స్వీయ వివాహం చేసుకున్న హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ | Britney Spears Announcing Self Marriage In Social Media | Sakshi
Sakshi News home page

నాలుగో పెళ్లి చేసుకున్న హాలీవుడ్‌ సింగర్‌.. ఈసారి..!

Oct 21 2024 7:35 PM | Updated on Oct 21 2024 7:54 PM

Britney Spears Announcing Self Marriage In Social Media

ప్రముఖ హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బ్రిట్నీస్పియర్స్‌  42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు నాతో నాకే పెళ్లి జరిగింది. మీకిది తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసినవాటిలో ఇదొక గొప్ప విషయం అని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. స్వీయ వివాహం చేసుకున్న బ్రిట్నీస్పియర్‌ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

మూడు పెళ్లిళ్లు పెటాకులు
కాగా బ్రిట్నీస్పియర్స్‌ మొదటగా చిన్ననాటి స్నేహితుడు జాసన్‌ అలెగ్జాండర్‌ను పెళ్లాడింది. 2004లో వీరి వివాహం జరగ్గా కొద్ది రోజులకే విడిపోయారు. తర్వాత అదే ఏడాది డ్యాన్సర్‌, నటుడు కెవిన్‌ ఫెడెర్‌లైన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే ఈ దాంపత్యం కూడా సజావుగా సాగలేదు. దీంతో 2007లో విడిపోయారు. అనంతరం బ్రిట్నీ.. 2016లో నటుడు సామ్‌ అస్గారితో డేటింగ్‌ చేసింది. 2022లో వీరు పెళ్లి చేసుకోగా గతేడాది విడిపోయారు. ఈ మధ్యే విడాకులు సైతం మంజూరయ్యాయి.

చదవండి: అప్పుడేమో సినిమాలతో బిజీ.. ఇప్పుడేమో పిల్లలుంటే బాగుండని ఫీలవుతున్న నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement