కుమ్ముడు అంటే.. ఇదేనట! | This is what we call KUMMUDU... More than 6 Million views in one week! | Sakshi
Sakshi News home page

కుమ్ముడు అంటే.. ఇదేనట!

Published Mon, Dec 26 2016 6:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

కుమ్ముడు అంటే.. ఇదేనట!

కుమ్ముడు అంటే.. ఇదేనట!

 హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ఖైదీ నెం.150  విడుదలకు ముందే సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల  విడుదలైన ఈ సినిమాలోని మొదటి ' అమ్మడు-కుమ్ముడు' పాట అప్రతిహతంగా దూసుకుపోతోంది.  యూ ట్యూబ్ లో రికార్డులను తిరగ రాస్తోంది. తాజాగా 60 లక్షల  (6 మిలియన్ల) హిట్లను   సాధించింది. ఈ మేరకు లహరి మ్యూజిక్   అధికారిక  ట్విట్టర్ లో తన సంతోషాన్ని షేర్ చేసింది.  కుమ్ముడు అంటే ఇదే..ఒక వారంలో 60 లక్షల వ్యూస్  అంటూ  ట్వీట్ చేసి అనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది

మరోవైపు ఈ మూవీలోని  మూడవ పాటను విడుదలచేసేందుకు చిత్ర  యూనిట్  సిద్ధమవుతోంది. లహరి ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన సంగీత దర్శకుడు   దేవి శ్రీ ప్రసాద్ ఈ శుభవార్త అందించారు.  మెలోడీ  సాంగ్ గా    మెగా అభిమానులకు సంతోషాన్ని పంచనున్న ఈ పాట డిసెంబర్ 28 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు  ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు.  ద మెలోడీ ఆఫ్ ద మౌసం అంటూ ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement