Official Trailer
-
ఒక అనాథ రాజు ఎలా అయ్యాడు?.. ఆ క్రేజీ మూవీ ట్రైలర్ వచ్చేసింది!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే చిత్రాల్లో ది లయన్ కింగ్ ఒకటి. ఈ సిరీస్‌లో వచ్చిన హాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో ముఫాసాను కుట్రలతో అతని తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. ఆ తర్వాత ముఫాసా తనయుడు సింబా.. తన బాబాయ్ అయిన స్కార్ను రాజ్యం నుంచి తరిమేస్తాడు. అలా మళ్లీ ముఫాసా వారసుడిగా సింబా మళ్లీ అడవికి కింగ్ అవుతాడు. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ముఫాసా ది లయన్ కింగ్ తీసుకొస్తున్నారు.ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్, టిఫానీ బూనే, కగిసో లేడిగా, ప్రెస్టన్ నైమన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్. ఈ ప్రీక్వెల్‌కు బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అనాథగా ఉన్న ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ముఫాసా: ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలా ఉందో మీరు చూసేయండి. -
'మనం జాబ్ చేయండి ఏంటి?'.. ఆసక్తిగా పేకమేడలు ట్రైలర్!
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తోన్న సినిమా 'పేకమేడలు'. ఈ చిత్రం ద్వారా వినోద్ కిషన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు సినీ ప్రియుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మధ్య తరగతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏ పనిపాట లేకుండా భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఒక అమ్మాయి పరిచయంతో అతని లైఫ్ ఎలా మారింది? అనే కథాంశంతో రూపొందించినట్లు అర్థమవుతోంది.'వెధవ పనులు చేసేటప్పుడు పదిమందికి తెలియకుండా చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదారా నీకు?' అన్న డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 19న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
మోడ్రన్ గుండమ్మ
ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు– లక్ష్మీ శ్రీవాత్సవ దర్శక ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘గుండమ్మకథ’ (2020). ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘అలనాటి ‘గుండమ్మకథ’ చిత్రం తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ స్ఫూర్తితో ఈ మోడ్రన్ గుండమ్మకథను రెడీ చేశాం. లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. లాక్డౌన్ ముగిసిన వెంటనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఉన్న లక్ష్మీ శ్రీవాత్సవ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ‘గెటప్’ శ్రీను, భాష తదితరులు నటించిన ఈ సినిమాకు మోనీష్ భూపతి సంగీతం అందించారు. -
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
-
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
తమిళ బడా స్టార్ విజయ్ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘బిగిల్’ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, కోచ్‌గా విభిన్నమైన షేడ్స్‌తో విజయ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మాస్ యాక్షన్ థ్రిలర్‌గా విజయ్ ఫ్యాన్స్‌కు పండుగ బొనాంజాలా సినిమా ట్రైలర్ ఉంది. అట్లీ దర్శకత్వంలో బిగిల్ తెరకెక్కింది. విజయ్ - అట్లీ కాంబినేషన్లో గతంలో వచ్చిన తెరీ, మెర్సల్ సినిమాలు భారీ విజయం సాధించాయి. -
శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ కేసరి. ‘బ్యాటిల్ ఆఫ్ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్ ఒరక్జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజుర్ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పరిణితీ చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యూ ట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ట్రైలర్
-
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పెంటాటానిక్స్ అండ్ డాలీ పార్టన్ : జోలిన్ ‘ప్లీజ్ డోన్ట్ టేక్ మై మ్యాన్’! పాత పాట. 43 ఏళ్లనాటి పాట. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్‌గా! ప్లీజ్ డోన్ట్ టేక్ మై మ్యాన్. పాత ఏడుపే. ప్రేమలో ఉండే ఏడుపు. ‘నా భర్తను పట్టుకెళ్లిపోవద్దు. నా ప్రియుణ్ణి వలలో వేసుకోవద్దు. ప్లీజ్.. ప్లీజ్ జోలీన్’ అని వేడుకోలు. కొత్తగా పెళ్లయిన ఒక అమ్మాయి.. తన భర్త పనిచేసే చోట, ఆయనతో కలిసి పనిచేసే జోలీన్ అనే అందమైన అమ్మాయిని వేడుకునే పాట! అప్పట్లో ఈ పాటను రాసి, పాడింది డాలీ పార్టన్. ఆ తర్వాత చాలామంది పాప్ సింగర్లు ఈ పాటను పాడారు. పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పాటను అదే డాలీ పార్టన్ ఈ 70 ఏళ్ల వయసులో మళ్లీ ఫ్రెష్‌గా పాడారు. డాలీ అనుభవంలోంచి వచ్చిన పాట ఇది. 1973 అక్టోబర్‌లో రిలీజ్ అయిన డాలీ ఫస్ట్ సింగిల్ ఇది. ‘ఆఫ్ ద సేమ్ నేమ్’ అనే ట్రాక్లోనిది. 2004లో ‘రోలింగ్ స్టోన్’ మ్యాగజీన్ విడుదల చేసిన ‘ది 500 గ్రేటెస్ట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్’ జాబితాలో ‘ప్లీజ్ డోన్ట్..’ 217వ స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ జోలిన్ ఎవరు? డాలీ అభిమాని. డాలీ కెరియర్ ప్రారంభంలో ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న అమ్మాయి! తన భర్తను వలలో వేసుకుంటుందేమోనని డాలీ భయపడిన స్టన్నింగ్ బ్యూటీ క్యారెక్టర్‌కు ఈ అభిమాని పేరే పెట్టుకున్నారు డాలీ. తన హృదయేశ్వరుడిని ఎవరైనా ఎగరేసుకెళతారేమోనన్న అభద్రతలో ఉన్న అమ్మాయిలు ఈ పాటను విని కొంత ఊరటను పొందవచ్చు. వాళ్ల హృదయేశ్వరులను ఎగరేసుకుపోయే ఉద్దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలు కూడా ఈ పాటను విని, అభద్రతలో ఉన్న అమ్మాయిల ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. కెన్ యు సింగ్ యువర్ ఎబిసి ఫర్ మి? ‘‘గుడ్మాణింగ్’’ (టీచర్ చెప్పింది) ‘‘గుడ్మాణింగ్ మిస్ సీసీ’’ (నవ్వుతూ చెప్పాడు) ‘‘హౌ యు డూయింగ్’’ (టీచర్ అడిగింది) ‘‘హౌ యు డూయింగ్’’ (వీడూ నవ్వుతూ చెప్పాడు) ‘‘ఐ యామ్ డూయింగ్ గుడ్. యు డూయింగ్ గుడ్’’(టీచర్) ‘‘ఎస్’’ (నవ్వుతూ చెప్పాడు) ‘‘ఓ.. కెన్ యు సింగ్ యువర్ ఎబిసీస్ ఫర్ మీ?’’ (టీచర్ అడిగింది) వీడు ఏబీసీడులు ఎత్తుకున్నాడు. ఎలా ఎత్తుకున్నాడు? ఎలా కంటిన్యూ చేశాడు? ఎలా ది ఎండ్ చెప్పాడు? వీడియో చూడండి. చూశాక మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. దీన్ని బట్టి మీకేం అర్థమయిందో? పార్చ్డ్ : అఫీషియల్ ట్రైలర్ పార్చ్డ్ అంటే ‘ఎండిపోయిన’ అని అర్థం. లీలాయాదవ్ డెరైక్షన్‌లో అజయ్‌దేవగణ్ నిర్మించిన ఈ చిత్రం ఇండియా బయట విడుదలై ఏడాది అవుతోంది. ఇండియాలో ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఇప్పటికి ఈ మూవీకి 24 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. అలాగని ఇది పూర్తిగా అవార్డు చిత్రమనో, ఆర్ట్ కావ్యమనో అనుకోనక్కర్లేదు. ప్రాచీన ఆచారాలను పాటించే భారతదేశపు గ్రామాల్లో స్త్రీల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో రాణి, లజ్జో, బిజిలీ అనే ముగ్గురు అమ్మాయిల జీవితాల ద్వారా డెరైక్టర్ చూపించారు. చిత్రం మనసును కదిలిస్తుంది. చివరికి ముగ్గురూ విముక్తి పొందుతారు. విముక్తి కోసం ఆడపిల్లలు ఎంత పోరాటాం చెయ్యాలో ఇందులో చూస్తే కనుక ప్రతి ఇంటి ఆడపిల్లకూ చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది. రాధికా ఆప్టే, తన్నిష్ణా చటర్జీ, సుర్వీన్ చావ్లా.. ఈ చిత్రంలోని ఆ ముగ్గురు అమ్మాయిలు. మొవానా : అఫీషియల్ ట్రైలర్ నవంబర్ 24 ‘థాంక్స్‌గివింగ్ డే’! చాలా దూరమే ఉంది. బట్, గుర్తుంచుకోవలసిన సంగతి.. ఈ ఏడాది ప్రపంచ సినీ అభిమానులంతా వాల్ట్ డిస్నీకి థాంక్స్ చెప్పుకోవాలి. వాల్డ్ డిస్నీ నిర్మిస్తున్న హాలీవుడ్ ఏనిమేటెడ్ మూవీ ‘మొవానా’.. థాంక్స్‌గివింగ్ డేకి ముందురోజే విడుదలవుతోంది. ఇందులో మొవానా అనే కొండజాతి టీనేజర్ అసలు తను ఎవరో తెలుసుకోడానికి తన పూర్వీకుల జాడలను అన్వేషిస్తూ, సముద్రజలాల మీద సాహసయాత్ర ప్రారంభిస్తుంది. సముద్రం మీద అమెకు ‘మాయీ’ అనే డెమిగాడ్ (సగం మనిషి, సగం దేవుడు) తోడవుతాడు. మొవానాకు దారి చూపుతూ ఉంటాడు. మధ్యలో ప్రమాదాలు ఎదురౌతాయి. భయంకరమైన ఆకారాలు పీడించడానికి వస్తాయి. ఇద్దరూ కలిసి అన్నిటినీ ఎదుర్కొంటారు. ఈ అప్‌కమింగ్ 3డి కంప్యూటర్ ఏనిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ కామెడీ ఎడ్వంచరస్ ఫిల్మ్.. మనల్ని ఊరిసి సలపనివ్వకుండా వినోదంలో ముంచెత్తబోతోందని వీడియోలో వండర్ఫుల్ ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకే వాల్ట్ డిస్నీకి థాంక్స్ చెప్పుకోవాలి. -
30 లక్షల మందిపైగా చూశారు!
ముంబై: హృతిక్ రోషన్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మొహంజోదారో' ట్రైలర్ ను సోమవారం రాత్రి విడుదల చేశారు. మూడు నిమిషాలు నిడివివున్న ఈ ప్రచార చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందిపైగా వీక్షించారు. సోమవారం రాత్రి 9.57 గంటలకు స్టార్ టీవీ చాన్సల్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల చేశారు. స్టన్నింగ్స్ విజువల్ ఎఫెక్ట్ తో 'మొహంజోదారో' కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన హృతిక్, ఫూజా హెగ్డే ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో హవా చూపిస్తుండగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. 'లగాన్' డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన కబీర్ బేడి, అరుణోయ సింగ్ కీలకపాత్రలు పోషించారు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సిద్ధార్థరాయ్ కపూర్, సునీత గోవారికర్ నిర్మించిన 'మొహంజోదారో' ఆగస్టు 12న విడుదల కానుంది. టీవీ ద్వారా వేగంగా ప్రేక్షకులను చేరుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ సినిమా ట్రైలర్ ను టీవీలో విడుదల చేసినట్టు దర్శకుడు అసతోశ్ గోవారికర్ తెలిపారు. ప్రచార చిత్రానికి వచ్చిన స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యూట్యూబ్ లోనూ ఈ సినిమా ట్రైలర్ ను అప్పుడే 9 లక్షల మందిపైగా వీక్షించారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అవర్ హోటెల్ హాడ్ యాన్ ఇంట్రెస్టింగ్ పాలసీ ఉల్లాసానికో, ఉత్సాహానికో ఎప్పుడూ టూర్లు కొడుతుండేవారు నిత్య జీవితంలో అస్సలు నివసించలేదు. వారి దేహంతో పాటూ, మనసూ నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే చూడండి... మనం తరచు ఆశ్చర్యపోతుండే విషయాలకు వాళ్లు ఏమాత్రం సర్ప్రైజ్ అవ్వరు. మన స్పందనలకు వాళ్ల స్పందనలకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. భ్రమణకాంక్ష (తిరగాలన్న కోరిక) ఉన్నవారు దేన్నీ పట్టించుకోరు. దేన్నీ లెక్కచెయ్యరు. క్రిస్ టేలర్ అనే అతడు కూడా ఇలాంటి ప్రయాణికుడే. ఈ మధ్య అతడు కాలిఫోర్నియాలోని రుబికాన్ కు 4000 మైళ్ల చరిత్రాత్మక ట్రిప్‌ను ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన స్నేహితులు కూడా. మార్గం మధ్యలోని వింతలు, విశేషాలు వాళ్లకేం కొత్త కాదు కానీ... గ్యాలప్ న్యూ మెక్సికో అనే రోడ్ సైడ్ హోటల్.. ఈ మిత్ర బృందానికి ఊహించని జర్క్ ఇచ్చింది. వీళ్లంతా ఒక రోజు ఉండడానికి ఆ హోటల్లో విడివిడిగా గదులు తీసుకున్నారు. ప్రతి గదికీ ఒక లాక్. ఆ లాక్ తియ్యడానికి ఒక కార్డ్. విషయం ఏంటంటే... క్రిస్ మిత్రుడు తన రూమ్ నెంబర్ 146ని తన దగ్గర ఉన్న కార్డుతో తెరిచాడు. అంతవరకు బాగుంది. అయితే అదే కార్డుతో అన్ని రూములూ ఓపెన్ అవుతున్నట్లు తెలుసుకుని నివ్వెరపోయాడు. క్రిస్ అండ్ కో.. నవ్వుకుంది. ఆ తతంగాన్ని ఇలా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. వాళ్లందరి డౌట్ ఏమిటంటే... క్రిస్ ఫ్రెండ్‌కి ఆ హాటల్ వాళ్లు పొరపాటున మాస్టర్ కీ గానీ ఇచ్చి ఉంటారా అని! డిష్యూం : అఫీషియల్ ట్రైలర్ రోహిత్ ధావన్ దర్శకత్వంలో జూలై 29న రిలీజ్ అవుతోన్న డిష్యూం చిత్రం ట్రైలర్ ఇది. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ల ఉత్కంఠ భరిత సన్నివేశాలను ఇందులో చూడొచ్చు. అయితే పరిమితిని మించి ఉత్కంఠను ఊహించినవారు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడవలసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఇంకా కొద్ది గంటల్లో మొదలవాల్సి ఉండగా మధ్యప్రాచ్యంలో ఇండియన్ టాప్ బాట్స్మన్ మిస్ అవుతాడు. అతడు ఏమైందీ, ఎక్కడుందీ తెలుసుకోడానికి అరేబియా సముద్రానికి రెండు వైపుల నుంచి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. 36 గంటలపాటు వేట మొదలు పెడతారు. తర్వాత ఏమైందన్నది స్టోరీ. మెలనీ మార్టినెజ్ - ఆల్ఫాబెట్ బాయ్ ‘ఐ నో మై ఎ బి సీ స్. ఎట్ యు కీప్ టీచింగ్ మీ...’ మెలనీ మార్టినెజ్ ఈ పాటను ఎవరి గురించి పాడుతున్నారు మీకు అర్థమై ఉంటుంది. టీనేజ్ ఆవేదన ఇది. నిజమే కదా టీన్స్‌లో ఉన్న పిల్లలకు అందరూ చెప్పేవాళ్లే. ‘మాకు తెలుసు’ అని మొత్తుకుంటున్నా ఈ పెద్దవాళ్లు వినరు కదా. అ అ ఆ.. బ బ బ బా.. మని మెల్లిగా రాగం అందుకునే ఈ పాట నిజానికి.. ‘ఆల్వేస్ ఎయిమింగ్ పేపర్ ఎయిర్‌ప్లేన్ ఎట్ మీ.. వెన్ యు ఆర్ అరౌండ్..’ అని మొదలౌతుంది. మెలనీ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్. నిన్న మొన్న పుట్టిన అమ్మాయి. ఏజ్ 21. టీన్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన మెలనీ.. డాల్హస్, పిటీ పార్టీ ఆల్బమ్స్‌తో... సీనియర్ల పాప్ గాయకుల సరసన చేరారు. అయితే ఇప్పుడీ యూట్యూబ్ వీడియో ఆమెను తిరిగి కౌమారప్రాయురాలిగా మార్చి పెద్దల్లో.. ఊహించని పరివర్తనను తెచ్చేంత ముచ్చటగా ఉంది. -
'చీకటి రాజ్యం' మేకింగ్ వచ్చేసింది.