mega family
-
చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?
ఇప్పటి జనరేషన్ కి సరిగా తెలియకపోవచ్చు గానీ కొన్నేళ్లు వెనక్కి వెళ్తే చిరంజీవికి (Chiranjeevi) ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తోంది. ఎన్నో అద్బుతమైన సినిమాలు, అంతకు మించిన కళ్లు చెదిరే డ్యాన్సులు.. ఇలా గత 40 ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిరంజీవిని యూకే(యూనైటెడ్ కింగడమ్)కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా మార్చి 19న సన్మానించనున్నారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)ఈ సందర్భంగా చిరంజీవి సోమవారం లండన్ చేరుకున్నారు. పలువురు తెలుగు ఎన్నారైలు ఈయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఒకామె మాత్రం ఏకంగా చిరంజీవికి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఫొటో వైరల్ అయింది. అయితే ఈ ఫొటో వెనక ఓ అభిమాని చిన్నప్పటి ఎమోషన్ ఉన్నట్లు తెలుస్తోంది.'చిన్నప్పుడు అమ్మని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లు అని అల్లరి చేసేవాడిని. ఇప్పుడు మా అమ్మనే చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లా. అమ్మ ఆనందానికి అవధులు లేవు' అని ఓ నెటిజన్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)ఇక చిరంజీవిని యూకే పార్లమెంట్ లో సన్మానించిన తర్వాత బ్రిడ్జ్ ఇండియా సంస్థ తరఫున చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ప్రముఖ సంస్థ. వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు.. తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. కానీ మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందని వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
న్యూఇయర్ సెలబ్రేషన్స్: అడవిలో మెగా ఫ్యామిలీ అడ్వెంచర్ (ఫోటోలు)
-
'మెగా' ట్యాగ్.. నిహారికకు ప్లస్‌తో పాటు మైనస్ కూడా!? (ఫోటోలు)
-
రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్‌తో పాటు డ్యాన్స్‌లోనూ
మెగా డాటర్ నిహారిక ఇదివరకే తెలుగులో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఒకటి రెండు వెబ్ సిరీసుల్లో నటించింది కానీ అవేమంత చెప్పుకోదగ్గ పాత్రలైతే కాదు. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్కారన్' మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఇందులో ఓ పాట షాకిచ్చే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి, నిర్మాతగా మారింది. ఈ ఏడాది 'కమిటీ కుర్రోళ్లు' అనే అద్భుతమైన సినిమాని అందించింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె హీరోయిన్గా చేసిన తమిళ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది.తాజాగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేశారు.ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి!(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!) -
ఎవరూ తీసుకోనంత పారితోషకం బన్నీ తీసుకున్నాడా..?
-
అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇప్పటికే మెగా vs అల్లు అన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది. అటు మెగా హీరోల అభిమానులు బన్నీపై ట్రోలింగ్ చేస్తుంటే.. ఇతడి ఫ్యాన్స్ వాళ్ల హీరోలని ట్రోల్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త చల్లారుతుందేమో అనుకుంటున్న టైంలో దర్శకుడు ఆర్జీవీ మంటపెట్టేలా ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగా బన్నీని రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేసినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)'అల్లు మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ.. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ అనడానికి 3 కారణాలు..పుష్ప 2 భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకు లేని క్రేజ్‌తో రిలీజ్ కాబోతుంది. మొదటి రోజు దాని కలెక్షన్లు బాక్సాఫీస్ యూనివర్స్ స్ట్రాటోస్పియర్ను విచ్ఛిన్నం చేస్తాయి. బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా..ప్రపంచవ్యాప్తంగా ప్లానెట్ స్టార్ అని పిలిచే ఏకైక స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే, బన్నీ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా.అలానే బన్నీ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోలేదు, అందుకే ఇతడు నిజమైన టవర్ స్టార్' అని వర్మ ట్విటర్లో(ఎక్స్) రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం)Here are 3 REASONS why ALLU is many times more MEGA than MEGA , and why he is not just a global star , but a PLANET STAR REASON 1.His film #Pushpa2 is the BIGGEST release in the ENTIRE HISTORY of INDIAN CINEMA and its COLLECTIONS on the 1st day are bound to BREAK the… https://t.co/WJClSl8VcZ— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2024 -
'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ రిలీజైంది. చివర్లో బన్నీ చెప్పిన డైలాగ్‌లా వైల్డ్ ఫైర్‌లా ఉంది. ట్రైలర్ సంగతి అటుంచండి. పాట్నాలో ఆదివారం సాయంత్రం ఈవెంట్ జరిగితే లక్షకు పైగా జనాలు వచ్చారు. ఏ మాత్రం ముఖపరిచయం లేని ఓ తెలుగు హీరో కోసం ఇంతమంది రావడం ఏంటా అని చాలామంది ఇప్పటికే షాక్‌లో ఉన్నారు. అయితే టాలీవుడ్ మాత్రం 'పుష్ప 2'ని సరిగా పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది!'బాహుబలి' ముందు వరకు టాలీవుడ్ అంటే దేశంలో ఓ ఇండస్ట్రీ మాత్రమే. కానీ ఈ సినిమా దెబ్బకు దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. దీని తర్వాత 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయా సినిమాల రిలీజ్ టైంలో తెలుగు స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)'పుష్ప 2' విషయానికొస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత నాగవంశీ, హీరో శర్వానంద్ లాంటి కొద్దిమంది తప్పితే టాలీవుడ్ నుంచి అనుకున్నంతగా సపోర్ట్ రావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇప్పటివరకు ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. దీన్నిబట్టే అర్థమవుతోంది 'పుష్ప 2' కోసం అందరూ ఉన్నా బన్నీ ఒంటరిగానే పోరాడుతున్నాడని!టాలీవుడ్ నుంచి అనుకున్నంత సపోర్ట్ రానంత మాత్రాన 'పుష్ప 2'కి వచ్చిన నష్టమేమి లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దెబ్బకు రూ.1000 కోట్ల కలెక్షన్ అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సౌత్‌లో ఏమో గానీ బాలీవుడ్, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పూనకాలు గ్యారంటీ. (ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్) -
మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య
మెగాకపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి అప్పుడే పెళ్లయి ఏడాది అయిపోయింది. దీంతో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపిన క్షణాల్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. వాటన్నింటిని ఒకటిన్నర నిమిషంలోనే చాలా చక్కగా చూపించారు.(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)వరుణ్ తేజ్.. లావణ్య గురించి చెప్పడం, అలానే లావణ్య.. వరుణ్ని 'హే మిస్టర్' అని పిలవడం లాంటి విజువల్స్ బాగున్నాయి. ఈ వీడియోలోనే హల్దీ, పెళ్లికి సంబంధించిన అన్నింటినీ చూపించేశారు. అల్లు అర్జున్-రామ్ చరణ్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేయడం లాంటివి కూడా భలే అనిపించాయి.రీసెంట్గా వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి వరుణ్-లావణ్య స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చారు. దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలానే పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భార్యకు వరుణ్ విషెస్ కూడా చెప్పాడు. సరే ఇదంతా పక్కనబెడితే వరుణ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. దీనిపై ఈ మెగా హీరో బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)A love story written in the stars! ✨💖Relive the magical moments of Mega Prince @IAmVarunTej and @Itslavanya's wedding day with a special video 😍Happy Wedding Anniversary to the Lovely Couple and Here’s to a lifetime of happiness together 🫶#VarunTej #LavanyaTripathhi pic.twitter.com/UnVQizu9s6— Filmy Bowl (@FilmyBowl) November 1, 2024 -
నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చాలు తెలుగు ప్రేక్షకులకు, కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే రేంజ్ వరకు వచ్చారు. ఎంత ఎదిగినా మూలాలు, జ్ఞాపకాల్ని మర్చిపోకూడదని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు చిరు కూడా అదే చేశారు. స్పెషల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చారు. నలుగురు హీరోల్లో ఒకడిగా చేసిన 'పునాదిరాళ్లు' తొలి సినిమా. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో హీరోగా ఎదిగారు. అద్భుతమైన, టాలీవుడ్ గుర్తుంచుకునే సినిమాలు చేశారు. అయితే చిరంజీవికి నటుడిగా తొలి అడుగు పడింది మాత్రం డిగ్రీ రోజుల్లోనే. రెండో ఏడాది చదువుతున్నప్పుడు 'రాజీనామా' అనే నాటకాన్ని వేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా అవార్డ్ వచ్చింది. ఇదంతా 1974-75 టైంలో జరిగింది. తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఫొటోని చిరంజీవి ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మారిపోయారో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. అనుకున్న ప్రకారమైతే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు తన మూవీని వాయిదా వేసుకున్నారు. వేసవిలో 'విశ్వంభర' చిత్రం థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ?
-
అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి
ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య అనే అభిమాని.. తిరుమల కొండ పైవరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలియగానే చిరంజీవి.. ఈశ్వరయ్యతో పాటు ఆయన కుటుంబాన్ని హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. పట్టుబట్టలు పెట్టి సత్కరించారు. ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా)అలానే సోమవారం.. చిరంజీవి అయ్యప్ప మాల ధరించారు. ప్రతి ఏడాది అయ్యప్ప మాలను ధరించే చిరు.. ఈ ఏడాది కూడా అదే ఫాలో అయిపోయారు. మాలధారణలోనే ఈశ్వరయ్య కుటుంబంతో కలిసి మాట్లాడారు. గతంలో ఇదే ఈశ్వరయ్య.. తిరుపతి నుంచి హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్ర చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) -
పూజలో వదిన మరదళ్లు.. ఎంత చూడచక్కగా ఉన్నారో! (ఫోటోలు)
-
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో
ప్రేమించి పెళ్లి చేసుకోవడ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. హీరోహీరోయిన్లు ఈ పాటికే చాలామంది ఇలా లవ్ మ్యారేజులు చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్ ఇలానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒక్కటయ్యాడు. అయితే ఈ లిస్టులో మెగా హీరో సాయిధరమ్ కూడా చేరబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ మెహ్రీన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)'ఊషా పరిణయం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగ్గా.. దీనికి చీఫ్ గెస్ట్‌గా సాయితేజ్ వచ్చాడు. ఇందులోనే 'మీ లవ్ గురించి చెప్పండి' అని యాంకర్ అడగ్గా.. 'వన్‌సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు (నవ్వుతూ). ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి, మాట్లాడేలోపు 'మీకు పెళ్లి అయిపోయిందట కదా' అనే ఆన్సర్ వస్తోంది. నాకు పెళ్లా? అని ఆశ్చర్యపోతుంటే.. మీడియాలో చూశామని అంటున్నారు అని నవ్వుతూ సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.'త్వరలో మెగా ఇంట పెళ్లి సందడి అంటూ న్యూస్ వస్తోంది. మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?' యాంకర్ అడగ్గా.. 'నా సినిమాలో 'నో పెళ్లి' (సోలో బ్రతుకే సో బెటర్) అనే పాట ఉంది తెలుసు కదా' అని అసలు విషయాన్ని దాటవేశాడు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతం 'హనుమన్' నిర్మాతలతో సాయితేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?) -
ఒలింపిక్ ఆరంభ వేడుకలకు మెగా ఫ్యామిలీ.. చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ అడ్వెంచెరస్‌గా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా.. విశ్వంభర సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.అయితే ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలుదేరి వెళ్లారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్‌లో విహరిస్తున్నారు. ఓ పార్క్‌లో తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఒలింపిక్స్ ఆరంభ ఈవెంట్ కోసం పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా అక్కడికి చేరుకుంటామని వెల్లడించారు. తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow! Summer Olympics 24 Inaugural Event Beckons :) pic.twitter.com/bFa31zBh3a— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024 -
అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయొద్దు: కమెడియన్ ఆది
మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. లోపల వాళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉందనేది తెలియదు గానీ ఎవరికీ వాళ్లు ఏదేదో అనేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల టైంలో ఇది మరింత ఎక్కువైంది. తాజాగా ఈ విషయమై ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది స్పందించాడు. 'శివం భజే' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)'అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయన్ని అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొందరు అల్లు అర్జున్‌ని ఉద్దేశపూర్వకరంగానే ట్రోల్ చేస్తున్నారు. థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఇకనుంచైనా ఇలాంటివి ఆపేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అని ఆది చెప్పాడు. (ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఈమె పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా చాలామంది ఉపాసనకు విషెస్ చెప్పాడు. ఇకపోతే బర్త్ డే వేడుకల్ని చరణ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ.. కొత్త పేరు ఏంటనేది రివీల్ చేశాడు.(ఇదీ చదవండి: సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్)రామ్ చరణ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ సంగతేమో గానీ గత కొన్నాళ్లలో మెగా కోడలు ఉపాసన కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించారు. గతేడాది కూతురికి జన్మనిచ్చిన ఉపాసన.. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా బర్త్ డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక పుట్టినరోజు ఫొటోని పోస్ట్ చేసిన చరణ్.. ఉపాసనని 'కారా మమ్మీ' అని రాసుకొచ్చాడు. నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా సంభోదించాడు. దీనికి రిప్లై ఇచ్చిన ఉపాసన.. 'థ్యాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ మాత్రం సూపర్' అని రాసుకొచ్చింది. ఇదిప్పుడు మెగాఫ్యాన్స్ని తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఉపాసన పుట్టినరోజు స్పెషల్.. మెగా ఫ్యామిలీ కోడలా మజాకా! (ఫొటోలు)
-
మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?
టాలీవుడ్లో మెగా- అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. వీరి మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరలైంది. అంతే కాకుండా ఎన్నికలముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య మరింత దూరం పెరిగినట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు స్పందించారు. ఆయ్ మూవీ ప్రెస్మీట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చారు.బన్నీ వాసు మాట్లాడుతూ.. 'కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. కానీ నేను 20 ఏళ్ల నుంచి మెగా- అల్లు ఫ్యామిలీని చూస్తున్నా. వారి కుటుంబాలు కలిసి ఉండాలని చిరంజీవి ఎల్లప్పుడు కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తారు. అంతమందిని తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. చాలా ఖర్చు కూడా అవుతుంది. దానికి ప్రధాన కారణం అందరూ కలిసి ఉండాలనేదే ఆయన కోరిక. ఇలా చేయడం వల్ల మేమంతా ఒకటే అని చెప్పడం. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని విషయాల్లో ఇష్యూస్ వస్తాయి. కానీ ఇవీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. అంత మాత్రాన దీన్ని ఇలా చూడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి నాకు బాగా తెలుసు. వాళ్లందరూ కలిసి ఉండాలనే మేం అందరం కోరుకుంటాం.' అని అన్నారు. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ గొడవ ఉందా??#AlluArjun #BunnyVas #TeluguFilmNagar pic.twitter.com/YFXCOxglXA— Telugu FilmNagar (@telugufilmnagar) July 19, 2024 -
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్‌ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్‌తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్) -
ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది
పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్‌ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు. అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.:::: సిమ్మాదిరప్పన్న -
మెగా ఫ్యామిలీపై రామానుజం సంచలన విషయాలు..!
-
మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే
మెగాస్టార్ చిరంజీవి కాస్త మొన్నమధ్యే పద్మవిభూషణ్ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో ఈయన పేరు రావడంతో అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఈ అవార్డు వచ్చిన తర్వాత చిరు.. తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరయ్యారు. మెగాహీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. అయితే మెగాస్టార్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఆయన చేతి వాచీ మాత్రం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం మీకు గుండె జారిపోద్ది. ఓ సాధారణ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజుకు వెళ్లిపోయారు. 150కి పైగా సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. అలానే చిరు దగ్గర కార్లు, వాచీల కలెక్షన్ కూడా బాగానే ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఇందులో ఉన్నాయి. రోలెక్స్ వాచీల దగ్గర నుంచి బెంజ్ కార్ల వరకు చిరు దగ్గర ఉన్నాయి. చాలాసార్లు వాటి ఫొటోలు వైరలయ్యాయి. (ఇదీ చదవండి: లావణ్యని ఇప్పటివరకు ఆ ప్రశ్న అడగలేదు: వరుణ్ తేజ్) తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించిన చిరు.. ఏ.లాంజ్ & సోహ్నే అనే బ్రిటీష్ కంపెనీ చేతి గడియారంతో కనిపించారు. దీని ధర ఎంత అని ఆరా తీస్తే షాకింగ్ నంబర్స్ కనిపించాయి. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.50,56,747 అని తెలుస్తోంది. అంటే అరకోటి అనమాట. అదేదో సినిమాలో అన్నట్లు చిరు కట్టుకున్న ఈ వాచీ అమ్మితే బ్యాచ్ బ్యాచ్ సెటిలైపోవచ్చు! చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ వశిష్ట తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ తీస్తున్న ఈ మూవీ.. 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం నటిగా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కొన్ని సినిమాలు చేసింది. ఓ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు గతేడాది ప్రకటించింది. ప్రస్తుతం సోలోగానే ఉంది. తాజాగా ప్రేమ గురించి ఈమె పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. చిరంజీవి 'సైరా'లో జస్ట్ కాసేపు కనిపించే అతిథి పాత్రలో మెరిసింది. నటిగా కాస్త బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా పలు ఓటీటీ చిత్రాలు చేసింది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) 2020లో చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఓ మూడేళ్లు బాగానే ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో గతేడాది వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎక్కువగా ట్రావెల్ చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాజాగా ప్రేమ గురించి ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. 'నీకు కావాల్సింది ప్రేమ-బీచ్ మాత్రమే' అని ఉన్న ఫొటోని స్టోరీలో ఉంచింది. అయితే నిహారిక ప్రేమ గురించి పోస్ట్ పెట్టడం చూస్తుంటే మెగా డాటర్ మళ్లీ ప్రేమలో పడిందా? ఏమైనా హింట్ లాంటిది ఇస్తోందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ప్రేమని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ) -
అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన
మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంటాయి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువని చెప్పొచ్చు. అలాంటిది తాజాగా ఓ బుక్ లాంచ్ సందర్భంగా ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులోనే చరణ్‌తో బాండింగ్, కూతురు క్లీంకార గురించి పలు సంగతుల్ని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నాళ్లకు.. పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా, ఎలా ఫీలవుతున్నారు? అని అడగ్గా.. 'అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది' అని ఉపాసన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) చరణ్‌కి నాకు బౌండ్రీస్ ఇక భర్త చరణ్‌తో బాండింగ్ గురించి అడగ్గా.. 'రామ్ ఎప్పుడూ కూడా 'ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం' అని అంటుంటాడు. అలానే మేం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం, మా ఇద్దరి మధ్య హద్దులు(బౌండరీస్) కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోం. కానీ వ్యక్తిగత జీవితం విషయానికొచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది. 2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ల జంటపై ట్రోల్స్ వచ్చాయి. కానీ రానురాను ఉపాసన.. మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలైపోయింది. ఇప్పడు చరణ్ ని ఎంత అభిమానిస్తారో.. ఉపాసనని కూడా మెగా అభిమానులు అంతే అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చెప్పిన మాటలు ఫ్యాన్స్ మధ్య డిస్కషన్‌కి కారణమయ్యాయి. (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!) -
భర్త, మెగా ఫ్యామిలీపై మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు
సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించేస్తారు లేదంటే పూర్తిగా పక్కనబెట్టేస్తారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఎదురైంది. దీనికి ఆమె నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. అలానే కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నాననేది బయటపెట్టింది. భర్త వరుణ్ తేజ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగాకోడలిగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదిస్తోంది. నవంబరులో పెళ్లి జరగ్గా.. ఇప్పుడు ఫిబ్రవరిలో 'మిస్ ఫెర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే మీడియా ఆమెని పలకరించగా.. పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తలో సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. అలానే కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టినా సరే సినిమాలు చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్) లావణ్య ఏం చెప్పింది? 'పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పు రాలేదు. మెగా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని నాకు ఎవరు పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఇంతకు మించి ఏం కావాలి' 'మా వరకు మేం అయితే ఎప్పటిలానే ఉన్నాం. అలానే నా సినిమాల విషయంలో వరుణ్ పెద్దగా కల్పించుకోడు. నేను ఏదైనా స్టోరీ చెబితే మాత్రం వింటాడు. తను ఈ సిరీస్ చూసి బాగుందని మెచ్చుకున్నాడు' అని మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా సరే.. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్.. ఇకపై నటిస్తారా? లేదంటా ఇండస్ట్రీ టాటా చెప్పేస్తారా? అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా ఎదురైంది. ప్రస్తుతం ఈమె 'మిస్ ఫెర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా లావణ్యకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కెరీర్, అత్తారింట్లో కండీషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ట్యాగ్ అలాంటిది మెగా కోడలు ట్యాగ్ అనేది నటిగా తనకు బాధ్యత పెంచిందని.. లావణ్య త్రిపాఠి అనే పేరు తాను కష్టపడి సాధించుకున్నానని, మెగా కోడలు అనే పేరు మాత్రం వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిందని.. ఈ పిలుపు చాలా స్పెషల్‌గా భావిస్తున్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది. అలానే ఓటీటీ, సినిమాలు అనే భేదం తనకు లేదని.. నచ్చిన కథల్లో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు సాగుతున్నానని లావణ్య క్లారిటీ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) నేను ఫెర్ఫెక్ట్ కాదు వెబ్ సిరీస్ టైటిల్‌లానే మీరు కూడా ఫెర్ఫెక్టేనా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన లావణ్య.. ఫెర్ఫెక్షన్ కూడా ఓ సమస్య అని, దీని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పింది. తాను మాత్రం నిజజీవితంలో ఫెర్ఫెక్షనిస్ట్ కాదని స్పష్టం చేసింది. తన భర్త వరుణ్ తేజ్ మాత్రం ఫెర్ఫెక్షనిస్ట్ అని, అతడికి ఓసీడీ ఉందని ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది. కండీషన్స్ ఏం లేవు సినిమాలు-కెరీర్ విషయంలో పెళ్లి తర్వాత అత్తారింట్లో కండీషన్స్ ఏమైనా పెట్టారా? అనే ప్రశ్నకు కూడా లావణ్య సమాధానమిచ్చేసింది. పాత్రల ఎంచుకునే విషయమై వరుణ్ కుటుంబుం తనకు ఎలాంటి కండీషన్స్, ఆంక్షలు పెట్టలేదని.. ఇలాంటి పాత్రలు చేయొద్దు లాంటి మాటలు కూడా తనతో అనలేదని చెప్పింది. కెరీర్ విషయంలో అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పింది. అలానే మంచి కథతో దొరికితే వరుణ్‌తో నటించడానికి తాను రెడీ అనే హింట్ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) -
మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే సంక్రాంతి హడావుడి కనిపిస్తోంది. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్లు, ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరు పండగని ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటకు చేరి అసలైన సంక్రాంతిని జరుపుకొంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీ కూడా గ్రాండ్‌గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) అయితే గతంతో పోలిస్తే ఈసారి సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ కూతురి క్లీంకారకు ఇదే తొలి పండగ. అలానే గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు కూడా ఇదే తొలి సంక్రాంతి కావడం విశేషం. ఇకపోతే సంక్రాంతిని మెగా ఫ్యామిలీ.. బెంగళూరులోని ఫామ్ హౌసులో జరుపుకొంది. రెండు రోజుల క్రితం అందరూ అక్కడికి వెళ్లిపోయారు. ఇకపోతే ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్ తప్పితే దాదాపు మెగా-అల్లు కుటుంబ సభ్యులు కనిపించారు. ఈ ఫొటో చూస్తుంటే మెగా అభిమానులకు రెండు కళ్లు సరిపోవట్లేదు. అలానే మగవాళ్లు అందరూ లైట్ బ్రౌన్ కలర్ కుర్తా వేసుకోగా.. ఆడవాళ్లు అందరూ ఎర్ర చీరల్లో కనిపించారు. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
సంక్రాంతి సంబురాల్లో మెగా ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
-
ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి గుడ్‌న్యూస్ చెప్పింది. తన కుటుంబంలో జరిగిన ఆనందాన్ని అందరికీ చెప్పింది. అలానే ఓ ఫొటోని పోస్ట్ చేసి తన సంతోషాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ హీరోయిన్ లావణ్య ఏం చెప్పింది? ఏం ఫొటో పోస్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) 'అందాల రాక్షసి' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. మీడియం రేంజ్ హీరోలతో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే సాధారణ హీరోయిన్‌గానే ఉండిపోయింది. మరోవైపు 'మిస్టర్' సినిమా చేస్తున్న టైంలో మెగాహీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది కానీ ఈ విషయాన్ని చాలా రహస్యంగా మెంటైన్ చేస్తూ వచ్చింది. 2023 జూన్‌లో నిశ్చితార్థం, నవంబరులో ఈమె పెళ్లి జరిగింది. మెగా కోడలు అయిన తర్వాత లావణ్య ఏం పోస్ట్ చేసినా సరే అభిమానులు చూస్తూ వస్తున్నారు. అలా తాజాగా తనకు మేనల్లుడు పుట్టిన విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది. అలానే సొట్టబుగ్గల జీన్స్ తన కుటుంబంలో ఈ పిల్లాడు కొనసాగిస్తున్నాడనే శుభవార్తని చెప్పి తెగ సంతోషపడిపోయింది. ఆ పిల్లాడి ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసినప్పటికీ.. ముఖం కనిపించకుండా ఏమోజీ పెట్టింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) -
Mega And Allu Family Christmas Celebration: అల్లు అర్జున్ క్రిస్మస్ పార్టీ.. హాజరైన మెగా ఫ్యామిలీ (ఫొటోలు)
-
మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోట కనిపించిన ఆ ఇద్దరు!
క్రిస్మస్ హడావుడి ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఆల్మ్టోస్ట్ సోమవారమంతా క్రిస్మస్ పిక్సే కనిపించాయి. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పిక్ మాత్రం వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) ఏ పండగొచ్చినా సరే మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా క్రిస్మస్ జరగ్గా.. యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒక్కచోటకు చేరారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒక్కటిగా కనిపించడం.. ఆయా హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే గత కొన్నిరోజుల ఈ హీరోల మధ్య బాండింగ్ సరిగా లేదని రూమర్స్ వచ్చాయి. అలానే ఈ ఏడాది చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పకపోవడం.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చరణ్.. సోషల్ మీడియాలో ఏం విష్ చేయకపోవడం తదితర అంశాల వల్ల వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. కానీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో వీళ్లు కలిసి కనిపించారు. వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహా, లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ కూడా ఈ పిక్‌లో ఉన్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఇప్పుడు తీరిక దొరికింది. ఇన్నాళ్లు పెళ్లి, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలతో తెగ బిజీ అయిపోయిన ఈమె.. తొలిసారి తన భర్త వరుణ్ తేజ్ గురించి మాట్లాడింది. ఆసక్తికర విషయాలు చెబుతూనే పెళ్లి ఫొటోలను కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకీ లావణ్య.. భర్త వరుణ్ గురించి ఏం చెప్పింది? పెళ్లి తర్వాత ఫస్ టైమ్ 'మిస్టర్' మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో ప్రేమలో పడ్డ వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కానీ తమ లవ్ మేటర్ ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం జరగడానికి కొన్నిరోజుల ముందు వీళ్ల రిలేషన్ బయటపడింది. తాజాగా నవంబరు 1న వరుణ్-లావణ్య.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్, డెహ్రాడూన్‌లో రిసెప్షన్ తో కొత్త జంట చాలా బిజీగా గడిపారు. ఇప్పుడు పెళ్లి తర్వాత తొలిసారి లావణ్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. (ఇదీ చదవండి: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!) భర్త గురించి చెబుతూ తమ పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ.. క్యాప్షన్‌లో మాత్రం భర్త వరుణ్ తేజ్ గురించి రాసుకొచ్చింది. 'నా భర్త జాలి, కేరింగ్ ఉన్న ఎంతో అద్భుతమైన మనిషి. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాటిని నాలోనే దాచుకుంటాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా, ఓ కలలా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి, బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్లందరికీ థ్యాంక్యూ' అని లావణ్య రాసుకొచ్చింది. ఈ పోస్టులోనే మెగా ఫ్యామిలీ, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలని లావణ్య పోస్ట్ చేసింది. అలానే స్పెషల్‌గా డిజైన్ చేయించిన లావణ్య పెళ్లి చీరపై 'వరుణ్ లవ్' అని రాసి ఉన్న పిక్ తో పాటు, కాళ్ల పారాణీ-పట్టీలు ఉన్న ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ ఫొటోలపై మెగా ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) -
'మీ చిన్న హృదయాలు స్వచ్ఛంగా ఉండాలి'.. శ్రీజ పోస్ట్ వైరల్!
శ్రీజ కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి కూతురిగా శ్రీజకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ఫ్యామిలీతో కలిసి హాజరైంది. తన ఇద్దరు కూతుళ్లతో వరుణ్ పెళ్లిలో సందడి చేసింది. పెళ్లిలో నూతన దంపతులతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?) తాజాగా ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తన కూతుళ్లతో పాటు మెగా, అల్లు కుటుంబాల పిల్లలు ఉన్న ఫోటోను పంచుకుంది. అంతే కాకుండా పిల్లల మనస్తత్వం గురించి నోట్ రాసుకొచ్చింది. శ్రీజ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఇక్కడ ఉన్న అన్ని చిన్న హృదయాలు ప్రేమ, స్వచ్ఛత, నవ్వు, ఆనందం, ఉత్సుకతతో నిండి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసి ఫ్యాన్స్ సూపర్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీంకార ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఓకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు కుటుంబాల పిల్లలను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. కాగా.. 2016లో కల్యాణ్ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
Manchu Lakshmi Prasanna: మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు, పార్టీలో పూనకాలే (ఫోటోలు)
-
మూడు రోజుల వేడుక.. వరుణ్-లావణ్య పెళ్లి ముహూర్తం టైమ్ ఇదే!
మెగా ఫ్యామిలీలో పూర్తి సందడి వాతావరణం. వరుణ్ - లావణ్య పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు పెళ్లి హడావుడిలో మునిగిపోయారు. నవంబరు 1న పెళ్లి వేడుక జరగనుంది. అయితే ముహూర్తం ఎన్నింటికి? ఏది ఎప్పుడు జరగనుందనే విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే కొత్త ఫొటోలు బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్-లావణ్య.. పెద్దల్ని ఒప్పించి ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అలానే తాము తొలిసారి కలిసిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యారు. అందుకు తగ్గట్లే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. నవంబరు 1న పెళ్లి జరగనుంది. తాజాగా మూడు రోజుల పెళ్లి వేడుకలో ఏ కార్యక్రమం ఎప్పుడు జరగనుందనే డీటైల్స్ ఉన్న ఇన్విటేషన్ కార్డు బయటకొచ్చింది. అక్టోబరు 30న అంటే సోమవారం రాత్రి కాక్టైల్ పార్టీ గ్రాండ్ జరిగిపోయింది. అక్టోబరు 31న అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు హల్దీ, సాయంత్రం 5:30 గంటలకు మెహందీ వేడుక జరగనుంది. ఇక బుధవారం మధ్యాహ్నం 2:48 గంటలకు వరుణ్, లావణ్య మెడలో తాళి కట్టనున్నాడు. అదేరోజు సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు నితిన్ కూడా ఇటలీ చేరుకున్నాడు. పెళ్లి బస్ ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవంబరు 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) #VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family. The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/CcDcDXwrD8 — Kiran Kumar (@KiranKu36169631) October 26, 2023 -
వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా ఫ్యామిలీ పెళ్లి బాజాలు మోగే టైమ్ వచ్చేసింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే కుటుంబమంతా ఇటలీకి వెళ్లిపోయారు. ఆల్రెడీ సందడి కూడా మొదలైపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ వేడుకకు వెళ్లట్లేదని చెబుతూనే, దానికి కారణాన్ని కూడా బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) పెళ్లి సంగతేంటి? దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్-లావణ్య.. పెద్దల్ని ఒప్పించి ఈ జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టులో పెళ్లి ఉంటుందన్నారు. కానీ అది నవంబరుకి వాయిదా పడింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు ఇటలీ వెళ్లిపోయారు. అక్కడి ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి జరగనుంది. రేణు దేశాయ్ కామెంట్స్ ఈ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్.. తన భార్య అన్నా లెజనోవాతో కలిసి ఇటలీ వెళ్లిపోయాడు. అదే టైంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించాను. వరుణ్ తేజ్ నా కళ్ల ముందే పెరిగాడు. అతడికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయితే వరుణ్ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. అకీరా, ఆద్య కూడా వరుణ్ పెళ్లికి వెళ్లట్లేదు' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) -
వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం
మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో వెళ్లాడు. ఇలా రామ్ చరణ్, బన్నీ ఇద్దరూ వరుణ్ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ వేడుకకు మెగా-అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ నేడు ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్టేల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్ 1న పెళ్లి తర్వాత ఇటలీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో నవంబర్ 5న రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరూ ఆ సమయంలో హాజరు కానున్నారు. వరుణ్ వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన వీడియోతో పాటు కొత్త జంటకు సంబంధిన వీడియోలు,ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. #Varunlav అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇదిలా ఉండగా మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లిగారు అయిన అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరు కావడం లేదట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య రిత్యా జర్నీ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో ఆమె ఇండియాలోనే ఉంటున్నారు. దీంతో వరుణ్- లావణ్యల పెళ్లిని ఇంటి నుంచే వీడియోలో చూసే విధంగా చిరంజీవి ప్లాన్ చేశారట. #VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family. The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/CcDcDXwrD8 — Kiran Kumar (@KiranKu36169631) October 26, 2023 -
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట దసరా సంబరాలు.. అనాథ చిన్నారులతో బతుకమ్మ ఆటలు (ఫోటోలు)
-
చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!
మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల విషయంలో ఫెయిల్ కావొచ్చేమో కానీ సాయం చేసే విషయంలో ఎప్పుడూ టాప్‌లో ఉంటారు. సినీ కార్మికుల దగ్గర నుంచి అభిమానల వరకు చాలాసార్లు తన ఆపన్న హస్తాన్ని అందించారు. వీటిలో చాలావరకు బయటకు రావు. ఇప్పుడు అలానే ఓ విషయం జనాల దృష్టికి రాలేదు. కానీ ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో చిరు చేసిన సాయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏమైంది? 157వ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి.. తాజాగా హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో కనిపించారు. దీంతో ఎవరి కోసం వెళ్లారా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. చిరు చిన్నప్పుడు మొగల్తూరులో పెరిగారు. అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు. అందులో పువ్వాడ రాజా అనే వ్యక్తి కూడా ఉన్నారు. తాజాగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చిరు.. మర్చిపోలేని సాయం చేశారు. (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) ఫ్రెండ్ అనారోగ్య సమస్య తెలుసుకుని.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో అతడికి చికిత్స ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చిన్నప్పటి ఫ్రెండ్ రాజాని.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కలిశాడు. డాక్టర్‌తో మాట్లాడి స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'గా వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆగస్టులో 'భోళా శంకర్'గా ఘోరమైన డిజాస్టర్ చవిచూశాడు. ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) A Friend in Need is a Friend Indeed ❤️ Megastar ✨ Chiranjeevi garu inquired Doctors about the Health condition of his Childhood friend Puvvada Raja garu of Mogalthur at Apollo Hospital Hyderabad.#MegaStarChiranjeevi @KChiruTweets pic.twitter.com/pPHWVJemKL — Ujjwal Reddy (@HumanTsunaME) October 22, 2023 -
మెగా ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడలు గ్రాండ్ పార్టీ!
మెగా ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే మెగాస్టార్‌తో పాటు అల్లు అరవింద్ ఇంట్లో మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగాయి. ఈ జంట త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లావణ్య త్రిపాఠి తాజాగా బ్యాచులరేట్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేదిక ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచులరేట్ పార్టీ జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె స్నేహితులు నీరజ, నితిన్ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. అయితే కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1న వరుణ్ - లావణ్య వివాహం జరగనుందని సమాచారం. కాగా.. ఇప్పటికే రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు తమ ముద్దుర కూతురు క్లీంకారతో కలిసి టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. కాబోయే వధూవరులు సైతం ఇప్పటికే ఇటలీకి పయనమైనట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే! ) -
పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి
మెగాహీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. రీసెంట్‌గానే పెళ్లి పనులు మొదలుపెట్టిన ఈ జంట.. ఇప్పుడు కలిసి పండగ సెలబ్రేషన్స్ లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: టాలీవుడ్ యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) మెగా ఫ్యామిలీ వినాయక చవితి.. గతేడాది కంటే చాలా గ్రాండ్‌గా జరిగింది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్‌చరణ్ కూతురు క్లీంకార.. పుట్టిన తర్వాత ఈరోజే ఇంట్లోకి అడుగుపెట్టింది. దీంతో చిరు ఫ్యామిలీ ఫుల్ హ్యాపీస్. మరోవైపు లావణ్య త్రిపాఠి.. మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్లో పాల్గొంది. ఆ ఫొటోల్ని వరుణ్ పోస్ట్ చేశాడు. దాదాపు ఏడేళ్లుగా వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడ్డారు. మొన్నీమధ్యే జూన్ 9న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మధ్య పెళ్లి పనులు మొదలుపెట్టడంతో నవంబరులో పెళ్లి ఫిక్స్ అంటున్నారు. ఇప్పుడు పెళ్లికి ముందే లావణ్య.. కాబోయే అత్తారింట్లో పండగ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
పెళ్లి పనులు మొదలుపెట్టిన మెగాకపుల్
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు అంతా రెడీ అయినట్లు కనిపిస్తుంది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. కాబోయే భార్యతో కలిసి ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) 'ముకంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత పలు విభిన్నమైన సినిమాల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య గాండీవధారి అర్జున' చిత్రంతో వచ్చాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇకపోతే 'మిస్టర్' మూవీ చేస్తున్నప్పుడు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ విషయాన్ని దాదాపు ఆరేడేళ్ల పాటు చాలా సీక్రెట్‌గా ఉంటారు. ఈ ఏడాది జూన్ 9న వరుణ్-లావణ్య.. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో ఈ ప్రేమ కాస్త బయటపడింది. అయితే ఈ జంట.. ఆగస్టు చివరి వారంలో పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చింది. కానీ కారణాలేంటో తెలీదు గానీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా స్టోర్‌లో కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి కనిపించింది. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నవంబరులో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండనుందని సమాచారం. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తెలుగమ్మాయి.. 'జవాన్' బ్యూటీ గ్లామర్ ట్రీట్) The wedding prep begins for the Mega Wedding❤️🔥 Mega Prince #VarunTej & #LavanyaTripathi Spotted at @MMalhotraworld for their wedding outfit trails, Specially designed by @ManishMalhotra💥@IAmVarunTej @Itslavanya #VarunLav pic.twitter.com/GLyFpwsTPv — Haashtag Cinema (@HaashtagCinema) September 16, 2023 -
పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో
మెగా కోడలు ఉపాసన.. జూన్‌లో కూతురికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ముద్దులొలికే ఆ పాపతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అలానే కుమార్తె క్లీంకార పుట్టిన తర్వాత పెద్దగా బయట కనిపించని ఉపాసన.. తాజాగా వెకేషన్‌కి వెళ్లింది. అయితే ఓ పెళ్లి కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? రామ్ చరణ్-ఉపాసన ప్రస్తుతం తల్లిదండ్రులుగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 2012లో వీళ్లు పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ మధ్యనే పేరెంట్స్ అయ్యారు. పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. గతంలో టూర్స్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత పారిస్ టూర్ వేశారు. అయితే అది ఓ పెళ్లి కోసమే అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?) తాజాగా పారిస్‌లో ల్యాండ్ అయిన ఉపాసన.. తమకు అందిన ఇన్విటేషన్కి సంబంధించిన ఓ ఫొటో తీసి ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. అయితే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసిన చాలామంది నెటిజన్స్.. వరుణ్‌తేజ్-లావణ్య పెళ్లి పనుల కోసమేమోనని పొరబడ్డారు. కానీ ఇది వేరే ఎవరిదో పెళ్లి అని తెలుస్తోంది. బహుశా ఇది ఫ్రెండ్స్ లేదా బంధువుల మ్యారేజ్ అయ్యిండొచ్చు అనిపిస్తుంది. ఇకపోతే జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న మెగా కపుల్ వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి.. ఈ ఏడాది నవంబరులో పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నాగబాబు ఫ్యామిలీ కూడా కెన్యా వెకేషన్లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') -
మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?
మెగా బ్రదర్ నాగబాబు.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వీళ్లంతా ఆఫ్రికాలో ఉన్నారు. అయితే ఇది నార్మల్ టూర్ లా అనిపిస్తున్నప్పటికీ.. వరుణ్ తేజ్, నిహారిక కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి విషయం? నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. ఈ ఏడాది జూన్‌లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ఛం చేసుకున్నాడు. దీంతో వీళ్ల పెళ్లి గురించి అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఆగస్టులో ఉండొచ్చని అన్నారు. కానీ అలా జరగలేదు. మొన్నీ మధ్య మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నవంబరులో డెస్టినేషన్ మ్యారేజ్ ఉంటుందని, తేదీ అమ్మ డిసైడ్ చేస్తుందని అన్నాడు. (ఇదీ చదవండి: నా లైఫ్‌లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్) మరోవైపు 2020లో పెళ్లి చేసుకున్న నిహారిక.. చైతన్య నుంచి అధికారికంగా ఈ ఏడాది విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె లైఫ్ ఇప్పుడిప్పుడే మళ్లీ సర్దుకుంటోంది. మళ్ళీ నార్మల్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తోంది. నాగబాబు ఫ్యామిలీ ఫారెన్ వెళ్లడానికి ఇది ఓ కారణమని తెలుస్తోంది. అలానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఈ వేడుక ఇటలీలో జరగనున్నట్లు చాలారోజుల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు ఇలా నాగబాబు ఫ్యామిలీ విదేశాలకు వెళ్లడానికి పెళ్లి పనులు కూడా ఓ కారణమని అనిపిస్తుంది. ఇవన్నీ నిజమైతే త్వరలో వరుణ్‌తేజ్ పెళ్లి వివరాలు.. స్వయంగా నాగబాబు వెల్లడించే అవకాశముంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)' View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..
మెగాస్టార్ చిరంజీవి.. అందరిలానే రాఖీ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. చెల్లెళ్లు ఇద్దరు వచ్చి ఈయనకు రాఖీ కట్టారు. ఆ వీడియోని తన ఇన్‌స్టా, ట్విట్టర్లో షేర్ చేయగా, అభిమానులు తెగ లైకులు కొట్టేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఆ వీడియో చూస్తే మీకు ఓ సీక్రెట్ తెలుస్తుంది. చిరు పూజగదిలో దేవుళ్ల చిత్రపటాలతో పాటు ఓ ఇద్దరి వ్యక్తుల ఫొటోలు స్పెషల్‌గా ఉన్నాయి. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరివి? (ఇదీ చదవండి: సమంతను మోసం చేసిన మేనేజర్.. ఎంతో నమ్మితే, చివరకు ఇలా..) చాలామంది ఓ స్థాయికి వచ్చిన తర్వాత దానికి కారణమైన వాళ్లని మర్చిపోతుంటారు. కానీ చిరంజీవి అలా అస్సలు చేయలేదు. జన్మనిచ్చిన తండ్రి కొణిదెల వెంకట్రావుతో పాటు నటుడిగా తన ఎదుగుదలకు కారణమైన అల్లు రామలింగయ్యని అస్సలు మర్చిపోలేదు. అవును మీరు ఊహించింది కరెక్టే. వీళ్లిద్దరి ఫొటోలనే తన ఇంట్లో పూజగదిలో పెట్టుకున్నాడు. అంటే వాళ్లని దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు. తాజాగా రాఖీ పండగ సందర్భంగా చిరు షేర్ చేసిన ఫొటోలు, వీడియోల వల్ల ఈ విషయం బయటపడింది. దీంతో చిరు.. తండ్రి-మామకు ఇస్తున్న గౌరవం చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో వచ్చిన చిరు.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం చిరు రెండు కొత్త మూవీస్ ఒప్పుకొన్నారు. ఇందులో ఒకటి కూతురు సుస్మిత నిర్మిస్తున్న ప్రాజెక్టుతో పాటు, యంగ్ డైరెక్టర్ వశిష్ట్ తీస్తున్న మరో చిత్రం ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్
ఈ మధ్యే కాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్న పుట్టినరోజున కూడా ఎక్కడా కనిపించలేదు. అలాంటిది తాజాగా రాఖీ సందర్భంగా తన చెల్లెళ్లతో కలిసి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) ఈ వీడియోలో భాగంగా చిరంజీవి కుర్చీలో ఉండగా, ఇద్దరు చెల్లెళ్లు ఆయనకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అయితే మెగాస్టార్ కాబట్టి.. చెల్లెళ్లు ఇద్దరికీ రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్స్ లేదా డబ్బులు బాగానే ఇచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. 'భోళా శంకర్' సినిమాతో ఈ మధ్యే వచ్చిన చిరు.. బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు. వీటిలో కూతురు సుస్మిత నిర్మాణంలో ఒకటి, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వశిష్ట్ దర్శకుడిగా మరో సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈ రెండు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!
మెగా ఫ్యామిలీలో ఈ నెలలోనే పెళ్లి బాజాలు మోగాల్సింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఆగస్టు 24న ఏడడుగులు వేస్తారని కొన్నరోజుల ముందు వినిపించింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది. ఎందుకంటే ఒకవేళ పెళ్లి ఉంటే ఈ పాటికే శుభలేఖలు పంచడం, ముందస్తు కార్యక్రమాలు జరిగేవి. కానీ అలాంటివేం జరగట్లేదు. మరోవైపు వరుణ్ కొత్త మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. 'గాండీవధారి అర్జున' పేరుతో తీసిన ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలోకి రానుంది. ఫుల్ ఆన్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ స్పై (గూఢచారి) పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్‌కి తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే వాటికి సమాధానమిచ్చేశాడు. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సమంత కామెంట్స్) 'లావణ్యతో నా లవ్‌స్టోరీ మొదలై ఐదేళ్లు దాటిపోయింది. చాలాకాలం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. అలా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో మరో అడుగు ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో లావణ్య ఒకరు. ఫస్ట్ నేనే ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాను. మా ప్రేమ గురించి ఇంట్లో చెబితే వాళ్లు ఒప్పుకొన్నారు' 'లావణ్య.. ఇప్పటికే నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేను వాడుతున్న ఫోన్ అలాంటి గిఫ్టే. నాకు ఏది ఇష్టమనేది లావణ్యకి బాగా తెలుసు. ఆమె చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. కేరింగ్ పర్సన్ కూడా. నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచడానికి ఇష్టపడతాను. అందుకే ప్రేమ గురించి బయటపెట్టలేదు. ఎంగేజ్మెంట్లానే పెళ్లి కూడా సింపుల్‌గా చేసుకుంటాం' అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి ఉండొచ్చని అంటున్నారు. అలానే వీళ్లిద్దరూ తొలిసారి కలిసి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే టాక్ కూడా వినబడింది. బహుశా ఇదే నిజమై ఉండొచ్చు. అయితే ఈ విషయాలన్నింటిపై మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ కామెంట్స్) -
రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!
ఈ ఏడాది మెగా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే దాదాపు రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వారసురాలు జన్మించింది. జూన్ 20న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెలలోనే నామకరణం ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. తన మనవరాలి పేరును మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. క్లీంకారగా రామ్,ఉప్సీల బిడ్డకు పేరు పెట్టారు. అయితే క్లీంకార పుట్టాక మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన తల్లిదండ్రులు సైతం మనవరాలితో టైం స్పెండ్ చేస్తున్నారు. క్లీంకార పుట్టాక తొలిసారిగా ఇండిపెండెన్స్ డే వేడుకలను తాత, అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోల్లో మెగా వారసురాలు ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజే తమ బిడ్డ రూపాన్ని మెగా అభిమానులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాకుండా క్లీంకార భారత జెండాను ఆవిష్కరిస్తూ తొలి ఇండిపెండెన్స్ డే రోజే అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇది అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా అన్నయ్య రామ్ చరణ్ ఫేస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మెగా ఇంట్లో పెళ్లి వాయిదా.. కారణం అదేనా?
మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు చివర వారంలో అని కొన్నాళ్ల ముందు టాక్ వినిపించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో ఆ తంతు జరిగేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఎంత డెస్టినేషన్ వెడ్డింగ్ అయినాసరే శుభలేఖలు పంచడం, బ్యాచిలర్ పార్టీలు ఇలా ఏదో ఒకటి జరగాలి. కానీ ఇప్పుడు అలాంటిదేం లేకపోయేసరికి పెళ్లి వాయిదా పడిందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అలానే తేదీ మార్పు వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ముకుంద' దగ్గర నుంచి ఆగస్టు 25న థియేటర్లలోకి రాబోతున్న 'గాండీవధారి అర్జున' వరకు వేటికవే భిన్నమైన చిత్రాలని చెప్పొచ్చు. సినిమాల గురించి పక్కనబెడితే వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత ఏడేళ్లుగా రిలేషన్షిప్ మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఈ జూన్‌లో వీళ్లిద్దరికీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. (ఇదీ చదవండి: మెగా బ్రదర్స్‌కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!) ఇక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని అన్నారు. అయితే ఇప్పుడది వాయిదా పడినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఈ మధ్యే విడాకులు తీసుకుంది. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు. మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యం అంటే బాగోదని ఆలోచించి, పెళ్లి తేదీలో మార్పు చేసినట్లు సమాచారం. నిహారిక ప్రస్తుతం విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడే పనిలో ఉంది. ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కి వెళ్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది. అలా ఇంట్లో పరిస్థితులు కాస్త కుదురుకున్న తర్వాత, మరోవైపు ముహుర్తాలు చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారట. అంటే నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ఆగితే ఏ విషయమనేది క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) -
పెళ్లి రూమర్స్‌పై హీరో తరుణ్ క్లారిటీ!
కొన్నిరోజుల ముందు ఓ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకప్పటి లవర్ బాయ్, హీరో తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ తెగ రూమర్స్ వచ్చాయి. చాలామంది ఇది నిజమే అనుకున్నారు కూడా. ఆ నోట ఈ నోట పడిన ఈ వదంతులు ఇప్పుడు అతడి వరకు చేరుకున్నాయి. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. అసలు నిజాన్ని తరుణ్ బయటపెట్టాడు. పెళ్లి రూమర్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్.. లవర్ బాయ్ ఇమేజ్‌తో తెలుగులో చాలా సినిమాలు చేశాడు. కారణం ఏంటనేది పక్కనబెడితే కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కూడా అలానే తరుణ్ మ్యారేజ్ ఫిక్సయింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) నిజం కాదు దాదాపు మీడియా చాలావరకు ఈ విషయాన్ని రాసింది. దీంతో ఈ విషయమై స్వయంగా తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. 'ఈ ప్రచారం నిజం కాదు. నిజంగా నేను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు తెలియడం లేదు' అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పుకారు ఎలా? తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడుతూ... త్వరలోనే కొడుక్కి పెళ్లి చేస్తామని అన్నారు. అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో పలు పేర్లు వినిపించి, చివరకు మెగాఫ్యామిలీ దగ్గర వచ్చి ఆగాయి. అయితే ఇప్పుడు స్వయంగా తరుణ్ దీనిని ఖండించడంతో ఇవి కేవలం వదంతులు మాత్రమే అని తేలిపోయాయి. View this post on Instagram A post shared by Tharun (@actortarun) (ఇదీ చదవండి: స్టార్ సింగర్ సర్ప్రైజ్.. ఒక్కో డ్రైవర్‌కు రూ.82 లక్షలు) -
వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?
మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ, ఎవరికీ తెలియకుండా భలే మేనేజ్ చేశాడు. ఇన్నేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది జూన్‌లో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంట పెళ్లి గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ఆగస్టు చివర్లో? మెగాఫ్యామిలీలో ఈ మధ్య అన్నీ బ్యాడ్న్యూస్లే వినిపిస్తున్నాయి. నిహారిక విడాకులు తీసుకోవడం, భర్తతో కలిసి కాకుండా శ్రీజ విడిగా ఉండటం మెగా ఫ్యాన్స్‌కి బాధ కలిగించింది. వీటి మధ్య వరుణ్ తేజ్ కాస్త హ్యాపీనెస్‌ని తీసుకొచ్చాడు. లావణ్య త్రిపాఠితో జూన్ లో నిశ్చితార్థం జరగ్గా.. ఆగస్టు చివరి వారంలో పెళ్లి ఉండబోతుందని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) అలాంటి పద్ధతిలో? వరుణ్-లావణ్య.. 'మిస్టర్' సినిమా కోసం తొలిసారి ఇటలీలో కలిశారు. అలా ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ తర్వాత ప్రేమలో పడి, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో తాము తొలిసారి కలిసిన చోటే మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలానే ఆషామాషీగా కాకుండా రాజరిక పద్ధతిలో వివాహం జరగనుందని సమాచారం. వాళ్లకే ఆహ్వానం ఇటలీలో జరిగే ఈ డెస్టినేషన్ వేడుక కోసం ఇప్పటికే పలువురు వెడ్డింగ్ ప్లానర్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి కేవలం 50 మంది మాత్రమే హాజరవుతారని సమాచారం. అలానే పెళ్లి జరిగిన వారం తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నారట. (ఇదీ చదవండి: ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో పెద్ద సినిమా) -
వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్సయ్యిందా?
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు డేట్ ఫిక్సయ్యిందా అంటే.. అవుననే టాక్ వినిపిస్తోంది. జూన్ 9న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) మెగాఫ్యామిలీలో బోలెడంత మంది హీరోలున్నారు. వాళ్లందరిలో సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'గాండీవధారి అర్జున' అనే క్లాస్ యాక్షన్ చేస్తున్నాడు. ఇది ఆగస్టు 25న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న వరుణ్-లావణ్య ఈ మధ్యే కాఫీ డేట్‌కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో స్టోరీస్‌గా పెట్టారు. జూన్‌లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే.. ఈ ఏడాదిలో పెళ్లి ఉంటుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏకంగా డేట్ ఇదేనంటూ ఒకటి బయటకొచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టేశారని సమాచారం. అయితే సినిమా రిలీజ్ పెట్టుకుని వరుణ్.. ఆగస్టులో మ్యారేజ్ చేసుకుంటాడా? లేదా ఇదే జస్ట్ రూమర్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!
మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రస్తుతం కూతురితో కలిసి ఉంటోంది. భర్త కల్యాణ్ దేవ్.. శ్రీజ దగ్గర కాకుండా తన ఇంట్లో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అధికారికంగా బయటకు చెప్పలేదు గానీ విడాకులు తీసుకున్నారనే టాక్ చాలారోజుల నుంచి వినిపిస్తోంది. గతంలో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే దీనికి ఉదాహరణ. సరే అది పక్కనబెడితే కల్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ మాత్రం అతడి బాధని చెబుతోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) కారణం ఏంటో మరి చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్దమ్మాయి సుస్మిత ఓవైపు స్టైలిష్ట్, మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. రెండో కూతురు శ్రీజ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధంగా కల్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. వీళ్లకు కూడా ఓ పాప పుట్టింది. కారణమేంటో తెలియదు గానీ భార్యభర్తలు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. వారంలో ఒక్కసారే పాప నవిష్క.. ప్రస్తుతం తల్లి శ్రీజ దగ్గరే ఉంటోంది. వారంలో ఓసారి అది కూడా నాలుగు గంటలు తండ్రి దగ్గరకి వస్తోంది. ఈ మధ్యే కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా కల్యాణ్ తన తల్లి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆమెకు విషెస్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో కూతురి గురించి చెప్పుకొచ్చాడు. 'మిస్ యూ మై బేబీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూస్తుంటే.. ప్రతివారం నవిష్కని కలుస్తున్నాసరే కల్యాణ్ దేవ్ ఆమెని మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
మెగా ఫ్యామిలీలో ఒక పెళ్లి...ఒక విడాకులు ఎందుకిలా..?
-
మేనకోడల్ని చూడడానికి వచ్చిన అల్లుఅర్జున్ , స్నేహ
-
మెగా ఫాన్స్ హంగామా పుట్టిన పాపతో రామ్ చరణ్
-
పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన మెగా ఫ్యామ్లీయ్ లో సంబరాలు
-
వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!
నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. మణికొండలోని పామ్ బ్రీజ్ గేటేడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసన కూడా హాజరైంది. తాజాగా ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి వెల్కమ్ చెబుతూ ఎంగేజ్మెంట్లో దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ జంటకు రామ్ చరణ్ కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: వరుణ్‌తో నిశ్చితార్థం, లావణ్య త్రిపాఠి చీర ధరెంతో తెలుసా?) ఉపాసన తన ట్వీట్లో రాస్తూ.. 'వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ మై డియరెస్ట్ లావణ్య.. రాబోయే నా తోడి కోడలి వేడుక కోసం ఎదురు చూస్తున్నా. వరుణ్ నీతో చాలా సంతోషంగా ఉంటాడు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొణిదెల లావణ్య అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. Varun & Lavanya, love you guys. Heartiest congratulations. @IAmVarunTej @Itslavanya pic.twitter.com/PYynlbNt3h — Ram Charan (@AlwaysRamCharan) June 10, 2023 Welcome to the Konidela family dearest Lavanya 🤗❤️ Looking forward to celebrating my dearest thodi kodalu. Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf — Upasana Konidela (@upasanakonidela) June 10, 2023 -
చెర్రీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. మనసులు గెలిచారు భయ్యా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గొప్ప మనసు చాటుకున్నారు. మండువేసవిలో సేవ కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ముంబయిలోని అంధేరి , భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది చెర్రీ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవిలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేశారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే) రామ్‌చరణ్ అనగానే సిల్వర్‌స్క్రీన్ మీద ఆయనకున్న క్రేజే వేరు. సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీవోల ద్వారా, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కొవిడ్ సమయంలోనూ సహకారం అందించారు. తమ అభిమాన హీరో చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకున్న ఫ్యాన్స్ సమాజానికి సాయపడాలని ముందుకొచ్చారు. తమ స్టార్‌లాగానే సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని.. తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు. ఈ నెల 6న ముంబయిలోనూ.. ఏప్రిల్ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిక పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?) -
టాలీవుడ్ ని షేక్ చేస్తున్న మెగా రూమర్
-
విడాకులు ఫిక్స్..?
-
Upasana Konidela: మెగా కోడలి అరుదైన ఘనత.. నెటిజన్ల ప్రశంసల జల్లు!
అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలు, మెగా వారి కోడలు 'ఉపాసన' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా, వైద్య రంగంలో తనదైన సేవచేస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె, రామ్‌చరణ్ సతీమణిగా మరింత పేరు సంపాదించింది. అయితే ఇటీవల ఈమె 'మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23' జాబితాలో ఒకరుగా నిలిచారు. ఆస్కార్ విజయంతో సంబరాలు చేసుకున్న మెగా ఫ్యామిలీకి మరో అరుదైన ఘనత రావడం నెటిజన్లను, మెగా అభిమానులు ఆనందంలో ముంచెత్తుతోంది. చాలా మంది ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఉపాసన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు లభించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న వారి జాబితాలో ఉపాసన ఒకరని పలువురు అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఉపాసన తల్లి కాబోతున్నట్లు ఇదివరకే అందరికి తెలిసిందే. మొత్తానికి మెగావారి ఇంట ఆనందాలు వెల్లువిరుస్తాయి. ఉపాసన ఎప్పటికప్పుడు సామజిక కార్యక్రమాలలో కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ తన వంతు సమాజ సేవ చేస్తోంది. ఈమె ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ.. 'బి పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్: ఇప్పటికే..) చిన్ననాటి నుంచే వ్యాపార మెలకువలను నేర్చుకుంటున్న ఉపాసన 'యు ఎక్స్చేంజ్' అనే సేవా సంస్థ నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు ఇచ్చేవారు. అంతే కాకుండా మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారు. తరువాత రీజెంట్స్ యూనివర్సిటీ లండన్ నుంచి ఇంటర్నేషనల్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. 2012న మెగాస్టార్ కుటుంబానికి కోడలయ్యింది. Thank u @EconomicTimes for featuring me as one of the Most Promising Business Leaders of Asia 2022-23. pic.twitter.com/fP39b2zQTi — Upasana Konidela (@upasanakonidela) March 23, 2023 -
మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఇటీవలే స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఉపాసన. తన ప్రసవానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల్లో డెలివరీకి ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు. తాజాగా ట్వీట్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టారు ఉపాసన. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. ఇటీవలే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. ప్రముఖ అమెరికన్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడమంటే తనకు అదో గౌరవమని.. ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది. తాజాగా ఉపాసన ట్విటర్లో రాస్తూ..' డాక్టర్ జెన్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. దయచేసి ఇండియాలోని మా అపోలో ఆస్పత్రుల ఫ్యామిలీలో చేరండి. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి మా బిడ్డ ప్రసవంలో భాగం కావాలని కోరుకుంటున్నా.' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కాగా.. 2012లో ఉపాసన- రామ్ చరణ్ వివాహం జరిగింది. ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️ A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK — Upasana Konidela (@upasanakonidela) February 25, 2023 -
ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
మెగా ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా-అల్లు ఫ్యామిలీ ప్రీ-క్రిస్మస్ను సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎలాంటి పండగైన, బర్త్‌డే సెలబ్రెషన్స్ అంటే మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరుతారు. ఈ నేపథ్యంలో ప్రీ-క్రిస్మస్ వేడుకలో భాగంగా మెగా ఇంట సీక్రెట్ శాంట గేమ్ నిర్వహించారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, మెగా డాటర్స్ నిహారిక కొణిదేల, సుష్మితా కొణిదెల, శ్రీజలతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, చరణ్ వైఫ్ ఉపాసన, మిగతా కజిన్స్ అంతా పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఉపాసన సీక్రెట్ శాంట అంటూ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా హీరోలందరిని ఒకేఫ్రేంలో చూసి ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
KSR కామెంట్ : మెగా ఫ్యామిలీ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతుందా ..?
-
పవన్ కల్యాణ్‌కి విషెస్ చెప్పని బన్నీ, కారణమిదేనా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా-అల్లు ఫ్యామిలీలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ రెండు కుటుంబాలు ఒక్కచోట కనిపిస్తే ఫ్యాన్స్‌కు కన్నుల పండగే. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మెగా ఇంట్లో ఎలాంటి సెలబ్రెషన్స్ అయిన అల్లు ఫ్యామిలీ మొత్తం అక్కడ వాలిపోతుంది. అయితే ఈ మధ్య వారు కలిసి ఎక్కడ కనిపించడం లేదు. చిరంజీవి బర్త్‌డే వేడుకలో బన్నీ కొడుకు తప్పా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ ఈ వార్తలపు ఖండించారు. మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉందని, తమ కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే అని ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తాజాగా బన్నీ తీరు చూసి కొందరు మరోసారి వీరి బంధుత్వం చెడిందా? అనే సందేహాలను లేవనేత్తున్నారు. దీనికి కారణం శుక్రవారం(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డేకు అల్లు అర్జున్ విష్ చేయకపోవడమే. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్‌కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి చిరంజీవి బర్త్‌డేకు విష్ చేసిన అల్లు అర్జున్ మరి పవన్‌కు ఎందుకు విషెస్ చెప్పకపోవడం ఈ వార్తలకు మరోసారి ఆజ్యం పడింది. ఒక్క బన్నీ మాత్రమే కాదు అల్లు శీరిష్ కానీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి సైతం పవన్ కల్యాణ్‌ని విష్ చేస్తూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నా మాటే నిజమేనా? అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్తలపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చిన బన్నీ విష్ చేయకపోవడంతో ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరి ఇక దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య గొడవలా? అందుకే కలుసుకోవట్లేదా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత బావమరిదిగా, నిర్మాతగానూ అల్లు అరవింద్ చిరంజీవికి అండగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే రెండు కుటుంబాలకు చెందినవారు పెద్దగా కలుసుకోవడం లేదంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మెగా ఫ్యామిలీతో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉంది. మా కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఎవరి షూటింగ్స్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అన్నిసార్లు కలుసుకోకపోవచ్చు. కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్స్ జరిగినా అందరూ ఒకచోట చేరిపోతారు. ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇండస్ట్రీలో పెద్దవాళ్లపై రాళ్లు విసరడానికి చాలామంది ఎదురుచూస్తుంటారు. అలా పనిగట్టుకొని కొందరు చేస్తున్న ప్రచారమే తప్పా మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు' అంటూ చెప్పుకొచ్చారు. -
నగరానికి దూరంగా చిరు బర్త్‌డే వేడుకలు, ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం(ఆగస్ట్ 22) ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన సందడి అంతఇంత కాదు. ట్విటర్, ఫేస్బుక్ మొత్తం చిరు బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. ఈ స్పెషల్ డేను చిరు తన కుటుంబ సభ్యులతో హ్యాపిగా గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తనకు విషెస్ తెలిపన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్ ఫొటో ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ‘ఈ పుట్టిన రోజును(ప్రత్యేకమైన రోజు) నా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా జరుపుకున్నాను. కుటుంబంతో కలిసి గడిపిన ఆ క్షణాలు అద్భుతం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే కటుంబంతో కలిసి సందడి చేసిన ఫొటోలను కూడా చిరు పంచుకున్నారు. ఇందులో ఆయన భార్య సురేఖ, మెగా, అల్లు కుటుంబానికి చెందిన పలువురు హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే బన్నీ, ఆయన భార్య స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ మాత్రం ఈ వేడుకలో మిస్ అయ్యారు. రీసెంట్గా బన్నీ భార్యతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. This birthday, I have been with family away from the city and spent some wonderful time together! #BlissfulMoments #FamilyTime pic.twitter.com/cXvDhyZlEk — Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2022 -
భోగి వేడుకల్లో మెగా ఫ్యామిలీ...
-
విడాకుల రూమర్స్‌కి ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు
Kalyan Dev Sreeja Divorce Rumors: సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-హీరో కల్యాణ్‌దేవ్‌లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు దీపావళి సెలబ్రేషన్స్‌లో సైతం వీరు కనిపించలేదు. అంతేకాకుండా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో పాటు మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫొటోలోనూ కళ్యాణ్ దేవ్ మిస్ అయ్యాడు. సాధారంగా మెగా ఫ్యామిలీలో జరిగే దాదాపు అన్ని వేడుకల్లో కల్యాణ్ దేవ్ హాజరవుతుంటారు. అలాంటిది ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అన్న అనుమానం కొందరిలో మొదలైంది. తాజాగా కల్యాణ్‌దేవ్ ఒక్క ఫోటోతో రూమర్స్‌కి చెక్ పెట్టారు. భార్య శ్రీజ బర్త్‌డే సందర్భంగా..హ్యాపీ బర్త్‌డే స్వీటూ అంటూ లవ్ సింబల్‌ను జతచేస్తూ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనికి శ్రీజ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విడాకుల రూమర్స్‌కి బ్రేక్ పడినట్లయ్యింది. 2016లో శ్రీజ-కల్యాణ్‌ల వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఇటీవలె సూపర్ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్ చేసిన బన్నీ
Mega Family Diwali Celebration: మెగా ఫ్యామిలీలో దీపావళి పండుగ సందడి నెలకొంది. ఏ పండుగ అయిన అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకచోట చేరుతారు. ఇక ఈ దీవాళికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి పండుగ వేడుకులను ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులందరికి ‘హ్యాపీ దీపావళి’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫొటోలో రామ్ చరణ్,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక,చైతన్య, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు మెగా కుటుంబ సభ్యుల ఉన్నారు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం కనిపించలేదు. ఈ సెలబ్రెషన్స్‌లో సాయి తేజ్ లేకపోవడం ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. అలాగే ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయితేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈమూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా అలరించనున్నాడు. ఇక రామ్‌చరణ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలకరించనున్నాడు. జనవరి 7న చిత్రం విడుదలవుతుంది. ఇందులో రామ్‌చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. Happy Diwali 🪔 pic.twitter.com/QqdOqxR9nb — Allu Arjun (@alluarjun) November 3, 2021 -
వీడియోకాల్‌లో ఫ్యామిలీతో మాట్లాడిన తేజ్
Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్‌తేజ్ శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తను మాట్లాడే క్రమంలో తీవ్రంగా ఇబ్బందిపడినట్లు సమాచారం. కేవలం ఒక నిమిషమే మాట్లాడినప్పటికీ ఆ సమయంలో చాలా నొప్పిగా ఉందని తేజ్ వైద్యులకు చెప్పారట. దీంతో తను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తేజ్ దగ్గరకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు అపోలో వైద్యులు. కాలర్ బోన్ ఫ్రాక్చర్.. తొందరగానే నయమవుతుంది సాయిధరమ్‌తేజ్‌కు మొట్టమొదటిగా వైద్యం చేసిన డాక్టర్ సతీష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. సాయి తేజ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు స్పృహలో లేరని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఫిట్స్ వచ్చాయని, అందుకే చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కువగా రక్తస్రావం కాకపోవడం వల్ల ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలోనే ఉన్నారన్నారు. ఆయనకు కంటి మీద గాయం కాలేదని, అది చిన్న స్క్రాచ్ మాత్రమేనని చెప్పారు. చేతితో పాటు, ఛాతీ, కాళ్ల మీద చిన్నచిన్న గాయాలయ్యాయని పేర్కొన్నారు. అలాగే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, అయితే ఇది పెద్ద సమస్యేమీ కాదని, తొందరగానే నయమవుతందని చెప్పుకొచ్చారు. -
మెగా సందడి
-
నాలుగు తరాల మహిళలతో వరలక్ష్మి వ్రతం: ఉపాసన
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆగస్ట్20న వరలక్ష్మీ వ్రతం కాగా, శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శుక్రవారం సందర్భంగా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది. ఇక ఈ పూజలో నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు.వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. ఆ విధంగా మెగా జనరేషన్స్ మహిళలు అందరూ ఒకే చోటకు చేరారు. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో.. నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఓ వైపు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే మరో వైపు వ్యాపారాలు, హాస్పిటల్ వ్యవహారాలను కూడా చూస్తున్నారని అంటుంటారు. ఇవే గాక సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మెగా ఫ్యామిలీ నుంచి పెళ్లి కబురు.. మేలో పెళ్లి!
లాక్డౌన్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. నితిన్ రానా, నిఖిల్, నిహారిక, కాజల్.. ఇలా అందరూ వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక నిహారిక పెళ్లి అనంతరం అందరి చూపు మెగా కుటుంబంలోని బ్యాచిలర్స్‌పై పడింది. పెళ్లి కావాల్సిన ప్రసాద్‌ల లిస్ట్‌లో మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు(వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్) ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఈ ఇంటి నుంచి మరో పెళ్లి కబురు ఎప్పుడస్తుందానని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వినిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ధరమ్ తేజ్ తను సింగిల్ అన్న విషయాన్ని వెల్లడించాడు. ‘నేను సింగిల్. కానీ నా కుటుంబం నా పెళ్లి కోసం ప్లాన్ చేస్తోంది. నిహారిక వివాహం తరువాత ఇప్పుడు పెళ్లిపై కుటుంబం ఒత్తిడి చేస్తోంది’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇదే వార్త నిజం కాబోతుందని మళ్లీ టాక్ వస్తోంది. సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న రూమర్. చదవండి: హీరో రిపబ్లిక్కి ముహూర్తం పెళ్లిరోజు: భార్యకు మహేష్ రొమాంటిక్ విష్ ఈ ఏడాది మే నెలలో ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుందని, తేజ్ తల్లి, చిరంజీవి చెల్లెలు ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేనని, ఆమెకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని వినికిడి. అంతేగాక మెగా ఫ్యామిలీకి తెలిసిన అమ్మాయేనట. మరి ఇవన్నీ నిజమా కాదా తెలియాలంటే మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. ఇక మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన కెరీర్పైన దృష్టి పెట్టిన తేజ్ ఆ ప్రయత్నంలో ఉన్నారు. -
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండావిష్కరించిన మెగా ఫ్యామిలీ..
-
నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్
కొణిదెల వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంగేజ్మెంట్ తేదీ అధికారికంగా వెల్లడైంది. గుంటూరు ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో నిహారికకు ఆగస్టు 13న నిశ్చితార్థం జరగనుంది. కేవలం కుటుంబసభ్యుల సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక వివాహం కూడా ఈ ఏడాది చివర్లో నిర్వహిస్తామని ఇదివరకే నాగబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (హ్యాపీ బర్త్‌డే.. లవ్ : నిహారిక) చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన మెగా డాటర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ నటించారు. అశోక్ సెల్వన్ హీరోగా నటించనున్న తమిళ చిత్రంలోనూ నటించనున్నారు. ఇక చైతన్య విషయానికి వస్తే... హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ మ్యాథమ్యాటిక్స్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎమ్బీఏ పూర్తి చేశారు. (ప్రేమ ఏంటి? పెళ్లేంటి?) -
నా ప్రియమైనవారిని మిస్సవుతున్నాను : చిరు
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతికి.. చిరు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పండగ జరుపుకుంటారు. అలాగే వీలు దొరికినప్పుడల్లా.. ఆదివారం రోజున మెగా ఫ్యామిలీ చిన్నపాటి గెట్ టూ గెదర్ లాంటిది నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించడంతో చాలా మంది వారివారి ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. తన ప్రియమైనవారిని మిస్ అవుతున్నానంటూ పేర్కొన్న చిరు.. లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం తన తల్లి చెల్లలు, తమ్ముళ్లు అంతా కలిసి భోజనం చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవితోపాటు ఆయన తల్లి అంజనాదేవి, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్, చెల్లెలు మాధవి, విజయలు ఉన్నారు. ‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం రోజున తీసిన ఫొటలో ఇది. నా ప్రియమైనవారిని మిస్ అవుతున్నాను. మీలో చాలా మంది కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. త్వరలోనే మళ్లీ ఇలాంటి సమయం మనకు తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు. -
‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్
కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ప్రజలకు మెగా ఫ్యామిలీ ఎంతగానో తోడ్పాటుని అందిస్తూ వస్తుంది. ఆర్థిక సాయం అందించడమే కాకుండా పలు రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి లాక్డౌన్ ప్రాముఖ్యతను, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు వీడియో సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి ట్వీటర్ వేదికగా వినూత్న రీతిలో ‘ కరోనా’సందేశాన్ని ఇచ్చారు. ‘మెగా’ కుటుంబ సభ్యులందిరితో ఒక ప్లకార్డు పట్టించి ఓ కరోనా మెసేజ్ ఇచ్చాడు. ‘స్టేహోం, ఇంట్లో ఉంటాం, యుద్ధం చేస్తాం, క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం.. స్టే సేఫ్' అని చిరంజీవి నుంచి మొదలు అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, ఉపాసన, చిరంజీవి ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రిజతో పాటు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వరకు ప్లకార్డులు పట్టుకొని ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోని చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'మనమంతా కలిసి ఈ యుద్ధంలో గెలుస్తాం! ఎక్కడ ఉన్న వాళ్లం అక్కడే ఉందాం. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనం ప్రేమించే వారిని రక్షిస్తూ.. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుదాం' అని పిలుపునిచ్చారు. ఇందులో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తప్ప మిగిలిన హీరోలందరూ ఉన్నారు. దీంతో వారి అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ‘ పవన్ ఎక్కడా?’, బన్నీ ఎక్కడా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. -
ఒకే ఫ్రేంలో మెగా వారసులు.. కానీ!
