![Kangana Ranaut Counter to Hrithik Roshan All Mafia Pappu Coming To Defence Aryan - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/7/Aryan-Drug%27s-Case.jpg.webp?itok=6CgZ_SJC)
డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్‌లోని ఎంతో మంది ప్రముఖులు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి మద్దతుగా నిలిచారు. అయితే తాజాగా హృతిక్ రోషన్ సైతం ఆర్యన్‌కి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆ హీరోకి కౌంటర్‌గా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
అందులో..‘ఇప్పుడు ఆర్యన్ ఖాన్ డిపెండ్ చేయడానికి మొత్తం మాఫియా పప్పు రంగంలోకి దిగింది. మనం తప్పుటు చేస్తాం. కానీ వాటిని గొప్పగా చెప్పుకోం. ఈ తప్పు (డ్రగ్ కేసు) వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నా. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు’ అని అందులో కంగనా ఘాటుగా విమర్శించింది.
అయితే భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ కంగనాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అభిప్రాయ భేదాలతో ఈ లవ్ కపుల్ విడిపోయారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు ఎదో విధంగా తమ కోపాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఆర్యన్‌కి సపోర్టుగా ఆ హీరో పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఫైర్ బ్రాండ్ ఈ స్టోరీ పెట్టింది. ఇది తన హృతిక్‌కి కౌంటరేనని నెటిజనులు అనుకుంటున్నారు.
చదవండి: ఆర్యన్‌ఖాన్‌కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment