M. M. Keeravani
-
హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!
ఉపాసన- రామ్ చరణ్ ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో చేరిన మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తమ ముద్దుల కూతురి పేరును క్లీంకారగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో వారసురాలు అడుగు పెట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా ) అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు కీరవాణి బర్త్‌డే సందర్భంగా ఉపాసన వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫోటోను పంచుకున్నారు. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్‌లో టెన్నిస్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆస్కార్ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. (ఇది చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!
1993లో విడుదలై జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ బ్రహ్మాండ చిత్రానికి నిర్మాత కె.టి.కుంజుమోన్. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. (ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా) కాగా 30 ఏళ్ల తరువాత కేటీ కుంజుమోన్ జెంటిల్మెన్–2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని ఎ.గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ నటుడు సేతన్ శీను కథానాయకుడిగా నటించనున్న ఇందులో నయనతార అనే నూతన నటి నాయకిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జెంటిల్మెన్ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఇప్పటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి జెంటిల్మెన్–2 చిత్రానికి సంగీతాన్ని అందించనుండం విశేషం. (ఇది చదవండి: ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్) అవును తమిళంలో మరకతమణి పేరుతో ఇంతకుముందు కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి చాలా గ్యాప్ తరువాత మళ్లీ జెంటిల్మెన్ –2 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా ఈ చిత్ర దర్శకుడు గోకుల్‌కృష్ణ ఇటీవల హైదరాబాదుకు వెళ్లి కీరవాణికి కథను వినిపించారట. కథ అద్భుతంగా ఉందని కీరవాణి ఆయన్ని ప్రశంసించడంతో పాటు నిర్మాత కేటీ కుంజుమోన్‌కు ఫోన్ చేసి వచ్చే నెల నుంచి జెంటిల్మెన్–2 చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభిద్దామని తెలిపినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కేటీ కుంజుమోన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. -
ఆర్ఆర్ఆర్ మరో ఘనత.. అంతర్జాతీయ అవార్డులు కైవసం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా లాస్ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికయ్యారు. మరోవైపు బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డు గెలుచుకున్నారు. నిర్మాణ సంస్థలు, టాలీవుడ్ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం) ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో స్పాట్లైట్ అవార్డును కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది. జపాన్, అమెరికాలోనూ విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. Our very own @MMKeeravaani Garu won the prestigious @LAFilmCritics award for the Best Music Director🥳 Our utmost gratitude to the jury for recognising #RRRMovie’s chartbuster album & background score. 🎶🎼 pic.twitter.com/a9KGTsb73j — RRR Movie (@RRRMovie) December 12, 2022 -
జ్ఞానోదయం అయింది!
సినిమాకి రీక్యాప్‌లా అసలేం జరిగిందంటే... ‘బాహుబలి–2’ ప్రీ–రిలీజ్ వేడుక గత నెల 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అన్ని కళ్లూ ఆ వేడుకను చూడాలనుకున్నాయి. అదే జరిగింది. అలాగే అన్ని నోళ్లూ ఆ రోజు కీరవాణి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నా యి. ‘‘నేను ఎక్కువగా బ్రెయిన్లెస్ దర్శకులతో పని చేశా. వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది’’ అని ఆ రోజు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నట్లే, ఆ అభిప్రాయాలను విమర్శించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. ‘కీరవాణిగారూ.. ఎందుకయ్యా మీకు ఇవన్నీ..’ అంటూ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఇతర ప్రముఖులెవరైనా కీరవాణికి సలహాలిచ్చారేమో. అందుకే సోమవారం ట్విట్టర్లో కీరవాణి ఈ విధంగా స్పందించారేమో! ► మీ సలహా తప్పకుండా పాటిస్తా తమ్మారెడ్డి భరద్వాజ్‌గారూ... థ్యాంక్స్.. ఒక ట్వీట్లో ‘మోస్ట్లీ’ అనే పదం వాడాను. అది చాలామందిని బాధపెట్టింది. కానీ, టీబీ (తమ్మారెడ్డి భరద్వాజ్) వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్‌ను తొలగించాను. ►మనం ఎప్పటికీ విద్యార్థులమే.. తప్పులు చేస్తుంటాం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు. ► గౌరవనీయులైన దర్శకులందరూ మేథావులని సడన్‌గా నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవరైనా తెలివితక్కువవారు ఉన్నారంటే.. అది నేనేనేమో! ► నేను తప్ప అందరూ సృజనాత్మకత కలిగినవారే. ఎంత ఎదిగినా అందరూ ఒదిగి ఉంటున్నవారే. ► నాకు ఎవరో ఒక నిఘంటువు పంపారు. అందులో పొగరుకి ‘ఎమ్.ఎమ్.కె’ (అంటే ఎం.ఎం. కీరవాణి) అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతాను. ► ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవారు. వారితో పనిచేసేందుకు నేను తహతహలాడుతున్నాను. కానీ, నేను ఓల్డ్ బ్రెయిన్లెస్ కంపోజర్‌ని కాబట్టి, అవకాశాలు తక్కువ వస్తాయనుకుంటున్నా. ► కేవలం ఐదు నిమిషాల్లోనే బుర్ర లేని నా మతిని తమ్మారెడ్డి భరద్వాజ్ వాష్ చేశారు. ► ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ► తమ్మారెడ్డి భరద్వాజ్‌గారికి మళ్లీ థ్యాంక్స్. త్యాగయ్యగారికి ధన్యవాదాలు. ► నాకు పాటల రచయితలందరూ ఇష్టమే. ఎంతో కష్టపడి వాళ్లు రాస్తున్న పాటలంటే ఇష్టమే. వాళ్లను ఎలా మరచిపోయాను? (నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా). ► వేటూరిగారికి 100 మార్కులు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి 90, మా నాన్నగారికి 35, నాకు 10 మార్కులేనని నా అభిప్రాయం. మిగతా వారందరూ 11 మార్కుల నుంచి 89 మార్కుల మధ్యలో ఉంటారు.. ► ఇటీవల సాయిగారు టీవీ ప్రోగ్రామ్ చూశారు. ఆ ప్రోగ్రామ్‌లో టాలీవుడ్లో కంపోజర్స్ కొరత ఉందని అన్నారు. ఆ మాటలను నేను వ్యతిరేకించాను. ఆయన్ను ఎడ్యుకేట్ చేశాను. ► నిజానికి రైటర్స్ కొరత అధికంగా ఉంది. వాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారు. ► తన 30 ఏళ్ళ అనుభవంలో మా నాన్నగారు నాకు 20 పాటలకంటే తక్కువగా రాశారు. ఎందుకంటే ఆయన అవుట్‌సైడర్ కదా. నేను బంధు ప్రీతిని సపోర్ట్ చేస్తాను. చంద్రబోస్‌గారు నాకు బావ. ఆయన నాకోసం చాలా పాటలు రాశారు. (వ్యంగ్య ధోరణిలో) ► నెపోటిజమ్‌ను (బంధు ప్రీతిని) నేను నమ్ముతాను. వసుధైక కుటుంబాన్ని ప్రోత్సహిస్తాను. ఒకవేళ అది తప్పయితే నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి. ► రాజమౌళి నా మీద కోపంగా ఉన్నాడు. ‘బాహుబలి–2’ వర్క్‌ని కంప్లీట్ చేయమని రాజమౌళి తొందరపెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా. ► అనంత శ్రీరామ్ పాటలు రాయడం మానేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాటలు రాస్తున్నారు. దాంతో ప్రతిభ ఉన్న రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ► నిజమే... తెలుగు లిరిక్స్ అంపశయ్యపై లేవు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు. ► నీతి వాక్యాలు, దేశభక్తి పాటలే రాయమని మాత్రమే దర్శకులు తనను అడుగుతున్నారని అనంత శ్రీరామ్ చెప్పాడు. ► డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్స్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్.. వీళ్లంతా రాసేస్తున్నారని అనంత శ్రీరామ్ అన్నాడు.