ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | this week YouTube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Mon, Nov 13 2017 1:11 AM | Last Updated on Mon, Nov 13 2017 5:17 AM

this week YouTube hits - Sakshi

జో జో చిన్నారి జో.. బజ్జుకో బుజ్జయ్యా
జాన్‌ లూవిస్‌ క్రిస్మస్‌ యాడ్‌ 2017 : మోజ్‌ ది మాన్‌స్టర్‌
నిడివి :  2 ని. 10 సె.
హిట్స్‌ :  60,40,085

బెడ్‌ కింద ఓ రోజు రాత్రి ‘గుర్ర్‌’మని చప్పుడు వినిపిస్తే, దుప్పటి ముసుగు తీసి, కిందకు తొంగి చూస్తాడు జో. అక్కడో రాక్షసుడు ఉంటాడు! ‘మోజ్‌’ అనే ఆ రాక్షసుడు ఏడడుగుల ఎత్తు ఉంటాడు. భయపడి ముసుగు తన్ని పడుకుంటాడు చిన్నారి జో. ఉదయం లేవగానే ‘నో మాన్‌స్టర్స్‌ ఎలౌవ్డ్‌’ అని నోట్‌ రాసి తన బెడ్‌రూమ్‌ తలుపు బయట అంటిస్తాడు. అయినా ఆ మాన్‌స్టర్‌ వచ్చేస్తాడు. రెండో రోజూ, మూడో రోజూ.. అలా రాత్రయ్యేసరికి ప్రతి రోజూ వచ్చేస్తుంటాడు. బెడ్‌ను కింది నుంచి కదిలిస్తుంటాడు. ఆ కుదుపులకు జో కి భయం పోయి నవ్వొస్తుంది. వాడి నవ్వు విని మాన్‌స్టర్‌ బయటికి వచ్చి వాడికి షేక్‌హ్యాండ్‌ ఇస్తాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌ అవుతారు.

జో ని గదిలోనే భుజం ఎక్కించుకుని తిçప్పుతాడు. రాత్రంతా రకరకాల ఆటలు ఆడిస్తాడు. రోజూ రాత్రి ఆటలే ఆటలు. జో కి నిద్ర సరిపోదు. మాన్‌స్టర్‌కంటే వేరే పని లేదు. జో స్కూల్‌కి వెళ్లాలి కదా. వెళ్తాడు. కానీ అక్కడ నిద్రకు జోగుతుంటాడు. జో.. ఫుట్‌బాల్‌ గోల్‌ కీపర్‌. గోల్‌ కీపర్‌ అన్నవాడు ఎంత అలెర్ట్‌గా ఉండాలి. అక్కడా ఓ పోల్‌కి ఆనుకుని నిద్రపోతుంటాడు. గోల్‌ పడుతున్నా కదలడు. హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లో క్రాఫ్‌ చేయించుకుంటూ ముందుకు తూలిపోతాడు.

ఇంట్లో లివింగ్‌రూమ్‌లో కూర్చొని క్రిస్మస్‌ తాతకు గిఫ్ట్‌ లిస్ట్‌ రాస్తూ, రాస్తూ, నిద్రకు ఆగలేక టేబుల్‌ మీద వాలిపోతాడు. ఇది అమ్మానాన్న గమనిస్తారు. క్రిస్మస్‌ గిఫ్టుగా వాడికి ‘నైట్‌ లైట్‌’ ఇస్తాడు. ఆ నైట్‌ లైట్‌లో బెడ్‌ కింది మాన్‌స్టర్‌ మాయం అవుతాడు. జో కి చక్కగా నిద్రపడుతుంది. ‘జాన్‌ లూవిస్‌’ కంపెనీ విడుదల చేసిన క్రిస్మస్‌ యాడ్‌ ఇది. యాడ్‌ పేరు ‘మోజ్‌ ది మాన్‌స్టర్‌’. జాన్‌ లూవిస్‌ బ్రిటన్‌లో పెద్ద సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ల కంపెనీ. 2007 నుంచి ఏడాదికొకటి చొప్పున ఇలా క్రిస్మస్‌ యాడ్‌ రిలీజ్‌ చేస్తోంది.

భయం అనే చీకట్లోనే మాన్‌స్టర్స్‌ కనిపిస్తాయి. నక్షత్రాల వెలుగుల్లో అవి మాయం అయిపోతాయి అన్నది ఈ ఏడాది థీమ్‌. వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌గా మనకు వినిపించే సాంగ్‌ బీటిల్స్‌లోని ‘గోల్టెన్‌ స్లంబర్స్‌’ ట్రాక్‌. ‘వన్స్‌ దేర్‌ వాజ్‌ ఎ వే..’ అని స్టార్ట్‌ అవుతుంది. ‘స్లీప్‌ లిటిల్‌ డార్లింగ్, డునాట్‌ క్రయ్, ఐ విల్‌ సింగ్‌ ఎ లాల్లాబై..’ అనేది ఇమ్మీడియెట్‌ లైన్‌.


పిండుకున్నవాళ్లకు పిండుకున్నంత
హౌ టు డ్రై ఎ షర్ట్‌ ఇన్‌ 30 సెకండ్స్‌
నిడివి :  1 ని. 26 సె.
హిట్స్‌ :  16,85,391

ఉతికిన షర్ట్‌ని 30 సెకన్లలో ఆరబెట్టడం ఎలా? ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు. చూశాక, ఇదేదో కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉందనుకుంటే హాయిగా, మేడ మీదకు వెళ్లి ఎండలో దండెం మీద ఆరేసుకోవచ్చు. షర్ట్‌ని ఎండబెట్టడానికి ఇందులో రకరకాల చిట్కాలు చెప్పాడు ఆ మహానుభావుడెవరో! ‘హౌవ్‌ టు బేసిక్‌’ అనే యూట్యూబ్‌లో అతడు అజ్ఞాతంగా ఉండి మనకిన్ని ఐడియాలు ప్రసాదిస్తుంటాడు. 2011లో ఈ చానల్‌ స్టార్ట్‌ అయింది. తర్వాత రెండేళ్లలో హిట్‌ అయింది.

దీనికిప్పుడు 90 లక్షల మంది అభిమానులు తయారయ్యారు. 2014లో ఒకసారి, 2015లో ఒకసారి యూట్యూబ్‌ ఈ చానల్‌ను బ్యాన్‌ చేసినప్పుడు వీళ్లలో చాలామంది హర్ట్‌ అయ్యారు. పోన్లే పాపం అని మళ్లీ రివైవ్‌ చేసింది. ఎందుకు బ్యాన్‌ చేసిందో తెలుసుకోవాలంటే మీరీ వీడియో చూడాల్సిందే. తెలుసుకోకూడనిది ఏదైనా ఉందీ అంటే.. షర్ట్‌ని ఎలా ఎండబెట్టకూడదన్నదే. ఊ కొడతారో, ఉలిక్కి పడతారో మీ స్టామినా మరి.


బ్లడీ కామెడీ.. నవ్వలేక చావాలి
గేమ్‌ నైట్‌ : ట్రైలర్‌
నిడివి : 2 ని. 27 సె.
హిట్స్‌ : 13,39,076

‘‘ఈ రాత్రికి మనం ఒక కొత్త గేమ్‌ ఆడబోతున్నాం’’ అంటాడు బ్రూక్స్‌.. ఈ ట్రైలర్‌ ఓపెనింగ్‌ సీన్‌లో. బ్రూక్స్‌.. మాక్స్‌ బ్రదర్‌. మాక్స్‌.. యానీ భర్త. మాక్స్‌కీ, యానీకీ ఫ్రెండ్‌.. రియాన్‌. రియాన్‌ లవ్‌ ఇంట్రెస్ట్‌.. శారా. అంటే.. రియాన్‌ శారాను లవ్‌ చేస్తుంటాడు. వీళ్లు కాకుండా ఎఫ్‌.బి.ఐ. ఏజెంట్‌ ఒకరు ఉంటారు. వీళ్లంతా కలిసి, వాళ్లకు తెలియకుండానే ఒక మర్డర్‌ మిస్టరీ వైపు గేమ్‌ను ఆడుకుంటూ పోతుంటారు. గెలిచిన వాళ్లకు డబ్బొస్తుంది.

ఓడినవాళ్ల ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీదు. గేమ్‌ స్టార్ట్‌ అవుతుంది. గేమ్‌ ఆడేవాళ్లలో ఒకళ్లు ఫినిష్‌ కాబోతున్నారు. ఆ ఫినిష్‌ కాబోయేవాళ్లెవరో గేమ్‌లో ఉన్నవాళ్లు కనిపెట్టాలి. వాళ్లకే గ్రాండ్‌ ప్రైజ్‌. అక్కడ ఏదీ నిజమో, ఏది అబద్ధమో తెలీదు. ద ప్లేయర్స్, ద క్లూస్, ద ట్విస్ట్, ద ఛేజ్, ద గూన్స్, ద బ్లడీ డాగ్, ద కరాఒకే, ద స్టంట్స్, ద డాన్స్‌–ఆఫ్స్, ద షిట్‌.. యు వోన్ట్‌ బిలీవ్‌.. అలా కంటిన్యూ అవుతుంది గేమ్‌. వచ్చే ఏడాది మార్చి 2న థియేటర్స్‌లోకి వస్తున్న ‘గేమ్‌ నైట్‌’లో మరింత బ్లడ్‌ను చూడొచ్చు. ఇదొక బ్లడీ కామెడీ థ్రిల్లర్‌.


ఈడ్చుకెళ్లినా ఒడిలోకి చేర్చుకుంది
హోప్‌ ఫర్‌ పాస్‌ రెస్క్యూవర్‌ డ్రాగ్డ్‌
నిడివి : 6 ని. 24 సె.
హిట్స్‌ : 10,52,688

యు.ఎస్‌.లో ‘హోప్‌ ఫర్‌ పాస్‌’ అనే జీవ కారుణ్య సంస్థ ఉంది. దెబ్బ తగిలిన మూగ జీవులను, అనాథ జంతువులను కాపాడటం ఈ సంస్థ పని. ఆ సంస్థలో పనిచేసే వలంటీర్లు నిరంతరం రోడ్ల మీద తిరుగుతూ మూగప్రాణులను అక్కున చేర్చుకుంటూంటారు. ఎవరైనా ఫోన్‌ చేసి చెప్పినా తక్షణం అక్కడికి వెళ్లిపోతారు. అలా ఈ మధ్య గెర్షి్వన్‌ అనే కుక్క గురించి వారికి తెలిసింది. అది ఎవరిదో పెంపుడు కుక్క. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపాలు చేసి వెళ్లిపోయారు వేరే స్టేట్‌కో, వేరే కంట్రీకో! పాపం అది దిక్కులేనిది అయింది.

దాన్ని తమ సంరక్షణలోకి తీసుకోడానికి రెస్క్యూ టీమ్‌ బయల్దేరింది. టీమ్‌ అంటే పెద్దగా ఎవరూ లేరు. లొరెటా అనే అమ్మాయి, ఆ అమ్మాయి అసిస్టెంట్‌. ఇద్దరే. ఇక దాన్ని పట్టుకోవడం పెద్ద టాస్క్‌. ఆ టాస్క్‌ని సంస్థవాళ్లు లొరెటాకు అప్పగించారు. ఆ అమ్మాయికి చాలా ఓపిక. గతంలో ఇలాంటి టఫ్‌ ఆపరేషన్‌లు రెండు మూడు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన అనుభవం ఉంది. అయితే గెర్షి్వన్‌ బలమైన కుక్క.

50 కిలోలకు పైగా బరువుంది. పైగా దాని మెడకు తాడు వెయ్యడం, దానిని నెట్‌లోకి లాక్కోవడం పెద్ద పని. లొరెటా ఆ శునకం మెడకు చాకచక్యంగా తాడు వెయ్యగలిగింది కానీ, దాని బలానికి నిలబడలేకపోయింది. కొంత దూరం శునకమే ఆ అమ్మాయిని లాక్కుపోయింది. అయినా లోరెటా పట్టు వదల్లేదు. టాస్క్‌ పూర్తి చేసింది. గెర్షి్వన్‌ని భద్రంగా తనతో తీసుకెళ్లింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement