టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్‌కు ముహూర్తం కుదిరింది. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అగ్రహీరో వెంకటేష్-మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు ఎఫ్-2లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం రేపు(శనివారం) అంటే జూన్ 23 నుంచి లాంఛ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు పెయిర్‌గా మెహ్రీన్ నటించనున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఎఫ్-2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
We have a date and time. #F2LaunchTomorrow at 9AM.. #VenkateshDaggubati @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP pic.twitter.com/AHMoMQqZDa
— Sri Venkateswara Creations (@SVC_official) 22 June 2018
Comments
Please login to add a commentAdd a comment