Aryan Khan
-
హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం
హాలీవుడ్లో అప్పుడప్పుడు కార్టూన్ సినిమాలు వస్తుంటాయి. ఇందులో పాత్రలకు ఏ భాషకు ఆ భాషలో ఫేమస్ నటీనటులు డబ్బింగ్ చెబుతుంటారు. గతంలో రానా, మహేశ్ కూతురు సితార.. ఇలా తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి మాట సాయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)అడవి బ్యాక్ డ్రాప్ కథతో తీసిన 'ద లయన్ కింగ్' సినిమా చాన్నాళ్ల క్రితమే వచ్చింది. ఇందులోనే ముఫాసా అనే పాత్ర కాస్త ఫేమస్. ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్‌గా తీసుకుని ముఫాసా చిన్నప్పుడు ఏం జరిగింది? ఎలా రాజుగా ఎదిగింది అనే స్టోరీతో ఓ మూవీ తీశారు. ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.రీసెంట్గా 'ముఫాసా' ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద ముఫాసా పాత్రకు షారూఖ్, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్, సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీని వల్ల హిందీ మార్కెట్లో వసూళ్లు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?) -
స్టార్ హీరో కుమారుడి సెంటిమెంట్.. పాత భవనానికి రూ. 37 కోట్లు!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్‌గా గుర్తింపు ఉంది. తాజాగా ఢిల్లీలో భారీ మొత్తంలో ఆస్తులను ఆర్యన్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం సొంతంగా దుస్తుల బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్ త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇలా సంపాదన వేటను ఆయన ఎప్పుడో ప్రారంభించాడు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రెండు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది.బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లో రెండు అంతస్తుల భవనాన్ని రూ. 37 కోట్లు చెల్లించి ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన లావాదేవీలు మే 2024లో జరిగాయి. ఆ బంగ్లా ఆయన పేరుతో రిజిస్టర్ కూడా అయినట్లు నివేదించబడింది.ముంబైలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఢిల్లీలోని ఫ్లాట్‌ను ఎందుకు కొనుగోలు చేశాడో కూడా తెలిపారు. ఆయన అమ్మ గౌరీఖాన్ చిన్నతనంలో ఇక్కడే ఉండేవారని తెలుస్తోంది. షారుక్, గౌరీఖాన్ ముంబైకి షిఫ్ట్ కాక ముందు ఆ ఫ్లాట్‌లోనే జీవనం సాగించారని, అందుకే ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు ఆర్యన్ దానిని కొనుగోలు చేశాడు. అయితే, ఇప్పటికే ఈ బిల్డింగ్‌లో వారి కుటుంబానికి చెందిన ఆస్తులున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఆ భవనంలో బేస్మెంట్, మొదటి ఫ్లోర్‌ను ఆ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ బిల్డింగ్ నుంచే తన తండ్రి జీవితం ప్రారంభం కావడంతో తాజాగా అక్కడ రెండు ఫ్లోర్లను ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకోసం రూ. 37 కోట్లు ఆయన చెల్లించాడు. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్ చిట్ దక్కింది. -
ఆర్యన్ ఖాన్ కొత్త బ్రాండ్ జాకెట్ ధర వింటే షాకవ్వుతారు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడి కొత్త బ్రాండ్ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా..వీటి ధరలు చూసి కంగుతింటున్నారు అభిమానులు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో సందడి చేశారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు వచ్చేసి ఏకంగా రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి. ఈ బ్రాండ్ ఎక్స్ 2 అందుబాటులోకి వచ్చిందంటూ వెబ్సైట్ http://dyavolx.comలో బుక్ చేసుకోండి. ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటాయి, గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం విశేషం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది. ఇవన్నీ ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లో ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చిన కలెక్షన్ల ధరలైతే ఏకంగా రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇవి కాస్త బెటర్ అని చెప్పొచ్చు. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఇక తన కొడుకు బ్రాండ్‌కు షారుక్ ఇస్తున్న ప్రమోషన్ కూడా బాగా కలిసి వస్తోంది. అందులో షారుక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతనికి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) (చదవండి: రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...) -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
ఆర్యన్‌ని జైల్లో పెట్టొద్దు! సమీర్ వాంఖడేని వేడుకున్నట్లు స్క్రీన్ షాట్లు
బాలీవుడ్ దిగ్గజ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టులో సీనియర్ ఆఫీసర్‌గా పేరొందిన నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే అక్రమంగా వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీబీఐ ఆయన తోపాటు మరికొందరూ షారూఖ్ ఖాన్ కుటుంబాన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తోంది. సీబీఐ పెట్టిన కేసుల విషయమై ముంబై హైకోర్టు ఆశ్రయించిన సమీర్ వాంఖడే శుక్రవారం తనకు షారుక్ ఖాన్‌కి మధ్య జరిగిన చాట్ల సంభాషణను కోర్టుకి సమర్పించారు. అంతేగాదు షారూఖ్ తన కొడుకుని విడిపించమని వేడుకుంటూ జరిగిన సుదీర్ఘ చాట్ సంభాషణ గురించి పిటిషన్లో పేర్కొన్నాడు వాంఖడే. ఆ స్క్రీన్ షాట్లో దయ చేసి అతన్ని జైల్లో పెట్టోద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు నా కుటుంబంపై దయచూపాలి. నా కొడుకుని కరుడుగట్టిన నేరస్తుడిలా జైల్లో ఉండటానికి అర్హుడు కాదు. అది అతడి ఆత్మవిస్వాశాన్ని దెబ్బతీస్తుంది. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కేసు ఉపసంహరించుకునేలా నా శక్తిమేర చేయల్సిదంతా చేస్తానని మీకు హామి ఇస్తున్నా. దయచేసి నా కొడుకుని ఇంటికి పంపించండి. అని షారూక్ తనకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారని సమీర్ వాంఖడే ఆరోపించారు. అందుకు సమీర్ సమాధానంగా షారూక్ నువ్వొక మంచి మనిషిగా నాకు నీ గురించి తెలుసు. నేను జోనల్ డైరెక్టర్. సమాజాన్ని, పిల్లల జీవితాలన్ని కలుషితం చేస్తున్న వాటిని ప్రక్షాళ చేసే సర్వీస్ చేస్తున్నాను. కానీ కొందరూ నా ప్రయత్నాన్ని దుర్మార్గంగానూ, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాంఖడే స్రీన్‌షాట్ మెసేజ్‌లో పేర్కొన్నట్లు ఉంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. మే 22 దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం హైకోర్టు ఆదోశిచింది. కాగా, వాంఖడే తన కుటుంబంతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లాడని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఎన్సీబీ నివేదిక పేర్కొనడం గమనార్హం. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 (చదవండి: సిన్సియర్ సమీర్ వాంఖడే.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్లు?!) -
సిన్సియర్ సమీర్.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, ప్లాట్లు?!
సిన్సియర్ ఆఫీసర్‌గా పేరొందిన సమీర్ వాంఖడే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంలో ఈ నార్కోటిక్స్ మాజీ అధికారి అక్రమంగా వ్యవహరించాడంటూ సీబీఐ చెబుతోంది. ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆయన, మరికొందరు కలిసి పాతిక కోట్ల రూపాయల లంచం షారూఖ్ ఖాన్ కుటుంబం నుంచి డిమాండ్ చేశారనే అభియోగాలతో ముందుకు వెళ్తోంది సీబీఐ. అయితే.. ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డగొలుగా ఆయన ఆస్తుల్ని వెనకేసుకున్నారని, అలాగే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్పులకూ వెళ్లారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ.. తన దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. సిబిఐ పెట్టిన కేసుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడేకు సోమవారం వరకు ఊరట దక్కింది. Order Prima facie there is a legal bar under 17A of the PC Act and since a 41A notice is issued in the case..no coercive action against the petitioner till the next date Monday. #SameerWankhede#BombayHighCourt#CBI #AryanKhan — Live Law (@LiveLawIndia) May 19, 2023 2017 నుంచి 2021 మధ్య సమీర్ వాంఖడే ఆరుసార్లు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ జాబితాలో యూకే, ఐర్లాండ్, పోర్చ్‌గల్, సౌతాఫ్రికా, మాల్దీవ్స్ ఉన్నాయి. దాదాపు 55 రోజులు ఆ ట్రిపుల్లో గడిపాడు. ఆ పర్యటనల కోసం కేవలం రూ.8 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు చేశానని నివేదించాడాయన. కానీ, ఆ ఖర్చు విమాన ప్రయాణాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. ఇక సమీర్ వాంఖడే ఆస్తులకు సంబంధించి కూడా విస్తూపోయే విషయాల్ని వెల్లడించింది ఎన్సీబీ రిపోర్ట్. సమీర్, ఆయన భార్య ఇద్దరి ఆదాయం కలిపి ఏడాదికి 45 లక్షల రూపాయలుగా ఐటీ రిటర్న్స్‌లో చూపించారు. కానీ, చేతికి 17 లక్షల రూపాయలకు తక్కువకాని ఓ రోలెక్స్ వాచీతో పాటు ముంబైలో కోట్లు ఖరీదు చేసే నాలుగు ప్లాట్లు, అలాగే.. వాసిం ఏరియాలో 41 వేల ఎకరాల జాగా ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇక కొత్తగా 82 లక్షల రూపాయలకు మరో ప్లాట్‌ను కొన్నారాయన. అయితే.. గోరేగావ్‌లో ఉన్న ఆ ప్లాట్ విలువ రూ.2.45 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇవేకాదు.. పెళ్లికి ముందు కోటికి పైగా విలువ చేసే ఓ ప్లాట్‌ను సమీర్ ఖరీదు చేశాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సమీర్ లెక్కలు చూపించలేదని సీబీఐ అంటోంది. Acceptance, tolerance, bravery, compassion. These are the things my mom taught me. The words of my mother echo constantly that my son is equal to thousands. Such inspiration lifts my spirit to epitome for each end every challenge and struggle…#MothersDay #SameerWankhede pic.twitter.com/pteBReu5bf — Sameer Wankhede (@swankhede_IRS) May 14, 2023 సెలబ్రిటీ పేరు వింటే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ముంబై విభాగం) మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై స్థానిక మోడల్ మున్మున్ దామెచా సంచలన ఆరోపణలు చేశారు. కార్డిలియా డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి.. బెయిల్ మీద బయట ఉన్నారామె. ‘‘సమీర్‌కు పబ్లిసిటీ పిచ్చి. సెలబ్రిటీ అని తెలిస్తే చాలూ.. వాళ్లను ఏదో ఒకరకంగా జైలుకు పంపించేవాళ్లు. అలా మీడియాలో నానడం ఆయనకు ఇష్టం. అందుకే మోడల్స్‌ను, సెలబ్రిటీలను ఆయన టార్గెట్‌గా చేసుకునేవాళ్లు. ఈ కేసులో అన్యాయంగా నన్ను ఇరికించారాయన. తొలుత నాకేం కాదని ధైర్యం చెప్పే యత్నం చేశారు. ఆపై తాను ఒక మోడల్ అని తెలియగానే.. అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నప్పుడు కూడా తనను మానసికంగా వేధించారని తెలిపారామె. ఎన్సీబీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో కార్డిలియా క్రూయిజ్ మీద దాడి జరిగాక.. ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో సమీర్ టీం యాడ్ చేసింది. 2021, అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అలాగే.. రోలింగ్ పేపర్‌తో పట్టుబడ్డ ఓ యువతిని మాత్రం వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ కస్టడీ విషయంలో సమీర్ వాంఖడే వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది.అలాగే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి తేడాలు కనిపిస్తున్నాయి అని ఎన్సీబీ విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 సమీర్‌కు ఊరట ఇదిలా ఉంటే సీబీఐ తనపై అరెస్ట్ సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసు తనపై ప్రతీకార చర్యగానే ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ క్రమంలో.. ఆయనకు ఊరట లభించింది. సోమవారం(22, మే) దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం ఆదేశించింది బాంబే హైకోర్టు. గురువారం ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మాత్రం గైర్హాజరు అయ్యారు. మరోవైపు.. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ సింగ్ తనను కులం పేరుతో దూషించారని, వేధింపులకు గురి చేశారని సమీర్ వాంఖడే ఆరోపిస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు నుంచి బయటపడేసేందుకే జ్ఞానేశ్వర్ తనపై సీబీఐను ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కూడా. -
సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్.. రూ.25 కోట్ల అవినీతి ఆరోపణలు
న్యూఢిల్లీ: మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్న్కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది. సమీర్ వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై కేసు కూడా నమోదు చేసింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్‌గా సమీర్ వాంఖేడే ఉన్నారు. షారూక్ తనయుడు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై ఈయనే తొలుత దర్యాప్తు చేశారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడికి .. సరైన ఆధారాలు లేకపోవడంతో 2022 మేలో క్లీన్చిట్ లభించింది. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ఆర్యన్‌ఖాన్‌ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్‌ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్‌ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు
ముంబై: సమీర్ వాంఖడే గుర్తున్నాడా?.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై డ్రగ్స్ ఆరోపణలను దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి. అదిగో ఆ ఆఫీసర్‌పై శుక్రవారం సీబీఐ అవినీతి కేసు ఫైల్ చేసింది. అదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో ముడిపడిన ఆరోపణలపైనే కావడం గమనార్హం. సమీర్‌తో పాటు ఇతర అధికారులు.. ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు పాతిక కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్‌గా సమీర్ వాంఖేడే ఉన్నాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసింది కూడా తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సమయంలో ఆయన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేయించింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది కూడా. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడు .. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 2022లో క్లీన్ చిట్ దక్కించుకున్నాడు. సంబంధిత వార్త: సమీర్ అంటే ఒకప్పుడు వాళ్లకు ‘సింహస్వప్నం’ -
బ్రో నా కిడ్నీ తీసుకుంటావా?.. షారుక్ తనయుడిపై ట్రోలింగ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సొంతంగా దుస్తుల బిజినెస్ ప్రారంభించాడు. డి యావోల్ ఎక్స్ పేరిట బ్రాండెడ్ బట్టలను విక్రయిస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఆ దుస్తుల రేట్లు చూసి గుడ్లు తేలేస్తున్నారు నెటిజన్లు. ఒక్కో టీ షర్ట్ ధర రూ.22,000-24,000 మధ్య ఉంది. లెదర్ జాకెట్ ధర ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇతరత్రా హుడీలైతే రూ.45,000 పైనే ఉన్నాయి. అయినప్పటికీ అలా తను సేల్స్ ప్రారంభించాడో లేదో ఒక్క రోజులోనే అన్నీ అమ్ముడు పోవడం విశేషం. ఈ విషయాన్ని ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. నెక్స్ట్ సేల్ కోసం రెడీగా ఉండండని పోస్ట్ చేశాడు. అయితే ఆ రేట్లు చూసి షాకైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాడు. 'దయచేసి నా కిడ్నీ తీసుకుంటారా?', 'ఓరి భగవంతుడా, నన్ను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టించావు. రూ.2 లక్షల జాకెట్ నాక్కూడా కావాలి', 'అయ్యో, రెండు ఎకరాలు అమ్మేసి డబ్బులు రెడీ చేసుకుంటే తీరా అన్నీ అమ్ముడుపోయాయని అంటున్నారే' అంటూ ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @dyavol.x View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) చదవండి: బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలివే -
ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన సొంత ప్రీమియం స్ట్రీట్‌వేర్ బ్రాండ్ డియావోల్ (D'Yavol)ను ప్రారంభించాడు. ఈ బ్రాండ్ టీజర్‌ను ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. టీజర్లో షారుక్ ఎంట్రీ సూపర్! ఇందులో ఆర్యన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా కనిపించారు. బ్రాండ్ లోగో, థీమ్ రూపొందించే విషయంలో ఆర్యన్ తికమకపడుతుంటాడు. ఏదీ ఓ పట్టాన కుదరక పెయింట్ బ్రష్‌ను నేలకేసి కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు. అదే బ్రష్‌తో సింపుల్‌గా ఓ గీత గీస్తాడు. అంతే అద్భుతమైన బ్రాండ్ లోగో, థీమ్ ఆవిష్కృతమౌతాయి. వైవిధ్యంతో రూపొందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు ఆర్యన్ గత సంవత్సరం తన ప్రీమియం వోడ్కా బ్రాండ్‌ను ప్రారంభించిన అదే భాగస్వాములైన లెటీ బ్లాగోవా, బంటీ సింగ్‌ల భాగస్వామ్యంతో డియావోల్ పేరుతో ఈ దుస్తుల కంపెనీని ప్రారంభించాడు. వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆర్యన్ సినిమా పరిశ్రమతో సంబంధాలు వదులుకోలేదు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై నిర్మించనున్న చిత్రం ద్వారా త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఐపీఎల్ వేలం, దానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్ల పనుల్లో సోదరి సుహానా ఖాన్‌తో కలిసి ఆర్యన్ పాల్గొంటున్నాడు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. షారుఖ్ ఖాన్ రూ. 6,289 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని. వీరికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాగే VFX స్టూడియోను నడుపుతున్నాడు. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోంది. ఆర్యన్ ఖాన్ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించి ఖాన్ కుటుంబానికి ఇప్పటికే ఉన్న వ్యాపార పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేశాడు. అయితే అత్యంత పోటీ ఉన్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్యన్ కొత్త వెంచర్, డియావోల్ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) -
ఆర్యన్ ఖాన్‌తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి
గతంలో డ్రగ్ కేసుతో సంచలనమైన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మోడల్, నటి సాదియా ఖాన్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు హాల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు కాస్తా క్లోజ్‌గా దిగిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే బాలీవుడ్ నటి, డాన్సర్ నోరా ఫతేహితో ఆర్యన్ ఖాన్ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఆర్యన్‌తో డేటింగ్ రూమర్స్‌పై పాకిస్తాన్ నటి సాదియా ఖాన్ స్పందించింది. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె ఆర్యన్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలేం తెలియకుండానే ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. కలిసి ఫొటో దిగితే వారు రిలేషన్లో ఉన్నట్లేనా? అసలు ఏంటీ? ఏం జరిగిందో తెలియాకుండానే అలా ఎలా రాసేస్తారు. ఒక్క ఫొటో చూసి డేటింట్లో ఉన్నాని ఎలా అభిప్రాయపడతారు. ఇదంత వింతగా.. విచిత్రంగా అనిపిస్తోంది’ అని పేర్కొంది. అనంతరం ‘ఆర్యన్‌ను న్యూ ఇయర్ ఈవెంట్లో కలిశాను. అప్పుడు మేం మాట్లాడుకున్నాం, ఫొటో దిగాం. ఫొటో దిగినంత మాత్రాన మేమిద్దరం డేటింగ్లో ఉన్నట్లు కాదు. ఆ రోజు న్యూ ఇయర్ పార్టీ నేను మాత్రమే లేను. చాలా మంది ఉన్నారు. వారంత కూడా ఆర్యన్‌తో ఫొటో దిగారు. వారందరు కూడా సోషల్ మీడియాలో ఫొటోలు కూడా షేర్ చేశారు. కానీ ఈ రూమర్స్‌పై నాపైనే ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు’ అంటూ సాధియా మండిపడింది. కాగా దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్లో సాధియా ఖాన్, ఆర్యన్ ఖాన్లు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే సాధియా పాకిస్తాన్లో పలు టీవీ సీరియల్స్‌తో గుర్తింపు పొందింది. -
హీరోయిన్‌తో షారుక్ ఖాన్ కొడుకు డేటింగ్? ఫోటోలు లీక్
బాలీవుడ్లో సెలబ్రిటీల మధ్య లవ్ ఎఫైర్లు, రిలేషన్స్‌షిప్స్‌కు కొదువ లేదు, ఇప్పటికే చాలామంది స్టార్స్ డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తాజాగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ బీటౌన్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహితో ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వీరిద్దరూ దుబాయ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25ఏళ్లు కాగా, నోరాకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. ఇక రీసెంట్గా నోరా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్‌తో కూడా డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో నోరా-ఆర్యన్ల రిలేషన్ నిజమేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్‌కుమార్‌రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
ఆర్యన్ ఖాన్‌ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్‌తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్‌లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్‌షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్‌ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
లైగర్ బ్యూటీకి అవమానం, కనీసం పట్టించుకోని ఆర్యన్
సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. లైగర్ హీరోయిన్ అనన్య పాండేకు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటే క్రష్ అని ఇటీవలే ఓ షోలో తన మనసులోని మాట బయటపెట్టింది. ఇటీవలే అనన్య.. 'మజా మా' సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లగా అక్కడ ఆర్యన్ తారసపడ్డాడు. కానీ అతడు ఈ బ్యూటీని అని అసలు లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆర్యన్ కాదు కదా, అతడి డ్రైవర్ కూడా పట్టించుకోలేదు', 'చూశారా... ఆర్యన్ ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో', 'పాపం, అనన్యను చూస్తే జాలేస్తోంది. ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైతే మాత్రం అంతలా యాటిట్యూడ్ చూపించాలా?', 'షారుక్ ఖాన్ దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకో' అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'బహుశా ఆర్యన్ ఏదో బాధలో ఉన్నాడేమోలే' అని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఓటీటీని షేక్ చేస్తున్న కార్తికేయ 2 ఆ హీరోతో కలిసి పని చేస్తే అంతే సంగతులు -
అంతకుమించిన నరకం ఉండదు.. ఆర్యన్ అరెస్ట్‌పై స్పందించిన గౌరీఖాన్
గతేడాది క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై గౌరీఖాన్ తొలిసారి స్పందించింది. ప్రముఖ పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ షోకి మహిప్ కపూర్, భావనా పాండేతో కలిసి హాజరైన ఆమె తొలిసారి కొడుకు అరెస్ట్‌పై మాట్లాడింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డార. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డారు. ఆ కష్టసమయం గురించి ఏమని చెబుతారు అని కరణ్ ప్రశ్నించాడు. దీనికి గౌరీఖాన్ బదులిస్తూ.. అవును. 'మా కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డాం. తల్లిగా అంతకంటే భయంకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. కానీ ఆ సమయంలో అందరూ మాకు కుటుంబంలా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్లు కూడా మెసేజ్‌లు, కాల్స్ ద్వారా నన్ను ఓదార్చారు. ఆ సమయంలో మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు అండగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని చెబుతూ గౌరీఖాన్ ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు
సాధారణంగా స్టార్ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్‌సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తుంది. -
వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?
మాదక ద్రవ్యాల కేసులో హిందీ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు విముక్తి లభించింది. అంతవరకూ మంచిదే. కానీ ఆర్యన్ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వ్యవహరించిన తీరు ఆమోదనీయమైనదేనా? కేసులో సత్తా లేదని అర్థమైన తర్వాత, విచారణ జరిగితే డొల్లతనమంతా బయటపడుతుందని అనుకున్నారో ఏమో... ఆ యువకుడి పేరు ప్రఖ్యాతులకు మచ్చ తేవడానికి ఎన్సీబీ ప్రయత్నించింది. ప్రతి వ్యవస్థలోనూ పొరబాట్లు జరుగుతూంటాయి. అయితే మన వ్యవస్థల్లో మాత్రం ఘోరమైన తప్పిదాలు జరగడం సాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాల్లో నిందితులకు వాటిల్లిన నష్టం గురించి వాటికి ఏ బాధ్యతా ఉండదా? అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యన్‌కు జరిగిన నష్టాన్ని ఏదోలా భర్తీ చేయకపోవడం, క్షమాపణ కోరకపోవడం ఎంత వరకూ సబబు? చేసిన తప్పులకు కనీసం క్షమాపణ అడిగేంత ధైర్యం కూడా మన వ్యవస్థలకు లేకపోవడం తీవ్ర నిస్పృహకు గురి చేసే అంశమే! బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మాదక ద్రవ్యాల కేసు నుంచి విముక్తి లభించింది. బాగానే ఉంది. కానీ... ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆర్యన్ ఖాన్‌తో వ్యవహరించిన తీరుపై మాత్రం అనేకానేక విమర్శలు వెల్లు వెత్తాయి. నాకైతే వారి వ్యవహార శైలి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ... ఈ దేశంలోని ప్రభుత్వ సంస్థ చేతుల్లో ఇలాంటి వైఖరిని ఎదుర్కొన్నవారు కొన్ని లక్షల మంది ఉన్నారనడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. కాకపోతే అప్పుడప్పుడూ మనలాంటి ‘సామా న్యుల’కు అలాంటి ట్రీట్మెంట్ ఎదురైనప్పుడు మాత్రం షాక్‌కు గురవుతూంటాం. ఇదో కపటపూరితమైన వ్యవహారమని తెలుసు కానీ... వాస్తవం కూడా ఇదే. ఇదొక క్రూరమైన మేల్కొలుపు. ఈ కథనం రాయడానికి అది కూడా ఒక కారణమని ఒప్పుకుంటాను. కట్టు కథలే! అయితే ఈ కథనంలో చెప్పదలుచుకున్న విషయం మాత్రం అది కాదు. ఉదారబుద్ధి అనే చాలాపెద్ద మాటను కూడా నేను వాడటం లేదుగానీ... కనీసం క్షమాపణ అడిగేంత ధైర్యం కూడా మన వ్యవస్థలకు లేకపోవడం మాత్రం నన్ను కదిలించడమే కాదు... తీవ్ర నిస్పృహకు గురి చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యన్ ఖాన్‌కు జరిగిన నష్టాన్ని ఏదోలా భర్తీ చేయడం, క్షమాపణ కోరకపోవడం ఎంత వరకూ సబబు? ప్రతి వ్యవస్థలోనూ పొరబాట్లు జరుగుతూంటాయి. అయితే మన వ్యవస్థల్లో మాత్రం ఘోరమైన తప్పిదాలు జరగడం సాధారణ మైపోయింది. అయితే, ఆర్యన్‌ఖాన్ విషయంలో జరిగింది చిన్న తప్పేమీ కాదు. అయినాసరే... క్షమాపణ కోరాలనే నైతికమైన ఇంగితం కూడా ఆ సంస్థకు లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇరవై నాలుగేళ్ల యువకుడు ఆర్యన్ ఖాన్ విషయంలో వాస్తవంగా జరిగిందేమిటి? ఒక్క క్షణం ఆలోచించండి. అన్యాయమైన, సత్య దూరమైన ఆరోపణల నెపంతో అతడిని అరెస్ట్ చేసి ఏకంగా నాలుగు వారాల పాటు జైల్లో పెట్టారు. పెట్టిన కేసులన్నీ కట్టుకథలే. అంతర్జాతీయ మాదక ద్రవ్య కార్టెల్‌లో ఆర్యన్ ఖాన్ ఒక భాగమని ఆరోపించారు. మాదక ద్రవ్యాల సరఫరాకు కూడా కుట్రపన్నాడని అస్పష్టమైన ఆరోపణలు మోపారు. పరిస్థితి మరింత దిగజారిం దెప్పుడంటే... కేసు వివరాలను రోజూ కొంచెం కొంచెంగా తప్పుడు ఉద్దేశాలతో, వివరాలతో మీడియాకు లీకులివ్వడంతో! నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటిది ఇలాంటి వ్యవహారానికి ఎందుకు పాల్ప డింది? ఒకే ఒక్క వివరణ మాత్రమే ఆ సంస్థ ఉద్దేశాలను స్పష్టం చేస్తుంది. అదేమిటంటే... ఒక యువకుడి పరువు మర్యాదలను మంటలో కలపడానికి ప్రయత్నం చేసిందన్నమాట. కేసులో సత్తా లేదని వారికీ అర్థమై ఉంటుంది. విచారణ జరిగితే డొల్లతనమంతా బయటపడుతుందని అనుకున్నారో ఏమో! ఆ యువకుడి పేరు ప్రఖ్యాతులపై బురద చల్లారు. ప్రజల దృష్టిలో అతడిని ఓ విలన్‌గా చిత్రీకరించారు. తద్వారా న్యాయస్థానాన్ని కూడా ప్రభావితం చేయ వచ్చునని అనుకున్నారేమో మరి! తాము చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేని నేపథ్యంలో ఈ దుశ్చర్యలన్నింటి ఫలితంగా ఆర్యన్ ఖాన్‌కు శిక్ష పడుతుందని ఊహించివుంటారు వారు. ఇంకా దుర దృష్టకరమైన విషయం ఏమిటంటే... మీడియా కూడా ఎన్సీబీ ఆడమన్నట్టు ఆడటం. రోజూ ఆర్యన్‌ఖాన్‌పై చర్చోపచర్చలు జరిపి అతడిని హింసించింది మీడియా. ఉదయాన్నే వార్తాపత్రికల పతాక శీర్షికల్లోనూ అవే వివరాలు! తాము రాస్తున్న కథనాలకూ, చేస్తున్న ఆరోపణలకూ ఆధారాలెక్కడ అని ఒక్క ఛానల్, వార్తా పత్రిక కూడా ఆలోచించలేదు. ఊరూ పేరూ లేని అధికారులు చెప్పారన్న సాకుతో బోలెడంత తప్పుడు సమాచారం తెచ్చి కాగితాల్లోకి ఎక్కించారు. వీరిలో ఏ ఒక్క అధికారికీ తాము ప్రచారం చేస్తున్న తప్పుడు ఆరోప ణలను బయటికి సమర్థించే ధైర్యం లేకపోయింది. క్షమార్హం కూడా కానీ అభూత కల్పనలను వండివార్చారన్నమాట. ఎన్సీబీ తానా అంటే... మీడియా కూడా తందానా అని పనిగట్టుకుని మరీ ఆర్యన్ ఖాన్‌ను బద్నామ్ చేసింది. అర్హుడు అవునా, కాదా? ఇప్పుడు చెప్పండి... ఆర్యన్ ఖాన్‌కు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఎన్సీబీకి ఉందా, లేదా? ఎన్సీబీకి మాత్రమే కాదు... మీడియాకూ ఇది వర్తిస్తుంది. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. ప్రధాన్ ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి... ఆర్యన్ ఖాన్ కేసు ప్రాథమిక విచారణలో లోపాలూ, అక్రమాలూ బోలెడన్ని ఉన్నాయనీ, సంబంధిత సిబ్బందిపై చర్యలు చేపడతామనీ బహిరంగంగా ఒప్పుకున్నారాయన. అయితే, ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సమర్థనీయమేనా? అన్న ఎన్డీటీవీ ప్రశ్నకు మాత్రం చిత్రమైన సమాధానమిచ్చారు – ‘‘విచారణలో... ఆ తరువాత అందే వాస్తవాలు విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. కాబట్టి ప్రాథమిక విచారణను నిందించడానికి నేను తొందర పడను’’ అనేశారు. బహిరంగంగా చేసిన తన ప్రకటనకు భిన్నంగా ఇలా మాట్లాడగలిగిన వ్యక్తిని ఇదే చూడటం! ఆర్యన్ ఖాన్ తరఫున కేసు వాదించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నాతో మాట్లాడుతూ ఈ ఉదంతం మొత్తమ్మీద రెండు పాఠాలు నేర్పుతోందని అన్నారు. మొదటిది... తప్పుడు అరెస్ట్‌లు జరిగినప్పుడు బాధితుడికి నష్టపరిహారం పొందే హక్కును చట్టబద్ధం చేయాల్సిన అవసరముంది! ఇక రెండోది... అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని పోలీసులు లేదా ఇతర విచారణ సంస్థలు ఆదరా బాదరాగా ఆ పని చేయకూడదు. కొంచెం స్థిమితంగా ఆలోచించి... కేసులో దమ్ము ఉందా, లేదా అన్నది విచారించుకున్న తరువాత మాత్రమే అరెస్ట్ గురించి యోచించాలి. బాధ్యులను నిలబెట్టాలి సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఇంకో అడుగు ముందుకెళ్లి మరో మాట చెబుతారు. ప్రాథమిక విచారణ జరిపినవారిని విచారించాలి అని! ఆర్యన్ ఖాన్ కేసు విషయంలో ప్రశాంత్ విస్పష్టంగా సమీర్ వాంఖడే పేరును ప్రస్తా వించారు. దుర్బుద్ధితో విచారణ జరపడం, అధికార దుర్వినియో గానికి పాల్పడటం ఇంకోసారి జరక్కుండా ఉండాలంటే విచారణ జరగాల్సిందేనని వాదించారు ఆయన. చేసిన తప్పునకు శిక్ష పడటం ఒక్కటే ఇంకోసారి ఇలాంటి తప్పులు జరక్కుండా నిలువరిస్తుందన్న నమ్మకం ప్రశాంత్‌తోపాటు చాలామందికి ఉంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా అడ్మిరల్ బైంగ్ను ఉరితీయడాన్ని తన కాండీడ్ పుస్తకంలో తత్వవేత్త వోల్టేర్ కూడా విస్పష్టంగా సమర్థించుకున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో వోల్టేర్ వ్యాఖ్య ఒకటి ఎప్పటికీ గుర్తుండిపోయేదే... ‘‘పౌర్ ఎన్కరేజర్ లెస్ అటర్స్’’ (ఇతరులను ప్రోత్సహించేందుకు) అన్న ఆ వ్యాఖ్య ఆర్యన్ ఖాన్ కేసు విషయంలోనూ వర్తిస్తుంది మరి! వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
అప్పుడు డ్రగ్ తీసుకున్నట్లు ఆర్యన్ అంగీకరించాడు: ఎన్సీబీ
మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్చిట్ లభించిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీట్ సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో ఆర్యన్‌కు ఖాన్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఎన్సీబీ పొందుపరిచింది. చదవండి: ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే! అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్ ఖాన్ తమ విచారణలో తెలిపాడని ఎన్సీబీ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టు చేసిన 20 మంది 14 మందిపై ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విధితమే. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్సీబీకి ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో ఈ చార్జిషీట్లో ఏం చెబుతుంటే.. ‘ఆ సమయంలో తాను నిద్ర సమస్యలతో బాధపడ్డానని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని ఇంటర్నెట్లో పలు కథనాలు చదివినట్లు వాంగ్ములమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన ఫోన్లో దొరికిన గంజాయి వాట్సప్ డ్రగ్ చాట్ తానే చేశానని, దోఖా అనే కోడ్‌వర్డ్‌తో గంజాయి కొనుగోలు కోసం ఆచిత్‌తో(ఈ కేసులో మరో నిందితుడు) చాట్ చేశానని ఆర్యన్ ఒప్పుకున్నాడు. అయితే తన ఫోన్‌ను అధికారికంగా స్వాధినం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవి ప్రస్తుత కేసుతో అతనికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్సీబీ తమ అభియోగపత్రంలో వెల్లడించింది. -
Drug Case: షారూక్ కొడుక్కు క్లీన్చిట్
ముంబై/న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్చిట్ లభించింది. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీటు సమర్పించింది. ఆర్యన్, మరో ఐదుగురి పేర్లను అందులో ప్రస్తావించలేదు. సంజయ్‌కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపి 14 మందిపై ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ‘‘ఆర్యన్‌కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలేవీ దొరకలేదు. దాంతో అతన్ని, మరో ఐదుగురిని చార్జిషీటు నుంచి మినహాయించాం’’ అని ఎన్సీబీ చీఫ్ ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు. ఆర్యన్, మొహక్ల దగ్గర డ్రగ్స్ లభించలేదన్నారు. సత్యమే గెలిచిందని ఆర్యన్ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఎన్సీబీ తన తప్పిదాన్ని అంగీకరించిందని చెప్పారు. ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్ అనుభవించిన మనస్తాపానికి ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్‌గా కేసులో ప్రాథమిక విచారణ చేసిన సమీర్ వాంఖెడే బాధ్యత వహించాలంది. తప్పుల తడకగా విచారణ జరిపినందుకు వాంఖెడేపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఏం జరిగింది..? ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓడలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో 2021 అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు చేసిన దాడుల్లో ఆర్యన్‌ఖాన్ దొరికిపోయాడు. ఆర్యన్‌తో పాటు మొత్తం 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో లింకులున్నాయని ఎన్సీబీ వాదించడంతో ఆర్యన్, అర్బాజ్, దమేచాలను కోర్టు రిమాండ్‌కు అప్పగించింది. ఆర్యన్‌ను జైల్లో పెట్టారు. 22 రోజుల తర్వాత వారికి బెయిల్ దొరికింది. కేసు వీగింది ఇందుకే... ► ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలూ దొరకలేదు. పడవలో అరెస్టు చేసిన ఇతర నిందితుల వద్ద లభించిన డ్రగ్స్‌నే అరెస్టు చేసిన వారందరి దగ్గర నుంచి గంపగుత్తగా లభించినట్టు చూపారు. ఇది ఎన్డీపీఎస్ నిబంధనలకు విరుద్ధం. ► ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించడానికి వైద్య పరీక్షలేవీ చేయలేదు. ► పడవలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడి చేశామంటున్న ఎన్సీబీ వీడియో ఫుటేజ్ సమర్పించలేదు. ► ఆర్యన్ ఫోన్ చాటింగ్స్ ఈ కేసుకు సంబంధించినవి కావు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో అతనికి లింకులున్నట్టు వాటిలో ఆధారాలేవీ లేవు. ► ఎన్సీబీ సాక్షులు విచారణలో ఎదురు తిరిగారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఒకరు, ఆ సమయంలో తాము ఆ పరిసరాల్లోనే లేమని మరో ఇద్దరు చెప్పారు. -
ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్చిట్
అందరికీ ఎన్నడో అర్థమైన ఒకానొక సత్యం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్సీబీ)కి ఆలస్యంగా తలకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మాదక ద్రవ్యాలతో ఏవిధమైన సంబంధమూ లేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు అనేకుల్ని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ప్రకటించింది. ఇంకేం? సామాజిక మాధ్యమాలూ, టీవీ చానెళ్లూ హోరెత్తిపోయాయి. మాదకద్రవ్యాలు తీసుకుం టుండగా ఆర్యన్‌ను స్వయంగా చూసినంత హడావుడి చేశాయి. అందులోనూ పట్టుబడింది బీజేపీకి అయిష్టుడిగా ముద్రపడిన షారుఖ్ తనయుడు కావడంతో కొన్ని చానెళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అవి రోజంతా నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నవారు ఈ కేసులో తీర్పులిచ్చేశారు. సెలబ్రిటీల పిల్లల పెంపకంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి లేనివారి సంతానం ఇలాగే ఉంటారని దెప్పిపొడిచారు. కొందరు ఆ అరెస్టు వెనకున్న పరమార్థమేమిటో అంచనా వేశారు. ఆ సమయంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. నిజానికి ‘ఫలానా హీరో తనయుడు లేదా తనయ’ అనే విశేషణం అవసరం లేకుండానే స్టార్ హీరోల పిల్లలు వారికై వారు సెలబ్రిటీలుగా మారిపోతున్న కాలమిది. గతంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్న నటులైనా తమ వారసులను వెండితెరపై వెలిగించాలనుకున్నప్పుడు చేయితిరిగిన దర్శకులను ఆశ్రయించేవారు. దీటైన పబ్లిసిటీ కోసం వెంపర్లాడేవారు. ఇవాళ ఏ చిత్రంలోనూ నటించకపోయినా, కనీసం నలుగురి దృష్టినీ ఆకర్షించే పనులేమీ చేయకపోయినా ఆర్యన్ నుంచి ఆరాధ్య వరకూ ఎవరు ఎవరి వారసులో అందరికీ తెలుసు. ఎవరినైనా రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చే చిట్కాల్లో ఆరితేరిన పీఆర్ మేనేజర్ల పుణ్యమిది. ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ట్విటర్‌లోనో లక్షల మంది అనుచరగణాన్ని సృష్టించి ఆ పిల్లల ఫొటోలు పెడితే చాలు... బహుభాషా మాధ్యమాల్లో అవి చిలవలు, పలవలుగా అల్లుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అటుపై వారి గురించి తెలియ దంటే అలా అన్నవారి అజ్ఞానమే బయటపడుతుంది. అయితే ఈ మాదిరి ప్రచారం కూడా వికటించే ప్రమాదం లేకపోలేదు. ఆర్యన్‌ఖాన్‌కు జరిగింది అదే. అతను షారుఖ్ కుమారుడు కాకపోయివుంటే కథ వేరేలా ఉండేది. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసులో అతడి స్నేహితురాలు నటి రియా చక్రవర్తికి చుక్కలు చూపించిన అప్పటి ముంబై జోన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేనే ఆర్యన్ ను కూడా కటకటాల్లోకి నెట్టగలిగారు. ఏలికల ఆదేశాలను శిరసావహించి ఎవరినైనా కేసుల్లో ఇరికించగల నైపుణ్యంగల అధికారుల్లో ఒకరిగా ఆయనకున్న అపకీర్తి ఎవరికీ తెలియనిది కాదు. రోజంతా మోతమోగే చానెళ్ల కారణంగా హఠాత్తుగా వచ్చిపడిన గ్లామర్ ఆయనను మరింత వ్యామోహంలోకి నెట్టింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆర్యన్‌ఖాన్ కేసును సవాలుగా తీసుకొని రోజుకొక కొత్త కోణంతో వాంఖడే చరిత్రను ఏకరువు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నవారికి వాంఖడేతో ఉన్న సంబంధాలు వెల్లడి కావడంతో ముందు ఎన్సీబీ విజిలెన్సు విభాగం దర్యాప్తు, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరిగాయి. ఈ రెండు విభాగాలూ వాంఖడేను గుచ్చి గుచ్చి ప్రశ్నించి నిజాలు నిగ్గు తేల్చాయి. ఆర్యన్‌తోపాటు ఆరుగురిపై ఆధారాల్లేవని నిర్ధారణ కావడంవల్ల కేసులు ఉపసంహరిస్తున్నామని సిట్ ప్రకటించింది. ఉగ్రవాదం తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ మాదకద్రవ్యాల వాడకమే కొరకరాని కొయ్యగా మారింది. అంతటి పెను రక్కసి ఆరా తీసి, దాన్ని దుంపనాశనం చేయాల్సిన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావాల్సిన ఎన్సీబీ వంటి సంస్థ స్వప్రయోజనాపరులైన నేతల చేతుల్లో కీలుబొమ్మయితే, దాని అధికారులు బానిస మనస్తత్వంతో అడుగులేస్తుంటే జరిగేదేమిటో తెలియంది కాదు. యువతను మత్తులో ముంచెత్తి మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయగల సత్తా మాదకద్రవ్యాల కుంటుంది. వాటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నమవుతాయి. ఏదో ఒక ముసుగులో ప్రపంచం నలుమూలల నుంచీ మాదకద్రవ్యాలు ఇక్కడికొస్తున్నాయి. మరెన్నో దేశాలకు చడీచప్పుడూ లేకుండా పోతున్నాయి. గట్టి నిఘా ఉంటే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యం. మనం ఆ పని చేయలేకపోతే ప్రపంచంముందు చులకనవుతాం. దర్యాప్తు సంస్థలు దీన్ని గుర్తెరిగి వృధా కేసులతో పొద్దుపుచ్చడం మానుకోవాలి. ప్రచారయావను తగ్గించుకోవాలి. అవకాశం దొరికిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా తీర్పులీయటం అలవాటైన చానెళ్లకూ ఈ కేసు గుణపాఠం కావాలి. వాంఖడే ఆర్యన్ జోలికి పోయాడు గనుక ఈ కేసు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో దర్యాప్తు సక్రమంగా సాగి నిజానిజాలేమిటో వెల్లడయ్యాయి. మరి అమాయకుల మాటో?! ఎన్‌సీబీతోసహా అన్ని దర్యాప్తు సంస్థలనూ ప్రక్షాళన చేయడం ముఖ్యమనీ, అవి స్వతంత్రంగా మెలిగేందుకు తోడ్పాటునందించడం అవసరమనీ కేంద్రం గుర్తించాలి. -
ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్ కు క్లీన్ చిట్
-
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్‌తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్