హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో | Sai Dharam Tej Clarifies Wedding Rumours At Usha Parinayam Pre Release Event | Sakshi
Sakshi News home page

Sai Tej: మెగా పెళ్లి గాసిప్స్.. అసలు విషయం బయటపెట్టిన సాయితేజ్

Jul 29 2024 9:06 AM | Updated on Jul 29 2024 9:40 AM

Sai Dharam Tej Clarifies Wedding Rumours At Usha Parinayam Pre Release Event

ప్రేమించి పెళ్లి చేసుకోవడ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. హీరోహీరోయిన్లు ఈ పాటికే చాలామంది ఇలా లవ్ మ్యారేజులు చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్ ఇలానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒక్కటయ్యాడు. అయితే ఈ లిస్టులో మెగా హీరో సాయిధరమ్ కూడా చేరబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ మెహ్రీన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

'ఊషా పరిణయం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగ్గా.. దీనికి చీఫ్ గెస్ట్‌గా సాయితేజ్ వచ్చాడు. ఇందులోనే 'మీ లవ్‌ గురించి చెప్పండి' అని యాంకర్ అడగ్గా.. 'వన్‌సైడ్‌ లవ్‌ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు (నవ్వుతూ). ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి, మాట్లాడేలోపు 'మీకు పెళ్లి అయిపోయిందట కదా' అనే ఆన్సర్ వస్తోంది. నాకు పెళ్లా? అని ఆశ్చర్యపోతుంటే.. మీడియాలో చూశామని అంటున్నారు అని నవ్వుతూ సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.

'త్వరలో మెగా ఇంట పెళ్లి సందడి అంటూ న్యూస్‌ వస్తోంది. మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?' యాంకర్ అడగ్గా.. 'నా సినిమాలో 'నో పెళ్లి' (సోలో బ్రతుకే సో బెటర్‌) అనే పాట ఉంది తెలుసు కదా' అని అసలు విషయాన్ని దాటవేశాడు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతం 'హనుమన్' నిర్మాతలతో సాయితేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement