Shiva Rajkumar
-
సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సర్జరీ కోసం తాజాగా ఆయన అమెరికాకు వెళ్లారు. ఈమేరకు ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'భైరతి రంగల్' సినిమా విడుదల తర్వాత ఆయన మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ సినిమా సమయం నుంచే ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో డిసెంబర్ 24న సర్జరీ జరగనుంది. మీడియాతో శివరాజ్ కుమార్ తన అనారోగ్యం గురించి ఇలా చెప్పుకొచ్చారు.'ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఎందరో అభిమానులు, సహ నటీనటులు నుంచి ఎంతో ప్రేమ నాకు అందుతుంది. వారందరి ఆశీస్సులు నేను పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను కాస్త అనారోగ్యంగా ఉన్నానని గతంలోనే పంచుకున్నాను. అయితే, ఈ విషయంలో మీడియా చాలా సంయమనం పాటించి తప్పుగా వార్తలు ప్రచారం చేయలేదు. వారందరికీ ధన్యవాదాలు. సర్జరీ కోసం ఇలా వెళ్తున్నప్పుడు ఎవరిలోనైనా కాస్త ఆందోళన ఉంటుంది. చాలా విషయాల్లో నేను చాలా డేర్‌గా ఉంటాను. అయితే, ఇలాంటి సమయంలో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను చూసినప్పుడు కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అవుతాం. అంతా మంచిగానే జరుగుతుంది. ఎవరూ అందోళన చెందకండి. సర్జరీ పూర్తి అయ్యాక యూఐ, మ్యాక్స్ సినిమాలను తప్పకుండా చూస్తాను.' అని ఆయన అన్నారు.శివరాజ్ కుమార్ ఆరోగ్య సమస్య గురించి మీడియాతో పంచుకోలేదు. తన అనారోగ్యం గురించి చెప్పి అభిమానులను బాధ పెట్టడం ఇష్టం లేదని ఆయన అన్నారు. అయితే, ఫ్లోరిడాలోని మయామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చేరనున్నారని తెలుస్తోంది. 'భైరతి రంగల్' సినిమా కోసం ఆయన భారీగానే ప్రచారం చేశారు. అయితే, ఒప్పుకొన్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన తన చిత్రం కోసం కష్టపడ్డారు. సర్జరీ తర్వాత సుమారు నెల రోజుల పాటు ఆయన అమెరికాలోనే ఉండనున్నారు. రెండు నెలల తర్వాత మళ్లీ అందరి ముందుకు వస్తానని శివ అన్నారు. ఉత్తరకాండ, భైరవుడు, రామ్‌చరణ్-బుచ్చిబాబుల చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. -
తెలుగులో రిలీజ్ కాబోతున్న మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ!
ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అయితే కొన్ని అక్కడ రిలీజ్ అయిన రోజే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని మాత్రం అక్కడ సూపర్ హిట్ అయితేనే కొంత సమయం తీసుకొని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కూడా తెలుగులో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. అదే భైరతి రణగల్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం కర్ణాటకలో రిలీజ్ అయి హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ "మఫ్తీ"కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంతోషంలో శివరాజ్ కుమార్ అభిమానులు సినిమాలోని ఆయన మేకోవర్ తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. "భైరతి రణగల్" చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ నటించారు. -
విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్
ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.కాగా.. శివరాజ్ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు. -
పవర్ఫుల్ రోల్
శివన్నగా పాపులర్ అయిన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కెరీర్‌లోని 131వ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకుడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ .పి నిర్మిస్తున్నారు.‘‘శివ రాజ్‌కుమార్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు చేరుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని డిజైన్ చేశారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: ఎ.జె. శెట్టి. -
ఓటీటీలో శివన్న, ప్రభుదేవా సినిమా స్ట్రీమింగ్
శివరాజ్‌కుమార్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన కన్నడ సినిమా 'కరటక దమనక'. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక సాంగ్ దేశవ్యాప్తంగా ఊపేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రముఖ డైరెక్టర్ యోగరాజ్ భట్ తెరకెక్కించారు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా మార్చి నెలలో విడుదలైంది. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.శివరాజ్ కుమార్‌తో యోగరాజ్ భట్ మొదటి సారి ఈ సినిమా తెరకెక్కించారు. ఆపై శివన్న- ప్రభదేవా కాంబినేషన్లో నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభుదేవా హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వారు ఆశించనంతగా ఈ చిత్రం మెప్పించలేదని టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగు, తమిళ్ వర్షన్స్ కూడా విడుదల కానున్నాయని సమాచారం.కరటక (శివరాజ్‌కుమార్), దమనక (ప్రభుదేవా) పాత్రలలో ఇద్దరూ పోటీపడి నటించారు. ఒక కేసు కారణంతో జైలులో ఉన్న వారిద్దరిని ఒక పనిచేసి పెట్టాలని జైలర్ విడుదల చేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒక పల్లెటూరుకు వెళ్తారు. అక్కడ ఊరును మోసం చేసి, దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే మోసగాళ్లలా ఉంటారు. అదే గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్న ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోతారు. నీళ్లు లేకపోవడంతో కొందరు ప్రజలు అక్కడి నుంచి పట్టణాలకు వెళ్లిపోతారు. కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అక్కడే ఉండాలని కొందరు అనుకుంటారు. ఇలాంటి సమయంలో జిత్తులమారి నక్కలుగా ఉన్న వారిద్దరూ ఆ గ్రామం కోసం ఏం చేశారు. వారికి ఆ జైలర్ అప్పగించిన పని ఏంటి..? అనేది ఆసక్తిని పెంచుతుంది. ప్రియా ఆనంద్, నిశ్విక నాయుడు, రవిశంకర్, రంగాయణ రఘు, తనికెళ్ల భరణి తదితరలు ఈ సినిమాలో నటించారు. తనికెళ్ల భరణి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇంటి వద్దే చూసేయండి. -
హిట్ సినిమాకు ప్రీక్వెల్.. ఫస్ట్ గ్లింమ్స్ విడుదల
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా నుంచి ఫస్ట్ వెర్డిక్ట్ పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో శివ రాజ్‌కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.'భైరతి రంగల్' సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15, 2024న విడుదల చేస్తామని గతంలో శివరాజ్‌కుమార్ ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన వెర్డిక్ వీడియోలో సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. అందులో శివన్న రగ్గడ్ లుక్‌లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్‌గా రానుంది. -
ఒక్క సినిమాతో తెలుగోళ్లకు నచ్చేశాడు.. శివరాజ్ కుమార్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడశ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు. -
యువ రాజ్‌కుమార్, శ్రీదేవి దాంపత్య జీవితంలో 'ఎఫైర్స్' చిచ్చు
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తనను క్రూరంగా శ్రీదేవి హింసిస్తుందంటూ అందులో పేర్కొన్నాడు. దానిని ఖండించిన శ్రీదేవి కూడా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిపై శ్రీదేవి భైరప్ప కూడా కౌంటర్ ఇచ్చింది. యువ రాజ్‌కుమార్‌కు అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి సంచలన ఆరోపణ చేసింది. విడాకుల కేసుకు సంబంధించి యువ రాజ్‌కుమార్ తరఫు న్యాయవాది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. అది గమనించిన శ్రీదేవి భైరప్ప.. ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే.న్యాయవాది చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటి..?'శ్రీదేవికి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. శ్రీదేవి తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇంటి పేరు దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తితో శ్రీదేవికి ఎఫైర్ ఉంది. తన అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ నటితో యువ రాజ్‌కుమార్‌కు సంబంధం ఉందంటూ తప్పుడు కథనం చెబుతుంది. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్య ఉందని నా లీగల్ నోటీసుకు శ్రీదేవి సమాధానంగా ఇచ్చింది. లైంగిక సమస్య ఉంటే అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది..?' అని ప్రెస్మీట్లో న్యాయవాది ప్రశ్నించారు.ఆయనకు ఒక నటితో ఎఫైర్ ఉంది: శ్రీదేవి భైరప్ప 'వృత్తిపరమైన సమగ్రతను కాపాడుకోవాల్సిన వ్యక్తి బహిరంగంగా ఒక మహిళ పాత్రపై తక్కువ స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనది. గత కొన్ని నెలలుగా నేను ఎన్నో బాధలు పడ్డా, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నాను. కానీ నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం. యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను.' అని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు.యువ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓమ్ చిత్రంలో మెప్పించాడు. ఈ ఏడాదిలోనే 'యువ' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్‌కుమార్ జోక్యంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. నివేదిక ప్రకారం, శ్రీదేవి మొదట్లో డాక్టర్ రాజ్‌కుమార్ సివిల్ సర్వీస్ అకాడమీని చూసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నత చదువులు చదువుతోంది. జూలై 4 విడాకుల విషయం కోర్టులో విచారణ జరగనుంది. View this post on Instagram A post shared by Sridevi Byrappa (@sridevibyrappa) -
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు. -
Pawan Kalyan: అక్కడ బ్రేక్ వేస్తే..ఇక్కడ చిక్కే!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా హీరో శివరాజ్‌కుమార్ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. శివరాజ్ కుమార్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్ స్పీడ్‌కు కర్ణాటక బీజేపీ బ్రేకులు వేసే పనిలో ఉంది. శివరాజ్ కుమార్ టార్గెట్‌గా కన్నడ చిత్రపరిశ్రమలో ఆయనకు సంబంధించిన సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్స్‌ను ఎక్కడా కనిపించకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక బీజేపీ ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగులను ప్రదర్శించకుండా ఆదేశించాలని బీజేపీ తాజాగా కోరింది. బీజేపీ ఫిర్యాదును అక్కడి ఎన్నికల కమిషన్ అమలు చేస్తే ఏపీలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు, ప్రకటనలు వంటి వాటిని కూడా నిషేధించాల్సి వస్తుంది. కన్నడలో శివరాజ్ కుమార్ కూడా పాపులర్ హీరో.. ఆయన గురించి బీజేపీ ఎలాంటి ఫిర్యాదు చేసిందో ఇప్పుడు ఏపీలో కూడా అవన్నీ పవన్‌కు వర్తిస్తాయి అనేది పాయింట్. -
మెగాస్టార్‌ను కలిసిన శివన్న.. చిరు ఇంట్లో భోజనం..
సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ క్రమంలో చిరంజీవి.. రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సన్మానించింది. ఆయనతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న అందరినీ ఘనంగా సత్కరించింది. ఆత్మీయంగా కలిసి మరీ.. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మెగాస్టార్‌ను అభినందించాడు. ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో కాదు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ చిరంజీవిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. 'ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి ఉప్పొంగిపోయాను. మెగాస్టార్‌తో శివన్న లంచ్ మేమిద్దరం కలిసి భోజనం చేశాం, చాలాసేపు కబుర్లాడుకున్నాం. లెజెండరీ నటుడు రాజ్ కుమార్‌తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం' అని కాస్త ఎమోషనలయ్యాడు. శివన్నతో కలిసి భోజనం చేసిన ఫోటోలను సైతం ట్వీట్ చేశాడు. ఇది చూసిన జనాలు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗 Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso — Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024 చదవండి: హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు! -
శివరాజ్ కుమార్‌తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ!
"సప్త సాగరాలు దాటి" సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. -
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్. -
రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..
-
డీకే శివకుమార్ భారీ ఆఫర్.. నో చెప్పిన హీరో శివ రాజ్‌కుమార్
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దేశ వ్యాప్తంగా 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అందరూ ఎన్నికల కోసం సిద్ధం కావాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం కన్నడ స్టార్ హీరో అయిన శివ రాజ్‌కుమార్‌ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలనే కాంగ్రెస్ ప్లాన్‌కు శివన్న బ్రేకులు వేశాడు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్‌ను డీకే శివకుమార్ ఆఫర్ చేశారు. కర్ణాటకలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ టికెట్ ఇస్తామని శివన్నతో డీకే చెప్పారు. కానీ అందుకు శివరాజ్కుమారు నిరాకరించారు. తన ముందు ఐదారు సినిమా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని తెలిపారు. దీనికి సమాధానంగా డీకే కూడా ఇలా చెప్పారు... సినిమాలు ఎప్పుడైనా తీయవచ్చు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్రజలకు సేవ చేద్దాం. పార్లమెంటులో మీ లాంటి వారు ఉండాలి. కన్నడిగుల వాయిస్ వినిపించాలి.' అని కోరారు. అప్పటికీ కూడా శివరాజ్ కూమార్ అంగీకరించలేదు. అనంతరం శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'నేనెప్పటికీ రాజకీయాల్లోకి రాను. మా నాన్న మాకు తెరపై మాత్రమే నటించమని అడిగారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ చెప్పలేదు. ముఖానికి రంగులు వేసుకుని నటించి మీ అందరినీ మెప్పించడం మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్.. అక్కడే నా లైన్ ముగుస్తుంది. వెండితెరపై మా నటన మాత్రమే చూసి అభిమానులు మమ్మల్ని ఆధరించారు. అది చాలు మాకు .. రాజకీయాలు మాకొద్దు. వాటి కోసం ప్రత్యేకంగా మంచిపని చేసేవాళ్లు కూడా ఉన్నారు. అది వారి పని.. వెండితెరపై నటించడం మాత్రమే నా పని. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప (జనతాదళ్ JDS) కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. ఆయన కూడా మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఏనాడు పిలవలేదు. కానీ రాజకీయాలకు అతీతంగా మాత్రమే నా భార్య గీతకు అండగా నిలుస్తాను. తను రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలతో మమేకంగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వరకు మాత్రమే నా పాత్ర ఉంటుంది.' అని శివన్న చెప్పాడు. దీంతో కొందరు శివన్న ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. (డీకే శివకుమార్‌తో గీత, ఆమె సోదరుడు మధు బంగారప్ప) గీత జనతాదళ్ అభ్యర్థిగా 2013లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గీత కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భగా ఆమె డీకే శివకుమార్ కాళ్లకు నమస్కరించారు. ఈ చర్యను శివరాజ్ కుమార్, రాజ్‌కుమార్ అభిమానులు అప్పట్లో ఖండించారు. గీత సోదరుడు అయిన మధు బంగారప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. -
కన్నడ సూపర్‌స్టార్‌ను కలిసిన టాలీవుడ్ హీరో నాని (ఫొటోలు)
-
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా
ఓటీటీల దెబ్బకు స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోలని తేడా లేకుండా పోయింది. ఏదో కొన్ని మూవీస్ మినహా మిగతావన్నీ కూడా నెలలోపే లేదంటే ఐదు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన రెండు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఏ సినిమా? కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. పునీత్ రాజ్కుమార్కి ఇతడు సొంత అన్న. మొన్నీమధ్య రజనీ 'జైలర్'లో గెస్ట్ రోల్ చేసి విజిల్స్ వేయించారు. ఇకపోతే ఈయన హీరోగా నటించిన 'ఘోస్ట్' అనే యాక్షన్ మూవీ.. సెప్టెంబరు 19న కన్నడలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తీసిన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు లేటుగా అంటే నవంబరు 4న విడుదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ఓటీటీలో ఎప్పుడు? పెద్దగా బజ్ లేకుండానే తెలుగులో రిలీజైన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలీదు. అలా ఇప్పుడు తెలుగులో రిలీజైన రెండు వారాల్లోలోపే అంటే నవంబరు 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ వారం వీకెండ్లో ఏదైనా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే శివన్న 'ఘోస్ట్' ట్రై చేయొచ్చు. 'ఘోస్ట్' కథేంటి? వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. 10 ఏళ్లు పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు అనుమతి తెచ్చుకుంటాడు. భూమిపూజ కోసం జైల్లో అడుగుపెట్టిన వామన్, అతడి టీమ్‌ని ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అయితే వామన్ని అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితం చనిపోయిన బిగ్ డాడీ(శివరాజ్ కుమార్) అని తెలుస్తుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు? ఆ జైలులోని వెయ్యి కిలోల బంగారం కథేంటి? చివరకు ఏమైందనేదే 'ఘోస్ట్' స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
యాక్షన్ ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా శ్రీని దర్శకత్వంలో రూపొందిన కన్నడ యాక్షన్ చిత్రం ‘ఘోస్ట్’. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జాయిస్, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్ . సందేశ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, దీంతో ఈ సినిమాను నవంబరు 4న తెలుగులోనూ విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య. -
పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్
కన్నడ సినిమా యువరాజు, పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది నేటికి రెండేళ్లు. నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక సేవలో కూడా అప్పూ నిమగ్నమయ్యాడు. అందుకే నేటికీ ఆయన అభిమానుల మదిలో మరపురాని జ్ఞాపకం. కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకాన్ని పూలతో అలంకరించారు. సంస్మరణ సభకు సన్నాహాలు కంఠీరవ స్టూడియోలోని ఆయన సమాధి దగ్గర శనివారం అప్పు సంస్మరణ సభకు సన్నాహాలు చేశారు. ఈ సమాధిని పునీత్ రాజ్ కుటుంబం నిర్మించింది. పునీత్ రాజ్‌కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించారు. దానిపై పునీత్ ఫోటో పెట్టారు. సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లటి రాతి పలకతో కప్పబడి ఉంటుంది. తన తండ్రి స్మారకం మాదిరిగానే పుత్ర స్మారకం కూడా ఏర్పాటు చేశారు. నేడు ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్, పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేశారు. వారితో పాటుగా శివరాజ్ కుమార్ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. అక్కడకు భారీగా ఆయన అభిమానులు తరలి వచ్చారు. క్యూలో నిల్చున్న అభిమానులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ, పునీత్ రాజ్‌కుమార్ సమాధులను రకరకాల పూలతో అలంకరించారు. పూజలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సమాధి వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి నివాళీలు అర్పిస్తున్నారు. అప్పా (నాన్న) ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడని వారు నినాదాలు చేస్తున్నారు. పునీత్ మరణం తర్వాత జూ. ఎన్టీఆర్ మాట్లాడిన మాటాలను తాజాగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానులకు అన్నదాన ఏర్పాట్లు పునీత్ సమాధి దర్శనానికి వచ్చే అభిమానులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పులావ్, పెరుగు, కుంకుమపువ్వు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. 20 మందితో కూడిన బృందం వంట చేస్తోంది. రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను శివరాజ్ కుమార్ ఏర్పాటు చేశాడు. ► పునీత్ రాజ్‌కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ► పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. We Will Never Miss You....🥺 Untill See You Again......🙏🏻💐 ನಿಮ್ಮನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ.... Atleast,We Are Waiting In Our Dream To See You 🥺😭🙏🏻#DrPuneethRajkumar pic.twitter.com/ntLaMstVmP — POWER STAR (@Yuva_PRK) October 28, 2023 #Appuliveson #DrPuneethRajkumar Day 730, Still love for him remains same ♥️pic.twitter.com/qWgQEfy0iu — Insulter (@Insulter3730010) October 29, 2023 We miss you @PuneethRajkumar garu 😭#WeMissYouAppu #AppuLiveOn #PowerStar #DrPuneethRajkumar #PuneethRajkumarLivesOn#DrPuneethRajkumar pic.twitter.com/mtGZEwdMNG — NTR Fans AnaNTapuR (@Anantapur_FCNTR) October 29, 2023 -
వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్ కుమార్?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రాలకు కన్నడ ప్రేక్షకులు జేజేలు పలుకుతారు. అంత ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు ఈయన. అలాంటిది ఎప్పుడు తమిళంలో ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించడానికి వెనుకాడటం లేదు. రజనీకాంత్‌తో ఇటీవల జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. దీంతో జైలర్ చిత్రం తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీనికి కారణం అక్కడ శివరాజ్ కుమార్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఏదేమైనా ఆయన ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించే చిత్రంలోని శివరాజ్ కుమార్ నటించే అవకాశం ఉన్ట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఘోస్ట్ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా కమలహాసన్‌తో దిగిన ఫొటోను శివరాజ్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కమలహాసన్ వీరాభిమానినైనా తాను ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్, ధనుష్ తర్వాత కమలహాసన్ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ నటించబోతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. -
పేరుకే నా తమ్ముడు.. తండ్రిలా నా కోసం ఏం చేశాడంటే: పునీత్ అన్నయ్య
మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (శివన్న),రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్ రాజ్‌కుమారు అని తెలిసిందే. (ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్) తాజాగా పునీత్ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్ రాజ్‌కుమార్‌ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్‌కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు పునీత్ రాజ్‌కుమార్ రక్తసంబంధానికి మంచి మెసేజ్ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్‌లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్) 'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి మా ఇంటి బాధ్యతను పునీత్ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన గుర్తుచేసుకున్నాడు. -
రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్
కన్నడ సూపర్ స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్‌లకు ఎంతోమంది వీరాభిమానులున్నారు. వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కూడా పెద్ద నటుడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా.. తండ్రి రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసిన సమయంలో రజనీకాంత్ తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు శివ రాజ్‌కుమార్. ఆయన ఇటీవల కీలక పాత్రలో నటించిన జైలర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఉందని చెప్పుకొచ్చాడు. తండ్రిని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో రజనీ తన కుటుంబానికి ఎంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. 2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్ గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి వీరప్పన్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్‌తో చర్చలు జరిపింది. అటు వీరప్పన్.. ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. 108 రోజుల తర్వాత నవంబర్ 15న రాజ్‌కుమార్‌ను విడుదల చేశాడు. 2004 అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. చదవండి: Niharika: నిహారిక మీద బ్యాడ్ కామెంట్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్ -
Kannada Superstar Shivarajkumar: కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ అరుదైన ఫోటోలు.. ఓ లుక్కేయండి