చాలామంది పనిలో పడి వ్యక్తిగత జీవితాన్నే మర్చిపోతుంటారు. అలా ఏళ్లకు ఏళ్లే గడిచిపోతాయి. కానీ వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో కోల్పోయామని బాధపడుతుంటారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం ఈయన వయసు 69 ఏళ్లు.. ఇన్నేళ్లుగా కెరీర్‌లోనే మునిగిపోయిన ఆయన తనకంటూ కన్నకొడుకు ఉంటే బాగుండని అంటున్నాడు.
ఇద్దరికీ రెండో పెళ్లి
కాగా అనుపమ్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగాకొన్నేళ్లకే విడిపోయారు. 1985లో కిరణ్ ఖేర్‌ను పెళ్లాడాడు. కిరణ్‌కు కూడా ఇది రెండో పెళ్లి! గతంలో ఆమె బిజినెస్‌మెన్ గౌతమ్‌ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. తర్వాత భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్‌ను పెళ్లాడింది. అయితే వీరికి సంతానం లేదు.
ఆ అనురాగం వేరే..
తాజాగా అనుపమ్ మాట్లాడుతూ.. అంతకుముందు పట్టించుకునేవాడిని కాదు కానీ కొన్నిసార్లు బాధేస్తుంటుంది. నాకూ ఓ కొడుకో, కూతురో ఉంటే బాగుండేదని ఏడెనిమిదేళ్లలో ఎన్నోసార్లు అనుకున్నాను. అలా అని సికిందర్‌తో సంతోషంగా లేనని కాదు. కానీ ఓ కొడుకు పుట్టుంటే.. వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషం, అనురాగమే వేరేలా ఉండేది. మాకు సంతానం ఉండుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంటాను.
(చదవండి: నాన్న ఏడుస్తుంటే ఫోటోలు తీశారు, దారుణం: కిచ్చా సుదీప్ కూతురు)
50 ఏళ్లు దాటినప్పటి నుంచి..
నేను పనిలో మునిగిపోయి కొన్నేండ్లపాటు దీని గురించే ఆలోచించలేదు. ఎప్పుడైతే 50-55 ఏళ్ల వయసు వచ్చిందో అప్పటినుంచే ఏదో వెలితిగా అనిపిస్తోంది. ద అనుపమ్ ఖేర్ ఫౌండేషన్‌లో పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. అలాగే నా స్నేహితుల పిల్లలను చూసినప్పుడు కూడా నాకు పిల్లలు లేరు అని ఫీలవుతాను అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment