1993లో విడుదలై జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ బ్రహ్మాండ చిత్రానికి నిర్మాత కె.టి.కుంజుమోన్. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
(ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా)
కాగా 30 ఏళ్ల తరువాత కేటీ కుంజుమోన్ జెంటిల్మెన్–2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని ఎ.గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ నటుడు సేతన్ శీను కథానాయకుడిగా నటించనున్న ఇందులో నయనతార అనే నూతన నటి నాయకిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జెంటిల్మెన్ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఇప్పటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి జెంటిల్మెన్–2 చిత్రానికి సంగీతాన్ని అందించనుండం విశేషం.
(ఇది చదవండి: ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్)
అవును తమిళంలో మరకతమణి పేరుతో ఇంతకుముందు కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి చాలా గ్యాప్ తరువాత మళ్లీ జెంటిల్మెన్ –2 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా ఈ చిత్ర దర్శకుడు గోకుల్‌కృష్ణ ఇటీవల హైదరాబాదుకు వెళ్లి కీరవాణికి కథను వినిపించారట. కథ అద్భుతంగా ఉందని కీరవాణి ఆయన్ని ప్రశంసించడంతో పాటు నిర్మాత కేటీ కుంజుమోన్‌కు ఫోన్ చేసి వచ్చే నెల నుంచి జెంటిల్మెన్–2 చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభిద్దామని తెలిపినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కేటీ కుంజుమోన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment