పవర్‌ఫుల్‌ రోల్‌ | kannada star siva rajkumar 131st movie update | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ రోల్‌

Published Mon, Aug 19 2024 3:25 AM | Last Updated on Mon, Aug 19 2024 3:25 AM

kannada star siva rajkumar 131st movie update

శివన్నగా పాపులర్‌ అయిన కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ కెరీర్‌లోని 131వ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌ అద్వైత్‌ దర్శకుడు. పద్మజ ఫిల్మ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్‌ఎన్‌ రెడ్డి, సుధీర్‌ .పి నిర్మిస్తున్నారు.

‘‘శివ రాజ్‌కుమార్‌ ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు చేరుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని డిజైన్‌ చేశారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సీఎస్, కెమెరా: ఎ.జె. శెట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement