one week
-
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
తనవాళ్లు చనిపోయారు అని తెలియక ..7రోజులపాటు సహజీవనం చేసాడు
-
ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత
హాంకాంగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉండడంతో యూ ట్యూబ్ కూడా ఆయన చానెల్ని వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ట్రంప్ తాజాగా పోస్టు చేసిన వీడియో తమ నిబంధనలకి వ్యతిరేకంగా ఉందని యూ ట్యూబ్ బుధవారం ట్వీట్ చేసింది. అయితే ఆ వీడియో ఏమిటన్నది స్పష్టంగా వెల్లడించలేదు. ‘‘డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ చానెల్లో హింసను ప్రేరేపించేలా వీడియోలు పోస్టు అవుతున్నాయని మాకు ఫిర్యాదులు అందాయి. ఆయన చానెల్లో కొన్ని వీడియోలను తొలగించాం. మొదటి హెచ్చరికగా వారం రోజులు నిషేధిస్తున్నాం’’అని ట్వీట్ చేసింది. యూట్యూబ్ నిబంధనల ప్రకారం మళ్లీ ఇలాంటి వీడియోలు పోస్టు చేస్తే రెండు వారాలు నిషేధం విధిస్తారు. మూడోసారి అదే తప్పు చేస్తే శాశ్వతంగా చానెల్ని తొలగిస్తారు. రాజ్యాంగాన్ని కాపాడదాం: మిలటరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అనుచరులు హింసాత్మక ఘటనలకు పాల్పడతారని ఆందోళనలు నెలకొన్న వేళ మిలటరీ అప్రమత్తమైంది. అమెరికా రాజ్యాంగాన్ని కాపాడడమే తమ బాధ్యతంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ రక్షణలో ఉన్న ప్రతీ ఒక్కరిపైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందంటూ మంగళవారం మిలటరీలో అత్యున్నత స్థాయి నాయకులు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశారు. అమెరికా ఆర్మీ ఇలా పిలుపునివ్వడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమెరికా మిలటరీ సీనియర్ జనరల్ మార్క్ మిల్లే, అన్ని బలగాల జాయింట్ ఛీప్స్ ఆఫ్ స్టాఫ్ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. ‘‘అమెరికా మిలటరీ ఎల్లప్పుడూ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతుంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తాం. ఇంటా, బయటా శత్రువుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము కట్టుబడి ఉన్నాం’’అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
మబ్బులు తాత్కాలికమే
నరసాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లావాసులు ఎండల్ని తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. బయటకు రావడానికి భయపడుతున్నారు. అత్యవసర పనులపై రోడ్డెక్కుతున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి జిల్లాలో మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 28వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ అది తాత్కాలికమేనని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. నైరుతి రుతు పవనాలు సమీపించే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేమంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నప్పటికీ.. మరో వారం రోజులపాటు వేడిగాలుల తీవ్రత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మూడేళ్లలో ఎప్పుడూ లేదు ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మన జిల్లాపై దీని తీవ్రత ఈ ఏడాది మరింత ఎక్కువైంది. జిల్లాలో ఇప్పటికే మూడేళ్లలో ఎన్నడూలేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 20 రోజుల్లో అత్యధికంగా 47 డిగ్రీలు, అత్యల్పంగా 29 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 రోజుల నుంచి సగటున 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత ఏడాది మే నెలలో ఇన్ని రోజులపాటు, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు లేవు. అప్పట్లో వేసవి సీజన్ మొత్తం తీసుకుంటే 40–47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు 11 రోజుల పాటే నమోదైనట్టు వాతావరణ శాఖ చెబుతోంది. 2014, 2015 సంవత్సరాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి. మొత్తంగా ఈ ఏడాది ఎండలు జిల్లా వాసులను మాడ్చేస్తున్నాయి. ఇప్పటికే వడదెబ్బకు గురై జిల్లాలో 50 మందికి పైగా మృతి చెందారు. ఇదిలావుండగా.. నైరుతి రుతుపవనాలు అండమాన్ ద్పీపాన్ని తాకాయి. ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మన జిల్లా వరకు వచ్చి.. నేల పూర్తిస్థాయిలో చల్లబడాలంటే జూన్ 10–15 తేదీల వరకు ఆగాలి్సందేనంటున్నారు. పెరిగిన తేమ శాతం వాతావరణంలో 20 రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమశాతం 65–70 మధ్య నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలను వడగాడ్పు, ఉక్కబోత ఇబ్బంది పెడుతున్నాయి. అనేకమంది డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గి.. ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనా ఇబ్బందిగానే ఉంటుందని చెబుతున్నారు. అలాంటప్పుడు చెమటలు తక్కువగా పట్టి వడగాడ్పు తీవ్రత పెరుగుతుంది. ఈ నెలలో 19, 20, 21 తేదీల్లో జిల్లా ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమశాతం 75–85 మధ్య ఉంటోంది. దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రజలు ఉక్కబోతకు గురై నీరసించి కంటిమీద కునుకులేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పెరిగిన ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభా వం చూపుతాయని నరసాపురం పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి చెప్పారు. చెమట, ఉక్కబోతతో కూడిన వేడి గాలుల ప్రభావం వల్ల ఆస్త్మా రోగులు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వడగాడ్పుల బారిన పడితే వయసు, వ్యాధులతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తాయన్నారు ఉక్కబోత ఎక్కువ పగటిపూట గాలిలో తేమశాతం పెరగడం వల్ల ఉక్కబోత ఎక్కువైంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కావచ్చు. తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే వడగాడ్పుల తీవ్రత పెరుగుతుంది. ఏదేమైనా మరో వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో అల్పపీడనాలకూ ఆస్కారం కనిపిస్తోంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొద్దిపాటి వర్షాలు పడొచ్చు. ఏదేమైనా ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే.. ఈనెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయంటున్నారు. – ఎ.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం -
వారం రోజుల్లో కొత్త కమిషనర్..!
అనంతపురం న్యూసిటీ : మరో వారం రోజుల్లో నగరపాలక సంస్థకు నూతన కమిషనర్ రానున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరపాలక సంస్థలో పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపుగా పది మంది కమిషనర్లు మారారు. గ్రూపు రాజకీయాల నడుమ ఇక్కడ పని చేయాలంటే హడలిపోతున్నారు. దీంతో ఈ సీటులో వచ్చేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏపీఎండీపీలో ప్రాజెక్టు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మూర్తిను కమిషనర్‌గా పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరో వారం రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని డీఎంఏ వర్గాలు తెలిపాయి. మంత్రి నారాయణ పేషీ నుంచే జీఓను విడుదల చేసి కమిషనర్‌ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి, గ్రూపు తగాదాలు సీఎం దృష్టికి Ðð వెళ్లాయి. పరిపాలనపరంగా ప్రజాప్రతినిధులు అతిగా నగరపాలక సంస్థపై జోక్యం చేసుకోకూడదని ఇద్దరు ప్రజాప్రతినిధులకు అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులపై దాడులు, అవినీతితో పార్టీ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని అధిష్టానం సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరోసారి కమిషనర్‌పై ఎవరైనా దూకుడుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలుంటాయని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. నూతనంగా బాధ్యతలు తీసుకునే అధికారి పాలకుల ఒత్తిళ్లకు ఏ మేరకు తట్టుకుంటారో వేచి చూడాలి. -
కుమ్ముడు అంటే.. ఇదేనట!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ఖైదీ నెం.150 విడుదలకు ముందే సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని మొదటి ' అమ్మడు-కుమ్ముడు' పాట అప్రతిహతంగా దూసుకుపోతోంది. యూ ట్యూబ్ లో రికార్డులను తిరగ రాస్తోంది. తాజాగా 60 లక్షల (6 మిలియన్ల) హిట్లను సాధించింది. ఈ మేరకు లహరి మ్యూజిక్ అధికారిక ట్విట్టర్ లో తన సంతోషాన్ని షేర్ చేసింది. కుమ్ముడు అంటే ఇదే..ఒక వారంలో 60 లక్షల వ్యూస్ అంటూ ట్వీట్ చేసి అనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది మరోవైపు ఈ మూవీలోని మూడవ పాటను విడుదలచేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. లహరి ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ శుభవార్త అందించారు. మెలోడీ సాంగ్ గా మెగా అభిమానులకు సంతోషాన్ని పంచనున్న ఈ పాట డిసెంబర్ 28 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. ద మెలోడీ ఆఫ్ ద మౌసం అంటూ ట్వీట్ చేశారు. This is what we call KUMMUDU... More than 6 Million views in one week! ROCKSTAR @ThisIsDSP Musical.#KhaidiNo150 https://t.co/unK7XcJkLj pic.twitter.com/MIJm7dbaUy — Lahari Music (@LahariMusic) December 26, 2016 -
వారంపాటు నగదు విత్‌డ్రా చేయం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు.. ఆపై నెలారంభం కావడంతో సామాన్యులకు కొంత మేరకైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజులదాకా తమ జీతాలకు సంబంధించిన డబ్బును తమ ఖాతాల నుంచి తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. న్యాయమూర్తులందరూ గురువారం స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఉద్యోగులకు హైకోర్టులోని ఎస్బీహెచ్లో జీతాల ఖాతాలున్నాయి. ఒక్కో వ్యక్తి వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో 22 మంది న్యాయమూర్తులు తమ తమ ఖాతాల నుంచి ఆ మొత్తాలను ఉపసంహరించుకుంటే ఉద్యోగులకు నగదు సమస్యలు ఏర్పడతాయని, అందువల్ల ఓ వారం రోజులపాటు నగదు ఉపసంహరణ చేయకుండా ఉంటే కనీసం హైకోర్టు ఉద్యోగులకు కొంత మేరైనా సాయం చేసినట్లు ఉంటుందని భావించిన న్యాయమూర్తులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు హైకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటెండర్లకు రూ.10వేలు, మిగిలిన ఉద్యోగులు, అధికారులకు రూ.8వేల నగదు అందచేయనున్నది. -
సాంకేతిక సమస్యతో ఈ–ఆఫీస్‌కు బ్రేక్
అనంతపురం అర్బన్ : సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ–ఆఫీస్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వారం రోజులుగా ఈ–ఆఫీసు సేవలు ఆగిపోయాయి. కలెక్టరేట్లో ఫైళ్ల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ–ఆఫీసుని అమలు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే సాంకేతిక సమస్య రావడంతో ప్రక్రియ నిలిచినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి ఫైలు ఈ– ఆఫీసు ద్వారానే రావాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. మాన్యువల్‌గా పంపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే వారం రోజులుగా ఈ–ఆఫీసు ప్రక్రియ నిలిచిపోవడంతో ఫైళ్లు ఎలా పంపించాలో అర్థం కాక సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఫైళ్లను మాన్యువల్‌గా సిద్ధం చేసి తమ వద్ద ఉంచుకున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ–ఆఫీసు ద్వారా వస్తేనే పరిశీలిస్తామని చెప్పడంతో వాటిని సిబ్బంది తమ వద్దనే ఉంచుకున్నారు. ఇదే పరిస్థితి ఈ–ఆఫీసు అమలు చేస్తున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉన్నట్లు తెలిసింది. ఈ–ఆఫీసు నిలిచిపోయిన విషయంపై అధికారులను వివరణ కోరితే ప్రతి రోజు రాజధానిలోని అధికారులతో మాట్లాడుతున్నామని, మంగళవారం కూడా ఇదే విషయంపై మాట్లాడామని, ఒకటి రెండు రోజులు సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారని సమాధానమిచ్చారు. -
వారం రోజులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి నెల్లూరు(బారకాసు): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో వారం రోజుల పాటు ‘తిరంగా’ పేరుతో వేడుకలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని అన్ని వర్గాల ప్రజల్లో నింపేందుకు అన్ని మండల కేంద్రాల్లో జాతీయ జెండా చేతపట్టి ఈ తిరంగా యాత్రలను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల అనుగుణంగా పార్టీ అవసరాల మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ఎవరైనా సరే తమ పార్టీలో చేర్చుకోవాలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి జిల్లాకు ఒక్కో కేంద్ర మంత్రి చొప్పున మొత్తం 13 మంది కేంద్ర మంత్రులతో ఆయా జిల్లా కేంద్రంలో సందర్శించి కార్యకర్తల, మేధావుల సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఏలూరులో రైతు ర్యాలీ, కడపలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. çబీజేపీ నేతలు సుధాకర్‌రెడ్డి, మధు, శేషారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఏడు రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో నిర్ణయించారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశం ముగిసింది. శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న వైఎస్ఆర్ సిపి డిమాండ్‌కు ప్రభుత్వం వ్యతిరేకత ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. సమైక్య తీర్మానం డిమాండ్‌కు సమావేశంలో మద్దతు లభించలేదు. కాంగ్రెస్, టిడిపి నేతలు మౌనం వహించారు. జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాతోపాటు దివంగత నేతలకు రేపు అసెంబ్లీలో నివాళులు అర్పిస్తారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్‌బాబు, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ప్రభుత్వచీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ సిపి తరపున వైఎస్ విజయమ్మ, శోభానాగిరెడ్డి, సిపిఎం తరపున జూలకంటి రంగారెడ్డి, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్, సీపీఐ నుంచి గుండా మల్లేష్, బీజేపీ తరఫున లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నారు.