మెగా కుటుంబం సంక్రాంతి పర్వదినాన అభిమానులకు కనువిందును కలిగించింది. మెగా స్టార్ చిరంజీవితో కలిసి మెగా, అల్లు ఫ్యామిలీ వారసులంతా ఒకే ఫ్రేంలో మెరిసారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘హ్యాపి సంక్రాంతి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మెగా అల్లుడు కల్యాణ్ దేవ్, అల్లు వారసులు అల్లు అర్జున్, శిరీష్‌లతో పాటు పవన్ కల్యాణ్, రేణుదేశాయ్‌ల తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నాడు. ఎప్పుడూ సినిమాలతో బీజీగా ఉండే మెగా ఫ్యామీలిని ఒకేచోట చూసి అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. పండుగ సందర్బంగా అందరూ ఒక్కచోట చేరిన ఈ ఫొటోకు అభిమానులంతా ‘మెగా ఫ్రేంలో పవన్ కల్యాణ్, నాగబాబులు మిస్సయ్యారు’ అని ‘మెగా ఫ్యామిలీలో క్రికెట్ టీంకు సరిపడ హీరోలు ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram Happy Sankranti !!! A post shared by Ram Charan (@alwaysramcharan) on Jan 14, 2020 at 9:59pm PST ఇక ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి క్రీం కలర్ పంచెకట్టులో ఉండగా ఆయన చూట్టూ రామ్ చరణ్, వరణ్ తేజ్, బన్నీ, శీరిష్, సాయిధరమ్ తేజ్ అకీరాలు బ్లాక్ అండ్ బ్లూ కాంబీనేషన్ దుస్తులను ధరించి ఉన్నారు. పండుగా పూట మెగా వారుసలంతా ఒకేచోట ఉండటంతో.. మెగా అభిమానుల సంక్రాంతి సంబరాలు ఇంకాస్తా పెరిగాయని చెప్పుకోవచ్చు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా తన భర్త కళ్యాణ్ దేవ్, కూతుళ్లతో కలసి ఉన్న ఫొటోకు ‘హ్యాపి బోగి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. కాగా కొరటాల శివ దర్వకత్వంలో చిరంజీవి 152వ చిత్రం రానుంది. రామ్ చరణ్, వరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లు వారి వారి సినిమాలో బిజీగా ఉండగా. బన్నీ తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసందే. -
మెగా మీట్..
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్స్ మధ్య ఉండే అనుంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రమే కాకుండా.. వీలు దొరికినప్పుడల్లా వీరంతా ఒకచోట చేరి సందడి చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ తారలు లంచ్ మీట్‌తో ఒకచోట చేరారు. ఆదివారం కావడంతో.. సరదాగా గడిపారు. ఈ మీట్‌కు రామ్‌చరణ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్, సుష్మిత, వరుణ్‌తేజ్, నిహారిక, సాయిధరమ్ తేజ్, శ్రీజ పెద్ద కూతురు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సాయిధరమ్ తేజ్, నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విందుకు వైష్ణవ్ తేజ్ హాజరుకాలేదు. దీంతో కళ్యాణ్ దేవ్ ‘మిస్డ్ యూ’ వైష్ణవ్ తేజ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసి మెగా ఫ్యామిలీ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. View this post on Instagram Sunday well spent! 🥰🥰 FAMJAM 🧡 A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 23, 2019 at 4:02am PDT -
‘మెగా’ ఫ్యామిలీకి సంబంధం లేదు..
సాక్షి, హైదరాబాద్ : శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్’తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని సీఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట స్థాపించిన సంస్థకు చిరంజీవి, రాంచరణ్, నాగబాబుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో ఈ స్కూల్ పేరిట సంస్థను స్థాపించాం. దిగువ తరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో విద్యను అందించాలనే దృఢసంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం. మెగా కుటుంబం మీద ఉన్న అభిమనాంతో చిరంజీవి,రాంచరణ్, నాగబాబుని గౌరవ పౌండర్, గౌరవ అధ్యక్షులు, గౌరవ చైర్మన్‌గా మంచి ఉద్దేశంతో మేం నియమించుకునన్నాం. దయ ఉంచి మెగా స్నేహితులందరు ఈ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థకు చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు. అదేవిధంగా మా చిరు (సంస్థ) ప్రయత్నాన్ని ముందుకు నడిపించి పేద ప్రజలకు విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడానికి మీరు కూడా సహకరిస్తారని కొండంత అభిమానంతో’ అని సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. Press Release : #Chiranjeevi international schools not owned by Megastar Chiranjeevi or his family. The school in Srikakulam is running by a Mega Fan. pic.twitter.com/iEOPBflyQ3 — BARaju (@baraju_SuperHit) 13 May 2019 -
పవన్‌కల్యాణ్ చేతిలో మోసపోవద్దు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతిలో మరోసారి మోసపోవద్దని కాపులకు ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ విజ్ఞప్తి చేశారు. కాపులంటే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని.. తాము కూడా కాపులమేనన్నారు. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే నీకెందుకు అంత భయమని పవన్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటున్న ఆంధ్రులమంతా సంతోషంగానే ఉన్నామని చెప్పారు. రాజకీయం కోసం రాష్ట్రాలను విడదీయొద్దని.. ప్రజల జీవితాలతో ఆటలాడొద్దని పవన్‌కు సూచించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయొద్దని కోరారు. తాను కూడా కాపు బిడ్డనేనని.. నీ మాటలతో రెచ్చిపోయి హైదరాబాద్‌లో తమపై ఎవరైనా దాడి చేస్తే ఎవరు రక్షిస్తారని చిన్నికృష్ణ ప్రశ్నించారు. పవన్ వచ్చి రక్షిస్తాడా? ఆయన అన్న నాగబాబు వచ్చి రక్షిస్తాడా? అని నిలదీశారు. ఎన్నో రికార్డులను తిరగరాసిన ఇంద్ర వంటి సినిమాను చిరంజీవికి ఇస్తే కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన వీళ్లు.. ఒక్కసారైనా తమకు ఓట్లు వేసిన ప్రజల్ని కలిశారా? అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని.. ముందు రాజకీయ ఓనమాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్రాక లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమవుతుంటే.. ఏ రోజైనా టీడీపీ ప్రభుత్వాన్ని అడిగావా అని పవన్‌ను చిన్నికృష్ణ ప్రశ్నించారు. మళ్లీ కాపులను మోసం చేస్తున్న ఘనత పవన్‌దేనన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన కుమ్మక్కై వైఎస్ జగన్ ఒక్కడ్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదని.. ఇక చంద్రబాబు అమరావతి ఎలా పూర్తి చేస్తారని చిన్నికృష్ణ ప్రశ్నించారు. వైఎస్ జగన్ రూపకల్పన చేసిన నవరత్న పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్సీపీ ఘన విజయం తధ్యమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. -
ఈ అవకాశం రావడం వైష్ణవ్ అదృష్టం
చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిదరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్‌లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. నాగబాబు, అల్లు అర్జున్ స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందించారు. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి స్టార్ట్ కానుంది. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మైత్రీ మూవీస్ గురించి, ఆ సంస్థ అందించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు సుకుమార్‌ని అభినందిస్తున్నాను. ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్, మైత్రీ వాళ్లతో నాకు అనుబంధం ఏర్పడింది. వైష్ణవ్‌కి ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం. ఈ అవకాశాన్ని వైష్ణవ్ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బుచ్చిబాబు కొత్త కథ రాశాడు. ‘రంగస్థలం’ కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర ఎంతో ఉందని సుకుమార్ నాతో చెప్పారు’’ అన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో సుకుమార్ కూడా భాగమైనప్పుడు ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుందనుకున్నాను. వైష్ణవ్, మనీషాకు నా అభినందనలు. దర్శకుడు అడిగిందల్లా ఇచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. దేవిశ్రీ కూడా తోడై ఈ సినిమా స్టామినా పెంచేశారు’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘బుచ్చిబాబు అద్భుతమైన కథ రాశాడు. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ హీరో అని ఫిక్స్ అయ్యాడు బుచ్చి. మైత్రీ వాళ్లకు థ్యాంక్స్. పెద్ద సినిమాలు నిర్మిస్తూ, చిన్న సినిమాలనూ నిర్మించడం వారికే సొంతం. దేవిశ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్. వైష్ణవ్‌కి మంచి భవిష్యతు ఉంది. కథ ఇంత బాగా రావడానికి కారణం చిరంజీవిగారే. ఆయన చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు’’ అన్నారు సుకుమార్. ‘‘కథ చాలా అద్భుతంగా వచ్చింది. హీరో, హీరోయిన్ సినిమాకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు నిర్మాత నవీన్ యర్నేని. ‘‘సుకుమార్‌గారికి థ్యాంక్స్ అని చెప్పడం చిన్న పదం అయిపోతుంది. నన్ను నమ్మిన అమ్మా నాన్నలకు, చిరంజీవిగారికి థ్యాంక్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారికా, దేవిశ్రీ ప్రసాద్, వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
మెగాఫ్యామిలీ నుంచి మరో హీరో
-
మెగా ఎంట్రీ
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇది మెగా ఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, విశిష్ట దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్న చిత్రంతో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నారు. దర్శకుడు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. -
క్రేజీ కాంబినేషన్లో వైష్ణవ్ తేజ్ తొలి మూవీ
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీశ్, సాయిధరమ్‌తేజ్, నిహారికలు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇటీవల చిరంజీవి చిన్న అల్లుడు(శ్రీజ భర్త) కల్యాణ్ దేవ్ విజేత చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా చిరు మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిచయవుతున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు, ఆయన దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన ‘రంగస్థలం’ చిత్రానికి రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి పనిచేసే సాంకేతిక నిపుణల, నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. -
కేరళకు మెగా ఫ్యామిలీ మెగా విరాళం!
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ముందుకొచ్చింది. కేరళ వరద బాధితుల సహాయార్థం చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని కేరళకు ప్రకటించగా.. ఆయన తనయుడు రాంచరణ్ రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించగా.. రాంచరణ్ సతీమణి ఉపాసన రూ. పదిలక్షల విరాళాన్ని అందజేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు రూ. 10 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రకటించింది. ‘మన భూతల స్వర్గం 80 శాతం మునిగిపోయింది. దీన్ని టీవీలో చూస్తుంటే బాధగా ఉంది. ‘మా’ రూ.10 లక్షలు విరాళం ఇస్తుంది. అలాగే ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా’ అని మా ప్రెసిడెంట్ శివాజీ రాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మెగా ఫ్యామిలీపై కత్తి ఫైర్
-
మెగా నటుడు నాగబాబుపై కత్తి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. దీంతో నాగబాబు, మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్బుక్ అకౌంట్లో కత్తి మహేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘నాగబాబు నా పేరు కూడా ఉచ్ఛరించకుండా నన్ను నీచుడిగా సంభోదిస్తూ చేసినటువంటి వీడియో నేను చూశాను. నాకు జాలి కలిగింది. నేనా నీచుడినా? అంత నీచానికి ఏం పాల్పడ్డానని ప్రశ్నించారు. ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భక్తులా.. ‘జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి షోలో జడ్జ్‌గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్ సొసైటీ. మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది మాకందరికీ బాగా తెలుసు. మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే మీరే బాధ్యత వహిస్తారు. నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్ ఇస్తారా.. ఇదే పంథా మీరు కొనసాగించండీ.. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. సాధారణంగా నేను మనుషుల గురించి, వారి వ్యక్తిగతాల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడే వాడ్ని కాదు.. నీచుడు అంటూ నన్ను ఒక దళితున్ని సంభోదించారు ఎంత అహంకారముంటే ఇలా చేస్తారోనని అర్థమవుతోంది. సెక్యులర్ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు? దళితుల మీద దాడి జరుగుతున్నపుడు మీరంతా నోరెందుకు మెదపలేదు. ముస్లింపై దాడి జరిగినపుడు మీరంతా ఏం చేస్తున్నారు? నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. నా వాక్స్వాతంత్రం, భావాప్రకటన స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను’ అని కత్తి మహేశ్ అన్నారు. కత్తి మహేష్‌పై నాగబాబు కామెంట్లు -
మెగా ఫ్యామిలీలో ఒకరు నాకు బాగా క్లోజ్: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: క్యాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైం వచ్చినపుడు రివీల్ చేస్తా..’ అని శ్రీరెడ్డి అందులో పెర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మెగా అభిమానులు స్పందిస్తున్నారు. ఓ అభిమాని ‘నువు చేసే పోరాటం వేరు.. రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నావా.. కేవలం నీ పోరాటం గురించి.. నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడు ఒకే కానీ.. ప్రతిదానిలో వేలు పెడితే నీ పోరాటం చులకన అయిపోతుంది.. ఎవరో చెప్పేది విని అనవసరంగా రాంగ్ స్టెప్ వేయకు..’ అని బదులిచ్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. -
మెగా మదర్
చిరంజీవి తల్లి అంజనాదేవికి ముగ్గురు కొడుకులు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్), ఇద్దరు కూతుళ్లు (విజయదుర్గ, మాధవి). ఆదివారం మదర్స్ డే సందర్భంగా తల్లికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె నుండి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సంతోషాల జ్ఞాపకమే ఈ ఫొటో. పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లడం వల్ల పాల్గొనలేకపోయారు. -
మెగా హీరోను లాంచ్ చేయనున్న అవసరాల
విభిన్న దర్శకుడు అవసరాల శ్రీనివాస్ స్టైలే వేరు. ఆ విషయం అతని గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా కథను నడిపించే విధానం, కథనం అన్నింట్లోనూ తన మార్క్ కనిపిస్తుంది. డైరెక్టర్‌గా కొనసాగుతూనే నటుడిగానూ బిజీగా ఉన్నారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం అవసరాల మెగా కాంపౌండ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అవసరాల శ్రీనివాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ (సాయి ధరమ్‌తేజ్ సోదరుడు), అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. అవసరాల టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మెగాస్టార్ చిరంజీవి అతనికి అవకాశం ఇచ్చినట్లు మెగా కాంపౌండ్ చెబుతోంది. ఈయన సినిమాలు సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయి. రొమాంటిక్ కామెడీలను తెరకెక్కించటంలో తనదైన ముద్ర వేసిన అవసరాల వైష్ణవ్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు చిరు చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్( చిరు చిన్న కూతురు శ్రీజ భర్త)తో కూడా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోంది. -
సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మెగా ఫ్యామిలీ
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మెగా స్టార్ కేవలం తన సినీ జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం ఫ్యామిలీ జీవితాన్ని కూడా సెట్ చేశాడనే చెప్పాలి. బాలీవుడ్లో కపూర్ ఖాన్దన్ ఫ్యామిలీ లాగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి కుటుంబం అతి పెద్దది. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్లో జోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి తమ అభిమాన హీరో కొడుకో.. కూతురో.. అల్లుడో... వస్తున్నారంటే అభిమానులు చాలా హ్యాపీ. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది చిరంజీవి కుటుంబం నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు. మెగాస్టార్ ప్యామిలీ నుంచి ఆయనతోపాటు, ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు, కుమారులు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లుళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, కూతురు నిహారికలు ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నారు. అయితే వీరిలో పవణ్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని టాప్ 10 లో నిలిచారు. వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించి అందరిని ఆకట్టుకుంటున్నారు. అయితే గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తున్న పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీలో సభ్యుడే. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా, డిస్ట్ర్రిబ్యూటర్గా ఉన్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో ఎంట్రీ ఖరారైంది. అల్లుడు కూడా అభిమానులకు వారుసుడే కదా. ప్రస్తుతం కల్యాణ్ నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు. ‘జత కలిసె’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవికా నాయర్ కథానాయిక. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలోనే హీరో అవతారం ఎత్తుతారని, ప్రస్తుతానికి యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. -
సోషల్ మీడియాలో ‘మెగా’ పెళ్లి వార్త వైరల్
మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక, హీరో సాయి ధరమ్ తేజ్‌లకు త్వరలో వివాహం జరగనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వార్తపై ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడే ధరమ్ తేజ్. బావా మరదళ్లు అయిన సాయి ధరమ్ తేజ్, నిహారిక పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా నిహారిక హీరోయిన్గా ధరమ్ తేజ్ నిర్మాణ సారధ్యంలో ఓ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడట. కాగా నిహారిక, సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారని, అంతేతప్ప, వారిద్దరి మధ్య సహజంగానే ఇంటిమసీ అనేది ఉంటుందని, పెళ్లివార్త ఊకార్లే అని కొందరు వాదిస్తుండగా, మరోవైపు ’మెగా’ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. అయితే దీనిపై మెగాస్టార్ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే తప్ప, అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. కాగా బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక.. రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసు' అనే చిత్రం ద్వారా హీరోయిన్గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె .. మరాఠిలో విజయం సాధించిన హ్యాపీజర్నీ అనే సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెకెక్కనున్న ఈ సినిమాలో.. నిహారిక దెయ్యంగా నటించనుంది. అలాగే ఓ తమిళ చిత్రంలో నిహారిక నటించనున్నట్లు తెలుస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం
తిరుమల: సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తల్లి అంజనాదేవి, చెల్లెళ్లు విజయదుర్గ, మాధవిలు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు. -
అది పూర్వజన్మ సుకృతం
చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించడంపై వీవీ వినాయక్ అంతర్వేది(సఖినేటిపల్లి): మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. ఈ చిత్రం తాలూకు స్క్రిప్టును గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలోని హీరోలతో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా.. వారికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రారంభమైన కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మొదటి చిత్రం చిరంజీవితో చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా చిత్రం ముహూర్తం షాట్ శుక్రవారం హైదరాబాద్‌లో చిరంజీవితో చేస్తున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. -
బెంగళూరులో మెగా పండగ!
ఇంట్లో ఐదారుగురు ఉంటేనే వాతావరణం సందడిగా ఉంటుంది. పదీ, ఇరవై మంది ఉంటే ఆ సందడి డబుల్... త్రిబుల్. ఓ యాభై మంది ఉన్నారనుకోండి.. అప్పుడు అక్కడ ఒక వేడుక జరుగుతున్నట్లే ఉంటుంది. పండగ వాతావరణం కనిపిస్తుంది. అందుకే, సంక్రాంతి పండగకు చిరంజీవి కుటుంబం భారీ గెట్ టు గెదర్‌ని ప్లాన్ చేసి ఉంటుంది. చిరంజీవికి బెంగళూరులో ఫామ్‌హౌస్ ఉంది. సంక్రాంతిని తన కుటుంబ సభ్యులందరితో కలిసి చిరంజీవి అక్కడే చేసుకోబోతున్నారట. మొత్తం 50 మంది కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లనున్నారు. ఎవరెవరు వెళతారన్నది స్పష్టంగా బయటకు రాలేదు కానీ... తెలిసిన సమాచారం ప్రకారం చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్ మాత్రం కంపల్సరీగా పండగ సంబరంలో ఉంటారట. ఇక, ఆ ఇంటి ఆడపడుచులు ఎలానూ ఉంటారనుకోండి. మొత్తానికి మెగా ఫ్యామిలీ సందడి సందడిగా సంక్రాంతి పండగ చేసుకోబోతున్నారన్న మాట. -
ఆ తర్వాత ఇదే గొప్ప విజువల్: రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య మెగా ఫ్యామిలీ మీద పడ్డట్టు కనిపిస్తోంది. రీసెంట్గా రిలీజైన రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా మీద తనదైన శైలిలో సెటైర్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన రామూ తాజాగా మరోసారి ట్విట్టర్లో మెగా ఫ్యామిలీపై కామెంట్లు చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కలిసున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసి.. నయాగరా జలపాతం తర్వాత ఇదే గొప్ప విజువల్ అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఊరుకోకుండా పట్టలేనంత సంతోషంగా ఉందని.. మళ్లీ వెళ్లి 'బ్రూస్ లీ' సినిమా చూస్తానని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ నుంచి నేరుగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి 'బ్రూస్ లీ' లో నటించిన చిరంజీవిని అభినందించిన విషయం తెలిసిందే. అయితే 'చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు కలవడం కల అనుకున్నానని.. తీరా లేచి చూశాక అది నిజమని రియలైజ్ అయ్యానని.. మెగా ఫ్యామిలీ విషయంలో ఇప్పుడు తనకెంతో సంతోషంగా ఉందని' కామెంట్ చేశారు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ. P K Mega together is greatest visual I saw since Niagara Falls ..I am so exhilarated nd going to see Bruce Lee again pic.twitter.com/10HkjFijNO — Ram Gopal Varma (@RGVzoomin) October 18, 2015 I thought it was my dream that Mega and PK got back and I woke up and realised its really true..I am so ecstatically happy for Mega Family— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2015 ]]> I thought it was my dream that Mega and PK got back and I woke up and realised its really true..I am so ecstatically happy for Mega Family — Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2015 -
వారసురాలి ఎంట్రీపై ఒత్తిడిలో 'మెగా'ఫ్యామిలీ!
టాలీవుడ్ ఇండస్ట్రీకి వారసులు రావడం చాలా కామన్. హిస్టరీని తీసుకుంటే హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల తనయులు హీరోలు అయ్యారు. కానీ, వారి కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవ్వడం ఎప్పుడో గానీ జరగదు. తాజాగా ఈ జాబితాలోకి నటుడు నాగబాబు కుమార్తె నీహారిక చేరిందన్న వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుందన్న విషయం అందరికీ విదితమే. వ్యాఖ్యాతగా ఇప్పటికే బుల్లితెరపై బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న 'మెగా' ఫ్యామిలీ అమ్మాయి నీహారిక ఇప్పుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్దమైంది. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు హీరోలుగానే వెండితెరకు పరిచయం అయ్యారు...అవుతున్నారు కూడా. అయితే నాగబాబు కూతురు నీహారిక వెండితెరకు పరిచయం అవుతుందనే వార్తలు గతంలోనే జోరుగా వినిపించాయి. అక్కినేని అఖిల్ సరసన నటించబోతోందని వార్తలొచ్చాయి కూడా.అఖిల్, నీహారిక ఇద్దరు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే. తర్వాత ఏమైందో తెలియదు కానీ నీహారిక తెరంగేట్రం గురించి ఎటువంటి వార్తలు బయటికి రాలేదు. దీనికి అసలు కారణం పెదనాన్న చిన్నాన్నలు, నీహారికని సినిమాలో నటించవద్దని చెప్పడంతో తన ప్రయత్నాలు మానుకొందని తెలిసింది. దీనితో నీహారిక వెండితెరకు బదులుగా బుల్లితెరపై దర్శనమిచ్చింది. ఓ చానల్లో రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుటికే ఆమె తండ్రి నాగబాబు పలు టీవీ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని నీహారిక బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో మెప్పిస్తోంది. యువ హీరో నాగశౌర్యతో కలిసి వెండితెరకు పరిచయం అవబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ రూటే సపరేటు.. అన్ని సినీ పరిశ్రమల్లోకెల్లా తెలుగు చిత్ర పరిశ్రమ రూటే సపరేట్ అని చెప్పనక్కర్లేదు. నీహారిక సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతుందంటూ ప్రకటించిన మెగా ఫ్యామిలీపై అభిమానులు మండిపడుతున్నారు. నిహారికను సినిమాల్లోకి రానివ్వద్దని మెగా ఫ్యామిలీపై అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారట. అయితే తన కూతురు పద్ధతిగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తుందంటూ నాగబాబు వివరణ ఇచ్చుకున్నారని ఇండస్ట్రీలో టాక్. మెగా ఫ్యామిలీపైనే అభిమానులు ఒత్తిడి తెచ్చారంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది. అయితే నాగబాబు మాత్రం తన కుమార్తె ఎంట్రీపై సుముఖంగా ఉన్నారు. అభిమానులకు కూడా ఆయన నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. లక్ష్మీ.. వెరీ లక్కీ.. అయితే, ఈ విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ చాలా లక్కీ అని చెప్పవచ్చు. మూవీ ఎంట్రీ ఇవ్వడంతోనే నంది అవార్డు గెలుచుకుని, దిగ్విజయంగా ఆమె తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. వారసురాళ్ల ఎంట్రీ విషయానికి వస్తే... ఇక ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. వారు లేనిదే మేము లేము అనే నటులకు...వారి అభిమతాన్ని కూడా లెక్కలోకి తీసుకున్న సందర్భాలున్నాయి. గతంలో సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడూ ఆయన్ ఫ్యాన్స్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా మంజుల కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిందన్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఒత్తిడి వల్లే తన కుమార్తె ఆ నిర్ణయం తీసుకుందని కృష్ణ స్వయంగా ప్రకటించారు. ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నం కేవలం నటీనటుల కూతుళ్ల విషయానికొస్తే.. కోలీవుడ్‌లో కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరా హాసన్, అర్జున్ కుమార్తె ఐశ్వర్య, శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి, రాధ పెద్ద కుమార్తె కార్తీక, చిన్నకూతురు తులసీ కూడా వెండితెరపై నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో గోవిందా కూతురు టీనా అహుజా, అనిల్‌కపూర్ తనయ సోనమ్ కపూర్, శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి గారాలపట్టి అతియాశెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అలాగే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా తమ వారసురాళ్లను తెరకు పరిచయం చేయటానికి ఆసక్తి చూపించడం లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న సాధకబాధకాల కారణంగానే వారు అనాసక్తత చూపిస్తున్నారు. కుటుంబసభ్యులే కాకుండా అభిమానులు కూడా వారసురాళ్ల వెండితెర ఎంట్రీకి అంతగా ఇష్టపడటం లేదు. అదే ఇప్పుడూ నిహారిక విషయంలో బయటపడిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
చిరంజీవి ఒప్పుకుంటారా?
హైదరాబాద్: తన తండ్రి నటించబోయే 150 సినిమాలో స్టెప్పులు వేయాలనుకుంటున్నట్టు చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ వెల్లడించాడు. తన తండ్రితో కలిసి డాన్స్ చేయాలనుందని చెప్పాడు. 'నాన్న సినిమాలో ఆయనతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నా. సీన్ లో నటించాలని అనుకోవడం లేదు. స్టెప్పులు వేయాలనివుంద'ని రామ్ చరణ్ తెలిపాడు. మెగా ఫ్యామిలీ చెందిన మిగతా హీరోలు ఈ సినిమాలో కనిపిస్తారా అని అడగ్గా.... పవన్ కల్యాణ్, నేను అల్లు అర్జున్ సహా అందరం నటిస్తామని సమాధానమిచ్చారు. దీనికి చిరంజీవి ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా... ఇది నేను నిర్మిస్తున్న సినిమా. నేను తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడానికి ఇది అవసరం. దీనికి అవసరమైవన్నీ చేస్తాను. ఆ విషయాలు నాన్న ఎలా చెబుతారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తార'ని జవాబిచ్చారు. చిరంజీవి కథ ఫైనలైజ్ చేసిన వెంటనే షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. షూటింగ్ ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నలుగురు స్టార్ డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారని చరణ్ వెల్లడించారు. -
మెగా కాంపౌండ్ నుంచి పూరికి పిలుపు
-
పవన్ బాబాయ్ తిట్లే.. దీవెనలయ్యాయి
తన తొలి చిత్రం విడుదలతో మంచి ఉత్సాహం మీద ఉన్న మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ తిట్టడం వల్లే ఈరోజు తాను ఇంతవాడినయ్యానని అన్నాడు. తనతో పాటు తమ సమీప బంధువు సాయి ధరమ్ తేజ్‌ను కూడా ఒకరోజు పవన్ కల్యాణ్ బాబాయ్ పిలిచారని, అసలు భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా.. లేదా అంటూ తిట్టారని చెప్పాడు. సరైన ఆలోచనలతో తన వద్దకు రావాలని చెప్పి, తమకు పూర్తి స్పష్టత వచ్చేలా సాయం చేశారని అన్నాడు. అలాగే.. తాను డాడీ అని పిలిచే మెగాస్టార్ చిరంజీవి తనకు క్రమశిక్షణ నేర్పించారని వరుణ్ తేజ్ చెప్పాడు. పరిశ్రమలో విజయాలు సాధించాలంటే క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆయనే చెప్పారన్నాడు. వరుణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా చేసిన ముకుంద సినిమా బుధవారం విడుదలైంది. దీనికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు. -
మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!
ప్రముఖ దర్శక-నిర్మాత దాసరి నారాయణ రావు పరోక్షంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోందని, పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులను తాను చూడలేదని, ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని అన్నారు. చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు కావాలని అడిగితే ''సినిమా రెడీ చేసి పెట్టుకో, వారం గ్యాప్ వస్తే వేసుకో, ఎప్పుడు ఖాళీ వస్తే అప్పుడు వేస్తాం'' అని అంటున్నారని చెప్పారు. 'లౌక్యం' సినిమా అద్భుతమైన వసూళ్లతో ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారన్నారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని, దాంతో మళ్లీ 'లౌక్యం' చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారని చెప్పారు. రామ్‌చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం గురించే దాసరి విమర్శించారని ఫిల్మ్‌నగర్ టాక్. 'లౌక్యం' మూవీ సెప్టెంబరు 26న విడుదలైంది. 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబరు 1న విడుదలైంది. దీనిని దృష్టిలోపెట్టుకొనే దాసరి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గతంలో కూడా ఒక సందర్బంలో దాసరి, రామ్‌చరణ్ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత దాసరి గానీ, రామ్ చరణ్ గానీ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు 'లౌక్యం' సినిమా బాగా ప్రదర్శిస్తున్నప్పటికీ రామ్‌చరణ్ చిత్రం కోసం దానిని థియేటర్లలో ఎత్తివేయడంతో దాసరి ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. ** -
మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!
-
మెగా ఫ్యామిలీ సెంటిమెంట్!
సినిమా రంగం సెంటిమెంట్లకు నిలయం. ఆ సెంటిమెంట్ ఒకటని చెప్పలేం. అనేక రకాల సెంటిమెంట్లు రాజ్యమేలుతున్నాయి. వారాలు - తేదీలు - నెలలు-పండుగలు-కాంబినేషన్లు.....ఇలా అనేక సెంటిమెంట్లు ఎక్కువ మంది నమ్ముతారు. ముఖ్యంగా టాలీవుడ్లో హీరోలు ఎక్కవగా సెంటిమెంట్లను ఫాలో అవుతారని చెబుతుంటారు. అందరికీ ఉన్నట్లే మెగా ఫ్యామిలికి చెందిన హీరోలకు కూడా సెంటిమెంట్లపై నమ్మకం ఉందని అంటున్నారు. వారిలో ఎవరితోనైనా ఓ హీరోయిన్ జతగా నటించిన చిత్రం హిట్ కొడితే, మిగిలినవారి సినిమాలలో కూడా ఆ హీరోయిన్‌కు అవకాశం దక్కడం ఖాయం. నాజూకు భామ శృతి హాసన్ ఇటీవల అటువంటి అవకాశాలను కొట్టేసింది. వరుస పెట్టి ఆ స్టార్ హీరోల సరసన నటించింది. ఇంకా నటిస్తోంది. ఆ రకంగా శృతి మెగా హీరోలకి లక్కీ గర్ల్‌గా మారింది. ఈ బ్యూటీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజతో ఎవడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రేసు గుర్రం చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం మెగా అభిమానులు మరోసారి శృతి హాసన్‌తో మెగా హీరోలు రోమాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. దాంతో మెగా హీరోలు కూడా శృతితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్‌ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిని హీరోయిన్గా తీసుకోవలసిందిగా శ్రీను వైట్లని రామ్‌చరణ్ కోరినట్లు సమాచారం. అందుకు శ్రీను వైట్ల కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆగడు, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. - శిసూర్య -
దూసుకుపోతున్న మెగా హీరోలు
-
విశాఖలో పవన్, హైదరాబాద్‌లో చరణ్...
హైదరాబాద్ : మెగాస్టార్ కుటుంబ కథా చిత్రం ఆసక్తిదాయకంగా కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీలో విభేదాలు మరోసారి తెర మీదకు రానున్నాయా అనేది హాట్ న్యూస్ గా మారింది. ఓవైపు పవన్ కల్యాణ్ విశాఖలో అభిమానులతో భేటీ అవుతుంటే...మరోవైపు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ ఛాంబర్లో అభిమానులతో సమావేశం అవుతున్నాడు. దాంతో బాబాయి...అబ్బాయిల పోటీ పోటీ సమావేశాలు... ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఓ వైపు అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రి హోదాతో పాటు ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్.....‘కాంగ్రెస్ హటావ్...దేశ్ బచావ్' నినాదంతో కొత్త పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓవైపు, మిగతా మెగా ఫ్యామిలీ హీరోలంతా మరోవైపు చీలి పోయారు. పవన్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, తమతో పాటు, మెగా అభిమానులంతా చిరంజీవి వైపే అని రామ్ చరణ్ తో పాటు సోదరుడు నాగబాబు మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ పరిణామాలతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల మధ్య కూడా చీలిక ఏర్పడిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్ర విభజనలాగా....మెగా అభిమానులు కూడా రెండుగా చీలబోతున్నారా? చరణ్ అభిమానులకు ఏం సందేశం ఇస్తాడనేది సస్పెన్స్‌గా మారింది.అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ప్రతి సంవత్సరం అభిమానులు రామ్ చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పడం, రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పుకొస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈ నెల 27న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్’ అనే నినాదంతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం’ పుస్తకాన్నిఆవిష్కరించనున్నాడు. ఇటీవలే పవన్ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా.....పవన్ కల్యాణ్ సభ పెట్టిన రోజు రామ్ చరణ్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది. -
కెమెరా ముందుకు నాగబాబు తనయ
హైదరాబాద్: మోగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వారసులు మాత్రమే తెర ముందుకు వచ్చారు. కొణిదెల వంశం నుంచి తొలిసారిగా వారసురాలు తెర ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయ నిహారిక కొణిదెల కెమెరా ముందుకు వచ్చారు. బుల్లితెరపై వ్యాఖ్యాత ఆమె కనిపించనున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే చిన్న పిల్లల డాన్స్ కార్యక్రమానికి ఆమె యాంకర్‌గా వ్యవహరించనున్నారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా తెలుగుతెరగా పరిచయం కానున్నాడు. ఇక నాగబాబు కూడా పలు టీవీ కార్యక్రమాలకు నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయ కూడా తండ్రి బాటలోనే ముందుకు సాగుతోంది. వ్యాఖ్యాతగా నిహారిక ఏమేరకు రాణిస్తోందనని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
చిరు, పవన్‌ల మధ్య విభేదాలు...?
-
'చిరు, పవన్ ల మధ్య అదే రిపీటైంది'
మెగా ఫ్యామిలీలో 'ప్రజారాజ్యం', ఇతర సంఘటనలు చిచ్చు రాజేశాయని తరచుగా వార్తల్లో వినిపిస్తునే ఉన్నాయి. ఆ వార్తలకు తోడుగా ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు చూస్తూన్న, పరోక్షంగా వింటున్న అభిమానులకు ఆ వార్తలు నమ్మశక్యం కలిగించలేదు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ కైనా చిరంజీవి హాజరైతే పవన్ రాకపోవడం కనిపించింది. కుటుంబ కార్యక్రమాన్ని తలపించిన రచ్చ ఆడియో ఇతర కార్యక్రమంలో పవన్ అడ్రస్ లేకుండా పోయింది. దీనిపై పవన్ అభిమానులు నానా హంగామా చేశారు. కాని మెగా ఫ్యామిలీ నుంచి మరో తెలుగు తెరకు పరిచమయ్యే వేదిక సాక్షిగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య విబేధాలు తారాస్థాయిలోనే ఉన్నాయనే వార్తలకు వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన క్షణం నుంచి తనకు ఇష్టం లేని ఫంక్షన్ కు వచ్చానే అనే ఫీలింగ్ అణువణువునా కనిపించింది. తన సోదరుడి కుమారుడి ఆరంగేట్రంలో ఎలాంటి ఉత్సాహం లేకుండా మెట్లపై కూర్చుని అనాసక్తిని ప్రదర్శించడమే కాకుండా ఓ విధమైన నిరసనను వ్యక్తం చేసిన లెక్కలు బాగానే కనిపించాయి. ఈ కార్యక్రమంలో మెగాస్ఠార్ చిరంజీవి ముఖాన్ని పవర్ స్టార్ లు కనీసం చూడటానికి ప్రయత్నించలేదనే సత్యం స్పష్టం కనిపించింది. చిరంజీవి ఇచ్చిన అక్షింతల్ని ఏదో మోహమాటంగా తీసుకుని వరుణ్ తేజ్ ను అశ్వీరదించారు. ఆతర్వాత వెంటనే అక్కడి నుంచి తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ నిష్క్రమించారు. అయితే పవన్ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్ఠార్ తో విబేధాలు ఏస్థాయిలో ఉన్నా.. మరో సోదరుడి కార్యక్రమాన్ని రచ్చరచ్చ చేశాడనేది ఓ వర్గం వాదన. ఆర్ధికంగా ఓ రేంజ్ లో ఇబ్బందుల్లో కూరుకుపోయి.. తన కెరీర్ ను లాంచ్ చేశారు నాగబాబు. అలాంటి కార్యక్రమంలో పవన్ అలా ప్రవర్తించడం ఏమాత్రం బాగాలేదనే విమర్శలు భారీగానే వినిపించాయి. వాస్తవానికి చెప్పుకుంటే.. మెగాస్టార్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో లేకుంటే నాగబాబు, పవన్, మెగా ఫ్యామిలీ సభ్యులెవరికి స్థానం లేదనది కాదనలేదని వాస్తవం. ప్రజారాజ్యం పార్టీ తర్వాత మెగాస్టార్ వర్గం అంటూ పరిశ్రమలో కనుపించని చీలిక వచ్చింది. అయినా తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా మెగాస్టార్ ఎదురుపడితే ఇతరులు కనీసం ఆయన హోదాను గౌరవించడం మనం గమనిస్తునే ఉంటాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా పవన్ ఇష్టం లేకున్నా మెగాస్థార్ గౌరవించాలనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఎన్నో ఆశలతో తన కుమారుడి కెరీర్ ఆరంభం కార్యక్రమం మీడియా, అభిమానులు, ప్రేక్షకుల సాక్షిగా నవ్వుల పాలైంది. మెగా ఫ్యామిలీలోని విభేదాలు పవన్ మూలంగా ఈ రోజు మళ్లీ బజారు కెక్కాయి. తనకు ఇష్టం లేని పని చేస్తే .. 'మళ్లీ ఇదే రిపీట్ అవుద్ది' అంటూ బద్రి చిత్రంలో పవన్ కొట్టిన డైలాగ్ ప్రేక్షకులను రంజింప చేసింది. కాని పట్టు విడుపులన్నీ రెండుగంటలపాటు సాగే సినిమాల్లో అయితే పర్వాలేదు. కాని వాస్తవ జీవితానికి వస్తే.. గతంలో జరిగిన సంఘటనల్ని మనసులో పెట్టుకుని వరుణ్ తేజ్ సినిమా ఆరంభ కార్యక్రమంలో పవన్ తీరు ఏమాత్రం సమంజసంగా లేదని అంటున్నారు. చిరంజీవి ఎంత పెద్ద తప్పు చేసినా..పవన్ ఇలాంటి శిక్ష వేయడం సరికాదు అనేది మెజార్టీ సభ్యుల భావన. -
మరో మెగా వారసుడి అరంగేట్రం
-
వరుణ్ ఆరడుగుల అందగాడు కాదు: చిరంజీవి
హైదరాబాద్ : మెగా టైటిల్ అందిపుచ్చుకుని వెండితెరకు పరిచయం అవుతున్న వరుణ్తేజను ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. వరుణ్‌తేజ ఆరడుగుల అందగాడు కాదని....ఆరున్నర అడుగుల అందగాడు అని కితాబిచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర ముహూర్త కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అభిమానులు ఇప్పటివరకూ తమను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన అందరి హీరోలను ఆదరించినట్లుగానే... మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వరుణ్‌కు సైతం అభిమానులు అండగా నిలవాలని కోరారు. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని అన్నారు. నాగబాబు ఎంతో అదృష్టవంతుడని అన్నారు. రాంచరణ్ షూటింగ్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని చిరంజీవి తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైనా మాట్లాడకపోవటం చర్చనీయాంశమైంది. కార్యక్రమం అవగానే వెంటనే వెళ్లిపోయాడు. చిరంజీవి మొదలు నిన్నటి సాయి ధరమ్ తేజ్ వరకు మొత్తం ఆరుగురు హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చారు. కాగా మెగా ఫ్యామిలీ నుంచి ఏడో నెంబరుగా వస్తున్న వరుణ్ తేజ్ మెగా వారసత్వాన్ని నిలుపుతాడా..? లేదా..? అనేది సినిమా విడుదలయ్యాకే తేలనుంది. -
మెగా కాంపౌండ్‌లో హరీష్ శంకర్
-
అల్లు అర్జున్ కు కూతురు పుట్టింది!
సంకాంత్రి పండుగ, ఎవడు ఘన విజయం సాధించడంతోపాటు, మరో సంఘటన అల్లు, మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఓ పండంటి బిడ్డకు తండ్రయ్యాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఆడపిల్లకు జన్మనిచ్చారని తెలిసింది. రెండేళ్ల క్రితం అర్జున్, స్నేహారెడ్డిలకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంలోకి కొత్తగా మరో సభ్యురాలు చేరడాన్ని అల్లు, చిరు కుటుంబాలు ఆహ్వానించాయి. బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
కోటె సంతాప సభకు మెగాస్టార్ ఫ్యామిలీ
బెంగళూరు : కర్ణాటక మెగా ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షడు, దివంగత కోటె వెంకటేష్ యాదవ్ సంతాప సభ శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాలులో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు, అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువజన శాఖ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు ఆర్వీ దేవరాజ్, జమీర్ అహమ్మద్ హాజరు కానున్నారు. గత ఏడాది అక్టోబరు 29న తన సోదరి అనితతో కలిసి జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు ప్రమాదంలో కోటె వెంకటేష్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇటీవల వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి చిరంజీవి సోదరుడు నాగబాబు రూ.5 లక్షలు అందించారు. -
అభిమాని సంతాప సభకు మెగా హీరోలు
వోల్వో బస్సు ప్రమాదంలో మరణించిన కర్నాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్ యాదవ్ సంతాప సభ బెంగళూరులోని రవీంద్ర భారతిలో డిసెంబర్ 6 తేదిన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు నిర్వహించనున్నారు. తన చెల్లెలు పెళ్లి సందర్భంగా శుభలేఖలు ఇవ్వడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఎస్ వెంకటేశ్ వోల్వో బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అకాల మరణం చెందిన వెంకటేశ్ కుటుంబానికి ఇటీవల మెగా హీరోలు ఆర్ధిక సహాయం అందించారు. వెంకటేశ్ సంతాప సభకు మెగా హీరోలు హాజరవుతున్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.