చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే చిత్రాల్లో ది లయన్ కింగ్ ఒకటి. ఈ సిరీస్‌లో వచ్చిన హాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో ముఫాసాను కుట్రలతో అతని తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. ఆ తర్వాత ముఫాసా తనయుడు సింబా.. తన బాబాయ్ అయిన స్కార్‌ను రాజ్యం నుంచి తరిమేస్తాడు. అలా మళ్లీ ముఫాసా వారసుడిగా సింబా మళ్లీ అడవికి కింగ్ అవుతాడు. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ముఫాసా ది లయన్ కింగ్ తీసుకొస్తున్నారు.
ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్, టిఫానీ బూనే, కగిసో లేడిగా, ప్రెస్టన్ నైమన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్. ఈ ప్రీక్వెల్‌కు బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అనాథగా ఉన్న ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ముఫాసా: ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలా ఉందో మీరు చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment