ఈ వారం యూట్యూబ్‌ హిట్స్ | This week YouTube Hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

Published Mon, Jun 6 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

అవర్ హోటెల్ హాడ్ యాన్ ఇంట్రెస్టింగ్ పాలసీ
ఉల్లాసానికో, ఉత్సాహానికో ఎప్పుడూ టూర్‌లు కొడుతుండేవారు నిత్య జీవితంలో అస్సలు నివసించలేదు. వారి దేహంతో పాటూ, మనసూ నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే చూడండి... మనం తరచు ఆశ్చర్యపోతుండే విషయాలకు వాళ్లు ఏమాత్రం సర్‌ప్రైజ్ అవ్వరు. మన స్పందనలకు వాళ్ల స్పందనలకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. భ్రమణకాంక్ష (తిరగాలన్న కోరిక) ఉన్నవారు దేన్నీ పట్టించుకోరు. దేన్నీ లెక్కచెయ్యరు. క్రిస్ టేలర్ అనే అతడు కూడా ఇలాంటి ప్రయాణికుడే.

ఈ మధ్య అతడు కాలిఫోర్నియాలోని రుబికాన్ కు 4000 మైళ్ల చరిత్రాత్మక ట్రిప్‌ను ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన స్నేహితులు కూడా. మార్గం మధ్యలోని వింతలు, విశేషాలు వాళ్లకేం కొత్త కాదు కానీ... గ్యాలప్ న్యూ మెక్సికో అనే రోడ్ సైడ్ హోటల్.. ఈ మిత్ర బృందానికి ఊహించని జర్క్ ఇచ్చింది. వీళ్లంతా ఒక రోజు ఉండడానికి ఆ హోటల్‌లో విడివిడిగా గదులు తీసుకున్నారు. ప్రతి గదికీ ఒక లాక్.

ఆ లాక్ తియ్యడానికి ఒక కార్డ్. విషయం ఏంటంటే... క్రిస్ మిత్రుడు తన రూమ్ నెంబర్ 146ని తన దగ్గర ఉన్న కార్డుతో తెరిచాడు. అంతవరకు బాగుంది. అయితే అదే కార్డుతో అన్ని రూములూ ఓపెన్ అవుతున్నట్లు తెలుసుకుని నివ్వెరపోయాడు. క్రిస్ అండ్ కో.. నవ్వుకుంది. ఆ తతంగాన్ని ఇలా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. వాళ్లందరి డౌట్ ఏమిటంటే... క్రిస్ ఫ్రెండ్‌కి  ఆ హాటల్ వాళ్లు పొరపాటున మాస్టర్ కీ గానీ ఇచ్చి ఉంటారా అని!
 
డిష్యూం : అఫీషియల్ ట్రైలర్
రోహిత్ ధావన్ దర్శకత్వంలో జూలై 29న రిలీజ్ అవుతోన్న డిష్యూం చిత్రం ట్రైలర్ ఇది. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ల ఉత్కంఠ భరిత సన్నివేశాలను ఇందులో చూడొచ్చు. అయితే పరిమితిని మించి ఉత్కంఠను ఊహించినవారు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడవలసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఇంకా కొద్ది గంటల్లో మొదలవాల్సి ఉండగా మధ్యప్రాచ్యంలో ఇండియన్ టాప్ బాట్స్‌మన్ మిస్ అవుతాడు. అతడు ఏమైందీ, ఎక్కడుందీ తెలుసుకోడానికి అరేబియా సముద్రానికి రెండు వైపుల నుంచి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. 36 గంటలపాటు వేట మొదలు పెడతారు. తర్వాత ఏమైందన్నది స్టోరీ.
 
మెలనీ మార్టినెజ్ - ఆల్ఫాబెట్ బాయ్
‘ఐ నో మై ఎ బి సీ స్. ఎట్ యు కీప్ టీచింగ్ మీ...’ మెలనీ మార్టినెజ్ ఈ పాటను ఎవరి గురించి పాడుతున్నారు మీకు అర్థమై ఉంటుంది. టీనేజ్ ఆవేదన ఇది. నిజమే కదా టీన్స్‌లో ఉన్న పిల్లలకు అందరూ చెప్పేవాళ్లే. ‘మాకు తెలుసు’ అని మొత్తుకుంటున్నా ఈ పెద్దవాళ్లు వినరు కదా. అ అ ఆ.. బ బ బ బా.. మని మెల్లిగా రాగం అందుకునే ఈ పాట నిజానికి.. ‘ఆల్వేస్ ఎయిమింగ్ పేపర్ ఎయిర్‌ప్లేన్ ఎట్ మీ.. వెన్ యు ఆర్ అరౌండ్..’ అని మొదలౌతుంది.

మెలనీ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్. నిన్న మొన్న పుట్టిన అమ్మాయి. ఏజ్ 21. టీన్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన మెలనీ.. డాల్‌హస్, పిటీ పార్టీ ఆల్బమ్స్‌తో... సీనియర్‌ల పాప్ గాయకుల సరసన చేరారు. అయితే ఇప్పుడీ యూట్యూబ్ వీడియో ఆమెను తిరిగి కౌమారప్రాయురాలిగా మార్చి పెద్దల్లో.. ఊహించని పరివర్తనను తెచ్చేంత ముచ్చటగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement