వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.
ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.
ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..
గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్‌లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.
The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥
ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now.
Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025
Comments
Please login to add a commentAdd a comment