
ఇప్పటి జనరేషన్ కి సరిగా తెలియకపోవచ్చు గానీ కొన్నేళ్లు వెనక్కి వెళ్తే చిరంజీవికి (Chiranjeevi) ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తోంది. ఎన్నో అద్బుతమైన సినిమాలు, అంతకు మించిన కళ్లు చెదిరే డ్యాన్సులు.. ఇలా గత 40 ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిరంజీవిని యూకే(యూనైటెడ్ కింగడమ్)కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా మార్చి 19న సన్మానించనున్నారు.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
ఈ సందర్భంగా చిరంజీవి సోమవారం లండన్ చేరుకున్నారు. పలువురు తెలుగు ఎన్నారైలు ఈయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఒకామె మాత్రం ఏకంగా చిరంజీవికి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఫొటో వైరల్ అయింది. అయితే ఈ ఫొటో వెనక ఓ అభిమాని చిన్నప్పటి ఎమోషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
'చిన్నప్పుడు అమ్మని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లు అని అల్లరి చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మనే చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లా. అమ్మ ఆనందానికి అవధులు లేవు' అని ఓ నెటిజన్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)
ఇక చిరంజీవిని యూకే పార్లమెంట్ లో సన్మానించిన తర్వాత బ్రిడ్జ్ ఇండియా సంస్థ తరఫున చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేయనున్నారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ప్రముఖ సంస్థ. వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు.. తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. కానీ మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)
Comments
Please login to add a commentAdd a comment