ఈ వారం యూట్యూబ్ హిట్స్ | This week Youtube Hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Mon, Aug 8 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఇరు ముగన్ : అఫిషియల్ ట్రైలర్ 
యూట్యూబ్‌లో ‘కబాలి’ తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు ‘ఇరు ముగన్’ చిత్రం హిట్‌ల మీద హిట్‌లు కొడుతోంది! ఇరు ముగన్ అంటే రెండు ముఖాలు అని అర్థం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ తమిళ్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో విక్రమ్, నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు. సంగీతం హ్యారిస్ జయరాజ్. ఈ చిత్రంపై నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జయా టీవీ ఇప్పటికే శాటిలైట్ హక్కులను తన్నుకుపోయింది. గత ఏడాది డిసెంబరులో చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ పర్‌ఫెక్షన్ కోసం దర్శక, నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు విడుదలను జాప్యం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

హాలీవుడ్ తరహాలో అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తూ, మధ్య మధ్య మధురమైన ప్రేమ సన్నివేశాలతో ఇరు ముగన్ గిలిగింతలు పెట్టబోతోందని ఈ ట్రైలర్‌ని చూస్తే అర్థమౌతోంది. 
నిడివి : 2 ని. 17 సె. హిట్స్ : 41,99,362
 
బ్రిట్నీ స్పియర్స్ : మేక్ మీ వీడియో సాంగ్
నిడివి : 4 ని. 53 సె. హిట్స్ : 49,33,788
అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ఈ నెల 26న విడుదల చేయబోతున్న తొమ్మిదవ స్టుడియో ఆల్బమ్‌లోని లీడ్ సాంగ్ ‘మేక్ మీ..’ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయింది. పాటను బ్రిట్నీతో పాటు మ్యాథ్యూ బర్న్, జో జనైక్, గెరాల్డ్ గిల్లమ్ కలిసి ఉమ్మడిగా రాశారు. 
 
‘ ఐ యామ్ డ్రీమింగ్ ఎ మైల్ ఎ మినిట్ అబౌట్ సమ్‌బడీ... దిస్ ఫీలింగ్, ఐ వానా గో విత్ ఇట్, కాస్ దేర్ ఈజ్ నో వే... అంటూ మొదలయ్యే మేక్ మీ సాంగ్... ‘మై హార్ట్ ఈజ్ ఆన్ ఫైర్ వెన్ యు ఆర్ అరౌండ్.. మేక్ మీ ఊ ఊ ఊ ఊ... యా, యూ మేక్ మీ ఊ ఊ’’ అని ముగుస్తుంది. యువతరంలో సున్నితమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్న ఈ వీడియో సాంగ్ ప్రస్తుతానికైతే యు.ఎస్.బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో 17వ స్థానంలో ఉంది. చార్ట్‌లదేముంది? మన హార్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచిపోయే పాట... మేక్ మీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement