Mehreen Pirzada
-
వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్.. తన గ్యాంగ్‌ను చూశారా?..ఫోటోలు వైరల్
-
సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. కెరీర్ డౌన్ ఫాల్.. మెహ్రీన్ ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
కంగు బీచ్ లో హీరోయిన్ మెహరీన్ అందాల హొయలు..
-
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో
ప్రేమించి పెళ్లి చేసుకోవడ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. హీరోహీరోయిన్లు ఈ పాటికే చాలామంది ఇలా లవ్ మ్యారేజులు చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్ ఇలానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒక్కటయ్యాడు. అయితే ఈ లిస్టులో మెగా హీరో సాయిధరమ్ కూడా చేరబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ మెహ్రీన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)'ఊషా పరిణయం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగ్గా.. దీనికి చీఫ్ గెస్ట్‌గా సాయితేజ్ వచ్చాడు. ఇందులోనే 'మీ లవ్ గురించి చెప్పండి' అని యాంకర్ అడగ్గా.. 'వన్‌సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు (నవ్వుతూ). ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి, మాట్లాడేలోపు 'మీకు పెళ్లి అయిపోయిందట కదా' అనే ఆన్సర్ వస్తోంది. నాకు పెళ్లా? అని ఆశ్చర్యపోతుంటే.. మీడియాలో చూశామని అంటున్నారు అని నవ్వుతూ సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.'త్వరలో మెగా ఇంట పెళ్లి సందడి అంటూ న్యూస్ వస్తోంది. మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?' యాంకర్ అడగ్గా.. 'నా సినిమాలో 'నో పెళ్లి' (సోలో బ్రతుకే సో బెటర్) అనే పాట ఉంది తెలుసు కదా' అని అసలు విషయాన్ని దాటవేశాడు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతం 'హనుమన్' నిర్మాతలతో సాయితేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?) -
బంగారు కాంతుల మధ్య మెరిసిపోతున్న మెహరీన్ (ఫొటోలు)
-
18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి
-
మెహరీన్‌పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్లో భారీగా పాపులారిటీ దక్కింది. అయితే, కొద్దిరోజుల క్రితం మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రటీలు కూడా పెళ్లి కాకుండానే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన యువతులే కాకుండా హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మెహరీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్‌ను ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మెహరీన్ ఫైర్ అయింది. ఈ అంశం గరించి తప్పుగా వార్తలను ప్రచురించిన వారు వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. ' పలు మీడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలాంటి అంశాలను అర్థం చేసుకుని వార్తలను అందించండి. ఎవరికితోచినట్లు వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో నేను పెట్టిన 'ఎగ్ ఫ్రీజింగ్' పోస్ట్‌పై కొందరు రకరకాల వార్తలు రాశారు. ఈ విధానంలో అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. మొదట ఈ విషయాన్నిఅందరూ తెలుసుకోవాలి. నేను ఒక సెలబ్రిటీగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే వారందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇదీ చాలా తప్పుగా అనిపించలేదా..? ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టిండి. మీ తప్పును తెలుసుకొని సరిచేసుకోండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నాపై పెట్టిన పోస్ట్‌లను తొలగించండి. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పండి.' అని మెహరీన్ కోరింది.'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఎందుకు పాటిస్తున్నారంటే..?ఈ కాలంలో మహిళలు తమ కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, సినిమా రంగలో ఉండే మహిళలు పెళ్లి, అమ్మతనాన్ని వాయిదా వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్‌లో అనుకున్నంతగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అని ఇప్పటికే చాలామంది దంపతులు చెప్పారు కూడా.. ఆ కోవకు చెందిన వారు తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి 'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఒక వరం అని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయసులోపు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన తమ అండాల్ని ఇలా భద్రపరుచుకుంటారు. ఆపై వారికి నచ్చినప్పుడు పిల్లల్ని కంటారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఎగ్ ప్రీజింగ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది. అదేనండి మొన్నీ మధ్య 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకుర్ చెప్పిందిగా. ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.'ఎగ్ ఫ్రీజింగ్' అంటే ఏంటి?ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్లు.. వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' చేసుకోగా, ఇప్పుడా లిస్టులోకి మెహ్రీన్ చేరింది.(ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక)మెహ్రీన్ ఏమని చెప్పింది?'గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు. కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం''తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆస్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
Mehreen Pirzada: చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మెహరీన్ (ఫోటోలు)
-
Spark Review: 'స్పార్క్' సినిమా రివ్యూ
టైటిల్: స్పార్క్ నటీనటులు: విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్, నాజర్ తదితరులు నిర్మాత: విక్రాంత్ రచన-దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: విక్రాంత్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ విడుదల తేది: 2023 నవంబర్ 17 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) స్కార్క్ కథేంటంటే? లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు. పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. దానికి ట్రయాంగిల్ లవ్‌స్టోరీని జోడించారు. ఫస్టాఫ్‌లో ఒకపక్క హీరోహీరోయిన్లతో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. మరోపక్క వరుస హత్యలు చూపిస్తూ ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు. హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. లవ్‌ట్రాక్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. నాజర్,గురు సోమసుందరం పాత్రల ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనార్థాలను గురించి ఇందులో చర్చించారు. హత్యలతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తది. పాన్ ఇండియా సబ్జెక్టు. ఇలాంటి భారీ కథకు స్టార్ హీరో అయితే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే? విక్రాంత్ కొత్తవాడే అయినా.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే.. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆర్య, జై పాత్రల్లో చక్కగా నటించాడు. కొన్ని చోట్ల నటనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ విషయంలో విక్రాంత్ ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. లేఖ పాత్రలో మెహరిన్ ఒదిగిపోయింది. ఇక హీరో ప్రియురాలు అనన్యగా రుక్సార్ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. విలన్‌గా గురు సోమసుందరం తనదైన నటనతో మెప్పించాడు. సుహాసినీ మణిరత్నం సరికొత్త పాత్రలో నటించింది. నాజర్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
‘స్పార్క్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ అందరికి గుర్తుంటుంది..!
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
అలా విమర్శించేవారికి కూడా అక్కా చెల్లెళ్లు ఉంటారు: హీరోయిన్
తమిళసినిమా: ఆడవారిని విమర్శలతో బాధించడం నీచమైన చర్యగా నటి మెహ్రిన్ పేర్కొంది. ఈ బ్యూటీ తెలుగులో నానీకి జంటగా కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. తమిళం, హిందీ భాషల్లోనూ కథానాయకిగా నటించిన మెహ్రిన్‌కి ఇప్పటికీ స్టార్ ఇమేజ్ రాలేదని చెప్పాలి. అంతేకాదు ప్రస్తుతం అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నెంజిల్ తునివిరిందాల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ధనుష్‌కు జంటగా పటాస్, విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రాల్లో ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు. అలాంటిది ప్రస్తుతం స్పార్క్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ అమ్మడు కూడా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సీరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మెహ్రిన్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో హద్దు మీరి ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అశ్లీల సన్నివేశాలలో బరితెగించి నటించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలపై స్పందించిన మెహ్రిన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సీరీస్‌లో చోటుచేసుకున్న మానభంగం సన్నివేశంలో అశ్లీలంగా నటించాలని తనపై విమర్శలు గుర్తిస్తున్నారని ఇది తనను ఎంతగానో బాధకు గురిచేస్తోందని పేర్కొంది. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలనే ఆ వెబ్ సీరీస్‌లో చూపించినట్లు చెప్పింది అయితే తనను చాలా నీచంగా చిత్రీకరించి ట్రోలింగ్ చేయడం బాధిస్తోందని పేర్కొంది. విమర్శలు చేసే వారికి అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని ఆడవారిని బాధించడం వారిపై రాక్షసంగా ప్రవర్తించడం హేయమైన చర్య అనే భావనను మెహ్రిన్ వ్యక్తం చేసింది. Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
అది శృంగార సీన్ ఎలా అవుతుంది?.. మండిపడ్డ మెహ్రీన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. గతేడాది ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది. ఇటీవలే ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే ఈ సిరీస్‌లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే ఈ సీన్ ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్‌గా అభివర్ణించడంపై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా రాయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) మెహ్రీన్ ట్వీట్లో రాస్తూ.. 'ఢిల్లీ సుల్తాన్‌లో వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే ఓ సన్నివేశం ఉంది. మనదేశంలో ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్యను మీడియాలో చాలా మంది శృంగార సీన్‌గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు ఇది తీవ్రమైన సమస్య. ఈ విషయాన్ని ఇలా చెప్పడం సమస్యను చిన్నదిగా చూపించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలా చేయడం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి వారు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. వారు తమ నిజ జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనది.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని అని తెెలిపింది. మిలన్ లుథ్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సన్నివేశాల షూటింగ్ సమయంలో నటులుగా మేం చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నామని పేర్కొంది. నేను చేసే పాత్ర మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ఫ్యాన్స్ కోసం ప్రతి పాత్రలోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
నా మూడేళ్ల కల స్పార్క్
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రాంత్ మాట్లాడుతూ – ‘‘నాకు సినిమాలంటే ఇష్టం. అమెరికాలో జాబ్ చేస్తున్న క్రమంలో సంపాదనలో పడి కలను మర్చిపోకూడదని ఈ సినిమా తీశాను. ఏడాదిన్నర పాటు ‘స్పార్క్’ కథ రాసుకుని, కష్టపడి మరో ఏడాదిన్నర పాటు ఈ సినిమాను నిర్మించాం. ‘స్పార్క్’ నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా.. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మల్టీజానర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు తమిళ నటుడు గురు సోమసుందరం. ‘‘టైటిల్‌కు తగ్గట్లే మా సినిమా ‘స్పార్క్’లా ఉంటుంది’’ అన్నారు మెహరీన్. ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
Mehreen Pirzada: తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న మెహరీన్ (ఫోటోలు)
-
బక్కచిక్కిన లుక్ లో మెహరీన్ తిట్టిపోస్తున్న నెటిజన్లు
-
షాకింగ్ లుక్‌లో హీరోయిన్ మెహ్రీన్
-
హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్‌లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
జహీరాబాద్ : షాపింగ్ మాల్లో హనీరోజ్, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది?
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ పిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇటీవలే ఎఫ్ 3తో ప్రేక్షకులను అలరించిన మెహరీన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మెహరీన్ ముఖమంతా సూదులతో గుచ్చి ఉంది. ఇది చూసిన మెహరీన్ ఫ్యాన్స్ ముఖానికి సూదులు గుచ్చుకోవడమేంటని కంగారుపడుతున్నారు. అయితే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఇలా చేసింది మెహరీన్. తను ఆక్యుస్కిన్లఫ్ట్ అనే థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ చేసి నా ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) చదవండి: జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది తుప్పాస్ పని చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ -
నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ఫాలోవర్స్, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. 'ఎఫ్3'తో సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా. ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్ మెహ్రీన్. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన బారాత్‌లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్. ఈ పోస్ట్‌కు 'పంజాబీ వెడ్డింగ్ సీన్స్' అనే క్యాప్షన్స్ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హైదరాబాద్‌లో ప్రారంభమైన మెహరీన్ స్పార్క్ మూవీ
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్పార్క్’. మెహరీన్ హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కుమార్ రవివర్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి, కెమెరామేన్ రత్నవేలు, నిర్మాత అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు పాల్గొన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. రత్నవేలు దగ్గర అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు అరవింద్. దర్శకులు శంకర్, సుకుమార్గార్ల దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ‘ఎఫ్ 2’లో అల్లరి, అమాయకత్వం నిండిన హనీ పాత్రలో కనిపించిన మెహరీన్ ‘ఎఫ్ 3’లో ఈ రెండు షేడ్స్‌తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనున్నారు. ‘‘మెహరీన్ క్యారెక్టర్ మెచ్యూర్డ్‌గా డిఫరెంట్ లేయర్స్‌తో ఉంటుంది. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ‘‘నా కెరీర్లో ఇది బెస్ట్ ఎంటర్టైనింగ్ రోల్’’ అని మెహరీన్ అన్నారు. సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు