YouTube hits
-
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
‘గంగవ్వ’ ఎరుకనే కదా..!
సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయ కూలీనుంచి.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్ మై విలేజ్ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ఛానల్ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గంగవ్వ మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్ వీడియోలు తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది. మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం. గంగవ్వతో ఒక్క సెల్ఫీ.. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు. చెప్పింది చేసుడే తెలుసు.. వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం. – గంగవ్వ -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అమర్ అక్బర్ ఆంటోని – థియెట్రికల్ ట్రైలర్ నిడివి 2 ని.02సె ,హిట్స్ 2,218,077 శ్రీను వైట్ల తొలి సినిమా ‘నీ కోసం’లో హీరో రవితేజాయే. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలసి ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ సినిమాలతో సక్సెస్ చూశారు. కాలం గడిచిపోయింది. ఇద్దరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు వచ్చాయి. హీరోగా మళ్లీ ఒక సూపర్ హిట్ ఇవ్వాల్సిన అవసరం రవితేజాకి, దర్శకుడిగా తాన సత్తా చాటాల్సిన సందర్భం శ్రీను వైట్లకు వచ్చాయి. ‘ఆగడు’, ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’ సినిమాలు శ్రీను వైట్లను నిరాశ పరిచాయి. కనుక మళ్లీ ఒక మేజిక్ కోసం పాత స్నేహితుడు రవితేజాతో జోడీ కట్టాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం తొలి పాజిటివ్ సంకేతం. ట్రైలర్లో మంచి ఎనర్జీ, మేకింగ్‌లో క్వాలిటీ, నటీనటుల ప్యాడింగ్, మ్యూజిక్... అన్నీ ఊపు మీద ఉన్నాయి. కథను విదేశాల్లో నడపడం వల్ల లొకేషన్లు కూడా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. కథ ‘రివేంజ్’ పాయింటే అయితే శ్రీనువైట్ల తనదైన ఎంటర్టైన్మెంట్తో తీసినట్టు తెలుస్తోంది. ‘చెడ్డవాళ్ల నుంచి చెడును ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. ‘అమర్ అక్బర్ ఆంటోని’ టైటిల్ చాలా హిట్ టైటిల్. దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ అమితాబ్‌ను హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా నేటికీ టీవీలో ఇంటిల్లిపాది కలెక్షన్లతో ఆడుతుంటుంది. ఆ క్యాచీ టైటిల్ కూడా సినిమాకు ప్లస్ కావచ్చు. ఏమైనా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. డిసెంబర్ 16 విడుదల. విలేజ్ దివాలి– కామెడీ షార్ట్ ఫిల్మ్ నిడివి 10 ని. 52 సె. ,హిట్స్ 1,830,539 దీపావళి అంటే గతంలో జేబులో డబ్బులు పెట్టుకుని సంచిలో టపాకాయలు తెచ్చేవాళ్లం. ఇప్పుడు సంచిలో డబ్బులు పెట్టుకొని జేబులో టపాకాయలు తెచ్చుకునేంత ఖరీదుగా మారాయి. ఈసారి దీపావళి మీద ఫోకస్ కూడా పెరిగింది. సుప్రీంకోర్టు ఎంత సేపు టపాకాయలు కాల్చలన్న సంగతిపై తీర్పు ఇవ్వడంతో కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే జనం తీర్పును దాదాపు పక్కన పెట్టిన ఉదంతాలు కనిపించాయి. ఈ నేపధ్యంలో ‘మై విలేజ్ షో’ యూ ట్యూబ్ చానల్ వారు ‘విలేజ్ దివాలి’ ఫన్ వీడియో తీశారు. తెలంగాణ భాష మాధుర్యంతో ఆకట్టుకునే ఈ షో అక్కడి గ్రామస్తులే నటులైన కారణాన సహజరీతిలో ఉంటూ నవ్వు తెప్పిస్తుంది. ఈ షోలో ఒక పిసినారి తండ్రి టపాకాయలు కొనమని పీక్కు తినే పిల్లలను చివరకు చిల్లర తుపాకులు కొనిచ్చి ఊరుకోబెడతారు. పండక్కు అల్లుళొచ్చి అది కావాలి ఇది కావాలి అని పేచీకి దిగితే ఇద్దరు అత్తలు ఒక ప్లాన్ చేసి అల్లుళ్లను దారికి తెస్తారు. చివరలో పర్యావరణ సహిత టపాసులు కాల్చమని సందేశం కూడా ఉంది. సరదాగా చూడొచ్చు. వినయ విధేయ రామ– టీజర్ నిడివి 0 ని.49 సె. ,హిట్స్ 11,942,34 ఇప్పుడు తెలుగులో ఉన్న మొదటి ఐదు మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. హీరోను ఎలివేట్ చేసి, అతనితో ముడిపడిన ఎమోషనల్ సీన్లను ప్లాన్ చేసి, భారీ ఫైట్లు పెట్టి, బలమైన డైలాగులు పెట్టి, పట్టు సడలని కథనంతో సినిమాను గట్టున పడేయడం ఆయన శైలి. ‘రంగస్థలం’లో సెమీ రియలెస్టిక్ నటన చూపి అభినయాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు దగ్గరైన రామ్‌చరణ్ తన మాస్ అభిమానులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని ‘వినయ విధేయ రామ’ తీర్చే సూచనలు టీజర్లో కనిపిస్తున్నాయి. మన దర్శకులు హీరోల వంశాలను, వారి తండ్రుల గొప్పతనాన్ని వదిలిపెట్టరు. ఈ సినిమారో హీరో పేరు ‘రామ్ కొణిదల’ అట. పాత్రను గుర్తించేలోపు దాని నుంచి బయటపడేసే ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారో. టైటిల్ బాగానే ఉన్నా బోయపాటి గత టైటిల్ ‘జయ జానకి నాయక’ వరుసలోనే ఉంది. భారీతనం మెండుగా ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
భారతీయ రైల్ (షార్ట్ ఫిల్మ్– హిందీ) నిడివి 14 ని.47సె , హిట్స్ 2,413,235 కంట నీరు కురువని వాడు రైల్లో ప్రయాణించనివాడు భారతదేశంలో ఉండడు. రైలెక్కాక ఒక మినీ భారతదేశమే రైల్లో ఉంటుంది. వంద రకాల మనుషులు, మనస్తత్వాలు, మంచితనాలు, తెలివిడి మొహాలు, కయ్యాలు, కొట్లాటలు, టికెట్టు లేని ప్రయాణికులు, బిచ్చగాళ్లు, సరుకులమ్మే వాళ్లు, హిజ్డాలు... రైలు మొదలయ్యి గమ్యం చేరే లోపల అనంతమైన కార్యకలాపాలు సాగుతాయి. రైలునే జీవనాధారం చేసుకునేవారి మాట తీరు, జీవన నైపుణ్యం, లౌక్యం, దబాయింపు ఎవరూ మర్చిపోరు. రైలు చుట్టూ చాలా సాహిత్యం ఉంది. సినిమాలు ఉన్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ భారతీయ రైల్వేలలో నిత్యం తారస పడే ఘటనలను చూపించి నవ్వు తెప్పిస్తుంది. టాయిలెట్స్ దగ్గర నడవడానికి కూడా చోటు లేకుండా ఆక్రమించుకుని పడుకుని ఉండేవారిని దాటుకుని వెళ్లడం ఎంత కష్టమో– మనకు తెలిసిందే– మళ్లొకసారి చూసుకుంటే గిలిగింత పుడుతుంది. ఎవరో కుర్రాడు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గంటలు గంటలు మాట్లాడి చంపుతుంటాడు. పేకాట ఆడేవాళ్లు, ఆస్తి మొత్తం టీసీకి రాసిచ్చైనా సరే బెర్త్ సంపాదించాలని తంటాలు పడేవాళ్లు, ఎదుటి వారికి అవసరం లేకపోయినా సలహాలు ఇచ్చేవాళ్లు... ఇండియాలో ఇంతే... ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అనిపిస్తుంది. ‘టి.వి.ఎఫ్’ వారి వీడియో ఇది. రైలును అభిమానించేవారు తప్పనిసరిగా చూడొచ్చు. మొహల్లా అస్సి (హిందీ సినిమా ట్రైలర్) నిడివి 2 ని. 31 సె. , హిట్స్ 9,476,593 కాశీ నగరం భారతీయ ఆధ్యాత్మికతలో అవిభాజ్యమైన నగరం. కాశీ ప్రమేయం లేని హైందవ ధర్మ వికాసం లేదు. శివ భక్తుల అంతిమ గమ్యస్థలి అది. అలాంటి నగరాన్ని రాజకీయ కారణాల రీత్యా, వ్యాపార కారణాల రీత్యా ఎలా కలుషితం చేస్తున్నారో చూప్తూ రచయిత కాశీనాథ్ సింగ్ ‘కాశీ కా అస్సి’ అనే నవల రాశారు. ‘అస్సి’ అంటే ఎక్కువగా విదేశీ టూరిస్టులు బస ఉండే కాశీలోని ఒక ఘాట్. ఆ నవల ఆధారంగానే ‘మొహల్లా అస్సి’ సినిమా తీశారు. అంటే ‘అస్సి చుట్టుపక్కల’ అని అర్థం. ఇందులో సన్ని డియోల్ ఒక ‘పండా’గా నటించాడు. దొంగ గురువులు, సాధువులు, రామ మందిర వివాదం ఇవన్నీ కాశీ మీద ఎలాంటి ఫ్రభావం చూపాయో ఈ సినిమాలో చూడొచ్చు. సెన్సార్ కారణాల రీత్యా విడుదల ఆలస్యమైన ఈ సినిమా నవంబర్ 16న విడుదల కానుంది. ఒకప్పుడు టీవీలో ‘చాణక్య’ నవల ద్వారా పాపులర్ అయిన నటుడు చంద్రప్రకాష్ ద్వివేది ఈ సినిమా దర్శకుడు. సవ్యసాచి (ట్రైలర్) నిడివి 1 ని. 39 సె. ,హిట్స్ 4,121,951 చందు మొండేటి అకౌంట్లో ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ సినిమాల విజయం ఉంది. అతడి మూడో సినిమా ‘సవ్యసాచి’. ఈ టైటిల్ మహిమ ఏమో కాని ఎన్నో ఏళ్లుగా ఈ టైటిల్‌తో సినిమా తీయాలని చాలామంది ట్రై చేసి విఫలం అయ్యారు. చివరకు నాగ చైతన్యకు రాసి పెట్టి ఉంది. తమిళుల తరహాలో ‘హీరోకు ఒక చేయి అతని అదుపులో ఉండదు’ అనే పాయింట్‌ని తీసుకుని, తమిళుల తరహాలోనే ఒక విలన్ (మాధవన్)ను అనుకుని ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తోంది. నవ్యత కోసం ప్రయత్నించారనడంలో సందేహం లేదు. భూమిక, నిధి అగర్వాల్ ఇతర ముఖ్య పాత్రలు. మైత్రీ మూవీస్ నిర్మాణం, కీరవాణి సంగీతం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్‌కు లాభించే అంశాలు. థ్రిల్లర్లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. ఆ వరుసలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 2 విడుదల. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఉత్తరం– షార్ట్ ఫిల్మ్ నిడివి 24 ని.04సె , హిట్స్ 91,283 ఉత్తరాలు పోయి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ పోయి మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు పోయి ఆ మెసేజ్ భాషలోని షార్ట్ కట్ మిగిలింది. థ్యాంక్యూ కి ’tq’. ఐ లవ్ యూ కి ’ILY’. లెట్ మి నో కు ’LMK’... ఇలా. ప్రేమ, అభిమానం, ఆప్యాయత... అన్నీ ఈ పొడి పొడి మాటల్లో ముక్కచెక్కలయ్యాయి. ఇవాళ మనసులోని భావాలను ఎదుటివారికి పరవడం లేదు. సరైన మాటల్లో మనసును తాకేలా నివేదించడం లేదు. ఉత్తరం రాయడం లేదు. ఒట్టి మాటలతో, వాట్సాప్‌లతో బంధాలు ముడిపడతాయా? ‘ఉత్తరం’ షార్ట్‌ఫిల్మ్ ఒక తాతా మనవడిది. ఊళ్లో ఉన్న తాత– భార్యతో గొడవ పడి విడాకుల దాకా వెళ్లి సెలవు మీద ఊరు చేరుకున్న మనవడితో చేసే సంవాదం ఈ కథ. భార్య పట్ల మనసులో నిజంగా ఏముందో, ఎంత ప్రేముందో తెలియాలంటే కావలసింది మధ్యవర్తులు, పంచాయితీలు, వాదనలు కాదని మంచి ఉత్తరం అని తాత చెబుతాడు. ఆ మేరకు మనవడి చేత రాయిస్తాడు. ఆ ఉత్తరానికి ఎటువంటి స్పందన వచ్చిందనేది ముగింపు. ఎల్.బి.శ్రీరామ్ సున్నితమైన అంశాలను తీసుకొని సాహిత్యం నుంచి ఎంపిక చేసుకున్న కథల ద్వారానో, లేదా సొంతంగా అల్లిన కథల ద్వారానో ఆకట్టుకునే షార్ట్‌ఫిల్మ్స్ తీస్తున్నారు. ఆ వరుసలో ఈ షార్ట్‌ఫిల్మ్ సామాజిక ప్రయోజనం కలిగినది అని చెప్పవచ్చు. ఇవాళ్టి తరానికి ఇటువంటి షార్ట్‌ఫిల్మ్స్ కొంత అవసరమే అనిపిస్తుంది. చిరాకులో ఉన్న దంపతులు తప్పక చూడాల్సిన ఫిల్మ్ ఇది. చక్కటి భాష, సంభాషణలు, దర్శకత్వం, లొకేషన్ ఉన్నాయి. ఎల్.బి.శ్రీరామ్, శర్మ లంక ముఖ్య పాత్రధారులు. హలో గురూ ప్రేమ కోసమే – ట్రైలర్ నిడివి 2 ని. 1 సె. ,హిట్స్ 4,211,561 రామ్ సినిమాలలో ‘నేనూ శైలజా’ తర్వాత వచ్చిన ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వెంట వెంటనే హిట్స్ ఇవ్వడం, మార్కెట్లో డిమాండ్‌లో నిలవడం గ్లామర్ ప్రపంచంలో తప్పనిసరి. లేకుంటే ఈలోపు సమీకరణాలు మారిపోతాయి. హిట్స్‌ను బట్టి వేరే వేరే హీరోలొచ్చి స్లాట్స్‌ను తన్నుకుపోతారు. రామ్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంది. యాక్షన్ కామెడీ సినిమాలను అతను ఒక్క చేత్తో లాక్కురాగలడు. లవ్ సబ్జెక్ట్స్ కూడా అతడికి మేచ్ అవుతాయి. అన్నీ సరిగ్గా కుదిరితే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగలడు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా అతడికి అలాంటి అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. గతంలో ‘సినిమా చూపిస్తా మావా’, ‘నేను లోకల్’ సినిమాలు తీసిన త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటుడు హీరో ఫ్రెండ్‌గా డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం ఫ్రెష్‌గా అనిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు మెచ్చి తీసిన సినిమా అంటే ఏదో ఒక పాయింట్ ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది కనుక సినిమా కోసం ఎదురుచూడటమే తరువాయి. హమీద్ – ట్రైలర్ నిడివి 2 ని. 36 సె. ,హిట్స్ 1,562,977 కశ్మీర్ లోయ నేపథ్యంగా చాలా సినిమాలే వచ్చాయి. అక్కడ అలజడుల్లో మనుషులు అదృశ్యం కావడం సర్వ సాధారణం. కొడుకులు అదృశ్యం అయిన తల్లులు, భర్తలు అదృశ్యమైన భార్యలు అక్కడ వందల కొలదీ కనిపిస్తారు. జీవచ్ఛవాలుగా బతుకీడుస్తుంటారు. ఆ అదృశ్యమైనవారు బతికారో చనిపోయారో కూడా తెలియనిదుర్భర సందిగ్ధావస్థ. ఈ సినిమాలో ఎనిమిదేళ్ల హమీద్ అనే కుర్రాడి తండ్రి కూడా అదృశ్యమవుతాడు. తల్లి కుదేలవుతుంది. హమీద్‌కు ఈ విషయం దేవుడి దగ్గర నిలదీయాలనిపిస్తుంది. ‘786’ దేవుడి నంబర్ అని ఎవరో చెబుతారు. దానికి అటూ ఇటూ నంబర్ కలిపి హమీద్ డయల్ చేస్తాడు. అది కశ్మీర్‌లోనే విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడికి వెళుతుంది. అతడు తానే ‘అల్లా’ అని అతడితో సంభాషణలో దిగుతాడు. వాళ్లిద్దరూ తమ తమ జీవితాల నుంచి ఏమి తెలుసుకున్నది పరస్పరం ఏమి ఇచ్చుకున్నది ఈ సినిమా. ‘సారెగమ’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఏజాజ్ ఖాన్ దర్శకత్వం వహించాడు. బాల నటుడిగా నటించిన ‘తల్హా అర్షద్’ మనసును కట్టి పడేస్తాడు. ఎదురు చూడదగ్గ సినిమా. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్– అఫీషియల్ ట్రైలర్ నిడివి 3 ని.38సె , హిట్స్ 42,342,521 భారతదేశంలో థగ్గుల చరిత్ర చాలానే ఉంది. ఆ పేరు చెప్పగానే నేటికీ ఉలిక్కిపడేవాళ్లున్నారు. బాటసారులతో కలిసిపోయి అదను చూసి తడిగుడ్డతో గొంతుకోసే థగ్గుల గురించి వందలాది కథలు ప్రచారంలో ఉన్నాయి. మొఘలు సామ్రాజ్యం అంతమయ్యి బ్రిటిష్ పాలన వేళ్లూనుకుంటున్న సంధి కాలంలో థగ్గులు రెచ్చిపోయారు. వీరి చేతుల్లో దాదాపు 50 వేల మంది చనిపోయి ఉంటారని కొందరు లక్ష వరకు సఫా అయి ఉంటారని మరికొందరు అంటారు. ఈ నేపథ్యంలో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ పేరుతో సినిమా రావడం పెద్ద ఆసక్తి కలిగించే అంశం. దీనిని దర్శకుడు ‘దేశభక్తి’ కోణం నుంచి చూడటం విశేషం. థగ్గులు దేశభక్తులనీ బ్రిటిష్‌వారిని ఎదిరించారని ఈ కథలో చెప్తున్నాడు. చరిత్రకారుల్లో కొందరి అభిప్రాయం ఏమిటంటే థగ్గులను పెంచి పోషించింది బ్రిటిష్‌వారే అని. భారతీయులలో భయం పెంచి తమను శరణుజొచ్చేలా చేయడానికి థగ్గులను రెచ్చగొట్టారని కొందరి పరిశీలన. ఏమైనా ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, ఆమిర్‌ఖాన్ తొలిసారి జోడి కట్టడం, కత్రీనాకైఫ్ తన సొగసును చిందించడం, భారీ ఖర్చు, ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ తరహా మేకింగ్ ఇవన్నీ మాస్ ప్రేక్షకుడిని లొట్టలేసేలా చేస్తున్నాయి. యశ్‌రాజ్ ఫిలిమ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమాను ‘ధూమ్3’ దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య తెరకెక్కించాడు. నవంబర్ 8 విడుదల. బజార్ – అఫీషియల్ ట్రైలర్ నిడివి 2 ని. 42 సె. , హిట్స్ 13,477,557 కోట్లకు పడగలెత్తినవారు మరిన్ని వందల కోట్ల కోసం సహస్రఫణులను ఎలా విప్పుతారో సామాన్యుడి ఊహకు అంతుచిక్కని అంశం. ఇవాళ బజారులో పచారీకొట్టులో చిన్న చిన్న వస్తువులను కొనే సామాన్యుడికి ఆ వస్తువుల విస్తరణ కోసం మార్కెట్ మీద ఆధిపత్యం కోసం తద్వారా దేశం మీద అజమాయిషీ కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో తెలిసే అవకాశం లేదు. ‘బజార్’ సినిమా బహుశా అలాంటి కథను చెప్పే అవకాశం ఉంది. డబ్బు తప్ప వేరే ఏమీ ఆలోచించని ఒక వ్యాపారవేత్త తనను ఢీకొట్టడానికి వచ్చిన ఒక కుర్రకుంకతో కలిసి ఎటువంటి మాయోపాయాలు పన్ని ఉంటాడనేది కథ కావచ్చు. ‘మారథాన్‌ను గెలిచినవాణ్ణి ఎవరూ గుర్తు పెట్టుకోరు. హండ్రెడ్ మీటర్స్ రేస్ గెలిచినవాణ్ణి జ్ఞప్తికి పెట్టుకుంటారు’ వంటి డైలాగులు ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ శక్తిమంతమైన పాత్రను పోషించినట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. రాధికా ఆప్టే, చిత్రాంగదా సింగ్ తెర మీద కొన్ని హాట్ హాట్ సన్నివేశాలు ఊతం ఇచ్చినట్టు కనిపిస్తోంది. గౌరవ్ కె.చావ్లా దర్శకుడు. అక్టోబర్ 26 విడుదల. లవ్ ఈజ్ లవ్ – హిందీ షార్ట్ ఫిల్మ్ నిడివి 11 ని. 53 సె. ,హిట్స్ 916,603 పెళ్లిచూపులు జరుగుతుంటాయి. అబ్బాయి ఫ్రాంక్‌గా మాట్లాడే టైప్. ‘నా కాలేజీ రోజుల్లో నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు’ అంటాడు. ‘మరి నీ సంగతి’ అని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం సందిగ్ధంగా ‘నాక్కూడా’ అంటుంది. ఆ అబ్బాయి ‘ఆమెకు ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నార’ని అర్థం చేసుకుంటాడు. వాస్తవానికి ఆ అమ్మాయి చెప్పింది తనకు ఇద్దరు ‘గర్ల్‌ఫ్రెండ్స్’ ఉన్నారని. వ్యక్తులు తమ లైంగికతను, లైంగిక ఆసక్తులను బయటపెట్టే వాతావరణం ఇప్పుడిప్పుడే దేశంలో కనిపిస్తోంది. సజాతి వ్యక్తుల ఆకర్షణకు సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. కొన్ని చోట్ల సంప్రదాయ కుటుంబాల వారు కూడా చేదు దిగమింగుకునో లేదంటే పరిణితితో ఆలోచించో ‘గే మేరేజస్’ వరకూ వెళుతున్నారు. ఈ సందర్భంలో ‘లెస్బియన్’ అయిన అమ్మాయి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కేరీ చేసే కథ ఇది. దానిని తల్లిదండ్రులు ఎలా స్వీకరించారో హుందా అయిన చర్చ ద్వారా చూపించారు. కొన్ని విషయాలను మరుగున పెట్టి అనర్థాలు తెచ్చుకోవడం కన్నా వెలుతురులోకి తీసుకువచ్చి సక్రమైన మార్గం చూపడమే కాదు దానిని సమర్థించడం కూడా అవసరమే అని ఈ షార్ట్‌ఫిల్మ్ చెబుతుంది. -
‘అది’ మాట్లాడరుకానీ దేశ జనాభా పెంచేస్తుంటారు!
బధాయి హో – ఆఫీషియల్ టీజర్ నిడివి 3 ని. 3 సె. ,హిట్స్ 15,146,445 భారతీయులు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడరుకానీ దేశ జనాభాను పెంచడంలో మాత్రం విశేష ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడేమో గానీ ఒక ముప్పై ఏళ్ల క్రితం చాలా ఇళ్లల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉండేది కాదు. ఒక్కోసారి కొన్ని ఇళ్లల్లో తల్లి గర్భంతో ఉంటే కాపురానికి వెళ్లిన కూతురు కూడా గర్భంతో తిరిగి వచ్చి ఇద్దరూ ఒకే చూరు కింద ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సిట్యుయేషన్లో తల్లీ కూతుళ్లే కాదు మామా అల్లుళ్లు కూడా ఒకరినొకరు ఎదురుపడటానికి ఇబ్బంది పడేవారు. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు వస్తే? అదే ‘బధాయీ హో’ కథ. ఎదిగొచ్చిన ఇద్దరు కుమారులు ఉన్న తల్లి హటాత్తుగా గర్భం దాలుస్తుంది. తల్లీ తండ్రి నానమ్మ ఇంట్లో ఇద్దరు కొడుకులు వీళ్లు సమాజం నుంచి ఎటువంటి ఘర్షణ ఎదుర్కొన్నారు తమలో తాము ఎలా ఘర్షణ పడ్డారు అనేది కామెడీగా చెప్పిన కథ ఇది. హిందీ వాళ్లు కొత్త కొత్త కథలను వినోదం కోసం ఎంచుకుంటున్నారు. పెద్దలు మాత్రమే వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయదగ్గ సినిమాగా అనిపిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరో. ‘దంగల్’ ఫేమ్ సాన్య మల్హోత్రా హీరోయిన్. అక్టోబర్ 19న విడుదల. ప్లస్ మైనస్ – హిందీ షార్ట్‌ఫిల్మ్ నిడివి 18 ని.7సె ,హిట్స్ 9,231,520 భార్యలకు ఎప్పుడూ కంప్లయింట్సే. భర్త సరిగా చూసుకోవడం లేదనీ... అత్తగారు పెత్తనం ఎక్కువ చేస్తుందనీ... కాపురం నరకంగా ఉందనీ... అసలు పెళ్లే చేసుకోకపోతే బాగుంటుందనీ... భర్తలు మాత్రం తక్కువా? ఇవే కంప్లయింట్లు భార్యల మీద కొంచెం అటు ఇటుగా. కాపురం మీద తీవ్ర అసంతృప్తి ఉన్న ఒక భార్య ఢిల్లీ నుంచి జలంధర్ వెళుతూ ఉంటుంది భర్త దగ్గరకు. ఆమెకు భర్త అంటే ఎంత విసుగ్గా ఉంటుందంటే రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు కూడా రావద్దని అంటుంది. ఆ విసుగునే తన ఎదురుగా ఉన్న ఒక సైనికునితో పంచుకుంటుంది. ఆ సైనికుడు ఆమెతో మాట కలుపుతాడు. ‘మేము సరిహద్దులో ఉంటాం. జీవితం గురించి ఆలోచించడానికి అక్కడ చాలా సమయం దొరుకుతుంది. జీవించడానికి మనసారా జీవితం దొరికితే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి ఇంటికి వస్తాం. ఆ సమయంలో భార్యను ప్రేమించడానికి సమయం చాలదు. ఇక జగడానికి వీలెక్కడ’ అంటాడు. ‘సైనికుల జీవితం ఒక నిమిషం నుంచి మరో నిమిషంలో మారిపోతూ ఉంటుంది. మేము రిటైర్ అవుతామో అమరులవుతామో మాకే తెలియదు. అందుకే ప్రతి నిమిషాన్ని మనస్ఫూర్తిగా జుర్రుకోవాలని చూస్తాం. మీరు సాధారణ మనుషులు. మీ దగ్గర ఎంతో సమయం ఉంటుంది. భద్రత ఉంటుంది. ప్రతి నిమిషాన్ని ఎంతో ఆస్వాదించవచ్చు. ప్రేమతో ఉండచ్చు. కాని మీరు ఎదుటి వారిలో ప్లస్సులూ మైనస్‌లు వెతుక్కుంటూ కూర్చుంటారు’ అంటాడు. ఆ మాట ఆమెను ఆలోచనలో పడేస్తుంది. తర్వాత ఏమవుతుందనేది కథ. యూ ట్యూబ్ స్టార్ భువన్, సినీ నటి దివ్యా దత్తా నటించారు. 2.ఓ – ఆఫీషియల్ టీజర్ నిడివి 1 ని. 29 సె. , హిట్స్ 6,588,760 ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ట్రైలర్. ఇది ఎంతో కాలంగా ప్రేక్షకుల మధ్య నలుగుతున్న సినిమా. ఇంతకాలానికి రాబోతూ ఉంది. సినిమా కథను ఒక్కముక్కలో దర్శకుడు ఈ టీజర్లో చెప్పేశాడు. లోకానికి ఒక ‘పక్షి విలన్’తో ముప్పు వచ్చింది. ఆ విలన్ ఎదుర్కొనడానికి మనిషనేవాడు లేడు. ఏం చేయాలి? గతంలో ప్రమాదకారి అని తలచి డిస్మాంటల్ చేసి ‘చిట్టీ’ రోబోను తిరిగి ఉనికిలోకి తేవాలి. ఆ చిట్టీ ఈ విలన్ భరతం ఎలా పట్టాడనేది కథ. సాధారణంగా ఈ సినిమా టీజర్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ‘కబాలి’ టీజర్ కట్ చేసిన తీరు దాని మీద ఎన్నో అంచనాలను పెంచింది. ఈ టీజర్ ఆ స్థాయి సంతృప్తిని ఇచ్చేలా ఉందా అనేది చెప్పలేము. 3డిలో చూడాల్సిన ఈ టీజర్‌ను 2డిలో చూడటం వల్ల ఇలా అనిపిస్తోందా అంటే ఎఫెక్ట్స్‌కు 3డి కాని కంటెంట్‌కు కాదుగా. ఏమైనా వందల కోట్లు సంవత్సరాల తరబడి కాలం వెచ్చించి తీసిన ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఎక్కువ కుతూహలం కలిగిస్తోంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అంధా ధున్ – ట్రైలర్ నిడివి 2 ని. ,హిట్స్ 1,61,42,070 అంటే చీకటి పాట అని అర్థం. ఈ మధ్యే హృతిక్ రోషన్ అంధుడిగా ‘కాబిల్’ అనే థ్రిల్లర్ వచ్చింది. ఈ అంధా ధున్ కూడా థ్రిల్లరే. అయితే ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. తన సమక్షంలో జరిగిన హత్యలను ఆ అంధుడు గుర్తించి ఎలా నిందితులను పట్టుకున్నాడా అనేది కథ. ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైసా’ వంటి హిట్ చిత్రాలను అందించిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాను కూడా హిట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. టబూ, రాధికా ఆప్టే ఇతర ప్రధాన తారలు. గతంలో ‘ఏక్ హసీనా థీ’, ‘రామన్ రాఘవన్’, ‘బద్లాపూర్’ వంటి సినిమాలు తీసిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమా దర్శకుడు. అక్టోబర్ 5 విడుదల. నోటా – ట్రైలర్ నిడివి 1 ని. 39 సె. ,హిట్స్ 49,08,923 ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వాలు ఏర్పడాలంటే అభ్యర్థులను ఎంచుకోవాలి. అభ్యర్థులను ఎంచుకోవాలంటే వారు నచ్చాలి. నచ్చితే ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తుపై ఓటు వేస్తాం. నచ్చకపోతే? ఎన్నికలలో నిలబడిన ఏ అభ్యర్థీ నచ్చకపోతే? అప్పుడు ప్రజలు నొక్కాల్సిన మీట ‘నోటా’. ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులకు పవర్ ఉన్నట్టే ఈ ‘నోటా’కు కూడా పవర్ ఉంటుంది. దీనిని సరిగా ఉపయోగించిన రోజు పార్టీల పట్ల ఈ దేశంలోని ప్రజలకు నిజమైన అంగీకారం ఏమేరకు ఉందో తెలిసి వస్తుంది. విజయ్ దేవరకొండ చాలా త్వరగానే బైలింగ్వల్ సినిమా స్థాయికి ఎదిగాడు. ‘నోటా’ తమిళంలో తెలుగులో ఏకకాలంలో నిర్మితమైంది. ఇందులో విజయ్ దేవరకొండ ‘కీలుబొమ్మ సి.ఎం’గా కనిపిస్తాడు. కాని అతడికి రాజకీయాల మర్మం నిజంగా తెలిసిననాడు ఏం చేశాడనేది కథ కావచ్చు. విక్రమ్ ‘హిజ్డా’గా నటించి హిట్ చేసిన సినిమా ‘ఇంకొక్కడు’కు దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ ఈ సినిమాకు కూడా దర్శకుడు. నాజర్, సత్యరాజ్ తదితరులు సహపాత్రలు పోషించారు. మెహ్రీన్ హీరోయిన్. ఎన్నికలు వస్తున్న వేళ ఈ సినిమా ప్రేక్షకులలో ఆసక్తి రేపవచ్చు. అదీ లెక్క – షార్ట్ ఫిల్మ్ నిడివి 13 ని. 40 సె. ,హిట్స్ 63,990 తెలుగులో వచ్చిన కథలలో నుంచి షార్ట్‌ఫిల్మ్స్‌కు అనువైన వాటిని ఎంచుకుని ‘ఎల్బి శ్రీరామ్ హార్ట్ఫిల్మ్స్’ పేరుతో రెగ్యులర్‌గా నిర్మిస్తున్న నటుడు ఎల్.బి.శ్రీరామ్ తాజాగా అందించిన షార్ట్‌ఫిల్మ్ ఇది. రిటైరైన లెక్కల మాస్టారు తాను రిటైరైనా తనలోని మాస్టారు ఎప్పటికీ రిటైర్ కాడని ‘లెక్క తప్పిన’ విద్యార్థి ఎప్పుడు కనిపించినా తిరిగి సరైన లెక్కలో పెడతాడని ఈ షార్ట్‌ఫిల్మ్ చెబుతుంది. మదనపల్లి సమీపంలో తీయడం వల్ల ఒక దేశీయమైన వాతావరణంలో ఈ షార్ట్‌ఫిల్మ్ ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎల్.బి. శ్రీరామ్ మాటలు ఆయనలోని నటుడిలాగే రచయిత కూడా మసకబారలేదని నిరూపిస్తాయి. రెండు వేల నోటు పోగొట్టుకుని ఇల్లు చేరిన ఎల్.బి.శ్రీరామ్‌తో ఆయన భార్య ‘పోతే పోయింది లేండి. డబ్బది. ఎన్ని చేతుల్లోంచి పోవాలో... ఎన్ని చేతుల్లోకి పోవాలో’ అంటుంది. ఇలాంటివి చాలా చమక్కులే ఉన్నాయి. విద్యార్థులకు చూపదగ్గ ఫిల్మ్ కూడా ఇది. ఎల్.బి.శ్రీరామ్లాగే మరికొంతమంది సీనియర్ నటులు, దర్శకులు పూనుకుని తెలుగులోని మంచి కథలను షార్ట్ఫిల్మ్స్గా తీస్తే బాగుండు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
శైలజా రెడ్డి అల్లుడు – ట్రైలర్ నిడివి 1 ని. 48 సె. ,హిట్స్ 45,51,713 మనం ప్రతిరోజూ చూసే సాధారణ సమస్యలే దర్శకుడు మారుతికి కథా వస్తువులుగా కనిపిస్తున్నాయి ఈ మధ్య. భలే భలే మగాడివోయిలో ‘మతి మరపు’ను, మహానుభావుడులో ‘ఓసీడీ’ను పాయింట్‌గా చేసుకొని సక్సెస్ సాధించారు. అయితే ఈసారి అక్కినేని హీరో నాగ చైతన్యతో కలసి ‘శైలజా రెడ్డి అల్లుడు’గా రాబోతున్నాడు. ఈ సినిమా కోసం ‘ఈగో’ అనే పాయింట్‌ను టచ్ చేసినట్టున్నారు మారుతి. తను ప్రేమించే అనూ ఇమ్మాన్యుయేల్, అత్తగారు రమ్యకృష్ణగార్ల ఈగోకు బలైపోయే అల్లరి పిల్లాడిగా చైతన్య కనిపించేట్లుగా ట్రైలర్లో చూపించారు. అలాగే మారుతి మార్క్ కామెడీతో ట్రైలర్ ఎంటర్టైనింగ్గా సాగిపోయింది. ట్రైలర్‌ను బట్టి అంచనా వేస్తే 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ హైలైట్‌గా ఉండబోతోందని ఊహించవచ్చు. నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘అల్లరి అల్లుడు’ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. వినాయక చవితి స్పెషల్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. భైరవ గీత – ట్రైలర్ నిడివి 1 ని. 59 సె. ,హిట్స్ 5, 82, 062 రామ్‌గోపాల్ వర్మ తీసే సినిమాల్లాగే ఆయన ప్రెజెంట్ చేసే సినిమాలు కూడా చాలా బోల్డ్‌గా, మరీ ముఖ్యంగా రియలిస్టిక్‌గా ఉంటాయి. కన్నడ దర్శకుడు సిద్ధార్థ్ తెర కెక్కించిన హైవోల్టేజ్ రూరల్ లవ్‌స్టోరీ ‘భైరవ గీత’. ఈ కన్నడ సినిమాను తెలుగు ఆడియన్స్‌కు ఆర్జీవీ సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మధ్య ఆడియన్స్ టేస్ట్ కూడా కొంచెం హానెస్ట్, రియలిస్టిక్ కథలు ఉంటేనే థియేటర్స్ వైపు అడుగులేస్తున్నారు. ఆల్రెడీ అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్100 సినిమా ప్రూవ్ చేశాయి. అన్నీ అలా ఉంటాయి అనుకోవడం కూడా పొరపాటే. విలేజ్ రివెంజ్ డ్రామాను చూపించింది ట్రైలర్. పేద, ధనిక, కుల మత వ్యత్యాసాలన్నింటిని కనబరిచే కమర్షియల్ ఎంటర్టైనర్లా ఉండబోతోందనే అవగాహన మాత్రం కలిగించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న సమస్యలు, దానికోసం పెద్ద వాళ్లపై చేసే తిరుగుబాటు చుట్టూ కథను అల్లుకున్నట్టున్నాడు దర్శకుడు. అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. సీమరాజా – ట్రైలర్ నిడివి 1 ని. 56 సె. ,హిట్స్ 20,24,249 అన్ని సమయాల్లో అన్ని రకాల కథలను ఎంజాయ్ చేసినా పండక్కి మాత్రం కచ్చితంగా ఓ పక్కా ఫార్ములా మాస్ సినిమా కోరుకుంటాడు ప్రేక్షకుడు. అదో మజా. తమిళ చిత్రం ‘సీమరాజా’ కూడా పండగకి వచ్చే మాస్ సినిమా ఫీలింగ్‌ని కలిగిస్తోంది. పక్కా విందు భోజనంలా తయారు చేసినట్టున్నాడు దర్శకుడు పోన్రమ్. అంచెలంచెలుగా స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి మాస్ హీరో ఇమేజ్ను సంపాదించుకున్న శివకార్తికేయన్ ఇందులో కథానాయకుడు. సమంత హీరోయిన్. ఊర్లో జరిగే హీరో విలన్ సవాల్‌గా ఈ సినిమా ఉండబోతోంది అని ట్రైలర్ చెవులు పగిలిపోయేలా చెబుతోంది. హీరోయిన్గా ఇంతకాలం ఆకట్టుకున్న సిమ్రాన్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. సిమ్రాన్ మాస్ డైలాగ్స్ పలకడం కొంచెం కొత్తగానే ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో ఈ సినిమా పండక్కి నడుస్తోంది అనే ఫీలింగ్‌ని కలగజేస్తుంది. వినాయక చవితికి రిలీజ్ కానుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ది ప్రిన్సిపాల్ – కామెడీ షార్ట్ ఫిల్మ్ నిడివి 10 ని. 09 సె. , హిట్స్ 23,41,270 డైలీ టెస్టుల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని ప్రిన్సిపాల్‌కి స్టూడెంట్ల మీద చిరాకు వస్తుంది. ఒక్కొక్కళ్లని ప్రవేశపెట్టమని ప్యూన్‌తో అంటాడు. ఆ తర్వాత ఏమైందనేది ఈ షార్ట్‌ఫిల్మ్. వైవా హర్ష ప్రిన్సిపాల్‌గా చేశాడు. ఎంసెట్, జెఇఇ, బిబిఎస్ఎఫ్, ఏబిసిడి... ఇలా రకరకాల ఎంట్రన్స్ టెస్టుల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని ప్రయివేట్ కాలేజీల్లో వాటికి అనుబంధంగా ఉన్న హాస్టల్స్ పడేసి పిల్లల్ని హింసిస్తే ఆ పిల్లలు ఎందుకూ పనికి రాకుండా పోయి ప్రిన్సిపాల్‌కే జెల్ల కొట్టే పరిస్థితి ఈ షార్ట్‌ఫిల్మ్‌లో కనిపిస్తుంది. ‘పిల్లలు ఔటింగ్ అడుగుతున్నారు సార్’ అని ప్రిన్సిపాల్‌తో అసిస్టెంట్ అంటే ‘అయితే ఒకసారి తలుపులు తెరిచి వెంటనే మూసెయ్’ అని జవాబు చెప్తాడు ప్రిన్సిపాల్. ఇవాళ్టి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. అన్నట్టు ఈ కాలేజ్‌లో టాయిలెట్లు సరిగా ఉండవు. అందుకని అందరూ ప్రిన్సిపాల్ రూమ్‌లోని టాయిలెట్‌ని వాడుతుంటారు. టాయిలెట్లు సరిగా లేని కాలేజీ అయితే మనకేమిటి? మనకు కావాల్సింది ర్యాంకులు. ‘ఒకటీ ఒకటీ ఒకటీ రెండూ రెండూ రెండూ’.. అని ఈ కాలేజీ ర్యాంకుల గురించి డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టుకు అరిచి చెప్పడం వల్ల స్వర పేటిక దెబ్బ తిని వైద్యం కోసం రెండు గాజులూ అమ్ముకోవాల్సి రావడం నవ్వు తెప్పిస్తుంది. మునపటి పంచ్‌లు తగ్గినా సరదా చూసే స్థాయిలో ఉంది. నవాబ్ – ట్రైలర్ నిడివి 2 ని. 46 సె. ,హిట్స్ 12,48,199 మణిరత్నం గతంలో మల్టిసార్టర్స్ చాలానే తీశాడు. ఇప్పుడు మరొకటి. ఈసారి ఇందులో అరవింద్ గోస్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రధారులు. మరో ముఖ్యపాత్ర ప్రకాష్ రాజ్. కథలు దొరకనప్పుడల్లా మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకులకు ‘గాడ్‌ఫాదర్’ అన్నం పెడుతూనే ఉంటుంది. ఈ కథ కూడా మరో గాడ్‌ఫాదర్ తరహాగా కనిపిస్తూ ఉంది. గాడ్‌ఫాదర్ అయిన ప్రకాష్‌రాజ్‌కు ముగ్గురు కొడుకులైన అరవింద్, శింబు, అరుణ విజయ్‌లకు మధ్య నడిచే కథ ఇది. ఇందులో ఒక పాత్రకు మన నానిని అనుకున్నారట గాని కుదరలేదు. దాంతో మొత్తంగా తమిళ ముఖాలు నిండిన సినిమా అయ్యింది. అయినప్పటికీ మణిరత్నం మీద అభిమానంతో దీని పట్ల కుతూహలం ప్రదర్శించే అభిమానులు ఉండకుండా ఉంటారా? రెహమాన్ సంగీతం. లవ్ సోనియా – ట్రైలర్ నిడివి 2 ని. 42 సె.,హిట్స్ 1,19,67,892 భారత దేశంలో రోజుకు 270 మంది ఆడవాళ్లు/బాలికలు/ఆడ శిశువులు మిస్సవుతున్నారట. వాళ్లంతా ఏమవుతున్నారు? దారుణమైన వ్యభిచార కూపంలో దింపబడుతున్నారు. సామాన్య మానవుల ఊహకు కూడా అందనంత కర్కశమైన చీకటి వ్యాపారాలు ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతా ఉన్నాయి. వ్యభిచారం వంటి వ్యాపారాలకు అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ మాయమైన యువతి ఏ దేశంలో తేలుతుందో చెప్పలేము. ఇంత ‘నాగరీకమైన’ సమాజంలో, పోలీసు – నేరపరిశోధక వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా ఈ స్థాయి మానవ వ్యాపారం జరుగుతుంటే మనం ఎక్కడ ఉన్నట్టు. హిందీలో ఇప్పుడు రాబోతున్న ‘లవ్ సోనియా’ వ్యభిచారంపై ఫోకస్ పెట్టింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో దేశీయ హాలీవుడ్ నటీనటులు నటించారు. హాలీవుడ్ టెక్నిషియన్లు పని చేశారు. వ్యభిచార గృహానికి అమ్మివేయబడ్డ తన సోదరి కోసం మరో సోదరి చేసే వెతుకులాట ఈ కథ. బహుశా తప్పక చూసి తెలుసుకోవాల్సిన సినిమా. రాజ్‌కుమార్ రావ్, అనుపమ్ ఖేర్, రిచా చద్దా, మనోజ్ బాజ్‌పేయి తదితరులు నటించారు. ‘లైఫ్ ఆఫ్ పై’ తీసిన డేవిడ్ ఓమర్క్ నిర్మాత. తబ్రేజ్ నూరాని దర్శకుడు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
మహర్షి – టీజర్ నిడివి 0.42 సె. ,హిట్స్ 55,00,827 ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత మహేశ్‌బాబు చుట్టూ ఉన్న ‘ఆరా’ ఇంకా పెరిగింది. ఆయన స్టార్డమ్ మరో మెట్టు పైకి ఎదిగింది. ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం ఎదురు చూడటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం పేరు ‘మహర్షి’ అని అనౌన్స్ చేసి విడుదల చేసిన టీజర్లో కాలేజ్ స్టూడెండ్ మహేశ్ ప్రదర్శించిన స్టయిల్, లుక్ అభిమానులను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. కాలేజ్ కారిడార్‌లో గళ్ల చొక్కా జీన్స్ ప్యాంట్ వేసుకొని చేతిలో ల్యాప్ టాప్‌తో నడుస్తూ పక్కన వెళుతున్న ఆడపిల్లల వైపు ఒక లుక్కు వేస్తున్న సన్నివేశం సినిమా మీద కుతూహలాన్ని ఆసక్తిని పెంచేలా ఉంది. నాగార్జున, కార్తిలతో ‘ఊపిరి’ వంటి హిట్ తీసిన వంశీ పైడిపల్లి మరెంతో శ్రద్ధతో ఈ సినిమా కథను తయారు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సంస్థ, వైజయంతి మూవీస్, పీవీపీ... ఈ మూడు దిగ్గజాలు సినిమాను నిర్మిస్తున్నందు వల్ల మేకింగ్ టాప్ క్లాస్ ఉండే అవకాశం ఉంది. గతంలోని వంశీ దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా వచ్చింది. ఇన్నేళ్లకు మళ్లీ అదే టైటిల్‌తో సినిమా రావడం గమనించదగ్గ అంశం. హెలికాప్టర్ ఈలా – ఆఫీషియల్ ట్రైలర్ నిడివి 2 ని. 46 సె. ,హిట్స్ 1,02,73,021 పిల్లలు కాలేజ్ వయసుకు చేరుకున్నాక, వయసు 40 దాటాక, భర్త తన ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో తీవ్రంగా బిజీ అయిపోయాక స్త్రీలకు సడన్ తమ గుర్తింపు సమస్య ఏర్పడుతుంది. తానేమిటో నిరూపించుకోవాలనిపిస్తుంది. లేదా జీవితం వృధా అయిపోయిందని ఇప్పటికైనా సద్వినియోగం చేసుకోవాలని సడన్‌గా అనిపిస్తుంది. నిజానికి పిల్లలతో, భర్తతో మానసికంగా వచ్చిన దూరాన్ని మరి దేనితోనైనా భర్తీ చేయాలనిపిస్తుంది. అప్పుడు అలాంటి స్త్రీ ఏం చేస్తుందనేది వ్యక్తిని, పరిసరాలని బట్టి మారుతూ ఉంటుంది. ఈ సినిమాలో కాలేజీ వయసుకొచ్చిన కొడుకుకు తల్లైన కాజోల్ తాను కూడా చదువుకోవాలని, మ్యూజిక్ నేర్చుకోవాలని భావించి కొడుకు చదువుతున్న కాలేజీలోనే చేరాలనుకోవడంతో సమస్య మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైందనేది కథ. ‘పరిణీత’ వంటి మంచి సినిమా తీసిన దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఈ సినిమాకు దర్శకుడు. అజయ్ దేవగన్ నిర్మాత. భిన్న భావోద్వేగాలు ఉంటాయని ఈ ట్రైలర్ హింట్ చేస్తోంది. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఆరామ్ సే సోవూంగా – కామెడీ షార్ట్‌ఫిల్మ్ నిడివి 7 ని. 44 సె. , హిట్స్ 18,27,583 ‘ఆరామ్ సే సోవూంగా’ అంటే హాయిగా నిద్ర పోతాను అని అర్థం. ఇంజనీరింగ్ చదువుతున్న ఒక స్టూడెంట్ హాస్టల్లో ఉంటూ మరుసటిరోజు ఉదయం క్లాసుకు అటెండ్ అవ్వాలని చెప్పి ఆ రాత్రి తొందరగా నిద్రపోవాలని అనుకుంటాడు. కాని అతడు హాయిగా నిద్ర పోవడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ఈ షార్ట్‌ఫిల్మ్ వినోదాత్మకంగా చూపిస్తుంది. ఫేస్బుక్, వాట్సప్, యూ ట్యూబ్ ఇవన్నీ అతడి టైమ్‌ను నిముషాల లెక్కన తినేస్తూ ఉంటాయి. రాత్రి పది గంటలకు నిద్ర పోవాలనుకున్నవాడు యూ ట్యూబ్‌లో వీడియో చూసి కింద కామెంట్స్‌లో ఎవరితోనో వాదనకు దిగి నానా బూతులు తిట్టి టైమ్‌ను చుట్టబెట్టేస్తాడు. రాత్రి ఒంటి గంటకు ఆకలైతే క్యాంటిన్‌కి వెళ్లి ఏదో తెచ్చుకుని ఆ తినేది ఏదైనా చూస్తూ తినొచ్చు కదా అని తిరిగి యూ ట్యూబ్ చూస్తూ తెల్లారి ఏడుకు నిద్ర పోతాడు. ఇవాళ రేపు స్టూడెంట్స్ ఇన్ని డైవర్షన్స్ మధ్య కొద్దో గొప్పో చదవగలగడం గొప్పే అనిపిస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్ చూస్తే. ఇలాంటి షార్ట్‌ఫిల్మ్స్ తీయడంలో అందెవేసిన ‘ది వైరల్ ఫీవర్’ (టి.వి.ఎఫ్) యూ ట్యూబ్ చానల్ సమర్పణ ఇది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఆక్వామ్యాన్ – ట్రైలర్ నిడివి 2 ని. 26 సె., హిట్స్ 100,39,812 కామిక్స్ నుంచి సూపర్ హీరో సినిమాలు రూపొందిస్తూనే వస్తున్నాయి మార్వెల్, డీసీ. తాజాగా తమ ఫ్రాంచైజ్‌లో మరో కొత్త సూపర్ హీరో ఆక్వామ్యాన్ను పరిచయం చేసింది. ఆక్వామ్యాన్ క్యారెక్టర్ మీద వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో డీసీ కామిక్స్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మార్వెల్‌తో పోలిస్తే డీసీ కామిక్స్ ఈ మధ్య కొంచెం వెనకబడటమే అందుకు కారణం. ఆ లోటుని కచ్చితంగా తీర్చేలా దర్శకుడు జేమ్స్ వాన్ రూపొందించారని ట్రైలర్‌ను చూస్తేనే అనిపిస్తోంది. అటు సముద్ర గర్భానికి, ఇటు భూమికి చెందిన వాడిగా కనిపిస్తాడు హీరో. అట్లాంటిస్ (సముద్ర గర్భం)కి భూమికీ మధ్య జరిగే పోరులో హీరో ఎవరి వైపు నిలబడతాడన్నది తెలియాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ ట్రైలర్‌ని అత్యద్భుతంగా మార్చాయి. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యుట్యూబ్లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుందీ ట్రైలర్. ప్యార్ ప్రేమా కాదల్ – ట్రైలర్ నిడివి 1. 49 సె. ,హిట్స్ 17,52,809 ప్యార్.. ప్రేమ.. కాదల్. హిందీలో అన్నా, తెలుగులో పలికినా, తమిళంలో చెప్పినా ఒకటే మాట, ప్రేమ. అలాగే ప్రేమకథలకు ఏ భాషైనా ఒకటే. కానీ ఎలా చెబుతారన్నది అందులోని విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఓ మోడ్రన్ అమ్మాయి. ముద్దపప్పు లాంటి అబ్బాయి మధ్యలో ఏర్పడ్డ తమిళ ప్రేమ కథ చిత్రమే ‘ప్యార్ ప్రేమ కాదల్’. ‘మా ఇంట్లో ఎవరూ లేరు ఆలస్యంగా వెళ్లినా ఏం ప్రాబ్లమ్ లేదు’ అని హీరోయిన్ ఎంత హింట్ ఇచ్చినా అర్థం చేసుకోలేనంత తింగరబుచ్చి మన హీరోగారు. లాస్ ఏంజెల్స్‌లో రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటుంది హీరోయిన్ అసలు లాస్ ఏంజెల్స్ అంటే ఎక్కడో సరిగ్గా తెలియదు హీరోకు. ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్ కచ్చితంగా నవ్వులు పూయిస్తూంది. ఈ సినిమాను సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తూ నిర్మించారు. హరీష్ కల్యాణ్, రైజా పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉండటం, ఆహ్లాదకరమైన సంగీతం, విజువల్స్ ట్రైలర్‌కు పెద్ద ప్లస్. బోనం పాట – ఫెస్టివల్ సాంగ్ నిడివి 4 ని. 20 సె. ,హిట్స్ 31,43,936 తెలంగాణలో బోనాల పండుగ హడావిడి స్టార్ట్ అయిపోయింది. అన్ని చోట్లా పండగ వాతావరణమే కనిపిస్తోంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు సిద్ధవుతున్నారు. తమవంతుగా యూట్యూబ్‌లో బోనాలు పండగ విశేషాలను వివరిస్తున్న ‘బోనాలు సాంగ్’ ట్రెండింగ్‌లో నిలిచింది. హైదరాబాద్ ట్విన్ సిటీలలో ఈ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారో చూపించే ప్రయత్నం చే సింది ఈ యుట్యూబ్ చానల్. నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పండగ విశేషాలను తిరుపతి మట్ల రచించి మంగళితో కలసి పాడారు. ఈ పాట వింటుంటే ఆటోమేటిక్‌గా పండుగ మూడ్‌లోకి వెళ్లిపోక మానలేం. ఈ పండుగ రోజుల్లో దేవతలకు భక్తులు ఎలాంటి సమర్పణలు అందిస్తుంటారంటూ చూపించారు దాము రెడ్డి. ఈ పాటకు యుట్యూబ్లో విశేష స్పందన లభిస్తోంది. ఆల్రెడీ మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ముల్క్ – ట్రైలర్ నిడివి 2ని. 40సె ,హిట్స్ 1,15,86,943 పరువు, మర్యాదలే ఆస్తిగా ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబం జీవనం సాగిస్తోంది. హఠాత్తుగా దేశ ద్రోహులు అనే ఆరోపణలు వారిని వెంబడించాయి. ఇరుగుపొరుగు వారు మాటలతోనే హింసిస్తున్నారు. దీనికి తోడు మీడియా వారిని హైలైట్ చేస్తోంది. ఆ కుటుంబానికి ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఓ హిందూ లాయర్ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఆల్మోస్ట్ ఇటువంటి అంశాలతోనే హిందీలో రూపొందిన చిత్రం ‘ముల్క్’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణా, రాజత్ కపూర్ నటించారు. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. సినిమాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్లిం కుటుంబం పెద్దగా రిషీ కపూర్ నటించారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ముస్లిం ఉగ్రవాది కాదు అంటూ ట్రైలర్లో వినిపించే సంభాషణలు ఉద్వేగభరితంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో అశుతోష్ రాణా, డిఫెన్స్ లాయర్ పాత్రలో తాప్సీ నటించారు. ఓ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను డెవలప్ చేశారట దర్శకుడు అనుభవ్ సింగ్. ‘ముల్క్’ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకేం ఇంకేం కావాలే – లిరికల్ వీడియో నిడివి 4ని. 29సె. ,హిట్స్ 70,08,912 ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ‘యువత, సోలో’ వంటి చిత్రాలను రూపొందించిన పరుశురామ్‌తో విజయ్ ఓ ప్రేమకథా చిత్రంతో వస్తుండటంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం కావాలే’ లిరికల్ వీడియోను రీసెంట్గా రిలీజ్ చేశారు. చిన్న మనస్పర్థ వల్ల విడిపోయిన హీరో హీరోయిన్ మళ్లీ కలుసుకున్న సందర్భంలో వచ్చే పాట ఇది. గోపీ సుందర్ అందించిన క్యాచీ ట్యూన్‌కు అనంత్ శ్రీరామ్ అందించిన అద్భుతమైన లిరిక్స్, సిడ్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ తోడు అవ్వడం ఈ పాటకు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించిందంటే ఈ పాట యూత్‌లోకి ఎంత బాగా వెళ్లిందో చెప్పొచ్చు. 96 – టీజర్ నిడివి 1 ని. 21 సె. ,హిట్స్ 30,28,130 మన లైఫ్‌లో పెద్ద పెద్ద మార్పులు జరగడానికి చిన్న ప్రయాణాలు కూడా చాలు అంటారు. తమిళ చిత్రం ‘96’ టీజర్ చూస్తే అదే అనిపిస్తోంది. విజయ్ సేతుపతి, త్రిష కలసి నటిస్తోన్న చిత్రం ‘96’. అస్తవ్యస్తంగా ఉన్న విజయ్ సేతుపతి జీవితంలోకి త్రిష ప్రవేశించి ఎలాంటి మార్పులు తీసుకొచ్చారని టీజర్ చెబుతోంది. కథంతా 96 గంటల్లో జరుగుతుందనే అనుమానం కూడా రాక మానదు, టైటిల్, టీజర్‌ను గమనిస్తే. సుమారు 80 సెకన్ల టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం ,చాలా గ్యాప్ తర్వాత కనిపిస్తున్న త్రిష పదేళ్లు వెనక్కి వెళ్లినంత అందంగా కనిపించడం టీజర్లో విశేషాలు. వైవిధ్యం చూపించడంలో విజయ్ సేతుపతి నిరాశపరచలేదు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన దర్శకుడు ప్రేమ్ సి. కుమార్ స్క్రీన్ అంతా కలర్ఫుల్గా ఉండేట్టుగా చూసుకున్నారు. కథేంటి అనేది చెప్పకపోయిన ఓ అందమైన జర్నీని ఈ సినిమాలో మీరు చూడొచ్చు అనేలా ఉందీ టీజర్. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
కరన్‌జిత్ కౌర్ – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ – ట్రైలర్ నిడివి 2 ని. 2 సె., హిట్స్ 92,01,505 బయోపిక్‌లు వెండితెర మీదికి వస్తున్నాయి. ఇప్పుడు వెబ్ చానల్స్‌లో కూడా వస్తున్నాయి. ‘జీ5’ వెబ్‌చానల్ జీ5 ఒరిజినల్స్ పేరుతో కొన్ని నిర్మాణాలు చేసి ప్రసారం చేస్తోంది. తాజాగా సన్నీలియోన్ బయోగ్రఫీని చిత్రీకరించింది. 16 జూలై నుంచి వీటిని జీ5 వెబ్ చానల్లో చూడవచ్చు. సన్నీలియోన్ అసలు పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె పేరు ‘కరన్‌జిత్ కౌర్’. కెనడాలో స్థిరపడ్డ పంజాబీ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె బాల్యం, కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు ఏ విధంగా ఆమెను పార్న్ స్టార్‌ను చేశాయో ఈ సిరీస్‌లో చూపించనున్నారు. సన్నీలియోనే తన పాత్రను తాను ధరించింది. ఇంగ్లిష్, హిందీ రెండు అర్థమైతే తప్ప ఈ సిరీస్‌ను అర్థం చేసుకోలేకపోవచ్చు. పార్న్ స్టార్‌గా ఉండి కూడా భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఆత్మగౌరవంతో కెరీర్‌ను స్థిరపరుచుకున్న సన్నీలియోన్ కచ్చితంగా మూసను భగ్నం చేసిన మహిళే. ఆమె జీవితం పట్ల కుతూహలం ఉన్నవాళ్లు ఈ సిరీస్ చూడవచ్చు. కార్వాన్ –ట్రైలర్ నిడివి 2 ని. 37 సె. , హిట్స్ 61,26,951 ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో ఉన్నాడు. కాని అనారోగ్యానికి ముందు నటించిన సినిమాలలో ‘కార్వాన్’ ఆఖరుది. దీని తర్వాతి సినిమా అంటే అతడు కోలుకుని ఒప్పుకుని నటించబోయేదే. ఇంతకు ముందు విడుదలైన ఇర్ఫాన్ సినిమాలు ‘కరీబ్ కరీబ్ సింగిల్’, ‘బ్లాక్మెయిల్’ మంచి టాక్‌ను సంపాదించి విజయం సాధించాయి. ఆ వరుసలోనే ‘కార్వాన్’ కూడా ఉండొచ్చు. ఇది కూడా రోడ్ ఫిల్మ్. ఇందులో మరో ముఖ్యపాత్ర కూడా ఉంది. దీనిని అభిషేక్ బచ్చన్ నటించాల్సిందిగానీ అతడు చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ గారెల బుట్టలో దుల్కర్ సల్మాన్ పడ్డాడు. ఇది దుల్కర్ తొలి హిందీ సినిమా. ఇర్ఫాన్‌తో పోటీ పడి నటించే అవకాశం వచ్చిందనే చెప్పాలి. తీర్థయాత్రలకు వెళ్లిన తండ్రి హటాత్తుగా చనిపోతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు బాడీని కార్గో చేస్తారు. అయితే ఒక శవం రావడానికి బదులు ఇంకో శవం వస్తుంది. దాని కోసం వ్యాన్ డ్రైవర్ అయిన ఇర్ఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాడు దుల్కర్. ఈ మధ్యలో ఏం జరిగిందనేది కథ. ఒక దర్శకుడు బిజయ్ నంబియార్ ఈ సినిమాకు రచన చేస్తే మరో దర్శకుడు ఆకర్ష్ ఖురానా తెర రూపం ఇచ్చాడు. ఇర్ఫాన్ అభిమానులు, దుల్కర్ అభిమానులు కూడా దీని కోసం ఎదురుచూడవచ్చు. గూఢచారి – టీజర్ నిడివి 42 సె. ,హిట్స్ 16,33,637 అడవి శేష్ గత సినిమా ‘క్షణం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో థ్రిల్లర్‌తో అతడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఈ టీజర్ చెబుతోంది. నటించడంతో పాటు తన సినిమాలకు కథలు కూడా రాసుకుంటున్న అడవి శేష్ ఈ ‘రా’ వంటి ఇంటెలిజెన్స్ వర్గాల నేప«థ్యంలో కథను అల్లుకున్నాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. శోభిత ధూళిపాళ దీని కథానాయిక. వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా రానుంది. సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3 – ట్రైలర్ నిడివి 2 ని. 46 సె. , హిట్స్ 101,99,227 ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ సిరీస్‌లో ఇది మూడవభాగం. మొదటి భాగం ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’, రెండవభాగం ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’ దాని తర్వాత ఇది మూడవ భాగం. ఒక సంపన్నమైన భర్త, అతడి చంచలమైన భార్య, వారి నడుమ వచ్చి ఆమెను ఆకర్షించిన గ్యాంగ్‌స్టర్... ఇదీ ఈ కథల వరుస ఇతివృత్తం. ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయి. భార్యాభర్తల పాత్రలు వేసిన జిమ్మి షేర్గిల్, మహి గిల్ ప్రతి భాగంలో కొనసాగుతూ ఉండగా గ్యాంగ్‌స్టర్ పాత్రను వేసిన నటులు మారుతూ వస్తున్నారు. మొదటి భాగంలో రణదీప్ హూడా, రెండో భాగంలో ఇర్ఫాన్ ఖాన్ ఈ పాత్ర చేయగా రాబోయే మూడో భాగంలో సంజయ్ దత్ నటించాడు. సంజయ్ దత్ మీద వచ్చిన ఆటో బయోగ్రఫీ ‘సంజు’ భారీ హిట్ కావడంతో జైలుకు వెళ్లగా అతడి ఆబ్సెన్స్ వల్ల ఏర్పడిన ఖాళీని ‘సంజు’ భర్తీ చేసింది. ఇక సంజయ్ దత్తే రంగంలో దిగి తన సినిమాలతో మళ్లీ పాత ప్రభావాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ‘పాన్‌సింగ్ తోమార్’ వంటి హిట్ ఇచ్చిన తిగ్మన్షు ధులియా దీనికి దర్శకుడు. ఈ నెల 27న విడుదల. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జీరో– ఈద్ టీజర్ నిడివి 1 ని. 21 సె. ,హిట్స్ 2,28,63,542 ఏమైనా మనోళ్లు చాలా గొప్పోళ్లోయి అన బుద్ధేస్తోంది ఈ టీజర్ చూస్తే. దాదాపు 30 ఏళ్ల క్రితమే మరుగుజ్జుగా కమలహాసన్ నటించాడు– ‘విచిత్ర సహోదరులు’లో. అప్పట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. గ్రాఫిక్స్ లేవు. క్రియేటివ్ సుప్రమసీతో కమలహాసన్, దర్శకుడు సింగీతం సాధించిన ఫీట్ అది. ఇన్నాళ్ల తర్వాత షారుక్ అలాంటి ప్రయత్నమే చేశాడు. కాని నిరాశ కలిగించే స్థాయిలో. మరుగుజ్జు కాకుండా పొట్టివాడిగా ఈ సినిమాలో షారూక్ నటించినట్టుగా అనిపిస్తోంది. అయితే పొట్టివాడికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అది టీజర్లో కనిపించలేదు. పైగా స్వాభావికంగా కాకుండా గ్రాఫిక్స్ ద్వారా ఇతన్ని పొట్టివాడిగా చూపించారని అర్థమైపోతోంది. షారుక్ ఏకంగా సల్మాన్ ఖాన్నే రంగంలో దింపి టీజర్ విడుదల చేశాడు. సహజంగానే ఈ టీజర్ విపరీతమైన రెస్పాన్స్ పొందుతోంది. కాని సీరియస్ సినీ ప్రేక్షకులు మాత్రం సినిమా విడుదలయ్యేకే షారుక్‌కు మార్కులు వేయాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారన్నది మాత్రం ఈ టీజర్ చూస్తే ఖాయంగా అనిపిస్తున్నది. దర్శకుడు ఆనంద్ ఎల్ పాయ్ ‘తను వెడ్స్ మను’ వంటి హిట్స్ ఇచ్చాడు కనుక అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ధడక్ – ట్రైలర్ నిడివి 3 ని. 3 సె. ,హిట్స్ 3,34,21,021 అతి తక్కువ బడ్జెట్‌తో మరాఠీలో సంచలనం సృష్టించిన ప్రేమకథ– ‘సైరట్’ (గట్టిగా చెప్పు)కు రీమేక్ ఇది. ‘సైరట్’ పరువు హత్యల ఆధారంగా తీసిన సినిమా. డబ్బు, కులం ఉన్న అమ్మాయి పేదరికం, ‘తక్కువ కులం’ ఉన్న అబ్బాయిని ప్రేమిస్తే ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి, చివరకు ఆ ప్రేమ ఏమైందనేది సహజమైన ప్రవర్తనల ద్వారా గుర్తుపట్టే సమాజ పోకడల ద్వారా దర్శకుడు కథను అల్లి విజయం సాధించాడు. రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె జాహ్నవి నటించింది. శ్రీదేవి తన కుమార్తెను లాంచ్ చేయడానికి చాలా కాలం ఆలోచించి ఎంచుకున్న సినిమా ఇది. ట్రైలర్లో శ్రీదేవి నిర్ణయం సరైందిగా అనిపించే సంకేతాలు ఉన్నాయి. కళ్లతో నటిస్తూ తల్లిని గుర్తు చేసే ప్రయత్నం చేసింది జాహ్నవి. ఇక హీరోగా చేసిన కుర్రాడు ఇషాన్ కూడా ఆకట్టుకున్నాడు. ఇతను హీరో షాహిద్ కపూర్ సవతి సోదరుడు. ధర్మ ప్రొడక్షన్స్ కింద కరణ్‌జొహర్ ఈ సినిమాను నిర్మించాడు. ‘బదరీనాథ్ కీ దుల్హనియా’ వంటి హిట్ ఇచ్చిన యువ దర్శకుడు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే శ్రీదేవి కోసం సంతోషము.. ఇంత ఘన విజయం సాధిస్తే చూడటానికి శ్రీదేవి లేదన్న బాధ ఆమె అభిమానులకు తప్పదు. ఈ నగరానికి ఏమైంది – ట్రైలర్ నిడివి 1 ని. 56 సె.,హిట్స్ 13,61,067 వెబ్ సిరీస్‌లో ‘టీవీఎఫ్’ (ది వైరల్ ఫీవర్) చానల్ హిందీలో ఫన్ సిరీస్ చేసింది. నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఒక ప్రహసనాన్ని చాలా సహజమైన స్వభావాలతో డ్రామా లేకుండా ఈ కాలపు వ్యవహారికాలతో ఆకట్టుకోవడం ఈ సిరీస్ లక్ష్యం. వీటికి భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ‘పెళ్లిచూపులు’తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ ప్రభావంలో ఉన్నాడా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే. నలుగురు స్నేహితుల జీవితాలలో అతలాకుతలమూ లేదా గందరగోళమూ లేదా కలగాపులగమూ జరిగిన కొన్ని ఘటనల సమాహారమే ‘ఈ నగరానికి ఏమైంది’ కథ కావచ్చు. తమిళంలో ‘వా క్వార్టర్ కటింగ్’ అనే సినిమా ఉంది. ఆ తెల్లవారి గల్ఫ్ వెళ్లాలనుకున్న స్నేహితుడు ఆ రాత్రి నలుగురు మిత్రులతో మందు కొట్టాలనుకుంటాడు. కాని ఆ రాత్రి మందు దొరకదు. మందు కోసం ఆ నలుగురు ఎటువంటి ఘనకార్యాలకు పాల్పడ్డారనేది కథ. దాని ప్రభావం దీని మీద ఉన్నట్టుంది. ఏమైనా కుతూహలం రేపుతున్న ట్రైలర్. నటీనటులంతా కొత్తవాళ్లే. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సంజు ట్రైలర్ నిడివి 3 ని. 04 సె. ,హిట్స్ 3,02,86,580 వెండి తెర మీద కనిపించే సంజయ్ దత్ వల్ల సంజయ్ దత్ మనకు కొంచెమే తెలుసు. మీడియా ద్వారా తెలిసే సంజయ్ దత్ వల్ల మనకు సంజయ్ దత్ కొంచెమే తెలుసు. సంజయ్ దత్ తండ్రికే సంజయ్ దత్ పూర్తిగా తెలియ లేదు. అతని తోబుట్టువులకు కూడా అతను పూర్తిగా తెలియదు. స్నేహితులు అతడికి ఎరిగినది కొంతే. ఒక మనిషి సంపూర్ణత్వం ఆ మనిషికే తెలుస్తుంది. ఎదుటివారికి ఎంతమాత్రమూ కాదు. అయినప్పటికీ వారిని పూర్తిగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సంజయ్ దత్ ఆత్మకథ ఆధారంగా ఇప్పుడు రాబోతున్న ‘సంజు’ కూడా అలాంటి ప్రయత్నమే. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్ర పోషించగా రాజ్‌కుమార్ హిరాణి దర్వకత్వంలో తయారైన ఈ సినిమా– ట్రైలర్లో కనిపిస్తున్న మేరకు సంజయ్ దత్ రహస్యాలను చాలానే చెప్పేలా ఉంది. అన్ని దశల్లో అతడు ఎదుర్కొన్న సన్మానాన్ని అవమానాన్ని చూపేలా ఉంది. ఉదాహరణకు జైలు గదిలో అతడి లావెటరీ లీకై గదంతా బీభత్సంగా మారితే భయంతో వికారంతో పెనుకేకలు పెడుతున్న సంజయ్ దత్ ఈ ట్రైలర్లో ఉన్నాడు. అలాంటి మరెన్ని ఘట్టాలు ఉన్నాయో. సంజయ్ దత్ ఈ దర్శకుడికి అన్ని కోణాలు విపులంగా చెప్పి ఉండాలి. అయితే వాటి సారం ఒకటే– తాను టెర్రరిస్టు కానని తన దగ్గర ఏకే 56 రైఫిల్ దొరకడం వెనుక కారణాలు వేరని. మనిషి తప్పులు ఎక్కువ చేస్తే సమాజం అతణ్ణి దూరంగా పెడుతుంది. సంజయ్ అదృష్టం ఏమిరా అంటే అతణ్ణి అతడి తప్పొప్పులతో పాటు ప్రేమించే అభిమాన గణం ప్రేక్షకులు ఉన్నారు. అతడిలో కనిపించే హానెస్టీ ఇన్నోసెన్స్ ఇందుకు కారణం కావచ్చు. ఏమైనా సంజయ్ దత్ మీద తీసిన సినిమా సంచలనం సృష్టించక మానదు. దీనివల్ల సంజయ్ దత్‌కు వచ్చే పేరు కంటే రణబీర్‌కు వచ్చే పేరే ఎక్కువగా ఉండబోతోందని ట్రైలర్ రూఢీ పరుస్తోంది. ఓరుగల్లు కోటనడుగు – తెలంగాణ ఆవిర్భావ గీతం నిడివి 4 ని. 50 సె. ,హిట్స్ 28,44,770 ‘ఓరుగల్లు కోటనడుకు... కోటలోని కత్తినడుగు చెపుతాయిలే ఈ నేల ఘనతనే తెలంగాణ చరితనే’... అని మొదలవుతుంది ఈ పాట పల్లవి. తెలంగాణ సాధన, ఆవిర్భావం తరాల కల. ఆ కల సాధన కోసం ఎందరో త్యాగాలు చేశారు. పోరాటాలు చేశారు. తెలంగాణ సాధించుకున్నాక ప్రతి సంవత్సరం జూన్ 1న ఆ వీరుల త్యాగాన్ని ఈ నేల గొప్పతనాన్ని తలుచుకోవడం బాధ్యతగా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ‘మైక్ టీవీ’ తెలంగాణ ఆవిర్భావ గీతాన్ని సమర్పించింది. మంగ్లి, జంగి రెడ్డి ఆలపించిన ఈ గీతాన్ని కందికొండ రచించారు. పాపులర్ ఉదాహరణతో కాకుండా సబ్ ఆల్టర్న్ సంస్కృతిని ఈ పాటలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అంగీకారం, అభ్యంతరం కలిగిన ఉదంతాలు, ఉద్యమాలు కూడా ఈ పాటలో కనిపిస్తాయి. తెలంగాణ అంటే అదంతా కదా. అదంతా కలిసే తెలంగాణ అని చెప్పే ప్రయత్నం ఈ పాటలో కనిపించింది. తెలంగాణలోని వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటను అప్పిరెడ్డి నిర్మిస్తే, దామురెడ్డి కొసనం దర్శకత్వం వహించారు. సంగీతం: నందన్‌రాజ్ బొబ్బిలి. ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్. రమాప్రభ ఇంటర్వ్యూ నిడివి 2గం.55ని.50సె. ,హిట్స్ 4,08,220 పాతతరం వాళ్లు జ్ఞాపకాల గని. ఎంతగా వారిని తవ్వుకుంటూ వెళితే అన్ని జ్ఞాపకాలు బయటపడతాయి. రమాప్రభ కామెడీలో సూపర్‌స్టార్. నిజ జీవితంలో ఆమె ఉత్థాన పతనాలు ఒక బయోపిక్ తీయడానికి తక్కువైనమేమీ కావు. అలాంటి స్టార్ ప్రస్తుతం మదనపల్లెల్లో అయినవాళ్ల సమక్షంలోనే అయినా ఒంటిరి జీవితం గడుపుతున్నారు. ఆమె సావిత్రి గురించి ఏం చెప్పారు... తన కాలపు నటీనటుల గురించి ఎటువంటి జ్ఞాపకాలు పంచుకున్నారు ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. ‘సావిత్రి మొండితనమే ఆమె కష్టాలకు కారణం’ అంటారు రమాప్రభ. ప్రజల సహాయార్థం మైలాపూర్‌లోని ఒక ఇంటిని ఆమె క్షణాలలో రాసివ్వడం గురించి రమాప్రభ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నటనకు, అనుభవానికి గౌరవం ఇవ్వాలనుకుంటే ముందు నాకు ఇవ్వాలి. కాని డబ్బు లేని కారణాన నన్ను తక్కువ చూస్తానంటే మాత్రం ఒప్పుకోను’ అంటారు రమాప్రభ. ఆమె ఒక లెజెండ్. ఎన్నో గౌరవాలు, సత్కారాలు పొందాల్సిన నటి. ఆ నటి అంతరంగం తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ కూడా ఒక మార్గం. ఇంటర్వ్యూ: టి.ఎన్.ఆర్, లొకేషన్: మదనపల్లె -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
రేస్ 3 ట్రైలర్ నిడివి 3 ని. 9 సె. ,హిట్స్ 2,50,36,347 రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లింలు ఉత్సాహంగా మాసాంతాన వచ్చే పండగ కోసం ఎదురు చూస్తారు. అలాగే ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు– సల్మాన్ ఖాన్ సినిమా కోసం. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ మాసం కలిసి వచ్చిందనడానికి గతంలో అతడు సాధించిన పెద్ద పెద్ద హిట్స్ ఉదాహరణ. ఈ రంజాన్‌కు అతడు ‘రేస్ 3’ సినిమాతో రానున్నాడు. ‘బాజీగర్’ వంటి పెద్ద హిట్స్ గతంలో తీసిన దర్శక ద్వయం అబ్బాస్–మస్తాన్ ఈ రేస్ సిరీస్‌కి ఆద్యులు. రేస్1, రేస్2 సినిమాలు సైఫ్ అలీఖాన్ ముఖ్యపాత్రలో పెద్ద హిట్ అయ్యాయి. ఆ వరుసలోనే రేస్3 సైఫ్‌తో తీద్దామనుకున్నారు. కాని నిర్మాత రమేష్ తౌరాని రేస్ 3లో సల్మాన్ ఉండాలని భావించాడు. సల్మాన్ కథలో మార్పులు చెప్పి దర్శకుడిగా కొరియోగ్రాఫర్ రెమో డిసూజాను దర్శకుడిగా పెట్టుకోమని కోరాడు. దాంతో అబ్బాస్–మస్తాన్లు పక్కకు తప్పుకున్నారు. అలాగే సైఫ్ కూడా తప్పుకున్నారు. రేస్ 3లో సల్మాన్‌ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్ ఫెర్నాండెస్ వంటి భారీ తారాగణం ఉంది. అలాగే భారీ పోరాట సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది. థాయ్‌లాండ్, అబూదాబీ దేశాల్లో భారీ చేజింగ్‌లు ఈ సినిమా కోసం తీశారు. చూడబోతే ఫుల్ పైసా వసూల్ సినిమాలా ఉంది. ఇప్పటికే రెండు కోట్ల హిట్స్ దాటి పోయాయంటే సల్మాన్ హవా ఎలాంటిదో అర్థం చేసుకోండి. నా నువ్వే ట్రైలర్ నిడివి 1 ని. 40 సె. ,హిట్స్ 76,78,820 పి.సి.శ్రీరామ్ చేయి పడితేనే ఎందుకో సినిమా ఫ్రెష్ లుక్ పొందేస్తుంటుంది. ‘నా నువ్వే’ ట్రైలర్ చూస్తే పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వల్లే తాజాగా అనిపిస్తుంది. కల్యాణ్‌రామ్ భిన్నమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఆ ఆసక్తి వల్లే ‘అతనొక్కడే’ సినిమా వల్ల సురేందర్ రెడ్డి వంటి మంచి దర్శకుడు దొరికాడు. ఇప్పుడు ‘నా నువ్వే’ వల్ల జయేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ‘నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే విశ్వమంతా దాని విజయానికి కృషి చేస్తుంది’ అని నానుడి. కాని ఎంత స్వచ్ఛమైన ప్రేమకైనా ఏదో ఒక ఆటంకం ఉంటుంది... దాన్ని దాటితేనే ప్రేమ దొరుకుతుంది అనే లైన్లో ఈ సినిమా తయారైనట్టుగా కనిపిస్తుంది. తమన్నా అందంగా ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది. కల్యాణ్‌రామ్ లుక్ కూడా కొత్తగా ఉంది. వెన్నెల కిశోర్ మరో ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు. రైల్వే ప్లాట్‌ఫామ్ కూడా ఇందులో మరో ముఖ్యపాత్ర పోషించింది. ఎదురు చూడదగ్గ సినిమా. మంటో ట్రైలర్ నిడివి 1 ని. 27 సె. ,హిట్స్ 40,11,718 ఇక్కడ ‘మహానటి’ సావిత్రి మీద బయోపిక్ వచ్చి వార్తలకెక్కితే హిందీలో సాదత్ హసన్ మంటోపై బయోపిక్ రాబోతూ సాహిత్యాభిమానుల్లో కుతూహలం రేపుతోంది. ఎవరీ సాదత్ హసన్ మంటో? దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ను ఎంచుకుని అక్కడ స్థిరపడి దేశ విభజన సమయంలో మానవ స్వభావంలోని నైచ్యాన్ని, హైన్యాన్ని కథనం చేసి లక్షలాది సాహిత్యాభిమానులను సంపాదించుకున్నాడు. కాని ‘సభ్య’ సమాజం అతణ్ణి వెంటాడింది. పదే పదే కోర్టు కేసులు వేసి విసిగించింది. ‘వేశ్యావాటికకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చుగానీ వేశ్య గురించి కథ రాయకూడదా’ అని ఈ ట్రైలర్లో మంటో పాత్రధారి నవాజుద్దీన్ సిద్దిఖీ అడుగుతాడు. వేశ్యల మీద, స్త్రీల మీద సాగిన రేప్‌ల మీద, హింస మీద మంటో కథలు ఉంటాయి. మంటో గురించి పాకిస్తాన్లో ఇది వరకే సినిమా వచ్చింది. భారతదేశంలో నాటకాలు వచ్చాయి. పూర్తిస్థాయి సినిమా రావడం ఇదే ప్రథమం. నందితా దాస్ దర్శకురాలు. జూన్‌లో విడుదల. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
రాజుగాడు ట్రైలర్ నిడివి 1 ని. 58 సె. హిట్స్8,79,057 పూర్వం సినిమాలో భౌతిక పరమైన ప్రాణాంతక జబ్బులుండేవి. ‘కేన్సర్’ సినిమా వాళ్లకు పెద్ద వరమైంది. హీరోకో హీరోయిన్‌కో కేన్సర్‌ను పెట్టి చాలా హిట్టు కథలే కొట్టారు. కాని దర్శకుడు మారుతి ఈ జబ్బులను వదిలిపెట్టి మానసిక జబ్బులకు వెల్కమ్ చెప్పాడు. ‘మతిమరుపు’, ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ వంటి జబ్బులతో ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాలు తీశాడు. ఇదే కోవలో ఇంకో జబ్బుతో సినిమా రాబోతోంది. దాని పేరే ‘రాజుగాడు’. ‘క్లెప్టోమేనియా’ అనేది ఒక జబ్బు. ఈ జబ్బు ఉన్నవారు ఏదో ఒకటి దొంగతనం చేయకుండా ఉండలేదు. ఆఖరికి చెంచాలో, చెంప పిన్నులో దొంగతనం చేస్తేనే వీరికి మనశ్శాంతి. అలాంటి జబ్బును మూల సూత్రంగా తీసుకొని ఈ సినిమా కథ అల్లుకున్నారని ట్రైలర్ సూచిస్తోంది. రాజ్ తరుణ్‌కి సరదా సినిమాల హీరో అనే పేరు పడింది. ఆ పేరుకు తగినట్టుగా ఉండటానికి తోడు రాజేంద్రప్రసాద్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమా కుతూహలం కలిగిస్తోంది. హీరోయిన్ యధావిధిగా ఉత్తరాది అమ్మాయి. అయితే మెచ్చుకోవాల్సిన సంగతి సంజనా రెడ్డి అనే మహిళా దర్శకురాలు తొలిసారి దర్శకత్వం వహించడం. త్వరలో విడుదల. వాట్సాప్ స్టోరీస్ మహాతల్లి కామెడీ నిడివి 11 ని. 28 సె. హిట్స్ 6,73,377 రోజువారీ అంశాల చుట్టూ చిన్నపాటి జోకులేసి నవ్వించే కామెడీ వీడియోలను ‘మహాతల్లి’ పేరుతో విడుదల చేసే జాహ్నవి ఈసారి వాట్సాప్ మీద తన వ్యంగ్యాన్ని సంధించింది. వాట్సాప్ పేరుతో జనం ఒకరినొకరు ఎంతగా హింసించుకుంటున్నారో ఈ వీడియోలో హాస్యభరితంగా చూడొచ్చు. వాట్సాప్ వచ్చాక ప్రతి కుటుంబం లేదా బంధుగణం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుంటోంది. ప్రతి కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటారు కదా. వారి ఫొటోలు రోజూ పెట్టడం, భార్యాభర్తలైతే సెల్ఫీలు దిగి ఫొటోలు పెట్టడం, ఆ తర్వాత గుడ్ మార్నింగ్ మెసేజీలు... దీంతో మెమరీ నిండిపోతోందని మహాతల్లి గోల చేస్తుంది. కాని ఎవరు వింటారు. గ్రూప్‌లో నుంచి బయటకు వచ్చేస్తే అదో గొడవ. ఒకవేళ వచ్చేసినా ఎవరో ఒకరు యాడ్ చేసి హింసిస్తారు. వాట్సాప్‌లో అన్నీ ఫ్రీ మెసేజ్‌లు కావడం వల్ల తిన్నావా, తాగావా, నిద్రపోయావా, లేచావా... అని చీటికి మాటికి మెసేజ్‌లు పెట్టడం, పెట్టినప్పుడల్లా ఆ మేసేజ్‌కు టింగ్‌మని రిసీవ్ చేసుకున్నవారికి సౌండ్ రావడం అదో చిరాకు. ఇక చిననాటి ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఇష్టం ఉన్నా లేకున్నా బర్త్‌డే విషెస్, హాయ్ బాయ్ చెప్పడం అదో హింస. దీనికి తోడు అదే వాట్సాప్‌లో ఫార్వార్డ్ మెసేజీలు... బొప్పాయిలో అల్లంకాయ కలిపి నల్లొంకాయ మిక్స్ చేసి అది తాగితే అరవై కిలోలు అర్ధరాత్రి లోపల తగ్గొచ్చని, ఫలానా వారికి డబ్బు సహాయం చేయమని ఈ హింస ఒకటి. వీటన్నింటినీ చూపి మహాతల్లి హాయిగా నవ్విస్తుంది. మీరూ నవ్వండి. హర్ ఫస్ట్ టైమ్ షార్ట్ ఫిల్మ్ నిడివి 8 ని. 30 సె. హిట్స్ 94,577 ఒక పదీ పదకుండేళ్ల అమ్మాయి బాత్రూమ్లో ఉంటుంది. ముఖం మీద ప్రశ్నార్థకం. వేళ్ల అంచున కొద్దిగా రక్తం. అక్కడ నుంచి మొదటిసారి కనిపిస్తున్న రక్తం. ఇది తల్లితో మాట్లాడాల్సిన సందర్భం. కాని తల్లి డాక్టర్. హాస్పిటల్లో సీజేరియన్తో బిజీగా ఉంటుంది. ఇంట్లో తండ్రి ఒక్కడే ఉంటాడు. అతడికి సిట్యుయేషన్ ఎలా డీల్ చేయాలో అర్థం కాదు. కూతురితో చర్చించి అమ్మకు మెసేజ్ పెడదామా అని పెడతాడు. వెంటనే తల్లి ఒక్క క్షణం ఉద్వేగానికి లోనవుతుంది. ఫలానా అరలో ఒక బాక్స్ ఉంటుంది చూడు అని మెసేజ్ పంపుతుంది. కూతురు, తండ్రి వెళ్లి ఆ బాక్స్ తెరిస్తే అందులో శానిటరీ నాప్కిన్ దానిని ఎలా వాడాలో ఒక చిన్న చీటీ ఉంటుంది. పిల్లలు మొదటిసారి పీరియడ్స్ పొందినప్పుడు అంటే పెద్దమనిషి అయినప్పుడు వాళ్లతో ఎలా మాట్లాడాలి ఎలా చర్చించాలి తండ్రులు ఎలా వ్యవహరించాలి ఈ షార్ట్ ఫిల్మ్ హృద్యంగా చూపించింది. ఆడపిల్లలున్న ప్రతి కుటుంబం ఈ షార్ట్‌ఫిల్మ్ చూడాలి. దివ్య ఉన్ని అనే నటి నటించి దర్శకత్వం వహించింది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అంగ్రేజీ మే కెహెతే హై ట్రైలర్ నిడివి 2 ని. 1 సె. , హిట్స్ 15,86,450 ‘నేను ఆఫీసుకు వెళతాను. నువ్వు ఇంట్లో ఉంటావు. పెళ్లంటే అదే’ అంటాడు ఈ సినిమాలో నడి వయసు మనిషి. అతననే ఏముంది... దేశంలో లక్షా తొంభై వేల మంది... సారీ... తొమ్మిది కోట్ల తొంభై వేల మంది... సారీ... ఇంకా ఎందరో లెక్క తెలీదు కానీ అంత మంది మగవాళ్లు ఆ మాటే అంటూ ఉంటారు. ఆఫీసుకు వెళతాను, జీతం తెస్తాను, బాధ్యతలు నెరవేరుస్తాను అదే కదా పెళ్లంటే అని. కాని దానిలో ‘ప్రేమ’ అనే ఒక చిన్న దినుసును మిస్సవుతారు. అది స్త్రీకి కావాలి. భార్యకు కావాలి. భర్త నుంచి కావాలి. దానిని అడిగితే అతనికి కోపం వస్తుంది. చిరాకు వస్తుంది. ప్రత్యేకంగా ప్రేమ ప్రదర్శించడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఆ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోతే అప్పుడు భార్య మీద అన్నాళ్లూ దాచి పెట్టిన ప్రేమంతా బయటకు వస్తుంది. ‘అంగ్రేజీ మే కెహెతే హై’... ఇలాంటి కథతో తయారైన సినిమా. మధ్య వయసులో ఉన్న జంట పెళ్లి నుంచి విడిపోయి తిరిగి ప్రేమలో పడే కథ ఇది. నటుడు సంజయ్ మిశ్రా ఈ మధ్య హీరోతో సమానంగా ముఖ్యపాత్రలలో సినిమాలు చేస్తున్నాడు. భావోద్వేగాలు, కొద్దిపాటి హాస్యాన్ని హామీ ఇస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తోంది. మే 18 విడుదల. ఫేమస్ ట్రైలర్ నిడివి 2 ని. 17 సె. , హిట్స్ 57,47,718 ఇంగ్లిష్‌లో ఫేమస్ను ‘ఎఫ్’ అక్షరం ఉచ్ఛారణ ద్వారా అందరూ ‘ఫేమస్’ (జ్చఝౌuట) అనే పలుకుతారు. కాని మధ్యప్రదేశ్, చంబల్ ప్రాంతంలో ఆ పదాన్ని ‘పి’తో మొదలెట్టి మోటుగా ‘ప్పేమస్’ (pp్చఝౌuట) అని పలుకుతారు. చంబల్ ప్రాంతంలో వెలిగిన దీపాలు నేటికీ తక్కువ. ఆ ప్రాంతం పై పడిన వెలుతురూ తక్కువ. ఆ ప్రాంత జీవనం మీద వచ్చిన సినిమాలు అరడజను వరకూ ఉంటాయి. కాని అరవై తీసినా ఆ ప్రాంతం అర్థమయ్యేది చాలా తక్కువే. ఇప్పుడు చంబల్ ప్రాంతంలో నాలుగు పాత్రల మధ్య నడిచే కథగా ‘ప్పేమస్’ సినిమా తయారయ్యింది. జాకీష్రాఫ్, జిమ్మీ షేర్గిల్, కెకె, శ్రియ... ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. చంబల్ అంటేనే తుపాకీ సంస్కృతి. ఆ సంస్కృతి తాలూకు విశృంఖలత్వం ఈ సినిమాలో చూడొచ్చు. ‘సీతను అపహరించుకొని వెళ్లకపోతే ఏ మనిషీ రాముడిగా మారలేడు’ వంటి డైలాగ్స్ ఉన్నాయి. జూన్ 1న ఈ సినిమా విడుదల కానుంది. కరణ్ లలిత్ భూటానీ దీని దర్శకుడు. సమ్మోహనం టీజర్ నిడివి 1 ని. 13 సె. , హిట్స్ 3,79,500 సినిమా హీరోయిన్‌తో ప్రేమలో పడితే... అదీ ఫ్యాన్సీగా కాదు... సీరియస్‌గా... ఆ సినిమా హీరోయిన్ కూడా సున్నితమైన భావాలు కలిగిన యువతి అయితే? సినిమా వాళ్లంటే ఒక చిన్న చూపు ఉంటుంది కొందరిలో. ఇందులో హీరో కూడా అలాంటివాడే కావచ్చు. కానీ అతడు ప్రేమలో పడింది సినిమా హీరోయిన్‌తోనే. తర్వాత ఏమైంది? అనేదే కథ. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హృద్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే పేరు సంపాదించాడు. ఈ సినిమా కూడా అలాంటిదే కావచ్చు. ‘గ్రోయింగ్ అప్’ అంటారు. అంటే ఎదగడం. ఈ సినిమాలో హీరో సుధీర్, హీరోయిన్ అదితి రావ్ పరస్పరం సమ్మోహనంలో పడి ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఎదుగుతారని టీజర్ సూచిస్తోంది. అభిరుచి ఉన్న నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్‌కు పేరు. ‘జంటిల్మెన్’ తర్వాత కృష్ణప్రసాద్, మోహనకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆకట్టుకోవచ్చు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఇన్ కాన్వర్జేషన్ విత్ మై పీరియడ్ – షార్ట్‌ఫిల్మ్ నిడివి 9 ని. 44 సె.హిట్స్ 6,16,874 ఆడవాళ్ల వైపు నుంచి లోక రీతులను ఉదహరించే యూ ట్యూబ్ చానల్ ‘గర్ల్ ఫార్ములా’ చేసిన కొత్త వీడియో ఇది. ఇంగ్లిష్‌లో టైటిల్ పెట్టారుగానీ అచ్చ తెలుగు వీడియో. ఇటీవలి కాలంలో స్త్రీ సమాజంలో ‘బహిష్టు’ గురించి చర్చ జరుగుతోంది. ‘హ్యాపీ టు బ్లీడ్’ పేరుతో నెలసరి ఒక సహజమైన విషయంగా దాని గురించి సమాజం ఆ సమయంలో స్త్రీలను వివక్షతో చూడరాదని, స్త్రీలు కూడా అందుకు న్యూనత పడరాదని చర్చ జరుగుతున్నది. స్త్రీలకు సహజమైన, జీవన చక్రానికి ఎంతో అవసరమైన ‘బహిష్టు’ గురించి పాతకాలపు ఆలోచనలు అవసరమా? ఆ సమయంలో స్త్రీలపై ఆంక్షలు అవసరమా? ఈ విషయాలను లౌడ్‌గా కాకుండా ఒక సున్నితమైన సంభాషణలాగా ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చిత్రీకరించారు. పుట్టిన రోజు నాడు ఒక అమ్మాయికి పీరియడ్స్ మొదలవుతాయి. పీరియడ్స్ ఒక యువతి రూపంలో ఆ అమ్మాయికి ఎదురుపడతాయి. ఆ అమ్మాయికి పీరియడ్స్ ఎలా సాంత్వనం కలిగించాయో ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చూడొచ్చు. ‘పీరియడ్స్ మొదలైన మొదటి రోజు ఆడవాళ్లకు ఆఫీషియల్ లీవ్ ఇచ్చే హక్కు’ను ఈ వీడియో నొక్కి వక్కాణించింది. మనం చాలా మారాం. ఇంకా మారాల్సిన సంగతులు నెలసరి విషయంలో ఈ వీడియోలో ఉన్నాయి. మంచి ప్రయత్నం. రచన, దర్శకత్వం: మసాలా సుదీప్. వీర్ ది వెడ్డింగ్ – ట్రైలర్ నిడివి 2 ని. 49 సె.హిట్స్ 1,93,86,809 సమాజం బంధనాలు వేయడం, వ్యక్తి స్వేచ్ఛ కోసం పెనుగులాడటం జరుగుతున్నదే. మగవాళ్ల సంగతి పక్కన పెట్టండి. స్త్రీలు స్వేచ్ఛ కోసం పెనుగులాడితే? స్వేచ్ఛను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే? మగ వ్యవస్థను చాలెంజ్ చేయాలనుకుంటే? ‘వీర్ ది వెడ్డింగ్’లో నలుగురు యువతులు ఈ ప్రయత్నమే చేసేలా ఉన్నారు. తమకు ఇష్టమైన జీవన మార్గాలలో ప్రయాణం చేయడానికి వీరు ప్రయత్నిస్తే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది కథ. ఇందులో వాడిన భాష, పాత్రల బాహాటమైన ప్రవర్తన మన ప్రేక్షకులకు కొంత షాక్ ఇచ్చే అవకాశం ఉంది. బూతులు కూడా ధారాళంగా మాట్లాడితే షాక్ కదా. అదీ ఆడపిల్లలు. కాని వాస్తవ సమాజంలో ఈ వాస్తవ యువతులు కూడా ఉన్నారు. ‘క్విక్ గన్ మురుగన్’ వంటి సినిమాలకు పని చేసిన శశాంక్ ఘోష్ దీనికి దర్శకుడు. సోనమ్ కపూర్ సొంతగా నటించి నిర్మించింది. కరీనా కపూర్ ఇంకో ముఖ్యపాత్ర. చాలా కుతూహలం రేపుతున్న ట్రైలర్ ఇది. నా పేరు సూర్య – ట్రైలర్ నిడివి 1 ని. 49 సె.హిట్స్ 27,56,165 సైనికుడు దేశాన్ని ప్రేమించడం విధి. దేశం కోసం పిచ్చిగా, ఆగ్రహంగా చెలరేగితే ఆ సైనికుడికే కాక ఎదుటివారికి కూడా సమస్యలు వస్తాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లో అల్లు అర్జున్ చాలా కోపం కలిగిన దేశభక్తితో నిండిన సైనికుడిగా కనిపించనున్నాడు. బార్డర్లో చచ్చిపోవాలనేది ఇతడి కోరిక. కాని బార్డర్లో ఎదుర్కోవాల్సిన శత్రువు కంటే బార్డర్ లోపల ఉన్న శత్రువును ఎదుర్కోవడం ముఖ్యమని భావిస్తాడు. ఆ పనిలో ఏం కోల్పోయాడు... ఏం పొందాడు... తెర మీద చూడాలి. వక్కంతం వంశీ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా అల్లు అర్జున్ అభిమానులలో క్రేజ్‌ను తీసుకువస్తోంది. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మాతలు. అర్జున్, శరత్ కుమార్ వంటి స్టార్లు కూడా ఉన్నారు. ‘నాకు కోపం వస్తే బూతులే వస్తాయి మంత్రాలు కాదు’... ‘కేరెక్టర్ కోల్పోవడం అంటే చావు రాక ముందే చచ్చిపోవడం’ వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. బన్నీ లుక్స్ బాగున్నాయి. మే 4న సినిమా విడుదల కానుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
గర్మీ కే సైడ్ ఎఫెక్ట్స్ కామెడీ షార్ట్ ఫిల్మ్ నిడివి 8 ని. 44 సె. హిట్స్ 1,09,65,129 సీజన్ మారగానే యూ ట్యూబ్ స్టార్స్ కొత్త వీడియోలు తయారు చేస్తుంటారు. ఇప్పుడు వేసవి వంతు. కామెడీ వీడియోలు తీసే ఆషిష్ చంచలానీ ‘గర్మీ కే సైడ్ ఎఫెక్ట్స్’ పేరుతో తీసిన ఈ వీడియో పెద్ద హిట్ అయ్యింది. కోటి హిట్స్ దాటిపోయాయి. ఆషిష్ చంచలానీయే ఇందులో ప్రధాన పాత్ర. స్నేహితుడు ‘బయటకెళ్లి ఆడుకుందామా?’ అనడిగితే ‘సూర్యుడు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు’ అంటాడు ఆషిష్. ఏసి పాడయ్యి ఆపసోపాలు పడుతున్న ఆషిష్కు గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు. రారాదూ’ అని పిలిస్తే ‘మీ ఇంట్లో ఏసీ పని చేస్తోందా?’ అని అడుగుతాడు. ‘లేదు’ అంటుంది. ‘అయితే నీ చావు చావు’ అని గోల్డెన్ చాన్స్ కూడా సెగ దెబ్బకు వదులుకుంటాడు. ఇంత ఎండలో ఒక స్నేహితుడు హాయిగా బైక్ మీద కూచుని ఉంటే ‘ఒరేయ్... నీకు ఇంకా ఎండ కావాలట్రా... సోలార్ ప్యానల్ అక్రమ సంతానమా’ అని తిడతాడు. ఈ సీజన్లో అత్యధిక సంపన్నుడు ఎవడంటే ఐస్ సోడా అమ్మే వాడే అని చూపిస్తాడు. ఎండల్లో చాలా చిరగ్గా ఉంటుంది. ఆ చిరాకు హాస్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సాక్ష్యం టీజర్ నిడివి 1 ని. 38 సె. హిట్స్ 11,12,398 శ్రీనివాస్ బెల్లంకొండ సినిమాలు భారీగా ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అతడు తగినంత శ్రమ చేస్తున్నాడనే చెప్పాలి. తాజాగా అతడి నుంచి రాబోతున్న ‘సాక్ష్యం’ ఆసక్తిరంగా ఉండబోతోందని టీజర్ చెబుతోంది. తప్పుకు అన్నిసార్లు సాక్ష్యం ఉండకపోవచ్చు... కాని ‘కర్మసాక్షి’ తప్పక ఉంటుంది అనే లైన్‌తో ఈ సినిమా కథ తయారయ్యింది. డిఫరెంట్ లొకేషన్స్, ఇంతకు ముందు అలవాటు లేని కథ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. దర్శకుడు శ్రీవాస్ అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. జగపతిబాబు, రావు రమేష్, వెన్నెల కిశోర్ కనిపిస్తున్నారు. కుతూహలం రేపే టీజర్ ఇది. అతను జైలుకు వెళ్లాలా? న్యూస్ వీడియో నిడివి 3 ని. 29 సె. హిట్స్ 50,888 యూ ట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేసేవారు ఈ సంగతి విని నోరెళ్ల బెడతారు. బార్సిలోనాలో స్థిరపడ్డ ‘కంగుహ’ అనే 20 ఏళ్ల చైనిస్ కుర్రాడు యూ ట్యూబ్‌లో తరచూ ఫన్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు. వాటి వల్ల అతనికి ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే అతడు జనవరి, 2017లో ఓరియో బిస్కెట్లలో క్రీమ్ తీసేసి టూత్ పేస్ట్ నింపి రోడ్డు పక్క ఉన్న ఒక కాందిశీకుడికి ఇచ్చాడు. ఆకలితో ఉన్న ఆ కాందిశీకుడు ఆ బిస్కెట్లు తిన్నాడు.అంత వరకూ షూట్ చేసిన వీడియోను కంగుహ తన చానల్లో ప్రేక్షకుల వినోదం కోసం పెట్టాడు. అయితే ఇది చాలా అవమానకరమైన పని అని ఆ దేశంలో (స్పెయిన్) కేసు నమోదైంది. ‘నైతిక సమగ్రత’కు భంగం కలిగేలా ప్రవర్తించాడని వాదనలు నడిచాయి. అరెస్టు ఆ వెంటనే బెయిలు పై విడుదలైన కంగుహ కుయ్యో మొర్రో అంటూ ఆ వీడియోను తొలగించాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రెండు రోజుల పాటు రోడ్డు పక్కన నివసించాడు. ఇవి ప్రజల నుంచి మద్దతు సంపాదించి పెట్టాయి కాని కోర్టు నుంచి కాదు. నేరం నిరూపణ అయితే కంగుహకు అక్షరాల రెండేళ్ల జైలు శిక్ష పడనుంది. అలాగే దాదాపు పాతిక లక్షలు అతని నుంచి జరిమానాగా వసూలు చేసి ఆ కాందిశీకుడికి ఇవ్వనున్నారు. ఇదంతా విని జనం విసుక్కుంటున్నారు. చిన్న ప్రాంక్‌కు ఇంత పెద్ద శిక్షా అని నిరసన తెలియ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా వివరించే న్యూస్ వీడియో ఇది. (ఇన్సెట్లో కంగుహ). -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ది డాక్టర్ షార్ట్ కామెడీ నిడివి 9 ని. 49 సె. , హిట్స్ 1,188,080 ‘వైవా’ యూట్యూబ్ చానల్ ‘ది సిరీస్’ పేరుతో ఒక కొత్త సిరీస్‌ను మొదలెట్టింది. అందులో భాగంగా తొలి కామెడీ వీడియో ‘ది డాక్టర్’ను విడుదల చేసింది. యధావిధిగా వైవా టీమ్ మొత్తం ఇందులో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. హర్ష డాక్టర్‌గా మిగిలిన మిత్రులు రోగులుగా నటించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్‌ను వైవా తన షార్ట్ఫిల్మ్స్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ‘ఏమి అడిగినా నవ్వుతూ ఉండే’ ఈ పాత్రను పోషించే నటుడు ప్రతి దానికీ హాయిగా నవ్వుతూ హాస్యం పండిస్తుంటాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ఇతడి గుండె మీద స్టెత్ పెడితే ‘హాహా.. హాహా’ అని వినిపిస్తూ ఉంటుంది. తలకు ఎక్స్‌రే తీస్తే ‘నవ్వుతున్న పుర్రె’ కనిపిస్తుంది. ‘గట్టి అప్పడం’ అనుకొని అర్ధరాత్రి చీకట్లో సీడీని తినేసిన పేషెంట్, ప్రాణిక్ హీలింగ్ పేషెంట్ వీళ్లందరి ప్రహసనాలు నవ్వు పుట్టిస్తాయి. ఎవరినీ కించ పరచకుండా, అశ్లీల జోకులు వేయకుండా, ఆరోగ్యకరమైన హాస్యంతో ముందుకు వెళుతున్న ఈ టీమ్‌ను ఆదరించకుండా ఎవరు ఉంటారు? హౌస్‌మెయిడ్ స్టాండప్ కామెడీ నిడివి 4 ని. 8 సె. ,హిట్స్ 4,59,683 స్టాండప్ కమెడియన్లు చేసే కామెడీ వీడియోలు కూడా యూట్యూబ్‌లో బాగా ఆదరణ పొందుతుంటాయి. రాహుల్ సుబ్రమణియన్ ‘పనిమనిషి’పై చేసిన స్టాండప్ కామెడీ కొన్ని మంచి పంచ్‌లతో సాగుతుంది. ఈ వీడియోలో అతనంటాడు– మనందరం పనిమనిషి వస్తేనే నిద్ర లేస్తాం. నేను కూడా అంతే. కాని ఒకరోజు ఆమె రాలేదు. నేను లేచేసరికి గురువారం వచ్చేసింది. అరె... మంగళవారం పడుకుంటే గురువారం ఎలా లేచాను? బుధవారం ఏమైపోయింది... అనుకున్నాను. మోడీ గారు నోట్లను బేన్ చేసినట్టు బుధవారాలు కూడా బేన్ చేశారా అని నవ్విస్తాడు. మరాఠిలో ‘బాయి’ అంటే స్త్రీ అని అర్థమని పని మనుషుల పక్కన ‘బాయి’ అని పెట్టి పిలుస్తామని అయితే తన పనిమనిషి విషయంలో ఒక ఇబ్బంది వచ్చిందనీ తన పేరు ‘లక్ష్మీబాయి’ కావడం వల్ల ఆమెను ‘లక్ష్మీబాయి బాయి’ అని పిలవాల్సి వచ్చిందని చెప్తాడు. తన పనిమనిషికి డస్ట్ ఎలర్జీ ఉంది కనుక తను చిమ్మే పద్ధతి వేరుగా ఉంటుందని చేసి చూపిస్తాడు. పనిమనుషులు లేకపోతే మన సమాజం, చాలా ఇళ్లు, కాపురాలు నడవవు. చాలా మంచి పనిమనుషులు మనకు ఉన్నారు. కాని కొందరు విసిగించే పనిమనుషుల బారిన పడినవారు ఇలాంటి జోకులతో కొంత తెరిపిన పడతారని చెప్పవచ్చు. కర్తా షార్ట్ ఫిల్మ్ నిడివి 20 ని. 19 సె. ,హిట్స్ 95, 296 రాయల్ స్టాగ్ లార్జెస్ట్ షార్ట్ ఫిల్మ్స్‌లోని ఒక ఫిల్మ్ ఇది. అనురాగ్ కశ్యప్ సమర్పణలో రణదీప్ ఝా దర్శకత్వం వహించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు ఏజెంట్లు ఎలాంటి ఒత్తిడికి గురవుతారో చాలా శక్తిమంతంగా, దిగులూ, బెంగా కలిగే స్థాయిలో దీనిని తీశారు. ఇందులో కథానాయకుడు తెలిసీ తెలియని జ్ఞానంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తూ ఉంటారు. పార్టీలు దొరకవు. డీల్స్ సెటిల్ కావు. ఇంటికి ఇఎమ్ఐలు కట్టలేని పరిస్థితి. పిల్లాణ్ణి స్కూలు నుంచి పంపించేస్తారు. ఏదో ఒకటి సంపాదించి తేవాల్సిన మగవాడు ఎలాంటి అవమానభారాలు మోస్తాడో ఇది చూపిస్తుంది. చివరకు ఆ ఏజెంట్ ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. షార్ట్ఫిల్మ్స్లో ఎంతటి ఇంటెన్సిటీతో తీయవచ్చో తెలియాలంటే ఈ వీడియో చూడాలి. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
భరత్ అనే నేను – సాంగ్ ఆఫ్ భరత్ నిడివి: 5 ని. 29 సె. ::: హిట్స్: 67,47,050 ‘భరత్ అనే నేను... హామీ ఇస్తున్నాను’... అని సాగుతుంది ఈ పాట. హీరో ఉదాత్తతను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న ‘అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి’... వంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘భరత్ అనే నేను’ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, రామజోగయ్య శాస్త్రి రాయగా, డేవిడ్ సిమన్ పాడిన ఈ లిరికల్ సాంగ్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కుతూహలం రేపేలా ఉంది. కొన్నాళ్లు సినిమాల్లో టైటిల్ సాంగ్స్ ఊపుగా ఉండేవి. మళ్లీ ఇప్పుడు అవి కనిపిస్తున్నాయి. కొరటాల శివ తీసిన అన్ని సినిమాల్లో టైటిల్ సాంగ్స్ కనిపిస్తాయి. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారెజ్’... ఈ మూడిటిలోని టైటిల్ సాంగ్స్లాగానే ‘భరత్ అనే నేను’ సాంగ్ కూడా మార్కులు సాధించేలా ఉంది. మహేశ్‌బాబు సీఎంగా నటిస్తున్న సినిమా ఏ కొత్త పాయింట్‌ను చెప్పిందో చూడాలి. గతంలో శంకర్ ‘ఒకే ఒక్కడు’ దాదాపు ఇదే పాయింట్‌తో తీశాడు. హీరో ముఖ్యమంత్రి కావడం శేఖర్ కమ్ముల ‘లీడర్’లో కూడా చూశాం. రాబోయే ‘భరత్ అనే నేను’ కోసం ప్రేక్షకులు కాచుకుని ఉన్నారు. ఏప్రిల్ 20 విడుదల. నాను కి జాను – ట్రైలర్ నిడివి: 2 ని. 20 సె. ::: హిట్స్: 1,18,05,550 తెలుగువారిని, తమిళులను ఒక ఊపు వూపిన హారర్ సినిమాల వరుస ఇప్పుడు బాలీవుడ్‌కు పట్టింది. ‘గోల్మాల్ ఎగైన్’లో ఈ జానర్ వాడి రోహిత్ శెట్టి హిట్ కొట్టాక చాలా బాలీవుడ్ కథలు ఈ దారి పట్టాయి. వాస్తవానికి రామ్‌గోపాల్ వర్మ కొన్ని సినిమాలు వరసపెట్టి తీసినా అప్పుడు లేని మూడ్ ఇప్పుడు వచ్చినట్టు ఉంది. ‘నాను కి జాను’ తాజాగా ఆసక్తి రేపుతున్న హారర్ సినిమా. అభయ్ డియోల్ ముఖ్యపాత్రధారి. ఒక ఫ్లాట్‌లో చేరిన అభయ్ డియోల్ అక్కడ వింత వింత అనుభవాలను ఎదురుచూడటం కథ. హాస్యం, ఉద్వేగం కలగలిసిన సన్నివేశాలు ఈ సినిమాలో మెండుగా ఉన్నాయని ట్రైలర్ చెబుతోంది. ఫరాజ్ హైదర్ దర్శకుడు. ఈ సినిమా హిట్ అయితే అభయ్కు లైఫ్ రావడంతో పాటు దెయ్యాలకు కూడా లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 విడుదల. హై–జాక్ – ట్రైలర్ నిడివి: 1 ని. 37 సె. ::: హిట్స్: 3,18,93,400 హైజాక్‌ను సీరియస్‌గా డీల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది కామెడీగా డీల్ చేసిన సినిమా. చాలా కాలంగా జీతాలు ఇవ్వని తమ ఎయిర్‌లైన్స్ అధిపతి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని ఆ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు నలుగురు డిసైడ్ అవుతారు. అందుకు మార్గం ఆ రోజు ఎగిరే ఆఖరు విమానాన్ని హైజాక్ చేయాలనుకుంటారు. హైజాక్ చేస్తారు కూడా. కాని లోపల ఉన్న ప్రయాణికులు చిత్రవిచిత్రంగా ఉంటారు. వాళ్లు హైజాక్‌కు కారణాలు అడుగుతారు. అంతే కాదు వీళ్లను నానా హింసలు పెడతారు. అదంతా హస్యంతో నిండి ప్రేక్షకులకు వినోదం కలిగించే అవకాశం ఉంది. ఆకర్ష్ ఖురానా దర్శకుడు. వెబ్ సీరిస్ ద్వారా పేరు గడించిన సుమిత్ వ్యాస్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్తవారే. హాస్యం ఇష్టపడేవాళ్లు దీని మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 20 విడుదల. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
వరద గుడి – షార్ట్ ఫిల్మ్ నిడివి: 24 ని. 25 సె. ::: హిట్స్: 82,550 భాండశుద్ధి లేని పాకమేల అంటారు పెద్దలు. చిత్తశుద్ధి లేని శివపూజలేల అని కూడా అన్నారు. స్వధర్మం, గృహధర్మం పాటించలేని వ్యక్తి ఎదుటివారికి ధర్మపన్నాలు వల్లించడం ఎంత సమంజసం? భార్యపట్ల, సంతానం పట్ల ఎటువంటి ధర్మాన్ని కలిగి ఉండాలో బోధ చేస్తూ తాను మాత్రం ఆ బోధ తప్పితే? అలాంటి భర్తకు బుద్ధి చెప్పి తిరుగుబాటు చేసిన ఒక భార్య కథ ‘వరద గుడి’. పాటిబండ్ల రజని కథ ‘సత్యవ్రతం’ ఆధారంగా అంజనీ యలమంచలి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రతిభావంతంగా రూపకల్పన చేశారు. నటి అర్చన ప్రధాన పాత్ర. ఎం.వి.రఘు కెమెరా. ప్రముఖ లలిత సంగీత గాయకులు మల్లాది సూరిబాబు ఈ షార్ట్‌ఫిల్మ్ కోసం టైటిల్ సాంగ్ ఆలపించారు. తెలుగు సాహిత్యంలోని మంచి కథలకు దృశ్యరూపం ఇచ్చే ఈ పరంపర కొనసాగాలని కోరుకుందాం. ఏక్ దో తీన్ – రీమిక్స్ సాంగ్ నిడివి: 1 ని. 37 సె. ::: హిట్స్: 3,18,93,40 నటి మాధురి దీక్షిత్‌ని రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ చేసిన పాట ‘ఏక్ దో తీన్’. ఎన్.చంద్ర దర్శకత్వం వహించిన ‘తేజాబ్’ (1988)లో వచ్చిన ఈ పాట దేశం మొత్తం ఊపేసింది. ముప్పై ఏళ్ల తర్వాత ఈ పాటను మళ్లీ రీమిక్స్ చేశారు టైగర్ ష్రాఫ్ నటించిన ‘భాగీ2’ కోసం. నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఈ పాటలో హుషారైన స్టెప్స్ వేస్తూ కనిపించింది. గతంలో ఈ పాటను అల్కా యాగ్నిక్ పాడగా ఇప్పుడు రీమిక్స్ కోసం శ్రేయా ఘోషల్ గొంతు విప్పడం సంగీతాభిమానులకు ఇరువురిలో ఎవరు బాగా పాడారని బేరీజు వేసుకునే సరదా కలిగిస్తుంది. ‘భాగీ 2’ మన తెలుగు సినిమా ‘క్షణం’కు రీమేక్. తెలుగులో హిట్టయిన ఆ సినిమాకు మార్పుచేర్పులు చేసి హిందీకి తగినట్టుగా టైగర్ ఇమేజ్‌కు తగినట్టుగా మార్చి రిలీజ్ చేస్తున్నారు. మార్చి 30 విడుదల. ఏక్ దో తీన్ పాట ఈ సినిమా ఘన విజయానికి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. బేవఫా బ్యూటీ – ఐటమ్ సాంగ్ నిడివి: 2 ని. 05 సె. ::: హిట్స్: 39,29,460 ఒకప్పుడు ‘రంగీలా’, ‘అనగనగా ఒకరోజు’, ‘ఏక్ హసీనా థీ’ వంటి సినిమాలతో ఎంతో బిజీ హీరోయిన్గా వెలిగిన ఊర్మిళా మంటోడ్కర్ చాలా గ్యాప్ తర్వాత ఈ ఐటమ్ నంబర్‌తో బాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది. ఏదైనా మంచి పాత్రతో కాక ఐటమ్ గర్ల్‌గా ఆమె రీఎంట్రీ ఇవ్వడం కుతూహలం రేపే అంశమే. ‘బ్లాక్ మెయిల్’ సినిమాలో ‘బేవఫా బ్యూటీ’ అంటూ ఊర్మిళ చేసిన ఈ పాట ప్రస్తుతం యూ ట్యూబ్‌లో మంచి హిట్లు సాధిస్తోంది. వంగపండు రంగు చమ్కీల చీరలో ఈ వయసులో కూడా మంచి శారీరక పటిమతో ఆమె సత్తా చాటుకునేలా ఉంది. ‘బ్లాక్ మెయిల్’ సినిమాలో హీరో ఇర్ఫాన్ ఖాన్. తన భార్య మరొకరితో సంబంధం కలిగి ఉండటం చూసి ఇర్ఫాన్ ఖానే వాళ్లను ‘ఈ సంగతి నీ భర్తకు చెప్పేస్తాను’ అంటూ అజ్ఞాత వ్యక్తిగా బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకోవడం కథ. ‘ఢిల్లీ బెల్లీ’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు అభినయ్ డియో ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అందరి అంచనాలు దీని మీద పెరిగాయి. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
102 నాటవుట్ – టీజర్ నిడివి: 1 ని. 02 సె.; హిట్స్: 49,95,900 అమితాబ్, రిషి కపూర్ అనగానే ‘చల్ మేరే భాయ్’... పాట గుర్తుకొస్తుంది. ‘నసీబ్’లో వాళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ‘అమర్ అక్బర్ ఆంథోనీ’లో కూడా వాళ్ల జోడీ పండింది. 27 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్లు తిరిగి నటిస్తున్నారు. సినిమా పేరు ‘102 నాటవుట్’. గుజరాతీ రచయిత సౌమ్యా మిశ్రా రాసిన నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో 102 ఏళ్ల తండ్రి అతని 75 ఏళ్ల కొడుకు మధ్య ఉన్న బంధాన్ని చర్చిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే కొడుకు తండ్రిని చూసుకోవడం కన్నా తండ్రి కొడుకును చూసుకోవడం ఈ సినిమా విశేషం. కొడుకులు సాధారణంగా తండ్రులను వృద్ధాశ్రమానికి పంపుతుంటారు కదా. ఇందులో తండ్రి కొడుకును వృద్ధాశ్రమానికి పంపుతానంటాడు. తర్వాత ఏమవుతుందనేది కథ. గతంలో ‘ఓ మై గాడ్’ వంటి హిట్ సినిమా తీసిన ఉమేష్ శుక్లా ఈ సినిమాకు దర్శకుడు. ప్రేక్షకుల్లో కుతూహలం రేపుతున్న ఈ సినిమా టీజర్ యాభై లక్షల హిట్స్‌కు సమీపించింది. ఎవ్విరి స్కూల్ రొమాన్స్ – షార్ట్‌ఫిల్మ్ నిడివి: 5 ని. 52 సె.; హిట్స్: 49,00,350 హైస్కూల్ స్థాయి వయసొచ్చాక– కో ఎడ్యుకేషన్ అయితే గనుక– స్కూళ్లలో కలిగే ఆకర్షణలు, కోరుకునే స్నేహాలు, ఇన్‌ఫాచ్యుయేషన్... వీటి మీద ఏ షార్ట్‌ఫిల్మ్ కనిపించినా నోస్టాల్జియాలోకి వెళ్లిన అనుభూతి వస్తుంది. ‘ఫిల్టర్ కాఫీ’ యూ ట్యూబ్ చానల్ తయారు చేసిన ‘ఎవ్విరి స్కూల్ రొమాన్స్’ షార్ట్ ఫిల్మ్ స్కూళ్లో అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణలో చోటు చేసుకునే సరదాలను చూపిస్తుంది. స్కూల్ బస్‌లో సీటు తీసి పెట్టడం, కోడ్ నేమ్స్ పెట్టుకుని మాట్లాడటం, ఇంటికి ఫోన్ చేస్తే తల్లో తండ్రో ఎత్తితే హడలిపోయి పెట్టేయడం, లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం.. ఇవన్నీ కనిపిస్తాయి. చివరకి ఎస్ అంటే ఎస్ అనుకున్నా సాధారణంగా ఇలాంటి ఆకర్షణలన్నీ స్కూలు ముగిశాక అంతమైపోతుంటాయి. సరదాగా చూడదగ్గ షార్ట్‌ఫిల్మ్ ఇది. . ఒరు అదార్ లవ్ – టీజర్ నిడివి: 44 సె.; హిట్స్: 1,64,92,700 కన్ను కొట్టే అమ్మాయి ప్రియా వారియర్ పుణ్యాన ఈ సినిమా రిలీజ్‌కు ముందే దేశమంతా తెలిసి పోయింది. వాస్తవానికి ఇది చిన్న మలయాళ సినిమా. రాబోయే రంజాన్ పండుగకి (జూన్) దేశంలో విడుదల కానుంది. కేరళకు çపరిమితం కావాల్సిన ఈ వ్యవహారం ఒక పాటలో ప్రియా ప్రదర్శించిన హావభావాల వల్ల విపరీత ప్రచారం పొందింది. ‘ఒరు ఆదార్ లవ్’ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల స్కూలు ప్రేమ కథ. రొమాంటిక్ కామెడీలు తీస్తాడని గుర్తింపు పొందిన ఒమర్ లులు దీనికి దర్శకుడు. దీని కోసం అందరూ కొత్తవారిని తీసుకుంటే వారిలో ఒకరైన ప్రియా వారియర్ దేశాన్ని ఆకర్షించింది. వారంలోనే దీని అఫీషియల్ టీజర్ కోటిన్నర హిట్స్‌ను దాటిపోయింది. అంతా ప్రియా లీల. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ది వీసా ఇంటర్వ్యూ– షార్ట్ ఫిల్మ్ నిడివి: 10 ని. 10 సె.; హిట్స్: 14,94,800 ‘వైవా’ హర్షా మళ్లీ ఎటాక్ చేశాడు. ఈసారి అమెరికా వెళ్లడానికి ఉవ్విళ్లూరేవాళ్లు వీసాకు అటెండ్ అయ్యి ఎలాంటి సమాధానాలు చెప్తారన్న కంటెంట్ మీద వ్యంగ్యం విసిరాడు. ఈ కామెడీ షార్ట్ ఫిల్మ్‌లో హర్షా ఎంబసీలో ఆఫీసర్‌గా కనిపిస్తే మిగిలిన నటులు వీసాకు హాజరైనవారుగా ఉంటారు. వీసా రావాలంటే ‘ఐ లవ్ మై ఇండియా’ అనాలనీ, ఏదో ఒక డిగ్రీ చదవే మిషతో అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోవచ్చని, ఎన్.ఆర్.ఐ వరుణ్ణి కట్టుకుని ప్రిస్టేజి కోసం అమెరికాలో సెటిల్ కావాలనుకునేవారి సమాధానాలన్నీ ఈ ఇంటర్వ్యూలో హాస్యం తెప్పిస్తాయి. వీటన్నింటికి మించి ‘ఫ్రీ చైతన్యా పారాయణ’ ప్రతినిధి వీసా కోసం రావడం ఆకట్టుకుంటుంది. అమెరికాలో ఫ్రీ చైతన్యా పారాయణ ఇన్స్టిట్యూట్స్ పెట్టి హాస్టల్స్ తెరిచి వంద మందిని కుక్కి రెండు మూడు ఆత్మహత్యలు చేయిస్తే తప్ప శాంతి లేదన్నట్టుగా ఆ ప్రతినిధి వీసాకు వస్తాడు. కానీ వీసా ఆఫీసర్ లక్కీగా అతడి వీసాను రిజెక్ట్ చేస్తాడు. అలరించిన ఈ షార్ట్ ఫిల్మ్ పోస్ట్ అయిన వెంటనే పది లక్షల హిట్స్‌కు చేరుకుంది. సమంతా రంగస్థలం– టీజర్ నిడివి: 28 సె.; హిట్స్: 57,80,100 పల్లెటూరి అమ్మాయిలను పల్లెటూరి అమ్మాయిలుగా చూసి చాలా కాలం అవుతోంది. అయితే ‘రంగస్థలం’ ఎనభైల కాలం నాటి కథ కాబట్టి ఆ కాలం నాటి పల్లెటూరి ఆడపిల్లలు ఆ సినిమాలో కనిపించే అవకాశం ఉంది. ఆ మాటకు ఊతమిస్తూ ‘సమంతా’పై విడుదల చేసిన రంగస్థలం టీజర్ విడుదలైన వెంటనే భారీ హిట్ అయ్యింది. నడుము వయ్యారంగా తిప్పుతూ నీళ్ల చెరువులోకి వెళుతున్న సమంతా, సైకిల్ తొక్కుతున్న సమంతా, చాకిరేవులో బట్టలుతుకుతున్న సమంతా ‘ఈ పిల్ల ఎదురైతే మా ఊరికి పద్దెనిమిదేళ్ల వయసొచ్చేలా ఉంటుందండీ’ అని రామ్ చరణ్ డైలాగును నమ్మబలికేలా ఉంది. దాదాపు 50 లక్షల హిట్స్‌కు ఈ టీజర్ చేరువైంది. గోల్డ్ – టీజర్ నిడివి: 1ని. 7 సె.; హిట్స్: 1,19,40,760 సినిమాటిక్ కథలతో విసిగిపోయిన బాలీవుడ్ బయోపిక్స్ వెంట గత చారిత్రక ఘటనల వెంట పరుగు తీస్తోంది. జనం ఆ సినిమాలను మెచ్చుకుంటున్నారు కూడా. తాజాగా ఇండియా హాకీ వెలుగులను తెలియచేసే ‘గోల్డ్’ అనే సినిమా రాబోతోంది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రధారి. భారతదేశం ‘బ్రిటీష్ ఇండియా’గా ఉన్నప్పుడు అనేక మెడల్స్ గెలిచింది. కాని స్వాతంత్య్రం వచ్చాక 1948 ఒలింపిక్స్‌తో తొలి బంగారు పతకం గెలిచింది. ఆ పతకం గెలవడానికి భారత జట్టు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొన్నది అనేది కథ. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది. ఆమిర్‌ఖాన్‌తో గతంలో ‘తలాష్’ తీసిన రీమా కాగ్తీ ఈ సినిమాకు దర్శకురాలు. కోటి హిట్స్‌ను దాటిపోయిన టీజర్ ఇది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సమ్మక్క సారక్క– కామెడీ షో నిడివి: 6 ని. 37 సె.; హిట్స్: 13,11,650 ‘మై విలేజ్ షో’ యూ ట్యూబ్ చానల్ ద్వారా ఇద్దరు తెలంగాణ వ్యక్తులు ఫేమ్‌లోకి వచ్చారు. ఒకరు గంగవ్వ. మరొకరు రాజు. వీళ్లిద్దరూ తల్లీకొడుకులుగా చేసే వీడియో షోస్‌కు పెద్ద ఆదరణ ఉంది. శ్రీరామ్ శ్రీకాంత్ అనే ఔత్సాహికుడు ఈ షోస్‌కు రచన, దర్శకత్వం నిర్వహిస్తుంటాడు. కరీంనగర్ సమీపంలోని ‘లంబాడి పల్లి’ అనే ఊరిలో గంగవ్వ, రాజు పాత్రల మధ్య సహజంగా జరిగే హాస్య సంభాషణలు, ప్రహసనాలు ఈ చానెల్లో ఉంటాయి. తాజాగా ‘సమ్మక్క సారక్క జాతర’ పేరున ఒక వీడియో విడుదల చేశారు. అమాయకురాలైన తల్లి, కొంచెం చదివి ఫ్యాషన్‌కు పోయే కొడుకు సమ్మక్క సారక్క జాతర కోసం ఎలా సిద్ధమయ్యారనేది కంటెంట్. అచ్చతెనుగు తెలంగాణ భాషలో సాగే ఈ సంభాషణలు వినడానికి చూడటానికి ముచ్చటగా, హాస్యం వచ్చేలా ఉంటాయి. పెట్టిన నాలుగు రోజులకే 11 లక్షల హిట్స్ సాధించిన వీడియో ఇది. బ్రేకప్ సైకిల్ – షార్ట్‌ఫిల్మ్ నిడివి: 5 ని. 45 సె.; హిట్స్: 11,08,100 యూ ట్యూబ్ చానెల్స్ ద్వారా పాపులర్ అయిన ‘ఫన్నీ గర్ల్’ ప్రాజక్త కోలి తాజా వీడియో ‘బ్రేకప్ సైకిల్’. ఇవాళ రేపు కుర్రకారు మధ్య టీ తాగినంత సామాన్యంగా బ్రేకప్స్ అయిపోతున్నాయి. బ్రేకప్ పార్టీలు కూడా జరుగుతున్నాయి. అలా బ్రేకప్ అయిన ఒక కుర్రాడు, బ్రేకప్ అయిన మరో అమ్మాయి కలిసి కాసేపు కబుర్లు చెప్పుకోవడం ఈ వీడియో. ‘నా గర్ల్‌ఫ్రెండ్ పేరు ఉష. కాని బతుకంతా చీకటి చేసి వెళ్లిపోయింది’ అని అతడంటే ‘నా బోయ్‌ఫ్రెండ్ పేరు ప్రకాశ్. అతను కూడా అంతే’ అని ఆమె అంటుంది. నా గర్ల్‌ఫ్రెండ్ కోసం అన్ని చేశాను అని ఇతడంటే నా బోయ్‌ఫ్రెండ్ కోసం ఇన్ని చేశాను అని ఈ అమ్మాయి అంటుంది. చివరకు కుర్రాడు బిల్ పే చేస్తాడు. కాని మగాడి బుద్ధి ఊరికే ఉండదు కదా. కలిసి టీ తాగిన పాపానికి ఫోన్ నంబర్ అడుగుతాడు. ఆ అమ్మాయి ఇస్తుంది. అతడు హుషారుగా తిరిగి వచ్చి మరసటి రోజు ఫోన్ చేస్తాడు. ట్విస్ట్ ఏమిటంటే అది రాంగ్ నంబర్. సరదాగా ఉన్న ఈ వీడియో పోస్ట్ అయిన నాలుగు రోజులకు పది లక్షల హిట్స్ దాటిపోయింది. బియాండ్ ది క్లౌడ్స్ – ట్రైలర్ నిడివి: 2 ని. 15 సె.; హిట్స్: 53,05,675 స్లమ్స్‌లో ఉండేవాళ్ల జీవితంపై పారలల్ సినిమాలు వచ్చాయి కానీ సీరియస్ కమర్షియల్ సినిమాలు రాలేదు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ తీసినది మన దర్శకుడు కాదన్న సంగతి మనకు తెలిసిందే. మన స్లమ్స్‌లో ఉన్నవాళ్ల జీవితాలను బిగువుగా చెప్పడానికి మరో పరాయి దర్శకుడు వచ్చాడు. మజిద్ మాజిది. సుప్రసిద్ధ ఇరాన్ దర్శకుడైన మజిద్ మాజిది తన ‘చిల్డ్రన్ ఆఫ్ హెవన్’, ‘ది సాంగ్ ఆఫ్ స్పారోస్’ వంటి గొప్ప సినిమాలు తీసి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అతడు ఇప్పుడు మొదటిసారిగా హిందీలో ‘బియాండ్ ది క్లౌడ్స్’ సినిమాతో రానున్నాడు. స్లమ్స్‌లో డ్రగ్స్‌ను చేరవేసే ఒక కుర్రాడి కథ ఇది. అతడు, అతడి ప్రియురాలు, కుటుంబం ఒక క్రైమ్‌లో ఎలా ఇరుక్కున్నారన్నది కథ. ఏ.ఆర్. రహెమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. విశాల్ భరద్వాజ్ మాటలు రాశాడు. కొత్త నటీనటులు ఉన్న ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఈ వారం విడుదలయ్యి కుతూహలం రేపుతోంది. చమక్ చమక్ చామ్ – రీమిక్స్ నిడివి: 5 ని. 58 సె.; హిట్స్: 16,08,006 మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ తన మేనమామ పాటలకు మెల్లగా హక్కుదారుడవుతున్నాడు. రామ్‌చరణ్, అల్లు అర్జున్ కంటే సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి తన సినిమాలలో వాడుతున్నాడు. గతంలో అతడు ‘అందం హిందోళం’, ‘గువ్వా గోరింకతో’ పాటలను రీమిక్స్ చేశాడు. తాజాగా ‘కొండవీటి దొంగ’లోని ‘చమక్ చమక్చామ్’ పాటతో ‘ఇంటిలిజెంట్’ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నిర్మితమైన ఈ సినిమాలో సాయి ధరమ్‌తేజ్ మాస్ క్యారెక్టర్ చేశాడని వినికిడి. మెగా అభిమానులను ఆకర్షించడంలో భాగంగా ‘చమక్ చమక్చామ్’ పాటను ఇందులో ఉపయోగించి ఉండొచ్చు. ఇళయరాజా చేసిన ఈ పాట గతంలో పెద్ద హిట్ అయ్యింది. స్టెప్స్ వేయడంలో చిరంజీవి పోలికలున్న సాయి ధరమ్ తేజ్ ఈ పాటనూ పండిస్తాడనే ఆశిద్దాం. యూట్యూబ్‌లో ఈ పాట 14 లక్షల హిట్స్‌కు చేరుకుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
దారి చూడు దుమ్ము చూడు మామ నిడివి : 3 ని. 12 సె; హిట్స్: 25,06,100 దారి చూడు దుమ్ముచూడు మామ దున్నపోతుల బేరి చూడు కమలపూడి కట్ట మింద కన్నెపిల్లల జోరె చూడు... జానపదంలో ఎప్పుడూ ఒక కిక్ ఉంటుంది. కవ్వించే శృంగారం ఉంటుంది. చెణుకులు విసిరే వయ్యారం ఉంటుంది. అది నింపుకున్న పాట ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. నాని నటిస్తున్న ‘కృష్ణార్జునయుద్ధం’ సినిమాలో ఒక జానపద గీతాన్ని రికార్డ్ చేసి విడుదల చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రకారుడు, గాయకుడు అయిన పెంచలదాసు రాసి పాడిన ఈ పాట సంగీత దర్శకుడు హిప్హాప్ తమిళ సంగీతంలో మంచి ఊపు తెచ్చేలా ఉంది. ‘కురస కురస అడవిలోన పిలగ కురిసినాది గాంధారివాన’ వంటి వాక్యాలు ఈ పాటలో కొత్త సొగసును తెచ్చేలా ఉన్నాయి. కథ ప్రకారం ఇందులో నాని చిత్తూరు జిల్లాకు చెందినవాడట. అందుకని ఆ ప్రాంతపు జానపదాన్ని పెట్టారు. రెండువారాల్లో ఇరవైలక్షలకు పైగా హిట్స్ సాధించిన పాట ఇది. గురుకులం– ది స్కూల్ నిడివి : 15 ని. 26 సె; హిట్స్: 1,41,730 తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ అవస్థ పడుతూనే ఉంటారు. బడి అంటే నాలుగుగోడలు ఉండే పాఠశాల కాదు ఈ విశాల ప్రపంచం కూడా బడే... దాని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది... పిల్లలు నేర్చుకుంటూనే ఉంటారు... అనే మెసేజ్‌తో తెలుగులో తయారైన షార్ట్ఫిలిమ్ ‘గురుకులమ్ ది స్కూల్’. ఇందులో నటుడు రాజీవ్ కనకాల ముఖ్యపాత్ర పోషించాడు. ఊరిలో చిన్న పనులు చేసుకుని బతికే రాజీవ్‌కు ఇద్దరు పిల్లలు ఉంటారు. పెద్దకొడుకు సరిగా చదవడం లేదని కంప్లయింట్స్ వస్తాయి. కాని ఆ పెద్దకొడుకు నిజంగా ఏ చదువు చదువుతున్నాడో తెలిసి ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో నామినేషన్లు అవార్డులు పొందిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ‘బాహుబలి’ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ దర్శకత్వం వహించాడు. పోస్టయిన మూడు నాలుగు రోజులకే సుమారు లక్ష హిట్స్ సాధించింది ఈ షార్ట్‌ఫిల్మ్. వెల్కమ్ టు న్యూయార్క్ నిడివి : 2 ని. 30 సె; హిట్స్: 2,05, 28,767 మన వైజాగ్ కుర్రాడు, అమెరికాలో స్థిరపడి స్పెషల్ ఎఫెక్ట్స్ రంగంలో పేరు గడించిన ‘చక్రి తోలేటి’ గతంలో కమలహాసన్ నటించిన ‘ఈనాడు’, తమిళంలో అజిత్ నటించిన ‘బిల్లా2’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తాజాగా అతడి రొట్టె విరిగి నేతిలో పడింది. హిందీలో పెద్ద కాస్టింగ్‌తో ‘వెల్కమ్ టు న్యూయార్క్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. పంజాబీ సూపర్‌స్టార్ దిల్జిత్, సోనాక్షి సిన్హా, బొమన్ ఇరానీ ముఖ్యపాత్రలు ధరిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు కరణ్ జొహర్ ముఖ్యపాత్ర పోషించాడు. అంతేకాదు రానా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి వాళ్లు కూడా ప్రత్యేక పాత్రలు పోషించారు. ఒక ఈవెంట్ షోలో పాల్గొనేందుకు ఇండియా నుంచి న్యూయార్క్ బయలుదేరిన దిల్జిత్, సోనాక్షి అక్కడ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు అనేది కథ. ఆద్యంతం హాస్యం నిండి ఉండే ఈ సినిమా ట్రైలర్ పోస్టయిన వారంలోనే రెండు కోట్ల హిట్స్‌ను దాటడం విశేషం. రంగస్థలం టీజర్ నిడివి : 1 ని. 3 సె; హిట్స్: 87,92,630 భిన్నమైన సినిమాలు తీస్తాడనే పేరు పొందిన సుకుమార్ తాజా సినిమా ‘రంగస్థలం’ కూడా భిన్నమైనదే అని టీజర్‌ని చూడగానే అర్థమైంది. రామ్ చరణ్ వంటి స్టార్ పల్లెటూరి మెకానిక్‌గా, చెవిటివాడుగా నటించడం విశేషమే కదా. నాటకంలో డైలాగ్ చెప్పడం ఎంత ముఖ్యమో ఎదుటివారి డైలాగ్ వినడం కూడా అంతే ముఖ్యం. అది వినపడకుండా నటుడిగా రాణించడం అసాధ్యం. రంగస్థలంలో రామ్‌చరణ్ స్టేజ్ నటుడని భోగట్టా. మరి చెవిటివాడు ఈ ఇబ్బందిని ఎలా అధిగమనించి రాణించాడనేది ఆసక్తికరమైన విషయమే. ‘మనల్ని అందరూ ఊళ్లో సౌండ్ ఇంజనీర్ అంటారు’ అనే డైలాగ్‌తో రిలీజైన ‘రంగస్థలం’ టీజర్ పోస్టయిన మూడు రోజుల్లో 80 లక్షల హిట్స్‌ను దాటేసింది. సమంత్, ఆది పినిశెట్టి, ప్రకాశ్‌రాజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సమ్మక్క–సారక్క పాట నిడివి : 1 ని. 2 సె. హిట్స్: 6,38,767 తలవంచని మేడరాజు తనయి జాతర అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర మూడొద్దుల ముత్తయిదువుల కోయ జాతర ఏడువందల ఏండ్ల జానపదుల జాతర భూమిని చీల్చిన పచ్చని చెట్టు జాతర రాజును ఎదిరించిన ధిక్కార జాతర... సమ్మక్క–సారక్క జాతర (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3) పురస్కరించుకుని డిజిటల్ చానల్ అయిన మైక్ టీవీ విడుదల చేసిన పాట ప్రోమో ప్రేక్షకులకు ఊపుతో పాటు జాతర పట్ల ఉద్వేగం కలిగించేలా ఉంది. గీత రచయిత కందికొండ రచించిన ఈపాటని యాంకర్ మంగ్లీ అభినయించగా మేడారం చుట్టుపక్కల చిత్రీకరించిన విజువల్స్‌తో పాట ఆకట్టుకుంటోంది. టీజర్‌కే ఐదు లక్షల హిట్స్ దాటిపోతే పూర్తి పాటకు ఇంకా ఆదరణ లభించే అవకాశం ఉంది. సమ్కక్క–సారలమ్మలకు తెలంగాణలో అందునా ముఖ్యంగా గిరిజన సంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. దాదాపు కోటిమందికి పైగా భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరిస్తారు. విందు జరుపుకుంటారు. రెండేళ్లకొకసారి వచ్చే ఈ జాతర కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఛోటే ఛోటే పెగ్ నిడివి : 2 ని. 49 సె. హిట్స్: 1,37,50,785 ఇద్దరబ్బాయిలు ఒకమ్మాయి కలిసి మందు మీద పాట పాడుకుంటే పార్టీకి ఇంతకుమించి డాన్స్ నంబర్ ఏం ఉంటుంది. యోయో హనీ సింగ్ మళ్లీ ప్రతాపం చూపాడు. ‘సోను కె టీటూ కే స్వీటీ’ సినిమా కోసం అతడు పాడిన ‘ఛోటే ఛోటే పెగ్’ పాట కోటి హిట్స్‌ను దాటేసింది. మందేద్దాం చిందేద్దాం అనే అర్థంలో సాగే ఈ పాటకు ఆదరణ జోరుగా ఉంది. టి–సిరిస్ నిర్మాణంలో తయారైన ఈ సినిమాకు ‘లవ్ రంజన్’ దర్శకుడు. కొత్త కుర్రాళ్లు నటించిన ఈ సినిమాలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒకతను ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. కాని ఆ అమ్మాయి అతడికి సరి కాదని రెండో స్నేహితుడు ఆ పెళ్లిని చెడకొట్టడానికి నిశ్చయించుకుంటాడు. పెళ్లికూతురికి ఈ సంగతి తెలిసి ఎలా చెడగొడతావో చూద్దాం అని తనూ రంగంలో దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా పాటలన్నింటికీ యూ ట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. చాలామంది తలా ఒక పాటకు సంగీతం అందించారు. వీటిలో యోయో హనీ సింగ్ చేసిన ‘ఛోటే ఛోటే పెగ్’కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. హజ్బెండ్ కీ హౌస్ పార్టీ (భర్త గారి హోమ్ ఎలోన్) నిడివి : 8 ని. 10 సె. హిట్స్: 9,21,978 భార్య ఊరికెళితే భర్తకు స్వాతంత్య్రం వచ్చినట్టు– అతడు అండమాన్ జైల్లో ఉన్నా సరే. భార్య ఊరికెళితే పార్టీ చేసుకుందామనుకున్న భర్త చివరికి ఏమయ్యాడనేది ఈ ప్రహసనం. హాస్య, వ్యంగ్య వీడియోలు తయారు చేసే ‘టివిఎఫ్’ సంస్థ తయారు చేసిన మరో షార్ట్ ఫన్నీ వీడియో ‘హజ్బెండ్ కి హౌస్ పార్టీ’. ఈ షార్ట్ వీడియోలో భార్య ఫ్రెండ్స్ దగ్గరకు వెళితే భర్త ఫ్రెండ్స్‌ని పార్టీకి పిలుస్తాడు. ఫోన్ చేసి విషయం కూపీ లాగిన భార్య భర్తకు ఆ పార్టీ చేసుకోవడానికి రకరకాల షరతులు పెడుతుంది. వచ్చిన వాళ్లే వంట పాత్రలు కడగాలంటుంది. సోఫాలు వాడకుండా కార్పెట్ మీద కూచోవాలంటుంది. బెడ్రూమ్లో అడుగుపెట్టడానికి వీల్లేదంటుంది. తీరా పార్టీకి ఫ్రెండ్స్ వచ్చే సమయానికి అత్తగారు ఊడిపడుతుంది. హాయిగా మందు కొడుతూ ఎంజాయ్ చేయాల్సిన ఫ్రెండ్స్ అత్తగారి ఎదుట కూచుని బుద్ధిగా బోజనం చేయడంతో ఈ షార్ట్ వీడియో ముగుస్తుంది. నిధి బిష్త్, బిస్వపతి సర్కార్ నటించిన ఈ వీడియో ఆరు రోజుల్లోనే దాదాపు తొమ్మిది లక్షల హిట్స్‌కు చేరుకుంది. ఇది డైలాగ్ ఆధారిత హాస్యం. సరదాగా ఉంటుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
టచ్ చేసి చూడు నిడివి : 31 సె., హిట్స్ : 25,35,578 ‘రాజా ది గ్రేట్’ హిట్ తర్వాత రవితేజా హుషారుగా ఉన్నాడు. అతడి రాబోయే సినిమా ‘టచ్ చేసి చూడు’ టీజర్ కూడా ఇంకా హుషారు కలిగిస్తోంది. ఈ టీజర్ పోస్టయిన రెండ్రోజుల్లోనే దాదాపు 25 లక్షల హిట్స్‌ను నమోదు చేసింది. ఏదో అల్లర్లు జరుగుతున్న చోట, గుర్రాల మీద ఉన్న పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమవుతూ ఉండగా రవితేజా ఒక మనిషిని గాల్లోకి ఎగురవేసి అల్లర్లు చేస్తున్న దుండగులపై విసిరేయడం ఈ టీజర్లో కనిపిస్తుంది. ఆగ్రహంగా సాహసంగా లెక్కలేనట్టుగా కనిపిస్తున్న రవితేజ లుక్స్ కూడా బాగున్నాయి. నల్లమోతు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకుడు. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ తమ అందచందాలతో ఆకట్టుకోనున్నారు. ఇంటర్ కేస్ట్ మేరేజ్ నిడివి : 11 ని. 14 సె., హిట్స్ : 2,74,576 భారతదేశంలో కులాల మధ్య పెళ్లిళ్ల విషయంలో వచ్చే అభ్యంతరాలను సబ్జెక్ట్స్‌కు అప్లై చేసి వినోదాత్మకంగా చెప్పిన షార్ట్ ఫిల్మ్ ‘ఇంటర్ కేస్ట్ మేరేజ్’. పోస్ట్ అయిన రెండు రోజుల్లోనే దాదాపు రెండున్నర లక్షల హిట్స్‌కు చేరుకుంది. ఇందులో అబ్బాయి పేరు ఫిజిక్స్. అమ్మాయి పేరు బయాలజీ. అబ్బాయి తండ్రి పేరు మేథ్స్. తల్లి పేరు తెలుగు. ప్రేమించుకున్న అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి తండ్రి దగ్గరకు వెళతారు. ఫిజిక్స్‌కు, బయాలజీకి ఎప్పుడూ లంకె కుదరవనీ రెండూ వేరు వేరు క్యాస్ట్స్ అని అభ్యంతరం చెబుతాడు తండ్రి. పైగా ‘గ్రావిటీకి వ్యతిరేకం ఏమిటి?’ అని అమ్మాయిని ప్రశ్నిస్తాడు. ‘బోయపాటి’ అని సమాధానం చెబుతుంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని నిరాకరించాల్సిందే అంటాడు తండ్రి. కాని ఏ మనిషి జీవితంలో అయినా ‘బయాలజీ’ ఉంటుందని స్నేహితుడు సర్దిచెప్పేసరికి తుట్టతుదకు అంగీకరిస్తాడు. సైన్స్ జార్గాన్ను వాడి హాస్యం తెప్పించడానికి ప్రయత్నించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు డైరెక్టర్ మసాలా సందీప్. సరదాగా చూడదగ్గ షార్ట్‌ఫిల్మ్ ఇది. ‘చాయ్ బిస్కెట్’ సమర్పణ. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పిల్లనీ కాదు.. పెంకునీ కాదు కేటీ పెర్రీ : హె హె హె ::: నిడివి : 3 ని. 45 సె. ::: హిట్స్ : 1,53,05,223 ఆమెరికన్ పాప్ స్టార్లెట్.. కేటీ పెర్రీ ఈ వీడియోలో మీకు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి ఆమెను ఆమె ఊహించుకున్న పాత్ర.. మ్యారీ ఆంటోనెట్! రెండోది ఆమె నుంచి ఆమెను బయట పడేసే పాత్ర.. జోన్ ఆఫ్ ఆర్క్. మ్యారీ ఆంటోనెట్ ఫ్రాన్స్ సామ్రాజ్యపు చిట్టచివరి మహారాణి. జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రాన్స్ దేశపు ‘నూరేళ్ల యుద్ధం’లో హీరోయిన్. మ్యారీ ఆంటోనెట్ వేష ధారణలో.. ఇష్టం లేని పెళ్లి నుంచి ఫ్రీడమ్ కోసం పరితపిస్తూ ఉంటుంది కేటీ పెర్రీ. అందుకు కారణం.. ఆమెను వలచి ఎత్తుకొచ్చిన వరుడు రాజప్రాసాద వరాహంలా ఉంటాడు. నిన్ను రాణిలా చూసుకుంటానంటాడు. ఎందుకు వింటుంది! మనసే లేకపోయాక?! ‘హె హె హె.. యు థింక్ దట్ ఐయామ్ ఎ లిటిల్ బేబీ. యు థింక్ దట్ ఐయామ్ ఫ్రాజైల్ లైక్ ఫ్యాబర్జే..’ (నువ్వనుకుంటున్నావ్ నేనో చిన్న పిల్లనని. నువ్వనుకుంటున్నావ్ కోడిగుడ్డు పెంకులా నేను పెళుసనీ..) అని కేటీ పాడుతుంది. కోపం వచ్చి కేటీ తల నరికేయిస్తాడు వరుడు. నేల రాలిన మ్యారీ ఆంటోనెట్ తలను చేతికి ఎత్తుకుని, కత్తితో జోన్ ఆఫ్ ఆర్క్ ప్రత్యక్షం అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్ ప్రిన్స్ గారి తలను జోన్ ఆఫ్ ఆర్క్ తెగ నరికేయడం. వీడియోలో లాస్ట్ సీన్ ఇది. కానీ కనిపించదు! ‘శివ’ మూవీలో రాం గోపాల్ వర్మ మర్డర్లు చేయిస్తాడు కానీ చూపించడు. బ్లడ్‌కి బదులు స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపో తుంది. అలా అన్నమాట. సాంగ్ బాగుంది. ఊహలున్న ఆడపిల్లలు చూడాలి. రెక్కలొచ్చేస్తాయి వాళ్లకి. వెరీ ఇన్స్పైరింగ్. రెండు క్యారెక్టర్లలో కేటీ కాస్ట్యూమ్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. రెప్పపాటులో గ్రేట్ రాబరీ ఓషన్’స్ 8 : ఫస్ట్ ట్రైలర్ ::: నిడివి : 2 ని. 31 సె. ::: హిట్స్ : 84,24,344 వార్నర్ బ్రదర్స్ ఎట్టకేలకు ‘ఓషన్’స్ 8’ ఫస్ట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. శాండ్రా బుల్లక్.. నారింజ రంగులో ఉండే ఖైదీల జంప్‌సూట్‌లో కూర్చొని, ‘‘నన్ను కనుక విడుదల చేస్తే, బయటి ప్రపంచంలోకి వెళ్లాక సాధారణ జీవితం గడుపుతాను’’ అని ప్రమాణం చేయడంతో ట్రైలర్ మొదలౌతుంది. ఇమీడియెట్ సీన్లో.. శాండ్రా, తన దోపిడి ముఠాతో కలిసి న్యూయార్క్ సిటీలో యేటా జరిగే ‘మెట్ గాలా’ నుంచి 150 మిలియన్ డాలర్ల ఖరీదైన ఆభరణాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేస్తుంటుంది! ‘ఎందుకు నువ్విలా చేస్తున్నావ్?’ ఓ క్యారెక్టర్ ఆమెను అడిగితే ‘నాకు బాగా తెలిసిన పని కాబట్టి’ అంటుంది శాండ్రా! ఎనిమిది మంది ఆడవాళ్లు సభ్యులుగా ఉండే ఈ దోపిడి ముఠా కామెడీ మూవీ ఓషన్’స్ 8 వచ్చే ఏడాది జూన్ 8న విడుదల అవుతోంది. ఓషన్స్ 11 (2001), ఓషన్స్ 12 (2014), ఓషన్స్ 13 (2007)ల ఓషన్స్ ట్రయాలజీకి సీక్వెల్‌గా వస్తున్న ఓషన్’స్ 8 వస్తోంది. ట్రయాలజీలో మొదట వచ్చిన మూవీలోని డ్యానీ ఓషన్ అనే కల్పిత పాత్రను ఈ సీరీస్‌లో ప్రతి సినిమా టైటిల్లోనూ కొనసాగిస్తున్నారు. ఆ డ్యానీ ఓషన్ చెల్లెలిగానే ఓషన్’స్ 8 లో మన దోపిడి ముఠా నాయకురాలు శాండ్రా బులక్ నటిస్తున్నారు. రాక్షస నగరాల ఫిక్షన్, యాక్షన్ మోర్టల్ ఇంజిన్స్: టీజర్ ట్రైలర్ ::: నిడివి : 1 ని. 29 సె. ::: హిట్స్ : 31,24,363 రిలీజ్‌కు ఇంకా ఏడాది టైమ్ ఉండగనే, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మోర్టల్ ఇంజిన్’ టీజర్ విడుదలైంది! ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘హాబిట్’, ‘కింగ్ కాంగ్’ చిత్రాల నిర్మాత పీటర్ జాక్సన్ తీస్తున్న మరో గ్రాండ్ ఎపిక్ ఇది. డైరెక్టర్ క్రిస్టియన్ రివర్స్. పెద్ద నగరాలు చిన్న నగరాలను తినేయడం థీమ్! ఆ తినేయడం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఈ టీజర్లో చూస్తారు. అలాగే ఓ అందమైన అమ్మాయి (28 ఏళ్ల ఐస్‌ల్యాండ్ హెరా హిల్మర్) నటి కళ్లను కూడా. అయితే ఆ కళ్లలో ఆందోళన మాత్రమే మీకు కనిపిస్తుంది. మీద పడి మింగేయబోతున్న ‘ట్రాక్షన్ సిటీ’ (కదిలే యంత్రం వంటి రాక్షస నగరం) నుంచి తను పుట్టిన ఊరిని, ఊరివాళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె అలా కనిపిస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? వెయ్యేళ్ల క్రితం సంభవించిన ఒక విపత్తులో భూగోళం మొత్తం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయి కొత్త జనరేషన్ పుట్టుకొస్తుంది. కొత్త టెక్నాలజీతో కూడా! దాంతో మానవ జీవనం రూపురేఖలే సమూలంగా మారిపోతాయి. మూవీంగ్ సిటీస్ తయారౌతాయి. టెక్నాలజీ అక్కడితో ఆగదు. వార్కి దారితీస్తుంది. పెద్ద సిటీస్ చిన్న పట్టణాలను పొట్టన పెట్టుకోడానికి బయల్దేరతాయి. ఈ ఆధిక్యపోరులో చివరికి టెక్నాలజీ గెలుస్తుందా? మనిషి గెలుస్తాడా అన్నదే స్టోరీ. సినిమా రిలీజ్ వచ్చే ఏడాది డిసెంబర్ 14న. వెక్కిళ్లు లేకుంటే అదొక జీవితమా?! హిచ్కీ: ట్రైలర్ ::: నిడివి : 2 ని. 31 సె. ::: హిట్స్ : 1,09,68,198 రాణీ ముఖర్జీకి టీచర్‌గా చేయడం ఇష్టం. అసలు అందుకోసమే పుట్టానంటుంది. కానీ రెండు మాటలు కూడా సరిగ్గా పలకలేదు. నిజానికి అవి మాటల్లా కూడా ఉండవు. వెక్కిళ్లలా ఉంటాయి. ఏదో న్యూరో డిజార్డర్! పెద్ద స్కూల్లో టీచర్‌గా జాయిన్ అవుతుంది. వాళ్లయినా ఎలా ఇస్తారు.. అలాంటి ఆవిడకు టీచర్ పోస్టు? ఇచ్చారు! ఒక్క ఛాన్స్ ఇస్తున్నట్టుగా ఇచ్చారు. ‘ప్రూవ్ చేసుకుంటే ఉంటావ్. లేదంటే ఉండడం కష్టం’ అని. రాణీ ముఖర్జీ తనని తాను నిరూపించుకుంటుంది. బ్యాడ్ స్టూడెంట్స్‌ని కూడా గుడ్ స్టూడెంట్స్‌గా మార్చేస్తుంది. తొలిరోజు క్లాస్‌లోకి రావడంతోనే ఈ టీచరమ్మకు కష్టాలు మొదలౌతాయి. ఎలాంటి కష్టాలో.. ట్రైలర్లో మీరే చూడండి. సిద్ధార్థ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ‘యశ్‌రాజ్ ఫిల్మ్’ బ్యానర్ కింద మనీష్ శర్మ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 23న మూవీ రిలీజ్ అవుతోంది. ‘మర్దానీ’ (మగతనం) తర్వాత దాదాపు మూడేళ్లకు మళ్లీ ఈ పిక్చర్తో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు రాణీ ముఖర్జీ. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
వ్రూమ్.. వ్రూమ్.. వ్రూమ్! మీగోస్, నిక్కీ మినాజ్, కార్డీ బి: మోటార్‌స్పోర్ట్ నిడివి : 5 ని. 17 సె. హిట్స్ : 86,84,215 ముగ్గురు అబ్బాయిల్ని ఇద్దరు అమ్మాయిలు నిర్దాక్షిణ్యంగా తొక్కి తైతక్కలాడే ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ‘మీగోస్’ అన్నది ముగ్గురు అమెరికన్ మగ రాయుళ్ల హిప్ హాప్ బ్యాండ్. నిక్కీ మినాజ్, ‘కార్డీ బి’ అమెరికన్ ఫిమేల్ సింగర్లు. ఈ ఐదుగురి న్యూ సింగిల్ ట్రాక్ ‘మోటార్‌స్పోర్ట్’. నిక్కీ మినాజ్ అయితే ‘నీ మొహం మండా’ అని తిట్టినట్లే చూస్తుంది! అసలేంటి వీళ్ల గొడవ? ఎక్స్పెన్సివ్ కార్లలో షికార్లు కొడుతుంటారు. సెటైర్లతో అబ్బాయిల్ని కుమ్మేస్తుంటారు. డెయిలీ కమ్యూట్‌కి ఇది థీమ్ సాంగ్ అనుకోండి. హైదరాబాద్‌లో కొత్తగా స్టార్ట్ అయిన మెట్రో రైల్లో ఇటు వెళ్తూ ఒకసారి, ఇటూ వస్తూ ఒకసారి అమ్మాయిలు డాన్స్ చేస్తూ, అబ్బాయిల్ని టీజ్ చేస్తున్నట్లు ఊహించండి. ఆ ఊహను పిక్చరైజ్ చేస్తే ఎలా ఉంటుండో... అలా ఉంది వీళ్ల సాంగ్ అండ్ డాన్స్. వ్రూమ్.. వ్రూమ్.. వ్రూమ్ అంటూ పిచ్చెక్కించేస్తున్నారు నిక్కీ, కార్డీ. బిట్టు.. బిట్టు.. దాహపు బొట్టు యూట్యూబ్రీవైన్డ్: ది షేప్ ఆఫ్2017 నిడివి : 7 ని. 14 సె. హిట్స్ : 10,31,12,555 ఇయర్ రౌండప్స్ స్టారై్టపోయాయి! యూట్యూబ్ కూడా తన రీవైండ్ని ఈ మిడ్ వీక్‌లో విడుదల చేసింది. ఆ రీవైండే ఈ వీడియో. 2017లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండి, వైరల్ అయిన ఈ మ్యూజిక్ వీడియోల సంకలనాన్ని వీక్షించినవారి సంఖ్య ఈ నాలుగు రోజులకే 10 కోట్లు దాటిపోయింది. ఇండియా నుంచి బిబి కి వైన్స్, వ్లోగర్ శృతి అర్జున్ ఆనంద్, కామెడీ కలెక్షన్ ఎ.ఐ.బి.లకు ఇందులో చోటు దక్కింది. అంతర్జాతీయంగా చూస్తే, ‘ఫిడ్జెట్ స్పిన్నర్స్’ నుంచి ‘స్లైమ్’ వరకు, ‘డెస్పసీటో’ నుంచి ‘షేప్ ఆఫ్ యు’ వరకు, ఇంకా.. బిబిసి ఇంటర్వ్యూలోని చిన్న ముక్క ‘కిడ్స్ హు క్రాష్డ్ దెయిర్ ఫాదర్స్ ఇంటర్వ్యూ’ కూడా రీవైండ్లో ఉన్నాయి. ‘సాక్షి’ ఫ్యామిలీలో ఏడాదికి పైగా ప్రతి సోమవారం వస్తున్న ‘యూట్యూబ్ హిట్స్’లోని వీడియోలలో కొన్నింటిని కూడా మీరు ఈ రీవైండ్లో పైపైన ఒకసారి చూడొచ్చు. ‘ది బెగ్గెస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ హిస్టరీ’గా నిలిచిన ‘డెస్పసీటో’ సాంగ్‌తో వీడియో మొదలౌతుంది. బిగ్గెస్ట్ డెబ్యూగా టేలర్ స్విఫ్ట్ ‘లుక్ వాట్ యు మేడ్ మీ డు’ ప్లే అవుతోంది. ఒక జిరాఫీ తన బిడ్డకు జన్మనిచ్చే భారమైన సుదీర్ఘ క్షణాలను కూడా యూట్యూబ్ దీనికి యాడ్ చేసింది. ఇక ‘స్లో–మో’ కొల్లీషన్ని ఎవరు మర్చిపోగలరు? పట్టాలపై పేరుకుపోయిన మంచుగడ్డల్ని దుమ్ములా రేపుకుంటూ ట్రైన్ దూసుకువచ్చే దృశ్యం అది. బిట్టు బిట్టు దాహపు బొట్టులా ఉంది చూడండి. డైనోసార్స్ మళ్లీ వస్తున్నాయి జురాస్సిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ నిడివి : 2 ని. 26 సె. హిట్స్ : 2,55,51,886 మితి మీరిన సంతతితో అదుపు తప్పిన డైనోసార్స్ కొన్ని.. ‘జురాస్సిక్ వరల్డ్’ అనే యానిమల్ థీమ్ పార్క్‌ను ధ్వంసం చేస్తాయి. ఆ విధ్వంసంలో కొన్ని డైనోసార్స్ చనిపోగా కొన్ని బతికి బట్టకడతాయి. ఆ తర్వాత, నాలుగేళ్లకు అక్కడికి సమీపంలోని ‘ఐలా నుబ్లార్’ దీవిలోని అగ్నిపర్వతాలు బద్దలై, ఆ జ్వాలా ప్రవాహంలో డైనోసార్స్ భస్మమైపోతుంటాయి. వాటిని కాపాడటం కోసం క్లెయిర్ డియరింగ్ అనే పూర్వపు పార్క్ మేనేజర్ నడుం బిగిస్తుంది. అప్పటికే ఆమె ‘డైనోసార్ ప్రొటెక్షన్ గ్రూప్’ అని ఒక ఆర్గనైజేషన్‌ని నడుపుతుంటుంది. ఆమెకు సహాయంగా ఒవెన్ గ్రేడీ అనే డైనోసార్ శిక్షకుడు పనిచేస్తుంటాడు. ఇద్దరూ కలిసి డైనోసార్స్ అంతరించిపోకుండా ఉండడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతారు. అది ఎంత ప్రాణాంతకమైన సాహసమో ఈ ట్రైలర్లో మీరు కనిపిస్తుంది. 2015 నాటి జురాస్సిక్ వరల్డ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ వచ్చే ఏడాది జూన్ 22న విడుదల అవుతోంది. మాటలు రావే ఎలా?! ఎవ్రీ ఇంట్రావర్ట్ అమ్మాయి ఎవర్ ‘ గర్ల్ ఫార్ములా నిడివి : 6 ని. 38 సె. హిట్స్ : 1,67,631 లోపల భావాల బ్లాస్టింగ్. పైన బ్లాంక్ ఫేసింగ్. ఎలా ఈ అమ్మాయిలు ఇలా ఉంటే? ఎలా బతుకుతారు ఈ పాడు లోకంలో? బాయ్‌ఫ్రెండ్ వస్తానన్నాడు. వచ్చాక వాణ్ణెలా ఇంప్రెస్ చెయ్యాలి? డ్రెస్తోనా? పెర్ఫ్యూమ్తోనా? విద్య రెండు వేలు అప్పు తీసుకుంది. తిరిగి ఇవ్వదే! మర్చిపోయినట్లుంది. అడుగుదామా వద్దా. ఊ.. వద్దులే. అమ్మో! వీడొచ్చాడు దేవుడా! చేతిలో చెయ్యేసిగానీ మాట్లాడడు. (‘కొంచెం మమ్మల్నీ పట్టించుకుంటుండండీ, మాకూ టైమ్ ఇస్తుండండీ..’) హమ్మయ్య. వెళ్లిపోయాడు. బతుకు జీవుడా! నైస్ కాన్సెప్ట్! ‘బుక్ అవ్వకూడదంటే.. మనసుకు మేకప్ చెయ్యకూడదు. సో.. వేకప్ గర్ల్స్’ అనే థీమ్‌తో ఈ వారం యూట్యూబ్‌లో ‘గర్ల్ ఫార్ములా’ ఛానెల్ అప్లోడ్ చేసిన ఈ వీడియో ఓస్సమ్. బాయ్స్ అండ్ గర్ల్స్. రెగ్యులర్‌గా ఈ ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. మనసులో ఉన్నది ధైర్యంగా మాటల్లోకి వచ్చేస్తుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు డెమీ లొవాటో : టెల్ మీ యు లవ్ మీ నిడివి : 6 ని. 47 సె., హిట్స్ : 1,23,18,780 లవ్ బ్రేక్ అయినప్పుడు ఎవరు ఎక్కువ బాధపడతారు? అమ్మాయా? అబ్బాయా? లవ్ బ్రేక్ అయ్యాక, మళ్లీ దగ్గర కావాలని ఎవరు ఎక్కువ ఆరాటపడతారు? అబ్బాయా? అమ్మాయా? డెమీ లొవాటో కొత్త వీడియో ట్రాక్‌లో మాత్రం ‘టెల్ మీ యు లవ్ మీ’ అని అమ్మాయే అంటుంది. ‘నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు..’ అని వాడిని మనసులోనే వెయ్యిసార్లు వేడుకుంటుంది. అది వాడికెలా తెలుస్తుంది? లవ్‌లో ఉన్నప్పుడే ఆమెను తెలుసుకోలేకపోయాడు. లవ్ బ్రేక్ అయ్యాక తెలుసుకుంటాడా? అసలు బ్రేక్ అవడానికే కారణమే వాడు కదా! వీడియోలో మీకు కనిపించే ఆ ‘వాడు’ జెస్సీ విలియమ్స్. సాంగ్ వెంటనే స్టార్ అవదు. కొన్ని సీన్లు ఉంటాయి. ‘కపుల్–వై’ ఈవెంట్స్, ప్రపోజల్, మేక్–అవుట్ సెషన్స్, లాస్ట్‌లో లవర్స్ ఫైటింగ్. ఆ ఫైటింగ్ ఎందుకవుతుందంటే.. మధ్యలోకి ఎరిక్ అనేవాడు వచ్చేస్తాడు. డైరెక్టుగా రాడు. ఆ అమ్మాయి ఫోన్లోకి వచ్చేస్తాడు. ‘హూ ఈజ్ హీ?’ అంటాడు జెస్సీ. నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అని అక్కడితో ఆగదు, ‘జెలస్ ఫీల్ అవుతున్నావా?’ అంటుంది. జెస్సీకి కోపం వస్తుంది. లవర్స్‌గా ఉన్నప్పుడే మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తే మండిపోతుందే, పెళ్లి ఫిక్స్ అయి, భార్యాభర్తల్లా ఉంటున్నప్పుడు ఎంటర్ అయితే మనసు దహించుకుపోదా? ముçహూర్తం రోజు వస్తుంది. పాస్టర్ పెళ్లి జరిపిస్తాడు. కానీ జెస్సీ మూడీగా ఉంటాడు. మెల్లిగా లొవాటో దగ్గరకు వెళ్లి, ఆమె తన వేలికి తొడిగిన ఉంగరాన్ని తీసి, ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. లొవాటో గుండె బద్ధలైపోతోంది. లొవాటో 25 ఏళ్ల అందమైన అమెరికన్ గాయని. ఇక జెస్సీ హాలీవుడ్ యాక్టర్. చక్కటి జంట. వాళ్లు బ్రేకప్ అవడం ఏమో కానీ.. మన మనసుకు బాధగా అనిపిస్తుంది.. ఒక రిలేషన్ పాడైపోవడం. గట్టి పిల్లే.. కాస్త ఎమోషనల్ అయింది సెలెనా గోమెజ్ టియర్ఫుల్లీ యాక్సెప్ట్స్ నిడివి : 2 ని. 21 సె., హిట్స్ : 34,32,541 ‘బిల్బోర్డ్’ యు.ఎస్.లో పెద్ద పేరున్న ఎంటర్టైన్మెంట్ మేగజైన్. ఆ పత్రిక ఏటా రకరకాల కేటగిరీలలో ‘బిల్బోర్డ్ మ్యూజిక్’ అవార్డులు ప్రకటిస్తుంటూంది. ఈ ఏడాది అమెరికన్ సింగర్, నటి సెలెనా గోమెజ్ ఎంపిక అయ్యారు! రెండు రోజుల క్రితం ‘బిల్ బోర్డ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంటూ స్టేజ్ మీద ఉబికి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోడానికి చాలా ప్రయత్నించారు సెలెనా. ‘యాక్సెప్టెన్స్ స్పీచ్’లో ఆమె ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. ఈ అవార్డు తనకు రావలసింది కాదు, ఫ్రాన్సియా రైజియాకు రావలసింది అన్నారు! ఫ్రాన్సియా ఆమె కన్నా నాలుగేళ్లు పెద్ద స్నేహితురాలు. అమెరికన్ నటి. ఈ రెండింటినీ మించి, సెలెనాకు ప్రాణదాత! అవును. గత అక్టోబర్‌లో సెలెనాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఆమెకు కిడ్నీ ఇచ్చింది ఫ్రాన్సియానే. తనెంతో అదృష్టవంతురాలిననీ, తన కన్నా పెద్దవాళ్లైన స్త్రీలందరినీ మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ చేస్తున్నాననీ అన్నారు సెలెనా. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పడు ఆమె గుండె నిబ్బరానికి మనమూ ఎమోషనల్‌గా ఫీలైపోతాం. కన్నీళ్లను పక్కన పెట్టి చూస్తే ఎంత మెచ్యూర్డ్‌గా ఉందీ పిల్ల! సూర్యా గ్యాంగ్‌లో శివగామి తాన సెరన్ద కూట్టమ్ : ట్రైలర్ నిడివి : 1ని. 14 సె. హిట్స్ : 59,85,968 సూర్య కొత్త మూవీ ‘తాన సెరన్ద కూట్టమ్’ ట్రైలర్.. సౌత్‌ని చిందులు వేయిస్తోంది. యోగ్యులు అక్కడే ఉంటారు. అయోగ్యలు ఎక్కడికో పోతారు.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది. లేనివాళ్లను దోచుకుని ఉన్నవాళ్లయిపోయిన పెద్ద మనుషుల్ని దోచుకునే హీరో.. ఇందులో సూర్య. అతడికో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో రమ్యకృష్ణ, సత్యన్ శివకుమార్ (త్రీ ఇడియట్స్‌లో సెలెన్సర్) ఉంటారు. ‘మన మనసు మంచిదైతే, మంచి మనసుతో మనం ఏదైనా పని చేస్తే.. ’ అంటూ ట్రైలర్ చివర్లో సూర్య ఏదో చెప్పబోతుంటే రమ్యకృష్ణ దగ్గుతుంది. దాన్ని బట్టి ఇదేదో మంచి పని చేయబోతున్న దొంగల ముఠా అనే డౌట్ వస్తుంది. సంక్రాంతికి గానీ అసలు కథేమిటో తెలీదు. జనవరి 12న పిక్చర్ రిలీజ్. హీరోయిన్ కీర్తీ సురేశ్. ట్రైలర్లో ఒక చోట చార్మినార్ కూడా కనిపిస్తుంది. అంటే.. ఇది తెలుగులోకి కూడా రీమేక్ అవుతోందన్నమాట! మాట కాదు. నిజమే. తెలుగులో ‘గ్యాంగ్’ అని పేరు పెట్టారు. ‘తాన సెరన్ద కూట్టమ్’ అన్నా కూడా అర్థం అదే.. ‘సొంత ముఠా’ అని. కుర్రాడికి ఎంత కష్టమొచ్చిందీ! లవ్, సైమన్ : ట్రైలర్ నిడివి : 1 ని. 51 సె. హిట్స్ : 27,01,971 సృష్టిలోంచి ప్రేమను మైనస్ చేసేస్తే, ఏమీ మిగలదు. శూన్యం తప్ప. సృష్టి విరుద్ధమైన ప్రేమను బయటికి చెప్పుకుంటే చుట్టూ ఒక్కరూ మిగలరు. మనోవేదన తప్ప. సైమన్ స్పియర్ 17 ఏళ్ల కుర్రవాడు. ఆన్లైన్లో ఒక అబ్బాయిని ప్రేమిస్తాడు. అంటే ‘గే’! ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేడు. తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ సతమతం చేస్తుంటూంది. అయినా తన లవ్‌ని కొనసాగిస్తూంటాడు. ఆ ఆన్లైన్ లవర్.. సైమన్ క్లాస్మేటే. అయితే ఆ క్లాస్మేట్ ఎవరో మాత్రం సైమన్కి నేరుగా తెలీదు. కానీ గాఢంగా ప్రేమిస్తుంటాడు. సైమన్ ఎవరో గే లవర్‌తో చాట్ చేస్తున్నాడని కొందరికి తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చెయ్యడం ప్రారంభిస్తారు. బ్లాక్ మెయిల్స్ నుంచి, లవ్ మెయిల్స్ నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తుంటాడు సైమన్. వీడియోలో సైమన్‌ని చూస్తే జాలేస్తుంది! ఏంట్రా నాయనా ఈ పిల్లాడికి ఇంత కష్టం అనిపిస్తుంది. లవ్‌ని అర్థం చేసుకోవడం కష్టం. ‘గే’ లవ్ అర్థం కావడం ఇంకా కష్టం. ఈ కష్టమంతా మైల్డ్ హాలీవుడ్ కామెడీ డ్రామాగా వచ్చే ఏడాది మార్చి 16న విడుదల అవుతోంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పలీనా పుపోవా.. ఫ్రమ్ రష్యా మిస్ వరల్డ్ 2017 ఇంట్రడక్షన్ అండ్ డాన్సెస్ నిడివి 5 ని. 45 సె. హిట్స్ 16,06,750 హరియాణా అమ్మాయి మానుషీ షిల్లర్ నవంబర్ 18న మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. టైటిల్ ప్రకటన ఈవెంట్‌కు ముందు ఇంట్రడక్షన్ పార్టే ఈ వీడియో. అమ్మాయిలు ఒక్కొక్కరూ వచ్చి పేరు, దేశం పేరు చెప్పుకుంటున్నారు. మన అమ్మాయీ వచ్చింది. ‘ఐయామ్ మానుషీ షిల్లర్, రిప్రజెంటింగ్ ఇండియా’ అని చెప్పింది. తర్వాత దేశదేశాల డాన్సులు. మన దేశం వంతు వచ్చినప్పుడు మానుషీ షిల్లర్ ఓ బాలీవుడ్ సాంగ్‌కి డాన్స్ వేసింది. ఇదంతా టీవీలో చూడలేకపోయినవారు ఈ వీడియోలో చూడొచ్చు. చిన్న గుసగుస. వీడియో చూసినవాళ్లు ఇందులో రష్యా అమ్మాయే అందరికన్నా బాగుంది అంటున్నారట! డాన్స్‌లలో చైనా డాన్స్ బాగుందట! బాగోవడం, బాగోలేకపోవడం కాదు కానీ.. ప్రతి దేశానికీ ఒక అందం ఉంది. ఒక చందం ఉంది. దేనికదే గ్రేట్. నాన్నా.. నేనొస్తున్నా... ఎ రింకిల్ ఇన్ టైమ్: ట్రైలర్ నిడివి 2 ని. 24 సె. హిట్స్ 22,30,955 మెగ్ ముర్రే ఒక సైంటిస్ట్ కూతురు. వయసు 14. పిల్ల బ్రిలియంట్! తండ్రి ఆస్ట్రోఫిజిసిస్ట్. ఖగోళ పరిశోధనలేవో చేస్తూ ఆయన ఏ దుష్ట గ్రహానికో బందీగా చిక్కుతాడు. దుష్టగ్రహం అంటే.. గ్రహం దుష్టురాలు అని కాదు. ఆ గ్రహంలో ఒక దుష్టశక్తి ఉంటుంది. అదే ఆయన్ని తన గ్రిప్‌లోకి తీసుకుంటుంది. ఇది తెలిసి మెగ్ ముర్రే విషాదంలో మునిగిపోతుంది. స్టడీస్ మీద ధ్యాస పెట్టలేదు. టీచర్ గమనించి, ‘ఫైట్ ఫర్ యువర్ డాడ్.. బేబీ’ అంటుంది. ఈ అమ్మాయి ఇంటెలిజన్స్ మీద ఆ టీచర్‌కి అంత నమ్మకం. మెగ్ ముర్రే డిసైడ్ అయిపోతుంది, ఎలాగైనా డాడీని కాపాడుకోవాలని. ముర్రేకి ఒక తమ్ముడు ఉంటాడు. వాడు ఇంకా షార్ప్. ఎంతైనా సైంటిస్టుల ఫ్యామిలీ కదా! వాడి పేరు చార్ల్స్ వాలెస్. వీళ్లద్దరికీ కాల్విన్ ఒకీఫ్ అనే క్లాస్మేట్ తోడవుతాడు. ఇప్పటికి ముగ్గురయ్యారు కదా, ఇంకో ముగ్గుర్ని జత చేసుకుంటారు. ఆ ముగ్గురూ ఆస్ట్రల్ ట్రావెలర్స్. మిసెస్ విచ్, మిసెస్ హూ, మిసెస్ వాట్స్ఇట్. అంతా కలిసి ఆరుగురు అవుతారు. విశ్వాంతరాళాల్లోకి వెళ్లిపోయి ఆ సైంటిస్టును కాపాడతారు. 2018 మార్చి 9న విడుదల అవుతున్న సైన్స్ ఫ్యాంటసీ హాలీవుడ్ అడ్వెంచర్ ఫిల్మ్ స్టోరీ ఇది. ఈ మూవీ ట్రైలర్‌ని డీస్నీ విడుదల చేసింది. మిసెస్ విచ్గా విశ్వవిఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే మీకు ఇందులో కనిపిస్తారు. ఇంకా చాలా వండర్స్ కనిపిస్తాయి. పులి బతికే ఉంది భయ్యా స్వాగ్ సె స్వాగత్ సాంగ్: టైగర్ జిందా హై నిడివి 2 ని. 49 సె. హిట్స్ 2,96,76,301 సల్మాన్, కత్రీనాల కొత్త మూవీ ‘టైగర్ జిందా హై’లోని ‘స్వాగ్ సె స్వాగత్’ యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. స్పెక్టాక్యులర్ అనుకోండి! సల్మాన్ యంగ్ లుక్‌తో ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అవును బాస్! ఫార్ బెటర్ దేన్ హిజ్ హీరోయిన్. ఇషాద్ కామిల్ పాటను రాస్తే, విశాల్–శేఖర్ కంపోజ్ చేశారు. దద్లానీ, నేహా పాడారు. పాటను గ్రీస్‌లోని ఒక దీవిలో షూట్ చేశారు. బాలరీనాలు (ఉమన్ డాన్సర్స్), హిప్–హాప్, ఆఫ్రో డాన్స్ హాల్ పెర్మార్మెన్స్ మొత్తం వంద మందిని గ్రీస్, ఫ్రాన్స్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నుంచి ఎంపిక చేసుకుని డాన్స్ చేయించారు. ‘ఏక్ థా టైగర్’ సీక్వెల్‌గా దాదాపు ఐదేళ్ల తర్వాత వస్తున్న ‘టైగర్ జిందా హై’ డిసెంబర్ 22న గాండ్రించబోతోంది. ఈ వీడియోలో సల్మాన్, కత్రీనా కంబైండ్‌గా ఒక ప్రేమ సందేశాన్ని వినిపించేందుకు ప్రపంచానికి స్వాగతం పలుకుతారు. ప్రేమ లేకుండా జీవితంలో ఏదీ లేదని మీనింగ్. కుచ్ నహీ, కుచ్ నహీ ఇష్క్ సే బెహ్తార్ అని కూడా. సాంగ్ అద్దిరిపోయిందబ్బా! తిక్క మొగుడు తింగరి పెళ్లాం పింక్ – బ్యూటిఫుల్ ట్రామా నిడివి 4 ని. 57 సె. హిట్స్ 1,34,80,670 ఈ వీడియోలో మెయిన్‌గా మీకు పింక్ కలర్ కనిపిస్తుంది. బ్లూస్, గ్రీన్స్ కూడా. హౌస్‌వైఫ్, ఆమెగారి భర్త.. తీరిక వేళల్లో 1960ల నాటి శకలన్నీ పడుతూ ఉంటారు. ఇంటి పనితో ఆమెకు, పేపర్ రీడింగ్‌తో ఆయనకు తెల్లారుతుంది. (ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఈ సీన్ మారదేమో!) తర్వాత ఆయన ఆమె గౌను, ఆమె ఆయన సూట్ వేసుకుని డాన్స్ చేస్తుంటారు. మద్యాన్ని సేవించి.. ‘మై లవ్.. మై లవ్.. మై లవ్..’ అంటూ ఒకరిపై ఒకరు తూలిపడుతుంటారు. ఆమె ఆయన కాళ్లూ చేతులు కట్టేసి, కొట్టడానికి కొరడా తీసుకుంటుంది. ప్రఖ్యాత హాలీవుడ్ డాన్స్ పార్ట్నర్స్ ఫ్రెడ్ ఆస్టయిర్, జింజర్ రోజర్స్‌కు గౌరవ నివాళిగా చానింగ్ టేటమ్ (భర్త), పింక్ (భార్య) ఈ వీడియోను సమర్పించారు. అంటే జింజర్గా.. పింక్, ఫ్రెడ్గా.. చానింVŠ టేటమ్ యాక్ట్ చేసి, డాన్స్ చేశారు. పింక్ అసలు పేరు అలీషియా బెత్ మూర్ (38). అమెరికన్ పాప్ సింగర్. ఇక చానింగ్ టేటమ్ (37) అమెరికన్ యాక్టర్. భార్య చూడకుండా భర్త తన కాఫీలో ఆల్కహాల్ కలుపుకోవడం, భర్త కంటపడకుండా భార్య ఎనర్జీ పిల్స్ గుటుకూ గుటుకూమని మింగేయడం.. ఇంకా ఇలాంటి దొంగపనులతో వీడియో స్పీడప్ అవుతుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
చెఫ్ కనిపెట్టిన టేస్టీ లైఫ్ నిడివి – 2 ని. 9 సె. హిట్స్ – 98,03,502 డెడ్పూల్స్ ‘వెట్ ఆన్ వెట్’ టీజర్ వేడ్ విల్సన్ ఒక కెఫెటేరియాలో చెఫ్. పశువులకు వచ్చే బోవైన్ వైరస్ ఏ విధంగానో అతడికి సోకి మనిషి కొంచెం దెబ్బతింటాడు. ముఖ్యంగా అతడి రుచిగ్రంథులు దెబ్బతింటాయి. చెఫ్‌కి ఏది అవసరమో అదే లేకుండా పోతుంది. మేబెర్రీ ప్రాంతపు చెయ్యి తిరిగిన వంటగాడిగా పేరు తెచ్చుకోవాలన్న అతడి కల నెరవేరేదెలా మరి?! ఆ కలను వదిలేసి జీవితంలోని రుచుల్ని అన్వేషించే పనిలో పడతాడు. ప్రపంచం మొత్తం తిరుగుతాడు. సాహసాలు చేస్తాడు. ఊహించని శత్రువులతో చేసే పోరాటాలు అతడికి జీవితానుభవాన్ని ఇస్తాయి. స్నేహాలు, కుటుంబ అనుబంధాలలోని మధురిమల్ని టేస్ట్ చేస్తాడు. చివరికి ‘వరల్డ్స్ బెస్ట్ లవర్’ టైటిల్ గెలుస్తాడు. వచ్చే ఏడాది జూన్ 1న రిలీజ్ అవుతున్న అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘డెడ్‌పూల్ 2’ కథ ప్రస్తుతానికైతే ఇదే కానీ, పూర్తిగా ఇదే కాకపోవచ్చు! ఈ కొంచెం కథైనా ‘ట్వంటీయెత్ ఫాక్స్ సెంచరీ’ విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ వల్ల బయటికి వచ్చింది.2016లో వచ్చిన ‘డెడ్‌పూల్’ చిత్రానికి సీక్వెల్ ఇది. పేరింకా పెట్టలేదు. అందుకే డెడ్‌పూల్ 2 అంటున్నారు. మూవీ టీజర్‌కు మాత్రం ‘వెట్ ఆన్ వెట్’ అనే పేరు ఇచ్చారు. టీజర్ కూడా తమాషాగా ఉంది. ఇటీవలి కాలంలో హాలీవుడ్లో ఇంత వింతైన టీజర్ రాలేదు. వీడియో మొదలవగానే మాస్క్, ‘రాస్ విగ్గు’ పెట్టుకుని ఒక పెయింటర్ ప్రత్యక్షం అవుతాడు. (అమెరికన్ పెయింటర్ ఒకాయన ఉండేవారు. చనిపోయారు. ఆయన పేరు బాబ్ రాస్. ఆయన హెయిర్ స్టైల్‌ను పోలిన విగ్గే రాస్ విగ్). టీజర్లో మనకు కనిపించే పెయింటర్.. కాన్వాస్‌పై ‘వెట్ ఆన్ వెట్’ పెయింటింగ్ వేస్తూ కెఫెటేరియా చెఫ్ కథను చెబుతుంటాడు. వెట్ ఆన్ వెట్ అంటే పెయింట్ పచ్చిగా ఉన్నప్పుడే కోటింగ్ మీద కోటింగ్ ఇవ్వడం. వీడియోలోని చివరి పది సెకన్లలో అకస్మాత్తుగా సీన్ మారిపోతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు వచ్చేస్తాయి... ధడ్ ధడ్.. మంటూ! మార్వెల్ కామిక్స్‌లో యాంటీ హీరో కోడ్ నేమ్ ‘డెడ్‌పూల్’. అతడి అసలు పేరు వేడ్ విల్సన్. కోడ్నేమ్నే ఈ సీరీస్ సినిమాలకు పెడుతున్నారు. ఆత్మసఖీ.. పట్టుకో నన్ను గట్టిగా..! నిడివి – 3 ని. 36 సె. హిట్స్ – 27,66,489 ఫాల్ అవుట్ బాయ్ : హోల్డ్ మీ టైట్ ఆర్ డోన్ట్ అమెరికన్ రాక్ బ్యాండ్ ‘ఫాల్ అవుట్ బాయ్’ ఏడవ ఆల్బమ్ ‘మేనియా’ త్వరలో విడుదల కాబోతోంది. అందులోని నాలుగో సింగిల్ ట్రాక్ ఈ ‘హోల్డ్ మీ టైట్ ఆర్ డోన్ట్’. ఇదొక అందమైన డెడ్థీమ్ సాంగ్. వీడియో ఆరంభంలో ఒక పుర్రె, దాని కింద క్రాస్‌గా పెట్టిన రెండు ఎముకల సింబల్.. ప్రవేశ ద్వారం దగ్గర గోడ మీద దర్శనం ఇస్తుంది. అది రాత్రి వేళ. కొంతమంది మహిళలు కొవ్వొత్తులు పట్టుకుని మిడ్నైట్ ఫంక్షన్‌కు బయల్దేరుతుంటారు. ఓ వైపు మేరి మాత విగ్రహం ఉంటుంది. ఇదంతా హాలోవీన్ సెట్. మెల్లిగా పొగమేఘాల్లోంచి ఓ దెయ్యం పళ్లికిలిస్తుంది. ఇమ్మీడియట్ షాట్లో ముఖాన్ని చక్కెర పలుకులతో పెయింట్ చేసుకున్నట్లున్న ఓ అమ్మాయి అందంగా నవ్వుతుంది. చిన్నా పెద్ద వచ్చేస్తారు. కొందరి చేతుల్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కొందరు డాన్స్ చేస్తుంటారు. ఆత్మీయ ఆత్మల్ని నిద్రలేపి, ‘అనదర్ డే గోస్ బై.. సో హోల్డ్ మీ టైట్, హోల్డ్ మీ టైట్ ఆర్ డోన్ట్’ అని పాడుతుంటారు. హలోవీన్ డే అయిన అక్టోబర్ 31 లోపే విడుదల అవాల్సిన ఈ ట్రాక్ ఎందుకనో రెండు రోజుల క్రితమే సమాధిలోంచి పైకి లేచింది! చూడ్డానికైతే బాగుంది నిడివి – 54 సె. హిట్స్ – 85,50,921 వాటీజ్ న్యూ, అట్లాస్? ప్రతి పనీ రోబోలు చేస్తుండడం వల్లనో ఏమో, రోబోలు ఇప్పుడు ఏ పని చేస్తున్నా మనకు పెద్దగా సర్ప్రైజింగ్గా అనిపించడం లేదు. లేదా, మనుషులే రోబోలుగా పనిచేస్తున్నందు వల్ల రోబోలు ఏం చేస్తున్నా మనకు గొప్పగా అనిపించడం లేదేమో! బోస్టన్ డైనమిక్స్ వాళ్లు కొత్తగా ఇప్పుడొక రోబోను క్రియేట్ చేసి, దానికి ‘అట్లాస్’ అని పేరు పెట్టి.. ‘అందరూ చూడండి, మా రోబో ఎలా జిమ్నాస్టిక్స్ చేస్తోందో’ అని ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఎందుకు పనికొస్తుందో తెలీదు! బోస్టన్ డైనమిక్స్ అనేది రోబోలను డిజైన్ చేసే అమెరికన్ ఇంజనీరింగ్ కంపెనీ. 2005లో ఈ కంపెనీ.. సైనికుల కోసం ‘బిగ్‌డాగ్’ అనే రోబో శునకాన్ని తయారు చేసింది. అయితే అది పెద్దగా వర్కవుట్ కావడం లేదని 2015లో డంప్‌లో పడేసింది. సైనిక సామగ్రి కోసం ‘ప్యాక్ మ్యూల్’గా (బరువులు మోసే గాడిద) ఆ బిగ్డాగ్ను వాడేవారు. పేరుకు డాగే అయినా అది గాడిద బరువు మోయాలి. రోబో కాబట్టి మోస్తుంది. అయితే పెట్రోలుతో నడిచే ఆ బిగ్‌డాగ్ ఇంజిన్ డబడబమని చప్పుడు చెయ్యడం సైనికులకు చికాగ్గా ఉండడంతో ‘ఆ బరువేదో మనమే మోసుకుందాం’ అనే నిర్ణయానికి వచ్చి, దాన్ని వదిలించుకున్నారు. ఈ అట్లాస్ రోబో కూడా అలానే వ్యర్థ ఆవిష్కరణ అవుతుందా? ఇప్పటికైతే తెలీదు కానీ.. నో డౌట్ ఇందులో ఉన్నది గ్రేట్ ఇంజనీరింగ్. లెక్క తప్పకుండా ఈ హ్యూమనాయిడ్... దిమ్మెల పైకి దుమికి రివర్స్ విన్యాసాలు కూడా ఎలా చేస్తోందో చూడండి! చచ్చినా ఎక్కకండి.. చచ్చిపోతారు నిడివి – 2 ని. 17 సె. హిట్స్ – 14,99,918 బ్రెంట్ పెల్లా: వై యు షుడెంట్ ఫ్లయ్ ఆన్ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యు.ఎస్.లోని స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌లో జర్నీ చచ్చేంత చీప్! అయితే ‘దటీజ్ నాట్ ట్రూ’ అట. బ్రెంట్ పెల్లా అనే కమెడియన్ అంటున్నారు. మరేమిటి నిజం? స్పిరిట్ ఎయిర్‌లైన్స్ చచ్చేంత కాదు, చంపేంత చీప్ అట. యు.ఎస్.లో ‘స్పిరిట్ ఎయిర్ లైన్స్’ కంపెనీ లోకల్ ఫ్లయిట్స్‌ని తిప్పుతుంటుంది. ఈ మధ్య బ్రెంట్కి ఆ ఫ్లయిట్లో ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవాన్ని సర్కాస్టిక్‌గా ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. డయాస్ మీద ఒక స్టాండింగ్ యానిమేటెడ్ కమెడియన్ మైక్ పట్టుకుని ఉంటాడు. యానిమేషన్ వెనుక గొంతు బ్రెంట్ది. ‘‘నేను ఫ్లయిట్లో ఉన్నాను. ఫ్లయిట్ ఎంతకీ బయల్దేరడం లేదు. ఈలోపు ఒక అటెండెంట్ వచ్చి అనౌన్స్ చేసింది. ఫ్లయిట్ వెయిట్ బ్యాలెన్స్ కుదరడం లేదు.. ఎవరైనా వెనక్కి వెళ్లి కూర్చుంటారా అని. ఎవరూ కదల్లేదు. నేనే వెళ్లి కూర్చున్నాను. నా పక్కన ఒక సీటు ఖాళీగా ఉంది. అది కూడా నిండితేనే కానీ బరువు బ్యాలెన్స్ అయ్యేలా లేదు. చివరికి ఇందాకటి అటెండెంటే వచ్చి నా పక్కన కూర్చుంది. ‘ఇప్పుడు సరిగానే ప్రయాణిస్తుందా?’ అని అడిగాను. అప్పుడు తనేమందో తెలుసా.. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో’ అని!’’. బ్రెంట్ ఈ మాట చెప్పగానే వీడియోలో నవ్వులే నవ్వులు. ఇంకా అతడు వేసిన ఇలాంటì జోక్స్ చాలానే ఉన్నాయి. సర్వీస్ బాగా లేనప్పుడు చికాకు పడి తిట్టుకుంటాం. బ్రెంట్ లాంటి కళాకారులకు మాత్రమే వాటిని పది మంది దృష్టికీ తెచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకూ ఆయన చెప్పడం ఏమిటంటే... చచ్చినా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఎక్కొద్దని. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జో జో చిన్నారి జో.. బజ్జుకో బుజ్జయ్యా జాన్ లూవిస్ క్రిస్మస్ యాడ్ 2017 : మోజ్ ది మాన్స్టర్ నిడివి : 2 ని. 10 సె. హిట్స్ : 60,40,085 బెడ్ కింద ఓ రోజు రాత్రి ‘గుర్ర్’మని చప్పుడు వినిపిస్తే, దుప్పటి ముసుగు తీసి, కిందకు తొంగి చూస్తాడు జో. అక్కడో రాక్షసుడు ఉంటాడు! ‘మోజ్’ అనే ఆ రాక్షసుడు ఏడడుగుల ఎత్తు ఉంటాడు. భయపడి ముసుగు తన్ని పడుకుంటాడు చిన్నారి జో. ఉదయం లేవగానే ‘నో మాన్స్టర్స్ ఎలౌవ్డ్’ అని నోట్ రాసి తన బెడ్రూమ్ తలుపు బయట అంటిస్తాడు. అయినా ఆ మాన్స్టర్ వచ్చేస్తాడు. రెండో రోజూ, మూడో రోజూ.. అలా రాత్రయ్యేసరికి ప్రతి రోజూ వచ్చేస్తుంటాడు. బెడ్‌ను కింది నుంచి కదిలిస్తుంటాడు. ఆ కుదుపులకు జో కి భయం పోయి నవ్వొస్తుంది. వాడి నవ్వు విని మాన్స్టర్ బయటికి వచ్చి వాడికి షేక్‌హ్యాండ్ ఇస్తాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. జో ని గదిలోనే భుజం ఎక్కించుకుని తిçప్పుతాడు. రాత్రంతా రకరకాల ఆటలు ఆడిస్తాడు. రోజూ రాత్రి ఆటలే ఆటలు. జో కి నిద్ర సరిపోదు. మాన్స్టర్కంటే వేరే పని లేదు. జో స్కూల్‌కి వెళ్లాలి కదా. వెళ్తాడు. కానీ అక్కడ నిద్రకు జోగుతుంటాడు. జో.. ఫుట్‌బాల్ గోల్ కీపర్. గోల్ కీపర్ అన్నవాడు ఎంత అలెర్ట్‌గా ఉండాలి. అక్కడా ఓ పోల్కి ఆనుకుని నిద్రపోతుంటాడు. గోల్ పడుతున్నా కదలడు. హెయిర్ కటింగ్ సెలూన్లో క్రాఫ్ చేయించుకుంటూ ముందుకు తూలిపోతాడు. ఇంట్లో లివింగ్‌రూమ్‌లో కూర్చొని క్రిస్మస్ తాతకు గిఫ్ట్ లిస్ట్ రాస్తూ, రాస్తూ, నిద్రకు ఆగలేక టేబుల్ మీద వాలిపోతాడు. ఇది అమ్మానాన్న గమనిస్తారు. క్రిస్మస్ గిఫ్టుగా వాడికి ‘నైట్ లైట్’ ఇస్తాడు. ఆ నైట్ లైట్లో బెడ్ కింది మాన్స్టర్ మాయం అవుతాడు. జో కి చక్కగా నిద్రపడుతుంది. ‘జాన్ లూవిస్’ కంపెనీ విడుదల చేసిన క్రిస్మస్ యాడ్ ఇది. యాడ్ పేరు ‘మోజ్ ది మాన్స్టర్’. జాన్ లూవిస్ బ్రిటన్‌లో పెద్ద సూపర్‌మార్కెట్ చెయిన్ల కంపెనీ. 2007 నుంచి ఏడాదికొకటి చొప్పున ఇలా క్రిస్మస్ యాడ్ రిలీజ్ చేస్తోంది. భయం అనే చీకట్లోనే మాన్స్టర్స్ కనిపిస్తాయి. నక్షత్రాల వెలుగుల్లో అవి మాయం అయిపోతాయి అన్నది ఈ ఏడాది థీమ్. వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌గా మనకు వినిపించే సాంగ్ బీటిల్స్‌లోని ‘గోల్టెన్ స్లంబర్స్’ ట్రాక్. ‘వన్స్ దేర్ వాజ్ ఎ వే..’ అని స్టార్ట్ అవుతుంది. ‘స్లీప్ లిటిల్ డార్లింగ్, డునాట్ క్రయ్, ఐ విల్ సింగ్ ఎ లాల్లాబై..’ అనేది ఇమ్మీడియెట్ లైన్. పిండుకున్నవాళ్లకు పిండుకున్నంత హౌ టు డ్రై ఎ షర్ట్ ఇన్ 30 సెకండ్స్ నిడివి : 1 ని. 26 సె. హిట్స్ : 16,85,391 ఉతికిన షర్ట్‌ని 30 సెకన్లలో ఆరబెట్టడం ఎలా? ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు. చూశాక, ఇదేదో కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉందనుకుంటే హాయిగా, మేడ మీదకు వెళ్లి ఎండలో దండెం మీద ఆరేసుకోవచ్చు. షర్ట్‌ని ఎండబెట్టడానికి ఇందులో రకరకాల చిట్కాలు చెప్పాడు ఆ మహానుభావుడెవరో! ‘హౌవ్ టు బేసిక్’ అనే యూట్యూబ్‌లో అతడు అజ్ఞాతంగా ఉండి మనకిన్ని ఐడియాలు ప్రసాదిస్తుంటాడు. 2011లో ఈ చానల్ స్టార్ట్ అయింది. తర్వాత రెండేళ్లలో హిట్ అయింది. దీనికిప్పుడు 90 లక్షల మంది అభిమానులు తయారయ్యారు. 2014లో ఒకసారి, 2015లో ఒకసారి యూట్యూబ్ ఈ చానల్‌ను బ్యాన్ చేసినప్పుడు వీళ్లలో చాలామంది హర్ట్ అయ్యారు. పోన్లే పాపం అని మళ్లీ రివైవ్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసుకోవాలంటే మీరీ వీడియో చూడాల్సిందే. తెలుసుకోకూడనిది ఏదైనా ఉందీ అంటే.. షర్ట్‌ని ఎలా ఎండబెట్టకూడదన్నదే. ఊ కొడతారో, ఉలిక్కి పడతారో మీ స్టామినా మరి. బ్లడీ కామెడీ.. నవ్వలేక చావాలి గేమ్ నైట్ : ట్రైలర్ నిడివి : 2 ని. 27 సె. హిట్స్ : 13,39,076 ‘‘ఈ రాత్రికి మనం ఒక కొత్త గేమ్ ఆడబోతున్నాం’’ అంటాడు బ్రూక్స్.. ఈ ట్రైలర్ ఓపెనింగ్ సీన్లో. బ్రూక్స్.. మాక్స్ బ్రదర్. మాక్స్.. యానీ భర్త. మాక్స్కీ, యానీకీ ఫ్రెండ్.. రియాన్. రియాన్ లవ్ ఇంట్రెస్ట్.. శారా. అంటే.. రియాన్ శారాను లవ్ చేస్తుంటాడు. వీళ్లు కాకుండా ఎఫ్.బి.ఐ. ఏజెంట్ ఒకరు ఉంటారు. వీళ్లంతా కలిసి, వాళ్లకు తెలియకుండానే ఒక మర్డర్ మిస్టరీ వైపు గేమ్‌ను ఆడుకుంటూ పోతుంటారు. గెలిచిన వాళ్లకు డబ్బొస్తుంది. ఓడినవాళ్ల ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీదు. గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ ఆడేవాళ్లలో ఒకళ్లు ఫినిష్ కాబోతున్నారు. ఆ ఫినిష్ కాబోయేవాళ్లెవరో గేమ్‌లో ఉన్నవాళ్లు కనిపెట్టాలి. వాళ్లకే గ్రాండ్ ప్రైజ్. అక్కడ ఏదీ నిజమో, ఏది అబద్ధమో తెలీదు. ద ప్లేయర్స్, ద క్లూస్, ద ట్విస్ట్, ద ఛేజ్, ద గూన్స్, ద బ్లడీ డాగ్, ద కరాఒకే, ద స్టంట్స్, ద డాన్స్–ఆఫ్స్, ద షిట్.. యు వోన్ట్ బిలీవ్.. అలా కంటిన్యూ అవుతుంది గేమ్. వచ్చే ఏడాది మార్చి 2న థియేటర్స్‌లోకి వస్తున్న ‘గేమ్ నైట్’లో మరింత బ్లడ్‌ను చూడొచ్చు. ఇదొక బ్లడీ కామెడీ థ్రిల్లర్. ఈడ్చుకెళ్లినా ఒడిలోకి చేర్చుకుంది హోప్ ఫర్ పాస్ రెస్క్యూవర్ డ్రాగ్డ్ నిడివి : 6 ని. 24 సె. హిట్స్ : 10,52,688 యు.ఎస్.లో ‘హోప్ ఫర్ పాస్’ అనే జీవ కారుణ్య సంస్థ ఉంది. దెబ్బ తగిలిన మూగ జీవులను, అనాథ జంతువులను కాపాడటం ఈ సంస్థ పని. ఆ సంస్థలో పనిచేసే వలంటీర్లు నిరంతరం రోడ్ల మీద తిరుగుతూ మూగప్రాణులను అక్కున చేర్చుకుంటూంటారు. ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా తక్షణం అక్కడికి వెళ్లిపోతారు. అలా ఈ మధ్య గెర్షి్వన్ అనే కుక్క గురించి వారికి తెలిసింది. అది ఎవరిదో పెంపుడు కుక్క. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపాలు చేసి వెళ్లిపోయారు వేరే స్టేట్‌కో, వేరే కంట్రీకో! పాపం అది దిక్కులేనిది అయింది. దాన్ని తమ సంరక్షణలోకి తీసుకోడానికి రెస్క్యూ టీమ్ బయల్దేరింది. టీమ్ అంటే పెద్దగా ఎవరూ లేరు. లొరెటా అనే అమ్మాయి, ఆ అమ్మాయి అసిస్టెంట్. ఇద్దరే. ఇక దాన్ని పట్టుకోవడం పెద్ద టాస్క్. ఆ టాస్క్‌ని సంస్థవాళ్లు లొరెటాకు అప్పగించారు. ఆ అమ్మాయికి చాలా ఓపిక. గతంలో ఇలాంటి టఫ్ ఆపరేషన్లు రెండు మూడు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన అనుభవం ఉంది. అయితే గెర్షి్వన్ బలమైన కుక్క. 50 కిలోలకు పైగా బరువుంది. పైగా దాని మెడకు తాడు వెయ్యడం, దానిని నెట్లోకి లాక్కోవడం పెద్ద పని. లొరెటా ఆ శునకం మెడకు చాకచక్యంగా తాడు వెయ్యగలిగింది కానీ, దాని బలానికి నిలబడలేకపోయింది. కొంత దూరం శునకమే ఆ అమ్మాయిని లాక్కుపోయింది. అయినా లోరెటా పట్టు వదల్లేదు. టాస్క్ పూర్తి చేసింది. గెర్షి్వన్ని భద్రంగా తనతో తీసుకెళ్లింది. -
ప్రియురాలి ప్రతీకారం
ప్రియురాలి ప్రతీకారం టేలర్ స్విఫ్ట్ : రెడీ ఫర్ ఇట్? నిడివి - 3 ని. 30 సె. హిట్స్ - 2,99,99,836 బాయ్స్ ఎప్పుడూ టేలర్ స్విఫ్ట్ ఎటాక్ కోసం ఎదురు చూస్తుంటారు.. కళ్లు, ఒళ్లు అప్పగించేసి! ఇరవై ఏడేళ్ల ఈ అమెరికన్ పాప్ దెయ్యప్పిల్ల.. వరల్డ్‌వైడ్‌గా అబ్బాయిల ప్రాణం తియ్యడానికి ఇదిగో ఇప్పుడు మళ్లీ వచ్చింది.. రెడీ ఫర్ ఇట్? అని అడుగుతూ! టేలర్ ఆరో ఆల్బమ్ ‘రెప్యుటేషన్’లోని ఈ సాంగ్‌లో ఆమె రెండు దేహాలతో దర్శనమిస్తుంది. ఒకటి సైబర్ రూపం. ఇంకొటి సైతాన్ రూపం. సైతాన్‌కి సైబర్ అంతరాత్మ. ఈ ప్రేమ మూర్తి సైతాన్ కావడం ఏమిటి? ప్రతీకారం మరి! నమ్మించి, నట్టేట ముంచిన మాజీ ప్రేమికుల గొంతులకు బిగించడానికి టేలర్ ఈ సాంగ్‌ని ఒక ఉరితాడులా గిర్రున తిప్పి విసిరారు. ‘ఎంతమందిని ప్రేమిస్తావు? ఎంతమందిని నీ వెంట తిప్పుకుంటావు? హృదయాలను దొంగిలించి, పారిపోతావు. కనీసం క్షమాపణైనా చెప్పవు. చూస్తా నీ అంతు..’ అంటూ బెదిరించినట్లే ఉంటుంది.. ఈ వీడియోను మోసకారులైన మగ ప్రేమికులెవరైనా చూస్తే కనుక. రాణిగారు మిమ్మల్నీ ఆవహిస్తారు పద్మావతి : ఘూమర్ సాంగ్ నిడివి - 3 ని. 19 సె. హిట్స్ - 2,41,27,424 కాంట్రావర్షియల్ మూవీ ‘పద్మావతి’ లోంచి బయటికి వచ్చిన ఫస్ట్ సాంగ్ ‘ఘూమర్’. మంచి ట్రెండింగ్‌లో ఉంది. రాచరికపు జానపదాల్లోని ‘ఘూమర్’ అనే పాటను తీసుకుని ఆ సారాన్ని రాజస్థాన్ గాయకుడు స్వరూప్ఖాన్తో కలసి శ్రేయాఘోషల్ ఆలపించారు. భన్సాలీ మ్యూజిక్‌లోని ఈ అంతఃపుర నృత్య ప్రధాన గీతం.. మీరు ఆడపిల్ల గనుకైతే కాసేపు మీ గాజుల చేతుల్నీ, మువ్వల కాళ్లను కదిలిస్తుంది. మీరు కదలకపోవచ్చు. మీ గాజులు, గజ్జెలు కదులుతాయి. దీపికా పడుకోన్ (పద్మావతి) తన భర్తపై గుండె నిండా ప్రేమను నింపుకుని నృత్యం చేస్తుంటుంది. అయితే ఎంతైనా ఆమె రాణి గారు కదా! పరదాల పరిమితుల్లోనే కొద్దిపాటి కదలికలతో, కనుసైగలతో తన ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. పై మందిరం నుంచి షాహిద్ కపూర్ (రావల్ రతన్ సింగ్) చిరునవ్వుతో దీపికను చూస్తుంటాడు. యూట్యూబ్‌లో ఈ సాంగ్ విడుదలైన కొద్ది వ్యవధిలోనే హిట్లు కోట్లకు చేరుకున్నాయి. అమెరికన్ రెడ్డి డ్రేమండ్ గ్రీన్ అండ్ బ్రాడ్లీ బీల్ : రియల్ ఫైట్ నిడివి - 2 ని. 25 సె. హిట్స్ - 20,14,573 ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా? చూడకపోయినా నో ప్రాబ్లం. ఈ వీడియో చూడండి. అర్జున్‌రెడ్డి చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ కాలేజ్ స్టూడెంట్. బాస్కెట్‌బాల్ ఆడుతుంటాడు. అవతలి జట్టులో అమిత్ అనే స్టూడెంట్ ఉంటాడు. హీరో గోల్ కొట్టి, ‘ఏయ్ అమిత్..’ అని రెచ్చగొట్టి, మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. ఆట ఆగిపోయి, ఇద్దరి మధ్య ఫైట్ మొదలౌతుంది. ఇంచుమించు అలాంటి సీన్‌నే మీరు ఈ వీడియోలో చూస్తారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో శుక్రవారం రాత్రి ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్’, ‘వాషింగ్టన్ విజార్డ్స్’ జట్ల మధ్య బాస్కెట్‌బాల్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. సెకండ్ క్వార్టర్లో ఇంకా ఇరవై సెకన్లు ఉందనగా, కడుపులో ఎంత కోపాన్ని దాచుకుని ఉన్నాడో ఏమో.. బ్రాడ్లీ బీల్ వెళ్లి డ్రేమండ్ గ్రీన్ మీద పడి అతడి ముఖం మీద, మెడ మీద కొట్టేశాడు. యాక్షన్‌కి రియాక్షన్ ఉండకుండా ఉంటుందా? గ్రీన్ కూడా అతడిని కొట్టాడు. పనిష్మెంట్గా ఇద్దర్నీ బయటికి పంపించారు. సోమవారం (ఇవాళ) వీరిద్దరి వాదన విన్నాక, ఎవరికి ఏ శిక్ష విధించాలన్నది ఫైనల్ అవుతుంది. రెడ్ డ్రెస్‌లోని బీల్ ‘వాషింగ్టన్ విజార్డ్స్’ ఆటగాడు. వైట్ డ్రెస్‌లోని గ్రీన్.. ‘గోల్డెన్ స్టేట్ వారియర్స్ ప్లేయర్. ఇద్దరూ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు. ఆటలోని కోపం కొట్టుకునేవరకూ వెళ్లిందంటే.. చిన్నపిల్లలం అయిపోయామనే! ఇంగ్లిష్ అండ్ ఇవాంక ఇవాంక ట్రంప్ డజంట్ అండర్‌స్టాండ్ వర్డ్స్ నిడివి - 3 ని. 17 సె. హిట్స్ - 18,84,394 అమెరికన్లకు ఇంగ్లిష్ రాకపోవడం మనకు వండర్. వాళ్లకు కామెడీ. రోజూ పొద్దుపోయాక ‘లేట్నైట్తో షో’లతో అమెరికన్లను నవ్విస్తుండే టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బెర్ట్ గారి కామెడీ గేలానికి ఈసారి ట్రంప్ కుమార్తె ఇవాంక చిక్కారు! ట్విట్టర్లో ఆమె కామెంట్స్‌నీ, ఇంటర్వ్యూలలో ఆమె సమాధానాలను ఎంపిక చేసుకుని ఆమె ఇంగ్లిష్‌పై ఆయన సెటైర్లు వేసి నవ్వించారు. ‘ఇవాంక ఎంతో తెలివైన అమ్మాయి. కానీ ఆమెకు ఇంగ్లిష్ పదాలకు అర్థం తెలీదు’ అని మొదలు పెట్టి, ‘మనం మాత్రం ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం’ అని షోని ముగించి ఆ పూటకి గుడ్‌నైట్ చెప్పేశారు స్టీఫెన్. ‘కంప్లిసిట్’ అంటే నేరంలో భాగస్వామ్యం అని అర్థం. అయితే ఒక ఇంటర్వ్యూలో ఇవాంక దానికి పూర్తి భిన్నమైన అర్థంలో ‘ఐ యామ్ కంప్లిసిట్’ అని చెప్పుకున్నారు! ‘ఒక మంచి పనిలో పాలుపంచుకోవడం కంప్లిసిట్’ కనుక అయితే నేను కంప్లిసిటే అని కూడా వివరణ ఇచ్చారు. దాన్ని పట్టుకుని స్టీఫెన్ కొద్దిసేపు ప్రేక్షకులను నవ్వించారు. తర్వాత ఇవాంక గతంలో చేసిన ఒక ట్వీట్‌ని పట్టుకున్నారు. ‘థియోడర్కి 8 నెలలంటే నేను నమ్మలేకపోతున్నాను. హ్యాపీ బర్త్‌డే’ అనే ట్వీట్ అది. థియోడర్ ఇవాంక కొడుకు. వాడికి ఎనిమిది నెలలు ఉన్నప్పుడు ఆమె ఈ ట్వీట్ పెట్టారు. ఎనిమిది నెలలకే హ్యాపీ బర్త్‌డేనా అని స్టీఫెన్ నోట్లో చెయ్యిపెట్టుకున్నాడు. షో నవ్వుల్తో షేక్ అయిపోయింది. మన పిల్లలకు తెలుగు సరిగా రానట్లే.. అమెరికాలో ఇవాంక లాంటి అమ్మాయిలకు ఇంగ్లిష్ రాదేమో మరి! రేపు రాత్రి బయటికి రాకండి హాలోవీన్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ : లెలె పాన్స్ నిడివి - 4 ని. 31 సె. హిట్స్ - 34,64,712 రేపు హాలోవీన్ డే. పిల్లలు డెవిల్స్‌లా డ్రెస్ చేసుకుని చీకట్లో ఒకర్నొకరు భయపెట్టుకుని ఆనందించే రోజు. పశ్చిమ దేశాల్లోని ఈ క్రైస్తవ ఆచారం క్రమంగా మన దేశానికీ వచ్చింది. చనిపోయిన ప్రవక్తలు, అమర వీరుల ఆత్మలు ఆ రోజు సమాధి నుంచి లేచి రాత్రి వేళ ఊళ్లలో సంచరిస్తారట. ఆత్మలు లేచి వచ్చినా రాకపోయినా, పిల్లలు మాత్రం అంత సీన్ క్రియేట్ చేస్తారు. ఎవరెంత బాగా భయపెట్టారన్నది ఎవరెంత బాగా (పిశాచిలా) డ్రెస్ చేసుకుని, మేకప్ వేసుకున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. ఈ వీడియోలోని ‘లెలె పాన్స్’ అనే అమ్మాయిని చూడండి. ఎంత చక్కగా ఉంటుందో! హలోవీన్ మేకప్ వేసుకోగానే భూతంలా మారిపోతుంది. అఫ్కోర్స్.. అందమైన భూతం. లెలె పాన్స్ వెనిజులా అమెరికన్. ఇంటర్నెట్ పర్సనాలిటీ. హలోవీన్డేకి ‘మంచి మంచి’ ఐడియాలు ఇవ్వడం కోసం ఒక పోటీ నిర్వహించి దాన్ని షూట్ చేసి యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేశారు లెలె పాన్స్. దీన్ని మీరూ ఫాలో అవ్వొచ్చు. లేదంటే ఊరికే చూసి హ్యాపీగా భయపడొచ్చు. ఏడంతస్తుల దెయ్యాల మేడ ది విన్చెస్టర్ : ది హౌస్ దట్ ఘోస్ట్స్ బిల్ట్ నిడివి - 1 ని. 56 సె. హిట్స్ - 23,44,264 వాస్తుకు విరుద్ధంగా కట్టిన ఏడంతస్థుల భవంతి అది! పేరు విన్చెస్టర్. శాన్‌ఫ్రాన్సిస్కోకి 50 మైళ్ల దూరంలో.. నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో ఉంటుంది. చెక్కల భవంతి. లోపల ఎప్పుడూ కిర్రుమనే చప్పుళ్లు. శారా విన్చెస్టర్ అనే వృద్ధురాలు కట్టించుకుంటుంది. విన్చెస్టర్ల కొండంత సంపదకు ఆమె ఏకైక వారసురాలు. భర్త, బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. ఆ భవంతి... ఏ గదిలోంచి ఏ గదిలోకి తీసుకెళుతుందో తెలియనంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది కాదు విషయం. ఆ భవంతి నిర్మాణం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందులో దెయ్యాలున్నాయని ఆమె అనుమానం. ఆమెను ట్రీట్ చెయ్యడానికి ఒక సైకియాట్రిస్ట్ వస్తాడు. అతడితో ఆ మాట అంటే.. ‘చూడని దానిని నేను నమ్మను’ అంటాడు. ‘నేను చూశాను’ అంటుంది విన్చెస్టర్. డాక్టర్‌కీ చూపిస్తుంది! 2018 ఫిబ్రవరి 18న మనమూ చూడొచ్చు. థియేటర్‌కి వెళితే. ఈలోపు ఈ టీజర్‌లోని దెయ్యాలతో సరిపెట్టుకోండి. సూపర్ నేచురల్ హాలీవుడ్ హారర్ మూవీ ఇది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సివిల్‌వార్ చిరుత పులి బ్లాక్ పాంథర్ : ట్రైలర్ నిడివి : 2 ని. 18 సె. హిట్స్ : 82,47,114 బ్లాక్ పాంథర్ పేరుతో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇది మూడోది. అయితే దీనికీ, ఆ రెండింటికీ సంబంధం లేదు. మొదటి ‘బ్లాక్ పాంథర్’ జర్మన్ సైలెంట్ మూవీ. దాదాపు వందేళ్ల క్రితం వచ్చింది 1921లో. రెండో ‘బ్లాక్ పాంథర్’ బ్రిటిష్ క్రైమ్ ఫిల్మ్. నలభై ఏళ్ల క్రితం వచ్చింది 1977లో. ఇప్పుడీ మూడో బ్లాక్ పాంథర్ 2018 ఫిబ్రవరిలో విడుదల అవుతోంది.మార్వెల్ కామిక్స్లోంచి బ్లాక్ పాంథర్ అనే క్యారెక్టర్ ఆధారంగా అదే పేరుతో తయారౌతున్న ఈ హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్.. గత ఏడాది విడుదలైన ‘కేప్టెన్ అమెరికా : సివిల్ వార్’ చిత్రం ఎక్కడైతే ముగుస్తుందో, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అలాగని ఆ సినిమాను చూడందే ఈ సినిమా అర్థం అవదనే వర్రీ ఏం అవసరం లేదు. దేనికదే వేర్వేరుగా ఒక కంప్లీట్ పిక్చర్. ట్రైలర్లో చురుకైన నల్ల చిరుతలా కనిపించే నలభై ఏళ్ల వ్యక్తే బ్లాక్ పాంథర్. హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్మాన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. మూవీలో బ్లాక్ పాంథర్కే ఇంకో పేరు టి–చార్లీ. అంతర్యుద్ధంలో స్థాన బలిమిని కోల్పోయి, తిరిగి తన రాజ్యానికి చేరుకున్న టి–చార్లీకి రాజ్యంలోని ఇద్దరు వ్యక్తులు తిరుగుబాటుతో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే కుట్రపన్నారని తెలుస్తుంది. దాంతో టీ–చార్లీ.. బ్లాక్ పాంథర్ అవతారం ఎత్తుతాడు. తన ప్రత్యేక మహిళా దళం ‘డోరా మిలాజే’ సహాయంతో తన రాజ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రపంచ యుద్ధాన్ని కూడా నివారిస్తాడు. మార్వెల్ కామిక్ కథలు, కల్పిత ప్రదేశాల ఆధారంగా మార్వెల్ స్టూడియోస్ (వాల్ట్ డిస్నీ స్డూడియోల అనుబంధ సంస్థ) నిర్మిస్తున్న 18 వ చిత్రం ఈ బ్లాక్ పాంథర్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఏ లెవల్లో ఉండబోతున్నాయో ట్రైలర్లో చూడొచ్చు. ఇదొక కిల్లర్ ట్రైలర్. మీ చేత స్టెప్స్ వేయిస్తుంది. అది కూడా ఆఫ్రికన్ స్టెప్స్! ఆడపిల్ల తండ్రి మరి! ఐ లవ్ యు, డాడీ: ట్రైలర్ నిడివి : 2 ని. 06 సె. హిట్స్ : 5,53,570 గ్లెన్ టోఫర్ టీవీ ప్రొడ్యూజర్. ఆయనకు 17 ఏళ్ల కూతురు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. తెలివైన కళ్లు. పసిపిల్ల నవ్వు. ఎక్కడో చదువుతున్న ఆ పిల్ల సీనియర్ ఇయర్ కోర్సులో తండ్రితో పాటు ఉండడానికి ఆయన ఉండే అపార్ట్‌మెంట్‌కు వచ్చేస్తుంది. తల్లి ఉండదు. (గ్లెన్ నష్టాల్లో ఉన్నప్పుడు ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోతుంది). గ్లెన్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. కూతురుతో మాట్లాడ్డానికి కూడా టైమ్ ఉండదు! గ్లెన్ ప్రొడ్యూజర్ కాబట్టి ఆ ఫీల్డులో ఉన్నవాళ్లు గ్లెన్ ఇంటికి వచ్చి వెళుతుంటారు. ఓసారి గోడపై ఉన్న గ్లెన్ కూతురు ఫొటో చూసి, ఒక టీవీ నటి అడుగుతుంది.. ‘ఎవరు సార్.. ఈ అమ్మాయి. మీ గర్ల్ ఫ్రెండా?’’ అని. గ్లెన్ ఇబ్బందిగా నవ్వుతాడు. ‘తను నా కూతురు’ అని చెప్తాడు. ‘గార్జియస్’ అంటుంది ఆమె ఆ ఫోటోనే చూస్తూ. తర్వాత తండ్రీకూతుళ్లిద్దరూ ఓ హాలీవుడ్ ఫంక్షన్‌కి వెళతారు. అక్కడ గ్లెన్‌కు ఆరాధ్యుడైన 68 ఏళ్ల వయసున్న సినీ నిర్మాత లెస్లీ గుడ్విన్ కంట్లో గ్లెన్ కూతురు పడుతుంది. గ్లెన్‌కు జీవితంలో ఒక్కసారైనా అపాయింట్మెంట్ ఇవ్వని వాడు గ్లెన్ కూతుర్ని తీర్చిదిద్దుతానని అంటాడు! టీనేజ్ పిల్లలతో రొమాన్స్ చేస్తుంటాడని లెస్లీకి పేరు. గ్లెన్ కూతురితోనూ అలానే చేయబోతే.. ‘తను మైనర్’ అంటాడు గ్లెన్. ‘అయితే ఏంటి?’ అంటాడు లెస్లీ. అంతే.. గ్లెన్లోని తండ్రి మేల్కొంటాడు. అంతకాలం పనిలో పడి కూతుర్ని పట్టించుకోని వాడు ఒక్కసారిగా ఆమె సంరక్షకుడిగా మారిపోతాడు. గ్లెన్ కూతురి పేరు ‘చైనా’. ‘దానికేం తెలియదు, అదొక ఈస్ట్రోజన్ బొమ్మ’ అని ట్రైలర్లో ఓ చోట కూతురి గురించి అంటాడు గ్లెన్. స్త్రీగా మారుతున్న బాలిక విషయంలో పురుష ప్రపంచం కనబరిచే దూకుడును కట్టడి చెయ్యడానికి.. పాపం ఈ ఆడపిల్ల తండ్రి చేయని ప్రయత్నం ఉండదు. ఈ చిత్రాన్ని లూయీ సి.కె. డైరెక్ట్ చేశారు. గ్లెన్గా నటించింది కూడా ఆయనే. గత నెల 9న ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్క్రీన్ అయిన ‘ఐ లవ్ యు, డాడీ’ 35 ఎంఎం బ్లాక్ అండ్ వైట్ మూవీ! పిడిగుద్దుల త్రిమూర్తులు ది షీల్డ్ మేక్ దెయిర్ ఎంట్రెన్స్ టుగెదర్ నిడివి : 2 ని. 40 సె. హిట్స్ : 40,41,464 ‘యు.ఎస్.ఎ. నెట్వర్క్’ అని అమెరికాలో ఒక టీవీ చానల్ ఉంది. అందులో ప్రతి సోమవారం రాత్రి 8 గంటలకు (వాళ్ల టైమ్ ప్రకారం) ‘రా’ అనే ఆ ముందు రోజు ఆదివారం నాటి లైవ్ షూటింగ్ ప్రసారం అవుతుంది. ప్రొఫెషనల్ రెజ్లింగ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అది. గత సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెజ్లింగ్ అభిమానులంతా ఇళ్లలో టీవీల ముందు కూర్చొని లైవ్‌లో ‘రా’ ని చూస్తున్నారు, ‘షో’ మధ్యలో అనూహ్యంగా ముగ్గురు వ్యక్తులు ‘షో’ ఎంట్రెన్స్ గేటు లోంచి లోపలికి వస్తూ కనిపించారు! వ్యూయర్స్ ముఖాల్లో ఒక్కసారిగా ఉత్తేజం.ఉత్సాహం. లైవ్ షోలో ఉన్న ఆడియెన్స్ అయితే ఆ ముగ్గుర్నీ చూసిన ఆనందాన్ని తట్టుకోలేక.. ‘దిస్ ఈజ్ ఓస్సమ్.. దిస్ ఈజ్ ఓస్సమ్’ అని అరవడం మొదలు పెట్టారు. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు? డీన్ ఆంబ్రోస్ (31), రోమన్ రీన్ (32), సేత్ రోలిన్స్ (31). ముగ్గురూ అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్లు. ‘షీల్డ్’ అనే రెజ్లింగ్ బ్యాండ్ సభ్యులు. వీడియోలో మొదట ఆంబ్రోస్ ముక్కు చిట్లించుకుంటూ ముందు వస్తాడు. అతడి వెనుకే జులపాల బలుడు రోమన్ రీన్ కనిపిస్తాడు. కుడివైపున రోలిన్స్ తన పెదవులతో ముక్కుని పైకి నెట్టుకుంటూ లుక్ ఇస్తాడు. ‘షీల్డ్ బ్యాండ్ హీరోలు వస్తున్నారహో’ అని ఎరీనాలోంచి షో యాంకర్ అరిచి చెప్పగానే ఒకటే హోరు! ఇక ఈ ముగ్గురి హావభావాలను మీరు వీడియోలో చూడాల్సిందే. గమ్మత్తుగా ఉంటాయి. డబ్లు్య.డబ్లు్య.ఇ. (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్రైటన్మెంట్) సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది! ఏమిటి ఇందులోని స్పెషల్? ముగ్గురూ కలిసి కనిపించడమే! మూడేళ్ల క్రితం ఏవో గొడవలొచ్చి విడిపోయిన ఈ త్రిమూర్తులు మళ్లీ ఒకటై ప్రత్యక్షమవడంతో అభిమానుల కడుపు నిండిపోయింది. బాల నేరస్థుడి హార్ట్‌బీట్ డ్రాకో ‘వాచ్ మీ డూ ఇట్’ (అఫీషియల్ వీడియో) నిడివి : 4 ని. 5 సె. హిట్స్ : 24, 843 పెద్దగా హిట్స్ ఏమీ లేని వీడియో ఈవారం యూట్యూబ్ హిట్స్లోకి ఎలా వస్తుంది?! కానీ డ్రాకో అనే 24 ఏళ్ల ఈ అట్లాంటా కుర్రవాడి జీవితంలో చాలా హిట్స్ ఉన్నాయి. హిట్స్ అంటే ఇక్కడ విజయాలు. దెబ్బలు! వాటిని తట్టుకుని పాప్ ర్యాపర్‌గా నిలబడి మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చాడు. బేబీగ్రాండ్ అనే కంపెనీ అతడిని చేరదీసింది. తన చిన్న జీవితంలో డ్రాకో పదేళ్ల పాటు ‘ఆన్ అండ్ ఆఫ్’గా బాల నేరస్థుల కర్మాగారంలోనే గడిపాడు! ఏంటి అతడు చేసిన నేరం? డ్రగ్స్, ఆల్కహాల్, అబ్యూజ్.. వీటి మధ్య పుట్టి పెరిగిన పిల్లవాడు ఎలా తయారౌతాడో అలాగే తయారయ్యాడు డ్రాకో. మంచి తిండి కోసం, మంచి బట్ట కోసం దొంగతనాలు చేశాడు. అట్లాంటా వీధుల్లో వీడొక ఆకతాయి వెధవ. ప్రతిసారీ పోలీసులు పట్టుకుపోవడమే. ఓసారి మ్యూజిక్ వాడిని పట్టుకుంది. పాప్ మ్యూజిక్. ఏ ఆర్టిస్టో పాడింది! దాన్ని వినగానే జీవితం మీద ప్రేమ కలిగింది. తనూ పాడాడు. ఫస్ట్ సింగిల్ ‘వాచ్ మీ డూ ఇట్’ ఆడియో ఆగస్టులో విడుదలైంది. అదే పేరుతో రెండు రోజుల క్రితం అది వీడియోగా వచ్చింది. బీట్ బాగుంది. థీమ్ అతడి జీవితానికి పూర్తి భిన్నమైనది. ఇందులో డ్రాకో పెద్ద హిప్హాప్ రాక్‌స్టార్. కనీసం బీట్ వినడానికైనా ఈ వీడియోను చూడండి. వరల్ట్స్టార్ హిప్ హాప్ కంపెనీ దీనిని అప్లోడ్ చేసింది. -
యూట్యూబ్‌లో సచిన్ సంచలనం
మైదానంలోకి అతడు అడుగు పెడుతున్నాడంటే చాలు.. స్టేడియంలో ఉన్న జనాలంతా ఒక్కసారిగా లేచి ఓ... అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అతడు సెంచరీకి చేరువ అయ్యాడంటే అంతా కలిసి ’సాచిన్.. సాచిన్’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తారు. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు.. వెండితెర మీద కూడా సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. బయోపిక్‌లు తీయడంలో అందెవేసిన చేయి అయిన ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ’సచిన్.. ఎ బిలియన్ డ్రీమ్స్‘ సినిమా ట్రైలర్ గురువారం రాత్రి విడుదలైంది. అప్పుడే యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. దాదాపు 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూలు ఆ ట్రైలర్‌కు వచ్చాయి. అన్నతో కలిసి చిన్నతనంలో పార్కింగ్ చేసి ఉంచిన కారు టైరులోని గాలి తీసేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 2 నిమిషాల 13 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో తొలిసారి బ్యాట్ పట్టుకున్నప్పటి మధుర స్మృతులు, టీమిండియా మొదటిసారి ప్రపంచకప్ గెలిచినప్పటి సంబరాలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలో తాను చూసిన మ్యాచ్‌లు, రమాకాంత్ ఆచ్రేకర్ శిష్యరికంలో నేర్చుకున్న పాఠాలు.. ఒకానొక సమయంలో తన ఇంటి మీద పడిన రాళ్లు, దిష్టిబొమ్మలు తగలబెట్టిన నిరసనలు, తీవ్రంగా మధనపడి.. మళ్లీ మైదానంలో మెరిసిన క్షణాలు, కోట్లాదిమంది అభిమానులు తమ గుండెల్లో గుడికట్టి పూజించిన వైనం.. పదో నెంబరు జెర్సీ.. ఇలా అన్ని విషయాలూ కనిపిస్తాయి. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుంది. రవి భగ్చాంద్కా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైతే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. The stage is set and we are ready to begin… #SachinTrailer is out now. Here it is! https://t.co/T3oWyZw3DL — sachin tendulkar (@sachin_rt) 13 April 2017 -
యూ ట్యూబ్ వెర్రి చేష్టలు...
పక్క దోవ ఈ మధ్య వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమా గుర్తు ఉందా? అందులో యూట్యూబ్ హిట్స్ కోసం హీరో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు నటిస్తూ తండ్రి కంట్లో పడి తిట్లు తింటాడు. ఇప్పుడు చాలామంది కుర్రాళ్ల వెర్రి ఈ స్థాయిలోనే ఉంది.గతంలో కుర్రాళ్లు పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్ చుకుని నలుగురి దృష్టిలో పడేవాళ్లు. లేదంటే సమాజానికి పనికొచ్చే పనులు చేసి ఆకర్షించేవారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించినా కూడా మెచ్చుకోలు దక్కేది. కాని ఇవన్నీ కష్టమైన పనులు కావడాన అందరి దృష్టిలో పడటానికి ఇవాళ కొందరు కుర్రకారు చేస్తున్న పని వెర్రి వేషాల వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెట్టడం. వీధి కుక్కను మేడ మీద నుంచి కింద పడేయడం, పులి బోనులో అడుగుపెట్టడం, దెయ్యం వేషాలు వేసుకొని భయపెట్టడం లాంటి చేష్టలు చేసి ఆ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టబోయి అభాసు పాలైన వారు ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీకి చెందిన మరో కుర్రాడు కూడా ఊచలు లెక్కబెట్టబోతున్నాడు. ఢిల్లీకి చెందిన సుమిత్‌కు యూ ట్యూబ్‌లో ‘ది క్రేజీ సుమిత్’ అనే చానెల్ ఉంది. దారిన పోయే జనం పై ప్రాంక్స్ (ఆట పట్టించడం) చేసి ఆ వీడియోలను యూ ట్యూబ్‌లో పెడుతుంటాడు. మొన్న జనవరి ఒకటిన ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఒక ప్రాంక్ చేశాడు. ఏమిటంటే దారిన పోతున్న ఆడపిల్లలను సడన్‌గా ముద్దు పెట్టి పరిగెత్తడం. ఈ ప్రాంక్‌ను ముగ్గురు నలుగురు ఆడపిల్లలపై చేసి దానిని యూట్యూబ్‌లో పెట్టాడు. రెండు వేల మంది దానిని చూసి ‘లైక్’ కొట్టారు కూడా. కాని ఆ వెంటనే స్త్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇది ఆట పట్టించడం కాదని లైంగిక దాడి చేయడం అని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఢిల్లీ మహిళా కమిషన్ అధికారి స్వాతి మలివాల్ ఈ వీడియోను ఖండించడంతో వేడి పుంజుకుంది. దాంతో పోలీసులు రంగంలో దిగి ఆ వీడియో ఎక్కడ ఎవరు అప్లోడ్ చేశారన్న దానిపై విచారణ మొదలెట్టారు. ఇది లైంగికదాడిగా భావిస్తే సుమిత్‌పై ఐ.పి.సి. సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. కాని ఇంతలోనే సుమిత్ ఆ వీడియోని తొలగించి క్షమాపణ పోస్ట్ పెట్టి, చెంపలు వేసుకున్నాడు. ఇలా మహిళలు వ్యతిరేకిస్తారని ఊహించలేకపోయానని ఏదో అందరూ ఎంజాయ్ చేస్తారని భావించానని కనుక క్షమించమని వేడుకున్నాడు. కాని వ్యవహారం అంత సులభంగా అతణ్ణి వదిలిపెట్టేలా లేదు.కెరీర్‌పై దృష్టి పెట్టాల్సిన వయసులో కుర్రాళ్లు ఇలాంటి వైపరీత్యాలకు పోయి జీవితాలు పాడు చేసుకోవడం ఈ కాలపు విషాదం. -
దుమ్మురేపుతున్న 'ధృవ' టీజర్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' టీజర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. దసరా కానుకగా మంగళవారం విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ ను ఇప్పటి వరకు 30 లక్షల మందిపైగా వీక్షించారు. విడుదలైన 24 గంటల్లోపే ఈ టీజర్ కు 10 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో దీన్ని షేర్ చేశారు. 'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది.. నా శత్రువును సెలెక్ట్ చేసుకున్నా..' అంటూ రాంచరణ్ చెప్పిన డెలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జారా లార్సన్ : ఎయిన్ట్ మై ఫాల్ట్ ‘నా తప్పు కాదు’ అంటోంది స్వీడిష్ సింగర్ జారా లార్సన్! దేని గురించి మాట్లాడుతోంది ఈ 18 ఏళ్ల పాప్ సింగర్? ‘నీ ప్రియుడు నా వైపు చూస్తే అది నా తప్పు కాదు’ అని తనలాంటి ఇంకో అమ్మాయికి చెబుతోంది జారా. ‘పిల్లా... నేను చూడకూడదనుకున్న చోట నువ్వు చేతులు అడ్డుపెట్టుకో. అయినప్పటికీ ఆ చేతి వేళ్ల ఖాళీల్లోంచి అతడు గనుక నన్ను చూస్తుంటే అందుకు నన్ను తప్పు పట్టకు. చెబుతున్నా’ అంటూ పాడుతుంది జారా లార్సన్. ‘అసలు నాకేం బాధ్యత లేదు’ అని కూడా అంటుంది. పాపం, ఆ అమ్మాయి ఎవరో కానీ ఎలా తన ప్రియుణ్ణి జారా లార్సన్ నుంచి, మిగతా అమ్మాయిల నుంచి కాపాడుకోవడం?! ప్రేమలో పడితే అంతే మరి. ప్రేమను కాపాడుకోవడంతోనే సరిపోతుంది! జారా సెకండ్ స్టుడియో ఆల్బమ్‌లోని సింగిల్ లీడ్.. ఈ సాంగ్. జారా అంత తేలిగ్గా ఏమీ ఈ గీతాన్ని ఆలపించలేదు. ‘ఓవ్ ఓవ్ ఓవ్ ఐ కాంట్ సింగ్ దిస్’ అన్నారు. ‘అసలు నేను ఆ టైపే కాదు. నాలాంటి ఒక ఆడపిల్ల ప్రియుడిని దొంగిలించడం నా వల్ల కాదు’ అంటూ పాటలోని ఇన్సెన్సిబిలిటీని పలచబార్చుతూ కొన్ని మార్పులు చేయించారు. ఆ తర్వాత మాత్రమే పాడేందుకు అంగీకరించారు. ‘ఎవరి ప్రియుణ్ణి వాళ్లే చేజారకుండా చూసుకోవాలి’ అనే అర్థం వచ్చినట్లున్న మొదటి వెర్షన్ కాస్తా... ఇలా.. ‘నీ బాధను నేను అర్థం చేసుకోగలను’ అనే లైన్లోకి మారిపోయింది. రైట్. అమ్మాయి మనసు ఇంకో అమ్మాయికి మాత్రమే అర్థమౌతుంది. గ్రేట్ జారా! బిల్లీ ఆన్ ది స్ట్రీట్ : సీజన్ 5 ట్రైలర్ బిల్లీ ఈజ్ బ్యాక్! నవంబర్ 15 నుంచి అమెరికన్ టీవీ ఛానెల్ ‘ట్రూ టీవీ’లో! ఎవరీ బిల్లీ? బిల్లీ ఐక్నర్. అమెరికన్ కామెడీ గేమ్ షో హోస్ట్. న్యూయార్క్ వీధులలోకి వెళ్లి... దారినపోయే దానయ్యలను, దానమ్మలను ఆపి ప్రశ్నలు అడిగి ఫన్ని క్రియేట్ చేస్తుంటాడు బిల్లీ. ‘ఫర్ ఎ డాలర్’, ‘క్విజ్డ్ ఇన్ ది ఫేస్’, ‘అమెచ్యూర్ స్పీడ్ స్కెచ్’ అనేవి ఈయన మళ్లీ మళ్లీ ఆడుతుంటే ఆటలు! 2011లో ఈ కామెడీ షో మొదలైంది. శాంపిల్‌గా ఇందులో ‘ఫర్ ఎ డాలర్’ గేమ్‌ని చూపించారు. బిల్ ఒక ప్రశ్న అడుగుతాడు. కరెక్ట్ సమాధానం చెప్పినవాళ్లకు ఒక డాలర్ ఇస్తాడు. (ఈ వీడియోలో ఒక అమెరికన్ మహిళ విండో షాపింగ్ చేస్తూ ఉంటుంది. బిల్లీ వెళ్లి ‘మిస్.. మిస్.. ఒక లయర్ పేరు చెప్పండి’ అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ, డొనాల్డ్ ట్రంప్ అంటుంది. బిల్లీ ‘వావ్’ అంటాడు. ఆమెకు గిఫ్ట్‌గా ఓ డాలర్ ఇస్తాడు). ఇక ‘క్విజ్డ్ ఇన్ ది ఫేస్’ మూడు రౌండ్ల గేమ్. మొదటి రెండు రౌండ్లలో పాప్ కల్చర్ గురించి మూడు ప్రశ్నలు ఉంటాయి. ఫైనల్ రౌండ్లో ఒక జనరల్ క్వొశ్చన్ ఉంటుంది. దాని ఆన్సర్ బిల్లీ దగ్గరున్న ఆన్సర్‌కి సరిపోవాలి. గెలిస్తే గిఫ్ట్. ‘అమెచ్యూర్ స్పీడ్ స్కెచింగ్’లో మళ్లీ మిస్టర్ దానయ్యలు, మిస్ దానమ్మలు అక్కడికక్కడ ఒక సెలబ్రిటీ బొమ్మ గీయాల్సి ఉంటుంది. దాన్ని బిల్లీ ఇంకో దానయ్య /దానమ్మకు చూపించి ఎవరో చెప్పమంటారు. వాళ్లు చెప్పింది, వీళ్లు గీసిందీ ఒకటే అయితే విన్ అయినట్టు. అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తనతో రోడ్ల మీద తిప్పుతూ గేమ్స్ ఆడుతుంటాడు బిల్లీ! హైదరాబాద్ ట్రాఫిక్ సీన్స్ : మహాతల్లి కొంతమంది కంత్రీ గైస్ కొలాబరేషన్ ఈ వీడియో. షార్ట్ ఫిల్మ్‌లా ఉంటుంది. తీరూతెన్నూ లేని హైదరాబాద్ ట్రాఫిక్‌ను కూడా తీరుగా చూపించిన ఆ మహాతల్లి జాహ్నవీ దాసెట్టి. ‘మహాతల్లి’ అనే టాగ్‌తో ఫన్నీ సీన్స్‌ని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్న ఈ షార్ట్‌ఫిల్మ్ సూపర్ స్టార్... కర్నూలు అమ్మాయి. శేఖర్ కమ్ముల టీమ్మేట్లా అనిపిస్తాయి ఆ యాక్సెంట్, ఆ హావభావాలు. అమ్మాయిలు బండేసుకుని బయటికొస్తే ఎన్ని అనుభవాలు ఎదురౌతాయో, అబ్బాయిల్ని ఈ అమ్మాయిలు డ్రైవింగ్‌లో ఒకోసారి ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారో ఈ వీడియోలో చూడొచ్చు. ఫన్నీగా ఉంది. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి చెవుల్ని ఇన్డెరైక్టుగా మెలేయడమూ ఉంది. ఫెన్సెస్ టీజర్ ట్రైలర్ : పారామౌంట్ పిక్చర్స్ ఈ క్రిస్మస్కి విడుదలౌతున్న అమెరికన్-కెనడియన్ డ్రామా మూవీ ‘ఫెన్సెన్’ టీజర్ ఇది. అగస్ట్ విల్సన్ నాటకం ఫెన్సెస్ ఆధారంగా డెంజిల్ వాషింగ్టన్ ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. 1983లో పబ్లిష్ అయిన ఫెన్సిస్... ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్, టోనీ అవార్డ్‌లను గెలుచుకుంది. ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డెంజిల్ వాషింగ్టన్ చేతిలో నాటకం పడింది కాబట్టి.. ఈ సినిమా వెండితెరపైన కూడా పండినట్టే. 1950ల నాటి పిట్స్‌బర్గ్‌లో కథ మొదలౌ తుంది. ఒకప్పుడు నీగ్రో లీగ్ బేస్‌బాల్ ఆటగాడైన ట్రాయ్ మాక్సన్ పరిస్థితుల ప్రాబల్యం వల్ల చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన కుటుంబాన్ని పోషించడానికి జీవితం విధించిన షరతులన్నిటికీ తలవొగ్గుతాడు. భార్యనీ కష్టపెడతాడు. డెంజిల్ వాషింగ్టన్, వయోలా డేవిస్ భార్యాభర్తలుగా నటించారు. వీళ్లిద్దరి ఎమోషన్స్ ఎంత హైట్స్‌లో ఉన్నాయో టీజర్లో కనిపిస్తుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
రెండు ఫెర్న్ మొక్కల మధ్య హిల్లరీ క్లింటన్ బిట్వీన్ టు ఫెర్న్స్ విత్ జాక్ : హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న, అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న హిల్లరీ క్లింటన్‌ను జాక్ గాల్ఫినాకస్ అనే అతడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ♦ ఫస్ట్ గర్ల్ ప్రెసిడెంట్ కాబోతున్నారంటే మీకు ఎక్సైటింగ్‌గా ఉందా? ♦ ఒబామా ప్రభుత్వంలో సెక్రెటరీగా ఉన్నప్పుడు మీరు నిమిషానికి ఎన్ని పదాలు టైప్ చేసేవారు? ♦ ఒబామా కాఫీ ఎప్పుడు తాగుతారు? నీరసంగా ఉన్నప్పుడా? ♦ మీరు ప్రెగ్నెంట్ అయితే ఏం జరుగుతుంది? ♦ ఆ తొమ్మిది నెలలు అమెరికన్ ప్రజల్ని వైస్ ప్రెసిడెంట్ టిమ్ కెయిన్ పాలిస్తారా? (రెండు మూడు ప్రశ్నల తర్వాత హిల్లరీ విసుగ్గా ముఖం పెడతారు. ‘ది కంట్రీ గోస్ టు షిట్’ అని జాక్ కూడా విసుక్కుంటారు). ఇంటర్వ్యూ కొనసాగుతుంది. ♦ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఎంత బాగుంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ♦ ఒకవేళ ట్రంప్ ప్రెసిడెంట్ అయి, కిడ్ రాక్ విదేశాంగ కార్యదర్శి అయితే మీరు కెనడాగానీ, ఆర్కిటిక్గానీ పారిపోతారా? ♦ వ్వాట్! అమెరికాలోనే ఉండిపోతారా! అంటే అంతర్యుద్ధానికి మీరు నాయకత్వం వహిస్తారా? ♦ మీ ప్యాంట్స్, సూట్స్ కుట్టే టైలర్ని కలవాలనుంది నాకు. ♦ ఎందుకంటే హెలోవీన్ ఫెస్టివల్‌కి నేను లైబ్రేరియన్లా తయారై, అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నాను. ♦ డిబేట్‌కు మీరు ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్లాలనుకుంటున్నారు? ♦ మీ ప్రత్యర్థి ఎలాంటి బట్టలు వేసుకోవాలని కోరుకుంటున్నారు? ♦ మీ అమ్మాయి చెల్సియా, ట్రంప్ కూతురు ఇవాంకా ఫ్రెండ్స్ అయి ఉంటే కనుక వాళ్లిద్దరూ బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుకునేవాళ్లా? చెల్సియాకు వాళ్ల డాడీలా లవర్స్ ఉన్నారా? ♦ మీతో కాంటాక్ట్‌లో ఉండాలంటే ఎలా? ఈమెయిల్? ది ఎండ్. ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ ప్రశ్నలన్నిటికీ హిల్లరీ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఏం చెప్పారన్నది వీడియోలో చూడండి. బై ది వే... జాక్ గాల్ఫినాకస్..అమెరికన్ యాక్టర్, స్టాండప్ కమెడియన్. ‘ఫన్నీ అండ్ డై’ అనే ఒక కామెడీ అమెరికన్ వీడియో వెబ్సైట్ కోసం ఆయన హిల్లరీని ఇలా ఇంటర్వ్యూ చేశారు. మూడు రోజుల క్రితమే ఇది యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయింది. చూడకపోతే చాలా మిస్ అవుతారు. గంట ముందే తెలిసిపోతుంది! న్యూ టాలెంట్ వన్ అవర్ : తెలుగు షార్ట్ ఫిల్మ్ చాలామందికి భవిష్యత్తు తెలుసుకోవాలనిపిస్తుంది. జాతకం చెప్పించుకుంటారు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చుపెడతారు. అయితే జరగబోయేవి మంచివైతే పర్వాలేదు. ఒక గంటలో ఎవరినో చంపబోతున్నామని తెలిస్తే? ఊహించడానికే భయంగా ఉంది కదా! గంట ముందు కాదు కదా.. నిమిషం ముందు జరగబోయేది తెలిసినా దాన్ని తట్టుకోవడం కష్టం. ఈ ‘వన్ అవర్’ షార్ట్ ఫిల్మ్ కథా సారాంశం ఇదే. మంచి ఫిక్షన్. తిరుపతిలో బిటెక్ చదువుతూ, చదువు మీద కంటే సినిమాల మీదే శ్రద్ధ, భక్తి ఉన్న జి.బి.కృష్ణ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. అందరూ ప్రేమకథలు తీస్తుంటే, అందుకు భిన్నంగా తను ఒక మంచి కథ తీయాలనుకుని కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలన్నీ తనే నిర్వహించాడు కృష్ణ. ఇంతకుముందు ఇతడు పూరి జగన్నాథ్ ‘టెంపర్’ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశాడు. ఈ ‘వన్ అవర్’ అనేది కృష్ణ తీసిన తొలి షార్ట్ ఫిల్మ్. ఇందులో కథానాయకుడి పేరు సుధీర్. గంట ముందు తాను ఏం చేయబోతుందీ అతడికి ముందే తెలిసిపోతుంటుంది. అదీ అతని సమస్య. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. గతంలో జరిగిన సంఘటనలన్నిటి గురించీ డాక్టర్‌కు చెబుతాడు. దీన్నే ఫ్యూచర్ సెన్స్ అంటారనీ, మైండ్‌ని కూల్‌గా ఉంచుకోమనీ డాక్టర్ చెబుతాడు. ఏడాదిగా తను ప్రేమిస్తున్న అమ్మాయిని తను ఇంకో గంటలో చంపబోతున్నట్లు తనకు తాజాగా వైబ్రేషన్ వచ్చిందని చెబుతాడు సుధీర్. నిద్రమాత్రలు వేసుకుని పడుకోమని సలహా ఇస్తాడు డాక్టర్. కానీ ఆ సలహా పని చేయదు. గంటలోనే సుధీర్ తన ప్రియురాలిని చంపేస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. విశేషం ఏమిటంటే సినీ నటి రోజా ఈ షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి, ఈ యువకుడిని ప్రోత్సహించారు. ఎంతో అందంగా, చక్కగా తీసిన ఈ లఘుచిత్రంలో డైలాగులు ప్రత్యేక ఆకర్షణ. - వైజయంతి -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పెంటాటానిక్స్ అండ్ డాలీ పార్టన్ : జోలిన్ ‘ప్లీజ్ డోన్ట్ టేక్ మై మ్యాన్’! పాత పాట. 43 ఏళ్లనాటి పాట. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్‌గా! ప్లీజ్ డోన్ట్ టేక్ మై మ్యాన్. పాత ఏడుపే. ప్రేమలో ఉండే ఏడుపు. ‘నా భర్తను పట్టుకెళ్లిపోవద్దు. నా ప్రియుణ్ణి వలలో వేసుకోవద్దు. ప్లీజ్.. ప్లీజ్ జోలీన్’ అని వేడుకోలు. కొత్తగా పెళ్లయిన ఒక అమ్మాయి.. తన భర్త పనిచేసే చోట, ఆయనతో కలిసి పనిచేసే జోలీన్ అనే అందమైన అమ్మాయిని వేడుకునే పాట! అప్పట్లో ఈ పాటను రాసి, పాడింది డాలీ పార్టన్. ఆ తర్వాత చాలామంది పాప్ సింగర్లు ఈ పాటను పాడారు. పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పాటను అదే డాలీ పార్టన్ ఈ 70 ఏళ్ల వయసులో మళ్లీ ఫ్రెష్‌గా పాడారు. డాలీ అనుభవంలోంచి వచ్చిన పాట ఇది. 1973 అక్టోబర్‌లో రిలీజ్ అయిన డాలీ ఫస్ట్ సింగిల్ ఇది. ‘ఆఫ్ ద సేమ్ నేమ్’ అనే ట్రాక్లోనిది. 2004లో ‘రోలింగ్ స్టోన్’ మ్యాగజీన్ విడుదల చేసిన ‘ది 500 గ్రేటెస్ట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్’ జాబితాలో ‘ప్లీజ్ డోన్ట్..’ 217వ స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ జోలిన్ ఎవరు? డాలీ అభిమాని. డాలీ కెరియర్ ప్రారంభంలో ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న అమ్మాయి! తన భర్తను వలలో వేసుకుంటుందేమోనని డాలీ భయపడిన స్టన్నింగ్ బ్యూటీ క్యారెక్టర్‌కు ఈ అభిమాని పేరే పెట్టుకున్నారు డాలీ. తన హృదయేశ్వరుడిని ఎవరైనా ఎగరేసుకెళతారేమోనన్న అభద్రతలో ఉన్న అమ్మాయిలు ఈ పాటను విని కొంత ఊరటను పొందవచ్చు. వాళ్ల హృదయేశ్వరులను ఎగరేసుకుపోయే ఉద్దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలు కూడా ఈ పాటను విని, అభద్రతలో ఉన్న అమ్మాయిల ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. కెన్ యు సింగ్ యువర్ ఎబిసి ఫర్ మి? ‘‘గుడ్మాణింగ్’’ (టీచర్ చెప్పింది) ‘‘గుడ్మాణింగ్ మిస్ సీసీ’’ (నవ్వుతూ చెప్పాడు) ‘‘హౌ యు డూయింగ్’’ (టీచర్ అడిగింది) ‘‘హౌ యు డూయింగ్’’ (వీడూ నవ్వుతూ చెప్పాడు) ‘‘ఐ యామ్ డూయింగ్ గుడ్. యు డూయింగ్ గుడ్’’(టీచర్) ‘‘ఎస్’’ (నవ్వుతూ చెప్పాడు) ‘‘ఓ.. కెన్ యు సింగ్ యువర్ ఎబిసీస్ ఫర్ మీ?’’ (టీచర్ అడిగింది) వీడు ఏబీసీడులు ఎత్తుకున్నాడు. ఎలా ఎత్తుకున్నాడు? ఎలా కంటిన్యూ చేశాడు? ఎలా ది ఎండ్ చెప్పాడు? వీడియో చూడండి. చూశాక మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. దీన్ని బట్టి మీకేం అర్థమయిందో? పార్చ్డ్ : అఫీషియల్ ట్రైలర్ పార్చ్డ్ అంటే ‘ఎండిపోయిన’ అని అర్థం. లీలాయాదవ్ డెరైక్షన్‌లో అజయ్‌దేవగణ్ నిర్మించిన ఈ చిత్రం ఇండియా బయట విడుదలై ఏడాది అవుతోంది. ఇండియాలో ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఇప్పటికి ఈ మూవీకి 24 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. అలాగని ఇది పూర్తిగా అవార్డు చిత్రమనో, ఆర్ట్ కావ్యమనో అనుకోనక్కర్లేదు. ప్రాచీన ఆచారాలను పాటించే భారతదేశపు గ్రామాల్లో స్త్రీల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో రాణి, లజ్జో, బిజిలీ అనే ముగ్గురు అమ్మాయిల జీవితాల ద్వారా డెరైక్టర్ చూపించారు. చిత్రం మనసును కదిలిస్తుంది. చివరికి ముగ్గురూ విముక్తి పొందుతారు. విముక్తి కోసం ఆడపిల్లలు ఎంత పోరాటాం చెయ్యాలో ఇందులో చూస్తే కనుక ప్రతి ఇంటి ఆడపిల్లకూ చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది. రాధికా ఆప్టే, తన్నిష్ణా చటర్జీ, సుర్వీన్ చావ్లా.. ఈ చిత్రంలోని ఆ ముగ్గురు అమ్మాయిలు. మొవానా : అఫీషియల్ ట్రైలర్ నవంబర్ 24 ‘థాంక్స్‌గివింగ్ డే’! చాలా దూరమే ఉంది. బట్, గుర్తుంచుకోవలసిన సంగతి.. ఈ ఏడాది ప్రపంచ సినీ అభిమానులంతా వాల్ట్ డిస్నీకి థాంక్స్ చెప్పుకోవాలి. వాల్డ్ డిస్నీ నిర్మిస్తున్న హాలీవుడ్ ఏనిమేటెడ్ మూవీ ‘మొవానా’.. థాంక్స్‌గివింగ్ డేకి ముందురోజే విడుదలవుతోంది. ఇందులో మొవానా అనే కొండజాతి టీనేజర్ అసలు తను ఎవరో తెలుసుకోడానికి తన పూర్వీకుల జాడలను అన్వేషిస్తూ, సముద్రజలాల మీద సాహసయాత్ర ప్రారంభిస్తుంది. సముద్రం మీద అమెకు ‘మాయీ’ అనే డెమిగాడ్ (సగం మనిషి, సగం దేవుడు) తోడవుతాడు. మొవానాకు దారి చూపుతూ ఉంటాడు. మధ్యలో ప్రమాదాలు ఎదురౌతాయి. భయంకరమైన ఆకారాలు పీడించడానికి వస్తాయి. ఇద్దరూ కలిసి అన్నిటినీ ఎదుర్కొంటారు. ఈ అప్‌కమింగ్ 3డి కంప్యూటర్ ఏనిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ కామెడీ ఎడ్వంచరస్ ఫిల్మ్.. మనల్ని ఊరిసి సలపనివ్వకుండా వినోదంలో ముంచెత్తబోతోందని వీడియోలో వండర్ఫుల్ ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకే వాల్ట్ డిస్నీకి థాంక్స్ చెప్పుకోవాలి. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
హానెస్ట్ ఎయిర్‌లైన్ కమర్షియల్ నిడివి : 4 ని. 1 సె. : హిట్స్ : 24,69,132 ఎ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అనుకుంటాం కానీ... మనిషి ఎక్కడైనా మనిషే! బస్సులో, రైల్లో, విమానంలో ఎక్కడైనా ఒకటే. విమానంలో కూడానా? అంత ఆశ్చర్యపోకండి. తరచు విమానయానం చేసేవాళ్లను అడగండి. ఫ్లయిట్ జర్నీలో ఊహించని విధంగా ఎన్ని చికాకులు, అసౌకర్యాలు ఉంటాయో తెలుస్తుంది. లేదా ఈ వీడియో చూడండి. మీకు నవ్వొస్తుంది. కోపం వస్తుంది. ఇంకా రకరకాల ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నిగహిగ పేరుతో యూట్యూబ్‌లో తరచు మీకు కనిపించే 26 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్, యాక్టర్ రియాన్ హిగ ఈ ‘హానెస్ట్ ఎయిర్ లైన్ కమర్షియల్’ను తయారుచేశాడు. ప్రపంచంలోని ప్రతి ఎయిర్‌లైన్‌లోనూ ఇంతే అనే అర్థం వచ్చేలా ‘ఎవ్రీ ఎయిర్‌లైనర్’ అని పేరుపెట్టి ఈ వీడియోను అప్లోడ్ చేశాడు. మూడు సీట్ల వరుసలో ఇద్దరి మధ్య నజ్జునజ్జు అవడం, వెనక సీట్లోంచి కాలొచ్చి ముందు సీటు చెయ్యి మీద ఉల్లాసంగా తాళం వెయ్యడం, పిలుస్తున్నా పలక్కుండా పక్క నుంచే ఎయిర్ హోస్టెస్ వెళ్లిపోవడం, చెవులు చిల్లులు పడేలా ఇయర్ఫోన్స్లోంచి అనౌన్స్మెంట్ వినిపించడం.. ఇందులో మీకు కనిపించే ఒక మోస్తరు అనుభవాలు. అంతకన్నా భయంకరమైన అనుభవాలను చూసేందుకు మీరు కనుక ఉవ్విళూరుతున్నట్లయితే వీడియో ఆసాంతం వీక్షించండి. సయా : ది గ్రేటెస్ట్ నిడివి : 5 ని. 51 సె. : హిట్స్ : 2,85,48,856 త్వరలో విడుదల అవబోతున్న ఆస్ట్రేలియన్ గాయని సయా ఫర్లర్ 8వ స్టుడియో ఆల్బమ్ ‘వియ్ ఆర్ యువర్ చిల్డ్రన్’లోని ఈ సింగిల్ ట్రాక్ ‘ది గ్రేటెస్ట్’ యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయిన మూడు రోజులకే రెండు కోట్ల హిట్లు దాటేసింది! ఉద్వేగభరితమైన ఈ పాటకు అమెరికన్ డాన్సర్ మాడీ జీగ్లర్ అర్థవంతమైన దృశ్యరూపాన్ని ఇచ్చారు. ‘డోన్ట్ గివ్ అప్.. ఐ వోన్ట్ గివ్ అప్.. డోన్ట్ గివ్ అప్.. నో నో నో..’ అనే రిపీటెడ్ లైన్స్‌తో వెళుతుండే ఈ భావగీతం.. ‘‘ఓ ఓ, రన్నింగ్ అవుట్ అఫ్ బ్రీత్, బట్ ఐ ఓ, ఐ, ఐ గాట్ ద స్టామినా.. ’అని మొదలౌతుంది. ‘ఐ యామ్ ఫ్రీ టు బి ద గ్రేటెస్ట్, ఐ యామ్ ఎలైవ్’ అని ఎండ్ అవుతుంది. అమెరికాలోని ఆర్లండోలో ఇటీవల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా సయా ఈ సింగిల్‌ని రిలీజ్ చేశారు. వీడియోలో జీగ్లర్ తన బుగ్గలపై రెయిన్బో చారికలతో కనిపిస్తారు. ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో తక్కిన డాన్సర్లు ఉగ్రవాదాన్ని పరిహసిస్తున్న ధోరణిలో అభినయాన్ని సహవాద్యంగా అభినయిస్తుంటారు. అండర్‌వరల్డ్ : బ్లడ్ వార్స్ / ట్రైలర్ నిడివి : 1 ని. 48 సె. : హిట్స్ : 21,02,005 హాలీవుడ్ యాక్షన్ హారర్ ఫిల్మ్ ‘అండర్‌వరల్డ్ : బ్లడ్ వార్స్’ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అండర్ వరల్డ్ సీరీస్‌లో ఐదో సీక్వెల్ అయిన ఈ చిత్రానికి మొదట అనుకున్న పేరు ‘అండర్ వరల్డ్ : నెక్స్ట్ జనరేషన్’. మూవీ 2017 జనవరి 6న రిలీజ్ అవుతోంది. కేట్ బెకిన్సేల్ హీరోయిన్. నిజానికి హీరోయిన్ కాదు. డెత్ డీలర్! చావుతో ఆటాడుకునే చలాకీ పిల్ల. సీరీస్ అన్నిట్లోనూ కేట్ కంటిన్యూ అవుతోంది. ఈ కొత్త సీక్వెల్ కథ ఏమిటో పూర్తిగా తెలియకున్నా, మొత్తానికైతే వాంపైర్స్కీ, లైకాన్స్కి (తోడేలు సంతతి మనుషులు) మధ్య పోరాటమే ప్రధాన కథాంశం అని ట్రైలర్‌ని చూస్తే అనిపిస్తోంది. బై ది వే.. ఇందులో కేట్ కొత్త హెయిర్ స్టెయిల్తో కనిపించబోతున్నారు. బహుశా ఇది అండర్ వరల్డ్ సీరిస్‌లో అఖరిది కావచ్చు. ఎందుకంటే మానవాళి సంక్షేమం కోసం వాంపైర్లు, లైకాన్ల మధ్య యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో కేట్ ఇందులో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడే అవకాశాలు ఉన్నాయి. ఏ దిల్ హై ముష్కిల్ : ఫుల్ సాంగ్ నిడివి : 2 ని. 58 సె. : హిట్స్ : 83,00,903 ప్రేమ ప్రాణం పోస్తుంది. బ్రేకప్ అయితే ప్రాణం తీస్తుంది. మళ్లీ ఇంకొకరికి ప్రాణం ఇస్తుంది. కరన్ జోహార్ డెరైక్షన్‌లో వస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ స్టోరీ లైన్ ఇది. ఈ టైటిల్ సాంగ్‌లో ఈ బ్రేకప్ లవ్‌ని, ప్యాకప్ లవ్‌నీ మీరు చూడొచ్చు. ఐశ్వర్యారాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మల మధ్య నడుస్తుందని అనుకుంటున్న ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఎన్నో కన్నీళ్లు, సంతోషాలు. ‘నువ్వు నా ప్రయాణం. నువ్వు నా గమ్యం. అయినప్పటికీ హృదయమా నీతో జీవించడం కష్టం’ అనే అర్థం వచ్చేలా ‘తూ సఫర్ మేరా.. హై తు హై మేరీ మంజిల్.. తేరా బినా గుజారా.. ఏ దిల్ హై ముష్కిల్’ అంటూ రణబీర్ కపూర్ బరువెక్కిన గుండెతో పాడుతున్నప్పుడు విడిపోయిన అనుష్కతో అతడి జ్ఞాపకాలు, కొత్తగా కలుసుకున్న ఐశ్వర్యతో అతడి అనుభూతులు రెండూ కంపారిటివ్‌గా ప్రత్యక్షమవుతూ, అదృశ్యమవుతూ ఉంటాయి. మనుషులతో ప్రేమ ఆడుకుంటుందా? ప్రేమను మనుషులే ఒక ఆట ఆడుకుంటారా? ఎప్పటికీ సమాధానం తెలియని ఈ ప్రశ్నకు ఒక అందమైన చిత్రీకరణ ఈ ఎమోషనల్ సాంగ్. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఇరు ముగన్ : అఫిషియల్ ట్రైలర్ యూట్యూబ్‌లో ‘కబాలి’ తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు ‘ఇరు ముగన్’ చిత్రం హిట్ల మీద హిట్లు కొడుతోంది! ఇరు ముగన్ అంటే రెండు ముఖాలు అని అర్థం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ తమిళ్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో విక్రమ్, నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు. సంగీతం హ్యారిస్ జయరాజ్. ఈ చిత్రంపై నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జయా టీవీ ఇప్పటికే శాటిలైట్ హక్కులను తన్నుకుపోయింది. గత ఏడాది డిసెంబరులో చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ పర్ఫెక్షన్ కోసం దర్శక, నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు విడుదలను జాప్యం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. హాలీవుడ్ తరహాలో అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తూ, మధ్య మధ్య మధురమైన ప్రేమ సన్నివేశాలతో ఇరు ముగన్ గిలిగింతలు పెట్టబోతోందని ఈ ట్రైలర్‌ని చూస్తే అర్థమౌతోంది. నిడివి : 2 ని. 17 సె. హిట్స్ : 41,99,362 బ్రిట్నీ స్పియర్స్ : మేక్ మీ వీడియో సాంగ్ నిడివి : 4 ని. 53 సె. హిట్స్ : 49,33,788 అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ఈ నెల 26న విడుదల చేయబోతున్న తొమ్మిదవ స్టుడియో ఆల్బమ్‌లోని లీడ్ సాంగ్ ‘మేక్ మీ..’ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయింది. పాటను బ్రిట్నీతో పాటు మ్యాథ్యూ బర్న్, జో జనైక్, గెరాల్డ్ గిల్లమ్ కలిసి ఉమ్మడిగా రాశారు. ‘ ఐ యామ్ డ్రీమింగ్ ఎ మైల్ ఎ మినిట్ అబౌట్ సమ్‌బడీ... దిస్ ఫీలింగ్, ఐ వానా గో విత్ ఇట్, కాస్ దేర్ ఈజ్ నో వే... అంటూ మొదలయ్యే మేక్ మీ సాంగ్... ‘మై హార్ట్ ఈజ్ ఆన్ ఫైర్ వెన్ యు ఆర్ అరౌండ్.. మేక్ మీ ఊ ఊ ఊ ఊ... యా, యూ మేక్ మీ ఊ ఊ’’ అని ముగుస్తుంది. యువతరంలో సున్నితమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్న ఈ వీడియో సాంగ్ ప్రస్తుతానికైతే యు.ఎస్.బిల్బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో 17వ స్థానంలో ఉంది. చార్ట్లదేముంది? మన హార్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచిపోయే పాట... మేక్ మీ. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అవర్ హోటెల్ హాడ్ యాన్ ఇంట్రెస్టింగ్ పాలసీ ఉల్లాసానికో, ఉత్సాహానికో ఎప్పుడూ టూర్లు కొడుతుండేవారు నిత్య జీవితంలో అస్సలు నివసించలేదు. వారి దేహంతో పాటూ, మనసూ నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే చూడండి... మనం తరచు ఆశ్చర్యపోతుండే విషయాలకు వాళ్లు ఏమాత్రం సర్ప్రైజ్ అవ్వరు. మన స్పందనలకు వాళ్ల స్పందనలకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. భ్రమణకాంక్ష (తిరగాలన్న కోరిక) ఉన్నవారు దేన్నీ పట్టించుకోరు. దేన్నీ లెక్కచెయ్యరు. క్రిస్ టేలర్ అనే అతడు కూడా ఇలాంటి ప్రయాణికుడే. ఈ మధ్య అతడు కాలిఫోర్నియాలోని రుబికాన్ కు 4000 మైళ్ల చరిత్రాత్మక ట్రిప్‌ను ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన స్నేహితులు కూడా. మార్గం మధ్యలోని వింతలు, విశేషాలు వాళ్లకేం కొత్త కాదు కానీ... గ్యాలప్ న్యూ మెక్సికో అనే రోడ్ సైడ్ హోటల్.. ఈ మిత్ర బృందానికి ఊహించని జర్క్ ఇచ్చింది. వీళ్లంతా ఒక రోజు ఉండడానికి ఆ హోటల్లో విడివిడిగా గదులు తీసుకున్నారు. ప్రతి గదికీ ఒక లాక్. ఆ లాక్ తియ్యడానికి ఒక కార్డ్. విషయం ఏంటంటే... క్రిస్ మిత్రుడు తన రూమ్ నెంబర్ 146ని తన దగ్గర ఉన్న కార్డుతో తెరిచాడు. అంతవరకు బాగుంది. అయితే అదే కార్డుతో అన్ని రూములూ ఓపెన్ అవుతున్నట్లు తెలుసుకుని నివ్వెరపోయాడు. క్రిస్ అండ్ కో.. నవ్వుకుంది. ఆ తతంగాన్ని ఇలా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. వాళ్లందరి డౌట్ ఏమిటంటే... క్రిస్ ఫ్రెండ్‌కి ఆ హాటల్ వాళ్లు పొరపాటున మాస్టర్ కీ గానీ ఇచ్చి ఉంటారా అని! డిష్యూం : అఫీషియల్ ట్రైలర్ రోహిత్ ధావన్ దర్శకత్వంలో జూలై 29న రిలీజ్ అవుతోన్న డిష్యూం చిత్రం ట్రైలర్ ఇది. జాన్ అబ్రహాం, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ల ఉత్కంఠ భరిత సన్నివేశాలను ఇందులో చూడొచ్చు. అయితే పరిమితిని మించి ఉత్కంఠను ఊహించినవారు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడవలసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఇంకా కొద్ది గంటల్లో మొదలవాల్సి ఉండగా మధ్యప్రాచ్యంలో ఇండియన్ టాప్ బాట్స్మన్ మిస్ అవుతాడు. అతడు ఏమైందీ, ఎక్కడుందీ తెలుసుకోడానికి అరేబియా సముద్రానికి రెండు వైపుల నుంచి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. 36 గంటలపాటు వేట మొదలు పెడతారు. తర్వాత ఏమైందన్నది స్టోరీ. మెలనీ మార్టినెజ్ - ఆల్ఫాబెట్ బాయ్ ‘ఐ నో మై ఎ బి సీ స్. ఎట్ యు కీప్ టీచింగ్ మీ...’ మెలనీ మార్టినెజ్ ఈ పాటను ఎవరి గురించి పాడుతున్నారు మీకు అర్థమై ఉంటుంది. టీనేజ్ ఆవేదన ఇది. నిజమే కదా టీన్స్‌లో ఉన్న పిల్లలకు అందరూ చెప్పేవాళ్లే. ‘మాకు తెలుసు’ అని మొత్తుకుంటున్నా ఈ పెద్దవాళ్లు వినరు కదా. అ అ ఆ.. బ బ బ బా.. మని మెల్లిగా రాగం అందుకునే ఈ పాట నిజానికి.. ‘ఆల్వేస్ ఎయిమింగ్ పేపర్ ఎయిర్‌ప్లేన్ ఎట్ మీ.. వెన్ యు ఆర్ అరౌండ్..’ అని మొదలౌతుంది. మెలనీ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్. నిన్న మొన్న పుట్టిన అమ్మాయి. ఏజ్ 21. టీన్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన మెలనీ.. డాల్హస్, పిటీ పార్టీ ఆల్బమ్స్‌తో... సీనియర్ల పాప్ గాయకుల సరసన చేరారు. అయితే ఇప్పుడీ యూట్యూబ్ వీడియో ఆమెను తిరిగి కౌమారప్రాయురాలిగా మార్చి పెద్దల్లో.. ఊహించని పరివర్తనను తెచ్చేంత ముచ్చటగా ఉంది. -
ఈ వారం యూటూబ్ హిట్స్
ఇన్క్రెడిబుల్ టైమ్ లాప్స్ ఆఫ్ బర్డ్స్ నెస్ట్ టాన్ న్యూయన్ పేరుతో యూట్యూబ్‌లోకి మూడు రోజుల క్రితమే విడుదలైన ఈ వీడియోను సున్నిత మనస్కులు చూడకపోవడమే మంచిది. అయితే విధి చేసే వింతలు చూడాలన్న ఆసక్తి ఉన్నవారు దీనిని ఏమాత్రం మిస్ చేసుకోకూడదు. ఒక మహావృక్షం. అందులో చిన్న పక్షి గూడు. ఆ గూడులో నాలుగు గుడ్లు. వాటిని పొదిగేందుకు వచ్చి వెళుతున్న పక్షి. ఆ పక్షితో పాటు రోజూ ఆ గుడ్లు పొదిగాయా లేదా అని తన ‘గోప్రో’ కెమెరాతో మాటు వేసి ఉన్న టాన్ న్యూయన్ అనే నెటిజన్. ఇదీ సీన్. ఓ రోజు ఆ పక్షి అప్పటి వరకు గుడ్లు పొదిగి ఎక్కడికో వెళ్లింది. అది అలా వెళ్లగానే టాన్ ఇలా పక్షి గూడుకు గురిపెట్టి తన వీడియో కెమెరాను జూమ్ చేశాడు. అందులోంచి ఓ దృశ్యం చూసి అదిరిపోయాడు. ఏమిటా దృశ్యం? గుండె చిక్కబట్టుకుని చూడండి. మదారి : అఫీషియల్ ట్రయల్ జూన్ 10న విడుదలకు సిద్ధమైన ‘మదారి’ చిత్రం ట్రైలర్‌ను టీ సీరీస్ రిలీజ్ చేసింది. ఇర్ఫాన్ ఖాన్, జిమ్మీ షేర్గిల్, తుషార్ డాల్వి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిషికాంత్ కామత్ డెరైక్షన్‌లో తయారైన ఈ సోషల్ థ్రిల్లర్... ‘బజరంగీ భాయ్‌జాన్’లా ప్రేక్షకాదరణ పొందే అవకాశాలున్నాయని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. 2012లో నిర్మాణంలో ఉన్న ముంబై మెట్రో బ్రిడ్జి కూలిపోయిన ఘటన ఆధారంగా దర్శక, నిర్మాతలు కథను అల్లుకున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని ఇర్ఫాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. న్యూఢిల్లీ, రాజస్థాన్, డెహ్రాడూన్, షిమ్లా, ముంబైలలో చిత్ర నిర్మాణం జరిగింది. ఇర్ఫాన్ ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సామాన్యుడిలా కనిపిస్తాడని తప్ప అసలు కథ బయటికి రాలేదు. మెగాన్ ట్రైనర్ - మీ టూ ఈ వారం యూట్యూబ్ హిట్స్లోని పక్షిగుడ్ల వీడియోను వీక్షించి నిర్వేదంలోకి వెళ్లినవారు.. ఈ వీడియోను చూసి రిఫ్రెష్ అవొచ్చు. 22 ఏళ్ల అమెరికన్ గాయని మెగాన్ ఎలిజబెత్ ట్రైనర్ సొగసుగా అడుగులు వేస్తూ లయబద్ధంగా ఆలపించిన ‘మీ టూ’ సాంగ్ మిమ్మల్ని ఉల్లాసవంతమైన ఉషోదయం నుంచి ఆహ్లాదకరమైన సాయంత్రాల వరకు నడిపించుకుంటూ వెళుతుంది. ‘ఐ థాంక్ గాడ్ ఎవ్రీ డే.. దట్ ఐ వోకప్ ఫీలింగ్ దిస్ వే’ అంటూ మెగాన్ దంతధావనాన్ని ప్రారంభించి, ‘ఇఫ్ ఐ వాజ్ యు, ఐ వుడ్ వాన్నా బి మి టూ’ అనే చరణంతో నైట్ క్లబ్లో తేలుతుంది. మధ్యలో ఒకసారి మన ఉషా ఉతుప్లా నవ్వుతుంది. ఓపమ్ గంగ్నమ్ స్టెయిల్ను గుర్తుకు తెచ్చే స్టెప్పులూ వేస్తుంది. జేసన్ డిరులో - ‘ఇఫ్ ఇట్ ఎయిన్ట్ లవ్’ ‘ఇది ప్రేమ కాకపోతే, ఎందుకింత బాగుంది?’ స్ట్రెయిట్ క్వొశ్చన్! అమెరికన్ గాయకుడు, గేయ రచయిత జేసన్ డెరులో అడుగుతున్నాడు చెప్పండి. ప్రేమ ఎందుకంత బాగుంటుంది? డిస్కోగ్రఫీలో జగద్విఖ్యాతుడైన జేసన్ తాజా మ్యూజిక్ ఆల్బమ్ ‘ఇఫ్ ఇట్ ఎయిన్ట్ లవ్’. ఆఫీస్ వర్క్‌ప్లేస్‌లో ఈ పాట మొదలవుతుంది. కంప్యూటర్ ముందు కూర్చోని, అదే గదిలో ఇంకో టేబుల్ మీద సిస్టమ్‌తో పనిచేసుకుంటున్న అమ్మాయి ప్రేమలో పడతాడు జేసన్. పడి, ఆమెను కూడా పడేసేందుకు పాట మొదలు పెడతాడు. దాంతో పాటు డాన్స్. అ అమ్మాయి నవ్వుతుంది. ఆమె ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, ఆమె ఆఫీస్ నుంచి వెళ్లేటప్పుడు తనకు ఎలాగుంటోందో చెబుతాడు. ‘ఆన్ ది టిప్ ఆఫ్ మై టంగ్.. ది ఫ్లేవర్ ఆఫ్ యువర్ స్కిన్ లింగర్స్ ఆన్ మై లిప్స్’ అంటూ.. తలకిందులైపోతాడు. యూత్‌కి నచ్చే వీడియో. -
ఈ వారం యూటూబ్ హిట్స్
బ్యాటిల్‌ఫీల్డ్ 1 : ట్రైలర్ ఈ ఏడాది అక్టోబర్ 21న విడుదల కాబోతున్న వీడియో గేమ్ ‘బ్యాటిల్‌ఫీల్డ్ 1’ ట్రైలర్ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తయారౌతున్న ఈ గేమ్‌ను స్వీడన్ కంపెనీ.. ‘ఈ డైస్’ అభివృద్ధి చేస్తోంది. బ్యాటిల్‌ఫీల్డ్ సిరీస్‌లో ఈ ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్ 14వ ది. గేమ్ ఆడేవారే ఇందులో షూటర్ కాబట్టి దీనిని ఫస్ట్ పర్సన్ వీడియో గేమ్ అంటున్నారు. ఇందులో చారిత్రక యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. శతఘు్నలు గర్జిస్తాయి. శత్రువులు నేల కూలుతారు. యుద్ధట్యాంకులు, విమానాలు, నౌకలు.. కళ్ల ముందు యుద్ధవాతావరణాన్ని సృషించి గేమ్ ఆడేవారిని సాయుధుడైన సైనికుడిలా, దేశభక్తుడిలా మార్చేస్తాయి. డేనియల్ బెర్లిన్ డిజైన్ చేసిన ఈ కొత్త బ్యాటిల్‌ఫీల్డ్ గతంలో వచ్చినవాటికన్నా మరింత భిన్నంగా ఉండబోతోందని నిర్మాత అలెగ్జాండర్ గ్రాండెల్ చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్ లలో ఇది రిలీజ్ అవబోతోంది. తొలి బ్యాటిల్ ఫీల్డ్ గేమ్ ‘బ్యాటిల్‌ఫీల్డ్ 1942’ అనే పేరుతో 2002లో మార్కెట్లోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ఆధారంగా అది తయారైంది. టిఇ3ఎన్ : ట్రైలర్ రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో జూన్ 10 న విడుదలకు సిద్ధమౌతున్న బాలీవుడ్ చిత్రం టిఇ3ఎన్ ట్రైలర్ ఇది. 2013లో వచ్చిన కొరియన్ చిత్రం ‘మాంటేజ్’ ఆధారంగా ఈ.. టిఇ3ఎన్ను థ్రిల్లర్ మూవీగా మలిచారు. అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్దికీ, విద్యాబాలన్, సవ్యసాచి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో.. అమితాబ్ మనవరాలు ఏంజెలా ఎనిమిదేళ్ల క్రితం కిడ్నాప్ అవుతుంది. అప్పటి నుంచీ ఆయన న్యాయం కోసం పోరాడుతూనే ఉంటారు. తన మనవరాలు ఆచూకీ తెలిసిందా అని అడిగేందుకు రోజూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వస్తుంటాడు. అయితే అక్కడ ఆయనకు నిర్లక్ష్యమే సమాధానంగా ఎదురవుతూ ఉంటుంది. ఎవరూ పట్టించుకోరు. ఏ విషయమూ చెప్పరు. చివరికి ఒక మతబోధకుడిని (నవాజుద్దీన్ సిద్దికీ) ఆశ్రయిస్తారు అమితాబ్. నవాజుద్దీన్ గతంలో పోలీసు. అతడి సహాయంతో ఏంజెలాను ఎవరు అపహరించిందీ అమితాబ్ తెలుసుకునే క్రమంలో సినిమా మలుపు తిరుగుతుంది. ఏంజెలా లాంటిదే మరో కిడ్నాప్ జరుగుతుంది. దానిని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ విద్యాబాలన్, నవాజుద్దీన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా ఏంజెలా కిడ్నాపర్ల విషయమై అమితాబ్‌కి ఆయన సొంత ప్రయత్నాల వల్ల సమాచారం దొరుకుతుంది. టిఇ3ఎన్.. ఉద్వేగం, ఉత్కంఠ కలిసిన చిత్రం అని ఈ ట్రైలర్‌ను చూస్తే అర్థమౌతుంది. -
ఈ వారం యూటూబ్ హిట్స్
హౌస్‌ఫుల్ 3 : ట్రైలర్ ఈ ఏడాది జూన్ 3న విడుదల అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘హౌస్‌ఫుల్ 3’ అఫిషియల్ ట్రయల్ రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ న్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి వారితో కామెడీ పండించడంలో ఫర్హాద్ సాదిజ్ (దర్శకుడు) సక్సెస్ కొట్టారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ‘నేను బటూక్ పటేల్. లండన్ సిటీ లక్కీయెస్ట్ ఫాదర్. ఎందుకంటే నవనాగరికులైన ముగ్గురు కూతుళ్ల తండ్రిని నేను’ అంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుండే బొమన్ ఇరానీతో ట్రైలర్ మొదలవుతుంది. వెంటనే ఆ ముగ్గురు కూతుళ్లూ ఆయన చెప్పినట్లుగానే నవ నాగరిక దుస్తులలో నవ్వుతూ, తుళ్లుతూ దర్శనం ఇస్తారు. అయితే వాళ్లకు పెళ్లి చెయ్యడం బొమన్‌కు ఇష్టం ఉండదు. వాళ్లు మాత్రం చక్కగా ప్రేమలో పడతారు. ఇక వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్ పని.. ఆ అమ్మాయిల తండ్రిని తమ పెళ్లికి ఒప్పించడం. అందుకోసం ఆ ముగ్గురు హీరోలు ఎన్ని పాట్లు పడ్డారు అన్నది సినిమాలో చూడవచ్చు. ట్రైలర్ ఆల్రెడీ హిట్ కొట్టేసింది. నిడివి : 3 ని. 27 సె. హిట్స్ : 78,97,608 కపిల్ శర్మ షో - ఎపిసోడ్ 2 లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘బాగీ’ హీరో టైగర్ ష్రాఫ్, అందులోనే ఆయన సరసన నటించిన అపురూప అందాల తార శ్రద్ధాకపూర్ కలిసి కపిల్ శర్మ దర్బార్‌లో అక్కడి గ్యాంగ్‌తో సినిమా ప్రమోషన్ కోసం వేసిన స్కిట్ల వంటి వీడియో షూట్ ఇది. సోనీ టీవీలో రెండో ఎపిసోడ్‌గా ఇది ప్రసారం అయింది. కలర్స్ టీవీ చానెల్ నుంచి విడిపోయి వచ్చి, కొంత విరామం తర్వాత కపిల్ శర్మ.. సోనీలో తన షోని మొదలు పెట్టారు. తొలి ఎపిసోడ్ ఏప్రిల్ 23న టెలికాస్ట్ అయింది. దానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. కడుపు చెక్కలయ్యేలా నవ్వించడంలో తన సత్తా కొద్దిగానైనా తగ్గలేదని కపిల్ కూడా తన రీ ఎంట్రీతో నిరూపించుకున్నారు. ఇప్పుడీ రెండో ఎపిసోడ్‌లోనూ అతడు దానిని నిలబెట్టుకున్నాడు. వీడియో నిడివి కాస్త పెద్దదే అయినా... అందులోని గిలిగింతల కామెడీ వల్ల వీక్షణ సమయం ఎక్కువగా ఉన్నట్లు అనిపించదు. నిడివి : 1 గం. 10 ని.16 సె. హిట్స్ : 30,71,929 -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఫార్మేషన్ (డర్టీ) : మ్యూజిక్ వీడియో అమెరికన్ సింగర్ బేయాన్స్ విడుదల చేసిన సింగిల్ ట్రాక్.. ‘ఫార్మేషన్ (డర్టీ)’. ఇందులో లయబద్ధంగా నాట్యమాడే బేయాన్స్తో పాటు ఆమె కూతురు బ్లూ ఐవీ కార్టన్‌ను కూడా చిన్న సన్నివేశంలో చూడొచ్చు. ప్రకృతి విలయాలు, నేరగ్రస్త మానవ స్వభావాలను థీమ్‌గా తీసుకుని, ‘లేడీస్.. అందరం ఒకటిగా ఫామ్ అవుదాం’ అనే అర్థంలో బేయాన్స్ ఈ పాటను పాడి, చిత్రీకరించారు. ఇందులోని మ్యూజిక్ మన చేత ఆన్ ది స్పాట్ డాన్స్ చేయిస్తుంది. వరద నీటిలో సగం మునిగిపోయి ఉన్న పోలీసు వాహనంపై బేయాన్స్ పడుకుని ఉండడంతో వీడియో మొదలౌతుంది. ‘మై డాడీ అలబామా.. మామా లూసీయానా.. యు మిక్స్ దట్ నీగ్రో విత్ దట్ క్రెయోల్ మేక్ ఎ టాక్సస్ బామా...’ అని బేయాన్స్ పాడుతున్నప్పుడు ఆ బీట్ ‘వ్రూమ్’ అంటూ వీక్షకుల్ని తనతో పాటు ఈడ్చుకుని వెళుతుంది. తప్పక చూడండి. బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ టీజర్ పోస్టర్లు, ట్రైలర్లు విడుదల అవుతూ ఊరిస్తున్నాయే కానీ.. ‘డాన్ ఆఫ్ ది జస్టిస్’ చిత్రం విడుదలయ్యే సమయం మాత్రం దగ్గరపడడం లేదు. ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ కాబోయే ఈ అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ కోసం ప్రేక్షకులు ఇంత ఇదిగా ఎదురు చూడడానికి 2013లో వచ్చిన దీని ప్రీక్వెల్ ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ఒక కారణం అయితే, పోస్టర్లు, టీజర్లలోని ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఇంకో కారణం. రెండు ప్రధాన క్యామిక్ క్యారెక్టర్లలో ఒకటైన బ్యాట్‌మ్యాన్ పాత్రను బెన్ ఎఫ్లెక్స్, సూపర్‌మ్యాన్ పాత్రను హెన్రీ కావెల్ పోషిస్తున్నారు. మానవాళిని విపత్తు నుండి కాపాడే ప్రయత్నంలో బ్యాట్మ్యాన్కీ, సూపర్మ్యాన్కీ మధ్య జరిగే పోరాటాలు పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. అద్దాలు బద్దలవడం, తుపాకులు మోతమోగడం, పిడిగుద్దుల ప్రతిధ్వనులు, వీటన్నిటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ తాజా ట్రైలర్‌లోని ప్రత్యేక ఆకర్షణలు. కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921) : ట్రైలర్ మరో బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ‘కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921)’ సినీ ప్రియుల కోసం సిద్ధం అవుతోంది. మార్చి 18న విడుదల అవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెరైక్షన్ షకున్ బాత్రా. నిర్మాత కరణ్ జోహార్. నవ్వులు, కన్నీళ్లు, భావోద్వేగాలతో నడిచే ఈ కథలో కుటుంబ సంబంధాల్లోని సున్నితమైన హాస్యమే ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. చిన్నప్పుడే విడిపోయి ఉంటారు. తొంభై ఏళ్ల తాతగారికి హార్ట్ ఎటాక్ అని తెలిసి తమ చిన్నప్పటి ఇంటికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి అదంతా ఓ ఫ్యామిలీ డ్రామా, కామెడీ డ్రామా. ట్రైలర్‌ను చూస్తూ కూడా మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చు! -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పుస్సీ రాయ్ట్ - చైకా : మ్యూజిక్ వీడియో నిడివి : 2 ని. 52 సె. హిట్స్ : 14,11,823 రష్యన్ జనరల్ ప్రాసిక్యూటర్ యూరి చైకాకు నేర ప్రపంచంతో ఉన్న అవినీతి, అక్రమ సంబంధాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీనిపై వెంటనే విచారణ జరిపి ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రష్యాలోని ‘పుస్సీ రాయ్ట్’ అనే ఫెమినిస్టు పంక్ రాక్ గ్రూపు తయారు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆ దేశంలో సంచలనం రేపుతోంది. అలాగని ఇది చూడడానికి మరీ నిస్సారమైన వీడియో ఏమీ కాదు. సామాజిక సందేశంతో పాటు, హాస్యం, వ్యగ్యం, స్పైస్ కూడా ఇందులో కలగలసి ఉన్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ మీ చేత లయబద్ధంగా దేశభక్తి నాట్యాన్ని చేయిస్తుంది. దేశభక్తి ఏ దేశంలోనైనా ఒకటే కదా. ‘విధేయంగా ఉండు.. ఒదిగి ఉండడం నేర్చుకో. లౌకిక విషయాల గురించి ఆలోచించకు. అధికారంలో ఉన్నవారికి అణకువతో ఉండు. ఎందుకంటే ఆ అధికారం దేవుడిచ్చిన కానుక’ అంటూ సెటైరికల్‌గా సాంగ్ సాగుతుంది. మి బిఫోర్ యు : ట్రైలర్ నిడివి : 2 ని. 47 సె. హిట్స్ : 13,49,169 ఇంగ్లండ్ రచయిత్రి జోజో మోయజ్ నవల ‘మీ బిఫోర్ యూ’ ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ని రెండు రోజుల క్రితమే యు.కె.లోని వార్నర్ బ్రదర్స్ కంపెనీ అప్లోడ్ చేసింది. వాలెంటైన్స్ డే వేళ కావడంతో ఈ ప్రేమకథా చిత్రం ప్రేయసీ ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ ఇది విడుదల కాబోతున్నది మాత్రం జూన్ (3)లో. ‘లివ్ బోల్డ్లీ’ అనే సందేశాన్నిచ్చే ఈ చిత్రం అంతా పూర్తిగా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా గొప్ప ప్రేమ వరంలా లభిస్తుంది. జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది.. అనే అద్భుతమైన థీమ్‌తో తయారౌతున్న ‘మీ బిఫోర్ యూ’ చిత్రం ట్రైలర్ కూడా అంతే అద్భుతంగా ఉంది. పప్పీస్ ప్రిడిక్ట్ సూపర్ బౌల్ 50 నిడివి : 2 ని. 31 సె. హిట్స్ : 7,66,219 జిమ్మీ ఫాలెన్ ‘ది టునైట్ షో’లోని పప్పీ ప్రిడిక్టర్స్ గేమ్ ప్రోగ్రామ్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్. ఆట పేరు ‘సూపర్ బౌల్ 50 ఎడిషన్’. ఇందులో రెండు జట్లు ఉంటాయి. కరోలినా పాంథర్స్, డెన్వర్ బ్రాంకస్. జట్లు అంటే బౌల్స్ అన్నమాట. అలాగే ఇందులోని ఆటగాళ్లు తొమ్మిది పప్పీలు. రెండు బౌల్స్‌లో పప్పీ ఫుడ్ ఉంటుంది. ఈ తొమ్మిది పప్పీలు ఈ బౌల్స్కి దూరంగా ఒక అర లాంటి ప్రదేశంలో ఉంటాయి. జిమ్మీ ఫాలెన్ వచ్చి వాటిని గెట్.. సెట్.. గో.. అంటూ ఒకేసారి బౌల్స్ వైపు వదిలేస్తాడు. వాటిలో ఏ బౌల్‌పై ఎక్కువ సంఖ్యలో పప్పీలు ఎగబడి తింటాయో ఆ బౌల్ పేరున్న జట్టు గెలిచినట్టు. ఇంట్రెస్టింగ్ కదా! ఇంతకీ ఏ జట్టు గెలిచింది? వీడియో చూడండి మజా వస్తుంది. -
ఈ వారం యు ట్యూబ్ హిట్స్
స్టీవ్ హార్వే రాంగ్ విన్నర్ : మిస్ యూనివర్స్ ఈ ఏడాది మిస్ యూనివర్శ్ పోటీలు ‘బిగ్గెస్ట్ టీవీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇయర్’ గా పూర్తయ్యాయి. కార్యక్ర మ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే.. ఫస్ట్ రన్నర్ అప్ అయిన మిస్ కొలంబియాను మిస్ యూనివర్శ్‌గా ప్రకటించడంతో ఈ తప్పు జరిగిపోయింది. (నిజానికి జడ్జీలు నిర్ణయించిన విశ్వసుందరి మిస్ ఫిలిప్సీన్స్ పియా అలోంజో). కొలంబియా సుందరి అరియాడ్నా ఆకస్మాత్తుగా తను విజేత కాదని తెలుసుకుని క్షణం పాటు నివ్వెర పోయినా, తన కిరీటాన్ని వదులుకుంటున్న క్షణంలోనూ ఎంతో హూందాగా చిరునవ్వులు చిందించారు. నిడివి : 5 ని. 28 సె. హిట్స్ : 1,79,80,657 జై గంగాజల్ : ట్రైలర్ బాలీవుడ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘జై గంగాజల్’ ట్రైలర్ ఇది. చిత్రం 2016 మార్చి 4న విడుదలౌతోంది. ఇందులో ప్రియాంకా చోప్రా ఎస్పీగా నటిస్తున్నారు. చిత్రీకరణ అంతా ఎక్కువ భాగం భోపాల్‌లో జరిగింది. బీహార్‌లోని బంకీపూర్ జిల్లా తొలి మహిళా ఎస్పీగా ప్రియాంక ఎంపికవుతారు. లోకల్ ఎమ్మెల్యే మానవ్ కౌల్, అతడి అనుచరులు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి సంఘ విద్రోహ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎస్పీకి, ఎమ్మెల్యేకు మధ్య జరిగే ఘర్షణల సన్నివేశాలను ఈ వీడియోలో చూడొచ్చు. నిడివి : 2 ని. 48 సె. హిట్స్ : 32,27,655 డెడ్‌పూల్ : ట్రైలర్ 2 మార్వెల్ కామిక్స్‌లోని ‘డెడ్‌పూల్’ క్యారెక్టర్ అధారంగా అదే పేరుతో వస్తున్న హాలీవుడ్ సూపర్‌హీరో మూవీ ‘డెడ్‌పూల్’. టిమ్ మిల్లర్ డెరైక్ట్ చేస్తున్నారు. 2016 ఫిబ్రవరి 12న చిత్రం విడుదల అవుతోంది. క్యాన్సర్‌ను నయం చేసుకునేందుకు వేడ్ విల్సన్ (డెడ్‌పూల్ అసలు పేరు) తనపై ప్రయోగం చేసుకుంటాడు. పర్యవసానంగా అతడికి మంత్రశక్తులు వస్తాయి ఆ శక్తులను తనకు అనుకూలంగా మార్చుకుని, తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తికి వేటాడుతుంటాడు. వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది. నిడివి : 2 ని 59 సె. హిట్స్ : 19,50,590 బాహా కిలిక్కి : ట్రిబ్యూట్ టు టీమ్ బాహుబలి ‘బాహుబలి’ చిత్ర బృందానికి ట్రిబ్యూట్‌గా పాప్ స్మిత రూపొందించిన ‘బాహా కిలిక్కి’ వీడియో ఆసక్తికరంగా ఉంది. ఐదు రోజుల క్రితం స్మిత్ బాహా కిలిక్కిని అప్లోడ్ చేశారు. ఇందులో నటుడు నోయల్ సీన్‌తో పాటు ‘కాలికేయ’ ప్రభాకర్ కూడా కనిపిస్తాడు. ఐటమ్ సాంగ్లా అనిపించే ఇందులోని నృత్యగీతాలు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘హేయ్.. టీచ్ మీ ఇంగ్లిష్’ అని అర్థం వచ్చే మాటలేవో కాలకేయుడు తనదైన స్టైల్లో అనగానే, ఆదిమజాతి రాకుమారి స్మిత ‘నో... నీకు కిలిక్కి భాషను నేర్పిస్తాం’ అని చెప్పడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. నిడివి : 3 ని. 29 సె. హిట్స్ : 3,59,251 -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పి.ఎస్.వై. డ్యాడీ : మ్యూజిక్ వీడియో దక్షిణ కొరియా పాప్ స్టార్, వైరల్ వీడియో సంచలనం పి.ఎస్.వై. (అసలు పేరు పార్క్ జేసాంగ్) మళ్లీ ఒళ్లు విరుచుకున్నాడు! ‘గంగ్నమ్ స్టైల్’ డాన్స్‌తో 2012లో లోకాన్ని షేక్ చేసిన పి.ఎస్.వై. ఇప్పుడు ‘డాడీ’తో ఊపేస్తున్నాడు. ‘ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై డాడీ’ అంటూ సాగే ఈ సాంగ్‌లో పి.ఎస్.వై. ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండడు. వీక్షకులను ఉండనివ్వడు. వీడియోపై ఓపీనియన్స్ మిక్స్‌డ్‌గా ఉన్నా, రోజు రోజుకీ హిట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ‘డాడీ’తో పాటే విడుదలైన పి.ఎస్.వై. దే ఇంకో వీడియో ‘నప్పల్ బాజీ’ కి పెద్దగా హిట్స్ లేకపోయినా చూడ్డానికి వెరైటీగా ఉంది. నిడివి : 4 ని. 5 సె. హిట్స్ : 2,63,44,794 ‘ది హోల్డ్’ : హౌ టు కామ్ ఎ క్రయింగ్ బేబీ రాబర్ట్ హామిల్టన్ యు.ఎస్.లో పేరున్న పిల్లల డాక్టర్. ముప్పై ఏళ్ల అనుభవంతో ఆయన పిల్లల బిహేవియర్‌కు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు. వాటిల్లో ఒకటి : ఏడుస్తున్న పసికందును ఊరుకోబెట్టడం! ఎంత గుక్కపట్టి ఏడుస్తున్న శిశువునైనా హామిల్టర్ ఒడుపుగా చేతుల్లోకి తీసుకుని క్షణాల్లో ఏడుపు మాన్పించేస్తాడు. ఇదెలా సాధ్యం? ఎలా సాధ్యమో ఈ వీడియోలో స్వయంగా చేసి చూపించారు ఆయన. తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఈ టెక్నిక్‌ను ఫాలో కావచ్చు. అయితే శిశువు ప్రత్యేక పరిస్థితుల్లో ఏడుస్తుంటే మాత్రం ఈ టెక్నిక్‌ను ప్రయోగించకూడదు. నిడివి : 4 ని. 12 సె. హిట్స్ : 98,35,913 బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ వచ్చే ఏడాది మార్చి 25న థియేట ర్స్లోకి వస్తున్న ‘బ్యాట్‌మ్యాన్ వర్సెన్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్’ చిత్రం తాజా ట్రైలర్ ఇది. బ్యాట్ మ్యాన్‌గా బెన్ అఫ్లెక్, సూపర్మ్యా న్గా హెన్రీ క్యావిల్ నటిస్తున్నారు. సూపర్మ్యాన్పై అనుమానంతో అతడిపై పగతీర్చుకోడానికి బ్యాట్‌మాన్ బయల్దేరడంతో మానవాళికి కష్టాలు ప్రారంభం అవుతాయి. ఇద్దరి మధ్య ఉత్కంఠభరితమైన భీకర పోరాటాలు సాగుతుంటాయి. కామిక్ సూపర్ హీరో పాత్రలను అందమైన నటీనటుల రూపాల్లో చూడడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎంత థ్రిల్లింగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. నిడివి : 3 ని. 1 సె. హిట్స్ : 42,07,161 గేమ్ ఆఫ్ థ్రాన్స్ సీజన్ 6 : టీజర్ ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ ఫాంటసీ డ్రామా. హెచ్బీవోలో ఏడాదిగా ఈ సీరీస్ ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ఐదో సీజన్ నడుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో సీజన్ 6 ప్రారంభం అవుతోంది. దాని టీజర్ రెండు రోజులు క్రితమే అఫీషియల్‌గా విడుదలైంది. టీజర్ అత్యద్భుతంగా, హాలీవుడ్ ట్రైలర్‌లా ఉంది. అమెరికన్ నవలా రచయిత జార్జి ఆర్.ఆర్.మార్టిన్ గొలుసు నవల ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ ఆధారంగా టీవీ సీరీస్ చిత్రీకరణ జరుగుతోంది. సింహాసనం కోసం రెండు రాజవంశాల మధ్య జరిగే కుట్రలు, కుయుక్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల కథనమిది. నిడివి : 41 సె. హిట్స్ : 41,52,087 జనమ్ జనమ్ : ‘దిల్వాలే’ న్యూ సాంగ్ కొన్ని ప్రేమ కథలకు మొదలు తప్ప తుది ఉండదు. కాలాతీతంగా ప్రేమ పరిమళాలను అవి వెదజల్లుతూనే ఉంటాయి. అలాగే ప్రేమ పాటలు. గతవారం అప్లోడ్ అయిన ‘దిల్ వాలే’ లోని ‘గేరువా’ సాంగ్ యూట్యూబ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఈవారం ‘జనమ్ జనమ్’ అనే పాటను విడుదల చేసింది సోనీ మ్యూజిక్. షారుక్‌ఖాన్, కాజోల్ నటించిన ఈ పాటకు ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చారు. అమిత్ భట్టాచార్య గీత రచన. పాడింది అరిజిత్ సింగ్, అంతర మిత్ర. వెస్ట్రన్, ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ కలగలిసిన ఈ పాట మనోరంజకంగా ఉంది. చిత్రం విడుదల డిసెంబర్ 18. నిడివి : 2 ని. 13. హిట్స్ : 17,52,832 ‘మల్హారీ’ సాంగ్ : బాజీరావ్ మస్తానీ ఇదొక హై-ఆక్టేన్ ట్రెడిషనల్ సాంగ్. స్వచ్ఛమైన సంప్రదాయ ఇంధనంతో జ్వలించే గీతం! బాజీరావ్ విజయోత్సాహ ఆత్మ రణవీర్ సింగ్‌ను ఆవహించినట్లే ఉంది. సంజయ్ లీలా భన్సాలీ ట్యూన్ ఇస్తే విశాల్ డడ్లానీ గీతాన్ని ఆలపించాడు. లిరిక్స్ ప్రశాంత్ ఇంగోల్. భన్సాలీ దర్శకత్వంలో డిసెంబర్ 18 విడుదల అవుతున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని మిగతా పాటల్లా ‘మల్హారీ’ కూడా రోమాంచితంగా ఉంది. ‘శత్రువును ఎంత ఘోరంగా ఓడించామో చూడండి. విజయ దుంధుబి మోగిస్తూ, ఆనందంతో ఆడిపాడదాం రండి’ అంటూ రణవీర్ సింగ్ పాడే గ్రూప్ సాంగ్ ఇది. నిడివి : 3 ని. 22 సె. హిట్స్ : 14,39,146 -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
బ్లోయింగ్ అప్ మై కిడ్ ప్రాంక్ రోమన్ ఎట్వూడ్ అమెరికన్ యూట్యూబ్ పర్సనాలిటీ. వ్లోగర్. ప్రాంక్‌స్టర్. యాక్టర్. ఫిల్మ్ డెరైక్టర్. రహస్య కెమెరాతో పబ్లిక్ ప్రాంక్ (ఉత్తుత్తి) వీడియోలు తీయడంలో ఎక్స్పర్ట్. తాజాగా ఆయన అప్లోడ్ చేసిన ‘బ్లోయింగ్ అప్ మై కిడ్’.. యూట్యూబ్ వీక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమ్మ, నాన్న, మూడేళ్ల బాబు, రాకాసి లాంటి ఓ పెద్ద ఫోర్ వీలర్ క్వాడ్ బైక్. బాబుకు ఆ బైక్ అంటే ప్రాణం. రైడ్ చెయ్యాలనుకుంటాడు. కానీ తల్లి వారిస్తుంది. ఆమెకు తెలీకుండా తండ్రి ఆ చిన్నారి ఒక్కడినే క్వాడ్ బైక్‌పై కూర్చోబెడతాడు. అది స్టార్ అవుతుంది. తర్వాత ఏమౌతుంది? చూడండి. హేట్ స్టోరీ 3 : ట్రైలర్ రెండ్రోజుల క్రితం టీ సిరీస్ అప్లోడ్ చేసిన ఈ హేట్ స్టోరీ 3 కి హిట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకో వాలంటే మీరీ వీడియో ట్రైలర్‌ను చూసి తీరాల్సిందే. విశాల్ పాండ్య దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ థ్రిల్లర్ డిసెంబర్ 4న విడుదల అవుతోంది. ఇందులో జరీన్ ఖాన్, డైసీ షా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1993లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ఇండీసెంట్ ప్రపోజల్’కు ఇది రీమేక్. విక్రమ్ భట్, మాధురి బెనర్జీ రాసిన హేట్ స్టోరీ 3 కథలో ‘ఇండీసెంట్ ప్రపోజల్’కు భిన్నమైన కథాంశాలు ఏమైనా ఉన్నాయేమో చిత్రం చూస్తే గానీ తెలీదు. ఆడమ్ లెవీన్స్ న్యూ గర్ల్ ఫ్రెండ్ మిలా అనే అమెరికన్ చిన్నారి తన ఫ్యావరెట్ సింగర్ ఆడమ్ లెవిన్‌కు పెళ్లయిపోయిందని తెలియగానే పట్టలేని దుఖంతో ఒక్కసారిగా ఏడ్చేసి, ‘నో.. నో.. హి డిడిన్ట్ మమ్మీ’ అని బాధపడిపోవడం గురించి ఇదే కాలమ్‌లో రెండు వారాల క్రితం మీరు చదివారు. ఇప్పుడీ లేటెస్ట్ వీడియోలో ఆ పాప మళ్లీ కనిపిస్తుంది. పాప, ఆమె తల్లి ‘ఎలన్ షో’కి వస్తారు. అమెరికన్ టీవీలో బాగా పాపులర్ అయిన ఈ సిట్యుయేషనల్ కామెడీ షోలో... హోస్ట్ అలెన్.. తల్లీ కూతుళ్లను ఇంటర్వ్యూ చేస్తారు. చివరలో సర్ప్రైజింగ్గా ఆడమ్ లెవిన్ ఓ గులాబీ పట్టుకుని ప్రత్యక్షమౌతాడు. తప్పక చూడాల్సిన వీడియో ఇది. మీట్ కోకోస్ న్యూ కిటెన్స్ కోకో అనేది ఒక గొరిల్లా. దానికి బేబీస్ అంటే ఇష్టం. మూతి మీద ముద్దులు పెడుతుంటుంది. అంతిష్టం. పాపం ఆ గొరిల్లాకు పిల్లల్లేవు. అందుకే వేరే వాళ్ల పిల్లల్లి ముద్దు చేస్తుంటుంది. ఈ వీడియోలో గొరిల్లా... పిల్లి పిల్లల్ని మురిపెంగా చూస్తుంటుంది. వాటిని మృదువుగా టచ్ చేస్తుంటుంది. అంతే కాదు, ఆ పిల్లుల్లో ఒకటైన ‘మిస్ గ్రే’ పై ప్రేమను కూడా పెంచుకుంటుంది! దానిని చేతుల్లోకి తీసుకుని, గుండెలకు హత్తుకుంటుంది. అయితే ‘మిస్ బ్లాక్’ అనే పిల్లి పిల్ల కోకోతో ప్రేమలో పడడం ఇందులోని ట్విస్ట్. తర్వాత ఇంకా చాలా కథ ఉంది. సీ అండ్ ఎంజాయ్. డబ్స్మాష్ విత్ సెలీనా గోమెజ్ అమెరికన్ నటి, గాయని, ఫ్యాషన్ డిజైనర్ సెలీనా గోమెజ్... డబ్స్మాష్ క్వీన్‌గా కూడా తనని తాను రుజువు చేసుకున్నారు. పాపులర్ అయిన మూవీ డైలాగ్స్‌కి అనుగుణంగా పెదవు లను కదపడమే డబ్స్మాష్ గేమ్. ఎంతో ఉల్లాసభరితమైన ఈ గేమ్‌ను ఆమె ‘టు నైట్’ షోలో జిమ్మీ ఫెలాన్తో కలిసి ఆడారు. గెలిచారు. తన సొంత సింగిల్ హిట్ సాంగ్‌కు ఆమె ఇచ్చిన లిప్ మూవ్మెంట్ వీక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తినప్పటికీ అదేమంత కష్టమైన విషయం కాదనీ, ఈ ఆట పూర్తి నిజాయితీగా సాగడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ ఆటలో సెలీనాకు దీటుగా జిమ్మీ ఫెలాన్ ఆడలేకపోయారు. సింగ్ : పెంటాటానిక్స్ పెంటాటానిక్స్ (పి.టి.ఎక్స్.) అనేది అమెరికన్ పాప్ బ్యాండ్. ఐదుగురు గాయకులతో (ఇందులో ఒకరు గాయని) 2011లో ఏర్పాటైన ఈ బ్యాండ్.. ‘సి సింగ్ ఆఫ్’ అల్బమ్‌తో ఫామ్‌లోకి వచ్చింది. యువర్ లవ్ ఈజ్ మై డ్రగ్, వీడియో కిల్డ్ రేడియో స్టార్, బార్న్ టు బి వైల్డ్, ఫర్ గెట్ యు, డాగ్ డేస్ ఆర్ ఓవర్, వితౌట్ యు, గివ్ మి జస్ట్ వన్ నైట్, ఐ ఆఫ్ ది టైగర్ వంటి పాటలతో ప్రసిద్ధి చెందింది. తాజాగా పెంటాటానిక్స్ అప్లోడ్ చేసిన ‘సింగ్’.. వాటి స్థాయిలోనే పాప్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. వీడియో కలర్ఫుల్గా ఉంది. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ది జంగిల్ బుక్ : ట్రైలర్ వాల్ట్ డిస్నీ పిక్చర్స్ విడుదల చేసిన ‘ది జంగిల్ బుక్ ’ చిత్రం టీజర్ ఇది. సినిమా 2016 ఏప్రిల్ 15న రిలీజ్ అవుతోంది. జాన్ ఫారో డెరైక్ట్ చేస్తున్న ఈ 3డి కామెడీ అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్‌కు జస్టిన్ మార్స్క్ స్క్రిప్ట్ అందించారు. 1967లో ఇదే పేరుతో డిస్నీ పిక్చర్స్ నిర్మించిన చిత్రానికి ఇది లైవ్ యాక్షన్ రీమేక్. రుడ్యార్డ్ కిప్లింగ్ 1894లో రాసిన ‘ది జంగిల్ బుక్’ ఈ రెండు చిత్రాలకూ ఆధారం. తాజా జంగిల్ బుక్‌లో బాల కథానాయకుడు మోగ్లీగా నీల్ సేథీ నటిస్తున్నాడు. అడవిలో తోడేళ్ల ఆలన, లాలనతో పెరుగుతున్న చిన్నారి మోగ్లీ చేసే సాహసాలే ఈ చిత్ర కథాంశం. తూంగవనం : ట్రైలర్ కమలహాసన్, త్రిష నటించిన తమిళ చిత్రం ‘తూంగవనం’ ట్రైలర్ ఇది. తెలుగులో ‘చీకటి రాజ్యం’గా తయారవుతోంది. తూంగవనం అంటే స్లీప్‌లెస్ ఫారెస్ట్. విశ్రమించని అరణ్యం. 2011లో విడుదలైన ఫ్రెంచి సినిమా ‘స్లీప్‌లెస్ నైట్’కు ఇది రీమేక్. రెగ్యులర్ సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉండవని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఎట్ ద సేమ్ టైమ్... చూసి తీరవలసిన సినిమా అని కూడా అనిపిస్తుంది. మాదక ద్రవ్యాల మాఫియాకు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మధ్య సాగే పోరాటంలో కుటుంబ అనుబంధాలు ఎలా నలిగిపోతాయో ఈ చిత్రం చెబుతుంది. షాందార్ : వీడియో సాంగ్ షాహిద్ కపూర్, అలియా భట్ నటించిన ‘షాందార్’ చిత్రంలోని ‘షామ్ షాందార్’ పాటను జీ మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోను చూసిన వారు సినిమా రిలీజ్ కోసం అక్టోబర్ 22 వరకు వేచి ఉండడం కాస్త కష్టమైన విషయమే. ఫుల్ జోష్‌తో సాగుతుందీ సాంగ్. డాన్స్‌లో అలియాను డామినేట్ చేశాడు షాహిద్. అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాటను అమిత్ త్రివేదీ ఆలపించాడు. ‘షాందార్’ అంటే ఫాబ్యులస్. వెరీ గుడ్. ఎక్స్లెంట్ అని అర్థం. ఈ పాటను దృశ్యీకరించిన తీరులో షాందార్ అంతా కనిపిస్తుంది. సినిమాను వికాస్ బల్ డెరైక్ట్ చేస్తున్నారు. లేడీ గాగా : టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు ‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే డాక్యుమెంటరీ చిత్రం కోసం అమెరికన్ సింగర్ లేడీ గాగా... సహగాయని, గీత రచయిత్రి అయిన డయానే వారెన్‌తో కలిసి రాసి, పాడిన పాట ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’. క్యాంపస్ రేప్ ఇందులోని థీమ్. ఈ ఏడాది ఆరంభంలో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ నుంచి అనధికారికంగా ఈ సాంగ్ లీక్ అయింది. ఇప్పుడు దీనినే అధికారికం చేసి మూడు రోజుల క్రితమే ఈ సింగిల్ ట్రాక్‌ను విడుదల చేశారు. వీడియోకు, లిరిక్కు అసాధారణమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి కాలేజీ అమ్మాయి, అబ్బాయి చూసి తీరవలసిన ట్రాక్ ఇది. లేడీ ఆస్ట్రాలజర్ స్లాప్స్ బాబా టీవీ చానెల్స్‌లో డిబేట్ ప్రోగ్రామ్‌లు వేడి వేడిగా సాగుతుంటాయి. అప్పుడప్పుడు ఆ వేడి కాస్త ఎక్కువై మాటలు మితిమీరి చేతల్లోకి వెళ్లిపోతాయి. అందుకొక ఉదాహరణ ఈ వీడియో. ఐబిఎన్7 ఛానెల్లో ‘ఆజ్ కా ముద్దా’ (నేటి టాపిక్) అనే ఈవెనింగ్ డిబేట్ లైవ్ వస్తుంటుంది. అందులో పాల్గొన్న లేడీ ఆస్ట్రాలజర్ దీపా శర్మ నిగ్రహం కోల్పోయి, సహవాది అయిన మరో ఆస్ట్రాలజర్ ధరమ్ గురు ఓమ్ జీ మహరాజ్ చెంప పగలగొట్టారు. అయితే ఆయనేమీ రెండో చెంప చూపలేదు. దీపను తనూ చెంపదెబ్బ కొట్టారు. ఆవేళ్టి తమ భవిష్యత్తును వాళ్లిద్దరూ ఊహించలేకపోయినట్లున్నారు. సత్యా నాదెళ్ల డెమో ఫెయిల్యూర్: ఫన్నీ వీడియో మైక్రోసాఫ్ట్ రూపొందించిన పర్సనల్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్... ‘కార్టానా’ మహా తెలివైనది. అందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అడిగిన ప్రశ్నలకన్నింటికీ సమాధానాలు చెబుతుంది. కానీ ఆ కంపెనీ సీయీవో సత్యా నాదెళ్ల ప్రశ్నలనే అది సరిగా అర్థం చేసుకోలేకపోయింది! గత బుధవారం ఒక పబ్లిక్ ఈవెంట్లో నాదెళ్ల తన ‘కార్టానా’ను టెస్ట్ చేశారు. ‘షో మీ మై మోస్ట్ ఎట్-రిస్క్ ఆపర్చునిటీస్’ అని అడిగారు. కార్టానా కామ్‌గా ఉండిపోయింది. నాదెళ్ల మరో రెండుసార్లు క్వొశ్చన్ రిపీట్ చేశారు. నాలుగోసారి వచ్చిన ఆన్సర్ వచ్చి ఏంటో తెలుసా? టు బై మిల్క్ అని. ఇక నవ్వులే నవ్వులు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
బ్యాట్‌మ్యాన్ v సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ నిడివి : 3 ని. 39 సె. హిట్స్ : 3,39,83,293 ఈ ఏడాది మొదట్లో విడుదలైన బ్యాట్‌మ్యాన్ v సూపర్‌మ్యాన్ తొలి ట్రైలర్‌కు ఏమంత రెస్పాన్స్ రాలేదు కానీ, గత వారం విడుదలైన ఈ రెండో ట్రైలర్‌కు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది! బ్యాట్‌మ్యాన్‌గా బెన్ అఫ్లెక్, సూపర్‌మ్యాన్‌గా హెన్రీ క్యావిల్ నటించారు. వీళ్లిద్దరి మధ్య పోరాటం మానవాళికి ఎలాంటి అపరిచిత సమస్యను తెచ్చిపెట్టిందన్నది ఇతివృత్తం. విడుదల 2016. వచ్చే ఏడాది ఇది బిగ్గెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూయిసైడ్ స్క్వాడ్ ట్రైలర్ నిడివి : 3 ని. 06 సె. హిట్స్ : 3,41,13,564 సీక్రెట్ మిషన్‌కు బయల్దేరి చివరికి ప్రాణాలు కోల్పోయే సూపర్ విలన్ల కథ ఇది. ఇందులో ‘జోకర్’గా జేర్డ్ లెటో (బొమ్మలో కనిపిస్తున్న వ్యక్తి) తన అసమాన ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. ఇక మార్క్స్ మేన్‌గా (తుపాకీని గురి చూసి పేల్చే హంతకుడిగా) విల్ స్మిత్ నటిస్తున్నారు. ‘ది ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ చిత్రంతో ప్రఖ్యాతిగాంచిన మార్గట్ రాబీ... ఇందులో జోకర్ గారి ఇష్టసఖిగా కనిపించ బోతున్నారు. విడుదల 2016. రోగ్ నేషన్ - స్టంట్ ఫీచరెట్ నిడివి : 1 ని. హిట్స్ : 69,11,849 ఊపరి సలపనివ్వని ఉత్కఠభరితమైన పోరాట దృశ్యాల ‘మిషన్ ఇంపాజిబుల్’ సీరీస్‌లో భాగంగా రాబోతున్న చిత్రం.. ‘రోగ్ నేషన్’. విమానం గాలిలోకి లేవబోతుండగా దాని రెక్క పట్టుకుని క్యాచ్ చేసే సూపర్ ఏజెంటుగా టామ్ క్రూయిజ్ చేసిన విన్యాసం వీక్షకుల కనుగుడ్లను పైకి తెస్తుంది. ఈ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు టామ్ క్రూయిజ్‌కు అనిపించిందట. చిత్రం విడుదల వచ్చే నెల 7. నైట్ ఫీవర్ డాన్స్: జెకోవిక్ అండ్ విలియమ్స్ నిడివి : 32 సె. హిట్స్ : 14,90,574 వింబుల్డన్ కోర్టులో ఛాంపియన్లు అయిన నొవాక్ జెకోవిక్, సెరీనా విలియమ్స్... డాన్స్ ఫ్లోర్ మీద కేవలం మానవ మాత్రులై వేసిన స్టెప్పుల అతి చిన్న వీడియో ఇది. దీనిని వింబుల్డన్ అప్లోడ్ చేసింది. వింబుల్డన్ చాంపియన్స్ డిన్నర్ నైట్‌లో ఏర్పాటు చేసిన నైట్ ఫీవర్ డాన్స్‌లో ఈ అగ్రస్థాయి క్రీడాకారులు విడివిడిగా, ఒకరినొకరు తాకకుండా తమకు రాని డ్యాన్స్‌ను ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించడం వీక్షకులను అలరిస్తోంది. 1976లో జోర్న్ బోర్గ్, క్రిస్ ఎవర్ట్... ఇలా డిన్నర్ మీట్లో డాన్స్ చేశారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు జెకోవిక్, సెరీనా కనువిందు చేశారు. హీరో : ట్రైలర్ నిడివి : 2 ని. 55 సె. హిట్స్ : 8,37,097 సుభాష్ ఘాయ్ 1983 లవ్‌స్టోరీ ‘హీరో’... మళ్లీ అదే పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్ 11 విడుదల అవుతోంది. ఆదిత్యా పాంచోలీ, జరీనా వాహబ్‌ల కుమారుడు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి హీరో హీరోయిన్లుగా ఇందులో ఆనాటి జాకీ ఫ్రాఫ్, మీనాక్షీ శేషాద్రిల పాత్రలను పోషిస్తున్నారు. గత వారం విడుదలైన ఈ ట్రైలర్లో కొత్త జంట ఆటా పాటా, అమ్మాయి అలకలు, అబ్బాయిగారి ఫైట్స్ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అతియాలోని అతి సహజ సౌందర్యం, సూరజ్ పెంచి పోషించుకున్న సిక్స్ ప్యాక్స్ యూత్‌కి నచ్చే అంశాలు కావచ్చు. ఎఐబి : అన్ అఫెండెడ్ నిడివి : 9 ని. 17 సె. హిట్స్ : 7,26,498 అ ఐఛీజ్చీ ఆ్చజుఛిూూూకి సంక్షిప్త నామం ఎఐబి. ఇదొక వివాదాల కామెడీ గ్రూప్. సుప్రసిద్ధులను అనుకరిస్తూ వారి తీరును వ్యంగ్యంగా విమర్శిస్తుం టుంది. తాజాగా ఈ గ్రూపు విడుదల చేసిన వీడియో పేరే అన్అఫెండెడ్. ఇందులో ‘టైమ్స్ నౌ’ న్యూస్ యాంకర్ అర్ణబ్ గోస్వామిని ఇమిటేట్ చేస్తూ కామెడీ పండించింది. ‘ది నేషన్ వాంట్స్ టు నో’ అంటూ స్టూడియోకు పిలిపించుకున్న అతిథులపై డిబేట్లో భాగంగా తరచు దౌర్జన్యంగా మాట్లాడుతుండే అర్ణబ్పై ఈ మాక్ వీడియో అత్యంత హాస్యభరితంగా సెటైర్లు విసిరింది. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
రైలర్ : పులి నిడివి : 55 సె. హిట్స్ : 33,29,623 తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘పులి’ సినిమాకు నాటి, నేటి సౌందర్య దివ్యతార శ్రీదేవి ప్రధాన ఆకర్షణగా మారారు. ఈ సినిమాలో ఆమె మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మేకప్ కోసం ఆమె ప్రతి రోజు కనీసం అయిదుగంటల సమయాన్ని వెచ్చించారట. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల విడుదలైన ‘పులి’ ట్రైలర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ చిత్రమిది. టాక్ షో: మ్యాజిక్ మైక్-ఎక్స్ఎక్స్ఎల్ నిడివి: 8 ని. 19 సె. హిట్స్: 12,45,352 అమెరికన్ టెలివిజన్ ‘ఎన్బిసి’లో ప్రసారమవుతున్న లేట్-నైట్ టాక్ షో ‘ది టునైట్ షో స్టారింగ్ జిమ్మి ఫాలన్’కు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉంది. ఈవారం లేట్-నైట్ టాక్ షోలో జూలై 1న విడుదల కానున్న ‘మ్యాజిక్ మైక్’ సినిమాపై అతిథి వ్యాఖ్యాతలు మాట్లాడారు. దీనిపై తాజాగా విడుదలైన టాక్-షో వీడియో అదుర్స్ అనిపించింది. ఈ అమెరికన్ కామెడీ-డ్రామాపై పిల్లలు రాసిన స్క్రిప్ట్‌ను అతిథులు చదివి వినిపించారు. వీడియో గేమ్: ది రష్ నిడివి: 4 ని. 1 సె. హిట్స్: 10,26,590 అమెరికాకు చెందిన అటారి గేమ్స్ కంపెనీ వారి ‘రష్’ వీడియో గేమ్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సీరిస్‌లో కొత్తదనం చేర్చడం వల్ల వాటి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. వింత ఆకార ‘జెర్గిలింగ్’ దాడి ఎలా ఉంటుందో, ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఎలా భయపెడుతుందో తాజా వీడియో చూస్తే తెలుస్తుంది. వీడియో గేమ్స్ ఇష్టపడే చిన్నారులైతే ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ట్రైలర్: బజ్రంగి బైజాన్ నిడివి: 1 ని. 33 సె. హిట్స్: 8,63,143 కరీనా అభిమానులు మాత్రమే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం ‘బజ్రంగి బైజాన్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ట్రైలర్. కొందరైతే ట్రైలర్ చూసి కథ ఊహించుకుంటున్నారు. హనుమాన్ వీర భక్తుడు పవన్ పాత్రలో సల్మాన్ నట విన్యాసాలకు ట్రైలర్ అద్దం పట్టేలా ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ రోజు బెబో(కరీనా కపూర్) అందం, అభినయం గురించి ఖాన్ తెగ పొగిడాడు. టీజర్: సుల్తాన్ నిడివి: 33 సె. హిట్స్: 5,75,643 బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా వచ్చే సంవత్సరం విడుదల అవుతోంది. అంతమాత్రాన ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన కబుర్లకేం లోటు లేదు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హర్యానాకు చెందిన మల్లయోధుడిగా సల్మాన్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. షార్ట్ ఫిల్మ్: కన్యాదాన్ నిడివి: 2 ని. 45 సె. హిట్స్: 5,16,455 గ్లామర్ ఒలకబోసే పాత్రల్లో ఎక్కువగా కనిపించే అదితిరావు హైదరి ఈసారి మాత్రం సామాజిక స్పృహ ఉన్న లఘు చిత్రంలో నటించారు. ‘కన్యాదాన్’ అనే ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల అనుబంధం పైనే కాకుండా గృహహింసపై కూడా దృష్టి పెడుతుంది. ‘కన్యాదాన్’లో కూతురుగా ఆదితిరావు, తండ్రిగా దలిప్ తహిల్ నటించారు. ‘ఫాదర్స్ డే’ రోజు విడుదలైన ఈ లఘుచిత్రానికి యూట్యూబ్‌లో హిట్ల మీద హిట్లు పడుతున్నాయి. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ఐయామ్ ఏ బిచ్-మడోనా నిడివి : 4 ని. 03 సె. హిట్స్ : 58,97,844 ‘రెబెల్ హార్ట్’ (2015)ఆల్బమ్‌లో మెడొన్నా పాడిన ‘బిచ్ ఐయామ్ మడోనా’ పాట ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడీ పాట రెబెల్ హార్ట్ ఆల్బమ్ నుంచి సింగిల్‌గా విడుదలైంది. తన తాజా ఆల్బమ్ తయారుకావడానికి ముందు ‘‘ఉర్రూతలూగించే సంగీతంతో ఈసారి ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నా’’ అని ప్రకటించారు మడోనా. అది నిజమైంది. ‘ఐయామ్ ఏ బిచ్’ కలర్‌ఫుల్ వీడియో ఈవారం యూట్యూట్ హిట్లలో అగ్రభాగాన ఉంది. బ్రదర్స్ నిడివి : 2 ని. 55 సె. హిట్స్ : 50,22,580 హాలీవుడ్ సినిమా ‘వారియర్’కు రీమేక్‌గా వస్తోంది ‘బ్రదర్స్’. వారియర్లో టామ్ హార్డీ, జోయెల్ ఎడ్గెర్టన్ పోషించిన పాత్రలను అక్షయ్ కుమార్, సిద్ధార్థమల్హోత్రాలు పోషించారు. ‘మహాభారతంలోలాగే ఇది సోదరుల మధ్య జరిగే యుద్ధం’ అని ట్రైలర్ చెబుతోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు, సినీ ప్రముఖుల నుంచి కూడా దీనికి ‘పవర్ఫుల్ ట్రైలర్’ అనే గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. కుంగ్‌ఫూ పాండా 3 నిడివి : 2 ని. 06 సె. హిట్స్ : 21,90,614 ‘పో’ ఈజ్ బ్యాక్! డ్రీమ్ వర్క్ యానిమేషన్ రిలీజ్ చేసిన ‘కుంగ్ఫు పాండా 3’ ట్రయిలర్ పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తోంది. ‘పో’ అనే పేరుగల పాండా ఈ చిత్రంలో మరిన్ని సాహసాలు అద్భుతాలు చేయబోతోంది. అంతేకాదు, తన తండ్రిని తిరిగి కలుసుకుంటుంది. మెయ్ మెయ్ అనే ఆడ పాండాతో ప్రేమలో పడుతుంది. ఈ చిత్రం 2016 జనవరి 29న రిలీజ్ అవుతోంది. అంతవరకు ఆగలేని వారికి పార్ట్ 1 పార్ట్ 2 ఎలాగూ ఉన్నాయిగా! కట్టి బట్టి నిడివి : 2 ని. 58 సె. హిట్స్ : 21,46,284 కంగనా రనౌత్, ఇమ్రాన్‌ఖాన్‌ల ‘కట్టి బట్టి’ ఫక్తు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ఈ భిన్నధృవాలు పరస్పరం ప్రేమించుకొని ఐదేళ్లు ‘లివ్-ఇన్ రిలేషన్షిప్’లో ఉంటాయి. ఊహించని ఘటనలతో సాగే ఈ కథ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కంగనాకు ఈ సినిమా మరో వరుస హిట్ అందిస్తుందో లేదో? అనేది వేచి చూడాలి. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ట్రైలర్ మాత్రం ఇప్పటికే నవ్వులు పండిస్తోంది. భజ్రంగి భాయ్‌జాన్ నిడివి : 2 ని. 43 సె. హిట్స్ : 9,23,840 గత గురువారం విడుదలైన భజ్రంగి భాయ్‌జాన్ ట్రెయిలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నాలుగు రోజుల్లోనే దగ్గర దగ్గర పది లక్షల హిట్లు వచ్చేశాయి! ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ కరీనా కపూర్ నటిస్తున్నారు. హిందూ అబ్బాయికి, ముస్లిం అమ్మాయికి మధ్య నడిచే ఈ ప్రేమ కథా చిత్రంలో 49 ఏళ్ల సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తనకే ప్రత్యేకమైన డాన్సులు, ఫైట్లతో ఆకట్టుకోబోతున్నాడని ఈ ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ఇగ్గీ అసేలియా కార్‌పూల్ కారావ్కే నిడివి : 8 ని. 2 సె. హిట్స్ : 3,42,536 ఆస్ట్రేలియన్ పాప్ సింగర్ ఇగ్గీ అసేలియా, బ్రిటిష్ టెలివిజన్ హోస్ట్ జేమ్ కార్డెన్ కలిసి కారులో పాటలు పాడుకుంటూ షికార్లు కొట్టే వీడియో ఇది. ఇగ్గీకి ఈ మధ్యే నిశ్చితార్థం జరిగింది. ఆ టాపిక్‌కి సంబంధించిన సంభాషణలు, మధ్యలో వెడ్డింగ్ డ్రెస్ కొనేందుకు ఇగ్గీ ఒక షాపుకు వెళ్లడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. కారులో ప్రయాణిస్తున్నంత సేపూ కారావ్కే నేపథ్య సంగీతానికి వీళ్లిద్దరూ గొంతు కలుపుతుంటారు. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ది మార్టియన్ నిడివి : 3 ని. 17 సె. హిట్స్ : 9,88,110 నవలగా ఆకట్టుకున్న సైన్స్-ఫిక్షన్ ‘ది మార్టియన్’. ఇప్పుడు రిడ్లే స్కాట్ డెరైక్షన్‌లో సినిమాగా వస్తోంది. డ్య్రూ గోడార్డ్ రూపొందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు వెన్నెముకగా నిలవనుంది. మాట్ డమన్ (మార్క్ వాట్నె) అనే వ్యోమగామి అంగారకగ్రహంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది కథాంశం. వచ్చే అక్టోబర్‌లో విడుదల కానున్న ‘ది మార్టియన్’ సినిమా హిట్ కావడం ఖాయమని ఈ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చెబుతోంది. ‘ది మార్టియన్’ ట్రైలర్ ఈ వారం క్వికెస్ట్ యూ ట్యూబ్ హిట్‌గా నిలిచింది. క్వాంటికో నిడివి : 14 సె. హిట్స్ : 2,11,844 క్వాంటికో పేరుతో ఒక అమెరికన్ టెలివిజన్ థ్రిల్లర్ రాబోయే సెప్టెంబర్ నుంచి ప్రసారం కానుంది. సఫ్రాన్, మార్క్ గోర్డెన్ ద్వయం సమర్పిస్తున్న ఈ థ్రిల్లర్ సీరిస్‌లో మన ప్రియాంకచోప్రా కూడా నటిస్తోంది! అమెరికన్ టీవీ సీరిస్‌లో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి. ఎలెక్స్ పారిష్ అనే ఎఫ్బిఐ ట్రైనీగా ఈ సీరిస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది ప్రియాంక. ట్రైనీ ఎఫ్బిఐ అధికారుల చుట్టూ తిరిగే కథ ఇది. ఒక్కొక్కరికీ ఒక్కో నేపథ్యం ఉంటుంది. దృశ్యం నిడివి : 50 సె. హిట్స్ : 2,73,353 దక్షిణాదిలో ఏ సినిమా హిట్ అయినా బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపుతారు. ‘మర్యాద రామన్న’ ‘సింగం’ రిమేక్లలో నటించిన అజయ్‌దేవగణ్ ఇప్పుడు దక్షిణాదిలో విజయం సాధించిన మరో సినిమా ‘దృశ్యం’లో కథనాయకుడిగా నటించారు. ఆయన సరసన నందిని పాత్రలో శ్రీయ నటించారు. రఫ్ క్యారెక్టర్లలో కనిపించే అజయ్దేవ్గణ్ను ‘దృశ్యం’లో విజయ్ అనే మధ్యతరగతి వ్యక్తిగా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదుగానీ, ట్రైలర్‌కు మాత్రం మంచి స్పందన లభిస్తోంది. బన్గిస్తాన్ నిడివి : 2 ని. 25 సె. హిట్స్: 3,47,992 ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉన్న ఇద్దరు ఔత్సాహిక టైస్ట్‌ల కథ ఇది. తమ సైద్ధాంతిక దృక్పథంతో ఈ ప్రపంచాన్ని రాత్రికే రాత్రే మార్చేయాలన్నది వారి ఆశయం. అయితే ఆశయం ఒకటి డిసైడ్ చేస్తే విధి మరొకటి డిసైడ్ చేసింది. తమ వేడి వేడి ఆలోచనలతో ఈ టైస్ట్లు ముప్పు తిప్పలు పడుతూ ప్రేక్షకులను చల్లగా, కడుపుబ్బా నవ్విస్తారు. రితేష్ దేశ్‌ముఖ్, పులకిత్ సామ్రాట్ నటించిన ఈ బాలీవుడ్ కామెడీ సెటైర్ ఫిల్మ్‌లో త్వరలోనే కామెడి బాంబుల మోత మోగనుంది. అనౌక్ - ది విజిట్ నిడివి : 3 ని. 21. సె హిట్స్ : 15,75,695 లెస్బియన్ దాంపత్య పాత్రలతో వచ్చిన భారతదేశపు తొలి వీడియో వాణిజ్య ప్రకటన ఇది. పేరు ‘ది విజిట్’. విడుదలై కనీసం రెండు వారాలైనా కాకుండానే ఇప్పటి వరకు దీనిని పదిహేను లక్షల మందికి పైగా వీక్షించారు. మింత్రా ఫ్యాషన్ పోర్టల్ తన ‘ఎత్నిక్ వేర్’ కలెక్షన్ కోసం దీనిని రూపొందించింది. ఇందులో కనిపించే ఇద్దరు అమ్మాయిలు... అచ్చు స్త్రీపురుష దంపతుల్లాగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను చూపుకుంటూ, శారీరక సాన్నిహిత్యాన్ని ఫీలవుతూ, అల్లరిగా మాటలతో గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ ఇంటికి రాబోతున్న తమ పేరెంట్స్‌కు స్వాగతం చెప్పడం కోసం ముస్తాబు అవుతుంటారు. సేమ్ సెక్స్ మేరేజెస్ మీద ఉన్న మూస అభిప్రాయాలను, తృణీకార భావాలను పోగొట్టేందుకు తమ యాడ్ తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ‘మింత్ర ఫ్యాషన్’ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ అగర్వాల్ అంటున్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సుబ్రహ్మణ్యస్వామి పరధ్యానం నిడివి : 1 ని. హిట్స్ : 6,55,207 తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి పరధ్యానం ఇటీవల దేశ ప్రజల వదనాలపై నవ్వుల పువ్వులూ పూయించింది. తిరునెల్వేలిలో జరిగిన ఒక పెళ్లికి హాజరైన స్వామి, ఒక పెళ్లిపెద్దగా ఆచారం ప్రకారం తాళిబొట్టును తాకి పురోహితుడికి తిరిగి ఇవ్వవలసి ఉండగా, దాన్ని పెళ్లికూతురి మెడలో కట్టబోవడం, వెంటనే ఆయన పక్కన ఉన్న స్నేహితురాలు చంద్రలేఖ ఆ పొరపాటును గ్రహించి ఆయన్ని వెనక్కి లాగడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికీ యూట్యూబ్‌లో జనం విరగబడి చూస్తున్నారు. పగలబడి నవ్వుతున్నారు. ఫ్లోటస్ స్టైల్ నిడివి : 2 ని. 10 సె. హిట్స్: 5,87,248 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్లో తన సతీమణికి ఓ సవాల్ విసిరారు. జిమ్‌లో నీ సత్తా ఏంటో చూపగలవా అని. మిషెల్ ఆ చాలెంజ్‌ను స్వీకరించారు. వైట్ హౌస్ అథ్లెటిక్ యూనిట్‌కి వెళ్లి తన పవర్ ఏమిటో చూపించారు. 51 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు పిల్లల మాతృమూర్తి 35 పౌండ్ల బరువైన రెండు డంబెల్స్‌ను అలవోకగా పైకీ కిందికీ కదిలించారు. పంచించ్ బ్యాగ్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇక అప్పుడు ఒబామా ఒక్కరే చూడరు కదా. అమెరికన్ పౌరులు ఎంతో ఇష్టంగా ఆ వీడియోను చూస్తూ తమ దేశ ప్రథమ పౌరురాలిని ప్రశంసిస్తున్నారట. గర్ల్స్ లైక్ టు స్వింగ్ నిడివి : 1 ని. 30 సె. హిట్స్ : 3,36,536 జూన్ 5న విడుదల కాబోతున్న ‘దిల్ ధడ్కనే దో’ చిత్రం కోసం శంకర్-ఈషన్-లాయ్ స్వరపరచి ఆలపించిన గర్ల్స్ లైక్ టు స్వింగ్ పాటలో అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రాల డాన్స్‌ను వీక్షించినవారు మళ్లీ మళ్లీ యూట్యూబ్‌ను ఆశ్రయిస్తూనే ఉన్నారు. కొద్దిపాటి నలుపు రంగు దుస్తుల్లో ప్రియాంక అపరిమితంగా ఆకట్టుకుంటుంటే, అనుష్క ఇంచుమించు అదే రకమైన తెలుపు రంగు బట్టల్లో, సరికొత్త హెయిర్ స్టెయిల్తో అలరిస్తున్నారు. అసలు ‘గర్ల్స్లైక్ టు స్వింగ్’ అనే టైటిలే కిక్కెక్కిస్తోందని ఇండియన్ యూత్ అంటోంది. మారీ టీజర్ నిడివి : 0 ని. 32 సె. హిట్స్ : 4,71,406 ధనుష్ టైలర్‌గా, కాజల్ అగర్వాల్ దారాలమ్మే అమ్మాయిగా నటించిన ‘మారి’ తమిళచిత్రం టీజర్ ఇది. ఇందులో ధనుష్ సిగరెట్ తాగే విధానం అతడి మామగారు రజనీకాంత్ స్టెయిల్ను గుర్తుకు తెస్తుంది. కారు అద్దాలు బద్దలవుతుండగా, కారు వెనుక నుంచి నోట్లో సిగరెట్‌తో ధనుష్ మెల్లిగా ఎంట్రీ ఇస్తాడు. మారీ వచ్చే జూలైలో విడుదల కాబోతోంది. రజనీ, ధనుష్‌ల ఉమ్మడి అభిమానులకు ఈ టీజర్ కన్నుల పండుగగా ఉంది. టీజర్లో ధనుష్‌తో పాటు కాజల్‌ను కూడా చూపించి ఉంటే కన్నుల నిండుగా ఉండేది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ప్రెట్టీ గాళ్స్ 4 ని. 32 సె. హిట్స్ 1,22,68,900 బ్రిట్నీస్పియర్స్, ఇగ్గీ అసేలియాల మధ్య ‘క్యాంపీ’ ఫన్ ఇది. క్యాంపీ అంటే స్ట్రేంజ్ అండ్ షాకింగ్. ఇద్దరూ 80ల లుక్‌తో కనిపిస్తారు. బ్రిట్నీ పింక్ డ్రెస్‌లో ఉంటుంది. ఈతకొలను పక్కన కూర్చుని ఉన్నప్పుడు ఇగ్గీ ఏలియన్లా ఊడిపడుతుంది. ఇద్దరు డాన్స్ చేస్తారు. పాడతారు. 1988 నాటి హాలీవుడ్ మూవీ ‘ఎర్త్ గర్ల్స్ ఆర్ ఈజీ’ ఇన్స్పిరేషన్తో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూత్‌ని ఉర్రూతలూగిస్తోంది. సూపర్ గర్ల్ - ఫస్ట్ లుక్ ట్రైలర్ 6 ని. 36 సె. హిట్స్: 81,81,445 పక్షి కాదు. విమానం కాదు. ఇట్స్ ఎ సూపర్‌గర్ల్. డీసీ కామిక్స్ కొత్త క్యారెక్టర్. సూపర్‌మేన్ కజిన్ సిస్టర్. ‘‘నా కజిన్ బ్రదర్ కల్ ఎల్ భూమి అనే గ్రహం మీదికి వెళ్లాడు. అతడి స్టోరీ గురించి మీకు తెలుసు. ఇప్పుడు నేనూ భూమ్మీదికి వస్తున్నాను. నా పేరు కారా జోర్ ఎల్’’ అని చెబుతుంది ఈ అమ్మాయి. అమెరికన్ సీబిఎస్ టెలివిజన్ నెట్ వర్క్ సమర్పించిన ఈ సపర్ గర్ల్ ఫస్ట్ లుక్ ట్రైలర్‌ను ప్రతి అమ్మాయీ చూసి తీరాలి. హమారీ అధూరీ కహానీ టైటిల్ సాంగ్ 2 ని. 14 సె. హిట్స్: 17,82,899 హమారీ అధూరి కహానీ టైటిల్ ట్రాక్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్ మధ్య సాంగ్ ఇది. గానం అరిజిత్ సింగ్. రొమాంటిక్ సెలైన్స్ సీక్వెన్స్. మోహిత్ సూరీ డెరైక్ట్ చేశారు. మ్యూజిక్ కంపోజ్ చేసింది కోల్‌కతా బాయ్ జీత్ గంగూలి. రంగ్ థే, నూర్ థా / జబ్ కరీబ్ తూ థా / ఏక్ జెన్నత్ పా థా, ఏ జహా / వక్త్ కి రేత్ పె కుచ్ మెరే నామ్ సా / లిఖ్ కె ఛోడ్ గయా తు కహా పాటల మిక్సింగ్ ఇది. సినిమా జూన్ 12న రిలీజ్ అవుతోంది. తనిష్క్ హ్యాపీ మదర్స్ డే యాడ్ 1ని. 46 సె. హిట్స్ : 6, 94,400 హ్యాపీ మదర్స్‌డేకి దీపికా పడుకోనే చేత తనిష్క్ చేయించిన యాడ్ ఇది. దీపిక ఒక జ్యూయలరీ షాపులో తన తల్లికి ఇవ్వడం కోసం గిఫ్ట్‌ను సెలెక్ట్ చేస్తుంటుంది. సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా అమ్మకు కూతుర్నే అని చెబుతుంది. యాడ్ చివర్లో తల్లికి గిఫ్ట్ ఇస్తూ, ఆమెను కావిలించుకుని దీపిక ఎమోషన్‌తో బర్ట్స్ అవడం హృదయాన్ని కదలిస్తుంది. ‘‘ఆజ్ భీ తుమ్హారే సామ్నే ఖానే కె ప్లేట్ మే కుఛ్ ఛోడ్నే కి హిమ్మత్ నహీ హోతీ’ అని యాడ్ మధ్యలో దీపిక చెప్పడం టచింగ్‌గా ఉంది.