Kannada star
-
'ఇకపై నాకు మేసేజ్ రాదు'.. కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్!
తల్లి మరణాన్ని తలుచుకుని శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను గుర్తు చేసుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ సమయంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించడానికి నా దగ్గర పదాలు రావడం లేదని బాధను వ్యక్తం చేశారు. సడన్‌గా ఈ శూన్యాన్ని అంగీకరించలేకపోతున్నాని.. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయిందని భావోద్వేగ ట్వీట్ చేశారు.కిచ్చా తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'మనిషి రూపంలో ఎప్పుడు నా పక్కనే నిజమైన దైవం అమ్మ. నా గురువు. నా నిజమైన శ్రేయోభిలాషి. నా మొదటి అభిమాని. ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. ప్రతి రోజు ఉదయం నా ఫోన్లో ఆ మేసేజ్ వచ్చేది. ఉదయం 5.30 గంటలకే గుడ్ మార్నింగ్ కన్నా అని సందేశం వస్తుంది. ఆ మేసేజ్ చివరిసారిగా అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం వచ్చింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్లో ఉన్నప్పుడు అమ్మ ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఆసుపత్రిలో ఉన్న మా సోదరితో పాటు, డాక్టర్లతో మాట్లాడి వేదికపైకి వెళ్లా. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లేసరికి వెంటిలేటర్‌పై ఉంచారు. ఆదివారం ఉదయం మాకు శాశ్వతంగా దూరమైంది. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన అమ్మ.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది' అంటూ కిచ్చా సుదీప్ బాధను వ్యక్తం చేశారు.(ఇది చదవండి: నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం)కాగా.. కన్నడ హీరో కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.సుదీప్ కూతురు ఆవేదనకిచ్చా సుదీప్ కుమార్తె శాన్వీ కూడా ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. నానమ్మతో దిగిన ఫోటోను పంచుకుంది. అయితే అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు చాలా దారుణంగా ప్రవర్తించారని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొందరు వ్యక్తులు అంత్యక్రియలకు అంతరాయం కలిగించారని రాసుకొచ్చింది. నానమ్మను కోల్పోయిన బాధలో మేము ఉంటే.. కొందరు మా మొహాలపై కెమెరాలు పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపింది. వారు నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారని.. మా భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా రీల్స్ కోసం అలా వ్యవహరించడం దారుణమని శాన్వీ పోస్ట్‌లో వివరించింది. My mother , the most unbiased, loving, forgiving, caring, and giving, in my life was valued , celebrated, and will always be cherished.*Valued... because she was my true god next to me in the form of a human.*Celeberated... because she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024 -
హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్
సౌత్ ఇండియా సినిమా అవార్డుల వేడుక(సైమా) దుబాయ్‌లో జరుగుతోంది. సౌత్‌కు చెందిన వివిధ భాషలకు చెందిన సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్ సైతం సైమా ఈవెంట్లో మెరిశారు. అయితే ఈ వేడుకల్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తనదైన స్టైల్లో కనిపించారు. ఈ సందర్భంగా సీసీఎల్ కొత్త సీజన్‌ను వేదికపై కిచ్చా సుదీప్ ప్రకటించారు.అయితే వేదికపై హైదరాబాద్‌కు చెందిన యాంకర్ పొరపాటున కన్నడను కన్నడ్ అంటూ సంభోధించారు. దీనిపై హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ముంబయి వాళ్లు అలా పిలిస్తే ఓకే.. కానీ నువ్వు హైదరాబాదీ అయి ఉండి అలా పిలవడం కరెక్ట్ కాదు' అని సుదీప్ అన్నారు. దీంతో యాంకర్ వెంటనే సారీ చెప్పాడు. ఇకపై కన్నడ అని సంబోధించాలంటూ అతనికి కిచ్చా సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో 2022లో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన సుదీప్ 'హిందీ జాతీయ భాష కాదు' అని అన్నారు. దీంతో అజయ్ దేవగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీప్‌కి హిందీలో సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్లో వార్ జరిగింది. అయితే ఆ తర్వాత అనువాదంలో పొరపాటు జరిగిందంటూ అజయ్ దేవగణ్ ఈ వివాదానికి చెక్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుదీప్ మ్యాక్స్ చిత్రంలో కనిపించనున్నారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022(ఇది చదవండి: గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్.. అభినందిస్తున్న ఫ్యాన్స్)కాగా.. ఈ ఏడాది సైమా అవార్డుల్లో టాలీవుడ్లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమనటుడుగా నాని, ఉత్తమనటిగా కీర్తి సురేశ్ నిలిచారు. ఈ రెండు చిత్రాలకు కలిపి వివిధ విభాగాల్లో దాదాపు ఎనిమిది అవార్డులు వచ్చాయి. PRIDE OF KANNADA CINEMA ♥️It’s not kannad ,, it’s KANNADA 💥💥Boss on Fire mode @#SIIMA2024 ♥️#KicchaBOSS #MaxTheMovie#BRBFirstBlood pic.twitter.com/gWTUMik4s9— K R R I I S S H H ™ 𝕏 (@krriisshhtveezz) September 15, 2024 -
పవర్ఫుల్ రోల్
శివన్నగా పాపులర్ అయిన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కెరీర్‌లోని 131వ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకుడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ .పి నిర్మిస్తున్నారు.‘‘శివ రాజ్‌కుమార్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు చేరుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని డిజైన్ చేశారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: ఎ.జె. శెట్టి. -
రిషబ్ శెట్టి బర్త్‌డే స్పెషల్.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్‌లాల్‌ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
స్టార్ హీరో ట్వీట్‌కు సచిన్ రిప్లై.. అదేంటో తెలుసా!
కన్నడ స్టార్ సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళం, కన్నడ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది కబ్జా సినిమాతో అలరించిన కిచ్చా.. ప్రస్తుతం మ్యాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నెటిజన్ల్తో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా ఆస్క్ కిచ్చా అనే సెషన్లో పాల్గొన్నారు. ఈ సెషన్‌కు హాజరైన పలువురు నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఇటీవల సచిన్‌ను కిచ్చా సుదీప్ కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫోటోను షేర్ చేసిన నెటిజన్.. కిచ్చాను ఇలా అన్నారు. సచిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అన్న ఈ ఫోటో గురించి ఒక్కమాటలో చెప్పండి.. సచిన్‌ను కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది' అని అడిగాడు. దీనికి సుదీప్ రిప్లై ఇచ్చారు. ఈ ఫోటోను చూస్తే 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ.. ఇది నా జీవితంలో మధురమైన జ్ఞాపకం' అంటూ బదులిచ్చారు. అయితే ఈ ట్వీట్ చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు తీసిన మన ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఇది చూసిన కన్నడ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సచిన్ రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ట్వీట్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం స్పందించారు. 'వావ్.. నేను ఇది ఊహించలేదు... మీరు నాకు మరో మరపురాని క్షణాన్ని అందించారు సార్' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This pic is just looking like a wowwwwwwwww... 😁 One fond memory my friend . https://t.co/y4C1a0LkPi — Kichcha Sudeepa (@KicchaSudeep) January 16, 2024 It was lovely meeting you. Aur uss din kisine hamara ye photo bhi kitna acha KICHCHA tha. Always wishing you good health and happiness in life. 😊 https://t.co/D3o1ZvwOUM — Sachin Tendulkar (@sachin_rt) February 2, 2024 Woaaa!!! ♥️♥️.. Didn't expect this ... You jus gifted me another memorable moment... Mch luv and wshs always @sachin_rt sir. https://t.co/tWXaV8Givs — Kichcha Sudeepa (@KicchaSudeep) February 2, 2024 -
స్టార్ హీరో చిత్రాన్ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?
కన్నడ దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే అమెజాన్‌లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్. కాగా.. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ అక్టోబర్‌లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఇటీవల విక్రాంత్ రోణాతో తెలుగులో కూడా మెప్పించాడు. తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) తాజాగా సుదీప్‌పై కన్నడ నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ తీసుకుని మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన తెలుపుతున్నాడు. ప్రాజెక్ట్ కోసం సుదీప్‌కు రూ. 9 కోట్ల రూపాయలు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశానన్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరనట్లు తెలిపాడు. కానీ ఇప్పటి వరకు డేట్స్ కేటాయించడంలో సుదీప్ విఫలమయ్యారని నిర్మాత పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ రూ. 9 కోట్లతో పాటు.. మరో రూ. 10 లక్షలు తన వంట గది రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు ఈ చిత్రానికి 'ముత్తట్టి సత్యరాజు' అనే టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేశామన్నారు. కానీ తమ బ్యానర్లో సినిమా చేయకుండా ఇప్పుడు, ఒక తమిళ నిర్మాతతో సుదీప్ మూవీ ప్రకటించారు. (ఇదీ చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్) తన వద్ద డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పటికే వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేశాడు. కానీ తన బ్యానర్లో చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. దీంతో తాను సుదీప్‌ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌కి సమస్యను తీసుకెళ్లానని, అతను మాట్లాడితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ చెప్పారు. -
'ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్'... ఆసక్తిగా టీజర్ ప్రోమో
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్ హీరోగా కన్నడ చిత్రం విక్రాంత్ రోణాలో నటించారు. ఈ చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. (ఇది చదవండి: కోలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్) తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ది డెమోన్ వార్ బిగిన్స్ ప్రోమో పేరుతో ఈ టీజర్‌ను విడుదల చేశారు. వి క్రియేషన్స్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిచ్చా నేరుగా తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాడీలో బుల్లెట్స్ తీస్తూ మరింత వైల్డ్‌గా కిచ్చా సుదీప్ టీజర్లో కనిపించారు. ఈ టీజర్లో 'యుద్ధాన్ని ఆరంభించే వాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు. రంగంలో దిగి శత్రువుని వెంటాడి, వేటాడి.. వాళ్లు రక్తంతో పరిగెత్తి పారిపోయేదాన్ని చూసేవాడు నేను.. దిగితే దయ, క్షమా, సంధానం లాంటిది ఏదీ ఉండదు.. ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్..' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కాగా.. ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఇటీవల వరుసగా అసురన్, కర్ణన్, నానే వరువేన్ చిత్రాలు నిర్మించారు. వీటిలో అసురన్, కర్ణన్ చిత్రాలు సూపర్ హిట్ కాగా.. నానే వరువేన్ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. (ఇది చదవండి: హాలీవుడ్ హారర్ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ రిలీజ్ డేట్ ఇదే) -
సినిమాలకు బ్రేక్.. కిచ్చా సుదీప్ సంచలన నిర్ణయం!
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈగతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇటీవల కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణతో ప్రేక్షకులను అలరించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రం అభిమానుల అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల సుదీప్ నటించిన కబ్జ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఆయన అభిమానులకు ఓ నోట్ విడుదల చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కిచ్చా సుదీప్ నోట్లో రాస్తూ.. ' హాయ్ ఫ్రెండ్స్. కిచ్చా46 గురించి మీ ట్వీట్స్ అండ్ మీమ్స్ చూశా. అలా పిలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. దీనిపై మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలచుకున్నా. ప్రస్తుతం నేను స్వల్ప విరామం తీసుకుంటున్నా. ఇది నా మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ, బిగ్ బాస్ సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ సమయాన్ని ఆనందంగా ఆస్వాదించాలనుకున్నా. క్రికెట్ కూడా నా లైఫ్‌లో ఓ భాగం. సీసీఎల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ తరఫున మ్యాచులు ఆస్వాదించా. నా సినిమాలకు సంబంధించి మూడు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకే చేశా. ప్రతి రోజు వాటిపై వర్క్ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే అప్డేట్స్తో మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. About my Next ❤️🥂 pic.twitter.com/3vkCmS6FBF — Kichcha Sudeepa (@KicchaSudeep) April 2, 2023 -
ఓటీటీకి వచ్చేస్తున్న పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియాశరణ్ హీరోయిన్గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. కేజీఎఫ్, కాంతార హిట్ చిత్రాల్లాగే అలరిస్తుందని ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ‘కబ్జ’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కబ్జ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
అభిమానితో ప్రేమ.. ఆ తర్వాత.. కాంతార హీరో ప్రేమకథలో ట్విస్టులు
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో రిషబ్ శెట్టి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన వ్యక్తిగత జీవితంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితేరి షబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. ఆయన భార్య పేరు ప్రగతి. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనం. అభిమానితో ప్రేమ సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. ఓ ఈవెంట్లో ఆమెను చూసిన మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఓ ఈవెంట్లో 2016లో పరిచయమైన ప్రగతిని 2017లో వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి. వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. రిషబ్‌కు వీరాభిమాని అయిన ఆ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడే ఆమెను చూశారు రిషబ్. ఇంటికెళ్లి ఫోన్లో ఫేస్ బుక్ చూస్తే ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందట. ఆమె రిక్వెస్ట్ ఏడాది తర్వాత చూసి యాక్సెప్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి చాటింగ్, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. పట్టుబట్టి మరీ ఒప్పించిన ప్రగతి అయినా ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఆ తర్వాత 2017లో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ సినీ కెరీర్ రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా చేశారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏమ్మార్ రమేశ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిర్మాత, దర్శకుడిగా రెండు చిత్రాలు చేస్తున్నారు. -
'కాంతార క్లైమాక్స్.. రియల్ లైఫ్‌లోనూ ఎదురైన సీన్'
కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా అయినా కేవలం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని ప్రధానంగా వరాహం సాంగ్, క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కర్ణాటకలో ప్రాచీన సంప్రదాయమైన భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియోను షేర్ చేసింది. రిషబ్‌శెట్టి, సప్తమి గౌడతోపాటు చిత్రబృందం సభ్యులు. హోంబలే నిర్మాతలు తులునాడులో పంజర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటం.. పంజర్లీ అతడిని ఆవహించడం లాంటి సన్నివేశాలను చిత్రబృందం దగ్గరుండి చూశారు. పంజర్లీ ఆవహించిన వ్యక్తి రిషబ్‌శెట్టిని ఆత్మీయంగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఆ వీడియోలో భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెరపై చూపించిన భూతకోల సన్నివేశాలను నిజ జీవితంలోనూ రిషబ్ శెట్టి బృందం కనులారా వీక్షించింది. స్పెషల్ వీడియో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. కాంతార టీమ్‌తో కలిసి తాము నిజ జీవితంలో దైవానుగ్రహం పొందామని పేర్కొంది. హోంబలే ఫిల్మ్స్ తన ట్విటర్ ఖాతాలో రాస్తూ..'ప్రకృతికి మనం లొంగిపోయి మనకు స్వేచ్ఛ, విజయాన్ని ప్రసాదించిన దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దేవానుగ్రహాన్ని పొందింది.' అని పేర్కొంది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు సినిమా తీయడానికి కంటే ముందే జరిగినట్లు తెలుస్తోంది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು. You surrender to the nature & worship the God, who has bestowed you with such success n freedom in life. #Kantara team witnessed the divine in real form & took the blessings of Daiva!@shetty_rishab #VijayKiragandur @gowda_sapthami @ChaluveG @Karthik1423 pic.twitter.com/vPn8mOoenR — Hombale Films (@hombalefilms) January 20, 2023 -
ఆయన స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రంలో నటిస్తోంది. పుష్-పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఎదిగిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్ అందుకున్న రష్మిక మందన్నా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కమార్తో ఓ చిత్రంలో నటించారు. ఆయనతో కలిసి అంజనీపుత్ర అనే చిత్రంలో కనిపించారు. ఆ సినిమా విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పుష్ప బ్యూటీ. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. ' ఇప్పటికీ అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్‌కుమార్‌తో సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన హర్ష సార్‌కు థాంక్యూ.' అంటూ పోస్ట్ చేసింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. It’s #5YearsForAnjaniPutra already🤍 I keep thinking about the conversations with @PuneethRajkumar sir and he was more confident in me than myself always. He has the best heart, forever will be irreplaceable in my heart. Thankyou Harsha sir for this film,it means a lot to me.🌸 — Rashmika Mandanna (@iamRashmika) December 21, 2022 -
కన్నడ స్టార్ ఉపేంద్ర ఆరోగ్యంపై వదంతులు.. క్లారిటీ ఇచ్చిన నటుడు
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. దీంతో ఉపేంద్ర ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో స్వయంగా ఉపేంద్ర ఓ వీడియోను రిలీజ్ చేశారు.ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి షూటింట్‌లో పాల్గొన్నాడయన. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని తెలిపారు. షూటింగ్ లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డానని, అందుకే దగ్గర్లోని హాస్పిటల్‌కి వెళ్లి వచ్చినట్లు వివరించారు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కబ్జా’, ‘త్రిశూలం’, ‘యూఐ’ వంటి సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. Amidst rumours that Kannada actor #Upendra has been hospitalized due to sudden illness, the actor himself clarified that he is doing fine and is continuing to shoot for #UI pic.twitter.com/4AEHwkDovg — FilmKraft (@FilmKraft24) November 25, 2022 ನಾನು ಆರಾಮಾಗಿ ಇದ್ದೀನಿ ಯಾರು ಭಯಪಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ Upendra | uppi | SK news Kannada #uppi #upendra #sknewskannada #sknews #kannada #media #socialmedia #Karnatakanews #viralnews #news #viral YouTube :-https://t.co/H8vCtVxQEU pic.twitter.com/rw4iHZ8xL3 — SK News Kannada (@SKNewsKannada) November 24, 2022 -
కెజిఎఫ్ 2: రికార్డుల మోత మోగిస్తున్న ట్రైలర్
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం నిన్న(ఆదివారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్, తెలుగులో 20M,హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8మిలియన్ వ్యూస్ వచ్చాయి. 'రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. Records.. Records.. Records..💥 Rocky don't like it, He avoids, But Records likes Rocky! He Cannot avoid it. 𝟏𝟎𝟗 + 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬 ♥️🙏 Kannada: 18M Telugu: 20M Hindi: 51M Tamil: 12M Malayalam: 8M#KGFChapter2Trailer #KGFChapter2 pic.twitter.com/n6pspljdxj — Hombale Films (@hombalefilms) March 28, 2022 -
ఇన్నాళ్లకు కొడుకును చూపించిన హీరో
సాధారణంగా సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్నైనా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ లిస్టులో "కేజీఎఫ్" చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ కూడా ఉన్నాడు. అయితే అక్టోబర్ 30న యశ్ దంపతులకు జన్మించిన కొడుకు ఫొటో మాత్రం ఇప్పటివరకు పంచుకోలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆ ఆ బుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లుంది. తన గారాల కొడుకు ఫొటోను కేజీఎఫ్ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా అయితే అప్పటి నుంచి అతని ముఖాన్ని ఇంతవరకు చూపించనేలేదు. ఆరు మాసాల అనంతరం యశ్ దంపతులు బాబుతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "చిన్నోడికి హాయ్ చెప్పండి.. మీ ఆశీర్వచనాలు అందించడి" అని వారు పేర్కొన్నారు. (‘నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు’) View this post on Instagram The moment all of you waiting for.... Yes Tomorrow, junior turn 6 months!! He will be ready to greet u all.... Are you guys ready for him!! 🤗 PS : Thanks Amrita for this memorable shoot! @mommyshotsbyamrita . . Follow @radhika_pandith_official Follow @radhika_pandith_official @iamradhikapandit @thenameisyash @nandiniarunkumar21 @sahlovesrayray @gourangpandit @toothless_rex #nimmaRP #rockingqueen #radhika_pandit_official #radhikapandit #radhu #iamradhikapandit #yash #thenameisyash #sandalwood_official #sandalwood #kgfmovie #nimmayash #ayrayash A post shared by Radhika_pandit (@radhika_pandith_official) on Apr 29, 2020 at 9:28am PDT ఎంతో క్యూట్‌గా ముద్దులొలుకుతున్న బాబును చూసి జూనియర్ యశ్ అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. ఇదిలా వుండగా యశ్ నటనపై పిచ్చితో రూ.300 తీసుకుని ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. టీ ఇవ్వడం నుంచి ప్రతీ పని చేస్తూ అవకాశం కోసం ఎదురు చూశాడు. అలా ఓరోజు స్టేజీపై ప్రదర్శన ఇస్తుండగా ఆయన ప్రతిభను గుర్తించి సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా సినిమాల్లో నటిస్తున్న సమయంలో రాధికతో ప్రేమలో పడి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఐరాతో పాటు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఇప్పటివరకు ఆ చిన్నోడికి ఇంకా పేరు పెట్టలేదు(రెండోసారి తండ్రి అయిన స్టార్ హీరో) View this post on Instagram Say hello to my little buddy for life ❤ 😎 do give him all your love and blessings🙂🙏 ನಿಮ್ಮ ಪ್ರೀತಿ... ಆಶೀರ್ವಾದ.. ಹಾರೈಕೆ... ಸದಾ ಈ ನನ್ನ ಪುಟ್ಟ ಕಂದನ ಮೇಲಿರಲಿ🙏❤️ A post shared by Yash (@thenameisyash) on Apr 30, 2020 at 3:53am PDT -
కలియుగ కర్ణ
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ (66) శనివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మాండ్య జిల్లాలో దొడ్డరాసినకెరెలో హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు 1952 మే 29న జన్మించారు అంబరీష్. ఏడుగురిలో ఆరో సంతానం ఆయన. అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. అంబరీష్ పేరుతో 1972లో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కన్నడనాట అభిమానులు అంబరీష్‌ను ‘రెబల్ స్టార్, మాండ్యాడ గండు (మ్యాన్ ఆఫ్ మాండ్య)’ అని అభిమానంగా పిలుచుకుంటుంటారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 230 సినిమాలకుపైగా నటించారు అంబరీష్. అంబరీష్‌పై ‘దేనికీ పనికి రాడు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉండేదట వాళ్ల ఇంట్లో. ఆయన టీనేజ్‌కి వచ్చే సమయానికి అన్నయ్యలు, అక్కలందరూ ఇంజినీరింగ్, డాక్టర్లుగా స్థిరపడ్డారు. అప్పటికి అంబరీష్ ఖాళీగా ఉండేవారు. ‘నాగరాహువు’ సినిమా కోసం దర్శకుడు పుట్టన్న కనగళ్ కొత్త వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ హీరోగా విష్ణువర్థన్‌ను ఎంపిక చేసుకున్నారు. విలన్ కావాలి. అంబరీష్ ఇష్టానికి వ్యతిరేకంగా స్క్రీన్ టెస్ట్ కోసం దర్శక–నిర్మాతలకు తన పేరుని సూచించారు ఆయన మిత్రులు. చూడటానికి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాలా ఉండటం, స్క్రీన్ టెస్ట్‌లో ఒకటే టేక్‌లో చేతిలో సిగరెట్‌ను నోట్లో వేసుకోవడంతో పుట్టన్న కనగళ్ ఇంప్రెస్ అయిపోయారు. అమర్నాథ్ని అంబరీష్‌గా కన్నడ సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేశారు. సినిమా బ్లాక్బాస్టర్. అలా అనుకోకుండా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారాయన. కన్నడ పరిశ్రమకు విష్ణువర్థన్, అంబరీష్ అనే ఇద్దరు స్టార్స్‌ను అందించిన సినిమా అది. ఆ సినిమాలాగే వీళ్ల ఫ్రెండ్షిప్ సూపర్ హిట్. ‘నాగరాహువు’ తర్వాత వచ్చిన సినిమాలను వచ్చినట్టు వరుసగా ఒప్పేసుకున్నారు అంబరీష్. సహాయ నటుడిగా, విలన్‌గా సినిమాలు చేస్తూ పోతున్నారు. ‘అంత’లో పోషించిన పవర్ఫుల్ పోలీస్ పాత్ర ఆయన కెరీర్‌కు బ్రేక్ అనుకోవచ్చు. ‘రెబల్’ అనే లేబుల్ అంబరీష్ పేరు ముందు ఫిక్స్ అవ్వడానికి పునాదిగా మారిన సినిమా అది అని అంటుంటారు. ఆ తర్వాత ఎక్కువశాతం సినిమాల్లో రెబల్ పాత్రలే ఆయనకు రావడం, దర్శక–రచయితలు కూడా అవే రాయడంతో ‘రెబల్‌స్టార్ అంబరీష్’గా మారిపోయారు. ‘చక్రవ్యూహ, నాగరాహువు, రంగనాయకీ, మసండ హూవు, గండు బేరుండ’ వంటి పలు ఫేమస్ సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. చిరంజీవి ‘శ్రీమంజునాథ’ సినిమాలో మహరాజు పాత్రలో అంబరీష్ కనిపించారు. ఆ చిత్రం తెలుగు– కన్నడ భాషల్లో తెరకెక్కింది. స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ విష్ణువర్థన్, అంబరీష్‌ల స్నేహానికి పోటీ, అహం అనే సమస్య ఎప్పుడూ అడ్డురాలేదట. అంబరీష్, విష్ణువర్థన్ ఇద్దరూ కలసి ‘స్నేహితర సవాల్, స్నేహ సేదు, మహా ప్రచండరు, అవల హెజ్జే, దిగ్గరాజు’ వంటి సినిమాల్లో కనిపించారు. అంబరీష్, సుమలత హీరో హీరోయిన్లుగా ‘ఆహుతి, అవతార పురుషా, శ్రీమంజునాథ, కళ్లరాలై హూవగీ’ తదితర సినిమాల్లో నటించారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నారు. అంబరీష్ బోల్డ్, రెబల్ యాటిట్యూడ్‌నే ఇష్టపడ్డానని సుమలత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అంబరీష్ ఎంత పెద్ద నటుడైనా బయట నటించడం తెలియదంటారు ఆయన సన్నిహితులు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలంతా బయట క్లీన్ ఇమేజ్‌తో ఉండాలనుకుంటారు. కానీ, అంబరీష్ తన ప్రవర్తనని, స్వభావాన్ని, అలవాట్లని బయట చెప్పడానికి సంకోచించలేదు. షుగర్ కోటింగ్ ఇవ్వాలనుకోలేదు. తన అలవాట్లను బహిరంగంగానే ఒప్పుకునేవారు. అంబరీష్ చాలా సెంటిమెంటల్ మనిషి. సొంత ఊరిని, వారసత్వంగా లభించినవి వదులుకోవడానికి ఇష్టపడేవారు కాదట. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన చెల్లికి ఇచ్చేశారు. కొన్ని కారణాలతో ఆమె ఆ ఇంటిని అమ్మేయడంతో బాధపడ్డానని ఆయన గతంలో పేర్కొన్నారు. అంబరీష్ మంచి భోజన ప్రియుడు. ‘ఒకసారి ఏకంగా 45 దోశెల వరకూ లాగించేశా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు కూడా. తన సినిమాల్లో స్టంట్స్, డ్యాన్స్‌లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు అంబరీష్. డ్యాన్స్ ఉందంటే క్రేన్ తెచ్చుకొని లాంగ్ షాట్లో కెమెరా పెట్టుకోండి అని దర్శక–నిర్మాతలకు సూచించేవారట. ‘దేనికీ పనికి రాడనుకున్న అమర్నాథ్ను కన్నడ ప్రజలంతా ప్రేమించే అంబరీష్‌గా మలిచారు’ అంటూ తన మొదటి చిత్ర దర్శకుడు పుట్టన్న కనగళ్ పేరును ఎప్పుడూ గౌరవంగా ప్రస్తావిస్తూనే ఉంటారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక చిత్రాల్లో›నటించిన రికార్డ్ కూడా ఆయనకే సొంతం. రాజ్‌కుమార్ 206 సినిమాల్లో యాక్ట్ చేయగా, విష్ణువర్థన్ 230 సినిమాల్లో కనిపించారు. రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌బాబు, మమ్ముట్టి.. అంబరీష్‌కు ఆప్త మిత్రులు. ఆయన లేరని తెలుసుకున్న వీరు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాల్లోనూ... 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబరీష్. ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో జనతా దళ్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాండ్య నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా సేవలందించారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీ మిగతా వాటితో పోటీగా నిలవాలని కలలు కంటుంటారు అంబరీష్. ‘‘మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే కన్నడ ఇండస్ట్రీ చిన్నదే. భారీ బడ్జెట్ సినిమాల్లో పాటలకు ఖర్చు పెట్టేంత మొత్తంతో మా కన్నడ సినిమా మొత్తం పూర్తి చేయొచ్చు. కానీ, మిగతా ఇండస్ట్రీలతో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాం’’ అంటూ ఇటీవల జరిగిన కన్నడ చిత్రం ‘కేజీయఫ్’ ఫంక్షన్లో చివరిగా మాట్లాడారు అంబరీష్. ఆసరా కోసం వచ్చే ఏ చేతినీ కూడా అంబరీష్ వట్టి చేతులతో పంపేవారు కాదనీ, ధైర్యంతో నింపేవారని అంటుంటారు. అవును.. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో అంబరీష్ సంపాదించుకుంది ఆస్తుల్ని కాదు.. ఆప్తుల్ని. ఇప్పుడు ఆ అభిమానులను, ఆప్తులను భౌతికంగా విడిచి వెళ్లిపోయి, జ్ఞాపకంగా మిగిలిపోయారు. ట్రబుల్షూటర్ అంబరీష్ కన్నడ ఇండస్ట్రీ ‘ట్రబుల్ షూటర్’ అనే పేరుని గడించారు. ఇండస్ట్రీలో ఎటువంటి మనస్పర్థలు ఏర్పడినా, చిన్న చిన్న గొడవలైనా కూడా వాళ్ల మధ్య సఖ్యత కుదురుస్తారట అంబరీష్. ఇండస్ట్రీలో చాలా మంది గౌరవంగా అంబరీష్‌ను ‘అప్పాజీ’ (నాన్న) అని పిలుస్తారట. కన్నడలో రాజ్‌కుమార్, విష్ణువర్థన్ తర్వాత అంతగా పాపులర్ అయిన నటుడు అంబరీషే కావడం విశేషం. 1994లో ‘మాండ్య గండు’ అనే చిత్రంలో యాక్ట్ చేశారు అంబరీష్. ఆ సినిమా తర్వాత నుంచి అదే పేరుతో ఫేమస్ అయ్యారు ఆయన. రెబల్ స్టార్‌తో పాటుగా కళియుగ కర్ణ అని కూడా అంబరీష్‌ని పిలుస్తుంది కన్నడ పరిశ్రమ. -
నన్ను నేను కోల్పోయినట్లుగా ఉంది
‘‘స్క్రీన్ నేమ్ ‘రెబల్ స్టార్’. కానీ రియల్‌గా ‘సింపుల్ స్టార్.. హంబుల్ స్టార్’’... ప్రముఖ కన్నడ స్టార్ అంబరీష్ గురించి పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ‘‘నలుగురూ బాగుండాలని కోరుకునే వ్యక్తి’’ అని కూడా పేర్కొన్నారు. ఇంత మంచి పేరు ఉంది కాబట్టే... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీవాళ్లు ‘ఇక అంబరీష్ లేరు’ అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని భాషల్లోనూ స్నేహితులను సంపాదించుకున్న అజాతశత్రువు అని అంబరీష్ గురించి వినిపించే మాట. బెంగళూరులో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి వెళ్లిన మోహన్‌బాబు, ఖుష్బూ, సీనియర్ నరేశ్‌లు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► అంబరీష్‌గారితో మీ స్నేహం ఎప్పుడు మొదలైంది? ఎవరు పరిచయం చేశారు అన్నది గుర్తు లేదు కానీ 36 సంవత్సరాల క్రితం మదరాసులో మా ఇంట్లో కలిశాం. ఆ స్నేహం ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలుచుకునేంత గాఢమైంది. అప్పట్లో మదరాసులో వాడు హోటల్లో ఉండేవాడు. ఆ సమయంలో మా ఇంటికి వచ్చేవాడు. అప్పటికి అంబరీష్‌కి పెళ్లి కాలేదు. సుమలత, నేను 10–12 సినిమాలు యాక్ట్ చేశాం. చాలా మంచి అమ్మాయి. అంబరీష్, తనూ పెళ్లి చేసుకోవడం.. ఇలా ఆ కుటుంబానికి చెందినవన్నీ మాకు, మా కుటుంబానికి చెందినవన్నీ వాళ్లకూ తెలుసు. నేను బెంగళూర్ వెళితే వాడికి ఫోన్ చేయాల్సిందే. లేకపోతే ఊరుకోడు. గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి. ► అంబరీష్‌గారు నటుడి నుంచి రాజకీయ నాయకు డిగా ఎదగడం చూశారు.. ఆయన ఎదుగుదల గురించి? నిజానికి మా ఇద్దరి స్నేహం మొదలైనప్పుడు నేను విలన్‌గా చేస్తున్నాను. అంబరీష్ అప్పటికే మంచి స్టార్. కానీ మా మధ్య ఆ తేడాలేవీ ఉండేవి కాదు. మంచి నటుడు అనిపించుకున్నాడు. యంఎల్‌ఏ అయ్యాడు. అన్నీ కష్టపడి సాధించుకున్నాడు. ఆ ఎదుగుదలలో భాగంగా వాడు ఏ ఫంక్షన్‌కి పిలిచినా వెళ్లేవాడిని. ఒకవేళ ఒకటీ అరా వెళ్లకపోతే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ‘ఎక్కడ వాడు.. ఆ రాస్కెల్ ఎక్కడ?’ అని అడిగేవాడు. నన్ను తిట్టేవాళ్లలో మొదటి వ్యక్తి వాడే. ‘అరేయ్ ఒరేయ్’ అనే మాటలకన్నా నన్ను ఎక్కువగానే తిట్టేవాడు. అంత చనువుంది. మా స్నేహాన్ని మాటల్లో చెప్పలేం. ► అంబరీష్‌గారు భోజనప్రియుడు అని విన్నాం. ఏది ఇష్టంగా తినేవారు? మదరాసులో హోటల్లో ఉండేవాడని చెప్పాను కదా. హోటల్లో ఉండే అన్ని రకాల వంటకాలు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉండే ఒకటీ రెండు కూరలు మనకు బ్రహ్మాండంగా అనిపిస్తాయి. అందుకే మా ఇంటి నుంచి క్యారేజీ పంపించేవాళ్లం. చికెన్, మటన్ బాగా ఇష్టపడి తినేవాడు. ఎందుకో కానీ చేపలంటే తనకి ఇష్టం ఉండేది కాదు. నన్ను కూడా తినొద్దనేవాడు. నేను బెంగళూరు వెళితే అప్పుడు కూడా ఫిష్ తప్ప చికెన్, మటన్ వండించేవాడు. ► చివరిసారిగా అంబరీష్‌గారిని మీరెప్పుడు కలిశారు? మా అమ్మగారు చనిపోయిన రోజున (ఈ ఏడాది సెప్టెంబర్ 20) ఫోన్ చేశాడు. ‘కొంచెం ఆరోగ్యం బాగాలేదు.. రాలేకపోతున్నాను. బాధగా ఉంది. కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తాను’ అన్నాడు. పది రోజుల ముందు ఫోన్ చేశాడు. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. వైకుంఠ ఏకాదశికి కుటుంబంతో తిరుపతి రావాలనుకుంటున్నాను అన్నాడు. అంతకు ముందు సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఫ్యామిలీతో సహా తిరుపతి వచ్చాడు. నేనే దగ్గరుండి తీసుకెళ్లాను. రెండు గంటల పాటు దైవ సన్నిధిలోనే ఉన్నాం. ► స్నేహం ఏమీ ఆశించదంటారు.. మీ ఇద్దరి స్నేహం అలానే సాగిందా? ఈ రోజు వరకూ కూడా వాడు ఫలానాది కావాలి అని అడిగింది లేదు. ఎప్పుడైనా నేనేమైనా అడిగానేమో గుర్తు లేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. నా లైఫ్‌లో గొప్ప స్నేహితుడు వాడు. శ్రేయోభిలాషి. అంబరీష్ లేడనే మాట విని బాధపడిపోయాను. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. అంబరీష్ అంతిమక్రియలు జరిగే వరకూ బెంగళూరులోనే ఉంటాను. నా మిత్రుడికి చివరి వీడ్కోలు ఇచ్చినప్పటికీ నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోడు. నా ఆప్తమిత్రుల్లో ఒకరిని కోల్పోయాను. నన్ను నేను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ‘అడుగు ఆపకూడదు అనేవారు’ — సీనియర్ నరేశ్ ► చివరిసారిగా అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? గతేడాది బెంగళూరులో ఆయన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అందర్నీ పిలిచారు. అప్పుడు కలిశాను. ఆ తర్వాత కన్నడ నటీనటుల సంఘం (కళారధి) భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాను. నటీనటుల కోసం బెంగళూరులో అంత పెద్ద బిల్డింగ్ రావడం ఆయన కృషి వల్లే సాధ్యమయింది. నేను చివరిసారిగా అంబీ అన్నను కలిసింది ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడే. దాదాపు 9 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. ► అసలు మీరు అంబరీష్‌గారిని ఫస్ట్ ఎక్కడ కలిశారు? 1983–84–85 టైమ్‌లో ఆయన చెన్నైలో ఉండేవారు. ఆ టైమ్‌లో ఫస్ట్ కలిశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. నా కెరీర్ తొలినాళ్లలో ఆయన వందో చిత్రం షూటింగ్ టైమ్‌లో కలిశాను. ఆయన్ను బ్రదర్‌లా అనుకునేవాడిని. ► అంబరీష్గారిలోని నటుడ్ని చూసి మీకేనిపించేది? కన్నడంలో రాజ్‌కుమార్‌గారి తర్వాత మాస్ హీరో అంటే అంబరీష్గారే. ఆయన్ను తొలిసారి బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘అంత’ (తెలుగులో ‘అంతం కాదిది ఆరంభం’)లో వెండితెరపై చూశాను. స్క్రీన్‌పై అంబీ అన్న నటన చూసి, ఆశ్చర్యపోయాను. సౌత్ నుంచి ఓ సినీ దిగ్గజం వెళ్లిపోయింది. ► అంబరీష్‌గారు ఎలాంటి వారు? ఆయనకు వయసు భేదం లేదు. అందరినీ కలుపుకునే పెద్ద మనసు ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇదే చెబుతారు. చాలా ధారాళమైన హృదయం ఉన్న వ్యక్తి. చాలా సరదా మనిషి. అంబరీష్‌గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారా? కలిసి నటించలేదు. కృష్ణగారితో సుమలతగారు సినిమాలు చేశారు. అలా ఆ కుటుంబానికీ, మా కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది. ► మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవారా? లైఫ్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఆగకూడదు అనేవారు. చాలా మొండివాడు. ధైర్యవంతుడు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ, దానధర్మాల్లోనూ ముందు ఉండేవారు. ► అంబరీష్గారి నుంచి స్ఫూర్తి పొందే విషయాలు చెబుతారా? చాలా ఉన్నాయి. మేజర్‌గా ధైర్యం, కలుపుగోలుతనం, దానగుణం. 'స్థాయిని బట్టి మాట్లాడే వ్యక్తి కాదు' – ఖుష్బూ ► మీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంబరీష్‌గారు స్టార్. ఆయనతో సినిమా చేసినప్పుడు ఎలా ఉండేది? అంబరీష్‌గారు చాలా కంఫర్ట్బుల్. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆయనతో పని చేయడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే రిపీటెడ్‌గా వర్క్ చేయాలనుకునే స్టార్ అంబరీష్. అంత కంఫర్ట్బుల్. ► ఫస్ట్ టైమ్ అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? ‘ఒంటి సలగా’ అనే కన్నడ సినిమా సెట్లో మెదటిసారి కలిశాను. నేను సూపర్‌స్టార్‌ని. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను చూసి భయపడాలి అనుకునే మనిషి కాదు అంబరీష్‌గారు. అలాంటివి కోరుకోరు కూడా. చాలా హంబుల్‌గా ఉండేవారు. అందుకని నాకు భయం అనిపించలేదు. ► పవర్ఫుల్ మాస్ రోల్స్ చేయడంవల్ల అంబరీష్గారికి ‘రెబల్‌స్టార్’ ట్యాగ్ ఉంది. లొకేషన్లో అసిస్టెంట్స్‌తో ఎలా ఉండేవారు? స్క్రీన్ మీదే ఆయన రెబల్ స్టార్. బయట అందరినీ సమానంగా చూసేవారు. కెరీర్ చివరి వరకూ కూడా ఆయన అలానే ఉన్నారు. స్థాయిని బట్టి మాట్లాడే గుణం లేదాయనకు. ► 1980లలో నటించిన తారలందరూ ‘రీయూనియన్’ అంటూ ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. అప్పుడు అంబరీష్‌గారు సందడి చేసేవారా? ఈ ఏడాది ఆరోగ్య కారణలతో హాజరు కాలేకపోయారు. కానీ ప్రతీ ఏడాది ఫుల్ హుషారుగా, సరదాగా ఉండేవారు. చాలా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటారు. కానీ 2015లో మోహన్‌లాల్ ఏర్పాటు చేసిన మీట్లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. శనివారం వెళుతూ వెళుతూ ఓ చేదు వార్త వినేలా చేస్తుందని ఊహించలేదు. మా అందరికీ పెద్ద షాక్. అత్యంత ఆప్తుడిని కోల్పోయాం. -
ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పండి : స్టార్ హీరో
శివాజీనగర: పుట్టినరోజును జరుపుకోవటానికి దుబారా ఖర్చులు చేయరాదని, నేరుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఉపేంద్ర అభిమానులకు విన్నవించారు. పుట్టిన రోజంటూ అభిమానులు కేక్‌లకు, పూలదండలకు, ఫ్లెక్సీ బోర్డులకు డబ్బులు ఖర్చులు చేయరాదని ఉప్పి అన్నారు. తన ఇంటికి వచ్చి నేరుగా శుభాకాంక్షలు చెప్పవచ్చని ట్విట్టర్లో ఆహ్వానం పలికారు. ఈ నెల 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఇటీవల పుట్టినరోజును జరుపుకున్న హీరో కిచ్చ సుదీప్.. అభిమానులు ఆడంబరాల కోసం కాకుండా ఆ సొమ్మును పేదల సహాయానికి ఉపయోగించాలని కోరారు. అదే రీతిలో ఉపేంద్ర కూడా స్పందించడం విశేషం. For all my loving fans request not to spend money on cakes garlands and flex boards. Please come and meet me with your wishes on my birthday — Upendra (@nimmaupendra) September 10, 2017 -
నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత
అమెంటే నాకు ప్రత్యేకం... ఆమెకే నా మొదటి ప్రాధాన్యం ... ఆమెను విపరీతంగా ప్రేమిస్తాను ... అని 11 ఏళ్ల తన గారాల పట్టి, కుమార్తె శాన్వీ గురించి ప్రముఖ నటుడు సుదీప్ తెలిపారు. ప్రియా, తనకు విడాకులు తీసుకున్నా శాన్వీతో తన అనుబంధంలో మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సుదీప్, కేరళకు చెందిన ప్రియా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్. సుదీప్ చిత్రాల్లో నటిస్తుంటే ... ప్రియా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమలోపడ్డారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రియను సుదీప్ వివాహం చేసుకున్నాడు. 2004లో వీరికి శాన్వీ జన్మించింది. మొదట్లో సుదీప్ ఇబ్బందులు పడ్డా... ఆ తర్వాత పుంజుకున్నారు. ఇటీవల వరుస సినిమాల ఆఫర్లు వస్తుండటంతో సుదీప్ తెగ బిజీ అయ్యారు. అయితే 2009 - 10లో సుదీప్‌పై వుకార్లు వెల్లువెత్తాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రియా కుమార్తె శాన్వీతో కలసి బెంగుళూరులోని జేపీ నగర్లో సర్జాపుర్ రహదారి సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సుదీప్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ ప్రియా ఈ ఏడాది ఆగస్టులో కోర్టును ఆశ్రయించింది. ఇద్దరి అంగీకారంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. శాన్వీ మైనర్ కాబట్టి ఆమె బాధ్యతులు తల్లి ప్రియా చూసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే విడాకులు నేపథ్యంలో ప్రియకు రూ. 19 కోట్ల రూపాయిలు భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ ఒప్పుకున్నాడని సమాచారం. భరణంపై సుదీప్‌ను విలేకర్లు ప్రశ్నించారు. నేను చేస్తున్నదంతా నా కుమార్తె... నా భార్య కోసమే కాదా అని సింపుల్‌గా సుదీప్ చెప్పేశాడు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రం ద్వారా సుదీప్ దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న విషయం విదితమే. -
మరో చాన్స్
ఇవన్ వేరమాదిరి చిత్రంలో కోలీవుడ్‌కే చెందిన కన్నడ బ్యూటీ సురభి నటించింది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా మంచి నటనను ప్రదర్శించి మార్కులు కొట్టేసిన ఈ భామకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి. రెండవ చిత్రంగా దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆదలాల్ కాదల్, పాండియనాడు వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న చిత్రానికి జీవా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విష్ణువిశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. మరో విషయమేమిటంటే సుశీం ద్రన్, విష్ణువిశాల్ కాంబినేషన్లో ఇంతకు ముందు వెన్నెలకబడికుళు వంటి హిట్ చిత్రం వచ్చింది. ఈ చిత్రం కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కగా తాజా చిత్రం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందటం విశేషం. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటి సురభి మాట్లాడుతూ సుశీంద్రన్, విష్ణు విశాల్ కాంబినేషన్లో నటించడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఈ చిత్రం తప్పకుండా వేరే స్థాయికి తీసుకు వెళుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. తన తొలి చిత్రం ఇవన్ వేర మాదిరికి ఈ చిత్రం పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని పేర్కొంది. ఇందులో తాను సిటీ అమ్మాయిగా నటించనున్నట్లు తెలిపింది. నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ సుశీంద్రన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితమే వీర ధీర సూర అనే చిత్రంలో నటించాల్సి ఉందన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభంకాలేదని వెన్నెల కబడ్డికుళు చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు జీవా చిత్రాన్ని సుశీంద్రన్ దర్శకత్వంలో చేయడం సంతోషంగా ఉందన్నారు.