The Lion King
-
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
మనం ఒకటిగా పోరాడాలి!
‘నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది.. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ’ అంటూ మొదలవుతుంది ‘ముఫాసా: ద లయన్ కింగ్’ సినిమా తెలుగు ట్రైలర్. 2019లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘లయన్ కింగ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ద లయన్ కింగ్’ రానుంది. ఆస్కార్ అవార్డు విజేత బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్ ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 20న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో హీరోగా కనిపించే ముఫాసాకు హీరో మహేశ్‌బాబు తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్‌బాబు. ‘అప్పుడప్పుడు ఈ చల్లగాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలన్నీ గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’, ‘అంతలోనే మాయం అవుతుంది’, ‘మనం ఒక్కటిగా పోరాడాలి’ అంటూ మహేశ్ బాబు వాయిస్‌తో చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. అలాగే ‘బయటి వాడు ఎప్పుడూ పగవాడే.. దూరం పెట్టాలి. ఠాకేనే మనకు కాబోయే రాజు’ వంటి డైలాగులు కూడా ట్రైలర్లో వినిపిస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు అలీ వాయిస్ ఓవర్లు ఇచ్చారు. -
ది లయన్ కింగ్.. మహేశ్‌బాబు వచ్చేస్తున్నాడు.. తెలుగు ట్రైలర్ చూశారా!
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం ది లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ముఫాసా పాత్రలో మహేశ్ బాబు వాయిస్‌తో అభిమానులను అలరించనున్నారు. గతంలో లాగే బ్రహ్మనందం, అలీ వాయిస్ పాత్రలతో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను మరోసారి మెప్పించనున్నారు. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. A new dimension to the character we know and love! Extremely excited to be the voice of Mufasa in Telugu and having been a massive fan of the classic, this is a special one for me! Long live the king ♥️@DisneyStudiosIN pic.twitter.com/9LdAX6qexT— Mahesh Babu (@urstrulyMahesh) August 26, 2024 -
ఒక అనాథ రాజు ఎలా అయ్యాడు?.. ఆ క్రేజీ మూవీ ట్రైలర్ వచ్చేసింది!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే చిత్రాల్లో ది లయన్ కింగ్ ఒకటి. ఈ సిరీస్‌లో వచ్చిన హాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో ముఫాసాను కుట్రలతో అతని తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. ఆ తర్వాత ముఫాసా తనయుడు సింబా.. తన బాబాయ్ అయిన స్కార్ను రాజ్యం నుంచి తరిమేస్తాడు. అలా మళ్లీ ముఫాసా వారసుడిగా సింబా మళ్లీ అడవికి కింగ్ అవుతాడు. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ముఫాసా ది లయన్ కింగ్ తీసుకొస్తున్నారు.ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్, టిఫానీ బూనే, కగిసో లేడిగా, ప్రెస్టన్ నైమన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్. ఈ ప్రీక్వెల్‌కు బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అనాథగా ఉన్న ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ముఫాసా: ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలా ఉందో మీరు చూసేయండి. -
యంగ్ ముఫాసా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రీక్వెల్‌కు సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిన పెంచేస్తున్నాయి. ముఫాసా చిన్నప్పటి కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. -
మళ్లీ వస్తున్నాడు లయన్ కింగ్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్’ (2019) కు ప్రీక్వెల్ రానుంది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ టైటిల్‌తో రానున్న ఈ ప్రీక్వెల్ ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుందని సమాచారం. ‘ది లయన్ కింగ్’ సినిమాకు జోన్ ఫావ్రూ దర్శకత్వం వహించగా, ప్రీక్వెల్‌ను ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ బార్రీ జెన్కిన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ‘ది లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా పాత్ర ఓ దశలో చనిపోతుంది. ముఫాసా కొడుకు సింబా, అతని సోదరుడు, శత్రువు స్కార్ల దృష్టి కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది. కానీ ముఫాసా రాజుగా ఎలా ఎదిగాడు? ఆ సమయంలో అతని సోదరుడు స్కార్ ఎలాంటి పన్నాగాలు పన్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా కథ ఉంటుందని హాలీవుడ్ టాక్. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ది లయన్ కింగ్’కు రచయితగా చేసిన జెఫ్ నాథన్సన్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’కూ వర్క్ చేస్తున్నారు. ముఫాసా పాత్రకు ఆరోన్ పైర్రీ, స్కార్ పాత్రకు కెల్విన్ హార్రిసన్ వంటివారు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని హాలీవుడ్ టాక్. -
‘ది లయన్ కింగ్’.. ఓ విజువల్ వండర్!
హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఏదో మొక్కుబడిగా సినిమాలు తెలుగులో రిలీజ్ చేయటం కాదు ఆ సినిమాకు తెలుగు టాప్ స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పించి సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. అదే బాటలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హాలీవుడ్ విజువల్ వండర్ ‘ది లయన్ కింగ్’. కథ విషయానికి ది లయన్ కింగ్ భారతీయులకు బాగా పరిచయం ఉన్న కథే. ఈ సినిమా కథకు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి కథకు చాలా దగ్గర పోలికలున్నాయి. అడవికి రారాజు ముఫాసా.. తన తరువాత తన కొడుకును సింబాను రాజును చేయాలనుకుంటాడు. కానీ ముఫాసా తమ్ముడు స్కార్‌కు ఇది నచ్చదు. అందుకే కుట్ర పన్ని ముఫాసాను చంపేస్తాడు. అంతేకాదు ముఫాసా చావుకు సింబానే కారణం అని అందరినీ నమ్మించి చిన్న వయసులోనే సింబాను ఆ అడవికి దూరం చేస్తాడు. ముఫాసా భార్య సరభిని ఇబ్బందుల పాలు చేస్తాడు. రాజ్యాధికారం తీసుకున్న స్కార్ తన అరాచక పాలన కొనసాగిస్తుంటాడు. స్కార్ చర్యల కారణంగా అడవితో పాటు జంతువులు కూడా అంతరించిపోతుంటాయి. అడవి వదిలి వెళ్లిన సింబాను పుంబా, టిమెన్ అనే రెండు జంతువులు పెంచి పెద్ద చేస్తాయి. పెద్దవాడైన సింబా.. నల అనే ఆడ సింహాం ద్వారా స్కార్ చేస్తున్న అరాచాకాలు, తన తల్లిని పడుతున్న కష్టాలను తెలుసుకుంటాడు. రాజ్యాన్ని, తల్లిని కాపాడుకునేందుకు సింబా ఏంచేశాడు? తిరిగి అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు..? స్కార్ ఆట ఎలా కట్టించాడు? అన్నదే మిగతా కథ. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు తెలుగులోకి డబ్ చేస్తే డైలాగ్స్ కామెడీగా ఉంటాయి. కానీ ది లయన్ కింగ్ చూస్తే మనకు అలాంటి ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ, రవిశంకర్‌లు చెప్పిన డబ్బింగ్ మనకు మన సినిమానే చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో దాదాపు 1700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళుతుంది. సినిమాలోని క్యారెక్టర్స్మాత్రమే కాదు పరిసరాలు, చెట్లు, వాగులు, చిన్న చిన్న పురుగులు లాంటివాటి విషయంలో కూడా దర్శకుడు తీసుకున్న కేర్ తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం సాంకేతికతను నమ్ముకొని గ్రాండ్ విజువల్స్ క్రియేట్ చేయటమే కాదు అందుకు తగ్గ కథా కథనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జాన్ ఫెవ్రూ. ఓ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన డ్రామా, ఎమోషన్స్, కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ది లయన్ కింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనటంతో సందేహం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. కథపరంగా మనకు పెద్దగా కొత్తగా అనిపించకపోయినా గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఇలా అన్ని కలిసి ది లయన్ కింగ్‌ను ఓ విజువల్ వండర్‌గా మార్చేశాయి. -
జున్ను కోసం లయన్‌కి డబ్బింగ్ చెప్పా
‘‘నా గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు నా గొంతు డిస్నీ సినిమాకు డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. జాన్ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘ద లయన్ కింగ్’. డిస్నీ వరల్డ్ స్టుడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ముఫాసా, స్కార్, సింబా, నల, పుంబా, టిమోన్ పాత్రలకు తెలుగులో రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్ చెప్పాలి. ఈ యానిమేషన్ చిత్రంలోనూ విలన్‌కు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. నాని మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది చేస్తున్న సినిమాలన్నీ నా కోసం, ప్రేక్షకుల కోసం. ‘ది లయన్ కింగ్’కి నా కొడుకు జున్ను కోసం (నాని కుమారుడు అర్జున్) డబ్బింగ్ చెప్పాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుకునేవాణ్ని. భావోద్వేగభరితమైన కథతో రూపొందిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డిస్నీవారు తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్ చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు అలీ. -
ద లయన్ కింగ్: బొమ్మాళీ రవిశంకర్ మ్యాజిక్
డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్‘ ట్రైలర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ చిత్రం వివిధ భాషల్లో త్వరలో రిలీజవుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ చిత్రంలోని పలు పాత్రలకు డబ్బింగ్ చెప్పిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను వివిధ భాషలతో పాటు తెలుగులో తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బొమ్మాళీ అంటూ విలక్షణమైన వాయిస్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రవిశంకర్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు వాయిస్ కూడా విలక్షణంగా వినిపిస్తోంది. అయితే హీరో నానీ వాయిస్ కోసం వెయిట్ చేశామంటూ మరికొంతమంది అభిమానులు నిరాశను వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జనం మెచ్చిన, జగమెరిగిన రారాజు, సింబా! ద లయన్ కింగ్ త్వరలోనే ధియేటర్లలో గర్జించడానికి రడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో హీరో నానితోపాటు , సీనియర్ నటుడు జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్లు వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నా పేరు సింబా
డిస్నీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. డిస్నీ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచే చిత్రం ‘లయన్ కింగ్’. తండ్రి సింహం (ముఫాసా) చనిపోవడంతో తన రాజ్యాన్ని లయన్ కింగ్ (సింబా) ఎలా చూసుకుంది? అనే కథ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ 1994లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రానికి కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది డిస్నీ సంస్థ. ఈ సినిమాను ఇండియాలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ముఫాసా పాత్రకు జగపతిబాబు, టిమోన్ అండ్ పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. తాజాగా సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘ఈ ఏడాది నన్ను తండ్రి పాత్రలో (‘జెర్సీ’ సినిమా) చూశారు. ఇప్పుడు కొడుకు పాత్రలో వినిపించబోతున్నాను. ఈ జూలై నాకో కొత్త పేరు రాబోతోంది. అదే సింబా’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. -
సింహానికి నాని డబ్బింగ్
ఈ జనరేషన్ హీరో యాక్టింగ్‌తో పాటు డబ్బింగ్ చెప్పేందుకు కూడా ఓకే చెపుతున్నారు. ముఖ్యంగా తెలుగులోకి డబ్ అవుతున్న బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలోని ప్రధాన పాత్రలకు టాలీవుడ్ టాప్ హీరోలు గాత్రదానం చేస్తున్నారు. అవెంజర్స్‌లో ఓ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పగా.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లాదిన్ సినిమాలోని రెండు ప్రధాన పాత్రలకు వెంకటేష్, వరుణ్ తేజ్ మాట సాయం చేశారు. తాజాగా లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో జాయిన్ అవుతున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ది లయన్ కింగ్ సినిమాలోని సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెపుతున్నాడు. డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెపుతుండటంతో సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. సింబా పాత్రకు బాలీవుడ్ లో షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెపుతుండటం విశేషం. ఈసినిమాలో మరో కీలక పాత్ర ముసాఫాకు తెలుగు వర్షన్‌కు జగపతి బాబు,హిందీ వర్షన్‌కు షారూఖ్‌లు గాత్రదానం చేస్తున్నారు. సినిమాలోని ఇతర కీలక పాత్రలు పుంబాకు బ్రహ్మానందం, టీమోన్కు అలీ, ముఫార్కు రవిశంకర్‌లు డబ్బింగ్ చెపుతున్నారు. కార్టూన్ నెట్‌వర్క్‌లో సీరియల్‌గా వచ్చిన లయన్ కింగ్‌ను 90లో డిస్నీ సంస్థ 2డీ యానిమేషన్ మూవీగా రూపొందించింది. ఇప్పుడు అదే సంస్థ 3డీ యానిమేటెడ్ టెక్నాలజీ సాయంతో మరింత రియలిస్టిక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. This year You have seen me as a father And now You are going to see me as a son This July I have a new name SIMBA 🦁 pic.twitter.com/MOpIkaUxMl — Nani (@NameisNani) 29 June 2019 -
జగపతిబాబు@ స్కార్ రవిశంకర్@ ముఫార్
కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ని డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘లయన్ కింగ్’ కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా జూలై 19న విడుదల కానుంది. జాన్ ఫేవ్రేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్కార్ పాత్రకి నటుడు జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా, ముఫార్ పాత్రకి డబ్బింగ్ స్టార్, నటుడు పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్
డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్ కింగ్’. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్ కింగ్’ కథకి సింబనే హీరో. టీమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘లయన్ కింగ్’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘లయన్ కింగ్’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. -
సింహానికి మాటిచ్చారు
క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతాయి.. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి జీవిస్తాయి. జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అవునా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా డిస్నీ వాళ్లు తయారు చేసిన ‘లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. ఇదే ఈ సినిమా కథకి హీరో. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. జూలై 19న విడుదల కానున్న ఈ సినిమాకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గాత్ర దానం చేశాడు. ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పగా, ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్టూన్ ¯ð ట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘లయన్ కింగ్’ ని డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ‘లయన్ కింగ్’ ఫ్యాన్స్‌కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. -
‘ద లయన్ కింగ్’ ట్రైలర్
1994లో ఘనవిజయం సాధించిన యానిమేషన్ ఫిలిం ద లయన్ కింగ్. ఇప్పుడు అదే సినిమాను మరింత ఉన్నత ప్రమాణాలతో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు ద లయన్ కింగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. ఈ చిత్రంలోని యానిమేషన్ పాత్రలకు హాలీవుడ్ టాప్ స్టార్స్ డబ్బింగ్ చెప్పటం విశేషం. తాజాగా రిలీజ్ అయిన ద లయన్ కింగ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్ కింగ్ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్ కానుంది. -
‘ద లయన్ కింగ్’ తొలి ట్రైలర్
1994లో ఘనవిజయం సాధించిన యానిమేషన్ ఫిలిం ద లయన్ కింగ్. ఇప్పుడు అదే సినిమాను మరింత ఉన్నత ప్రమాణాలతో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు ద లయన్ కింగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. ఈ చిత్రంలోని యానిమేషన్ పాత్రలకు హాలీవుడ్ టాప్ స్టార్స్ డబ్బింగ్ చెప్పటం విశేషం. తాజాగా రిలీజ్ అయిన ద లయన్ కింగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు జోన్ ఫావ్రే ట్వీట్ చేసిన టీజర్‌ను షేర్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్ కింగ్ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్ కానుంది.