ఎఫ్‌3 రిలీజ్‌ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే | Venkatesh, Varun F3 Release Date Announced | Sakshi
Sakshi News home page

ఎఫ్‌3 రిలీజ్‌ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే

Published Thu, Jan 28 2021 8:08 PM | Last Updated on Fri, Jan 29 2021 6:50 PM

Venkatesh, Varun F3 Release Date Announced - Sakshi

విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్‌3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్‌2’కి ఇది సీక్వెల్‌గా రూపొందుతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్2’ లో భార్య‌ల మ‌న‌స్తత్వం వల్ల కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రిగితే, ‘ఎఫ్ 3’లో డ‌బ్బు వ‌ల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జ‌రిగాయ‌నేది చూపించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్‌లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశాడు దర్శకుడు. తాజాగా ఎఫ్‌ 3 విడుదల తేదిని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. చదవండి: వరుణ్‌తేజ్‌ రింగులోకి దిగేది అప్పుడే!

గత రెండు మూడు రోజుల నుంచి ముఖ్యంగా ఈరోజు(గురువారం) టాలీవుడ్‌లో బోలేడు సినిమాలు వరుస పెట్టి రిలీజ్‌ డేట్‌లను అనౌన్స్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎఫ్‌3 సినిమా యూనిట్ కూడా తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించనుందని పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌ పనులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రామ్ చరణతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement