Shah Rukh Khan
-
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్‌పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్‌కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్‌ను అండర్‌వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్‌స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్‌కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్‌కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం
హాలీవుడ్లో అప్పుడప్పుడు కార్టూన్ సినిమాలు వస్తుంటాయి. ఇందులో పాత్రలకు ఏ భాషకు ఆ భాషలో ఫేమస్ నటీనటులు డబ్బింగ్ చెబుతుంటారు. గతంలో రానా, మహేశ్ కూతురు సితార.. ఇలా తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి మాట సాయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)అడవి బ్యాక్ డ్రాప్ కథతో తీసిన 'ద లయన్ కింగ్' సినిమా చాన్నాళ్ల క్రితమే వచ్చింది. ఇందులోనే ముఫాసా అనే పాత్ర కాస్త ఫేమస్. ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్‌గా తీసుకుని ముఫాసా చిన్నప్పుడు ఏం జరిగింది? ఎలా రాజుగా ఎదిగింది అనే స్టోరీతో ఓ మూవీ తీశారు. ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.రీసెంట్గా 'ముఫాసా' ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద ముఫాసా పాత్రకు షారూఖ్, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్, సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీని వల్ల హిందీ మార్కెట్లో వసూళ్లు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?) -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
షారుక్‌తో సినిమా.. తన వల్ల కాదన్న స్టార్ డైరెక్టర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్టార్ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనురాగ్ కశ్యప్.. షారుక్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చారు. మీరు షారుక్‌తో కలిసి ఎందుకు పని చేయలేదని ఆయను ప్రశ్నించగా.. అనురాగ్ స్పందించారు. అతనికున్న స్టార్ క్రేజ్, అభిమానులను చూసి తాను భయపడుతున్నట్లు తెలిపారు. షారుక్ ఫ్యాన్స్ అంచనాలను అందుకునే సామర్థ్యం తనకు లేదన్నారు.అనురాగ్ మాట్లాడుతూ..'సోషల్ మీడియా యుగంలో పెద్ద పెద్ద స్టార్స్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. వారి క్రేజ్ చూస్తే నాకు భయం. స్టార్ హీరోల అభిమానులకు తమ నటుడిపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రతిసారి ఫ్యాన్స్ వారి నుంచి మళ్లీ మళ్లీ అదే కోరుకుంటారు. ఒకవేళ వారి అంచనాలు అందుకోలేకపోతే అభిమానులు విమర్శిస్తారు. అందుకే హీరో కూడా కొత్తగా ప్రయత్నించడానికి భయపడతారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్‌తో సినిమా తీసే సామర్థ్యంలో నాకు లేదు.' అని అన్నారు. కాగా.. గతేడాది పఠాన్, జవాన్,డుంకీ చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్ సాధించారు. మరోవైపు అనురాగ్ తెరకెక్కించిన చిత్రం 'కెన్నెడీ' 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. -
ఐపీఎల్ ఫైనల్లో షారూఖ్ సందడి.. ఆ వాచ్‌తో లైఫ్‌టైమ్ సెటిల్మెంట్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గతేడాది జవాన్, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది.కేకేఆర్ విజయంతో బాలీవుడ్ బాద్షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్ వాచ్‌పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్‌గా గుర్తించారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దట్ ఇజ్ కింగ్ ఖాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్‌తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు. -
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సింగర్ సుచిత్ర కోలీవుడ్ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్ ట్రిప్‌లో కార్తీక్ కుమార్, షారుక్, కరణ్ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.*Big Allegations on Shahrukh Khan and Karan Johar*According to Tamil Singer Suchitra, her Ex husband Karthik Kumar, SRK and Karan Johar had a gay encounter in LondonThey Usually go the countries on holidays where GAY S*X is legal and they enjoy it 😵 pic.twitter.com/VYrYk8pUnz— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 16, 2024 -
అత్యుత్తమ ఓనర్ అతడే.. ఓ ఎమోషన్: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) చెరో ఐదుసార్లు టైటిల్ గెలవగా.. గంభీర్ రెండుసార్లు ట్రోఫీ అందుకున్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 2012, 2014 సీజన్లలో చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా స్థాయికి తగ్గట్లు రాణించలేక క్యాష్ రిచ్ లీగ్‌కు గంభీర్ గుడ్‌బై చెప్పాడు. మళ్లీ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా రీఎంట్రీ ఇచ్చాడు గౌతీ.అయితే, తాజా ఎడిషన్ నేపథ్యంలో మెంటార్‌గా సొంతగూటికి చేరుకున్నాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో కేకేఆర్ మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్‌కతా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదిలా ఉంటే.. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి గౌతం గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘అతడితో నా బంధం ఎంతో అద్భుతమైనది. నాతో కలిసి పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడు.కేవలం నిరాడంబరంగా ఉంటాడని మాత్రమే నేను ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం అతడిది. క్రికెటింగ్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నిజంగా అదృష్టం. నా ప్రతీ నిర్ణయంపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచాడు.అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా మా అనుబంధం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. 2011 నుంచి అతడితో నా బంధం ఇలాగే ఉంది. ఎస్ఆర్కే ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. అయితే, అతడితో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే! పరస్పరం నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యంతో కలిసి పనిచేసిన గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
షారుక్ ఖాన్ చిన్న పొరపాటు.. కోట్ల రూపాయల నష్టం!
స్టార్ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్ ఖాన్ సహానటుడు అలీ ఖాన్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్.. షారుక్ కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్‌కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్‌లో ఛేజ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్‌పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. -
అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్ పెర్ఫార్మెన్స్? ఫీజు అన్ని కోట్లా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రాధిక మర్చంట్‌ను పెళ్లాడనున్నాడు.మరి కుబేరుడి ఇంట్లో పెళ్లి సందడి క్రేజ్ మామూలుగా ఉండదుగా. ఈ నేపథ్యంలోనే వారి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అనంత్-రాధిక వెడ్డింగ్ వేడుకల్లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో అతిథులను అలరించనున్నాడని రిపోర్టులు ద్వారా తెలుస్తోంది. ఇందుకు ఏకంగా రూ. 3-4 కోట్లు డిమాండ్ చేసినట్లు పలు నివేదికలుసూచిస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌తో పాటు, బాలీవుడ్ స్వీట్ కపుల్ రణబీర్, అలియా, అలాగే సింగర్ దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయట. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ ముంబైకి వెళ్లేందుకు జామ్‌నగర్ విమానాశ్రయంలోకి వెళ్లే వీడియో ఒకటి కనిపించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్షిప్లో నల్ల జాకెట్‌తో, స్టైలిష్ లుక్‌లో కనిపించిన షారుక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.షారుక్ రిహార్సల్స్ కోసం జామ్‌నగర్‌ను వెళ్లాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Latest - SRK spotted at the Reliance township of Jamnagar ❤️@iamsrk #SRK #ShahRukhKhan pic.twitter.com/1mE5yJlmPO — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 22, 2024 పలు నివేదికల ప్రకారం జూలైలో వీరి పెళ్లి జరగనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. అంబానీ ఇంట పార్టీ అంటే పలువురు రాజకీయ, వ్యాపార, క్రీడారంగ ప్రముఖులతోపాటు, బాలీవుడ్ సెలబ్రిటీల సందడి కూడా తప్పక ఉంటుంది. అంతేకాదు మార్చి ప్రారంభంలోప్రీ వెడ్డింగ్ వేడుకలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ పలువురు గ్లోబల్ బిజినెస్ దిగ్గజాలు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం. -
షారుఖ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. పఠాన్ మళ్లీ రాబోతున్నాడు!
షారుక్ ఖాన్ కెరీర్లో రూ. వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘పఠాన్’ (2023). వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ‘పఠాన్’ సినిమాను నిర్మించారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్ చేశారు. కాగా ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘పఠాన్ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ ‘పఠాన్ 2’ స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, స్టోరీ బేసిక్ ఐడియాకు షారుక్ ఖాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, వైఆర్ఎఫ్ స్పై యూనిర్స్‌లో భాగంగానే ‘పఠాన్’ ఉంటుందని బాలీవుడ్ భోగట్టా. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో ప్రరంభం కానుందని టాక్. -
షారుఖ్ ఖాన్ పై ప్రశాంత్ నిల్ కు ఎందుకింత పగ..?
-
ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చారు షారుక్ ఖాన్. గతంలో వీరిద్దరి కాంబోలో చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రం రిలీజైంది. అయితే డంకీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అప్పుడే ఈ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే డంకీ ఓటీటీ పార్ట్నర్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్లో జియో స్టూడియోస్ ప్లాట్ఫామ్లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దీంతో డంకీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డంకీ చిత్రాన్ని జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్‌ను బట్టి, కలెక్షన్స్ ఆధారంగా మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. అలాగే జరిగితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. -
మూడు సినిమాలు.. మూడు వేల కోట్ల అంచనాలు!
ఒకప్పుడు సినిమా కలెక్షన్స్ రూ.100 కోట్లు దాటితే అదొక రికార్డు. కానీ ఇప్పుడు సాధారణ సినిమాలకు సైతం ఈజీగా రూ. 100 కోట్లు వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు అయితే ఫ్లాప్ టాక్ వచ్చినా.. మూడు, నాలుగు రోజుల్లో రూ. 100 కోట్లు రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఊహించలేం. ఈ ఏడాది ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. పఠాన్, జవాన్ సినిమాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించాయి. ఇక ఇయర్ ఎండ్‌లో కూడా మరో మూడు సినిమాలు రూ. 1000 కోట్ల వసూళ్లపై కన్నేశాయి. అవేంటో చదివేయండి సలార్‌పై భారీ అంచనాలు ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చివరి సినిమా కేజీయఫ్ 2 రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ గత సినిమా ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ అయినా రూ. 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఒకవేళ్ల హిట్ అయితే మాత్రం ప్రభాస్ సినిమాకు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు. అందుకే సలార్ ఈజీగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్‌పై షారుఖ్ గురి ఈ ఏడాది కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్‌కి బాగా కలిసొచ్చింది. ఆయన నటించిన రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజై సూపర్ హిట్లు కొట్టాయి. జనవరిలో వచ్చిన పఠాన్ మూవీ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అలాగే సెప్టెంబర్‌లో విడుదలైన జవాన్ మూవీ కూడా రూ. 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఇప్పుడు ‘డంకీ’ కూడా హిట్టయితే.. షారుఖ్ హ్యాట్రిక్ కొట్టినట్టే. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల అవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంపై ఉన్న నమ్మకం, షారుఖ్ ఫామ్ చూస్తే.. డంకీ ఈజీగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టేలా ఉంది. ఇదే కనుగా నిజమైతే ఒకే ఏడాదిలో మూడు సినిమాలు.. రూ. 1000 కోట్లు కలెక్షన్స్‌తో షారుఖ్ చరిత్ర సృష్టించనట్లే అవుతుంది. ఇండియన్ స్క్రీన్‌పై సరికొత్త రికార్డు! ఇక ఇప్పటికే డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. డిసెంబర్ 22 వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో.. యానిమల్కి రూ. 1000 కలెక్షన్స్ ఈజీగా రాబడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ యానిమల్తో పాటు సలార్, డంకీ చిత్రాలు కూడా రూ. 1000 కోట్లు వసూలు చేస్తే... ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. ఒకే నెలలో రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాలు మరి రూ. 1000 కోట్ల క్లబ్లో చేరుతాయో లేదే మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. -
'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్‌తో చిట్ చాట్ నిర్వహించడం మన స్టార్ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్లో ముచ్చటించారు షారుక్. అయితే ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. కాగా.. హ్యాట్రిక్ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్‌తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp — Shah Rukh Khan (@iamsrk) December 6, 2023 -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్‌తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్‌స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్‌లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్‌తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
కోట్ల ఆస్తులు.. టాయిలెట్స్ శుభ్రం చేసిన షారుక్ హీరోయిన్!
బాలీవుడ్లో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే అలాగే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్‌సఫర్‌లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది. అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్‌లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్ఎంజిల్స్లో ఉన్న సమయంలో ఫ్లోర్లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్‌తో జతకట్టనుంది. -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన రాజ్‌కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. -
మరి దారుణంగా షారుక్ ఖాన్ పరిస్థితి..
-
షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) పఠాన్ సాంగ్ వివాదం గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: 'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!) -
స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!
ఇటీవల ఇటలీలో రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ సంఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను పెళ్లాడిన గాయత్రి.. తన కెరీర్లో కేవలం ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ టూర్లో పాల్గొనేందుకు గాయత్రి, వికాస్ ఇటలీకి వెళ్లారు. ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రీ జోషి కెరీర్ ఎలా ప్రారంభమైంది? 1977లో నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రి ముంబైలోని కళాశాలలో చదువుతున్న సమయంలో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. మోడల్‌గా ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ ప్రకటనలలో నటించింది. షారుఖ్ ఖాన్‌తో కూడా ఓ ప్రకటనలో మొదటిసారి కనిపించింది. 1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2000లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. స్వదేశ్‌తో బాలీవుడ్లో అరంగేట్రం 2004లో మోడల్‌గా సక్సెల్ అయిన గాయత్రిని అశుతోష్ గోవారికర్ స్వదేశ్ చిత్రంలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాయత్రి తన తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. అయితే వికాస్ ఒబెరాయ్‌ని వివాహం చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. పెళ్లి తర్వాత గాయత్రి లైఫ్ గాయత్రి భర్త వికాస్.. ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఒకరు. అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 22,780 కోట్లు. ఇతరత్రా కలిసి ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 28000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయత్రి, వికాస్‌లకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ముంబయిలో నివసిస్తున్నారు. -
జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్‌కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. (ఇది చదవండి: అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!) ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్లో జవాన్ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. Bhai ko, behen ko… Dushman ko, Yaar ko… And of course, apne Pyaar ko… Kal Jawan dikhaaiyega! Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami… Yaani Poore Parivaar ko. Sab ke liye ek ke saath ek free ticket!!! Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO — Shah Rukh Khan (@iamsrk) September 27, 2023 -
వెయ్యి కోట్ల క్లబ్లో జవాన్.. షారుక్ అరుదైన ఘనత!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ షారుక్ ఖాన్ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??) 'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్ మూవీ క్లిప్‌ను షేర్ చేశారు. ఈ మైల్ స్టోన్‌కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్‌తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్‌ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) God is so kind to us Thank you all #jawan History in the maKING ft. Jawan! 🔥 Have you watched it yet? Go book your tickets now! https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h57GwuTTP3 — atlee (@Atlee_dir) September 25, 2023 -
జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్‌లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం.