
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) నటించిన ‘విశ్వంభర’(Vishwambhara) నుంచి రాములోరి సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలోని తొలిపాటను నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. శ్రీరాముడు, సీతమ్మల గొప్పతనం చెబుతూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అందుకు ఎమ్‌ఎమ్ కీరవాణి(MM Keeravaani) మధురమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ పాటను శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు.
ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ లీడ్ రోల్‌లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారని తెలుస్తోంది. నిమాను జూలై 24న విడుదల చేస్తారని సమాచారం.