షారుక్, ఆర్యన్
క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతాయి.. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి జీవిస్తాయి. జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అవునా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా డిస్నీ వాళ్లు తయారు చేసిన ‘లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. ఇదే ఈ సినిమా కథకి హీరో. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. జూలై 19న విడుదల కానున్న ఈ సినిమాకి బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గాత్ర దానం చేశాడు.
ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పగా, ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్టూన్ ¯ð ట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ ని డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ‘లయన్ కింగ్’ ఫ్యాన్స్‌కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment