మెగాస్టార్‌ను కలిసిన శివన్న.. చిరు ఇంట్లో భోజనం.. | Shiva Rajkumar Lunch at Chiranjeevi Home | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ కోసం వచ్చిన శివన్న.. చిరు అంటే ఎంత ప్రేమో!

Published Sun, Feb 4 2024 4:17 PM | Last Updated on Sun, Feb 4 2024 4:37 PM

Shiva Rajkumar Lunch at Chiranjeevi Home - Sakshi

సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ ప్రకటించింది. దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ క్రమంలో చిరంజీవి.. రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్‌ చిరంజీవిని సన్మానించింది. ఆయనతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న అందరినీ ఘనంగా సత్కరించింది.

ఆత్మీయంగా కలిసి మరీ..
తాజాగా కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ మెగాస్టార్‌ను అభినందించాడు. ఫోన్‌లోనో, సోషల్‌ మీడియాలోనో కాదు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ చిరంజీవిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించాడు. 'ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి ఉప్పొంగిపోయాను.

మెగాస్టార్‌తో శివన్న లంచ్‌
మేమిద్దరం కలిసి భోజనం చేశాం, చాలాసేపు కబుర్లాడుకున్నాం. లెజెండరీ నటుడు రాజ్‌ కుమార్‌తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం' అని కాస్త ఎమోషనలయ్యాడు. శివన్నతో కలిసి భోజనం చేసిన ఫోటోలను సైతం ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన జనాలు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: హనీమూన్‌ పిక్స్‌ షేర్‌ చేసిన స్టార్‌ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement