మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చాలు తెలుగు ప్రేక్షకులకు, కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే రేంజ్ వరకు వచ్చారు. ఎంత ఎదిగినా మూలాలు, జ్ఞాపకాల్ని మర్చిపోకూడదని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు చిరు కూడా అదే చేశారు. స్పెషల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చారు. నలుగురు హీరోల్లో ఒకడిగా చేసిన 'పునాదిరాళ్లు' తొలి సినిమా. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో హీరోగా ఎదిగారు. అద్భుతమైన, టాలీవుడ్ గుర్తుంచుకునే సినిమాలు చేశారు. అయితే చిరంజీవికి నటుడిగా తొలి అడుగు పడింది మాత్రం డిగ్రీ రోజుల్లోనే. రెండో ఏడాది చదువుతున్నప్పుడు 'రాజీనామా' అనే నాటకాన్ని వేశారు.
(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)
ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా అవార్డ్ వచ్చింది. ఇదంతా 1974-75 టైంలో జరిగింది. తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఫొటోని చిరంజీవి ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మారిపోయారో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. అనుకున్న ప్రకారమైతే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు తన మూవీని వాయిదా వేసుకున్నారు. వేసవిలో 'విశ్వంభర' చిత్రం థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment