Anil Ravipudi
-
లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ చిత్రం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం శివంగి. ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చేతుల మీదుగా శివంగి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది స్టన్నింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025 -
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్..
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
హీరో వెంకటేశ్ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషనల్ విషయంలో చేసిన మ్యాజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆడియో లిరిక్స్ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్‌ను దాటింది. థియేటర్స్‌లో ఈ పాటకు ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి. -
వచ్చే సంక్రాంతి కోసం చిరు మెగా ప్లాన్
-
ఈ సక్సెస్ చాలా పాఠాలు నేర్పింది: ‘దిల్’ రాజు
‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్‌తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్. అయితే వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.90 శాతం ఫెయిల్యూర్స్, కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ ఉండే ఇండస్ట్రీ ఇది. 20 ఏళ్లుగా మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు షేర్ రాబట్టింది. ఓ రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న రూ. 300 కోట్ల గ్రాస్ నంబర్ మా మూవీతో చూడబోతున్నందుకు హ్యాపీ’’ అని తెలిపారు. ‘‘20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఇలాంటి సమయంలో వాళ్లు తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’’ అని శిరీష్ పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సాయికృష్ణ, రాజేశ్, హరి, శోభన్, ఎల్వీఆర్ మాట్లాడారు. -
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
ఆ విషయంలో నేను శ్రీమంతుడిని: అనిల్ రావిపూడి
‘‘దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ మూవీ తీయాలనే నా కలని తొలి సినిమా ‘పటాస్’తోనే నెరవేర్చుకోగలిగాను. నా బలం ఏంటో విశ్లేషించుకుంటూ, నా గత చిత్రాల ప్రభావం ప్రస్తుత మూవీస్‌పై పడకుండా జాగ్రత్త పడుతూ, ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా కథ రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ). ‘పటాస్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి నేటి (జనవరి 23)తో పదేళ్లు. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ∙నా పదేళ్ల కెరీర్లో నేను చేసిన ప్రతి సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమాకు ఒకొక్క మెట్టు ఎక్కించి, ఫైనల్‌గా ఈ ‘పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఆడియన్స్ నాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఆడియన్స్ నుంచి నాకు లభించిన ప్రేమే నా ఆస్తి. ఆ విషయంలో నేను శ్రీమంతుడిని. ఇక నా కెరీర్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్, వన్ వీక్‌లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మూవీస్‌కి ఈ బలం ఉందని ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie)తో ఆడియన్స్ స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారనిపిస్తోంది. ‘పటాస్’కు ముందు దర్శకుడ్ని కావడానికి నేను ఎక్కని కాంపౌండ్ లేదు. చాలామంది హీరోలను కలిశాను. నన్ను నమ్మి, కల్యాణ్‌రామ్‌గారు చాన్స్ ఇచ్చారు. అందుకే నా సక్సెస్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.దర్శకులు ఈవీవీగారితో కొందరు నన్ను పోల్చడాన్ని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. గొప్ప బాధ్యత కూడా. జంధ్యాలగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి. థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. చిరంజీవిగారితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాను. నాగార్జునగారితో ‘హలో బ్రదర్’లాంటి మూవీ చేయాలని ఉంది. -
'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now. Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025 -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్‌కు రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.రూ.200 కోట్లకు చేరువలో..అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్ తాజాగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.మీనాక్షి స్థానంలో..సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్ వేసింది.ప్రభాస్‌తో నటించాలనుందన్న మీనాక్షిదీంతో అనిల్.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందని కవర్ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు. A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025 చదవండి: 'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..? -
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కాగా.. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూడు రోజులకే వందకోట్ల మార్క్‌ను అధిగమించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.చదవండి: కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండిన నాగ చైతన్యఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
విజయ్ చివరి సినిమా రీమేక్? ఉన్నదంతా కక్కేసిన నటుడు.. అనిల్ అసహనం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్‌అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్‌కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్‌ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.అప్పుడు నేనూ చూశాగణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్‌తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్‌ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
ఆ సాంగ్ విని అర్థరాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా: వెంకటేశ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేశ్(venkatesh) ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. యూట్యూబ్‌లో మిలియన్లకొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ పాట మొదట వెంకటేశ్‌తో పాడించాలని అనుకోలేదట మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఆ ఆలోచన లేదట. కానీ వెంకటేశ్ పాడతానని అనడంతో ట్రై చేశారట. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట గురించి వెంకటేశ్ కూడా మాట్లాడారు. తనకు బాగా నచ్చడంతోనే ఆ పాట పాడినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పాట వినగానే తెలియకుండా డ్యాన్స్ చేశాడట.‘అనిల్ రావిపూడి(Anil Ravipudi) నాకు ఈ పాటను షేర్ చేసి వినమని చెప్పారు. అర్థరాత్రి 2 గంటలకు ఆ సాంగ్ వింటూ తెలియకుండా డాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది’ అని వెంకటేశ్ అన్నారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.ముచ్చటగా మూడోదిఅనిల్ రావిపూడి, వెంకేటశ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా దిల్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రాలే. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈచిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.ప్రమోషన్స్‌లో సూపర్ హిట్ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో మొదటి చిత్రం గేమ్ ఛేంజర్ అల్రెడీ రిలీజైంది. రేపు(జనవరి 12) బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్లలో విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందంజలో ఉంది. అన్నింటికంటే చివరిగా రిలీజ్ అవుతున్నప్పటికీ.. మిగతా రెండు సినిమాల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాయి. డిఫరెంట్ ప్రమోషన్స్‌తో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక పక్క అనిల్ రావిపూడి హీరోయిన్లు, మరోపక్క విక్టరీ వెంకటేశ్, అందరూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని చేశారు. కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా టీవీ షోలు, కామెడీ షోలు అన్నింటిల్లోనూ పాల్గొన్నారు. వెంకటేశ్ అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ప్రమోషన్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో రానిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. -
సంక్రాంతికే రావాలనుకున్నాం: అనిల్ రావిపూడి
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్...’ అనే పాట వెంకటేశ్‌గారికి చాలా నచ్చింది. దీంతో ఆయనే స్వయంగా ఆ పాట పాడతానని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. కానీ ఆయన 20 నిమిషాల్లో ఆ పాట పాడటంతో సంగీత దర్శకుడు భీమ్స్ కూడా షాక్ అయ్యాడు’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ వెంకటేశ్‌గారితో నేను తీసిన ‘ఎఫ్ 2’ (2019) సంక్రాంతికి వచ్చి, విజయం సాధించింది. ‘ఎఫ్ 3’ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. మా కాంబోలో మూడో సారి చేసే సినిమాని ఎలాగైనా పండగకి తీసుకొస్తే బావుంటుందని సినిమా ఆరంభం అప్పుడే సంక్రాంతికి రావాలనుకున్నాం. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి సంబధించినది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజుల ప్రయాణం సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర వెంకటేశ్గారిది. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ట్రైలర్ అందరికీ బాగా నచ్చింది. థియేటర్స్‌కి వచ్చాక సినిమా అద్భుతంగా నచ్చితే మూవీ బ్లాక్ బస్టరే.⇒ కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి, గొప్పగా తీస్తే సరిపోదు. థియేటర్స్‌కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి ప్రమోషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాం. వెంకటేశ్‌గారి లాంటి పెద్ద స్టార్ హీరో సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయ్యింది. నేను హీరోలకి ఫ్యాన్‌గానే ఉంటాను. రిలేషన్‌ని పాజిటివ్‌గా ఉంచుతాను కాబట్టి వాళ్ల నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.⇒ ‘దిల్’ రాజుగారితో ‘పటాస్’ సినిమాతో నా ప్రయాణం ఆరంభమైంది. రాజుగారు, శిరీష్ గారు అంటే నా కుటుంబం లెక్క. మాది పదేళ్ల ప్రయాణం. ఇక ఉమెన్ సెంట్రిక్‌గా ఒక స్పోర్ట్స్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ నేపథ్యంలో మూవీ చేస్తాను. ‘ఎఫ్ 4’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి కూడా ఫ్రాంచైజీలు చేసుకునే అవకాశం ఉంది. -
72 రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి.. నాలుగు నిమిషాలే వృథా!
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా రెండున్నర గంటల సినిమాను దాదాపు 3 గంటలకు పైగా నిడివితో షూట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా అయినా సరే ఎడిటింగ్‌లో అరగంట సీన్స్ అయినా ఎగిరిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే కావాల్సిన నిడివి మేరకు మాత్రం చిత్రీకరణ చేస్తారు. వారిలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడా లిస్ట్‌లోకి అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని కూడా ఎక్కించొచ్చు. ఎడిటింగ్‌కి అవకాశం లేకుండా ముందే లెక్కలు వేసుకొని సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాసాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. అది కూడా స్టార్ హీరో సినిమా. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie). ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి బరిలో..అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్(venkatesh) సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సంక్రాంతికి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో రెండు బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకటేశ్‌తో ఫోటోలు దిగిన 3 వేల మంది ఫ్యాన్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్ తన అభిమానులతో పోటోలు దిగారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విజయం కోసం చిత్ర యూనిట్ సరికొత్తగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. తాజాగా వెంకటేశ్ 3000 మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వినూత్నమైన ముక్కోణపు క్రైమ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి చిత్రాలతో పోటీ పడి వాటికి మించిన ప్రమోషన్స్‌తో ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. -
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్‌గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్‌లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్‌లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్‌లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకీ మామ
-
పెదవుల పైన మెరుపులు మెరిశాయే...
‘‘నా లైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు. -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే ఈ పాట కూడా మ్యూజికల్ హిట్‌గా నిలవనుంది.అనంత శ్రీరామ్ రచించిన ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఆలపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
-
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి.. టాలీవుడ్లో ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. పటాస్,రాజా ది గ్రేట్, ఎఫ్2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో ఈ చిత్రం విడుదలపై ప్రకటన రానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ప్రకటన రానుంది.అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ గుర్తు చేసుకున్నారు. వాళ్లతో సినిమా చేయడం తన లక్ అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్‌లో అనిల్- చిరుల సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇక చిరు ఇటీవలే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనిల్ సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. -
వెంకటేష్ బర్త్‌డే కానుక.. రెండో సాంగ్ ప్రోమో అదిరిపోయింది
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. -
స్టయిలిష్‌గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 -
డబ్బింగ్ స్టార్ట్
హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపిస్తారు.ఈ పోలీసాఫీసర్ భార్యగా ఐశ్వర్యా రాజేష్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. కాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. ‘‘ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో తొంభై శాతం సినిమా పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే డబ్బింగ్ ఆరంభించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే ఆ ఆనందంలో నిర్మాతలు.. సదరు హీరో, దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం. అయితే మూవీ రిలీజైన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా కారు బహుమతిగా ఇచ్చే నిర్మాతలు ఉంటారా? అంటే టాలీవుడ్లో ఉన్నారనిపిస్తోంది. ఆయనే సాహు గారపాటి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)అనిల్ రావిపూడి గత సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు రిలీజైంది. మరీ అద్భుతం కానప్పటికీ ఓ మాదిరిగా ఆడింది. ఇందులో బాలయ్య-శ్రీలీల.. తండ్రి కూతురు పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అప్పట్లోనే నిర్మాత సాహు గారపాటి.. అనిల్‌కి టయోటా వెల్ఫైర్ కారు బహుమతిగా ఇచ్చారు.తాజాగా ఇప్పుడు మళ్లీ అదే మోడల్ మరో కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర కోటిన్నర రూపాయలు పైనే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌తో సినిమా చేస్తున్నాడు. దీనికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ అనుకుంటున్నారు. పేరుకి తగ్గట్టే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ) -
అతిథి ఆన్ సెట్
వెంకటేశ్ సినిమా సెట్స్‌లో సందడి చేశారు బాలకృష్ణ. హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ట్రైయాంగిల్ క్రైమ్ డ్రామా చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే పొల్లాచ్చిలో ఈ సినిమాకు చెందిన ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. ఈ అతిథి తమ సెట్‌కి రావడంతో యూనిట్ సంబరపడిపోయింది. ఈ సందర్భంగా క్లిక్‌మనిపించిన ఫొటోలను షేర్ చేసింది చిత్రబృందం. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
నాటకం అమ్మలాంటిది – అనిల్ రావిపూడి
‘‘నాటకం అమ్మలాంటిది. సినిమా అనేది ఆ అమ్మకి బిడ్డలాంటిది. నాటకాల గురించి ఈ తరానికి చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. కానీ, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగాన్ని ఏలిన చాలామంది గొప్పనటులు ఉన్నారు. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకుని మంచి కాన్సెప్ట్‌తో తీసిన ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవం జరుపుకోవాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జు¯Œ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి అతిథిగా çహాజరయ్యారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు దిలీప్ ప్రకాష్. ‘‘కళ కోసం జీవితాలన్నీ అంకితం చేసిన 150 కుటుంబాలు ఉన్నాయి. వారి అంకితభావం చూసి ‘ఉత్సవం’ సినిమా తీశా’’ అని అర్జు¯Œ సాయి తెలిపారు. ‘‘ఉత్సవం’ చాలా మంచి సినిమా’’ అని సురేష్ పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబె¯Œ్స, లిరిక్ రైటర్ అనంతశ్రీరామ్, రైటర్ రమణ గోపిశెట్టి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
పొల్లాచ్చికి పోదాం
పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
ఆలస్యంగా మొక్కు చెల్లించిన దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శుక్రవారం (జూలై 5న) నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నాడు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడాడు. భగవంత్ కేసరి సినిమా తర్వాత శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలనుకున్నాం. అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ఆ మొక్కులు సమర్పించాం అని తెలిపాడు.సినిమాల గురించి తెలియజేస్తూ.. వెంకటేశ్‌తో ఓ సినిమా మొదలుపెట్టాం. ఆయనతో ఇది నా మూడో సినిమా. దిల్ రాజు బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది ఎఫ్ 4 కాదు.. మరో జానర్లో ట్రై చేస్తున్నాం. ఇది కామెడీ ఎంటర్టైనర్గా ఉండనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని పేర్కొన్నాడు. కాగా అనిల్ రావిపూడి గతేడాది భగవంత్ కేసరితో హిట్ అందుకున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ మూవీ లాంగ్ రన్లో దాదాపు రూ.140 కోట్లు రాబట్టింది.చదవండి: దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్ -
హీరో వెంకటేష్ భార్యగా ‘ఐశ్వర్య రాజేష్’ (ఫొటోలు)
-
వెంకీ సరసన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్. శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ వెంకీ సరసన మరో హీరోయిన్ కనిపించనుంది. తాజాగా కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ కథాచిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Welcoming on board, the talented @aishu_dil as the EXcellent Wife in #VenkyAnil3 ❤️Victory @VenkyMama #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official #SVC58 pic.twitter.com/YQy5RlmMDp— Anil Ravipudi (@AnilRavipudi) July 2, 2024 -
వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్‌రావిపూడి ప్రకటించారు.అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. -
కథ విన్నారా?
హీరో వెంకటేష్ నుంచి మరో కొత్త సినిమా కబురు వినే సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్‌సిరీస్ నెక్ట్స్ సీజన్స్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమా సెట్స్‌లో ఆయన జాయిన్ అవుతారని తెలుస్తోంది.కాగా ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీకి రైటింగ్ టీమ్‌లో పనిచేసిన నందు అనే వ్యక్తి ఓ కథను వెంకటేష్‌కి వినిపించడంతో, ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్ది మళ్లీ వెంకటేష్‌కి వినిపించనున్నారట నందు. అన్నీ కుదరితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. -
ముహూర్తం కుదిరింది
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను అధికారికంగా వెల్లడించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. మరోవైపు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారట వెంకటేశ్. దీంతో వెంకటేశ్–అనిల్‌ల కాంబినేషన్లోని సినిమా ప్రారంభోత్సవానికి జూలై మొదటివారంలో ముహూర్తం కుదిరిందని తెలిసింది. అదే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అలాగే ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్గా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
F4 పై అనిల్ రావిపూడి ఫోకస్..
-
యేవమ్ అంటే...
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ వికారాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. తెలంగాణ కల్చర్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. నేను మొదటిసారి పోలీసాఫీసర్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి’’ అన్నారు. ‘‘యేవమ్’ అంటే ‘ఇది ఇలా జరిగింది’ అని అర్థం. విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నలుగురు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథాంశం’’ అన్నారు ప్రకాశ్. -
ఆగస్టులో క్రైమ్ కామెడీ స్టార్ట్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ప్రధానంగా ఈ మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ షూటింగ్‌తో వెంకటేశ్ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తయ్యాక అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని సినిమా సెట్స్‌లోకి వెంకటేశ్ ఎంట్రీ ఇస్తారని ఊహించవచ్చు. -
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. మరోవైపు ఐపీఎల్లో ఈసారి హైదరాబాద్ జట్టు దంచికొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇస్తోంది. దీంతో జనాలు దృష్టి క్రికెట్ పైకి మళ్లింది. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రావడమే తగ్గించేశారు. ఈ క్రమంలోనే మొన్నీమధ్య ఓ సినిమా ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని కామెంట్స్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపాయి. ఇప్పుడు వాటిపై మళ్లీ ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రీసెంట్గా 'కృష్ణమ్మ' సినిమా ఈవెంట్‌కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి.. 'ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. సాయంత్రం థియేటర్లకు వచ్చి మూవీస్ చూడండి' అని కాస్త ఘాటుగానే చెప్పాడు. దీంతో సినిమాల కంటే ఐపీఎల్ బెస్ట్, సినిమాలు చూడకపోయినా కొంపలేం మునిగిపోవు అని నెటిజన్స్ రిటర్న్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు.'మే 19న డైరెక్టర్స్ డే వేడుకలు చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఈ మధ్య ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు మరో రకంగా జనాల్లోకి వెళ్లాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్‌ని కలిశాను. వేసవిలో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగా ఆడట్లేదని చెప్తే ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఐపీఎల్ చూడండి. సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తా. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు' అని అనిల్ రావిపూడి.. వివాదాస్పద కామెంట్స్‌కి పుల్‌స్టాప్ పెట్టేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి) -
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముసుగేసి గుద్దితే..ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నాడు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్‌కు స్టార్డమ్ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు.రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్అనిల్ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్డేట్ చెప్పాలని కొరటాల శివను, మహేశ్‌బాబుతో చేస్తున్న మూవీ జానర్ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్లో నాలుగు కొట్టమని కౌంటర్ వేశాడు. ఇది విని షాకైన అనిల్ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్‌మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్‌లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు! -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విక్టరీ వినోదం
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (ఈ చిత్రాల్లో వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘వెంకటేశ్‌గారితో మూడోసారి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో ఆరోసారి, భీమ్స్‌తో తొలిసారి.. 2025 సంక్రాంతికి ‘విక్టరీ వినోదం’తో కలుద్దాం’’ అని ఈ సినిమా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... ఈ ముగ్గురి పాత్రల చుట్టూ సాగే క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. -
వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే?
-
ఆరంభం అప్పట్నుంచేనా..?
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ్రపారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ టార్గెట్ అని సమాచారం. -
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్‌మీట్ (ఫొటోలు)
-
వెంకటేశ్‌కి జోడీగా...
హీరోయిన్గా మీనాక్షీ చౌదరి ప్రస్తుతం ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. తమిళ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, విశ్వక్ సేన్ పదో చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు ఈ యంగ్ బ్యూటీ. కాగా మీనాక్షీకి హీరోయిన్గా మరో సూపర్ చాన్స్ వచ్చిందని టాక్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత త్రిష పేరు వినిపించింది. తాజాగా మీనాక్షీ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. వెంకీ వంటి స్టార్ హీరో సినిమా కాబట్టి మీనాక్షీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్టేనని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇంకా.. కథ రీత్యా ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉందని, ఈ పాత్రలో రవితేజ లేదా బాలకృష్ణ కనిపిస్తారని భోగట్టా. -
ఆ హిట్ ఫ్రాంచైజీలోకి త్రిష.. జోడీ కుదిరిందా?
హీరో వెంకటేశ్, హీరోయిన్ త్రిష నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వీరిద్దరూ గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమో వెంకటేశ’(2010), ‘బాడీగార్డ్’(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ హిట్ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు తీసి, హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 4’ సినిమా ఉంటుందని ‘ఎఫ్ 3’ క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చింది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజే తాజాగా వెంకీ–అనిల్ కాంబినేషన్ లో మూడో సినిమా నిర్మించనున్నారట. ఈ మూవీలో హీరోయిన్గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంటే.. దాదాపు పుష్కరకాలం తర్వాత వెంకటేశ్–త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కించేది ‘ఎఫ్ 4’ సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
చిరు మూవీతో వెంకీ సాహసం.. F2 రిపీట్ అవుద్దా..!
-
సీక్వెల్ కోసం వెంకటేశ్– అనిల్ రావిపూడి ప్లాన్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల (వరుణ్ తేజ్ మరో హీరో) కోసం కలిసి పని చేసిన హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ కథను వెంకటేశ్‌కు వినిపించారట. ఈ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అయితే వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సినిమా ‘ఎఫ్ 4’ అవుతుందా? లేక వేరే కొత్త కథా? అనే విషయాలపై స్పష్టత రావాల్సింది. మరి... వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
3 సం|| వెండితెరకు మహేష్ బాబు దూరం
-
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘మెకానిక్’ పోస్టర్
మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్... ట్యాగ్ లైన్. ముని సహేకర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మునెయ్య(మున్నా) నిర్మిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 15 న విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశాడు. కాగా, ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ పాట యూట్యూబ్‌లో 8 మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండిండ్‌లో ఉంది. ఇదే సినిమా నుంచి రిలీజ్ అయినా ‘టులెట్ బోర్డ్ ఉంది నీ ఇంటికి’అనే మరోపాట 1.6 మిలియన్స్‌తో దూసుకెళ్తోంది. ఇలా విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోను వచ్చే డిసెంబర్ 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
భగవంత్ కేసరి మూవీ సక్సెస్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా కారును బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. #BhagavanthKesari Producers @Shine_Screens gifted a brand new Toyota Vellfire car to the sensational director @AnilRavipudi for the tremendous Success of #BlockBusterBhagavanthKesari 👌🔥#NandamuriBalakrishna @sahugarapati7 pic.twitter.com/wDeXaLfPs5 — manabalayya.com (@manabalayya) November 27, 2023 -
‘సౌండ్ పార్టీ’ ప్రతి పంచ్‌కి నవ్వాను: అనిల్ రావిపూడి
‘సౌండ్ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.ఈ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. ‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ సంజయ్ శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు. -
Bhagavanth Kesari Movie Success Meet: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
ఫ్యాన్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
-
Bhagavanth Kesari Success Meet: ‘భగవంత్ కేసరి’ మూవీ విజయోత్సవ యాత్ర (ఫోటోలు)
-
భగవంత్ కేసరికి సీక్వెల్? అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది. సోమవారం ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంద్భంగా అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా భగవంత్ కేసరి సినిమా కోసం తనతో కలిసి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదన్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా బరువును తనపై వేసుకుని నలిగిపోయానని, సీక్వెల్ గురించి తర్వాత చూద్దామని అన్నాడు. బాలయ్య బాబు శక్తినిస్తే అప్పుడు భగవంత్ కేసరి 2 తీస్తామని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, స్ట్రీమింగ్ అప్పటినుంచే! -
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్
హీరో బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమా.. నిన్న(గురువారం) థియేటర్లలో రిలీజైంది. మరీ అంత సూపర్ అని చెప్పలేం గానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య, శ్రీలీల యాక్టింగ్ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లకు పైనే గ్రాస్ వచ్చింది. దీంతో శుక్రవారం 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులోనే మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ విషయమై సారీ చెప్పాడు. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) ఇంతకీ ఏమైంది? భగవంత్ కేసరి సినిమాలో పోలీస్ అధికారి, ఖైదీ పాత్రల్లో బాలయ్య కనిపించాడు. అతడి పెంపుడు కూతురిగా శ్రీలీల నటించింది. గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల ఇందులో సెటిల్డ్‌గా యాక్ట్ చేసింది. ఎమోషన్స్ సీన్స్‌తో పాటు క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ కూడా చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర తండ్రిగా శరత్ కుమార్ కాసేపు కనిపించారు. జైలర్ రోల్ చేశారు. కానీ ఆయన చనిపోయారని టీవీలో చెప్పినప్పుడు సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అనిల్ రావిపూడిని అడిగారు. అనిల్ ఏం చెప్పాడు? 'పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. మీ సునిశీత పరిశీలన, సూక్ష్మ బుద్దికి హ్యాట్సాఫ్. జైలర్‌ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే. మా వాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇకపోతే సినిమా బ్లాక్‌బస్టర్ అంటున్నారు గానీ తొలిరోజు వసూళ్లలో చిరు 'భోళా శంకర్'ని బాలయ్య దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) భగవంత్ కేసరి విస్ఫోటనం🔥#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER💥 - https://t.co/rrWPhVwU6B Enjoy #BlockbusterDawath in cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5 — Shine Screens (@Shine_Screens) October 20, 2023 -
‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే మాస్. ఈ రెండింటికి భిన్నంగా ‘భగవంత్ కేసరి’ ఉంటుందని చిత్రబృందం మొదటి నుంచి వచ్చింది. దీంతో బాలయ్యను అనిల్ ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అందుకే ‘భగవంత్ కేసరి’పై బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ట్విటర్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ చాలా ఫ్లాట్‌గా ఉందని అంటున్నారు. నటన పరంగా బాలయ్య పర్వాలేదనిపించినా.. అనిల్ రావిపూడి కథనం సరిగా లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. శ్రీలీల అయితే తెరపై కొత్తగా కనిపించించిందని చెబుతున్నారు. Just Now Completed My show 🤩 Movie Mathram Excellent Ra ayya 💥💥 Thaman anna BGM ayithey Next Level🥵💥💥 Anil Anna New Version 🔥🔥 My Rating 3/5 #BhagavanthKesari #Balakrishna pic.twitter.com/5TxGl3Z7dY — Rebel Star (@Pranay___Varma) October 19, 2023 #BhagavanthKesari 🔥 I don’t care 👉#NBK #kcpd acting 👉#thaman BGM 👉#srileela pure innocent acting 👉different zoner script 👉 #AnilRavipudi direction👌Hittu bomma😍Kcpd babu🦁 @NBKTrends @MusicThaman @sreleelaa @AnilRavipudi @Nandamurifans pic.twitter.com/b2qNevmZgw — Shanmukh Koyyalamudi (@shanmukh_k_95) October 18, 2023 Anil Ravipudi gave a decent commercial film that’s not of typical Balayya style & not a typical Anil film either. Though a couple of ideas & emotions didn’t work👎 , majority action blocks were pure blast💥 so, Absolutely kakapoyina, to an extent KCPD🔥(2.75/5) #BhagavanthKesari pic.twitter.com/N4b1HZcVKC — Kittu (@Kalyanchowdaryy) October 18, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 #BlockBusterBhagavanthKesari 🔥💥 @AnilRavipudi Unanimous B L O C K B U S T E R 💥🔥 Hatrick for #Balayya 🥁🥁#JaiBalayya 🔥🤙🤙 Happy ga velli movie chudandi.. Balayya Never Before, Archakam🥁#Balayya iche High peaks 💥🦁#BhagavanthKesari 🤙🤙🥁🥁 BhagavanthKesariOnOct19th pic.twitter.com/5TVQXt2kUu — ROHIT CHOWDARY K 🇮🇳 (@ROHITCHOWDARYK2) October 18, 2023 #BhagavanthKesari Review: Subtle yet MASS!#Balayya telangana dialect🔥#BalaKrishna & #SreeLeela bonding👌🏻#AnilRavipudi Dialogues💥 Story is routine but #NBK subtle acting, emotions & underlying msg itself is a worth Good Family Watch! Rating:3.25/5#BhagavanthKesariReview pic.twitter.com/nYN3Ac637l — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 19, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 -
సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?
'భగవంత్ కేసరి' సినిమాతో బాలకృష్ణ.. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. కానీ 'లియో' దెబ్బకు బాలయ్య చిత్రానికి అనుకున్నంతగా హైప్ రాలేదు. బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు చిత్ర నిర్మాతలు ఓ విషయంలో నష్టపోయారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: విజయ్ 'లియో' దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తీసిన సినిమా భగవంత్ కేసరి. ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ ఓ మాదిరి అంచనాలే ఏర్పడ్డాయి. అక్టోబరు 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కోసం బాలయ్య 'దంచవే మేనత్త' పాటని రీమిక్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించాడు. రెండోవారం నుంచి ఈ పాటని సినిమాకు జోడీస్తామని అన్నాడు. కానీ ఇప్పుడీ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా 'భగవంత్ కేసరి' ప్రివ్యూ వేయగా.. సినిమా చూసినోళ్లు ఈ రీమిక్స్ పాట గురించి ప్రస్తావించారట. ఓవరాల్ మూవీలో ఇది సెట్ కాలేదని, అతికించినట్లు ఉందని అన్నారట. దీంతో ఈ పాటని సినిమాలో పెట్టే ఆలోచన పూర్తిగా విరమించుకున్నారట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈ సాంగ్ కోసం ఖర్చు చేసిన రూ.3.5 కోట్లు నిర్మాతలు నష్టపోయినట్లే. మరి ఇది నిజమా కాదా అనేది మరో వారం ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి
స్టార్ హీరోయిన్ శ్రీలీల వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా తన టాలెంట్‌తో డ్యాన్స్,నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే మాటకు చెక్ పెడుతూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నేడు నిలిచింది. ఓ వైపు యంగ్ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు 'భగవంత్ కేసరి'లో సీనియర్ హీరో బాలకృష్ణకు కుమార్తెగా నటించింది. ఇదొక్కటి చాలు ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో చెప్పడానికి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా తను నటించిదని ట్రైలర్లోనే అర్థం అవుతుంది. (ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ) తాజాగా శ్రీలీల, అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఎలాంటిదో రివీల్ చేశాడు. మొట్టమొదటిసారిగా, దర్శకుడు అనిల్ రావిపుడు తాను ఎప్పుడూ అందరితో పంచుకోని విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. స్టార్ హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్‌షిప్‌ను మొదటిసారి బయటపెట్టాడు. శ్రీలీల అమ్మగారు డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని అదే ఊరు తన అమ్మమ్మగారిదని అనిల్ తెలిపాడు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు సిస్టర్ వరుస అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుంది. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందూ అనిల్ణు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టించేదట. శ్రీలీల పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ఆమె పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే కానీ తన అమ్మమ్మ ఊరు అయిన పొంగులూరుకు ప్రతి ఏటా వస్తూనే ఉంటుందని అనిల్ తెలిపాడు. (అమ్మో ఏంటి ఈ అందం శ్రీలీల ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
-
Bhagavanth Kesari Press Meet: బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
Bigg Boss 7 : శ్రీలల మాటలకు సిగ్గుతో మొగ్గలేసిన అమర్దీప్
బిగ్‌బాస్ హౌస్‌లో సండే అంటే ఫన్ డే అన్నట్లే. వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్ రావడం.. వాళ్లతో కలిసి కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడడం.. చిలిపి ప్రశ్నలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్ చాలా సరదాగా గడిపోతుంది. ఈ వారం కూడా బిగ్‌బాస్ షోకి అతిథులుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, అందాల తార శ్రీలీల వచ్చారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరు బిగ్‌బాస్ షోకి వచ్చినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమతుంతుంది. బిగ్‌బాస్ రియాల్టీ షోకి అనిల్ రావిపూడి పెద్ద అభిమాన్ని. తన సినిమాలు ఉన్న లేకపోయినా. ప్రతి సీజన్‌కి మాత్రం వచ్చేస్తాడు. ఈసారి వచ్చి రావడంతో తనదైన పంచులతో ఇచ్చిపడేశాడు. పనిలో పనిగా.. సీజన్ సీజన్‌కి టీఆర్పీతో పాటు మీ గ్లామర్ కూడా పెరిగిపోతుందంటూ నాగార్జునను పొగిడేశాడు. హౌస్మేట్స్ గురించి చెబుతూ.. తేజ కాలేజీలో తన జూనియర్ అని.. బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాడు. ఇక శోభాశెట్టిని క్రాకర్ అని..అందరిని ఒక ఆట ఆడిస్తోందని చెప్పాడు. ఇక అమర్దీప్ లేచి.. ‘శ్రీలీల గారు మీరు ఏం చెప్పట్లేదండి’ అని అనగా..‘మీరు చాలా బాగున్నారండి’అని ఆమె చెప్పింది. అయితే మనోడికి అర్థం కాలేదేమో..సింపుల్‌గా థ్యాంక్యూ అండి అని కూర్చోబోయాడు. వెంటనే నాగార్జున కలగజేసుకొని..ఆమె ఎం చెప్పిందో అర్థమయిందా? నువ్వు చాలా బాగున్నావని చెప్పింది అని అనగా.. అమర్ సిగ్గుతో మొగ్గలేశాడు.