తల్లి మరణాన్ని తలుచుకుని శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను గుర్తు చేసుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ సమయంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించడానికి నా దగ్గర పదాలు రావడం లేదని బాధను వ్యక్తం చేశారు. సడన్‌గా ఈ శూన్యాన్ని అంగీకరించలేకపోతున్నాని.. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయిందని భావోద్వేగ ట్వీట్ చేశారు.
కిచ్చా తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..'మనిషి రూపంలో ఎప్పుడు నా పక్కనే నిజమైన దైవం అమ్మ. నా గురువు. నా నిజమైన శ్రేయోభిలాషి. నా మొదటి అభిమాని. ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. ప్రతి రోజు ఉదయం నా ఫోన్‌లో ఆ మేసేజ్ వచ్చేది. ఉదయం 5.30 గంటలకే గుడ్ మార్నింగ్ కన్నా అని సందేశం వస్తుంది. ఆ మేసేజ్ చివరిసారిగా అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం వచ్చింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు అమ్మ ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఆసుపత్రిలో ఉన్న మా సోదరితో పాటు, డాక్టర్లతో మాట్లాడి వేదికపైకి వెళ్లా. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లేసరికి వెంటిలేటర్‌పై ఉంచారు. ఆదివారం ఉదయం మాకు శాశ్వతంగా దూరమైంది. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన అమ్మ.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది' అంటూ కిచ్చా సుదీప్ బాధను వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం)
కాగా.. కన్నడ హీరో కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
సుదీప్ కూతురు ఆవేదన
కిచ్చా సుదీప్ కుమార్తె శాన్వీ కూడా ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. నానమ్మతో దిగిన ఫోటోను పంచుకుంది. అయితే అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు చాలా దారుణంగా ప్రవర్తించారని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొందరు వ్యక్తులు అంత్యక్రియలకు అంతరాయం కలిగించారని రాసుకొచ్చింది. నానమ్మను కోల్పోయిన బాధలో మేము ఉంటే.. కొందరు మా మొహాలపై కెమెరాలు పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపింది. వారు నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారని.. మా భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా రీల్స్ కోసం అలా వ్యవహరించడం దారుణమని శాన్వీ పోస్ట్‌లో వివరించింది.
My mother , the most unbiased, loving, forgiving, caring, and giving, in my life was valued , celebrated, and will always be cherished.
*Valued... because she was my true god next to me in the form of a human.
*Celeberated... because she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024
Comments
Please login to add a commentAdd a comment