music director
-
రాజా... రాజాధిరాజా...
‘టిక్... టిక్... టిక్...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా (Ilayaraja ) ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం (Silence) ఉంచాడు. ‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు (music maestro) గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్‌తో మొదలైంది. హీరో గిటారిస్ట్. క్లయిమాక్స్ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి. పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్ మోతతో స్టేజ్ ఊగిపోయేలా ప్రిలూడ్ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్‌కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.తెల్లవారే లేచి, కాస్త టీ కొట్టి, హైదరాబాద్ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్పటికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్. 1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రావడం రావడమే కొత్త సౌండ్‌ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది. ఒకరోజు సాయంత్రం వాకింగ్‌కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు. చదవండి: వాక్కాలుష్యం.. మాటల గురించి కాస్త మాట్లాడుకుందాంప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం! చదవండి: ఆ రెండూ ఉంటే.. కావాల్సినవన్నీ ఉన్నట్టేరాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనర్లైనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా! -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫోటోలు)
-
కొందరిని నమ్మితే మోసం చేశారు: ఎస్ఎస్ తమన్
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్ తన కెరీర్ గురించి మాట్లాడారు. కొందరిని నమ్మి తాను కూడా మోసపోయానని వెల్లడించారు. తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. మన జీవితంలో చాలామందిని నమ్ముతామని.. కానీ ఏదో ఒక సమయంలో మోసపోతామని తెలిపారు. నా జీవితంలో కూడా అలాంటి అనుభవం ఎదురైందని అన్నారు. చాలావరకు డబ్బులు పోగొట్టుకున్నానని తమన్ వెల్లడించారు.తమన్ మాట్లాడుతూ.. ' నా కెరీర్ నాకు జీవిత పాఠాలు చాలా నేర్పింది. కొందరిని నమ్మి చాలా డబ్బులు కూజా పొగొట్టుకున్నా. నేను నమ్మడం వల్లే నన్ను మోసం చేశారు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పనిలో ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే గ్రౌండ్లోకి అడుగుపెడతా. మాకంటూ ఒక స్పెషల్ టీమ్ ఉండాలని భావించేవాడిని. స్టార్ క్రికెటర్లు ఆడిన మైదానంలో ఆడాలనేది నా కోరిక. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగం కావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌కు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
‘తండేల్’కి దేవిశ్రీని తీసుకోవద్దనుకున్నా.. కానీ.. : అల్లు అరవింద్
సినిమా ఆడాలంటే..దమ్మున్న కథ కావాలి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడు. అందులో డౌటే లేదు. కానీ అది ఎంత మంచి కంటెంట్ అయినా సరే.. ప్రేక్షకులకు రీచ్ కాకపోతే అంతే సంగతి. అందుకే రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, టీజర్లను విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు మేకర్స్. రిలీజ్‌కు ముందు..రిలీజ్ తర్వాత కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేంది సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతం బాగుంటే చాలు సినిమా సగం హిట్టయినట్టే. అందుకే సంగీత దర్శకుల విషయంలోనూ నిర్మాతలు ఆచి తూచి అడుగేస్తారు. జానర్‌ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు. ఇక ప్రేమ కథలకు పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). లవ్‌స్టోరీ చిత్రాలకు ఆయన అందించే పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా.. హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా తండేల్(Thandel) చిత్రానికి కూడా దేవి అలాంటి పాటలే అందించాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచాయి. హైలేస్సో హైలెస్సా.. సాంగ్ అయితే అంతటా మార్మోగుతుంది. అలాంటి చాట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదట. అసలు ఈ చిత్రానికి అతన్ని తీసుకోవద్దని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారట. బన్నీ చెప్పడంతోనే తండేల్ చాన్స్ డీఎస్పీకి వచ్చిందట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని చెప్పారు.దేవి సంగీతం వద్దని చెప్పానుతండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిప్రసాద్‌ని పెట్టుకుందామని మా టీమ్ చెబితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే..పుష్ప2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. దేవి పుష్ప 2కి సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకుంటే మన సినిమాకు న్యాయం చేయలేడని టీమ్‌కి చెప్పాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలనుకున్నాం.బన్నీ చెప్పడంతో..దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ల నాన్న(సత్య మూర్తి) నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ పుష్ప 2 లాంటి సినిమాకు పని చేస్తున్నప్పడు.. ఇంకో సినిమాకు న్యాయం చేయలేడేమో అనిపించింది. దేవిని వాళ్లే(పుష్ప టీమ్) లాగేసుకుంటారు. మాకు సమయం కేటాయించడు అనుకున్నాం. అయితే తండేల్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరి తీసుకోవాలనేది అర్థం కాలేదు. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్‌కి ఈ విషయం చెప్పాను. ‘ఎవరి తీసుకోవాలో తెలియడం లేదు. దేవిని తీసుకుంటే.. మీరు(పుష్ప 2) ఇబ్బంది పెడతారు. అతన్ని తీసుకోవాలంటే నిన్ను(బన్నీ), దర్శకుడు(సుకుమార్) ఇలా అందరిని అడగాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నాను’అని చెప్పా. వెంటనే బన్నీ.. ‘దేవినే బెస్ట్ చాయిస్. లవ్‌స్టోరీలకు దేవిని మించినోడు లేడు..అతన్నే తీసుకోండి’ అని చెప్పాడు. దీంతో మేం దేవిని సంప్రదించాం’ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, చందు మొండేటి దర్వకత్వంలో నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ.. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్కి కేరాఫ్ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Gopi Sundar Official (@gopisundar__official) -
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి
హైదరాబాద్: క్రీడలు శారీరక దేహ దారుడ్యానికే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2025 జాతీయ సదస్సు హెచ్ఐసీసీలో నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి మహాలింగప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్యం జీవితంలోని ఎన్నో టెన్షన్స్ను, పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సౌత్ జోన్ సభ్యులు విజేతలుగా నిలిచారు. వారికి థమన్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అశ్విన్ బాబు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. కిషన్, సెక్రటరీ డాక్టర్ ఉమా శంకర్, కోశాధికారి డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ విశాల్ ఆకుల, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్
కళ్లముందు కూతుర్ని కోల్పోవడం కంటే విషాదం మరొకటి ఉంటుందా? ఆ కడుపుకోతను సంగీత జ్ఞాని ఇళయరాజా అనుభవిస్తున్నాడు. గతేడాది జనవరి 25న ఆయన కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా కూతుర్ని తలుచుకుని ఇళయారాజా భావోద్వేగానికి లోనయ్యాడు.నిర్లక్ష్యం చేశా..ఇళయరాజా (Ilayaraja) మాట్లాడుతూ.. నేను ఎంతగానో ప్రేమించే నా కూతురు దూరమై ఏడాదవుతోంది. తను మాతో లేదన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. తను నాపై ఎంత ప్రేమ కురిపించేది.. ఎంత ఆప్యాయత చూపించేదన్న విషయం తనను కోల్పోయాకే తెలుసుకున్నాను. నా జీవితమంతా సంగీతానికే ధారపోశాను. ఈ క్రమంలో నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. వారికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ చేదు నిజం నన్ను కుంగదీస్తోంది.సంగీతంతో స్వాంతనసంగీతం ఎంతోమందికి ఓదార్పునిస్తుందంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అదే సంగీతం నాకూ కొంత స్వాంతన కలిగిస్తోంది. ఫిబ్రవరి 12న నా కూతురి పుట్టినరోజు. ఆరోజు నా కూతురికి నివాళిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నా సన్నిహితులను, ఇండస్ట్రీ మిత్రులను అందరినీ ఈ ప్రోగ్రామ్‌కు ఆహ్వానిస్తాను. నా కూతురు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. (చదవండి:సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)సింగర్‌గా భవతారిణిఇళయరాజాకు కూతురు భవతారిణితో పాటు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా అని ఇద్దరు కుమారులు సంతానం. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) మూవీ ద్వారా సింగర్‌గా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకుంది. తెలుగులోనూ పలు పాటలు పాడింది. ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ అనే పాటను ఆలపించింది.మ్యూజిక్ డైరెక్టర్‌గానూ..‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఇదే తన తొలి సినిమా. దాదాపు పాతిక చిత్రాల్లో సాంగ్స్ పాడగా పది సినిమాలకు సంగీత దర్శకురాలిగా పని చేసింది. శబరిరాజ్ అనే వ్యక్తితో భవతారణి వివాహం జరిగింది.. కానీ, వీరికి సంతానం లేదు.చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
కంగువా బీజీఎంపై విమర్శలు.. దేవీశ్రీ ప్రసాద్ రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచిందిఅయితే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదురయ్యాయి. కొన్ని సీన్స్‌లో విపరీతమైన బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొట్టారని దేవిశ్రీ ప్రసాద్‌పై కొందరు నెటిజన్స్ విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై డీఎస్పీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్‌లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం' అని అన్నారు.ఆస్కార్ బరిలో కంగువా..అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన కంగువా ఆస్కార్-2025 నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆరు చిత్రాలు ఎంపికవ్వగా అందులో కంగువా కూడా ఉంది. ఈ ఏడాది అందించనున్న 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితా జనవరి 19న రానుంది. -
విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్
తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది మేలో విడిపోయారు. బాల్య స్నేహితులైన వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్‌గా విడిపోవడానికి సిద్ధపడటం అభిమానులను షాక్‌కు గురి చేసింది. విడాకులు తీసుకున్నజంట11 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్, సైంధవి జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది.మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, హీరోగా..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా, హీరోగానూ ఫామ్‌లో ఉన్నాడు. సైంధవితో కలిసి తమి ఎన్నో పాటలు పాడాడు. ఈయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, యుగానికి ఒక్కడు, పందెం కోళ్లు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, రాజా రాణి, ఆకాశమే నీ హద్దురా.., సార్, టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్, మట్కా.. ఇలా పలు సినిమాలకు సంగీతం అందించాడు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం జీవీ ప్రకాశ్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్‌గా పదికి పైగా సినిమాలున్నాయి. హీరోగా ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించిన జీవీ ప్రస్తుతం కథానాయకుడిగా మరో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. Omg ❤️🥺 bt the professionalism btwn them is! 🥹#GVPrakash #gvprakashconcert #GVPrakashKumar #Saindhavi pic.twitter.com/jgarTEbmY9— Mr.D 🤍 ᵈⁱˡˡᵘ (@dilson_raj) December 9, 2024 உங்களுக்கு என்ன நா Rights இருக்கு 🥲🥲😭 எங்க அழ வைக்க @gvprakash #GVPrakash #GVPrakash @singersaindhavi #Saindhavi pic.twitter.com/RCXgse4wFO— 𝕽𝖔𝖇𝖎𝖓 𝕮𝖍𝖗𝖎𝖘 😈🛡️🗡️ (@robinthebadguy) December 8, 2024Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024 Thanks #Malaysia kuala lampur for making my live in concert a BLOCKBUSTER hit …. @dmycreationoffl pic.twitter.com/SUigJNaVwK— G.V.Prakash Kumar (@gvprakash) December 8, 2024 చదవండి: టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా.. -
చెన్నైలో దేవీశ్రీప్రసాద్ కామెంట్స్.. స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. రోజులు గడిచే కొద్ది ఆడియన్స్‌లో మరింత ఆతృత పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు.అయితే ఈ ఈవెంట్లో మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు నాపై ప్రేమతో పాటు ఫిర్యాదులు కూడా ఎక్కువే ఉన్నాయంటూ మాట్లాడారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుందని డీఎస్పీ మాట్లాడారు.అయితే దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. నితిన్ రాబిన్‌హుడ్ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మా వాళ్లకు నాపై లవ్ ఉంటది.. దాంతో పాటు కంప్లైంట్స్ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది సార్? మాకైతే దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదని రవిశంకర్ అన్నారు. మీరేదో రాసినంత మాత్రాన మేమంతా ఒక్కటే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. డీఎస్పీ ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం.. మేము ఉన్నంతసేపు ఆయన సినిమాలు చేస్తారు.. అందులో డౌటే లేదని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
తొమ్మిదేళ్లకే ఇండస్ట్రీలోకి.. ఆరో తరగతిలోనే చదువుకి పుల్‌స్టాప్.. తమన్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
నా కల నెరవేరింది: తమన్
‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్‌గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి. ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్‌ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు. -
మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని శబ్దాలయ వెనుక సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తికి కేటాయించిన స్థలంలో నిరి్మంచిన అక్రమ నిర్మాణాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. చక్రవర్తికి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిరి్మంచుకునేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అయితే కేటాయించిన స్థలంలో ఏడాది లోపు ఆ ఉద్దేశాన్ని బహిర్గతపరుస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి మాత్రం తనకు కేటాయించిన స్థలంలో పదేళ్లు దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు. ఆయన తనయుడు కూడా సదరు స్థలంలో రికార్డింగ్ స్టూడియో నిర్మించకపోగా తాను కూడా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్‌లో నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా ఈ స్థలం ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తూ డబ్బాలు ఏర్పాటు చేశారని, కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు షేక్‌పేట మండల తహశీల్దార్ అనితారెడ్డి తెలిపారు.ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ విభాగాలకు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచి్చందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మలయాళ రాక్‌స్టార్ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్ ఉత్తర కృష్ణన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్ చుట్టాలమ్మాయే ఉత్తర. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా..పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్ ఫాజిల్, నజ్రియా, జయరామ్, దర్శకుడు అన్వర్ రషీద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మ్యూజిక్ కెరీర్..సుశిన్ విషయానికి వస్తే.. దీపక్ దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్ లివింగ్స్టన్ 700 కండి, కిస్మత్ వంటి చిత్రాలకు బీజీఎమ్ అందించాడు. వరథాన్, కుంబలంగి నైట్స్ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్ మురళి, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, బోగిన్ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు. Sensational Malayalam music director #SushinShyam got married to AD and singer #UtharaKrishnan ❤️ #fahadhfaasil and wife #Nasriya , #Jayaram were present at this very private ceremony pic.twitter.com/CHR41ApcXL— sridevi sreedhar (@sridevisreedhar) October 30, 2024 చదవండి: అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! -
రజినీతో బంధుత్వం.. సినిమాకు రూ.10 కోట్లు.. అనిరుధ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
నా పాటను మార్చేశారు, రూపాయి కూడా అక్కర్లేదు: కల్కి మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను అందించిన అంధగన్ సినిమా టైటిల్ సాంగ్‌ను ఇష్టమొచ్చినట్లుగా మార్చేశారని ఆగ్రహించాడు. కాగా బాలీవుడ్ హిట్ మూవీ అంధదున్ను తమిళంలో అంధగన్గా రీమేక్ చేస్తున్నారు. హీరో ప్రశాంత్ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అంధగన్ యాంథెమ్ రిలీజ్ చేశారు. దళపతి విజయ్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.అంతా మార్చేశారు: సంతోష్ నారాయణన్ఈ సాంగ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించినట్లుగా క్రెడిట్స్ ఇచ్చారు. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన సాంగ్‌ను ఇష్టారీతిన మార్చేశారంటున్నాడు. 'చరిత్రలో మొట్టమొదటిసారి.. ఒక ఆడియో సంస్థ కళ్లులేనట్లుగా నటిస్తోంది. ఈ పాటలో ఉన్న సంగీతం, లిరిక్స్, అరేంజ్మెంట్, ఆ మిక్సింగ్ అన్నీ కూడా నేను కంపోజ్ చేసినట్లుగా లేనే లేదు. కాబట్టి ఈ సాంగ్‌కు ఒక్క రూపాయి కూడా తీసుకోను' అని ట్వీట్ చేశాడు. అప్పుడే రిలీజ్ఇకపోతే చెన్నైలో జరిగిన ప్రమోషనల్ సాంగ్ ఈవెంట్‌కు సంతోష్ నారాయణన్ హాజరవలేదు. అంధగన్ సినిమా విషయానికి వస్తే సిమ్రాన్, ప్రియా ఆనంద్,కార్తీక్, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, కేఎస్ రవికుమార్, వనితా విజయకుమర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాకు సంగీతం అందించాడు. For the first time in history, the audio label is also playing a blind character - method acting ? . FYI I don’t charge a fee to check if the actual music/lyric/arrangement/mix/master is actually mine . All The Best Of Luck 😂😂 https://t.co/i7rWKBFQ9N pic.twitter.com/iMq0dhxmfj— Santhosh Narayanan (@Music_Santhosh) July 24, 2024 చదవండి: మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత -
విడాకుల తర్వాత మళ్లీ అలా కలిసిన జీవీ ప్రకాశ్, సైంధవి
కోలీవుడ్ యంగ్ హీరో వేమల్ నటించిన SIR సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదలైంది. బోస్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమల్తో పాటు ఛాయా దేవి కన్నన్, శరవణన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంఘిక డ్రామాగా ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎస్ పిక్చర్స్ పతాకంపై సిరాజ్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు.ఎస్ఐఆర్ (SIR) చిత్రం నుంచి తాజాగా విడుదలైన సాంగ్ కోలీవుడ్‌లో భారీగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం జీవీ ప్రకాశ్, ఆయన మాజీ సతీమణి సైంధవి అని చెప్పవచ్చు. వీరిద్దరు కొద్దిరోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసింది. ఆ సమయంలో వారిపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. కానీ, వాటిని సున్నితంగానే ఇద్దరూ తప్పుపట్టారు. అయితే, విడాకులు తీసుకున్న తర్వాత జీవీ ప్రకాశ్, సైంధవి కలిసి ఎస్ఐఆర్ (SIR) సినిమా కోసం ఒక పాటకోసం తమ గొంతు కలిపారు. వారిద్దరూ కలిసి పాడిన ఆ సాంగ్ ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 2025లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.ఈ ఏడాది మే నెలలో సైంధవి, జీవీ ప్రకాశ్ విడిపోతున్నట్లు తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆ సమయంలో ప్రకాశ్ ఇలా చెప్పాడు 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా ఇద్దరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. -
రచయితగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్!
అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్‌లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్‌గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్‌లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. -
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
ఇటీవలే కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్, అతని భార్య, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రైవసీకి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై జీవీ ప్రకాశ్ రియాక్ట్ అయ్యారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం మంచిది కాదు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు రావడం దురదృష్టకరం.. ఇవీ తమకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం, వారి గురించి కామెంట్స్ చేయడం ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తులపై ప్రభావం చూపుతాయని గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా?" అని జీవీ ప్రకాశ్ ప్రశ్నించారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్‌ను తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.జీవీ ప్రకాశ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మీరు చేసే కామెంట్స్ బాధ కలిగించేవిగా ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) -
11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ ఇండస్ట్రీ కపుల్ (ఫొటోలు)
-
అభిమానుల దెబ్బకు ఇన్‌స్టాను తొలగించేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. అయితే ఈ సాంగ్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు. యూట్యూబ్‌లో విజిల్ పోడు పాటను మిలియన్ల కొద్ది ప్రేక్షకులు చూశారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు మంచి ఆదరణ లభించినప్పటికీ, కొందరి నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి. పాటలో మ్యూజిక్ పరమచెత్తగా ఉందని యువన్ శంకర్ రాజాపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా అనిరుద్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. అనిరుధ్‌ను పొగుడుతూ యువన్‌ను తక్కవ చేసి కామెట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరూ కూడా యువన్ శంకర్ రాజాను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన యువన్ శంకర్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి తప్పుకున్నారు. తన అకౌంట్‌ను తొలగించేశారు. కొందరి అభిమానుల వల్లే యువన్ శంకర్ రాజా ఈ నిర్ణయం తీసుకున్నారని యువన్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజిల్ పోడు పాట విజయ్ పార్టీ ఎన్నికల ప్రచార గీతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. యువన్ నుంచి ఇలాంటి పాట వస్తుందని ఊహించలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో, యువన్ శంకర్ రాజా తన ఎక్స్ పేజీలో ఒక కామెంట్ చేశారు. 'నా ఇన్స్టాగ్రామ్ పేజీలో సాంకేతిక లోపం కారణంగా, నా పోస్ట్‌లు తొలగించబడ్డాయి. అభిమానుల ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధన్యవాదాలు, నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం అయితే యువన్ శంకర్ రాజా ఇన్స్టాగ్రామ్ ఖాతా వినియోగంలో లేదు. -
అప్పట్నుంచి కీరవాణి ఫ్యాన్‌ని!
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
ఆ తమన్ అన్నీ అబద్ధాలే చెప్తాడు: మణి శర్మ
మాస్ పాటైనా, క్లాస్ పాటైనా, భక్తి గీతమైనా.. అన్ని రకాల ట్యూన్స్‌తో అద్భుతాలు సృష్టిస్తాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఈయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్న ఈయన ఇప్పుడు చేతినిండా అవకాశాలు లేవని బాధపడుతున్నాడు. తనకు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులిస్తే బాగుండని ఆశపడుతున్నాడు. తాజాగా అతడు ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మణి శర్మ మాట్లాడుతూ.. 'నేను మొదట వయొలిన్ నేర్చుకున్నాను. తర్వాత పెద్దదిగా కనిపించిందని కీబోర్డు నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇంతలో అనంత శ్రీరామ్.. 'మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్సులు పగలగొడతారంట కదా!' అని అడిగేశాడు. వెంటనే మణిశర్మ స్పందిస్తూ.. 'ఆ తమన్గాడు అబద్ధం చెప్పాడు. నా జీవితంలో ఒక్కసారే అలా చేశానులే' అని నవ్వేశాడు. తన కెరీర్లో ఎంతోమంది గొప్ప సెలబ్రిటీలతో కలిసి పని చేయడం అదృష్టమంటూ ఎమోషనలయ్యాడు. షో చివర్లో ఆయనకు సగౌరవంగా సన్మానం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్‌తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
చెన్నై: సీనియర్ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ (71) మంగళవారం చైన్నెలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. విసు దర్శకత్వం వహించిన నాణయం ఇల్లాద నాణయం చిత్రం ద్వారా విజయ్ ఆనంద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'నాన్ అడిమై ఇల్లై' చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని 'ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్‌దాన్..' పాట చాలా పాపులర్ అయ్యింది. తమిళంలో 'కొరుక్కు ఉపదేశం', 'రాసాతి వరుం నాళ్' తదితర 10 చిత్రాలకు పని చేసిన విజయ్ ఆనంద్ కన్నడంలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించడం విశేషం. కాగా విజయ్‌ఆనంద్ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు జరిగాయి. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత కళాకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్‌తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
‘ఈగల్’లో మ్యూజిక్ కూడా కథ చెబుతుంది
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మాట్లాడుతూ– ‘‘నా పదో తరగతి నుంచే మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాను. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. కొన్ని వీడియో గేమ్స్‌కి మ్యూజిక్ ఇచ్చాను. సంగీత దర్శకుడిగా ‘ఈగల్’ నాకు తొలి చిత్రం. కాలేజీలో నేను, హీరో శ్రీవిష్ణు క్లాస్మేట్స్. అలా కార్తీక్ నాకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తనతో నా జర్నీ మొదలైంది. రవితేజగారితో సినిమా ఫిక్స్ అయ్యాక ఆయన ఓకే చెబితే, మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు చాన్స్ ఇస్తానన్నాడు కార్తీక్. రవితేజగారు నా మ్యూజిక్ ట్రాక్స్ విని, నచ్చి ఓకే చేశారు. రవితేజగారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా లక్. ఈ సినిమాలో మ్యూజిక్, ఆర్ఆర్లకు మంచి స్కోప్ ఉంది. మ్యూజిక్ కూడా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ΄ాటలు ఉన్నాయి. ఇక కార్తీక్ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఓ సినిమాకు, దర్శకుడు నక్కిన త్రినాథరావుగారిప్రోడక్షన్లోని ఓ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాను. మరో రెండు ్ర΄ాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
హీరోగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సంగీతదర్శకుడిగా, కథానాయకుడిగా సక్సెస్ఫుల్ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్‌కుమార్. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెబల్ ఒకటి. నూతన దర్శకుడు నికేశ్ ఆర్ఎస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్ విద్యార్థిగా చాలా పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో సంభాషణలు, జీవీ.ప్రకాశ్‌కుమార్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక రెబల్ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో మమతా బైజూ, కరుణాస్ సుబ్రమణియ శివ, షాలూ రహీమ్, వెంకటేశ్. వీపీ, ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, ఆదిరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
చిరంజీవి, నాగార్జున కి మ్యూజిక్ సెన్స్ చాలా ఉంటుంది
-
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్‌నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టా రీల్ వ్యూస్‌తో మ్యూజిక్ డైరెక్టర్స్‌ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్‌లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
నాలుగోసారి ప్రేమలో పడ్డ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా గోపి.. అతడి భార్య, సింగర్ అమృత సురేశ్ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. గోపి సుందర్ ఈ మధ్య యూరప్‌లో సంగీత విభావరి (కన్సర్ట్)కి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోల్లో మయోని అలియాస్ ప్రియ నాయర్‌తో సన్నిహితంగా కనిపించాడు. న్యూజిలాండ్ ట్రిప్‌కు కూడా తనను వెంటేసుకుని వెళ్లాడు. దీపావళి కూడా ఆమెతోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. గోపి సుందర్- ప్రియ నాయర్ భార్యకు బదులుగా మరో అమ్మాయితో.. ఈ ఫోటోలను ప్రియ నాయర్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఎలా ప్రేమించాలి? ఎలా జీవించాలి? అనే విషయాలను నేర్పిన వ్యక్తితో సంతోషకర క్షణాలు' అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. దీంతో వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని అభిమానులు అనుమానిస్తున్నారు. కాగా గోపి సుందర్ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్, యాదవ్ అని ఇద్దరు సంతానం. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. తర్వాత సింగర్ అభయ హిరణ్మయితో తొమ్మిదేళ్లకుపైగా సహజీవనం చేశాడు. కానీ ఈ రిలేషన్ కూడా ముక్కలైపోయింది. గోపి సుందర్- అమృత సురేశ్ ఏడాదికే ముక్కలైన రిలేషన్.. గతేడాది సింగర్ అమృత సురేశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు గోపి సుందర్. కానీ ఏడాది గడిచేలోపు పరిస్థితులు తారుమారయ్యాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. బయట కూడా ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇద్దరూ విడివిడిగానే ట్రిప్పులకు వెళ్తున్నారు. దీంతో వీరు విడిపోయారని నెటిజన్లు ఫిక్సయిపోయారు. అటు విడాకుల వార్తలపై గోపి, అమృత సైతం ఇంతవరకు స్పందించనేలేదు. తాజాగా మరో అమ్మాయితో గోపి సుందర్ క్లోజ్‌గా కనిపించడంతో అతడు నాలుగోసారి లవ్‌లో పడ్డాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. గోపి సుందర్.. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఈయన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజ్ను, బ్రహ్మోత్సవం, ప్రేమమ్, నిన్ను కోరి, గీతా గోవిందం, మజిలి, 18 పేజెస్.. ఇలా ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. View this post on Instagram A post shared by Priya Nair (@_.mayoni._) View this post on Instagram A post shared by Priya Nair (@_.mayoni._) చదవండి: 21 ఏళ్ల కుమారుడున్న బాలీవుడ్ బ్యూటీతో రిలేషన్.. ట్రోలింగ్‌పై హీరో రియాక్షన్ ఇదే! -
మళ్లీ ఎందుకు?.. సంచలనంగా మారిన ఇళయరాజా కామెంట్స్!
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు, సంగీత దర్శకుడు దీనా మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంగీత రంగంలో అపర చాణుక్యులుగా ముద్ర వేసుకున్న ఇళయరాజాను వ్యతిరేకించి ఇక్కడ మనుగడ సాగించటం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆయన్ని ఎదుర్కోవడానికే మరో సంగీత దర్శకుడు దీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా ఎంపికయ్యా రు. కాగా ఈ సంఘానికి ప్రస్తు త కార్యవర్గ పదవీ బాధ్యతలు ముగియనున్నాయి. దీంతో ఈ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సంగీత దర్శకుడు దీనా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజాకు, ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుత దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దీనాతో ఇళయరాజా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సినీ రంగంలో మొట్టమొదటిసారిగా సంగీత కళాకారుల సంఘం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సంఘాన్ని ప్రారంభించింది ఎంపీ శ్రీనివాసన్ అని తెలిపారు. సంఘానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే సంఘానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలనే నిబంధన కూడా ఉందన్నారు. అందువల్ల నువ్వు ఇప్పటికే రెండుసార్లు సంఘం అధ్యక్షత బాధ్యతలను నిర్వహించావని.. మూడోసారి ఎందుకు పోటీ చేస్తున్నావని ఇళయ రాజా ప్రశ్నించారు. ఈసారి కొత్త తరానికి అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. ఈ సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే తాను ఆ విషయం గురించి లోతుగా పోదలచుకోలేదని.. సంఘం సభ్యులు కోరిక మేరకే అధ్యక్షుడిగా అంగీకరించాలని అంటున్నారు. అయితే దీన్ని ఇళయరాజా వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన దీనా కాలానుగుణంగా సంఘం నిబంధనలు మారుతాయని అన్నారు. ఇళయరాజా అన్నయ్యను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఇళయరాజాను కలిసి వాస్తవ పరిస్థితులు వివరిస్తానని దీనా స్పష్టం చేశారు. -
'మీ అభిమానిగా మేం సిగ్గుపడుతున్నాం.' ఏఆర్ రెహమాన్‌పై ఫ్యాన్స్ ఫైర్!
బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం చెన్నైలో పర్యటించారు. ఓ సంగీత కచేరీలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్యరామ్ ప్యాలెస్‌లో 'మరాకుమా నెంజమ్' అనే పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. అయితే కచేరీకి ఒక్కసారిగా ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ కచేరీకి దాదాపు 50,000 మంది వచ్చినట్లు సమాచారం. దీంతో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజర్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇది రెహమాన్ కెరీర్లోనే అత్యంత చెత్త కచేరీ అని అభిమానులు మండిపడుతున్నారు. ఆర్గనెజర్స్ పరిమితికి మించి టికెట్స్ విక్రయించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొంటే తీవ్ర నిరాశకు గురయ్యామని వెల్లడించారు. ఈవెంట్ నిర్వహించే తీరు ఇదేనా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొన్నామని వాపోయారు. ఇది ఒక ఫేక్ ఈవెంట్ అంటూ మండిపడ్డారు. ఈ కచేరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. ఇదొక పెద్దస్కామ్ అంటూ ఆరోపిస్తున్నారు. స్పందించిన రెహమాన్ ప్రియమైన చెన్నై అభిమానులారా.. మీలో టిక్కెట్లు కొనుగోలు చేసి.. దురదృష్టకర పరిస్థితుల కారణంగా ఈవెంట్లో పాల్గొనలేకపోయారు. దయచేసి మీ టిక్కెట్ కొనుగోలు కాపీని మీ ఫిర్యాదులతో పాటు మెయిల్‌కి షేర్ చేయండి. మా బృందం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. Dearest Chennai Makkale, those of you who purchased tickets and weren’t able to enter owing to unfortunate circumstances, please do share a copy of your ticket purchase to arr4chennai@btos.in along with your grievances. Our team will respond asap🙏@BToSproductions @actcevents — A.R.Rahman (@arrahman) September 11, 2023 ఇన్‌స్టాగ్రామ్‌లో తన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఏఆర్ రెహమాన్ రాస్తూ..'కొంతమంది నన్ను G.O.A.T(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తున్నారు. ఈసారి నన్ను త్యాగం చేసే మేకగానే ఉండనివ్వండి . చెన్నై ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో వర్ధిల్లాలి. టూరిజంలో పెరుగుదల, నిబంధనలను పాటించేలా ప్రేక్షకులను మెరుగుపరచడం .. పిల్లలు, మహిళలకు సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. People are saying #ARRahmanConcert is scam of the year, listen to this gentleman.#ARRahman | #ARRConcert | #MarakkumaNenjam pic.twitter.com/3VybS9eEsN — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 11, 2023 మండిపడుతున్న నెటిజన్స్ అయితే రెహమాన్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. మీ పోస్ట్‌లో క్షమాపణ ఎక్కడ ఉంది? సిగ్గుపడండి సార్.. ప్రజలు మిమ్మల్ని చూడటానికి వస్తారు. మీరు క్షమాపణ చెప్పడం మీకు నిజంగానే కష్టంగా కనిపిస్తోంది.' అంటూ విమర్శించారు. మరొకరు రాస్తూ.. “మేము ఎల్లప్పుడూ మీ అభిమానులమే...కానీ దీనికి చెన్నై మౌలిక సదుపాయాలను నిందించవద్దు... ఇది పెద్ద స్కామ్... కెపాసిటీ కంటే 10 రెట్లు ఎక్కువ టికెట్స్ అమ్ముకున్నారంటూ రాసుకొచ్చారు. మరో అభిమాని రాస్తూ..'ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి చెన్నై అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఆర్గనైజింగ్ టీమ్ ఈవెంట్ సామర్థ్యం గురించి పట్టించుకోలేదు. నిన్నటి దాకా మీ అభిమానులం అయినందుకు మేం బలి మేకలం. మీ పోస్ట్ చదివిన తర్వాత నేను మీ అభిమాని అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా.' అంటూ రెహమాన్‌పై మండిపడుతున్నారు. It was worst concert ever in the History #ARRahman #Scam2023 by #ACTC. Respect Humanity. 30 Years of the Fan in me died today Mr. #ARRAHMAN. #MarakkumaNenjam Marakkavey Mudiyathu, . A performer in the stage can’t never see what’s happening at other areas just watch it. pic.twitter.com/AkDqrlNrLD — Navaneeth Nagarajan (@NavzTweet) September 10, 2023 HORROR Story of a family who paid 30K RS for #ARRahmanConcert : “If I had stood for 2 more min, they would have squeezed & killed my child, we would have died, Are they even human beings” - Affected Family#ARRahman #marakumanenjam #Arr pic.twitter.com/nAaqREoFtx — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 10, 2023 -
యాక్టింగ్ ఛాన్సులు వచ్చినా వదులుకుంది.. కేతకి ఇంట్రెస్ట్ అదేనట
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది...అన్నట్లు సంగీతకారుల కుటుంబంలో జన్మించిన కేతకి మతేంగోకర్కు చిన్నప్పటి నుంచే పాట అంటే ఇష్టం. తండ్రి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తల్లి సువర్ణ సింగర్. నటిగా కూడా మెప్పించింది కేతకి. ‘షాల’ ఆమె డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా కోసం అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుజిత్ ఒక టెలివిజన్ మ్యూజిక్ షోలో కేతకిని చూసి తన సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాడు. నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ‘నటన’ కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది కేతకి. రోజుకు నాలుగు గంటల పాటు సంగీత సాధన చేస్తుంది. ‘మహేష్ మంజ్రేకర్ సినిమాలో నటించిన తరువాత ఎన్నో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. క్లాసిక్ నుంచి కాంటెంపరరీ మ్యూజిక్ వరకు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’. గత సంవత్సరం ‘మాయి’ ఆల్బమ్‌తో మ్యూజిక్ కంపోజర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది కేతకి. ఈ ఆల్బమ్‌లోని తొమ్మిది పాటలను శంకర్ మహాదేవన్, మహాలక్ష్మీ అయ్యర్‌లాంటి ప్రసిద్ధ గాయకులు పాడారు. ‘మన దగ్గర ఉమెన్ మ్యూజిక్ కంపోజర్లు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మంచి మ్యూజిక్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలామందికి మ్యూజిక్ కంపోజిషన్‌లో అద్భుత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారు’ అంటుంది కేతకి. -
ఈ ఘనత సాధించిన తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా రికార్డ్
పంజాబ్‌కు చెందిన జస్లీన్ రాయల్.. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా తనదైన ప్రతిభ చాటుకుంటోంది. పంజాబీ, హిందీ, బెంగాలీ, గుజరాతీలతో పాటు ఇంగ్లీష్‌లోనూ పాటలు పాడింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది. లుథియానాలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత పై చదువుల కోసం దిల్లీ వచ్చింది జస్లీన్. హిందూ కాలేజ్‌లో బి.కామ్ పూర్తి చేసింది. సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. తాను సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను ప్లే చేయడం తన ప్రత్యేకత. పిల్లలకు సంగీత పాఠాలు చెప్పడం వల్ల పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ ఫస్ట్ సీజన్లో సెమీ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షించింది జస్లీన్. తన సంగీత ప్రతిభతో ‘వన్ ఉమెన్ బ్యాండ్’గా పేరు తెచ్చుకుంది. ‘బాలీవుడ్‌లోకి రావాలనేది నా చిన్నప్పటి కల. అయితే అది అంత సులభంగా నెరవేరలేదు. ఇక వెనక్కి వెళ్లిపోదాం అనుకునే సందర్భాలు అందరిలాగే నాకూ ఎదురయ్యాయి. పరీక్ష సమయంలో గట్టిగా నిలబడితే విజయం మన సొంతం అవుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది’ అంటున్న జస్లీన్ రాయల్ రకరకాల ప్రాజెక్ట్‌లతో ముంబైలో బిజీబిజీగా ఉంది. -
సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా కొత్త సినిమా
సంగీత దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి జీవీ ప్రకాష్ కుమార్. ఈయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. అలా 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా చిత్రం రంగప్రవేశం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళంలో డార్లింగ్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్ కుమార్ మదయానై కూట్టం చిత్రం ద్వారా నిర్మాతగాను అవతారం ఎత్తారు. అలా సంగీత దర్శకుడిగా సెంచరీ కొట్టిన ఈయన కథానాయకుడిగా 25 చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ నిర్మాతగా కూడా వ్యవహరించనట్లు సమాచారం. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా జీవీ ప్రకాష్ కుమార్ 2013లో నిర్మాతగా మారి మదయానై కూట్టం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నిర్మాతగా చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: జైలర్‌కు తెలుగు సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు? -
నమ్మాను... ఆఫర్లు వచ్చాయి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ద్వారా సాయిరాజేష్ పరిచయం అయ్యారు. అలా ‘బేబీ’కి సంగీతం ఇచ్చాను. ‘బేబీ’ విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్మాను. అందుకే రెండున్నరేళ్లుగా ఏ ్రపాజెక్ట్ ఒప్పుకోలేదు. ఈ సినిమా పాటలు రిలీజ్ కాగానే చాలా ఆఫర్స్ వచ్చాయి’’ అన్నారు. -
చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలోని సంగీతం ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే! తొలి చిత్రంతోనే మ్యూజికల్ హిట్ కొట్టిన ఈయన తర్వాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే! తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే! మేము నలుగురం పిల్లలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు చూశాక ఈ స్థాయికి వచ్చాను. కాలేజీ పూర్తయిపోగానే స్టూడియో పెట్టుకుని కంపోజర్‌గా మారాను. జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని. నా తొలి పారితోషికం రూ.50. గులాబీ సినిమా చేసే సమయానికే జింగిల్స్‌తో మంచి పేరు సంపాదించాను. అప్పుడు ఒక్క జింగిల్కు రూ.50 వేలు తీసుకున్నాను. 1993లో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. మాకు ఒక పాప ఉంది. నా తొలి సినిమా గులాబీ చేసేటప్పుడు రాత్రిళ్లు పాపను ఎత్తుకుని పని చేసుకునేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయాను. కూతురు నా దగ్గరే పెరిగింది. ప్రతి రోజు ఛాలెంజ్‌లను దాటుకుంటూనే ముందుకు సాగాను. తొలి సినిమా గులాబీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 1999 నుంచి 2019 వరకు దాదాపు 25 సినిమాలు చేశాను. మధ్యలో కృష్ణవంశీతో గొడవ కూడా అయింది. సముద్రం సినిమాతో మళ్లీ కలిసిపోయాం. ఆ తర్వాత బాలీవుడ్ కూడా వెళ్లాను. తెలుగులో కొన్ని సినిమాల్లో అంతకు ముందు వచ్చిన పాటల్లోని సంగీతాన్ని కాస్త అటూఇటూ మార్చమనేవారు. అది నాకు నచ్చేది కాదు. అదే సంగీతం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికే వెళ్లండి, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి నేను బయటకు వచ్చేవాడిని. అది కొందరికి నచ్చలేదేమో.. అవకాశాలు ఇవ్వలేదు. అందుకే సినిమాలకు కాస్త దూరమయ్యాను' అని చెప్పుకొచ్చాడు శశి ప్రీతమ్. చదవండి: కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానినే: అల్లు అర్జున్ చిరంజీవి, విజయ్ విషయంలో ఎక్కువ వాధపడ్డాను: రష్మిక -
'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్‌మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు ఎలా తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్ తనదైన శైలిలో స్పందించారు. తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్‌తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్ ఆడి ఇంటికెళ్తా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్‌లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ కూడా ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!) -
మా స్నేహం చాలా గొప్పది..
-
గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు
టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ రీసెంట్గా వచ్చిన 'రామబాణం' గురితప్పింది. దీంతో చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు ఆయన ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రొటీన్ కథలతో వస్తున్నడంతో ఆయనకు ఏదీ సెట్ కాలేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు(జూన్ 12) తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేసి, పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. పోస్టర్లో పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నాడు. పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: Jr NTR: ఒక్క యాడ్ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!) 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్ట్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. #BHIMAA pic.twitter.com/a4R9gQb6mK — Gopichand (@YoursGopichand) June 12, 2023 (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
ట్రోల్స్‌పై ఎమోషనల్ అయిన తమన్ భార్య
సౌత్ ఇండియాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్ తెలుగు ఐడల్ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలు ఎక్కడా చర్చించని తమన్. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) తాజాగా వర్దిని ఓ ఇంటర్వ్యూలో తమన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. 'ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్ గురించి చర్చ రాదు. ఆయన కూడా ఆలోచించడు. తమన్ ఇంటర్వ్యూలు నేనూ చూస్తాను.. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవను.. ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల వాటిని చదివితే ఒక భార్యగా బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్ ఆఫ్ అవుతాను కూడా.. అందువల్ల వాటిపై మా ఇంట్లో నో కామెంట్ అని అనుకుంటాం. తమన్‌ను అభిమానించే వారందరికి థ్యాంక్స్' అంటూ ఎమోషనల్ అయింది. తెలుగులో 'స్వరాభిషేకం' షో వల్ల సింగర్‌గా వర్దిని చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది. (ఇదీ చదవండి: అన్నా.. నేను అలాంటి దాన్ని కాదు: అనుపమ) -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్‌తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్‌ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్‌ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!
1993లో విడుదలై జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ బ్రహ్మాండ చిత్రానికి నిర్మాత కె.టి.కుంజుమోన్. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. (ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా) కాగా 30 ఏళ్ల తరువాత కేటీ కుంజుమోన్ జెంటిల్మెన్–2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని ఎ.గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ నటుడు సేతన్ శీను కథానాయకుడిగా నటించనున్న ఇందులో నయనతార అనే నూతన నటి నాయకిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జెంటిల్మెన్ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఇప్పటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి జెంటిల్మెన్–2 చిత్రానికి సంగీతాన్ని అందించనుండం విశేషం. (ఇది చదవండి: ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్) అవును తమిళంలో మరకతమణి పేరుతో ఇంతకుముందు కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి చాలా గ్యాప్ తరువాత మళ్లీ జెంటిల్మెన్ –2 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా ఈ చిత్ర దర్శకుడు గోకుల్‌కృష్ణ ఇటీవల హైదరాబాదుకు వెళ్లి కీరవాణికి కథను వినిపించారట. కథ అద్భుతంగా ఉందని కీరవాణి ఆయన్ని ప్రశంసించడంతో పాటు నిర్మాత కేటీ కుంజుమోన్‌కు ఫోన్ చేసి వచ్చే నెల నుంచి జెంటిల్మెన్–2 చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభిద్దామని తెలిపినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కేటీ కుంజుమోన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. -
మహాప్రస్థానంలో సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఇక లేరు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజ్ సినీప్రస్థానం మొదలైందిలా.. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతుల రెండో సంతానమే రాజ్. 1954 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజ్‌కు సంగీతంపై ఓ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువుతూ మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అ సమయంలో తన తండ్రి మరణించడంతో కొద్దిరోజులు ఏం చేయకుండా ఉండిపోయిన రాజ్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది అవగానే సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి ఆరేళ్లు పని చేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించి రాజ్-కోటి ద్వయంగా పేరు తెచ్చుకున్నారు.. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాజ్ పలు చిత్రాలకు పని చేశారు. చదవండి: మమ్మల్ని కాలమే కలిపింది, కాలమే విడదీసింది: కోటి -
విడిపోవద్దురా అన్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న కోటి
రాజ్- కోటి ద్వయం టాలీవుడ్లో తెలియని వారు ఉండరు. వారిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతమందించారు. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామన్నారు. ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన సహచరుడు కోటి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన అన్నారు. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయన్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నా. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నేను పుట్టాక మా అమ్మానాన్న నా ముఖం కూడా చూడలేదు: హీరోయిన్) వారి మధ్య బంధం గురించి మాట్లాడుతూ.. 'చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు' అని అన్నారు. -
సంగీత దర్శకుడు మృతి.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సంగీతం, అద్భుతమైన బాణీలు నా చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. సంగీత దర్శకుడు కోటితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన మన మధ్య లేకపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) కాగా.. 1983లో ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు రాజ్ కోటి ద్వయం సంగీతాన్ని సమకూర్చారు. ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కాగా.. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. (ఇది చదవండి: నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ) ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ… pic.twitter.com/uPifYfmtFE — Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2023 -
సంగీత రాజ్ ఇక లేరు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకంది.ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో వెంకట సూర్యనారాయణ రాజు పెద్దవాడు కాగా, తోటకూర సోమరాజు(రాజ్) చిన్నవాడు. 1954 జూలై 27న రాజ్ జన్మించారు. టీవీ రాజు స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం. అయితే ఆయన చెన్నైలో స్థిరపడటంతో రాజ్ అక్కడే పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగటంతో రాజ్‌కి సంగీతంపై అవగాహన ఉండేది. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన రాజ్‌కి చిన్నతనం నుంచే సంగీతం నేర్పించారు టీవీ రాజు. ఓ వైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు రాజ్. ఆ సమయంలో తన తండ్రి టీవీ రాజు 1973 ఫిబ్రవరి 20న యాభైఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. దీంతో కొద్ది రోజులు ఏం చేయకుండా అలాగే ఉండిపోయిన రాజ్ ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది తర్వాత సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి, ఆరేళ్లు పనిచేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 1980లో సంగీత దర్శకుడు ^è క్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా చేరారాయన. అప్పుడు చేతినిండా పని ఉండేది.. జేబు నిండా డబ్బులు వచ్చేవి. ఆ సమయంలో 1982 మార్చి 11న రాజ్ వివాహం ఉషతో జరిగింది. రాజ్–కోటి ద్వయం... సంగీత దర్శకునిగా రాజ్ అందుకున్న తొలి అవకాశం ‘ప్రళయగర్జన’(1983). మోహన్‌బాబు హీరోగా పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి రాజ్‌కి తొలి సోలో సంగీత దర్శకునిగా అవకాశం వచ్చింది. అయితే తన మిత్రుడు, కొలీగ్ అయిన కోటిని కలుపుకొని సంగీతం అందించాలని నిర్ణయించుకున్నారు రాజ్. ఆ విషయాన్ని కోటికి చెప్పడం.. ఆయన కూడా ఒప్పుకోవడంతో సంగీత ప్రపంచంలో రాజ్–కోటి ద్వయం ప్రారంభమైంది. ‘సంసారం, యముడికి మొగుడు, ఖైదీనంబర్ 786, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, ముఠామేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న–తమ్ముడు, శత్రువు’ వంటి ఎన్నో సినిమాలకు వారిద్దరూ సంగీతం అందించారు. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా... అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్ సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ తనదైన శైలిలో సంగీతం అందించి శ్రోతలను మైమరపించారు. ‘సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా(నేపథ్య సంగీతం)’.. ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 70 సినిమాలకు పనిచేశారాయన. అలాగే పలు టీవీ సీరియల్స్‌కి కూడా సంగీతం అందించారు. అదేవిధంగా నటుడిగానూ పలు సినిమాల్లో మెరిశారు రాజ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘హలోబ్రదర్’ సినిమాకి 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాజ్–కోటి ద్వయం నంది అవార్డు అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్, నేపథ్య సంగీత దర్శకుడు, నటుడు.. ఇలా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన రాజ్ మృతితో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. రాజ్‌కి భార్య ఉష, కుమార్తెలు దివ్య, దీప్తి, శ్వేత ఉన్నారు. కాగా హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో నేడు (సోమవారం) రాజ్ అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. (చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. బుల్లితెర నటి స్పాట్ డెడ్!) మాకూ షాకింగ్‌గానే ఉంది – దివ్య, రాజ్ కుమార్తె ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్‌తో నాన్న మృతిచెందారు. ఫ్యామిలీని, అభిమానులను ఎప్పుడూ సంతోషపరిచారాయన. నాన్నగారికి చిరంజీవిగారు ఎప్పుడూ ఓ బ్రదర్‌లా సపోర్ట్‌గా ఉన్నారు. నాన్న మరణంపై స్పందించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో కలిసిన నాన్న, కోటి అంకుల్ కబుర్లు చెప్పుకున్నారు. నాన్న మరణవార్త చెప్పగానే అంకుల్ షాక్ అయ్యారు. మా పాటల రూపంలో బతికే ఉంటారు – కోటి, సంగీత దర్శకుడు నేను చెన్నైలో ఉండగా రాజ్ చనిపోయారనే చేదు వార్తను విన్నాను. ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్నాం. తనకు ఆరోగ్య సమస్యలున్నట్టు నాకు అనిపించలేదు. రాజ్ కూడా నాతో చెప్పలేదు. చక్రవర్తిగారి వద్ద మేమిద్దరం అసిస్టెంట్లుగా పనిచేశాం. రాజ్–కోటిగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం విడిపోయిన తర్వాత కూడా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్–కోటి పాటలు అనేవారు. అలాంటిది ఈ రోజు నా రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు. -
చరిత్ర సృష్టించబోతున్న సంగీత దర్శకుడు కోటి
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి! కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో గెస్ట్ ఆఫ్ హానర్‌గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా -
తమిళంలో మాట్లాడాలన్న ఏఆర్ రెహమాన్.. నెటిజన్స్ ఫైర్!
ఏఆర్ రెహమాన్.. ఆయన పేరే ఒక బ్రాండ్. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమై ప్రపంచస్థాయిలో తన సత్తా చాటారు. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను సాధించిన ఘనత రెహమాన్‌కే సొంతం. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్- 2022 అవార్డ్ ఫంక్షన్‌కు తన భార్య సైరా భానుతో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రెహమాన్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తన భార్య సైరా భానును హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ సరదాగా కోరాడు. (ఇది చదవండి: ఏఆర్ రెహమాన్ భార్యను ఎప్పుడైనా చూశారా?) అయితే ఆమె తనకు తమిళం సరిగా రాదని.. సారీ చెబుతూ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఇష్టం. అది చూసే ప్రేమలో పడ్డాను' అంటూ మాట్లాడింది. అయితే తమిళంలో మాట్లాడాలంటూ తన భార్యకు రెహమాన్ చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొందరేమో హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నావ్.. తమిళంలో మాట్లాడమని చెబుతావా అంటూ రెహమాన్‌ను తప్పుబడుతున్నారు. మరికొందరేమో హీందీ భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారని.. తమిళంలో కూడా హిందీ సాంగ్స్ ఫేమస్ అని చెప్పారు. ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా భారతదేశంలో అన్ని భాషలు సమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய் ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID — black cat (@Cat__offi) April 25, 2023 -
ఆయన మాటలతో ఇక నేను చనిపోయినట్లే: ఆర్జీవీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. అయితే నాకు మాత్రం తొలి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మనే అన్నారు. అయితే కీరవాణి ప్రశంసలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఇంటర్వ్యూ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. కీరవాణి అలా మాట్లాడుతుంటే తనకు చనిపోయినా ఫీలింగ్ కలుగుతోందని ఆర్జీవీ అన్నారు. కేవలం చనిపోయిన వారినే అలా పొగుడుతారంటూ ట్వీట్ చేశారు. కీరవాణి ఏమన్నారంటే.. కీరవాణి మాట్లాడుతూ..' నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మ. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించేందుకు నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశా. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మ ఆస్కార్ రోల్ ప్లే చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం.' అంటూ నాకు అవకాశాలిచ్చారని అన్నారు. Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this 😢😩😫 pic.twitter.com/u8c9X8kKQk — Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023 -
నాటు నాటు పాటకు అవార్డ్ వస్తుందని ఊహించలేదు: కీరవాణి
‘‘నాటు నాటు’ పాటకు అవార్డులు వస్తాయని నేను ఊహించలేదు. ఆస్కార్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఈ ‘నాటు నాటు’ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. ఓ తమిళ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా... ► ‘నాటు నాటు’ ఓ కమర్షియల్ సాంగ్... అంతే. ఒక వినూత్నమైన పాటలో మన ప్రతిభను క్లాసికల్ మ్యూజిక్ పరంగా, ఆర్కెస్ట్రాలో కొత్త డిజైనింగ్ కంపోజిషన్, అద్భుతమైన పొయిట్రీ వంటి వాటితో కనబరిచి ఉంటే.. అప్పుడు ఆ పాటకు అవార్డులను ఊహిస్తాం. కానీ ‘నాటు నాటు’ పాట పక్కా ఫాస్ట్ బీట్ కమర్షియల్ నెంబర్. ఆస్కార్‌ని మరచిపోండి.. అసలు ‘నాటు నాటు’ పాటకు నేను ఏ అవార్డునూ ఊహించలేదు. ఈ పాటను రాజమౌళి తీసిన విధానం, ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విధానానికి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అఫ్కోర్స్ చంద్రబోస్‌కి కూడా. ‘నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు’ అనే ఆ రెండు వాక్యాలు ఒక మంత్రంలాంటివి. వాటిని క్రియేట్ చేసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డుకి అర్హుడు. ఈ పాటను తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా చేశాం. అక్కడి రచయితలు కూడా వారి స్థాయికి తగ్గట్లుగా బాగానే కష్టపడ్డారు. కానీ తెలుగు వెర్షన్‌కి మంచి సౌండింగ్, రైమింగ్ కుదిరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ► ఇక నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మగారు. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించమన్నట్లుగా నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశాను. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మగారు చాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మగారు ఆస్కార్ రోల్ ప్లే చేశారు. ‘రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం’ అంటూ నాకు అవకాశాలు ఇచ్చారు. ► గునీత్ మోంగాగారి (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌లో ఆస్కార్ పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత)కి ఆస్కార్ వేదికపై మాట్లాడటానికి తగిన సమయం దక్కలేదు. దీంతో ఆమె తన యాక్సెప్టెన్సీ స్పీచ్ తర్వాత సరిగా శ్వాస తీసుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. -
అవార్డులపై నమ్మకం పోయింది : మ్యూజిక్ డైరెక్టర్
‘‘ఓ సినిమా సంగీతం విషయంలో అధిక భాగం దర్శకుల పాత్ర ఉంటుంది. దర్శకుడి అభిరుచిని బట్టే సినిమా, సంగీతం ఉంటాయి. నా సంగీతం బాగుందంటే అందులో ఎక్కువ క్రెడిట్ నా దర్శకులకే ఇస్తాను’’ అన్నారు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘2003లో నా తొలి సినిమా ‘ఐతే’ రిలీజైంది. ఈ 20 ఏళ్లలో ‘ఫలానా అబ్బాయి..’ నా 19వ సినిమా. సంవత్సరానికో సినిమా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంగీతానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాను. నా కెరీర్లో ‘ఫలానా అబ్బాయి..’ లోని ‘కనుల చాటు మేఘమా..’ ఉత్తమ పాట అని చెప్పగలను. ఈ పాటకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాను. కానీ జాతీయ అవార్డులు ఎవరికి ఇస్తారో, అవి ఎలా వస్తాయో ఈ మధ్య ఓ ఫ్రెండ్ చెప్పాడు. దాంతో అవార్డులపై నమ్మకం పోయింది. నాకిప్పటివరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’లోని ‘ఏం సందేహం లేదు..’ పాటని నేను, సునీత పాడాం. సునీతకు అవార్డు వచ్చింది కానీ నాకు రాలేదు. అప్పటి నుంచి అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశా. నా సినిమా, నా పాట నచ్చి ఎవరైనా నిర్మాత నాకు మరో చాన్స్ ఇస్తే అదే పెద్ద అవార్డుగా భావిస్తాను. మా అన్నయ్య (కీరవాణి) స్వరపరిచిన ‘నాటు నాటు..’ ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉంది. ఇక నేను సంగీతం అందించిన ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నా యి. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నా’’ అన్నారు. -
అందుకే శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది: విజయేంద్ర ప్రసాద్
‘‘చిన్నప్పుడు నేను శ్రీలేఖకు ఒక ఆశ చూపించాను. ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. మంచి పాటలతో ప్రేక్షకులను అలరించింది. శ్రీలేఖ అన్న కీరవాణి సంగీతంలో ఆస్కార్ రేసులో ఉన్నారు. తన అన్నలానే శ్రీలేఖ కూడా ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలి’’ అన్నారు రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్. ‘నాన్నగారు’ (1994) సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయమైన శ్రీలేఖ ఇప్పటి వరకూ 5 భాషల్లో 80 చిత్రాలకుపైగా సంగీతం అందించారు. ఆమె సినిమా రంగంలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25 దేశాల్లో 25మంది సింగర్స్‌తో ఈ నెల 17 నుంచి ‘వరల్డ్ మ్యూజిక్ టూర్’ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఆస్తులు సంపాదించకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
అమృత వేణువు
‘లోకంలో ఇన్ని చెట్లు, లతలు, తీవెలు ఉన్నాయి. కొన్నింటికి పండ్లు, కొన్నింటికి పూలు, కొన్నింటి పత్రాలు వర్ణభరితం... కాని ఈ వెదురు పొదను చూడండి. నిరాడంబరమైన ఈ వెదురులోని ప్రతి చిన్న భాగానికి అమృతమయమైన నాదాన్ని వెలువరించే శక్తి ఉంది... వేణుగానాన్ని వినిపించే జీవం ఉంది’ అంటాడు హరిప్రసాద్ చౌరాసియా. ‘మా నాన్న అలహాబాద్‌లో పహిల్వాన్. ఆరేళ్ల వయసులో నేను తల్లిని కోల్పోతే ఆయన తిరిగి పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని పిల్లాడు క్రమశిక్షణలో ఉండాలంటే అఖాడాలో దించి కుస్తీ లడాయిస్తూ ఉండాలని భావించాడాయన. నాకేమో చెవిన సరిగమలు పడితే ఆత్మ ఆగదు. గాత్రం నేర్చుకోవాలనుకున్నాను. తొలి రోజుల్లో పాఠాలు చెప్పిన గురువు... హరిప్రసాద్... నీకు పైస్వరం పలకదు. కాని దమ్ము చాలాసేపు నిలబెట్టగలవు. దమ్ము నిలిపే వాద్యం నేర్చుకో పైకి వస్తావు అన్నాడు. నాకు వేణువు గుర్తుకు వచ్చింది. అది ఖరీదైన వాద్యం కాదు. తీగలు ఉండవు. చర్మ వాద్యం కాదు పాడవడానికి. ఏ సంతలోనైనా దొరుకుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. పెదాలతో గాలి నింపితే శబ్దాన్ని వెలువరిస్తుంది. అందుకని వేణువును ఎంచుకున్నాను’ అంటాడాయన. ఇక్కడ మీరు చదవడం ఆపి తలత్ మెహమూద్ ప్రఖ్యాత గీతం ‘ఫిర్ వహీ షామ్...’ వినండి. అందులో ఎంతో మృదువైన తలత్ గొంతును అనుసరిస్తూ మరింత మృదువైన వేణుగానం వినిపిస్తుంది. అది హరిప్రసాద్ చౌరాసియా తొలి సినీ పాట వాద్యకారుడిగా. ఇంకా అర్థం కావాలంటే ‘విధాత తలపున ప్రభవించినది’ వినండి... అందులో పాటంతా కొనసాగే వేణువును అంత అద్భుతంగా ఎవరు పలికిస్తారు చౌరాసియా తప్ప. ‘సిరివెన్నెల’లో హీరో పాత్ర పేరు అదే– హరిప్రసాద్. ఇప్పుడు దేశంలో రెండు గురుకులాలను వేణుగాన ఉపాసకుల కోసం నిర్వహిస్తున్నాడు హరిప్రసాద్ చౌరాసియా. ఒకటి భువనేశ్వర్‌లో ఉంది. ఒకటి ముంబైలో. ‘పిల్లలకు వేణువు నేర్పిస్తాను’ అని చౌరాసియా అడిగిందే తడవు నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ స్థలం కేటాయించాడు. ముంబైలో కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చింది. ‘ముంబైలో గురుకులం కట్టడానికి డబ్బు లేదు. రతన్ టాటాను వెళ్లి అడిగాను. సంగీతం కోసం ఇబ్బందులా... అని రెండు కోట్లు ఇచ్చాడు. రెండు చోట్లా పిల్లలకు ఉచితంగానే నేర్పిస్తాను. నిజానికి వాళ్ల నుంచి నేను నేర్చుకుంటాను... నా నుంచి వాళ్లు... తుది శ్వాస వరకూ నేర్చుకుంటూ ఉండటమే నాకు ఇష్టం’ అంటాడు చౌరాసియా. నేర్చుకోవడాన్ని ఒక దశలో కొందరు మానేస్తారు. ఒక దశ నుంచి కొందరు అక్కర్లేదనుకుంటారు. వేణువులో పాండిత్యం గడించాక, కటక్ రేడియో స్టేషన్ లో ఆ తర్వాత ముంబై రేడియో స్టేషన్లో పని చేశాక, వందల సినిమా పాటలకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లకు వేణువు పలికించాక, విపరీతంగా డబ్బు గడించాక ‘నేనింకా నేర్చుకోవాలి’ అనుకున్నాడు తప్ప చాలు అనుకోలేదు చౌరాసియా. ‘సినిమాలో వాయించే ఆ కాసేపుతో నా ఆత్మ ఆకలి తీరడం లేదు... నేను శాస్త్రీయ సంగీతపు కెరటాలలో మునకలు వేయాలి..’ అనుకున్నాడు చౌరాసియా. కాని గురువు ఎవరు? శిష్యుల్ని ఎంచుకోవడంలో అతి కఠినంగా, అతి పరిమితంగా ఉండే అన్నపూర్ణా దేవి దగ్గర నేర్చుకోవాలని సంకల్పించాడు. అన్నపూర్ణా దేవి మహామహుడైన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె. సితార్ మేస్ట్రో పండిట్ రవిశంకర్ భార్య. కాని ఆమె ఇతడికి కనీసం తలుపు కూడా తీయలేదు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడేళ్లు ఆమె ఇంటి చుట్టూ తిరిగి చివరకు శిష్యుడిగా స్వీకరించబడ్డాడు. ‘నువ్వు నేర్చుకున్నదంతా మర్చిపోవాలి’ అనేది ఆమె చెప్పిన మొదటి పాఠం. అంతవరకూ చౌరాసియా అందరిలా కుడివైపు వేణువు ధరించేవాడు. ఇప్పుడు ఎడమవైపున. నవ శిశువుగా మళ్లీ జన్మించాడు. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ అర్టిస్ట్‌గా సెలెక్ట్ అయిన హరిప్రసాద్ చౌరాసియా ఇవాళ ప్రపంచానికి వేణునాద గురువు. ఒక నెల నెదర్లాండ్స్‌లో పాఠాలు చెప్తాడు. ఒక నెల కెనడాలో చెప్తాడు. ఒక రోజు అచట కచ్చేరి. మరోరోజు ఏదో దేశ ఔన్నత్య పురస్కార స్వీకరణ. అలహాబాద్‌లో రణగొణ ధ్వనుల మధ్య ఏకాంత సాధన కోసం స్థలాన్ని వెతుక్కుంటూ తిరిగిన హరిప్రసాద్ చౌరాసియాకు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ స్వాగతం చెప్పి తమ దగ్గర ఉండిపొమ్మంటాయి. ఆ గౌరవం అతనిలోని కళకా? దాని పట్ల అతని అర్పణకా? నిరంతర అభ్యాసం, వినమ్రత, లోపలి ఎదుగుదలపట్ల తపన, పంచేగుణం, స్వీకరించే తత్త్వం, స్థిరాభిప్రాయాలను త్యజించగలిగే నిరహంభావం, ఎదుటి వారిని గుర్తించి ప్రోత్సహించే గుణం.. ఇవి లేకుంటే మనిషి మహనీయుడు ఎలా అవుతాడు? మహనీయుడే కానక్కర్లేదు... ప్రేమాస్పదుడు ఎలా అవుతాడు? ఇవాళ సంఘంలో ప్రతి రంగంలో ఎందరో పెద్దలు. కాని కొందరే గౌరవనీయులు. అతికొద్దిమందే ప్రేమాస్పదులు. చౌరాసియా నుంచి నేర్చుకోవచ్చా మనం ఏదైనా? తాజాగా వెలువడ్డ హరిప్రసాద్ చౌరాసియా అఫిషియల్ బయోగ్రఫీ ‘బ్రెత్ ఆఫ్ గోల్డ్’ చదువుతున్నప్పుడు వెదురు పొదల మధ్య తిరుగాడినట్టు ఉంటుంది. త్రివేణీ సంగమంలో దేహాన్ని కడిగినట్టు ఉంటుంది. ముంబైలో మదన్ మోహన్ పాట రికార్డింగ్‌ను చూస్తున్నట్టు ఉంటుంది. శివ్‌తో కలిసి హరి చేస్తున్న జుగల్బందీకి ముందు వరుస సీటు దొరికినట్టు ఉంటుంది. మన జీవిత పాఠాలు మనల్ని చేరే దరులు, దారులు పరిమితం. ఇదిగో ఇలాంటి మహనీయులే చరిత్రలే మున్ముందుకు నడిపే ప్రభాత నాదం. -
తమన్ మ్యూజిక్ బాగాలేదు.. వారికి స్ట్రాంగ్ కౌంటర్
బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగానే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టెల్లో సమాధానమిచ్చారు. తనను కామెంట్ చేసే వాళ్లందరూ చిన్నపిల్లలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఎప్పుడు సరదాగా, కూల్‌గా ఉండే తమన్ ఆగ్రహానికి కారణం ఏంటా అని పలువురు ఆరా తీస్తున్నారు. గిటారు వాయిస్తున్న ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ప్రియమైన నెగెటివిటీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీలాంటి చిన్నపిల్లలందరి కోసం ఈ వీడియో అంకితం' అంటూ పోస్ట్ చేశారు తమన్. కారణం అదేనా? సంగీత దర్శకుడు తమని ఇటీవలే ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, బాలకృష్ణ అఖండ చిత్రాలు సూపర్‌హిట్ కావడంలో తమన్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఫేమస్ అయింది. తమన్ ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తమన్ మ్యూజిక్ బాగలేదని.. ఏమాత్రం వినాలనిపించలేదని పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదే తమన్ ఆగ్రహానికి కారణమైంది. Rest In Peace Dear #Negativity !! To all the kids out there 🤣 pic.twitter.com/pjt7ThMCkn — thaman S (@MusicThaman) February 4, 2023 -
'వాల్తేరు వీరయ్య'తో నా కల నెరవేరింది : దేవీ శ్రీ ప్రసాద్
‘‘వాల్తేరు వీరయ్య’లో ‘పూనకాలు లోడింగ్..’ పాటలో బూరలాంటి వాయిద్యం ఉపయోగించి ఆ ట్యూన్‌ని కంపోజ్ చేశాను. అది చిరంజీవిగారికి నచ్చడంతో ‘అదరగొట్టావ్ అబ్బాయ్’ అన్నారు. నేను కంపోజ్ చేసిన ట్యూన్ ఒక ఎత్తు అయితే ఆయన డ్యాన్స్‌తో పాటని మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా హీరో రవితేజ కీలక పాత్రలో బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ∙చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించింది మా మైత్రీ మూవీస్ నిర్మాతలే (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్). రెండు సినిమాలూ మావే కావడం, సంక్రాంతికి విడుదలవడం చాలా గర్వంగా ఉంది. సంగీతం విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. ఏ సినిమాకైనా కథ ప్రకారమే మ్యూజిక్ చేస్తాం.. రెండు సినిమాలూ అద్భుతంగా ఆడాలి. బాబీతో నాకు చాలా అనుబంధం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలూ హిట్ కావడానికి కారణం బాబీ కథ, ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం. అన్నిటికీ మించి చిరంజీవిగారు మా ఇద్దరిపై పెట్టుకున్న నమ్మకం. ►చిరంజీవిగారితో సినిమా చేయాలనే బాబీ కల ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి చిరంజీవిగారితో ‘నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’ అని అన్నాను. ఆయన ‘ఎంత బాగా చెప్పావ్ మై బాయ్’ అన్నారు. ∙ఈ సినిమాలో రవితేజ, చిరంజీవిగారి సీన్స్‌కి క్లాప్స్ మామూలుగా ఉండవు. కంటతడితో, నవ్వుతూ క్లాప్స్ కొట్టే సీన్స్ చాలా ఉంటాయి. బాస్‌ని (చిరంజీవి) మనం ఎలా అయితే చూస్తూ పెరిగామో.. ఆ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ► కామెడీ, డ్యాన్స్ ఫైట్స్.. అన్నీ కుమ్మేశారు. బాస్‌ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్లో చూస్తున్నాం.. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతి సినిమా సవాల్‌గానే ఉంటుంది. కానీ, ఒత్తిడిగా భావించకుండా సరదాగా చేస్తాను. నేను బాస్‌ని చూస్తూ పెరిగాను.. ఆయన్ని చూడగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులో ‘నువ్వు శ్రీదేవి..’ పాటకి ఆయన స్క్రీన్‌పై ఎలా చేస్తారో ముందే ఊహించి, కంపోజ్ చేసి బాబీకి చూపించా.. అలాగే ‘పూనకాలు లోడింగ్..’ పాటలో చిరంజీవి, రవితేజగార్లు కనిపిస్తే ఎంత సందడిగా ఉంటుందో ఆ ఎనర్జీ అంతా పాటలో ఇచ్చేశాం. అదరగొట్టావ్ అబ్బాయ్ అన్నారు – దేవిశ్రీ ప్రసాద్ -
ఆర్ఆర్ఆర్ మరో ఘనత.. అంతర్జాతీయ అవార్డులు కైవసం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా లాస్ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికయ్యారు. మరోవైపు బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డు గెలుచుకున్నారు. నిర్మాణ సంస్థలు, టాలీవుడ్ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం) ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో స్పాట్లైట్ అవార్డును కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది. జపాన్, అమెరికాలోనూ విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. Our very own @MMKeeravaani Garu won the prestigious @LAFilmCritics award for the Best Music Director🥳 Our utmost gratitude to the jury for recognising #RRRMovie’s chartbuster album & background score. 🎶🎼 pic.twitter.com/a9KGTsb73j — RRR Movie (@RRRMovie) December 12, 2022 -
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఆ వ్యాధి అంత డేంజరా.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. ఇటీవలే కామెర్ల వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. రఘురాం మృతి పట్ల ఆయన స్నేహితులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమిళంలో 2017లో వచ్చిన ‘ఒరు కిదైయిన్ కరుణై మను’ చిత్రానికి సంగీతమందించారు. 2011లో ‘రివైండ్’, ‘ఆసై’ తో పాటు మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. కామెర్లు బారిన పడిన ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. -
ఆయనతో తొలి హిట్ సాధించా!
‘‘గాడ్ ఫాదర్’ ప్రీమియర్ తర్వాత చిరంజీవిగారు ప్రేమగా హత్తుకున్నారు.. సినిమా రిలీజ్ తర్వాత ఆయన ప్రశంసించడం మర్చిపోలేను. దర్శకుడు శంకర్‌గారు, సంగీతదర్శకులు మణిశర్మ, కోటిగార్లు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. చాలామంది మెగా ఫ్యాన్స్ ఫోన్ చేసి, భావోద్వేగంగా మాట్లాడటం హ్యాపీ’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. సల్మాన్ ఖాన్, నయన తార, సత్యదేవ్ కీలక పాత్రలు చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ – ‘‘నేను తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడు చిరంజీవిగారితో చేసిన తొలి సినిమా ‘గాడ్ ఫాదర్’ హిట్ అయి, నా సెంటిమెంట్‌నిæకొనసాగించింది. నా ఆరేళ్ల వయసులో మా అమ్మగారితో కలిసి కోటిగారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లాను. ‘అందం హిందోళం..’ పాట రికార్డింగ్ జరుగుతోంది. ఆ పాట విని చిరంజీవిగారికి ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ చిరంజీవిగారి పాటలే వాయిస్తూ ఉండేవాణ్ణి. చిరంజీవిగారు మహా వృక్షం. ఒక ఫ్యాన్‌గా నేను ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశాను. ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం తేలికైన విషయం కాదు. పైగా మ్యూజిక్‌కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్‌గా హై తీసుకురావడం చాలెంజ్. లండన్‌లోని అబేయ్ రోడ్ స్టూడియోలో రికార్డ్ చేసిన తొలి భారతీయ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మనం ఓ కమర్షియల్ సినిమా చేద్దామని చిరంజీవిగారిని అడిగితే, చేద్దామన్నారు’’ అన్నారు. -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన సింగర్?
కోలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అమృతా సురేశ్, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. అమృత తన బర్త్‌డే రోజు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్‌లో గోపీ సుందర్‌ను భర్తగా అభివర్ణించింది. దీంతో వీరికి పెళ్లైపోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే గోపీసుందర్ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్, యాధవ్ అని ఇద్దరు పిల్లలు. కానీ తర్వాత పలు కారణాలతో వీరు విడిపోయారు. ఆ తర్వాత సింగర్ అభయతో ప్రేమలో పడిన గోపీ 2008 నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఇటీవలే వీరిమధ్య పొరపచ్చాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. మరోవైపు అమృతా సురేశ్ గతంలో నటుడు బాలాను పెళ్లాడింది. వీరికి కూతురు కూడా ఉంది. కొన్నేళ్లకు వారు విడిపోయారు. రీసెంట్గా జరిగిన బర్త్‌డే వేడుకలను సైతం అమృత తన కూతురు, ప్రియుడు సుందర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. View this post on Instagram A post shared by AMRITHA SURESSH (@amruthasuresh) View this post on Instagram A post shared by AMRITHA SURESSH (@amruthasuresh) చదవండి: ఆమిర్ ఖానా? ఆయనెవరు? నాకైతే తెలీదబ్బా.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన ప్రేమజంట!.. -
మన్మథుడు-2 రిలీజ్ అయ్యాక నాగార్జున ఫోన్ చేసి...
-
ఒకే ఏడాదిలో ఏడుసార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డులు అతని సొంతం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కా ర్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్నుస్ట్రుమెంట్స్పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు , కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూలలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
అట్లుంటది మనతోని.. షూటింగ్ ముందే పూర్తి చేస్తా..
తమిళసినిమా: తన సినిమాలను షూటింగ్‌కు ముందే సంగీతాన్ని అందిస్తానని.. యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ తెలిపారు. తొలి చిత్రం అంబులితోనే గుర్తింపు పొందిన శ్యామ్ విక్రమ్ వేదా చిత్రంతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపు పడేలా చేసుకున్నారు. తాజాగా సుళల్ వెబ్ సిరీస్‌కు, మాధవన్ దర్శక, నిర్మాణంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో నటించిన రాకెట్రీ చిత్రానికి ఈయన అందించిన సంగీతంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శనివారం ఆయన మాట్లాడుతూ తెలుగులో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Anasuya Bharadwaj: వెబ్ సిరీస్‌లో వేశ్యగా యాంకర్ అనసూయ ? -
నా కల నేరవేరింది: శ్రీ చరణ్ పాకాల
‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో ఇంత తొందరగా ఓ బయోపిక్కు పని చేస్తానని నేను అనుకోలేదు. ‘మేజర్’కి సంగీతం అందించడంతో నా కలల్లో ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో కనిపిస్తారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – ‘‘అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కిస్’ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా తొలి సినిమా. ఆ తర్వాత ‘క్షణం, గూఢచారి, ఎవరు’ చిత్రాలు చేశాను. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషన్, లవ్‌స్టోరీ.. ఇలా అన్ని అంశాలు ‘మేజర్’లో ఉన్నాయి. 26/11 దాడుల గురించి నాకు అవగాహన ఉంది. బయోపిక్ కావడంతో జాగ్రత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో కిక్ ఉంటుంది. ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’, ‘క్షణం’, ‘గూఢచారి 2’, ‘తెలిసినవాళ్ళు’, కన్నడ ‘ఎవరు’ రీమేక్, దర్శకుడు విజయ్ కనకమేడల సినిమా.. ఇలా ఆరేడు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 బిగ్‌బాస్ షో ద్వారా బిందు ఎంత వెనకేసిందంటే? పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది -
రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్
Music Director D Imman Gets Married Again: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో డి. ఇమాన్ ఒకరు. శతాధిక చిత్రాలకు సంగీతం అందిచారు ఇమాన్. తాజాగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2008లో కంప్యూటర్ ఇంజినీర్ మోనికా రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా గతేడాది డిసెంబర్ 29న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్లి చేసుకుంటానని అప్పట్లోనే తెలిపారు ఇమాన్. ఇప్పుడు దానిని నిజం చేస్తూ రెండో వివాహం చేసుకున్నారు. దివంగత కళా దర్శకుడు ఉబాల్ట్ కుమార్తె అమేలీని రెండో పెళ్లి చేసుకున్నారు ఇమాన్. వీరి వివాహం ఆదివారం ఉదయం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇమాన్ మ్యారేజ్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. రజనీకాంత్ 'పెద్దన్న', అజిత్ 'విశ్వాసం', సూర్య 'ఎవరికీ తలవంచకు' సినిమాలకు డి. ఇమాన్ సంగీతం అందించారు. చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చిన్ని మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌పై ప్రశంసలు
తన నేపథ్య సంగీతంతో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారనే ప్రశంసలను యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ అందుకుంటున్నారు. విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేదా చిత్రంతో చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్యామ్. ఆ తరువాత అడంగు మరు, అయోగ్య, ఖైదీ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం సంగీత దర్శకుడుగా మరింత బిజీ అయ్యారు. తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్, కీర్తి సురేష్ కలిసి నటించిన సాని కాయితం(తెలుగులో చిన్ని) చిత్రానికి ఈయన అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి సినీ వర్గాల నుంచి, సంగీత ప్రియుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. చదవండి: ఆడియన్స్‌కు మూవీ టీం విజ్ఞప్తి.. ‘దయచేసి అలా చేయకండి’ సోషల్ మీడియా శిల్పా శెట్టి గుడ్‌బై, కారణం ఏంటంటే.. -
మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్
‘‘నిర్మాతలు, దర్శకులు మనల్ని నమ్మి డబ్బు ఖర్చుపెడుతున్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకున్నంత సేపే మన గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి’’ అన్నారు సంగీతదర్శకుడు తమన్. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన విశేషాలు. స్టార్ హీరోలతో సినిమాలంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను ఎలా అందుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా స్కూల్‌కు వెళ్లాలనిపిస్తుంటుంది (నవ్వుతూ). ఇప్పుడు మ్యూజిక్ ఇవ్వడమే కాదు.. దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం కూడా ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఆడియో కంపెనీలు ఊరికే డబ్బులు ఇన్వెస్ట్ చేయవు. ఆదాయం వస్తుందా? లేదా అనే అంశాలను ఆలోచించుకుంటారు. ఒక పాట (‘సర్కారువారి..’లోని ‘కళావతి..’ని ఉద్దేశించి) 150 మిలియన్ల వ్యూస్‌ను దాటడమనేది చిన్న విషయం కాదు. పాన్ ఇండియా అనేది సినిమాల విషయంలోనే కాదు.. పాట విషయంలో కూడా జరుగుతోంది. పాట ఎలా ఉండాలి? లిరికల్ వీడియోను ఎలా డిజైన్ చేయాలి? అనే అంశాలను కూడా ముందే డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అప్పుడు.. అదో టెన్షన్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ చేయడమనేది పాయింట్ నెంబర్ వన్ మాత్రమే. అంచనాలను అందుకోగలడా? ఒత్తిడిని అధిగమించగలడా? అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫ్యాన్స్, హీరోలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్.. ఇలా ఎవరైనా సరే మ్యూజిక్‌లో కరెక్షన్స్ చెప్పగలుగుతున్న రోజులివి. ఇవి కాక మా లిరికల్ వీడియోలు, ఇతర భాషల్లోని లిరికల్ వీడియోలు ఒకే రోజు రిలీజైతే అదో టెన్షన్. ఉదాహరణకు ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి..’, విజయ్ ‘బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్..’ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అలాగే ప్రతి సినిమాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ కావడం కష్టం అయినా రీచ్ కావాల్సిందే. లవ్‌స్టోరీకి చేయాలని ఉంది ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే ఉండేవి. ఇప్పుడు స్టోరీ డ్రివెన్ సినిమాలను చేస్తున్నాం. దాంతో మ్యూజిక్‌లోని డిఫరెంట్ యాంగిల్స్‌ను చూపించే అవకాశం ఉంటుంది. సక్సెస్‌ను హెడ్‌కు లోడ్ చేసుకుంటే అప్పుడు మనం ఫెయిల్యూర్స్‌ను తట్టుకోలేం.. పెద్ద సినిమాలే కాదు.. చిన్న సినిమాలకూ సంగీతం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లవ్‌స్టోరీ చిత్రాలకు మ్యూజిక్ అందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అప్పుడు ‘కళావతి..’ ఉండేది కాదు ‘సర్కారువారి పాట’లో టైటిల్ సాంగ్ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాటకు ఓ పదీ పదిహేను ఆప్షన్స్ చేశాం. ఆ తర్వాత ఫైనల్ ట్యూన్ వచ్చింది. మ్యూజిక్ అంటే మ్యూజికల్ వెర్షన్ ఆఫ్ డైలాగ్సే. సినిమాలో ఉన్న డైలాగ్స్‌ను మ్యూజికల్‌గా చెప్పడం అన్నమాట. నాలుగు నిమిషాలు డైలాగ్స్ వదిలేసి దర్శకుడు మాకు ఆ టైమ్ ఇస్తున్నాడు. మేం కథను సంగీతంతో చెప్పాలి. అది పెద్ద బాధ్యత. ఇప్పుడు కథలో నుంచి వచ్చే పాటలు ఎక్కువయ్యాయి. లేకపోతే ‘కళావతి’ అనే పాట రాదు. జనరల్‌గా మాస్ సాంగ్‌కు డాన్స్ చేసే ఆడియన్స్ రివర్స్‌లో ‘కళావతి..’ పాటకు స్టెప్పులు వేస్తారు. సినిమాలో మహేశ్‌బాబుగారి లవ్‌ని ప్యూర్‌గా చూపించాలని ‘కళావతి..’ పాట రాశాం. ఈ పాట లిరికల్ వీడియో కోసం అదనంగా 30 లక్షలు ఖర్చుపెట్టాం. మా సినిమా నిర్మాతలు మ్యూజిక్‌ను ప్రేమించేవారు కాబట్టి అంత ఖర్చు పెట్టారు. అయితే పాట లీక్ కావడం చాలా బాధ అనిపించింది. కరోనా పరిస్థితుల్లో మా నిర్మాతలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాల గురించి ఆలోచించకుండా అలా లీక్ చేయడం బాధాకరం. లీక్ చేసిన వ్యక్తిని పిలిచి ‘నీ కెరీర్ గురించి ఆలోచించుకున్నావా? లీక్ చేయడం పెద్ద తప్పు’ అని మందలించి పంపాం. ఎందుకంటే అతనికి ఓ కుటుంబం ఉంది. సితార రాక్‌స్టార్ ‘పెన్నీ’ సాంగ్‌లో సితారను తీసుకోవాలనిపించి నమ్రతగారిని అడిగాను. మీ హీరోను అడగండి అన్నారు. మహేశ్‌గారిని అడిగాను. ఈ సాంగ్‌లో సితార ఎందుకు? అన్నారు. అప్పుడు సోషల్ మీడియాలో సితార డాన్సింగ్ వీడియోలు కొన్ని మహేశ్‌గారికి మళ్లీ చూపించి సితార బాడీలో మంచి రిథమ్ ఉందని చెప్పాను. ఆ తర్వాత ఓసారి నమ్రతగారితో మాట్లాడుతున్నప్పుడు సితార వచ్చింది. ‘పెన్నీ’ సాంగ్‌లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు చెప్పింది. సితార జస్ట్ మూడు గంటల్లో పాట పూర్తి చేసింది. సితార రాక్‌స్టార్. ‘పెన్నీ’ సాంగ్ ఫైనల్ వెర్షన్లో సితారను చూసి హ్యాపీ ఫీలయ్యారు మహేశ్‌గారు. ఓ తండ్రిగా ఆయనకు అది ఓ గ్రేట్ ఫీలింగ్. సితార లిరికల్ వీడియోలోనే ఉంటుంది. ఆడియో సైజ్ మారింది మన సినిమాలు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ అయ్యాయి. ‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. ‘అల వైకుంఠపురములో..’ తర్వాత ఆడియో సైజే మారిపోయింది. సినిమాలో మేటర్ ఉంటేనే ఏమైనా చేయగలం. ‘అఖండ’లో బాలయ్యగారిలో శివుణ్ణి ఊహించుకుని ఆ స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగాను. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా, చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’ చిత్రం, బాలకృష్ణగారి సినిమా, తమిళ హీరో విజయ్‌తో సినిమా చేస్తున్నాను. హిందీ సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఉంది. చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో! -
రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సంగీత దర్శకుడు
ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ ఇటీవలె అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పెళ్లి చేసుకునేందుకు ఇమ్మాన్ రెడీ అయినట్లు తెలుస్తుంది. చెన్నైకి చెందిని ఉమ అనే మహిళను వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ పెళ్లికి దగ్గరి బంధవులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరు కానున్నారట. మే నెలలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాతో ఇమ్మాన్ వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. కానీ విబేధాల కారణంగా గతేడాది విడిపోయారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. -
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్నా
స్పీకర్ బాక్సులు బద్దలయ్యాయి. స్తంభాలకు కట్టిన హారన్లు కేకపెట్టాయి. టేప్ రికార్డర్ల మోతకు అంతే లేదు. రేడియోలు మళ్లీ మళ్లీ పాడాయి. ‘జిమ్మీ.. జిమ్మీ.. ఆజా... ఆజా’... ‘హరి ఓం హరి... హరి ఓం హరి’... ‘మేరే దిల్ గాయేజా జు..జు.. జుబి జుబి జూబీ’... ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’... బప్పీ లహిరి అనే పేరు 1980లలో హోరై దేశాన్ని చుట్టేసింది. గంతులు రాని వాళ్లు గంతులేశారు. చిందులు వేయని వాళ్లు చిందులేశారు. ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచి బప్పీ లహిరి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ నృత్య సంగీతభరిత కాలం మరి తిరిగి రాదు. బప్పీ లహిరి ఇంటర్ వరకు కూడా చదువుకోలేదు. కాని ఉన్న చోటే ఉండిపోవడం మాత్రం బతుక్కు చేటు అని ముందే తెలుసుకున్నాడు. కోల్‌కతా మహా నగరం. తల్లిదండ్రులు అపరేష్ లహిరి, బాన్సురి లహిరి ఆ నగరంలో అంతో ఇంతో పేరున్న సంగీతకారులు. తల్లి క్లాసికల్ కచేరీలు ఇస్తుంది. బప్పీ ఒక్కగానొక్క కొడుకు. అయినా సరే ఉన్న చోటే ఉండటం సరికాదు అనుకున్నాడు బప్పీ. ముంబై వెళ్లాలి... సాధించాలి అనుకున్నాడు. సంగీత దర్శకుడుగా. 21 ఏళ్లు అప్పటికి. ముంబై చేరుకున్నాడు. కిశోర్ కుమార్ అతనికి దూరపు చుట్టం. హీరోయిన్ కాజోల్ తండ్రి సోము ముఖర్జీ దగ్గరి చుట్టం. సోము తీస్తున్న ‘నన్హా షికారి’ (1973) సినిమాకు సంగీతం చేశాడు. ఓకే అనిపించింది. ఆ తర్వాత తాహిర్ హుసేన్ తీసిన ‘జఖ్మీ’ (1975)తో గుర్తింపు వచ్చింది. 1977లో వచ్చిన ‘ఆప్ కీ ఖాతిర్’లోని ‘బంబై సే ఆయా మేరా దోస్త్... దోస్త్కో సలామ్ కరో’... పాట ఆల్మోస్ట్ డూపర్ హిట్ అయ్యింది. కాని అలాంటి గుర్తింపు కాదు బప్పీ కోరుకుంటున్నది. ఇంకా ఏదో చేయాలి. అప్పుడే అమెరికాలో కచేరీ చేసే చాన్స్ వచ్చింది. లోకం చూస్తే విషయం తెలుస్తుంది అని బయలు దేరాడు. పారే నీరే ఒండ్రుమట్టిని తోడు తీసుకుంటుంది. బప్పీ అమెరికాలోని చికాగోలో ఆ రాత్రి ఒక పబ్‌కు వెళ్లాడు. పబ్‌లో అంతా హోరుగా ఉంది. వెలిగే ఆరే దీపాలు. డాన్స్ చేస్తున్న జంటలు. ఒకతను మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ నచ్చిన బప్పీ అతని దగ్గరకు వెళ్లి ‘నువ్వు ప్లే చేస్తున్న సంగీతం ఏమిటి?’ అని అడిగాడు. ‘నేను డిస్క్ ప్లే చేస్తున్నాను. పబ్‌లో అందరూ డాన్స్ చేయడానికి ప్లే చేస్తున్నాను కనుక ఇది డిస్కో’ అన్నాడు. ఆ సౌండ్ బప్పీకి నచ్చింది. ఆ బీట్ కూడా. అది ఇండియాలో మొదలు కానున్న డిస్కో కాలానికి ఆరంభ క్షణం. ∙∙ పోటీదారుల్ని అర్థం చేసుకోకపోతే పోటీలో నిలవడం కష్టం. 1970ల కాలంలో బాలీవుడ్ సినిమా రంగం ఘనంగా ఉంది. పోటీలో గండర గండలు. ఎస్.డి. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి. బర్మన్, కళ్యాణ్‌జీ–ఆనంద్జీ... వీళ్లంతా టాప్‌లో ఉన్నారు. వీళ్ల మధ్య బప్పీ నిలబడాలి. అతను చిన్నప్పటి నుంచి తబలా ప్లేయర్. ఏ బీట్ శ్రోతలకు హుషారునిస్తుందో తెలుసు. అదే సమయంలో తల్లి ద్వారా విన్న శాస్త్రీయ సంగీతం వల్ల ఏ స్వరం చెవికి ఇంపుగా ఉంటుందో కూడా తెలుసు. ఈ మెలోడీని, బీట్‌ని సరిగ్గా కలపగలిగితే చాలు అనుకున్నాడు బప్పీ. కొత్త సంగీత పరికరాలతో ఎప్పటికప్పుడు పోటీ పడే ఆర్.డి. బర్మన్ను ఎదుర్కొనాలంటే డిస్కో ఒక మార్గంగా కనిపించింది. అదే సమయంలో అమితాబ్ స్టార్‌డమ్‌ను తట్టుకోవడానికి మిథున్ చక్రవర్తి ప్రయత్నిస్తున్నాడు. మిథున్‌ను పెంచడానికి కూడా కొంత మంది ట్రై చేస్తున్నారు. బి.సుభాష్ అనే బి గ్రేడ్ దర్శకుడు బప్పీకి స్నేహితుడు. బప్పీ అప్పటికే డిస్కో బీట్తో ఒకటి రెండు పాటలు చేయడంతో ఇదేదో బాగుందే అనుకుని ‘డిస్కో డాన్సర్’ అనే కథను తయారు చేశాడు. మిథున్ హీరో. కాని బప్పీకి అర్థమైంది. ‘ఈ సినిమా నాది’ అనుకున్నాడు. డిస్కో మ్యూజిక్ నేపథ్యంలో పాటలు పుట్టాయి. 1982. సినిమా రిలీజైంది. నిజానికి పెద్దగా డాన్స్ రాని మిథున్ చక్రవర్తి డాన్సింగ్ స్టార్ అయ్యాడు. బప్పీ లహిరి డిస్కో కింగ్ అయ్యాడు. ఆ సినిమాలోని ప్రతి పాట వీధి వీధి వాడ వాడ మార్మోగి పోయింది. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో, తిరునాళ్లలో, పెళ్లిళ్ల లో అందరూ ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ పాటకు డాన్స్ వేయడమే. ‘యాద్ ఆ రహా హై తేర ప్యార్’, ‘గోరోంకి నా కాలోంకి దునియా హై దిల్ వాలోంకి’, ‘కోయి యహా అహ నాచే నాచే’ హిట్టు మీద హిట్టు. దేశం ఇక డిస్కోలోకి మేల్కొంది. ∙∙ కృష్ణకు ఒక హిట్ ఎలాగైనా ఇవ్వాలని పట్టుదలగా కె.రాఘవేంద్రరావు తీసిన ‘ఊరికి మొనగాడు’ హిట్ కావడం బప్పీ లహిరికి లాభించింది. దానిని కృష్ణ ‘హిమ్మత్వాలా’ పేరుతో హిందీలో తీయాలని అనుకున్నప్పుడు బప్పీ లహిరిని సంగీతానికి ఎంచుకున్నాడు. ‘ఒక పాటలో బోలెడన్ని కుండలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాట చేయండి’ అని రాఘవేంద్రరావు అడిగితే ట్యూన్ కట్టేటప్పుడు తన ఎదురుగా ఐదారు తబలాల వరుస పెట్టుకుని ఉండే బప్పీ ఒక ట్యూన్ వినిపించాడు. పాట ఓకే అయ్యింది. షూటింగ్‌కు జితేంద్ర హాజరయ్యాడు. శ్రీదేవితో పాట. నగరాలో పాట విని ‘ఇదేం పాట డైరెక్టరు గారూ... ఇవేం స్టెప్పులు’ అని పైకే అనేశాడు. కాని చేయక తప్పలేదు. ‘హిమ్మత్వాలా’ రిలీజైంది. ఒక్క పాట. ‘నైనోమే సప్నా సప్నోమే సజ్నీ సజ్నీ పే దిల్ హోగయా’... ఎక్కడ చూసినా అదే. ‘హిమ్మత్వాలా’తో పాటు బప్పీ పాటా హిట్ అయ్యాయి. ఇక కె.రాఘవేంద్రరావు, జితేంద్ర, బప్పీ లహిరి ఒక టీమ్ అయ్యారు. తెలుగులో హిట్ అయిన ‘దేవత’ హిందీలో ‘తోఫా’(1984) గా రీమేక్ అయితే ‘తోఫా.. తోఫా.. తోఫా... లాయా లాయా లాయా’ హిట్. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా ‘మవ్వాలి’గా రీమేక్ అయితే ‘ఉయ్యమ్మ.. ఉయ్యమ్మ ముష్కిల్ ఏ క్యా హోగయీ’ మాస్ హిట్. ‘ముందడుగు’ రీమేక్ ‘మక్సద్’, ‘జస్టిస్ చౌదరి’, ‘ఖైదీ’... ఈ సినిమాలన్నింటికీ బప్పీ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదంతా ముంబై నుంచి హైదరాబాద్‌కు బప్పీ రావడానికి కారణమైంది. ∙∙ కృష్ణ ఏది చేసినా ఘనంగా చేయాలనుకుంటాడు. ‘సింహాసనం’ (1986) రెండు భాషల్లో తీయ తలపెట్టిన భారీ జానపద చిత్రం. తెలుగులో తాను. హిందీలో జితేంద్ర. రెండు భాషల్లో హిట్ పాటలు తప్పవు కనుక బప్పీ లహిరిని రంగంలోకి దించాడు. నిజానికి కృష్ణకు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడటం లేదు. రాజ్ సీతారాంతో సర్దుకోవాలి. కాని ఆ మైనస్‌ను కూడా పట్టించుకోని స్థాయిలో బప్పీ లహిరి భారీ హిట్ పాటలు అందించాడు. ‘ఆకాశంలో ఒక తార’ నేటికీ మోగుతూనే ఉంది. ఆ సినిమాలో ‘ఇది కల అని నేననుకోనా’, ‘గుమ్మా గుమ్మా’, ‘వహవ్వా నీ యవ్వనం’ మాస్‌ను క్యాసెట్లు కొనేలా చేశాయి. ఆ తర్వాత కృష్ణ హీరోగా భారీ ఖర్చుతో తీసిన సాధారణ సినిమా ‘తేనె మనసులు’కు, ‘నసీబ్’ రీమేక్‌గా చేసిన ‘త్రిమూర్తులు’కు పాటలు ఇచ్చాడు. కాని చిరంజీవి– బప్పీ లహిరి కాంబినేషన్లో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’ కలెక్షన్లలో అంతగా ఘనంగా లేకపోయినా పాటల్లో ఊపేసింది. ‘చుక్కల పల్లకిలో’, ‘రాధా రాధా మదిలో మన్మధ బాధ’కు తెర మీద కాగితపు ముక్కలు ఎగిరాయి. అయితే బప్పీ లహిరి అసలు సిసలు హిట్ ‘గ్యాంగ్ లీడర్’తో దక్కింది. ఆ సినిమాలో పాటలు చిరంజీవిని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేర్చాయి. ‘జీ ఏ ఎన్ జీ గ్యాంగ్ గ్యాంగ్’... ఎంత ఫాస్ట్ బీటో ‘భద్రాచలం కొండ’ అంత పల్లె బీట్తో ఆకట్టుకున్నాయి. ‘వానా వానా వెల్లువాయే’ పాట ‘రచ్చ’ సినిమాలో రీ మిక్స్ అయ్యేంత ఫ్రెష్‌గా నేటికీ ఉంది. ఆ పాటలో చిరంజీవి, విజయశాంతి గుర్తుండిపోయారు జల్లు కురిసే వానలాగా. చిరంజీవికే ‘రౌడీ అల్లుడు’ చేసిన బప్పీ బాలకృష్ణకు ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’ చేశాడు. ∙∙ కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’తో హిందీ దేశానికి తెలిశాడని అనుకుంటాం కాని దానికి ముందే బప్పీ అతని చేత ‘టూటే ఖిలోనే’లో పాడించాడు. శేఖర్ కపూర్ హీరో. షబానా ఆజ్మీ హీరోయిన్. ‘మానాహో తుమ్ బేహద్ హసీన్’ పాట ఇప్పటికీ బాగుంటుంది. ఆ తర్వాత తెలుగులో మోహన్‌బాబు కోసం చేసిన పాటల్లో ఏసుదాస్‌కు మంచి పాటలు ఇచ్చాడు. ‘రౌడీ గారి పెళ్లాం’ ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’... ‘బ్రహ్మ’లో ‘ముసి ముసి నవ్వులలోనా’ పాటలు హిట్. ∙∙ బప్పీ లహిరి చాలా ప్రయోగాలు చేశాడు. డిస్కోలో ఇండియన్ మ్యూజిక్ ‘ఫ్యూజన్’ను ఆ రోజుల్లోనే ప్రయత్నించాడు. ‘నమక్ హలాల్’లో 12 నిమిషాల పాట ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’లో డిస్కోను, క్లాసికల్‌ను కలిపాడు. కిశోర్ కుమార్ దగ్గరకు ఈ పాట కోసం వెళితే సహనం తక్కువగా ఉండే ఆయన (ఎంత పెద్ద పాట పాడినా అదే పారితోషికం కనుక) ‘ఇంత పెద్ద పాట నా వల్ల కాదు. ఇలాంటివి రఫీ సాబ్ కదా పాడేది’ అన్నాట్ట. కాని బప్పీ పట్టుబట్టి పాడించాడు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. మన జయప్రద అమితాబ్‌తో కలిసి నటించిన ‘షరాబీ’, ‘ఆజ్ కా అర్జున్’ సినిమాల్లో పాటలు బప్పీ చేయగా హిట్ అయ్యాయి. ‘షరాబీ’లో ‘దేదే ప్యార్ దే ప్యార్ దే’, ‘ఇంతెఖాల్ హోగయీ ఇంతెజార్కీ’... పాటలు ‘ఆజ్ కా అర్జున్’లో ‘గోరిహి కలాయియా’ పాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉన్నాయి. ∙∙ 1982 నుంచి 1990 వరకూ దాదాపు ఒక ప్రభంజనంలా బప్పీ కొనసాగాడు. డిస్కో తర్వాత బ్రేక్‌ను తెచ్చాడు. గోవిందా తొలి సినిమా ‘ఇల్జామ్’లో ‘ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్’ పాటతో బ్రేక్ డాన్స్ పాటలు ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ట్రెండ్ కొంతకాలం సౌత్‌లో కూడా కొనసాగింది. చివరకు ఆనంద్– మిలింద్, నదీమ్ – శ్రావణ్ వచ్చే వరకూ అతనికి ఎదురు లేకపోయింది. ∙∙ బప్పీ లహిరి మాస్ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఉండటానికే అతడు ఇష్టపడ్డాడు. బాలీవుడ్ కూడా అలాగే అతణ్ణి ఉంచింది. పెద్ద పెద్ద సినిమాలు, సీరియస్ కథాంశాలు అతని దాకా రాలేదు. క్లాసిక్స్ అంటూ చెప్పుకోవడానికి అతనికి ఏమీ లేవు. కాని అతడు మంచి పాటలు చేయగలడు. ‘ప్యార్ మే కభీ కభీ ఐసాహి హోతాహై’ (చల్తే చల్తే), ‘కిసీ నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై’ (ఐత్బార్), ‘జిద్ నా కరో అబ్ తో రుకో ఏ రాత్ నహీ ఆయేగీ’ (లహూ కే దో రంగ్) వంటి మంచి మెలోడీలు చేశాడు. బప్పీని సంగీత పండితులు నిరాకరించినా అన్ని పాటల్లో అతను తబలాను వాడే పద్ధతిని విశేషంగా మెచ్చుకుంటారు. అతడికి తబలా అంటే ఇష్టం కనుక ఎంతటి బీట్ ఆధారిత పాటలో కూడా తబలాను చాలా ప్రతిభావంతంగా ఇముడ్చుతాడు. బప్పీ లహిరిని 1980ల మాస్ పాటలకు ఐకాన్‌గా భావిస్తారు. అందుకే ‘డర్టీ పిక్చర్’ను తీసేప్పుడు ఆ కాలం మాస్ పాటకు సంకేతంగా బప్పీ స్టయిల్లో ‘ఊలాల ఊలాల’ పాట చేయించి అతని చేతే పాడించారు. బప్పీ, అలీషా చినాయ్, షరోన్ ప్రభాకర్ లాంటి గాయనులను సినిమాల్లోకి తెచ్చాడు. అతడు వెలుగుతున్నప్పుడు నిర్మాత దర్శకులే కాదు గాయనీ గాయకులు కూడా అతని ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. చివరి రోజుల్లో అతడు తనకు కనీసం ‘పద్మశ్రీ’ వస్తే బాగుండు అనుకున్నాడు. రాలేదు. ఒక కాలపు మాస్ ప్రేక్షకులు తనకు తెర మీద చిల్లర నాణేలు విరజిమ్ముతూ చేసిన సత్కారమే చాలనుకున్నాడు. అతను చేసిన మంచి పాటతోనే అతనికి వీడ్కోలు చెప్పవచ్చు. చల్తే చల్తే మేరే ఏ గీత్ యాత్ రఖ్నా కభి అల్విదా నా కెహెనా కభి అల్విదా నా కెహెనా... మైక్ టైసన్ ‘జింగిల్’ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ 2018లో ఎమ్ఎమ్ఏ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చినప్పుడు ఆయన్ను స్వాగతిస్తూ జింగిల్ పాటను బప్పీ పాడాడు. ‘ఓమ్ స్వాగతమ్..’ అని ప్రారంభమయ్యే ఈపాట మైక్ టైసన్ ను కొనియాడుతూనే బప్పీ మార్క్‌ను చూపింది. బప్పీ... ది గోల్డ్ మ్యాన్ ‘నడిచే నగల దుకాణం’... బప్పీ లహిరి గురించి చాలామంది సరదాగా అనుకునే మాట ఇది. ఇక అందరూ ఆయన్ను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఎందుకంటే మెడలో కొబ్బరి తాడుని తలపించే బంగారు గొలుసులు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతులకు కడియాలు, మణికట్టు గొలుసులు... ఇలా బప్పీ ఒంటిపై బంగారం మెరిసేది. నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్నది ఆయన ఆకాంక్ష. అలాగే బంగారాన్ని అదృష్టంగా భావించి ఎప్పుడూ కనీసం ఎనిమిది చెయిన్ లను మెడలో వేసుకునేవారు. 1974లో బప్పీవాళ్ల అమ్మగారు తొలి బంగారపు గొలుసు ఇచ్చారు. తొలిసారి వేసుకున్న ఈ గొలుసు పేరు ‘ఏ హరే కృష్ణ చెయిన్ ’. తర్వాత భార్య చిత్రాణి 1977లో బంగారపు గొలుసు ఇచ్చారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని బంగారపు గొలుసులు వేసుకుంటూ గోల్డ్ మ్యాన్, బ్లింగ్ మ్యాన్‌గా ప్రఖ్యాతిగాంచారు. అలాగే వినూత్న వస్త్రధారణ, ప్రత్యేకమైన సన్ గ్లాసెస్ ధరించేవారు బప్పీ. ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలంటే ముందు రోజే ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ గ్లాసెస్ పెట్టుకోవాలి? ఏ ఆభరణాలు ధరించాలి? అనేది ప్లాన్ చేసేసుకునేవారట. విశేషం ఏంటంటే... వెరైటీ డ్రెస్సింగ్ మీద భర్తకి ఉన్న ఆసక్తి గమనించి, భార్య చిత్రాణి లహిరి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బప్పీయే స్వయంగా చెప్పారు కూడా. కలసి రాని రాజకీయాలు 2014లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రస్తావిస్తూ, తనకు 754 గ్రాములు, భార్యకు 967 గ్రాముల బంగారం ఉందని, ఇద్దరిదీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నాయనీ బప్పీ పేర్కొన్నారు. అయితే సంగీత ప్రపంచంలో హిట్ రాగాలిచ్చిన బప్పీకి రాజకీయ జీవితం మాత్రం ఫ్లాప్ రాగం అనాలి. ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. – కె -
Bappi Lahiri Death: సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత
-
ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత
ముంబై: ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్ 27న బెంగాల్లో జన్మించిన బప్పి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బప్పీ లహరి మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బప్పి లహరి 70వ దశకంలో బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేశారు. మిథున్ చక్రవర్తికి డిస్కో డ్యాన్సర్ పాటతో లైఫ్ ఇచ్చిన బప్పి లహరి.. డిస్కో కింగ్‌గా గుర్తింపు పొందారు. నిత్యం బంగారు ఆభరణాలు ధరించి కనిపించే సంగీత విద్వాంసుడిగా ఆయనకు మరో గుర్తింపు కూడా ఉంది. లహరి తన సినీ ప్రయాణంలో వార్దత్, డిస్కో డాన్సర్, నమక్ హలాల్, డ్యాన్స్ డ్యాన్స్, కమాండో, సాహెబ్, గ్యాంగ్ లీడర్, సైలాబ్, షరాబి వంటి హిట్ సాంగ్స్‌ను అందించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారాడు. ఇక సంగీత దిగ్గజాలు మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, విజయ్ బెనెడిక్ట్, షారన్ ప్రభాకర్, అలీషా చినాయ్, ఉషా ఉతుప్ వంటి తరతరాల గాయకులతో కలిసి చేశాడు. చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు దీప్ సిద్ధూ మృతి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్‌కు బప్పిదా బంధువు. హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో బప్పి లహిరి సంగీతం అందించారు. ఇక తెలుగు ప్రేక్షకులనూ ఆయన సంగీతంలో ఓలలాడించారు. సింహాసనం (1986), తేనే మనసులు (1987), త్రిమూర్తులు, శంఖారావం, సామ్రాట్, కలెక్టర్ విజయ (1988), మన్మధ సామ్రాజ్యం, స్టేట్ రౌడీ (1989), చిన్నా (1990), చిన్న కోడలు, ఇంద్ర భవనం (1991), గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ అల్లుడు, దొంగ పోలీస్ (1992), రక్త తర్పణం, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, నిప్పు రవ్వ (1993), రౌడీ రాజకీయం, పెద్ద యజమాని (1995), ముద్దాయి ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్స్పెక్టర్, పుణ్య భూమి నా దేశం వంటి తెలుగు చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. తెలుగులో చివరగా రవితేజ “డిస్కో రాజా” సినిమాలోని “ఫ్రీక్ అవుట్” పాటలను పాడారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జెంటిల్మెన్-2 చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారు
MM Keeravani To Compose Music For Gentleman-2: గతంలో జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కె.టి.కుంజుమోన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయం కావడం గమనార్హం. ఆ తరువాత పలు భారీ చిత్రాలను నిర్మించిన కె.టి.కుంజుమోన్ కొంత గ్యాప్ తరువాత తాజాగా జెంటిల్మెన్ –2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరన్నది గెస్ చేసిన వారికి బంగారు నాణేన్ని బహుమతిగా అందించనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పలువురు తమకు తోచిన సంగీత దర్శకుల పేర్లను తెలియచేశారు. వారిలో జెంటిల్ మెన్ –2కు సంగీత దర్శకుడు ఎవరన్నది కరెక్టుగా తెలిపిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలను బహుమతిగా త్వరలో అందించనున్నట్లు నిర్మాత చెప్పారు. కాగా ఆదివారం ఆయన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని కుంజుమోన్ వెల్లడించారు. -
విషాదం: క్యాన్సర్‌తో పోరాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ మృతి
Music director Kaithapram Viswanathan Passed Away: మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి (58) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విశ్వనాథన్‌కు భార్య గౌరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1963లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆయన మ్యూజిక్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించి కన్నకి, తిలక్కం సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన సేవలకు గాను గానభూషణం అనే బిరుదును సైతం సంపాదించుకున్నారు. 'కన్నకి' చిత్రానికి గాను 2001లో కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. కాగా విశ్వనాథన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
షాకింగ్.. విడాకులు ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులు ప్రకటించింది. ఇప్పటికే సమంత-నాగచైతన్యల విడాకుల తీసుకున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోలివుడ్ స్టార్ మూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ జంట 2020లోనే విడాకులు తీసుకుంది. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. దాదాపు ఏడాది తర్వాత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఇమ్మాన్. ‘నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు ఇమ్మాన్. ఇమ్మాన్.. 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్ జంటగా నటించిన తమిజన్ చిత్రంతో మ్యూజిగ్ డైరెక్టర్‌గా మారాడు. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) సినిమాకు సంగీతం అందించాడు. అజిత్ హీరోగా నటించిన విశ్వాసం(2019)చిత్రానికి గాను.. జాతీయ అవార్డును అందుకున్నాడు. View this post on Instagram A post shared by D.Imman (@immancomposer) -
న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా..
Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయం అవసరంలేని పేరు. ఆయన సంగీతం గురించి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఆయన ముఖ చిత్రంతో ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. స్వరకర్త ఇళయరాజా అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజికల్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు. న్యూయార్క్‌లో ఇసైజ్ఞాని (మ్యూజికల్ జీనియస్) ఇళయరాజా పోస్టర్‌ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఇటీవల స్పూటీఫైతో ఆయన జతకట్టి, ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పూటీఫైలో ఆయన ప్లేలిస్ట్‌లను ప్రమోట్ చేయడానికి 3 నిమిషాల నిడివి గల యాడ్ ఫిల్మ్‌లో కనిపించారు ఇళయరాజా. నవంబర్ 19న టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా బ్యానర్ ప్రదర్శించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో ప్రకటిస్తూ 'ఈ చాలా పవిత్రమైన రోజున న్యూయార్క్‌లోని బిల్‌బోర్డ్స్ ఆఫ్ టైమ్స్ స్క్వేర్‌లో 'రాజా ఆఫ్ మ్యూజిక్', 'రాజా రూల్స్'' అని రాసుకొచ్చారు. ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ఈ విజయం ఆయన కెరీర్లో ఒక మెట్టుగా అభివర్ణించారు. Our own #Isaignani at #timesquare proud us🙏🏽👍🏽 pic.twitter.com/SEd60IJEFP — venkat prabhu (@vp_offl) November 19, 2021 'ఆయన మనందరి కంటే ముందుంటారు. కుటుంబంతో కలిసి ఉండండి. ఎప్పుడు పెద్దవారు, మొదటివారు' అని కాస్ట్యూమ్ డిజైనర్ వాసుకి భాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విదుతాలయి, మాయన్, తుప్పరివాళన్, తమిళరసన్ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా చేస్తున్నారు ఇళయరాజా. He is always way ahead from all of us...Put together in the family. Always the first and biggest.Dellighted to see #RAJAAPPA. @ilaiyaraajaoffl at the Times Square billboard. New York city. USA. @Spotify @SpotifyUSA ❤️ pic.twitter.com/gRmrfLOQdB — vasuki bhaskar (@vasukibhaskar) November 19, 2021 -
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
యువ సంగీత దర్శకుడు అమ్రేష్ తాజాగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈయన ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత కలైమామణి జయచిత్ర కుమారుడన్న విషయం తెలిసిందే. తొలుత నటుడిగా రంగప్రవేశం చేసిన అమ్రేష్ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు. మొట్టశివ కెట్టశివ, భాస్కర్ ఒరురాస్కెల్, చార్టీ చాప్లిన్-2, శత్రు, గర్జన వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. మల్లికా షెరావత్ కథానాయికగా నటిస్తున్న నాగమతి చిత్రానికి అమ్రేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలె పూజా కకార్యక్రమాలతో ప్రారంభమైంది. పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని అమ్రేష్ ముంబైలో రూపొందిస్తున్నారు. -
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బర్త్‌డే స్పెషల్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరు ఎస్ఎస్ తమన్. ట్రెండీ మ్యూజిక్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేస్తూ స్టయలిష్ కంపోజర్‌గా నిలుస్తున్నాడు. బ్యాక్ అండ్ బ్యాక్ హిట్ సాంగ్స్‌తో ప్రస్తుతం తమన్ హవా నడుస్తోంది. బుట్టబొమ్మ సృష్టించిన బ్లాక్ బస్టర్ రికార్డులతో తమన్ పాపులారీటీ రేంజ్ నెక్ట్స్ లెవల్ని కూడా దాటేసింది. నవంబరు 16 తమన్ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్. సంగీత దర్శకుడిగా తమన్ జీవన ప్రస్థానంపై ఆసక్తికర వీడియో మీ కోసం.. -
Happy Birthday S Thaman: డ్రమ్మర్ కాదు.. విన్నర్
-
విందామా... ప్రకృతి గీతం
ప్రకృతి నుండి వచ్చే వివిధ వైవిధ్యభరితమైన ధ్వనులు...... పక్షుల కువకువలు, నదీ ప్రవాహాలు, గాలి వీచికలు, సాగర ఘోషలు, జలపాత జోరులు, తుమ్మెద ఝంకారాలు, కీటక శబ్దాలు... వెరసి భూమి మనకు అందించే సంగీత కచేరి. ఆ దృష్ట్యా చూసేవారికీ భూమి అద్భుత సంగీతకారిణిగా గోచరిస్తుంది. నదులు, వాగులు, సాగరాలను, సెలయేళ్ల గలగలలను వివిధ సంగీత సాధనాలను వాయించే సంగీతకారులుగా చేసి, పక్షుల కుహూ కుహూలను గాత్రధారులను చేసి, ఈ అద్భుత మేళవింపుతో మనకు సంగీతాన్ని వినిపించే గొప్ప సంగీతవేత్త. శోధించ గలిగేవారికి మరెన్నో వివిధ సంప్రదాయ సంగీతాలు, అనేక రాగాలను శ్రవణానందకరంగా వినిపించే గొప్ప సంగీత దర్శకురాలు. అవును. భూమికి సంగీతం ఉంది. వినగలిగేవారికి అది సంగీతాన్ని వినిపిస్తుంది. అయితే మనం దృష్టి సారించి చూసి, తెలుసుకోగలగాలి. వినగలగాలి. అసలు మనకు జిజ్ఞాస, వినే మనస్సుండాలి. ఈ భూమి, దీని మీద నివసించే మానవులు, ప్రకృతి జంతుకోటి చేసే కదలికలకు, శబ్దాలకు లేదా ధ్వనులకు, ఓ తూగు, ఊగు, లయ ఉంటుంది. వాటికి మనస్సును పులకింపచేసే ఒక శక్తి ఉంది. అవి వీనులకు విందు కలిగిస్తాయి. ఓ హాయినిస్తాయి. మనస్సుకు ఒక ప్రశాంతతనిచ్చి, ఒక అలౌకిక ఆనందానికి లోను చేస్తాయి. అనేకమంది కవులు, రచయితలు భూమి వినిపించే సంగీతం గురించి చక్కగా వర్ణించారు విశ్వవ్యాప్తంగా. అది వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, షేక్స్పియర్, కీట్స్, వర్డ్స్‌వర్త్ లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. నదులు ప్రవాహపు తీరు వినసొంపుగా ఉంటుంది. ప్రవహించే భూ విస్తీర్ణాన్ని బట్టి వివిధ రకాలుగా నది ధ్వనిస్తుంటుంది. అవన్నీ చెవులకు హాయినిస్తాయి. నదులను తనలో కలుపుకునే సముద్రం నిరంతరం గర్జిస్తూనే ఉంటుంది. పర్వతాల, కొండల మీదనుండి భూమి ఒడిని చేరాలని తహతహలాడుతూ దుందుడుకుగా దూకే ఝరులు వీక్షకుల గుండెలను ఝల్లుమనిపిస్తూ విభ్రాంతిని కలిగించినా శ్రవణాలకు ఒకే సంగీత వాద్యాన్ని వందలమంది వాయించినంత అనుభూతినిస్తాయి. ఇహపరమైన ఇక్కట్లను, బాధను కొద్దిసేపైనా మనం మరిచేటట్టు చేస్తుంది. శ్రవణానందకరమైన ఏ శబ్దమైనా మనసును రసమయం చేయగల మహత్తును కలిగి ఉంటుంది. గాలి ఈలలు వేస్తుందని, ఎన్నెన్నో ఊసులు చెప్పగలదని ఎంతమందికి తెలుసు? వేసవి తాపాన్ని తొలగిస్తూ మనస్సులను ఝల్లుమనిపిస్తూ భూమిని ముద్దాడటానికి అనూహ్యమైన వేగంతో వచ్చే తొలకరిజల్లు శ్రవణ పేయమై మన ఉల్లాన్ని ఆనందలహరిలో ప్రవహింప చేయదూ! తెలతెలవారుతుండగానే చెట్ల మీద ఉండే పక్షులు బద్ధకాన్ని వదిలించుకునే క్రమంలో ఒళ్ళు విరుచుకుంటూ, రెక్కల సవరింపులో చేసే విదిలింపులు, టపటపలు, గొంతు సవరించుకుంటూ చేసే కిల కిలకిలలు ఉదయపు నడకలో ఉన్నవారికి నిత్యానుభవమే. తెల్లవారుతోందన్న సంగతిని సూచిస్తూ... కొక్కోరో కో.. అని కుక్కుటం చేసే శబ్దం మేలుకొలుపుకు చిహ్నం. సూర్యాస్తమయాన్ని సూచించే ఇంటికి వడివడిగా చేరుకునే పశువుల గిట్టల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తూ... ముచ్చటను కలుగచేస్తాయి. ఈ భూమి మీద జంతువులు కూడ నివసిస్తున్నాయి. మనుషుల స్వరాలలోని వైచిత్రి వాటిలో కూడ చూస్తాము. అడవికి రాజుగా భాసిల్లే సింహం చేసే గర్జన, మదమెక్కిన గజరాజు పెట్టే ఘీంకారం, చెడు భావనను కలిగించే నక్కల ఊళలు, పాము బుసలు, శిరోభారాన్ని, చికాకును కలిగించే కీచురాళ్ళ ధ్వనులు మనలను భీతిల్లేటట్లు చేస్తాయి. మానవ ప్రమేయం లేక ప్రకృతి చేసే శబ్దాలను అనాహతమని, మానవ ప్రేరితంగా వచ్చే శబ్దాలను లేదా ఆహతమని అంటారు. మన ఊపిరి నిలిపేందుకు నిరంతరం పరిశ్రమించే ఊపిరితిత్తుల ఉచ్వాస నిశ్వాసాలలో ఓ లయ ఉంది. శ్రుతి ఉంది. ఇవి సంగీత ధ్వనులే. మన ప్రాణాన్ని నిలిపే గుండె లబ్.. డబ్ ల ధ్వనిని ఎంత లయబద్ధంగా చేస్తుంది! శ్రుతి లయలలో రవ్వంత అపశ్రుతి వచ్చినా ఫలితం మరణమే కదా! మన శరీరాన్ని.. నాదమయం.. అన్నారు ప్రాజ్ఞలు. నాదం ఒక ప్రాణశక్తి. సంగీతానికి మనసును పరవశింపచేసే శక్తి ఉంది. ఒక గొప్ప సంగీత గాత్రధారి ఆలాపన చాలు మనల్ని తన్మయులను చేయటానికి. మాటను చక్కగా ఉచ్చరిస్తూ, కావలసిన ఊనికనిస్తూ మాటలలోని భావాన్ని గొంతులో పలికిస్తూ భాషించే వ్యక్తి సంభాషణ శ్రోతలనలరిస్తుంది. ఈ పోహళింపులకు మాధుర్యాన్ని జోడిస్తూ పాడగల పశువుల కాపరి పాట మనలను ఎంతగా అలరించగలదో, అంతగానే ఉన్నత శ్రేణి కి చెందిన సంగీతకళాకారుని త్యాగరాజ కీర్తన కూడ. ఇంతటి మహత్తును కలిగి ఉన్న సంగీతాన్ని భూమి మనకు నాదరూపంలో అందిస్తుంది. దీన్ని ఆనందించి పరవశించి, దాన్ని ఒక అనుభూతి చేసుకుని మనసు పొరల్లో పొదవుకోగల ఏకైక బుద్ధిజీవి మానవుడు ఒక్కడే. భూమి తన సంగీతంతో మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, సాంత్వన చేకూర్చి మనలను ఆనంద రసజగత్తులోవిహరించేయగల ఓ గొప్ప సంగీతజ్ఞురాలు. ఈ ఆనందస్థితిలో మనిషి తన విధిని చక్కగా నిర్వర్తించగలడు. ఈ ఆనందమే స్వర్గమైతే దీన్ని మనకు అందచేసే భూమి స్వర్గ తుల్యమే. దీన్ని మనం కాపాడుకోవాలి. సంరక్షించుకోవాలి. జీవనశైలి, నాగరికత, సాంకేతికతలనే పేరుతో దీన్ని విధ్వంసం చేసే హక్కు మనకెక్కడుంది? ఇప్పటికే ఈ గ్రహం మీద మన జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాం. ఈ భూ గ్రహాన్ని పూర్తిగా ఓ అగ్నిగుండంగా మార్చి భావితరానికి కానుకగా ఇద్దామా! ప్రస్తుతానికి మనిషి నివసించే, నివసించగల ఒకే ఒక గ్రహం ఈ భూమి. మన ముందు తరాలు, మన తరం నివసించిన ఈ.. ఆనందనిలయాన్ని... ముందు తరాలకు అందించే బాధ్యత మనందరిదీ. పక్వానికొచ్చిన పంటను పడతులు ఒకచేత ఒడుపుగా పట్టుకుని మరొక చేత కొడవలితో కోసే వేళ అది చేసే శబ్దంలో క్రమముంటుంది. అది సంగీతమే! కోసిన కంకులను మోపులుగా కళ్లాలలో కర్రలతో కొడుతున్నవేళ, తూర్పార పట్టే వేళ చేట చెరుగుళ్ల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తాయి. ఎంత ఆహ్లాదాన్నిస్తాయి! ఒకనాటి పల్లెటూళ్లు చక్కని సంగీత కచేరిలు చేస్తుండేవి. పాలు పితికే క్షణాన ఆ ధార పాత్రను తాకుతున్నప్పుడు వచ్చే ధ్వనికి ఓ లయ ఉంది. తరుణులు పెరుగును చిలికే వేళ కవ్వం, కవ్వపు తాడు చేసే ధ్వని, కవ్వపు గుత్తి కుండను తాకే శబ్దానికి ఎంత లయ! వీటికి తోడు అ ఆ మగువల చేతిగాజులు చేసే ధ్వని ఓ నాదమే. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
విడాకులకు సిద్దమైన మరో బాలీవుడ్ జంట
ప్రముఖ సంగీత దర్శకుడు అనుమప్ రాయ్ సంచలన ప్రకటన చేశాడు. తన భార్య ప్రియా చక్రవర్తి నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ‘పీకు’ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీతో అనుపమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందడమే కాకుండా అవార్డులు కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే తన భార్య ప్రియాతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఆయన ఓ సందేశం ఇచ్చాడు. ‘మేము, అనుపమ్, ప్రియా చక్రవర్తి విడాకులు తీసుకోబోతున్నాం. మా ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికి మంచి స్నేహితులుగా ఎవరి దారి వారు చూసుకుందామని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మేమీమద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇన్నేళ్ల మా ప్రయాణంలో అందమైన, అద్భుతమైన అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు నిండి ఉన్నాయి. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా మేము భార్యభర్తలుగా విడిపోవడమే మంచిదని భావిస్తున్నాం. విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటాం. ప్రతి విషయంలో ఇప్పటి వరకు మాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఈ మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మా గోప్యతను కాపాడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా అనుపమ్ రాయ్, ప్రియా చక్రవర్తిలు 2015లో వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లికి ముందు వారు కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్నారు. అనుపమ్ సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా నాలుగు సోలో ఆల్బమ్‌లను కూడా విడుదల చేశాడు. pic.twitter.com/V8cL725gRg — Anupam Roy (@aroyfloyd) November 11, 2021 -
ఘనంగా మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు
-
అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు
సాక్షి, హైదరాబాద్: తొంభై వసంతాల నిత్యయవ్వనుడు సింగీతం శ్రీనివాసరావు. దశాబ్దాల తెలుగు సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ... -
త్రివిక్రమ్ వల్లే... శంకర్ సినిమా వచ్చింది
‘సామజ వరగమన...’ అన్నారు తమన్.. అన్ని వర్గాల పాటల ప్రేమికులు... ‘ఏం ట్యూన్ అన్నా’ అన్నారు. ఇదొక్కటేనా? అంతకుముందు ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు. అయితే ‘సామజ..’ వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. శంకర్ ‘బాయ్స్’లో నటించిన తమన్ ఇప్పుడు రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంగీతదర్శకుడు. ‘సాక్షి’కి తమన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. ► శంకర్ డైరెక్షన్లో నటించిన ‘బాయ్స్’ తర్వాత ఇన్నేళ్లకు ఆయన సినిమాకి సంగీతం అందిస్తున్నారు... ఈ స్థాయికి రావడానికి ఇరవయ్యేళ్లు పట్టింది. నిజానికి సంగీతం అంటేనే నాకు ఆసక్తి. ‘బాయ్స్’ అçప్పుడే శంకర్ సార్‌తో మ్యూజిక్ గురించి మాట్లాడేవాణ్ణి. నా ట్యూన్స్‌ని ఫస్ట్ విన్నది ఆయనే. నిజానికి ‘బాయ్స్’ సినిమాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌ను నేనే. అయినప్పటికీ మ్యూజికల్‌గానే నా లైఫ్‌ను మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ముందు గా నేను సినిమాల నుంచి నేర్చుకోవాలనుకున్నాను. శంకర్‌గారు పాటలు ఎలా తీయిస్తున్నారు? కెమెరామేన్ రవిచంద్రన్‌గారు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నా. అలా నా కెరీర్లో ఓ ఏడాది శంకర్ సార్‌కు కేటాయించాను. ‘బాయ్స్’లో మాత్రమే యాక్ట్ చేశాను. యాక్టింగ్ నా స్పేస్ కాదనిపించింది. ► శంకర్‌ని తరచూ కలుస్తుంటారా? నటుడిగా ఎందుకు కొనసాగలేదు? చాన్స్ రాలేదా? ‘బాయ్స్’ చిత్రయూనిట్‌లోని యాక్టర్స్‌లో ఇప్పటికీ ఆయన్ను తరచూ కలుస్తుండేది నేనే. ఆ సినిమా విడుదలైన ఓ రెండు, మూడేళ్ల తర్వాత .. ‘నువ్వు యాక్ట్ చేయనన్నావని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. అజిత్, విజయ్ సినిమాల్లో యాక్ట్ చేయనన్నావట? ఏడాది పాటు కష్టపడ్డావు? నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు?’ అని శంకర్‌గారు అడిగారు. ‘‘వారికి ఏదో ఒక రోజు మ్యూజిక్ చేస్తాను కానీ వారి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకోవడంలేదు’’ అని ఆయనకు చెప్పాను. ‘సరే.. మ్యూజిక్కే చేస్తావా?’ అన్నారు. అవునన్నాను. ‘నా ప్రొడక్షన్లో రూపొందుతున్న ‘ఈరమ్’ (2009) (తెలుగులో ‘వైశాలి’) సినిమాకు సంగీతం ఇస్తావా?’ అని అడిగారు.. చేశాను. ఆ తర్వాత ‘మాస్కోవిన్ కావేరి’ సినిమాకు సంగీతం అందించే చాన్స్ వచ్చింది. ఎస్ పిక్చర్స్ (ఈరమ్), ఆస్కార్ ఫిలింస్ (మాస్కోవిన్ కావేరి) చెన్నైలో అప్పటికే పెద్ద బ్యానర్స్. నేను మ్యూజిక్ అందించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే.. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా నా ఫస్ట్ ఫిల్మ్ శంకర్గారిదే. ► ఇప్పుడు హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోని సినిమాకు చాన్స్ ఎలా వచ్చింది? శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మాణంలో సినిమా ఓకే అయ్యిందని తెలియగానే ... ‘దిల్’ రాజుగారితో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఏఆర్ రెహమాన్‌గారు తొలిసారి మ్యూజిక్ చేయనున్నారు.. అదీ శంకర్‌సార్ దర్శకత్వంలో.. కంగ్రాట్స్ సార్’ అన్నాను. కానీ ఆయనేమో ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నాకు శంకర్ వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. నిన్నే కావాలంటున్నారు, మార్చి 1న ఆయన్ను వెళ్లి కలువు’ అన్నారు. షాకయ్యాను. ► మరి.. ఏఆర్ రెహమాన్ మీ సినిమాకు సంగీతం చేయడం లేదా అని శంకర్‌ను అడిగారా? అడగలేదు. ఆయనకు ఫోన్ చేస్తే, ‘15 రోజుల్లో ఓ సాంగ్ చేయాలి.. నువ్వు ఎప్పుడొస్తావ్?’ అని అడిగారు. ‘ఒక వారం టైమ్ ఇవ్వండి.. వస్తాను’ అన్నాను. ఇప్పటివరకు మూడు పాటలు పూర్తి చేశాను. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయి. ► ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులతో వర్క్ చేసిన శంకర్ టేస్ట్‌కు తగ్గట్లు మ్యూజిక్ అందించగలనా అనే ఆందోళన లేదా? భయం ఉంటే మనం ముందుకు వెళ్లలేం. చాలెంజింగ్‌గా తీసుకున్నాను. దర్శకులు శంకర్, త్రివిక్రమ్ ఒకేలా ఆలోచిస్తారని నా అభిప్రాయం. ఇద్దరూ పదేళ్లు ముందుగా ఆలోచిస్తారు. వారిద్దరినీ పట్టుకోవాలి. దాని కోసం కొంచెం ఎక్కువగా పరిగెడతాను అంతే. ► త్రివిక్రమ్‌తో ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల మీ పని ఈజీ అయ్యిందనుకోవచ్చా? త్రివిక్రమ్ నాకో ప్రొఫెసర్లాంటి వారు. ఆయన దర్శకత్వంలో ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశాక మ్యూజిక్ పట్ల నా దృష్టి కోణం మారింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ త్రివిక్రమ్‌గారి వల్లే వచ్చిందను కుంటున్నాను. ‘అల.. వైకుంఠపురములో..’ సక్సెస్ వల్లే శంకర్‌గారితో సినిమా చేసే చాన్స్ వచ్చిందని నమ్ముతున్నాను. ► నా హార్ట్‌కు, బ్రెయిన్‌కు మధ్య త్రివిక్రమ్ ఓ కొత్త నర్వ్ వేశారని అన్నారు ఓ సందర్భంలో.. వివరిస్తారా? అది నిజమే. కొంతమందిని కలిసినప్పుడు మనం మారిపోతుంటాం... కనీసం ఒక శాతం అయినా. అది పెళ్లైన తర్వాత భార్య వల్ల కావొచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక బాస్ వల్ల కావొచ్చు.. మనం మారవచ్చు. త్రివిక్రమ్‌గారి వల్ల నేను మారిపోయాను. సినిమాకు ఉన్న వేరే కోణాలు ఏంటో ఆయన చెప్పారు. ఇదివరకు నేను సినిమా ముందు ఉండేవాణ్ణి. ఆయనతో వర్క్ చేసిన తర్వాత సినిమా వెనక్కి వెళ్లాను. ఇప్పుడు స్క్రీన్ వెనకాల నుంచి వర్క్ చేస్తున్నాను. ► త్రివిక్రమ్ ఒక నర్వ్ వేశారు. మరి.. శంకర్? ఆ నరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాను. ► మీ అమ్మగారితో పాడించాలని ఎప్పుడూ అనుకోలేదా? నాన్న చనిపోయాక 27 ఏళ్లుగా అమ్మ బాధ్యత అంతా నాదే. పాడతానని అమ్మ అడుగుతుంటారు. అయితే ఫ్యామిలీ చేత ఎక్కువ పాడిస్తున్నానంటారేమో అని ఆగాను. నా భార్య శ్రీవర్ధిని ‘కిక్’ , ‘ఆంజనేయులు’ వంటి సినిమాల్లో పాడారు. అలాగే విశాల్ సినిమాకీ పాడుతున్నారు. ► మ్యూజిక్ పరంగా చెన్నైతో పోలిస్తే హైదరాబాద్..? హైదరాబాద్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది. మ్యూజిక్‌కి పెద్ద బేస్ ఇది. చెన్నై ముంబై నుంచి కూడా తరచుగా రాకపోకలు సాగించే మ్యుజిషియన్స్ ఉన్నారు. లోకల్‌గా ఎక్కువ సింగర్స్ ఉన్నారు. కీరవాణి, మణిశర్మ, కోటి వంటివారు చాలా ట్రైన్ చేసేశారు. అలాగే ఇక్కడ బ్యాండ్ కల్చర్ బాగా ఉండడం వల్ల చాలామంది ఇతర వాద్య కళాకారులు కూడా బాగా వచ్చేశారు. ► రీ– రికార్డింగ్ అంటే ఒకప్పుడు చెన్నై కేరాఫ్? అవును.. అయితే ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ► క్రికెట్ బాగా ఆడతారు కదా? అవును శని, ఆదివారాల్లో పూర్తిగా క్రికెట్ ఆడుతూ ఉంటా. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులో మరొకరో ఉండరు. అక్కడా సింగర్స్, ఇతర మ్యుజిషియన్స్ ఉంటారు. హైదరాబాద్, చెన్నైలలో 2 టీమ్స్ ఏర్పాటు చేశాం. ► డైరెక్టర్ శంకర్ ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం.. ఇప్పుడు శంకర్ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్... శంకర ప్రియతమన మ్యూజిక్ డైరెక్టర్... తమన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఈరోజు ఉదయం 9:30 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గంటలకు ‘సాక్షి’ టీవీలో – రెంటాల జయదేవ -
ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య అలా అడగడంతో రాత్రంతా ఏడ్చాను: సునీత
టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు.. టాలీవుడ్ ఏ సింగర్ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్ వీరపనేనిని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇటూ ప్రొఫెషనల్ అటూ పర్సనల్ లైఫ్‌ను బ్యాలెస్ చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న సునీత తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తిర విషయాలను పంచుకుంది. తన కెరీర్ ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా వెల్లడించింది. గతంలో ఓ డైరెక్టర్ తనతో విచిత్రం వ్యహరించారంటూ నోరు విప్పిన సునీత తాజాగా ఓ ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ.. ‘ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోకు పాట పాడేందుకు వెళ్లిన నాకు అనుకోని సంఘటన ఎదురైంది. అది తలుచుకుని ఓ రాత్రంతా ఏడ్చేశాను. అక్కడికి వెళ్లాక ఆ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైకును నాకు ఇచ్చారు. దాన్ని తీసుకొని పాట పాడేశాను. అయిపోయాక ఆ మైక్ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే ఆయన భార్య నన్ను పిలిచి దారుణంగా అవమానించింది. ఏంటీ మైక్ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావు.. అసలేమనుకుంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. అది విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ తర్వాత నా స్టయిల్లో ఆమెకు గట్టిగా సమాధానం ఇచ్చాను. అక్కడ ధైర్యంగా తనతో మాట్లాడినప్పటికీ అలా అడగడం చాలా బాధించింది. నా తప్పు లేకపోయిన నిందలు పడ్డాను. ఇంటికి వెళ్లాక ఈ సంఘటనను తలచుకుని ఓ రాత్రంత ఏడ్చాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే ఇలాంటి దారుణమైన సంఘటనలు తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు కొందరిని కొట్టాలనిపించింది, కానీ కొట్టకుండా వచ్చేశానంది. ఇలా చాలా సందర్భాల్లో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి తాను చెప్పడం తనకు ఇష్టం లేదని ఆమె పేర్కొంది. అయితే సునీత ఆ సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. -
దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఆయన మ్యూజిక్ వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రొమాంటిక్, సెంటిమెంటల్, దుమ్మురేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటమ్స్ సాంగ్స్.. ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. ఆయన మరెవరోకాదు.. అభిమానులచే ముద్దుగా డీఎస్పీ అని పిలవబడే దేవిశ్రీ ప్రసాద్. స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్‌గా నిలిచే పేరు అది. ఎనర్జీ అనే పదానికి నిర్వచనం ఆయన. తన మ్యూజికల్ మ్యాజిక్‌తో ఎన్నో చిత్రాలకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 2). ఈ సందర్భంగా ‘డీఎస్పీ’గురించి.. దేవీశ్రీ ప్రసాద్.. 1979, ఆగస్ట్ 2న గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని వెదురుపాక వీరి స్వగ్రామం.దేవీకి ఒక తమ్ముడు సాగర్, చెల్లి పద్మిణి ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి గొప్ప కథా రచయిత. దేవత’‘ఖైదీ నంబర్ 786’, ‘అభిలాష’, ‘పోలీస్ లాకప్’, ‘ఛాలెంజ్’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు. ఒక రకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే. అసలు దేవిశ్రీప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరులోని దేవి.. తాతయ్య పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా కూర్చి ఆ పేరు పెట్టారు.చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్న దేవిశ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే మాండొలిన్ నేర్చుకున్నాడు. మాండొలిన్ శ్రీనివాస్ ఈ సంగీత దర్శకుడి గురువు. టీనేజ్ లోనే మ్యూజిక్ దర్శకుడిగా దేవిశ్రీకి చిన్నప్పటి నుంచే సంగీత దర్శకుణ్ణి కావాలని కోరికట. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్ని అవుతా’చెప్పాడట. ఇంట్లో కూడా అతని ఇష్టాలను గౌరవించేవాళ్లు. ఒక రోజు ఎంఎస్ రాజు దేవీశ్రీ ప్రసాద్ ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవీశ్రీ గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, ఒక సందర్భానికి ట్యూన్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లోనే ట్యూన్ ఇచ్చి ఎంఎస్ రాజు ఫిదా అయ్యాడట. వెంటనే ‘దేవి’సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడట. అప్పుడు దేవిశ్రీ ప్లస్ 2 చదువుతున్నాడు. అలా టీనేజ్‌లో మ్యూజిక్ డైరెక్టరై రికార్డును సృష్టించాడు. మెగా ఫ్యామిలీతో మ్యూజికల్ బాండ్ డీఎస్పీ కెరీర్ ను గమనిస్తే మెగా కాంపౌండ్ తో అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ - ఇలా ఫ్యామిలీలోని అందరికీ మ్యూజికల్ హిట్స్ అందించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ150 చిత్రాలకు సంగీతం అందించిన దేవీ... పవన్ కల్యాణ్‌కు 'జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మూడు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు. అలాగే అల్లు అర్జున్ ఆర్య, ఆర్య-2, బన్ని, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ ‘ఎవడు’, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’చిత్రాలను స్వరకల్పన చేసి విజయంలో పాలుపంచుకున్నాడు. ఒక మెగా హీరోలకే కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో పనిచేశాడు దేవిశ్రీ. అక్కినేని నాగార్జున ‘మన్మథుడు, మాస్' ఢమరుకం, కింగ్ , భాయ్ చిత్రాలకు, మహేశ్‌బాబు ‘వన్-నేనొక్కడి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు మీకెవ్వరు సినిమాలతో పాటు, ప్రభాస్ వర్షం,పౌర్ణమి, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, జూనియర్ ఎన్టీఆర్ "నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి, జనతా గ్యారేజ్మూవీస్కు కూడా దేవిశ్రీ పసందైన బాణీలు అందించాడు. రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులకు అలరిస్తున్న దేవీ.. మున్ముందు కూడా తనదైన బాణీలలో ప్రేక్షలకు వీనులవిందు అందించాలని ఆశిస్తూ.. ‘సాక్షి’తరపున దేవీశ్రీ ప్రసాద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
సంగీత దర్శకుడికి బీజేపీ కీలక బాధ్యతలు
సాక్షి, చెన్నై: యువ సంగీత దర్శకుడు కుమార్ నారాయణన్‌కి రాష్ట్ర బీజేపీ పార్టీ కీలక బాధ్యతలను అందించింది. ఎదుర్మలై చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన తమిళ సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా లాక్డౌన్ కాలంలో ఈయన పలు ప్రైవేటు ఆల్బమ్‌లను రూపొందిస్తూ విశేష ఆదరణను పొందుతూ వస్తున్నారు. అలా ఈయన తాజాగా రూపొందించిన కమ్కమ్ మురుగా అనే పేరుతో భక్తి గీతంతో కూడిన ఆల్బమ్ సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ ఆల్బమ్ బీజేపీలో ఈయనకు కీలక బాధ్యతలను కట్టబెట్టడానికి కారణంగా నిలిచింది. కుమార్ నారాయణన్ ఇటీవల రాష్ట్ర బీజేపీ పార్టీలో చేరారు. ఈయన సేవలను గుర్తించిన రాష్ట్ర బీజేపీ పార్టీ మధ్య చెన్నై తూర్పు విభాగం ఆర్ట్ అండ్ కల్చర్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను అందించింది. దీనిపై స్పందించిన యువ సంగీత దర్శకుడు కుమార్ నారాయణన్ ఈ బాధ్యత తనను బీజేపీ పార్టీని మరింత ప్రేమించేలా, ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
చిరు టూ సాయి తేజ్... తమన్ జోరు మాములుగా లేదుగా
టాలీవుడ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్. ముఖ్యంగా మెగా హీరోస్ తమన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ కు అల వైకుంఠపురము లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించాడు.అదే స్పీడ్ లో వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ వర్క్ చేస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన నాయక్, బ్రూస్ లీ లాంటి సినిమాలకు సూపర్ హిట్ ట్రాక్స్ అందించాడు తమన్. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మరోసారి చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు తమన్. పైగా ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫర్. శంకర్-చెర్రీ కాంబోలో రాబోతున్న మూవీకి తమనే సంగీతం అందిస్తున్నాడు. అలాగే లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం కూడా తమన్ వర్క్ చేయబోతున్నాడు.కెరీర్ లో ఫస్ట్ టైమ్ చిరు నటిస్తున్న సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా తమన్ తో చర్చలు ప్రారంభించాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇప్పటికే ప్రతి రోజూ పండగే మూవీతో సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడు. ఇఫ్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా గని కి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. మొత్తంగా మెగా హీరోస్ మూవీస్ కు మ్యూజిక్ అందిస్తూ మెగా మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్. -
విషాదం: సంగీత దర్శకుడు మురళీధరన్ కన్నుమూత
సాక్షి,ముంబై: కోలివుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఔత్సాహిక సంగీత దర్శకుడు టీఎస్ మురళీ ధరన్ కన్నుమూశారు. ఆదివారం (జూలై,18) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిభావంతుడైన మురళి అకస్మిక మరణంపై పలువురు పరిశ్రమ పెద్దలు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'శ్రీ' తో మ్యూజిక్ డైరెక్టర్‌గా మురళి తెరంగేట్రం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా రాణించకపోయినా, సంగీత దర్శకుడిగా పలువురి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అఖిల్ గౌరవ్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన 'గూడం' అనే హిందీ చిత్రానికి సంగీతం అందించారు మురళి. -
ఆ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్‌ను మర్చిపోవడం కష్టం, ఎందుకంటే?
‘తేరే బినా జిందగీ సే కోయీ’.... ‘తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ’... జీవితంలో సంగీతం ఉంటే జీవన సంగీతం శృతిలో ఉంటే మనిషి ప్రయాణం సులువవుతుంది. ఆర్.డి.బర్మన్ జీవితపు ప్రతి రంగుకూ ఒక పాట ఇచ్చాడు. యవ్వనంలో ‘లేకర్ హమ్ దీవానా దిల్’.. మధ్య వయసులో ‘హమే తుమ్ సే ప్యార్ కిత్నా’ తల పండాక ‘జిందగీ కే సఫర్ మే’... మరణించి ఇన్నాళ్లయినా విడువక సేద దీరుస్తున్న ఆర్.డి.బర్మన్ జయంతి నేడు. ఈ ఆదివారం అతని పాటలకు అంకితం. ఆర్.డి. బర్మన్ అంటే 20వ శతాబ్దపు సినీ టీనేజ్ ట్రెండ్. ఇండియన్ స్క్రీన్ ఆర్.డి.బర్మన్ వల్ల సంపూర్ణంగా టీనేజ్‌లోకి వచ్చింది. ఆడింది. పాడింది. జీవితాన్ని రంగుల గాలిపటంగా ఎగరేయడం నేర్చింది. ఏ జో మొహబ్బత్ హై ఏ ఉన్కా హై కామ్ అరె మెహబూబ్ కా జో బస్ లేతే హుయే నామ్ (కటీ పతంగ్)... యువతీ యువకులు ఆర్.డి.బర్మన్ పాటను హగ్ చేసుకున్నారు. హమ్ చేశారు. స్కేటింగ్ షూస్‌గా మార్చి స్కేటింగ్ కూడా చేశారు. వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్ జహా తుమ్ హో వహా మై భీ హూ (ఆ గలే లగ్ జా)... హవా కే సాథ్ సాథ్ ఘటాకే సంగ్ సంగ్ ఓ సాథీ చల్ (సీతా ఔర్ గీతా)... ఆర్.డి.బర్మన్ ఇలాంటి భావుక యువ ప్రేమికుల కోసమే కాదు... కొత్త ప్రపంచాలను వెతకాలనుకునే యువ అన్వేషకుల కోసం కూడా పాట ఇచ్చాడు. అలాంటి వాళ్లను ఆ రోజుల్లో ‘హిప్పీ’లు అనేవారు. ‘దమ్ మారో దమ్ మిట్ జాయే గమ్’ (హరే రామ హరే కృష్ణ) వారి కోసమే కదా. ఆర్.డి.బర్మన్ను, ఆనాటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నానూ యువతరం ప్రేమించింది. వారి జోడిని చూస్తే హోలి రోజు భంగు తాగి చిందులేసేంత మత్తు పొందేది. ‘జై జై శివ శంకర్... కాటా లగే యా కంకర్’... (ఆప్ కీ కసమ్) ఎంతమందిని తైతక్కలాడించింది! ఆర్.డి.బర్మన్ తన తండ్రి ఎస్.డి.బర్మన్ సమర్థతతో పాటు తన కాలపు ఊపును కూడా పాటలో స్వీకరించాడు. ఆర్.డి.బర్మన్ క్లబ్ సాంగ్స్‌కు, స్టేజ్ సాంగ్స్‌కు పెద్ద హోరు తెచ్చాడు. ‘బచ్నా అయ్ హసీనో లో మై ఆగయా’ (హమ్ కిసీసే కమ్ నహీ), ‘లేకర్ హమ్ దీవానా దిల్’ (యాదోంకి బారాత్)... ఇవన్నీ మెరిసే అద్దాల స్టేజ్ మీద తామూ మెరిశాయి. అయితే ఇదే కుర్రకారులో భావ గంభీరం కూడా ఉంటుంది. తాత్త్వికత కూడా ఉంటుంది. దానినీ పాటలో చూపాడు బర్మన్. ముసాఫిర్ హు యారో.. నా ఘర్ హై నా ఠికానా.. (పరిచయ్) ఇప్పుడు ఈ యువతీ యువకులు పెళ్లి చేసుకున్నారు. సంసారంలో పడ్డారు. సంగీతంలో సంసారంలో ఎన్ని సరిగమలని? ‘బాహోమే చలే ఆ’... (అనామికా) సినిమాలో జయ భాదురి అల్లరిగా సంజీవ్‌కుమార్‌ను ఆహ్వానించే పాట ఎంత బాగుంటుంది. ‘ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే సే రాజ్ హై’ (ఘర్) రేఖ– వినోద్ మెహ్రా డ్యూయెట్ ఇప్పటికీ హిట్. ఈ సంసారంలో అపార్థాలు రాకుండా ఉంటాయా? ‘మేరి భీగి భీగి సీ పల్కొంపే రహె గయ్ జైసే మేరే సప్నే బిఖర్ కే’ (అనామికా), ‘మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై’ (ఇజాజత్), ‘తేరే బినా జిందగీ సే కోయి’ (ఆంధీ)... ఆర్.డి.బర్మన్ ఊదిన విషాద సమీరాలివి. ఆర్.డి.బర్మన్ గుంపులో ఉండి వినే పాటలు ఎన్ని చేశాడో ఏకాంతంలో ఉండి వినే పాటలు అన్నే చేశాడు. ఎన్నో మెలొడీ లు అతడికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ‘చందా ఓ చందా’ (లాఖో మే ఏక్), ‘తుమ్ బిన్ జావూ కహా’ (ప్యార్ కా మౌసమ్), ‘హమే తుమ్ సే ప్యార్ కిత్నా’ (ఖుద్రత్), ‘ఆనె వాలా పల్ జానే వాలా హై’ (గోల్ మాల్). రఫీ, కిశోర్, లతా, ఆశా... ఆర్.డి.బర్మన్తో కలిసి ఒక కాలాన్ని కలర్‌ఫుల్ చేశారు. జంట సంగీతకారుల ఊపు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆర్.డి.బర్మన్ ఒక్కడే నిలిచి పాటలు అందించాడు. భిన్నంగా అందించాడు. మనసును తాకేలా అందించాడు. అతణ్ణి మర్చిపోవడం కష్టము. ఎందుకంటే అతడి పాట వినపడని రోజు ఉండటమూ కష్టం. నామ్ గుమ్ జాయేగా చహెరా ఏ బదల్ జాయేగా మేరే ఆవాజ్ హీ పహెచాన్ హై ఘర్ యాద్ రహే (కినారా) – సాక్షి ఫ్యామిలీ -
రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీనియర్ నటి, దర్శక, నిర్మాత జయచిత్ర కుమారుడు, సంగీత దర్శకుడు అమ్రీష్‌పై నమోదైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసినట్లు ఆయన తరఫు న్యాయవాది ఎల్ ఇన్ఫెంట్ దినేష్ తెలిపారు. చెన్నైలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చెన్నై వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ అనే వ్యాపారవేత్త, ఇరీడియం పేరుతో అమ్రీష్ రూ. 26 కోట్లు మోసం చేశారంటూ ఇటీవల ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ కేసులో అమ్రీష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పారు. తనపై అక్రమంగా బనాయించిన కేసును కొట్టి వేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ అమ్రీష్ వేశారని, వారి మధ్య ఒక చిత్రానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయని, ఆయన నిర్మించనున్న ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తంలో కొంత తిరిగి చెల్లించానని, పూర్తిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని అమ్రీష్ కోర్టుకు విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు సమ్మతించిన సదరు పారిశ్రామికవేత్త అమ్రీష్‌పై ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. వాదనలను విన్న అనంతరం సదరు కేసుతో అమ్రీష్‌కు సంబంధం లేనందున కేసును కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ మంగళవారం తీర్పు చెప్పారని న్యాయవాది ఇన్ఫెంట్ దినేష్ తెలియజేశారు. చదవండి: 'ఆమెతో డేటింగ్ చేశాను!' అందులో నిజమెంతో ఎవరికి తెలుసు? -
స్నేహితుడిని కాపాడమంటూ సంగీత దర్శకుడి అభ్యర్థన
టాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితుడిని కాపాడమంటూ సినీప్రముఖులను అభ్యర్థిస్తున్నాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశాడు. 'ఫొటోగ్రాఫర్‌గా ఎదుగుతున్న నా స్నేహితుడు జీవన్ కిశోర్ వర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని రక్షించేందుకు సాయం చేయండి. నేను నా వంతు సాయం అందించాను. దయచేసి మీరు కూడా మీ వంతు కృషి చేయండి' అంటూ తన స్నేహితులు సత్యదేవ్, అడివి శేష్, కోనవెంకట్‌ను వేడుకున్నాడు. దీనిపై సత్యదేవ్ స్పందిస్తూ తన వంతు సాయం చేశాను అని రిప్లై ఇచ్చాడు. కాగా జీవన్ వైద్యానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా వారికి తోచిన సాయం అందిస్తున్నారు. కాగా శ్రీచరణ్ పాకాల 'కిస్' సినిమాతో తన కెరీర్‌ను ఆరంభించినప్పటికీ 'క్షణం' చిత్రంతో పేరు సంపాదించుకున్నాడు. 'పీఎస్వీ గరుడ వేగ', 'గూఢచారి', 'అశ్వత్థామ', 'నాంది' చిత్రాలు అతడికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అతడు 'మేజర్'తో పాటు 'తిమ్మరుసు' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. A friend of mine who is a budding photographer met with an accident and fighting for Life. We need a helping hand to save his life. I've done my part. Request you to spread the word @ActorSatyaDev @vamsikaka @AdiviSesh @konavenkat99https://t.co/cfJUltnJFF — Sricharan Pakala (@SricharanPakala) June 6, 2021 చదవండి: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి -
కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు శాంతిరాజ్ కోశల(53) కరోనాతో మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అనంతరం హోం క్వారంటైన్లో ఉంటు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్న ఆయనకు బుధవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కటక్‌లోని ఎస్బీబీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. కోశల మరణం పట్ల ఒడిశాకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ కోశల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా శాంతిరాజ్ కోశల 20కి పైగా ఒడియా చిత్రాలకు సంగీతం అందించి ప్రశంసలు అందుకున్నారు. అంతేగాక 2వేలకు పైగా ఆయన సొంతంగా ఆల్బమ్స్ రూపొందించారు. -
బాలీవుడ్లో విషాదం: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
బాలీవుడ్ సంగీత దిగ్గజం రామ్‌లక్ష్మణ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. మైనే ప్యార్ కీయా, హమ్ ఆప్కే కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్ లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలకు పాటలు అందించింది ఈయనే. ఈయన అందించిన బాణీలు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. తొంభై దశకంలో అద్భుతమైన పాటలు అందించిన రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు అమర్ తెలిపాడు. కాగా, కొన్నిరోజుల క్రితం రామ్ లక్ష్మణ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని, ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారని, ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే గుండెపోటుతో చనిపోయినట్లు అమర్, మీడియాకు వెల్లడించాడు. గానకోకిల లతా మంగేష్కర్ రామ్ లక్ష్మణ్ మృతి పట్ల ట్విట్టర్లో సంతాపం తెలిపింది. ఆయన సంగీతంలో తాను పాడిన పాటలన్నీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని ఆమె గుర్తు చేసుకున్నారు. వీళ్లిద్దరి కాంబోలో ‘దీదీ తేరా దేవర్ దివానా’, ‘కబూతర్ జా జా’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఇద్దరూ.. ఒక్కడే రాజ్శ్రీ ప్రొడక్షన్లో ఎక్కువ సినిమాలకు పనిచేసిన రామ్‌లక్ష్మణ్.. 1975 నుంచి హిందీ, మరాఠీ, భోజ్‌పురిలో కలిపి మొత్తం డెబ్భై సినిమాలకు పని చేశారు. అయితే రామ్ లక్ష్మణ్ ఇద్దరూ వేర్వేరు. రామ్(సురేందర్), లక్ష్మణ్(విజయ్‌పాటిల్) ఇద్దరూ మొదట్లో కలిసి పనిచేశారు. 1977లో ఏజెంట్ వినోద్ సినిమా తర్వాత సురేందర్ చనిపోయారు. అప్పటి నుంచి విజయ్‌పాటిల్(లక్ష్మణ్) రామ్‌లక్ష్మణ్‌గానే కొనసాగుతూ వచ్చారు. చదవండి: DDLJ: తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదు -
కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
భువనేశ్వర్: కరోనాతో ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి సోమవారం మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం వైరస్ బారినపడిన ఈయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర షడంగి, ఓలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. చదవండి: కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత -
Anand: ఒక వేణువు వినిపించిన విషాద గీతిక
సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆయన పేరులోనే కాదు.. వ్యక్తిత్వం కూడా ఆనందకరం, అనుసరణీయమని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ సినీ గాయకులు, సంగీత దర్శకులు దివంగత జీ ఆనంద్‌కు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా వైరస్ సోకి ఇటీవల హైదరాబాద్‌లో అశువులు బాసిన జీ ఆనంద్‌ను గుర్తు చేసుకుంటూ నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) వారు శనివారం రాత్రి “ఒక వేణువు వినిపించిన విషాద గీతిక’ పేరున స్వర నివాళులర్పించారు. అంతర్జాలమే వేదికగా ఏర్పాటు చేసుకుని నిర్వహించిన ఈ కారక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు పాల్గొని జీ ఆనంద్‌తో తమకున్న పరిచయాన్ని, అనుభవాలను, ఆనందపు క్షణాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా, నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్వీ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా రాజకీయ వార్తలు రాసేవాడినని, అయినా సంగీతం, సాహిత్యాభిలాషతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆనంద్‌కు ఆప్తుడయ్యానని చెప్పారు. ఎస్పీ బాలుకు, ఆనంద్‌కు సినీ పరిశ్రమ ఘన నివాళులర్పించకపోవడం బాధాకరమన్నారు. తనకు 20 ఏళ్లుగా ఆనంద్‌తో పరిచయం అని, అతడో నిత్యసంతోషి, ఆనంద్, సుజాత ఆదర్శ దంపతులుగా మెలిగారని అని ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి గుర్తు చేశారు. సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ తనకు 50 ఏళ్ల అనుబంధం అని, జీ ఆనంద్ సార్థక నామథేయుడు తెలిపారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక -
సంగీత దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత
కరోనా మహమ్మారి మరణాలు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆల్ ఇండియా రేడియో సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కోవిడ్‌తో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరారు. అల్లు రామలింగయ్య నటించిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా చేశారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ ద్వారా సంగీత దర్శకుడు అయ్యారు. ‘బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్–హిందీ )’ ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు చంద్రశేఖర్. ఆ తర్వాత విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. తిరుపతిలో చంద్రశేఖర్ ప్రదర్శన చూసి ముగ్దులైన ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల తన హార్మోనియాన్ని ఆయనకు బహూకరించారట. కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు చంద్రశేఖర్ వద్ద శిష్యరికం చేశారు. చంద్రశేఖర్‌కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
ముంబై: అలనాటి సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియా(93) తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వన్రాజా భాటియా.. మంతాన్, భూమిక, జానే బీదో యార్ సహా పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. బుల్లితెర మీద టామస్, భరత్ ఏక్ ఖోజ్ వంటి పలు షోలకు సైతం మ్యూజిక్ అందించారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలావరకు భాటియా సంగీతం అందించినవే. సంగీంతంలో ఆయన అందించిన సేవలకుగానూ భాటియా 2012లో పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు. సుమారు 700కు పైగా జింగిల్స్(తక్కువ నిడివి ఉండే ట్యూన్స్) కంపోజ్ చేశారు. చిత్రపరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఎన్నో హిట్ సాంగ్స్‌ను అందించి గుర్తింపు పొందిన భాటియాను వృద్యాప్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తనకు వైద్యం చేయించుకునేందుకు ఇంట్లోని వస్తువులను సైతం అమ్మేయాల్సి రావడం విషాదకరం. చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే.. -
మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే..
సాక్షి, ముంబై: బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం నదీమ్-శ్రవణ్‌లలో ఒకరైన శ్రవణ్ రాథోడ్ (66) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోవిడ్ ఎలా సోకిందనే దానపై షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడటానికి కొన్ని రోజుల ముందు ఆయన కుంభమేళాకు హాజరయ్యారని శ్రవణ్ కుమారుడు సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. (కరోనాతో సంగీత దర్శకుడు కన్నుమూత) ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం ప్రకారం శ్రవణ్ రాథోడ్, ఆయన భార్య కరోనా బారిన పడటానికి కొన్నిరోజుల ముందు హరిద్వార్‌లోని కుంభమేళాకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సంజీవ్ వెల్లడించిన సంజీవ్ తమ కుటుంబం ఇంత ఘోరమైన పరిస్థితిల్లో కూరుకుపోతుందని తాము ఎప్పుడూఅనుకోలేదంటూ కంటితడి పెట్టారు. కన్నతండ్రి దూరమయ్యారు.తాను, అమ్మ, సోదరుడు కూడా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నా మంటూ ఆయన వాపోయారు. అయితే హోం అసోలేషన్లో ఉన్న సోదరుడు తన తండ్రి అంత్యక్రియలు చేసేందుకు అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే హాస్పిటల్ యాజమాన్యం బిల్లింగ్ సమస్య కారణంగా శ్రవణ్ మృత దేహాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్న పుకార్లను సంజీవ్ ఖండించారు. అలాంటిదేమీ లేదని వారు చేయగలిగిన సహాయం చేశారని తెలిపారు. కాగా కోవిడ్ పాజిటివ్ రావడంతో పరిస్థితి విషమించిన స్థితిలో శ్రవణ్‌ను ఎస్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి శ్రవణ్ తుదిశ్వాస విడిచారు. (ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం) చదవండి : షాకింగ్: గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి -
ఆ వార్త విని షాకయ్యాం.. మాటలు రావడం లేదు
సాక్షి, ముంబై: బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం నదీమ్– శ్రవణ్‌లలో ఒకరైన శ్రవణ్ రాథోడ్ (66) కరోనాకు బలయ్యారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో పరిస్థితి విషమించిన స్థితిలో ఆయనను ఇక్కడి ఎస్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చారు. గురువారం రాత్రి 10.15 గంటలకు శ్రవణ్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. 1990లో నదీమ్– శ్రవణ్‌లు పలు బాలీవుడ్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. 1990లో వచ్చిన ఆషికీ, ఆ మరుసటి ఏడాదే వచ్చిన సాజన్‌తో పాటు పర్దేశ్, రాజా హిందుస్థానీలకు బాణీలు కూర్చారు. అద్నన్ సమీ, సలీమ్ మర్చంట్, ప్రీతమ్ తదితరులు శ్రవణ్ మృతికి సంతాపం ప్రకటించారు. శ్రవణ్ మృతి పట్ల బాలీవుడ్ స్టార్స్ సంతాపం ప్రకటించారు. శ్రవణ్ ఇక లేడన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నదీమ్-శ్రవణ్ ద్వయం సంగీతంలో ఎన్నో మ్యాజిక్స్ క్రియేట్ చేశారు. వాళ్లు పని చేసిన ధడ్కన్ నా జీవితంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తుండిపోతుంది అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. ఈ సంగీత ప్రపంచానికి, మీ అభిమానులందరికీ ఇది పెద్ద తీరని లోటు అని ఏఆర్ రెహమాన్ తెలిపాడు. Very sad to know about the passing of music composer Shravan. Nadeem-Shravan created magic for many films in 90s and later, including Dhadkan that has remained legendary in my career. Deepest Condolences to his family. 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) April 23, 2021 మీరు ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెలలో మిర్చి మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్లో మీ వెనకాలే కూర్చున్నాను. నాకు మాటలు రావడం లేదు. కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి అని అర్మన్ మాలిక్ ట్వీట్ చేశాడు. శ్రవణ్ మరణించాడన్న వార్త విని షాకయ్యాను. సంగీత ప్రపంచంలో ఓ ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయాం అని శ్రేయా ఘోషల్ తెలిపింది. Our Music community and your fans will miss you immensely #ShravanRathod ji Rest in peace 🌺Respect and Prayers🌹🇮🇳 — A.R.Rahman #99Songs 😷 (@arrahman) April 22, 2021 Shocked to hear the news of Shravan ji (of Nadeem Shravan) passing away. A genuine humble human being and one of the biggest composers of our music industry. Another huge loss in this pandemic. God give strength to the bereaved family. Rest in peace. — Shreya Ghoshal (@shreyaghoshal) April 22, 2021 Rest in peace #ShravanRathod sir.. I can’t believe you’re gone.. It was just last month when I was sitting next to you at the Mirchi music awards event. Totally shattered.. at a loss of words. my sincere condolences to his entire family 🙏🏻 — ARMAAN MALIK (@ArmaanMalik22) April 22, 2021 చదవండి: సినిమాటోగ్రాఫర్ మృతికి మాధవన్ సంతాపం నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినీరంగాన్ని కోవిడ్-19 పట్టి పీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ కరోనాతో అత్యంత "క్లిష్టమైన" స్థితిలో చికిత్స పొందుతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్‌కు (నదీమ్- శ్రావణ్ ) ఇటీవల కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ (66) పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉందని ఆయన కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. ఎస్ఎల్ రహేజా హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న, తన తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మరోవైపు దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని సంజీవ్ తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇతర సంగీత దర్శకులు ఆకాంక్షిస్తున్నారు. శ్రావణ్, త్వరగా కోలుకోవాలంటూ మరో సంగీత దర్శకుడు నదీమ్ సైఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన భాగస్వామి శ్రావణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు,అభిమానులందరినీ వేడుకున్నారు. (కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్) శ్రవణ్ రాథోడ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉన్నదని అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు కీర్తి భూషణ్ చెప్పారు. ఆయన చికిత్సం నిమిత్తం ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు. (కరోనా రోగులకు డీఆర్డీవో అద్భుత పరికరం) -
ఆసుపత్రిలో... బప్పీలహరి
బాలీవుడ్ సినీసెలబ్రీటీలు కరోనా బారిన పడటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హిందీ చిత్రసీమకు చెందిన దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఇటీవల కరోనా సోకగా తాజాగా ప్రముఖ సంగీత దర్శకులు బప్పీలహరి కరోనా బారినపడ్డారు. ‘‘కొంతకాలంగా అనారోగ్యంతో బప్పీలహరి బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబయ్‌లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన పదిహేను రోజుల్లో ఆయన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినందిగా బప్పీలహరి కోరుతున్నారు’’’ అని బప్పీలహరి మీడియా ప్రతినిధి పేర్కొన్నారు. -
హీరోయిన్గా అవకాశాలు లేక నోయల్ మాజీ భార్య..
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన వెయ్యి అబద్దాలు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్. ఆ తర్వాత సునీల్ సరసన 'భీమవరం బుల్లోడు సినిమాలో నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే సింగర్ నోయల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏడాది కూడా గడవక ముందే వారి పెళ్లి పెటాకులైంది. ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇరువురూ సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమతమ కెరియర్లో ముందుకు సాగారు. అయితే పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినా ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్భమ్స్‌లో నటించిన ఎస్తర్...కొన్ని పాటలు కూడా పాడింది. త్వరలోనే ఓ కన్నడ మూవీతో సంగీతదర్శకురాలిగానూ పరిచయం కానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్4న రివీల్ చేస్తానని వెల్లడించింది. View this post on Instagram A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) -
రూ.26 కోట్ల మోసం.. సంగీత దర్శకుడు అమ్రేష్ అరెస్ట్
తమిళ సినిమా (చెన్నై): రూ.26 కోట్ల మోసం కేసులో యువ సంగీత దర్శకుడు అమ్రేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో అరుదైన ఇరిడియం(రైస్ పుల్లింగ్) తన వద్ద ఉందని మార్కెట్లో విక్రయిస్తే కోట్ల లాభం గడించవచ్చని చెప్పి తన వద్ద రూ.26 కోట్లు తీసుకుని అమ్రేష్, బృందం నకిలీ ఇరిడియం ఇచ్చి మోసం చేసినట్లు వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అమ్రేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు. చదవండి: ('వీడియో చూపి 5 కోట్లు అడిగారు.. అక్కడుంది నేను కాదు') -
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి...
విద్యాసాగర్ పేరు చెప్పగానే ‘ఏ అంటే అమల బి అంటే భానుప్రియ’ వంటి అల్లరి పాటలు వినిపిస్తాయి. ‘చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతిపూల మేడ కట్టనా’ అనే కమర్షియల్ హిట్స్ గుర్తుకొస్తాయి. ‘చుక్కా చుక్కా కన్నీటి చుక్కా బుగ్గన జారొద్దు’ వంటి సెంటిమెంట్ పాటలు కదిలిస్తాయి. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ వంటి మెలొడీలు చుట్టుముడతాయి. విద్యాసాగర్ మరో ఇళయరాజాగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు. విజయనగరం నుంచి వచ్చిన తెలుగు గీతమే అయినా తమిళంలో, మలయాళంలో ఎక్కువ గుర్తింపు పొందాడు. మార్చి 2 ఆయన పుట్టినరోజు. బొబ్బిలి సంస్థానం నుంచి... విద్యాసాగర్ తాత తండ్రులది బొబ్బిలి సంస్థానం. వాళ్లది సంగీత కుటుంబం. విద్యాసాగర్ తండ్రి రామచందర్ సినిమాల్లో పని చేయాలని 1950లలోనే మద్రాసు వచ్చారు. విద్యాసాగర్ అక్కడే పెరిగారు. తండ్రి వద్ద తొలి సంగీత విద్యలు నేర్చుకుని 11 ఏళ్ల వయసులో లండన్ ట్రినిటి కాలేజ్‌లో సంగీతం నేర్చుకున్నారు. విద్యాసాగర్ మొదట రీరికార్డింగ్‌లో గుర్తింపు పొందారు. వందలాది సినిమాలకు రీరికార్డింగ్ చేశారు. ఆ తర్వాత తమిళంలో మొదట... తర్వాత తెలుగులో సంగీత దర్శకుల య్యారు. రెండు చోట్లా కొన్ని అపజయాల తర్వాత మలయాళంలో హిట్ కొట్టి తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హిట్స్ ఇచ్చారు. మెలొడీస్ ఇష్టం విద్యాసాగర్‌కు మెలొడీలు ఇష్టం. ‘ఓ చినదానా’లో ‘తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడుతోందే’ అలాంటి మెలొడీనే. ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నవ్వుకునే మన యవ్వనమే ఒక పువ్వుల తోటంట’ కూడా అదే మెలొడీ. రాజశేఖర్ నటించిన ‘విలన్’లో ‘నా గుండె గుడి లో నువు శిలవా దేవతవా’ పెద్ద హిట్. ఇక తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన మెలొడీలు కూడా హిట్టే. అర్జున్ నటించిన ‘కర్ణ’ సినిమాలో ‘పలికే మౌనమా’ చాలా పెద్ద హిట్. అన్నింటికి మించి ‘చంద్రముఖి’ కోసం చేసిన ‘కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి’ క్లాసిక్‌గా నిలిచింది. ‘చంద్రముఖి’ విద్యాసాగర్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిపింది. అందులోని ‘చిలకా పద పదా’, ‘రారా సరసకు రారా’ అద్భుతంగా అమరాయి. విద్యాసాగర్ కె.విశ్వనాథ్ ‘స్వరాభిషేకం’కు, బాపు ‘సుందరకాండ’కు పనిచేశారు. పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమాకు ‘రా..రా.. రారా బంగారం’ మాస్ హిట్ ఇచ్చారు. విద్యాసాగర్ మరెన్నో మంచి పాటలు అందించాలని కోరుకుందాం. -
ఆ డైరెక్టర్ సంపాదించాడు, పోగొట్టుకున్నాడు
సలలితరాగ సుధారస సారం.. నిదురపోరా తమ్ముడా.. పరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా.. ప్రేమే నేరమౌనా.. వగలాడి వయ్యారం భలే జోరు.. జననీ శివ కామినీ .. ఈ పాటలు మచ్చుకి మాత్రమే. మాధుర్యప్రధానమైన పాటలు, హాస్య గీతాలు, జోల పాటలతో తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించారు సుసర్ల దక్షిణామూర్తి. ఇంటి దగ్గర పిల్లలతో ఒక మామూలు తండ్రిలానే ఉండేవారు. పిల్లలను సంతోషంగా ఉంచటం, మనవలకు జోల పాడటం సుసర్లకు ఇష్టం.. సెల్ఫ్మేడ్గా సంగీతజ్ఞానం సంపాదించుకుని, సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవారో వారి ఆఖరి కుమార్తె అనూరాధ సాక్షికి వివరించారు. నాన్నగారు పెదకళ్లేపల్లిలో పుట్టారు. తండ్రి కృష్ణ బ్రహ్మశాస్త్రి, తల్లి అన్నపూర్ణమ్మ. నాన్నగారి తాతగారి పేరే ఆయనకు పెట్టారు. ఆయన నేరుగా త్యాగరాజు శిష్యులు. నాన్నగారికి ఒక అక్క, నలుగురు చెల్లెళ్లు. అందరూ సంగీతం నేర్చుకున్నారు. మా పెళ్లిలో మా అత్తయ్యలే పాడారు. తాతయ్యగారి దగ్గర అందరూ వయొలిన్ నేర్చుకుంటుంటే, అది విని నాన్న సొంతంగా వాయించేవారట. 14 సంవత్సరాలకే వయొలిన్ వాయించటం వచ్చేసింది ఆయనకు. ఆకతాయితనంగా ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లి వయొలిన్ వాయించేవారట. అలా సంగీతంలో మునిగిపోయిన నాన్నగారు ఒకసారి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయి, అలాఅలా తిరుగుతూ ఏలూరు చేరుకున్నారట. అక్కడ స్టేజీ మీద వయొలిన్ వాయించిన తీరు చూసి మురిసిపోయిన నిర్వాహకులు నాన్నను ఏనుగు మీద ఊరేగించారట. విషయం తెలుసుకున్న తాతగారు, నాన్నకి ఉన్న సంగీత పరిజ్ఞానం, శ్రద్ధ గమనించి నాన్నకు సంప్రదాయబద్ధంగా వయొలిన్ నేర్పించారట. సంగీత కచేరీలు చేస్తూ ఒకసారి నంద్యాలకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ అమ్మని చూసి, ఇష్టపడి, చిన్న వయసులోనే పూరీ జగన్నాథుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నారట. అలా ఆ రోజుల్లోనే నాన్నది ప్రేమ వివాహం అనుకోవచ్చు. చిత్రమైన అనుభవం... ఒకసారి నాన్న వయొలిన్ కచేరీకి ఒక ఊరు వెళ్లవలసి వచ్చి రైలు ఎక్కారట. తన దగ్గరున్న వయొలిన్ బాక్స్ చూసిన టీటీ, బాక్సులో ఏముందని అడిగారట. అందుకు నాన్న ‘వయొలిన్’ అని చెబితే, వెంటనే ఆ టీటీ నాన్నను వయొలిన్ వాయించమని రైలులో నుంచి కిందకు దింపారట. నాన్న తన్మయత్వంతో వాయించేసరికి టీటీ రూమ్‌లోకి జనమంతా గుంపులుగుంపులుగా చేరారట. అప్పుడు నాన్న వయసు 18 సంవత్సరాలు. అది బ్రిటిష్ కాలం. అక్కడున్న బ్రిటిష్ ఆఫీసర్ నాన్నగారికి టికెట్ అక్కర్లేకుండా రైలు ఎక్కించారట. అలా ఆయన తన సొంత కృషితో రైలు ప్రయాణం చేశారు. కలకత్తాలోనే.. నాన్నగారు సినిమాల్లోకి ప్రవేశిస్తున్న తొలినాళ్లలో సినిమాలన్నీ కలకత్తాలోనే రూపొందేవి. అందుకేనేమో నాన్న ముందుగా కలకత్తా వెళ్లారట. అక్కడుండగానే కొన్ని సినిమాలకు, గ్రామఫోన్ రికార్డులకు పని చేశారట. గ్రామఫోన్ రికార్డు కంపెనీవారు నాన్నగారి సంగీత విధానానికి ఆశ్చర్యపడి, ‘ఈ అబ్బాయి సంగీతంలో నిష్ణాతుడు, సంగీత దర్శకత్వం బాగా చేయగలడు’ అని లెటర్ ఇచ్చారట. అప్పుడే కొత్తగా తమిళనాడులో స్టూడియోలు ప్రారంభం అవుతుండటంతో ఇక్కడకు వచ్చేశారట. చివరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో సంగీతంలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారట. అంతకు ముందు ఎన్నో ఊళ్లు తిరిగారట నాన్న. అందులో భాగంగానే సిలోన్ కూడా వెళ్లారట. ‘నారద నారదీయం’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది. కాఫీ కోసం పోటీ పడేవాళ్లం.. నేను, అన్నయ్య నాన్న దగ్గరే పడుకునేవాళ్లం. పొద్దున్నే నాన్నకు కాళ్లు తొక్కితే పావు కప్పు కాఫీ ఇస్తాను అనేవారు. ఆ కాఫీ కోసం కాళ్లు తొక్కడా నికి పోటీపడేవాళ్లం. ఉప్మా అంటే చాలా ఇష్టం. అల్లం, కరివేపాకు, ఆవాలు, అన్నీ వేసిన మంచి బ్రాహ్మణ వంటకాలంటే ఇష్టం. తమలపాకులు నమిలే అలవాటు ఉండేది. డాక్టర్ సలహా మేరకు మానేశారు. ఎవరైనా ఏడుస్తుంటే, తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయేవారు. ఎవ్వరి గురించీ చెడు మాట్లాడటం ఇష్టం ఉండదు నాన్నకి. టైమ్‌కి రెడీ అయిపోయేవారు. పాడుకుంటూ ఉండేవారు.. అకాల నిద్ర ఉండేది కాదు. నిత్యం ఉత్సాహం గా ఉండేవారు. ఆయన ముఖంలో తేజస్సు ఉండేది. ఎనిమిది వేళ్లకు ఉంగరాలు పెట్టుకునేవారు. ఆఖరి రోజుల వరకు తాళం వేస్తూ, ఆయనలో ఆయన పాడుకుంటూ ఉండేవారు. సమయ పాలన, సమయ పరిజ్ఞానం బాగా ఎక్కువ. అమ్మ పోయాక, నాన్న ముప్పై సంవత్సరాలు ఉన్నారు. సుగర్ కారణంగా చూపు దెబ్బ తింది. కళ్లు కనిపించకపోయినా, హాల్లోనే కూర్చునేవారు. లోపలకు వచ్చేవారు కాదు. ‘వర్షం పడుతోందా, ఎండ ఎక్కువగా ఉందా’ అంటూ ఏదో ఒకటి అడుగుతుండేవారు. ఆయనకు కనిపించదని ఎవరైనా చెబితేనే కానీ తెలియదు. 90 సంవత్సరాలు వచ్చేవరకు నా దగ్గర, అన్నయ్య దగ్గర ఉన్నారు. సంపాదించారు – పోగొట్టుకున్నారు.. సినిమా రంగంలో మంచి పేరుతో పాటు ఎంతో డబ్బు కూడా సంపాదించారు. రెండు సినిమాలు తీయటం వల్ల ఆర్థికంగా నష్టపోయినా బాధపడలేదు. ఉన్నదానితో సంతృప్తి చెందేవారు. చక్రవర్తి గారు సంగీత దర్శకులుగా ఉన్న రోజుల్లో, నాన్న దగ్గరకు వచ్చి, ‘మీ చేతిలో ఇంత విద్య ఉండి ఇలా ఉంటే ఎలా, నాతో రండి’ అని కారులో తీసుకువెళ్లారు. ‘నేను పెద్ద సంగీత దర్శకుడిని’ అనే గర్వం నాన్నకి ఉండేది కాదు. ఎవరు ఏది అడిగినా చేసేవారు. ఒకసారి నాన్నకు ఇళయరాజా సన్మానం చేసి, ఉంగరం ఇచ్చారు. నాన్నగారితో రికార్డింగులకి ఎక్కువగా ప్రభు బాబాయ్ (కజిన్) వెళ్లేవారు. నాన్నగారికి కంటి ఆపరేషన్ అయినప్పుడు కూడా వెంటే ఉన్నారు. స్నేహం వియ్యంగా మారింది.. గోపీనాథ్ మీనన్ నాన్నకి ఆడిటర్‌గా చేశారు. ఆయనతో కలసి నాన్న ఆరు సార్లు శబరిమల వెళ్లారు. అక్కడికి వెళ్లి వచ్చిన తరవాతే అన్నయ్య పుట్టాడు. అందుకే అన్నయ్యకు హరిహర ప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ తరవాత అన్నయ్య హరిప్రసాద్గా మారాడు. మీనన్‌గారితో ఉన్న స్నేహం వియ్యంగా మారింది. వారి ఆఖరి అబ్బాయితో నా వివాహం జరిగింది. నాన్న మా ఎవ్వరికీ సంగీతం నేర్పిం^è లేదు. అమ్మకి సినిమా వాళ్ల మీద మంచి అభిప్రాయం ఉండేది కాదు. మేం చదువుకుంటేనే ఆవిడకు ఇష్టం. నాన్నకి పుట్టిన రోజు పండుగ జరుపుకోవటం అంటే చాలా ఇష్టం. కేక్ తీసుకువచ్చి, పాట పాడాలి. అప్పుడే ఉత్సవం పూర్తయినట్లు. నాన్న పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం. నవ్వించేవారు... నాన్నగారికి మేం ఏడుగురం సంతానం. కల్యాణి (బంగారం వ్యాపారం), నళిని (డాక్టర్), పార్వతి (టీచర్), అన్నపూర్ణ (టీచర్), వరలక్ష్మి (డాక్టర్), హరిహరప్రసాద్ (టెక్నికల్ సైడ్). నేను (బి.కాం, టీచర్‌గా కూడా పనిచేశాను) ఆఖరి అమ్మాయిని. అంత మంది ఆడ పిల్లలమే అయినా మంచి స్కూల్లో చదివించారు. ఇంటి దగ్గర చాలా సరదాగా ఉండేవారు. మమ్మల్ని బాగా గారాబంగా చూసేవారు. మేం తలంటు పోసుకుంటే, ఆప్యాయంగా తల తుడిచేవారు. ఒకసారి మా నలుగురు అక్కలు స్కూల్‌కి కారులో బయలుదేరారు. ఆ రోజు పబ్లిక్ ఎగ్జామ్. చాలా టెన్షన్లో ఉన్నారు. రెండో అక్క మరీ టెన్షన్‌గా ఉంది. నాన్నగారు అది గమనించి, ‘పరీక్ష పేపర్లో వచ్చిన వాటిలో మీకందరికీ తెలిసింది రాయండి, మీకు తెలియనివి, పక్కన అమ్మాయి దాంట్లో చూసి రాయండి’ అంటూ, అందరినీ టెన్షన్ నుంచి తప్పించారు. పిల్లలు నిద్రపోతుంటే ఆనందంగా చూసేవారు. ఎవ్వరినీ నిద్రలేపేవారు కాదు. స్కూల్ టైమ్ అయిపోతున్నా, వర్షం పడుతున్నా కూడా నిద్ర లేపటం ఆయనకు ఇష్టం లేదు. పేకంటే ఇష్టం... పేకలో రమ్మీ అంటే ఇష్టం. అందరం కలసి ఆడుకునేవాళ్లం. అమ్మ కూడా ఆడేది. మేం ఎక్కడికైనా వెళితే, ఇంటికి వచ్చేవరకు సందు చివర ఉన్న అరుగు మీద కూర్చునేవారు. ఆలస్యం అవుతుందని సమాచారం ఇవ్వడానికి అప్పట్లో ఫోన్ ఉండేది కాదు. ‘అయ్యో పాపం నాన్న కూర్చున్నారే’ అనిపించేది. ‘కాళ్లకి చెప్పులు అరిగిపోయేలా ఎందుకు వీధిలో తిరుగుతారు’ అని అమ్మ అనేది. మమ్మల్ని చూడగానే నవ్వేవారు. ఎప్పుడూ పరుషంగా ఒక్క మాట కూడా అనలేదు. మేం ఎక్కువ అల్లరి చేస్తే, అమ్మని పిలిచేవారు. ‘అలా పిలిచే బదులు మీరే ఒక దెబ్బ వెయ్యొచ్చు కదా’ అనేది అమ్మ. నాన్నకి కోపం రావటం, మమ్మల్ని కొట్టడం మాకు తెలియదు. మంగళ హారతులు ఇచ్చే సమయంలో ‘జననీ శివకామినీ’ పాట పాడతాం. నాన్న స్వరపరిచిన ఈ పాట మా అందరికీ చాలా ఇష్టం. ‘నర్తనశాల’ చిత్రం లోని ‘శీలవతీ నీ గతీ’ పాట చాలా ఇష్టం. బాలు గారు నాన్నను, ‘గురువులకు గురువు’ అంటూ సన్మానం చేశారు. నాన్న జోలపాటలకు ప్రసిద్ధి. మనవలందరికీ జోల పాడేవారు. - అనూరాధ, సుసర్ల దక్షిణామూర్తి ఆఖరి కుమార్తె సంభాషణ: వైజయంతి పురాణపండ -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కేరళ సంగీత దర్శకుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా నిన్న( గురు వారం) చెన్నైలో తుది శ్వాస విడిచారు. థామస్ మరణంపై కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు.సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆయన లేని లోటు తీరనిది అంటూమంత్రి ఎకె బాలన్ ఫేస్బుక్లో కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు. ఇంకా పలు సినీరంగ ప్రముఖులు థామస్ అకాలమృతిపై విచారం వ్యక్తం చేశారు. మలయాళ ప్రముఖ దర్శకుడు కెజి జార్జ్ చిత్రం మన్ను ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన థామస్ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా ఆడమింటే మకాన్ అబూకు ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సలీం అహ్మద్ రచించిన 2011 చిత్రం ఆడమింటే మకాన్ అబూ, ఉత్తమ నేపథ్య స్కోర్‌తో సహా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకోవడమేకాదు ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. వీటితోపాటు భావం (2002), మార్గం (2003), సంచరం అండ్ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకు ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు. ఇంకా కుట్టి స్రాంక్ (2009), సంచరం (2004), షాజీ ఎన్ కరుణ్ స్వాహం(1994), సతీష్ మీనన్ భావం (2002) కుంజనంతంతే కడా (2013) లాంటి సినమాలకు సంగీతం సమకూర్చారు. ఇస్సాక్ థామస్ మాజీ ఎంపీ జార్జ్ థామస్ కుమారుడు. కాగా కేరళ కొట్టాయం జిల్లా పాలాలో జన్మించిన ఇస్సాక్ థామస్ పూణేలోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిఐఐ)లో చిత్ర నిర్మాణం, స్క్రీన్ ప్లే చదివారు. అనంతరం కొడైకెనాల్లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్ గ్రేడ్ సాధించారు. -
‘హమారీ పావ్రీ’ నయా ట్రెండ్ వైరల్
న్యూఢిల్లీ: యశ్‌రాజ్ ముఖాటే ప్రముఖ సంగీత నిర్మాత.. ఎప్పటికప్పుడు సరదా క్లిప్పింగ్స్, మీమ్స్, మాషప్‌లు విడుదల చేసి సోషల్ మీడియాలో తెగ సందడి చేసేస్తుంటారు. ఇప్పుడు ఆయన మరొక సరదా మాషప్ను రీలీజ్ చేసి నెట్టింట్లో సందడి చేశాడు. ‘యే హమారి కార్ హై, యే హమ్ హై, అవుర్ యే .. హమారి పవ్రీ హో రహీహై’ (ఇది మా కారు, ఇది మేము, మా పార్టీ అవుతోంది) అంటూ ఆయన షేర్ చేసిన మాషప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక పాకిస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డాననీర్ మోబీన్ ఈ మాషప్‌లో సరదాగా డ్యాన్స్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆమె ‘పావ్రీ హోరహి హై ’అనే హష్ టాగ్ ఉన్న టీషర్ట్ ధరించి డాన్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ‘పావ్ రీ హో రహీ హై’ హష్ట్యాగ్ కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 7,300 మందికి పైగా దీన్నిలైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు ఈ వీడియో చేసినందుకు మీకు థ్యాంక్స్అని, మరికొందరు మీ ఫుల్ ఎనర్జీ సీక్రెట్ ఏంటని కామెంట్లు చేస్తున్నారు. మీరు ఎప్పటికీ ఇలానే ఫుల్ జోష్‌గా ఉండాలని కోరుకుంటున్నామని మరికొందరు కామెంట్లు పెట్టారు. యశ్‌రాజ్ ముఖటే, గతంలోను ‘రాసోడ్ మేకోన్ థా’, గోపి బహు అండ్ రాశి, రాప్ సాంగ్, సాత్ నిభాయా సాథియాస్ కికిలా బెస్ మాషప్‌లు ట్రెండ్ అయ్యాయి. ‘పావ్ రీ హో రహీ హై’ హ్యాష్ టాగ్‌తో జోమాటో, స్విగ్గి, మెక్ డొనాల్డ్స్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కూడా తమదైన శైలిలో పోస్టులు షేర్ చేస్తున్నాయి. చదవండి: శుభవార్త చెప్పిన మేఘన్ మార్కెల్ -
మెగాస్టార్‌తో అవకాశం.. తమన్ భావోద్వేగం
ఆచార్య అనంతరం మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మెగాస్టార్ సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని తమన్ కొట్టేశాడు. లూసిఫర్‌కు స్వరాలు సమకూర్చే ఛాన్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా చిరంజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. చదవండి: ఆచార్య: చెర్రీ 'సిద్ధ'మయ్యాడుగా.. ‘ప్రతి కంపోజర్‌కు ఇది అతి పెద్ద కల. ఇప్పుడు నా వంతు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు సమయం వచ్చింది. లూసిఫర్ మ్యూజికల్ జర్నీ ఇప్పుడు మొదలవుతోంది. మోహన్ రాజాకి కృతజ్ఞతలు’ అంటూ తమన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా లూసిఫర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి చిరు అభిమానుల్లో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రానికి తెలుగులో బైరెడ్డి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మూవీ షూటింగ్ వేగంగా జరుపుకోంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సోనూసూద్ విలన్‌గా కనిపంచనుండగా.. రామ్ చరణ్ కీలక పాత్రలో అలరించనన్నాడు. ప్రస్తుతం కోకాపేటలోని 20 ఎకరాల స్థలంలో వేసిన టెంపుల్ సెట్లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ అనంతరం లూసిఫర్ షూటింగ్లో చిరు జాయిన్ కానున్నాడు. చదవండి: పవన్, క్రిష్ సినిమాకు మళ్లీ బ్రేక్.. A biggest dream for Any Composer 🎧 It’s My Turn to Show My love towards Our #BOSS 🖤 Shri #MEGASTAR ✊@KChiruTweets gaaru & My dear brother @jayam_mohanraja Here we begin our musical journey for #lucifer ( TEL ) !! 🏆🎧💪🏼 Godbless ♥️ pic.twitter.com/Sktc0auRsi — thaman S (@MusicThaman) January 20, 2021 -
ఏ.ఆర్.రహమాన్ బర్త్‌డే స్పెషల్
‘జాబిలిని తాకి ముద్దులిడు ఆశ’ అని పాట చేశాడు ఏ.ఆర్.రహమాన్ ‘రోజా’ కోసం. ఆ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లవుతోంది. వైరముత్తు ఆ వాక్యాన్ని ఏ ముహూర్తాన రాశాడో జాబిలిని తాకేంత ఎత్తుకు ఎదిగాడు రహమాన్. భూగోళం తిరగేసేవారు వందేళ్లకు ఒకసారి వస్తారు. రహమాన్ అలా వచ్చాడు. మార్చడం పెద్ద విషయం. ఉన్నదానిని కొనసాగించడం అతి చిన్న విషయం. ఇళయరాజా వంటి దిగ్గజం ప్రభావాన్ని, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్, అనూమల్లిక్, ఆనంద్–మిళింద్, నదీమ్–శ్రావణ్ వంటి అతి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లను ఉల్టాపల్టా చేయదగ్గ సంగీతంతో ఒక యువ సంగీతకారుడు రావడం పర్వతాలను అంచున ఒక చిన్న మేఘం నిలబడి ‘నా సత్తా ఇది’ అని చెప్పడమే. ‘మండపేట మలక్‌పేట నాయుడు పేట పేట రాప్’ అని రహమాన్ ‘ప్రేమికుడు’ కోసం రహమాన్ పాట చేస్తే కుర్రకారు ఉలిక్కిపడ్డాడు. ‘చుకుబుకురైలే’ అంటే వెర్రెత్తి గంతులేశారు. రహమాన్ ‘ప్రేమదేశం’ కోసం చేసిన పాటలు ‘ప్రేమా’... అని బాలూ పాడుతుంటే ముంబై అరేబియా సముద్రం అంచువరకూ వచ్చి వినడాలూ రహమాన్ని అందరికీ ఇష్టగానాన్ని చేశాయి. తాజా ప్రేమని కలిగించాయి. శబ్దాలు మాత్రమే వినిపిస్తాడని నిందలు పడ్డ రహమాన్ ‘లాలీ లాలీ అని’ పాట చేస్తే ఎంత మాధుర్యం. ‘అంజలీ అంజలీ పుష్పాంజలి’ పాట చేస్తే ఎంత పారవశ్యం. ‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని’ అని పాట చేస్తే నేడూ ఆ ప్రేమ పరీక్ష రాసిన ఎందరో విద్యార్థులు ఆ పాట పాడుకుంటూ ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మహేశ్‌బాబుకు చేసిన ‘పెదవే పలికిన మాటల్లోన’ చేసిన రహమానే ‘చక్కెర ఎక్కడ నక్కిన’ కొంటె పాట చేశాడు. ‘కొమరం పులి’లో రహమాన్ చేసిన పాటలు ఆ సినిమా అపజయం వల్ల జనంలోకి వెళ్లలేదు. ‘అమ్మా తల్లి నోర్మూయవే’ పాట ఒక ప్రయోగం. ‘నమ్మకమియ్యరా స్వామి’ పాట మధురం. రహమాన్ తమిళంలో చేసినా హిందీలో చేసినా ఆ పాటకు భాషతో పెద్ద నిమిత్తం లేదు. ఆ పాటే ఒక భాష మాట్లాడేది. ‘గుంజుకున్నా’... అనే పాట ఎంత గుంజుతుంది మనల్ని. హిందీలో రహమాన్ వల్ల సూపర్‌డూపర్ హిట్ అయిన సినిమాలు లెక్కలేనివి. ‘లగాన్’, ‘తాళ్’, ‘గజని’, ‘రంగ్ దే బసంతి’, ‘జోధా అక్బర్’... ఎన్నని. ‘తాళ్ సే తాళ్ మిలా’... అని రహమాన్ పాట కడితే తాళం వేసినవారే అంతా. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా ‘జయ హో’ పాటతో భారతీయ పాటను అస్కార్ వేదిక మీదకు తీసుకెళ్లాడు రహమాన్. 1992లో మణిరత్నం ‘రోజా’ చేసిన రహమాన్ 2021లో అదే మణిరత్నం ‘పొన్నియన్ సెల్వం’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆ జోడి కొనసాగింది. ఆ పాట కూడా.రహమాన్ ఇచ్చిన కొత్తగొంతులు, రహెమాన్ పట్టుకొచ్చిన కొత్త నాదాలు అనంతం. పాటను అందుకోవడంలో ప్రతిభ కలిగిన సామాన్యుడికిసులువు చేశాడాయన. రహమాన్ మరెన్నో గీతాలు అందివ్వాలని కోరుకుందాం. అతని పాటే చాలనుకునే అభిమానులతో ఈ పూట పాట కలుపుదాం.‘ఇవి మాత్రం చాలు.. ఇవి మాత్రమే’... -
ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
భువనేశ్వర్ : ప్రముఖ ఒడిశా సంగీత దర్శకుడు శాంతను మోహపాత్రా(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన న్యుమోనియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత 60 ఏళ్లుగా సంగీత పరిశ్రమలో ఉన్న ఆయన ఎన్నో హిట్ సాంగ్స్‌కు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మొదటగా 'కోనార్క్ గాథా' అనే పాటతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన లతా మంగేష్కర్, మొహద్ రఫీ, మన్నా డే, ఉషా మంగేష్కర్ లాంటి అనేక మంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. (అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి) 'సంగీతంలో బతికే ఉంటారు' 1936లో మయూరభంజ్ జిల్లాలో జన్మించిన శాంతను మొదట ఒడిశా మైనింగ్ కార్పొరేషన్లో పనిచేశారు. శాంతను మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేశ్ లాల్, ఏపీ గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. సంగీత దరర్శకుడిగా శాంతను చెరగని ముద్ర వేశారని, ఆయన భౌతికంగా దూరమైనా, సంగీతంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. శాంతను అంత్యక్రియలు నేడు ఒడిశాలో ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించనున్నారు. (ఆలియాభట్ స్టార్టప్.. పిల్లల దుస్తులు) -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సాక్షి, ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే (47) గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం ఉదయం పూణేలోని ఆయన నివాసంలో తుది శ్వాస తీసుకున్నారని నరేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర హఠాన్మరణంపై మరాఠీ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు తీరనిదంటూ సంతాపం ప్రకటించింది. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన నరేంద్ర, మరాఠీ చిత్ర పరిశ్రమలో గొప్ప మ్యూజిక్ డైరెక్టరుగా ఎదిగారు. పిల్లలనుంచి పెద్దల దాకా అన్ని వయసుల వారిలో తన సంగీతంతో పాపులర్ అయ్యారు. ‘ఏ పేయింగ్ గోస్ట్’ (2015) లాంటి నాటకాలతోపాటు, డియోల్ బ్యాండ్ (2015), బయోస్కోప్ (2015), ఉబూన్ టు (2017) పుష్పక్ విమాన్, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, ముల్షీ పాట్రన్ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. పూణేకు చెందిన స్టూడియో డాన్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు అనేక నాటకాలు, సీరియల్స్, సినిమాలు, జింగిల్స్ ద్వారా సంగీత పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అలాగే జీ గౌరవ్ (ఐదుసార్లు), సహ్యాద్రి సినీ అవార్డు, స్టేట్ డ్రామా అవార్డు (రెండుసార్లు), వి శాంతారామ్ అవార్డు, శ్రీకాంత్ ఠాక్రే అవార్డు, ఎం.ఎ. ఆనర్స్, స్టేట్ ఫిల్మ్ అవార్డలును ఆయన దక్కించుకున్నారు. నరేంద్ర భిడేకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేంద్ర అకాలమరణం సంగీత పరిశ్రమకు తీరని నష్టమని నటుడు ఓంకర్ తట్టే సంతాపం తెలిపారు. భిడేతో కలిసి ఒక శాస్త్రీయ పాటను రికార్డ్ చేయడానికి ఎదురుచూస్తున్నామని, కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడిందని చిత్రనిర్మాత సాగర్ వంజారీ గుర్తు చేసుకున్నారు. ఇక ఎప్పటికీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు ఉండదంటూ వంజారీ విచారం వ్యక్తం చేశారు. -
చినుకులా రాలి... నదులుగా సాగి
ప్రభాతాన వినాలంటే అతని పాట ఉంది. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’ పరవశాన పాడుకోవాలంటే అతని పాట ఉంది. ‘మల్లెలు పూసె వెన్నెల కాసే’ ఒకరి సమక్షంలో మరొకరు పాడుకోవాలంటేనో? ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ నిరాశలో ఒక తోడు కావాలా? ‘మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం’ కుర్రకారు శిగమూగాలంటే? ‘ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా’ తెలుగుపాటకు పల్లవి అనుపల్లవిగా భాసించిన రాజన్– నాగేంద్ర సోదరుల్లో నాగేంద్ర ఇరవై ఏళ్ల క్రితమే వెళ్లిపోయారు. ఇప్పుడు రాజన్ వంతు. మెలొడీ.. లాలిత్యం... రాజన్ నాగేంద్రల సంగీతం.. చల్లదనాన్ని పంచిన మంచు శిఖరం కూలి కాలంలో కరిగిపోయింది నేడు. సంగీత దర్శకుడు రాజన్‌కు నివాళి ఇది. రాజన్ ఇకలేరు ప్రముఖ సంగీత దర్శకులు రాజన్ (87) మృతి చెందారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1933లో మైసూర్‌లోని శివరాంపేట్‌లో రాజప్పకు జన్మించారు రాజన్. రాజప్ప హార్మోనియమ్, ఫ్లూట్ ప్లూయర్. పలు చిత్రాలకు పని చేశారాయన. తన సంగీత జ్ఞానాన్ని చిన్నప్పటినుంచే పిల్లలకు పంచారు రాజప్ప. 1952లో కన్నడ చిత్రం ‘సౌభాగ్య లక్ష్మీ’తో సోదరుడు నాగేంద్రతో కలసి సంగీతదర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు రాజన్. దాదాపు 40 సంవత్సరాల పాటు సుమారు 375 సినిమాలకు ఈ ద్వయం సంగీతం అందించారు. కన్నడ, తెలుగు, తమిళం, తుళు, సింహళ భాషల్లో సంగీతాన్ని అందించారు. రాజన్–నాగేంద్ర ద్వయంగా ఈ ఇద్దరూ పాపులర్. తెలుగులో తొలి నంది అవార్డు అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే. ‘పంతులమ్మ’ చిత్రానికి ఈ పురస్కారం లభించింది. తెలుగులో ‘అగ్గిపిడుగు, పూజ, పంతులమ్మ, మూడుముళ్లు, సొమ్మొకడిది సోకొకడిది, ప్రేమఖైదీ, రెండు రెళ్ల ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగలు’ వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. 2000 సంవత్సరంలో నాగేంద్ర మృతి చెందారు. రాజన్ బెంగళూరులో ‘సప్త స్వరాంజలి’ అనే సంగీత పాఠశాలను స్థాపించారు. లాక్‌డౌన్‌లోనూ ఆన్లైన్లో సంగీత పాఠాలు తీసుకున్నారాయన. రాజన్ కుమారుడు అనంత్ కుమార్ కూడా సంగీతదర్శకుడే. సోమవారం బెంగళూరులోని హెబ్బాళలోని స్మశాన వాటికలో రాజన్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. తెలుగువారు ఘనకార్యాలు చేస్తుంటారు. కాకపోతే తెలుగువారికి పెద్దగా పట్టదు. కన్నడ సీమలో తెలుగువారు రాజన్–నాగేంద్ర చాలా పెద్ద సంగీత దర్శకులు అయ్యారు. వారి దగ్గర పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనే తెలుగువారు చాలా హిట్ సాంగ్స్ పాడారు. కన్నడ ప్రజల కంఠానికి తెలుగు వారు రాసిన గంధం ఇది. కన్నడిగులు అది గుర్తించి గౌరవిస్తారు. తెలుగువారు చాలా తక్కువ ప్రస్తావిస్తారు. రాజన్–నాగేంద్రల తండ్రి తరం తెలుగు ప్రాంతం నుంచే మైసూర్ ప్రాంతానికి వలస వెళ్లింది. వారు నేటికీ తెలుగే ఇంట్లో మాట్లాడుకుంటారు. వారి ఇంటి భాష తెలుగు. బతుకు భాష కన్నడం. రాజన్–నాగేంద్రల తండ్రి రాజప్ప అలనాడు మైసూర్ ప్రాంతంలో మూకీ సినిమాలు రిలీజైతే హాల్లో కూచుని సన్నివేశాలకు తగినట్టుగా వాద్యసంగీతం సృష్టించి షోకు ఇంత చొప్పున తీసుకునేవాడు. ఆ రోజుల్లో మూకీ సినిమాల వ్యాఖ్యాతలకు, ఇలా వాద్యహోరు సృష్టించేవారికి నాలుగు డబ్బులు దొరికేవి. అయితే ఆ డబ్బుల కంటే తన ఇద్దరు పిల్లలకు నాలుగు స్వరాలు అందివ్వడమే మంచిదని రాజప్ప అనుకునేవాడు. ఆయన ఇద్దరు కొడుకులు రాజన్–నాగేంద్ర తండ్రి కోరినట్టే సంగీతం నేర్చుకున్నారు. రాజన్‌కు వయొలిన్లో గొప్ప ప్రవేశం వచ్చింది. నాగేంద్ర పాటలు పాడేవాడు. అన్నదమ్ములకు సంగీతం మీదే ధ్యాస ఉండటంతో అతి కష్టం మీద హైస్కూలు వరకూ చదివి పద్నాలుగు పదిహేనేళ్లు రావడంతోటే బెంగళూరులో సంగీత బృందాల్లో పని చేయడం మొదలెట్టారు. వారి ప్రతిభను గమనించి కన్నడిగుడని అందరూ పొరబడే మరో సంగీత ఉద్దండుడు, కన్నడ తొలి టాకీకి సంగీతాన్ని అందించిన టి.ఆర్.పద్మనాభశాస్త్రి వారిని మద్రాసు తీసుకెళ్లి ఒక సినిమా సంగీతంలో భాగం చేశారు. అక్కడ ఒకటి రెండేళ్లు ఉన్నాక తిరిగి బెంగళూరు చేరుకున్నారు అన్నదమ్ములు. విఠలాచార్య విన్న పాట అతి పొదుపుగా ఖర్చు చేసి సినిమా పూర్తి చేసే విఠలాచార్య ఈ కొత్త పిల్లలను సినిమా సంగీత దర్శకులను చేసి సినిమా ఖర్చును తగ్గించుకోదలచి కన్నడలో ‘సౌభాగ్యలక్ష్మి’ (1952) అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. అది రాజన్ నాగేంద్రల మొదటి సినిమా. వారి పని తీరు నచ్చాక ముఖ్యంగా డబ్బు గురించి అన్నదమ్ములకు పట్టింపు లేదని గ్రహించాక ఆయన మరో కన్నడ సినిమా ‘చంచల కుమారి’కి అవకాశం ఇచ్చాడు. అంతటితో ఆగక తెలుగుకు ‘వద్దంటే పెళ్లి’ (1957)తో పరిచయం చేశాడు. 1964లో విఠలాచార్య తీసిన ‘నవగ్రహ పూజా మహిమ’ లో ‘ఎవ్వరో ఎందుకీ రీతి సాధింతురు’ పాట పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ పాట ఓ.పి.నయ్యర్ చేసిన పాటకు కాపీ. తొలి రోజుల్లో నిలదొక్కుకోవడానికి రాజన్ నాగేంద్ర హిందీ బాణీల ప్రభావంతో చేసేవారు. కాని ‘అగ్గి– పిడుగు’లో వారు చేసిన ‘ఏమో ఏమో ఇది’ నేటికీ నిలిచి ఉంది. అసలైన రాజన్ నాగేంద్ర కన్నడ సీమలో ‘గంధదగుడి’ (1963) సినిమాతో రెక్కలు సాచారు. ఎన్.టి.ఆర్ ‘అడవిరాముడు’ సినిమాకు మూలంగా నిలిచిన ఈ హీరో రాజ్‌కుమార్ సినిమా రాజన్ నాగేంద్ర పాటలు తోడై సిల్వర్ జూబ్లీగా నిలిచింది. ఇందులో పి.బి.శ్రీనివాస్ పాడిన ‘నావాడువనుడియె కన్నడ నుడి’ పాటతో రాజన్–నాగేంద్ర కన్నడిగుల హృదయాలలో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. నింగి నేల ఒకటాయెనే రాజన్–నాగేంద్రల రెండవ రాకడ ‘పూజ’ (1975)తో జరిగింది. ఏ.వి.ఎం వారు తీసిన ఈ సినిమా అంతగా ఆడకపోయినా పాటలు నేటికీ పాడుతున్నాయి. ఇందులో రాజన్–నాగేంద్ర తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని తెలుగుసీమకు చూపారు. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాట ఒక బెస్ట్ డ్యూయెట్గా ఎంచబడుతుంది. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’, ‘మల్లెతీగ వాడిపోగా’, ‘నింగి నేల ఒకటాయెనె’, ‘అంతట నీరూపం’, ‘నీ దయ రాదా’... పాటలు వీరికి పునఃస్వాగతం పలికాయి. ఆ వెంటనే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘పంతులమ్మ’ పాటలూ సినిమాను మ్యూజికల్ హిట్‌ను చేశాయి. ‘సిరిమల్లె నీవే’, ‘మానసవీణ మధుగీతం’, ‘మనసెరిగిన వాడు మా దేవుడు’ పాటలు గానానికి, శబ్దానికి వీరిచ్చే విలువను తెలియ చేశాయి. సింగీతం, రాజన్ నాగేంద్రల కాంబినేషన్లో ‘సొమ్మొకడిది సోకొకడది’ కూడా హిట్టే. ఇందులోని ‘ఆ పొన్న నీడన’, ‘తొలి వలపూ తొందరలు’ కొబ్బరాకుల మీది పచ్చదనంతో ఉంటాయి. మధువనిలో రాధికవో సుందరమైన కుటుంబ కథలకు, లలితమైన ప్రేమ కథలకు రాజన్ నాగేంద్రల సంగీతం బాగుంటుందనే అభిప్రాయం స్థిరపడింది. ‘ఇంటింటి రామాయణం’ (వీణ వేణువైన సరిగమ విన్నావా, మల్లెలు పూసె వెన్నెల కాసే), ‘అల్లరి బావా’ (మధువనిలో రాధికవో), ‘నాగమలి’్ల (నాగమల్లివో తీగమల్లివో, రాగం తీసే కోయిల), ‘అద్దాల మేడ’ (పరిమళించు పున్నమిలో) ఇవన్నీ రాజన్ నాగేంద్రల మెలడీలతో నిండాయి. ఆ తర్వాత జంధ్యాల వచ్చి వారితో జత కట్టారు. ‘నాలుగు స్తంభాలాట’ పాటలు ముఖ్యంగా ‘చినుకులా రాలి’ ఇంటింట శ్రోతలు కోరే పాట అయ్యింది. జంధ్యాలతో రాజన్ నాగేంద్రలు ‘మూడు ముళ్లు’, ‘రెండురెళ్లు ఆరు’, ‘చూపులు కలసిన శుభవేళ’, ‘రాగలీల’ సినిమాలు తీశారు. ‘లేత చలి గాలులు’, ‘కాస్తందుకో దరఖాస్తందుకో’, ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ ఈ సినిమాల పాటలు. అలనాటి ‘చూపులు కలిసిన శుభవేళ’ పాటను ‘మేల్ డ్యూయెట్’ అంతే అర్థవంతంగా రాజన్ నాగేంద్రలు మలిచారు. ‘ప్రేమ ఖైదీ’, ‘అప్పుల అప్పారావు’ వారి చివరి హిట్ సినిమాలు. మనిషే మణిదీపం సంగీత ద్వయం అంటే ఒకరిది బాణి, ఒకరిది ఆర్కెస్ట్రయిజేషన్. రాజన్ నాగేంద్రలో పెద్దవారైన రాజన్ సినిమా బాణీలు కూర్చేవారు. నాగేంద్ర పాట నేర్పించేవారు. రాజన్ పర్ఫెక్షనిస్ట్. ఒక్కోసారి ఐదారుసార్లు రికార్డు చేసేవారు. ట్రాకులు పాడించకుండా గాయకుల చేతే ప్రాక్టీసు చేయించి పాడించేవారు. కన్నడంలో రాజ్‌కూమార్ స్టార్ హీరో చేత కూడా తమకు కావాల్సినట్టుగా పాడించుకున్న సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఆ సంగీతద్వయానికి ఎందరో అభిమానులు ఉన్నారు. వారందరూ ఇవాళ వారి పాటలను తలుచుకుంటారు. కొలుచుకుంటారు. మణిషే మణిదీపం మనసే నవనీతం... – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సినీ రంగంలో భంభం బోలే!
ఆనందం, బాధ, కోపం ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా పలికించవచ్చు. అటువంటి సంగీతంలో మానుకోటకు చెందిన బోలె షావలీ దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన ఇటీవల కరోనాపై ప్రజలకు చైతన్యం కలిగించేలా రూపొందించిన పాట ప్రశంసలు అందుకుంది. మహబూబాబాద్ అర్బన్: సంగీతం అనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా అందంగా పలికించవచ్చు. రాళ్లను కూడా కరిగించే శక్తి సంగీతానికి ఉంది. అటువంటి సంగీతంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు మహబూబాబాద్‌కు చెందిన బోలె షావలీ. ఇప్పటివరకు 20కి పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన ఇటీవల కరోనాపై ప్రజలకు చైతన్యం కలిగించేలా రూపొందించిన పాట ప్రశంసలు అందుకుంది. ప్రస్థానం ఇలా... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో యాకూబ్ అలీ – మెహిదీన్బీ దంపతులకు నాలుగో సంతానం బోలేæ షావలీ. ఆయనకు ఇద్దరు చెళ్లెళ్లు, ముగ్గురు అన్నలు ఉన్నారు. తల్లిదండ్రులు రెండు ఎకరాల భూమిలో సాగు చేస్తేనే జీవనం గడిచేది. బోలే చిన్న తనం నుంచి అమ్మకు చేదోడువాదో డుగా ఉంటూ ఆమె పాటలు పాడుతుంటే వింటూ నేర్చుకుని సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. పెనుగొండ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాక మిత్రులతో కలిసి సంగీత సాధన చేసేవారు. ప్రైవేట్ టీచర్‌గా వృత్తి కొనసాగిస్తున్నప్పుడు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఆయన నేర్పించిన పాట లు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నాయి. తొలి అడుగులు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హన్మంతునిగడ్డలో మిత్ర బృందంతో అద్దె గదిలో ఉండే బోలె షావలీ సంగీత సాధన చేస్తుండేవారు. ఆ సమయంలో మిత్రుడు బూరుగుల లక్ష్మణ్‌తో పాటు పబ్బతి సుధాకర్, చంద శ్రీనివాస్, నందన్ రాజ్, ప్రభాకర్, మల్లేష్, ప్రేమ్‌కుమార్ ప్రోత్సహించారు. తొలి సారి శ్రీనిలయం సినిమా డైరెక్టర్ మధువన్ బోలెకు అవకాశం కల్పించారు. తొలిసారి ఒక్కడే కానీ ఇద్దరు సినిమాకు కూడా మ్యూజిక్ అందించారు. ఇలా సుమారు 30 సినిమాలే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. మయహో యమ, నాన్‌స్టాఫ్, బంతిపూల జానకి, రవితేజ నటించిన కిక్ 2(మమ్మీ.. పాట రచించి, పాడారు)తో పాటు బిత్తిరి సత్తి నటించిన తుపాకీ రాముడు సినిమాకు సంగీతం అందించి ఆకట్టుకున్నారు. ఇవేకాకుండా హిందీలో తుహీ మెహెరా పహేలా ప్యార్, స్టెపినీ 2, నానే రాజా – నానె రాణి లాంటి సినిమాలకు సంగీతం అందించిన బోలె ఆకట్టుకున్నారు. అవార్డులు, పాటలు హిజ్రాల జీవన విధానంపై 2013లో రూపొందించిన థర్డ్ మ్యాన్ సినిమాకు బోలె షావలీ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇంకా పలు టీవీ చానళ్లలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా పాటలు రూపొందించి ఆకట్టుకున్నారు. తాజాగా ఒగ్గు కథ రూపంలో కరోనాపై పాటను చిత్రీకరించి ప్రజలను ఆకట్టుకోగా, రాఖీ పండుగ లఘు చిత్రంలో కూడా ఆయన నటించారు. కాగా, హైదరాబాద్ కృష్ణానగర్‌లో స్టూడియో ఏర్పాటుచేసుకున్న బోలె షావలీ జిల్లా నుంచి ఎవరు వచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటారు. -
మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా పాటలు విన్న నాగార్జునగారు ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడమే కాదు, ఏకంగా తాను నటిస్తున్న ఓ సినిమాకు నన్ను సంగీత దర్శకునిగా తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను’’ అని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అన్నారు. తక్కువ కాలంలోనే పలు హిట్ సినిమాలకి, స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించే స్థాయికి చేరుకున్న చైతన్య పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సంగీతంపై ఇష్టంతో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. శ్రేయాస్ మీడియా వారు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా నా మ్యూజికల్ టాలెంట్ ఇండస్ట్రీకి తెలిసింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన డైరెక్టర్ రమేశ్ వర్మ ‘7’ అనే సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా వర్క్స్‌లో ఉండగానే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి నుంచి పిలుపు వచ్చింది. అయితే ‘7’ సినిమా కంటే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రమే ముందుగా విడుదలయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు అందరూ ఛాలెజింగ్ వర్క్స్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఆ సినిమాలాంటి పాటలు కావాలని అడగలేదు.. దీంతో కొత్త ట్యూ¯Œ ్స చేసే వీలు కుదిరింది. నాకు అవకాశాలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలకు, నా పాటల్ని ఆదిరిస్తున్న శ్రోతలకి ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ శ్రోతలకి మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం’’ అన్నారు. -
సంగీత దర్శకుడు వాజిద్ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్–వాజిద్ (ఈ ఇద్దరూ అన్నదమ్ములు. వాజిద్ చిన్నవాడు) లలో ఒకరైన వాజిద్ ఖాన్ ఇక లేరు. 42 ఏళ్ల వాజిద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. అయితే కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో వాజిద్ ఇబ్బందిపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ (1998) చిత్రంతో సాజిద్–వాజిద్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి పని చేస్తూ వచ్చారు. ‘ప్యార్ కియాతో...’ తర్వాత మళ్లీ సల్మాన్ సినిమా ‘హలో బ్రదర్’కి సాజిద్–వాజిద్ సంగీతదర్శకులుగా చేశారు. అయితే ఈ చిత్రంలోని నాలుగు పాటలకు మాత్రమే స్వరాలందించారు. వాటిలో ‘ఏరియా కా హీరో’, ‘హతా సావన్ కీ ఘాటా..’ పాటలు ఉన్నాయి. సల్మాన్‌తో వాజిద్‌కి మంచి అనుబంధం ఉంది. సల్మాన్ నటించిన ‘తేరే నామ్’లోని ‘తూనే సాథ్ జో మేరా చోదా..’ పాట మంచి హిట్. అలాగే సల్మాన్ నటించిన ‘పార్టనర్’, ‘వాంటెడ్’, ‘వీర్’, ‘దబాంగ్’ తదితర చిత్రాలకు కూడా సాజిద్–వాజిద్ స్వరాలందించారు. ‘దబాంగ్’లోని ‘మున్నీ బద్నామ్ హుయి..’ పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. సల్మాన్ ‘దబాంగ్ 2’, ‘దబాంగ్ 3’ చిత్రాలకూ వీరే స్వరకర్తలు. ఇంకా ఈ సంగీత ద్వయం పని చేసిన ఇతర హీరోల చిత్రాల్లో ఇమ్రాన్ హష్మి ‘ది కిల్లర్’, అక్షయ్ కుమార్‡ ‘హౌస్‌ఫుల్ 2’, ‘రౌడీ రాథోడ్’, టైగర్ ష్రాఫ్ ‘హీరో పంతి’ వంటివి ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో సల్మాన్ రూపొందించిన ‘భాయ్ భాయ్’, ‘ప్యార్ కరోనా’ పాటలకు కూడా వాజిద్ సంగీతం అందించారు. ‘‘నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ తగ్గవు. ఎప్పటికీ గుర్తుండిపోతావ్ వాజిద్. నీ ప్రతిభను మిస్సవుతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, వరుణ్‌ధావన్, ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా, సోనమ్ కపూర్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు వాజిద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాజిద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. -
శ్రీనివాస కల్యాణం
చక్కగా డిగ్రీ చదివిన అమ్మాయిని సినిమావాళ్లకిచ్చి చేస్తున్నారేమిటో..! చుట్టు పక్కలవాళ్ల గుసగుసలు. లోపల పెళ్లిచూపుల సీన్ మాత్రం వేరుగా ఉంది. ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ’ అని రాగం తీస్తోంది అమ్మాయి. ఇకనేం.. అబ్బాయి అమ్మాయికి నచ్చేశాడు. పెళ్లయింది. పెళ్లయి అరవై ఏళ్లూ అయింది. ఈ అరవై ఏళ్లలో సింగీతంగారు.. ఎక్కువసార్లు పలికిన పేరు.. కల్యాణి. ఈ అరవై ఏళ్లలో కల్యాణి గారు.. చెప్పకోడానికి ఇష్టపడిన మాట.. ‘సింగీతం గారి భార్యని’ అరవై ఉగాదులు..! అరవై ఉషస్సులు..! ఎలా గడిచాయని ఇంటర్వ్యూలో అడిగాం. వాళ్లు చెప్పిన ప్రతి మాటా ఏడడుగుల బంధం విలువను చాటింది. రండి... శ్రీనివాస కల్యాణం చూతము రారండి ► ఈ నెల 20తో మీ పెళ్లయి 60 ఏళ్లవుతోంది. సుదీర్ఘ వైవాహిక జీవితం కాబట్టి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? సింగీతం: మేమెప్పుడూ పెళ్లి రోజు అంటూ ఆర్భాటాలు చేయలేదు. పిల్లలు వచ్చి మా దంపతులకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. కల్యాణి: అయితే మా 50 సంవత్సరాల పెళ్లిరోజుని మాత్రం అందరినీ పిలిచి చేసుకున్నాం. మా చిన్నమ్మాయి లండన్‌లో ఉంటోంది. పోయిన నెల తను ఇక్కడే ఉంది. లండన్ వెళ్లిపోయే లోపు 60 ఏళ్ల పెళ్లి రోజుని ముందే సెలబ్రేట్ చేద్దామని ఫిబ్రవరి 25న చేసుకున్నాం. ఆ వేడుక తర్వాత మా ఆమ్మాయి లండన్ వెళ్లిపోయింది. మా పిల్లల అవకాశాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడే మేం వేడుక చేసుకుంటాం. మాకు అదే మంచి రోజు అనుకుంటాం. సింగీతం: వాళ్లకి ఎప్పుడు కుదిరితే అప్పుడే మా మ్యారేజ్ డే అన్నమాట (నవ్వుతూ). ► మీ పెళ్లి ఎలా ఖాయం అయింది? సింగీతం: నేను టీచర్‌గా కొంతకాలం పనిచేశాక అక్కడక్కడా పని చేస్తూ దర్శక–నిర్మాత కేవీ రెడ్డి గారి దగ్గర చేరాను. సినిమా ఇండస్ట్రీలోకి రాగానే పెళ్లి సంబంధం వచ్చింది. చూసుకోవటం, వెంటనే ఓకే అనుకోవటం.. అలా క్విక్‌గా జరిగిపోయింది. కల్యాణి: నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. మా నాన్నగారికి ముగ్గురం ఆడపిల్లలమే. నాది ‘ఆశ్లేషా నక్షత్రం’. జాతక రీత్యా నేను చేసుకోబోయే అబ్బాయికి వాళ్ల అమ్మ బతికి ఉండకూడదు. సింగీతం: ఆశ్లేషా నక్షత్రం వారికి తాను చేసుకోబోయే అబ్బాయికి తల్లి ఉంటే ప్రమాదం. అది ఆ జాతకం వారితో ఉన్న లిటికేషన్ అన్నమాట (నవ్వులు). కల్యాణి: అంతకుముందు నాకో సంబంధం వచ్చింది. అబ్బాయికి తల్లి ఉన్నారు. మా నాన్న నా జాతకం విషయం చెబితే వాళ్లు ఫర్వాలేదన్నారు. మంచి సంబంధం అయినప్పటికీ నాన్న ఒప్పుకోలేదు. ఆ సంబంధం గురించి ఆ నోటా ఈ నోటా వైజాగ్‌లో ఉన్న సింగీతంగారి బాబాయ్ వరకూ వెళ్లింది. ఆయన మా నాన్నగారితో ‘మా అన్నయ్యకి తెలిసిన సింగీతం రామచంద్రరావుగారి అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. మీకు అభ్యంతరం లేదంటే నేను మా అన్నయ్యకు లెటర్ రాస్తాను’ అన్నారు. సింగీతం: ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పిల్లనివ్వాలంటే అంత తొందరగా ఒప్పుకునేవారు కాదు. కల్యాణి: ‘మావాడు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయి ఫోటో పంపగలరు’ అని మా నాన్నగారికి వీళ్ల నాన్నగారు ఉత్తరం రాశారు. మా నాన్న తన అభిప్రాయం చెప్పకుండా ‘అమ్మడూ.. నీ ఇష్టం’ అని ఆ లెటర్ నాకు ఇచ్చారు. నేను ఆలోచిస్తుంటే మా అమ్మమ్మగారు ‘వాళ్ల కుటుంబం గురించి నాకు తెలుసు. కంగారు పడకుండా ఒప్పుకో. ఆ అబ్బాయి డిగ్రీ, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. నేను ‘సరే’ అన్నాను. కల్యాణి, సింగీతం ► 60 ఏళ్ల క్రితం పెళ్లంటే అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా పెద్దలు పెళ్లి ఖాయం చేసేవారు. అయితే మీ నాన్నగారు మీ అభిప్రాయాన్ని అడిగారంటే, ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతోంది.. సింగీతం: మా మామగారు ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏది నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అనుకునేవారు. మా పెళ్లికి అంతా ఓకే అనుకున్నారు కానీ, కట్నం ఎంత అడుగుతారో అనేది అందరి మనసులోనూ ఉంది. అది గ్రహించి మా నాన్నగారు ‘మా వంశంలో కట్న, కానుకల ప్రసక్తే లేదు. నో డిమాండ్స్, నథింగ్’ అన్నారు. ► ఈ సందర్భంగా కట్న, కానుకలు తీసుకునే వారి గురించి నాలుగు మాటలు? సింగీతం: కట్నం తీసుకోకూడదు, నేరం.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే సరిపోదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ఆడవాళ్లు చదువుకోవాలి. స్త్రీలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఒకప్పుడు వాళ్ల అమ్మమ్మకు జరిగింది, తర్వాత వాళ్ల అమ్మకు జరిగింది.. ఇప్పుడు కూతురికి జరగకుండా చూసుకుంటే చాలు. మార్పు అదే వస్తుంది. ► అప్పట్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిని పాడమనేవారు.. కల్యాణి: ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ..’ అని పాడాను (నవ్వుతూ). ‘అబ్బాయి నచ్చాడని ఇంతకన్నా అమ్మాయి ఎలా చెబుతుంది’ అని పెద్దవాళ్లు అన్నారు. మా పెళ్లి కుదిరింది. కానీ అమ్మలక్కలు చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని సినిమా వాళ్లకి ఎందుకిస్తున్నారో అని గుసగుసలాడుకున్నారు. అప్పుడు వాళ్లు అలా అన్నారు. ‘సింగీతంగారి భార్యని’ అని నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ నాది ఒకటే మాట... ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను ధన్యురాలిని. ► పెళ్లి చూపుల్లో ‘ఇంతాకన్నా ఆనందం ఏముంది..’ అని పాడినట్లుగానే మీ లైఫ్ ఆనందంగా సాగుతోందన్న మాట... కల్యాణి: రెండొందల శాతం నా లైఫ్ అలానే ఉంది. పెళ్లికి ముందు నేను పక్కింట్లో పేరంటానికి కూడా వెళ్లేదాన్ని కాదు. మేం మా పుట్టింట్లో అలా పెరిగాం. ఓ సారి చెల్లెలు మద్రాసులో మా ఇంటికి వచ్చింది. నేను అందరితో మాట్లాడటం చూసి ‘అదేంటే... అందరితో అంత బాగా మాట్లాడుతున్నావు! బావగారు నిన్ను భలే మార్చేశారే’ అంది. సింగీతం: కాలేజీ డేస్‌లోనే మోడ్రన్‌గా ఉండేవాణ్ణి. మోడ్రన్‌గా డ్రెస్ చేసుకోవడం మాత్రమే కాదు.. నా ఆలోచనలు కూడా అలానే ఉండేవి. నేను కేవీ రెడ్డిగారి దగ్గర పని చేసేటప్పుడు మద్రాసులో రెండు లైబ్రరీలు ఉండేవి. ఇద్దరం పుస్తకాలు తెచ్చుకుని, చదివేవాళ్లం. ‘నేను ఏది చెబితే అది ఫైనల్ కాదు, నీకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీరు ఎంత చెబితే అంతే అనే తత్వం నుంచి నీకున్న హక్కుతో నువ్వు డిమాండ్ చెయ్’ అని పెళ్లయిన కొత్తలోనే తనకు చెప్పాను. ► ఇప్పుడు కూడా భార్యకి ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి చాలామంది భర్తలు ఇష్టపడటంలేదు. 60 ఏళ్ల క్రితం ‘ఈక్వల్ రైట్స్’ అన్నారంటే సూçపర్బ్. మేల్ డామినేషన్ అంటూ స్త్రీని చిన్నచూపు చూసేవారికి చిన్న సలహా ఏమైనా? సింగీతం: అప్పట్లో మగవాళ్లు ఆఫీసుకు వెళ్లి, తర్వాత క్లబ్‌లకు వెళ్లి, పేకాట ఆడి ఇలా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడితే తప్ప ఆడవాళ్లకు వేరే ఏమీ ఉండేది కాదు. టీవి వచ్చాక కొంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అయితే మగవాడు ఇంటికి వచ్చినా కూడా ఆడవాళ్లు టీవి చూస్తూనే ఉంటారనే అర్థంతో కార్టూన్లు వేసేవారు. అవి వేసేది కూడా మగవాళ్లే. అన్నిరోజులూ మగవాళ్లు పేకాట ఆడినా ఒక్క కార్టూన్ రాలేదు. ఆడవాళ్ల మీద ‘తిరగబడే ఆడది’, ‘భయపడే మొగుడు’ లాంటి టైటిల్స్‌తో కార్టూన్లు వచ్చేవి. ఇదంతా మేల్ డామినేషన్. ఇది తరతరాలుగా వస్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ ఒక్కటే పరిష్కారం. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం డిమాండ్ చేయాలి. ఈ రోజుకీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మగవాడు ఫస్ట్ అన్నట్లు చూస్తారు. 60 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా ఇప్పుడూ ఈమె కొన్ని విషయాల్లో ‘మేల్ ప్రయారిటీ’ ఇస్తుంది. అలా వద్దంటాను. స్త్రీ బతికినంతకాలం పురుషుడి మీద ఆధారపడాలనే ధోరణి మంచిది కాదు. ఆవిడకూ ఒక లైఫ్ ఉంటుంది. ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. కల్యాణి: అప్పట్లో మా నాన్నగారు ఓ పత్రికకు నాతో కరస్పాండెంట్‌గా పని చేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతుందో రాసి ఇచ్చేదాన్ని. అక్కడ లేడీస్ క్లబ్ మెంబర్‌గా ఉండేదాన్ని. అక్కడే పాఠాలు, టైప్ రైటింగ్ నేర్చుకున్నా. అలా మా నాన్న బాగా ఎంకరేజ్ చేసేవారు. పెళ్లయ్యాక ఈయన ఇంకా బాగా ఎంకరేజ్ చేశారు. ► మీరు డైరెక్షన్ చేసిన సినిమాల్లో కొన్నింటి కథా చర్చల్లో మీ ఆవిడ కూడా భాగం పంచుకున్నారట... ఆ విషయం గురించి? సింగీతం: ప్రతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ముందుగా ఆమెకు వినిపించేవాణ్ణి. ఆమెతో డిస్కస్ చేసేవాణ్ణి. ఓసారి ఆమెకు ఒక ఫిలిం ఫెస్టివల్లో చూసిన ఓ అర్జెంటీనా సినిమా నచ్చింది. ఆ మాట నాతో అంటే.. అయితే తెలుగుకి తగ్గట్టుగా ఆ కథ రాయమన్నాను. దాన్నే ‘సొమ్మొకడిది–సోకొకడిది’గా తెలుగులో తీశాను. కల్యాణి: ఏ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినా సినిమా చూస్తూ టక టకా నోట్ చేసేదాన్ని. తర్వాత ఆయనతో డిస్కస్ చేసేదాన్ని. కుమార్తెలు సుధా కార్తీక్, శకుంతలా సతీష్‌తో.... ► మీ 60 ఏళ్ల వైవాహిక బంధం గురించి అందరికీ స్ఫూర్తిగా ఉండే ఓ కొన్ని పాయింట్లు చెప్పండి... కల్యాణి: ఎంత అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అయినా వాదనలు లేకుండా ఉండవు. వాదించుకున్నా కూడా ఆ తర్వాత కలిసిపోవాలి. సమస్యలు ఉన్నా విడాకులవరకూ వెళ్లకూడదు. పెళ్లికి ముందు నాకు కొంచెం కోపం ఎక్కువ. పిల్లలు పుట్టాక ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ల అల్లరి తట్టుకోలేకపోయేదాన్ని. దాంతో పిల్లలను తిట్టి, కొట్టేదాన్ని. అలాంటి సమయాల్లో ఆయనే ఎక్కువగా సర్దుకుపోయేవారు. నాకు కోపం వచ్చింది కదా అని ఆయన ఇంకా కోపం తెచ్చుకుని సమస్యని పెద్దది చేసేవారు కాదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్సాండింగ్ ఉంది. సింగీతం: నాది ఆబ్సెంట్ మైండ్. అది నిజంగా పెద్ద సమస్యే అయినా తను సర్దుకుంది. నేను చిన్నçప్పటి నుంచీ నాస్తికుడిని. కానీ ఆమె పూజలు చేస్తుంది. నేను దేవుణ్ణి నమ్మను కదా అని తనని మానేయమనలేదు. తనకోసం నేను అష్టోత్తరాలు చదువుతాను. ఎందుకంటే ఆవిడ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కదా. నేను అష్టోత్తరాలు చదవడంవల్ల దేవుడు నన్ను ఇష్టపడతాడని కాదు... ఈమె ఇష్టపడుతుంది కదా (నవ్వుతూ). మనం ఎవరమూ పర్ఫెక్ట్ పీపుల్ కాదు. ప్రపంచంలో అందరం ‘ఇన్పర్ఫెక్ట్ పీపులే’. ఆ ఇన్పర్ఫెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. ► ‘ఆదిత్య 369’ చిత్రంలో టైమ్ మెషీన్‌ని వెనక్కి తిప్పి ప్రేక్షకులందర్నీ వెనక్కి తీసుకెళ్లిపోయారు.. ఇప్పుడు టైమ్ మెషీన్ వెనక్కి వెళితే మీకు ఏమేం చేయాలని ఉంది? సింగీతం: ఏవీ లేవమ్మా.. నిన్నటికన్నా రేపు బెటర్ అంటాను. అప్పట్లో అన్నీ అద్భుతాలే అంటుంటారు. కానీ ఇవాళ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను చేయనివి ఎన్నో ఇప్పుడు ఇండస్ట్రీలో చేస్తున్నారు. వాళ్లను చూసి నేను అప్డేట్ అవుతుంటాను. ► ఫైనల్లీ.. మళ్లీ దర్శకత్వం ఎప్పుడు? సింగీతం: రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. స్క్రిప్ట్ విషయంలో కల్యాణికి గతంలో చెప్పినట్లు పెద్దగా చెప్పడంలేదు. కాకపోతే ఇలా చేయబోతున్నానని తనకి చెబుతుంటాను. అన్నీ తనకి చెప్పే చేస్తుంటాను. ► చెప్పకుండా చేసినది ఏదైనా మీ జీవితంలో ఉందా? కల్యాణి: అలాంటిది ఏదీ లేదు (నవ్వులు). ► మీరు ‘శ్రీ కల్యాణం’ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఎవరు? కల్యాణి: నీ చిన్నప్పటి విషయాలు, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నీ అనుభవాలతో ఓ పుస్తకం రాయొచ్చు కదా? అని మా చిన్నమ్మాయి అంది. నా ఆటోబయోగ్రఫీ రాయడానికి ముఖ్య కారణం తనే. ఎలా ప్రారంభించాలా అనుకునేదాన్ని.. ‘నువ్వు అనుకున్నవన్నీ రఫ్‌గా రాస్తుండు. ఫైనల్ వెర్షన్ ఒకటి రాయొచ్చు’ అని ఆయన అన్నారు. ఓ డైరీలో రాసుకునేదాన్ని. రఫ్ రాయడానికే ఆర్నెల్లు పట్టింది. సింగీతం: మాకు పెళ్లైన కొత్తలో మాకు పెద్దగా వస్తువులు లేవు. రచయిత పింగళి నాగేంద్రగారు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు బహుమతిగా ఇచ్చారు. ఆ టేబుల్ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది. అది మాకు ప్రత్యేకం. దానిపై కాగితాలు పెట్టుకుని ఆ పుస్తకం రాసింది తను. అది నాకు సంతోషం. ► ఇప్పుడు మీ రోజువారి జీవితం ఎలా సాగుతోంది? సింగీతం: నేను ఉదయం 6:30 గంటలకు నిద్ర లేచి కాసేపు వాకింగ్, శ్వాసకి సంబంధించిన వ్యాయామం చేస్తాను. సాయంత్రం కూడా వాక్ చేస్తాను. ఆహారం అంతా టైమ్ టు టైమ్ జరిగిపోతుంది. రాత్రి కళ్లు మూసుకోగానే నిద్రపట్టేస్తుంది. పాపం తనకి నిద్రపట్టదు. కల్యాణి: నాకు రాత్రి 12 తర్వాత నిద్రపడుతుంది. అందుకని త్వరగా నిద్ర లేవలేను. నా 55వ సంవత్సరం నుంచే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. డాక్టర్ల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. డాక్టర్ చెప్పినట్లు కాసేపు చేతులు, కాళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తాను. నాకు 83 ఏళ్లొచ్చినా ఇప్పటికీ మా ఇద్దరికీ చపాతీలు చేయడం, దోసెలు వేయడం చేస్తాను.. వంట చేయడానికి మనుషులు ఉన్నారనుకోండి. సింగీతం: మేం చెన్నైలో ఉంటున్నాం. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నా తమ్ముడు అసిస్టెంట్‌గా చేసేవాడు. తన అబ్బాయి పూర్ణ ప్రగ్యా, కోడలు, వాళ్ల పిల్లలు మా వద్దే ఉంటూ బాగా చూసుకుంటున్నారు. కల్యాణి: ఆ అమ్మాయి మా సొంత కోడలిలా మమ్మల్ని చూసుకుంటుంది. అందుకని మాకేం ఇబ్బంది లేదు. ► ‘నా జీవితంలో నేను ఎక్కువగా పలికిన పేరు కల్యాణి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. సింగీతం: అవును. నేను ఎక్కువసార్లు పలికిన పేరు కల్యాణి. మాది చాలా సింపుల్ లైఫ్. నాకు డైరెక్షన్ తప్ప వేరే ఏదీ తెలియదు. షూటింగ్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేవాణ్ణి. మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఆరుగురు మాత్రమే ఉండేవారు. సినిమాలు, ఇల్లు, ఆ ఫ్రెండ్స్.. అంతే. – డి.జి. భవాని -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ సంగీత దర్శకుడు చక్రవర్తి
-
ఎ.ఆర్.రెహమాన్ మ్యూజికల్ జర్ని
-
వంశీ కథలు ఎంతో ఇష్టం
‘పుస్తకాలు చాలా తక్కువగానే చదువుతాను. కానీ నచ్చిన పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా చదివి తీరుతా’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను గురువారం ఆయన సందర్శించారు. పలు స్టాళ్లలో ఆయన తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వంశీ సాహిత్యం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ పుస్తకాల కోసం ప్రదర్శనకు వచ్చినట్లు పేర్కొన్నారు. వంశీ రాసిన ‘నల్లమిల్లోరి పాలెం’ కథల పుస్తకంతో పాటు, ‘కచ్చితంగా నాకుతెలుసు’.. ‘తెలుగాంధ్ర మిశ్రమ నిఘంటువు’ తదితర పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. అన్వేషిక స్టాల్‌లోని పలు సినీ రచయితల పుస్తకాలను కీరవాణి ఆసక్తిగాతిలకించారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు నాలుగో రోజు గురువారం పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్రిస్మస్ సెలవులతో సందర్శకుల రద్దీ కనిపించింది. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బుక్ఫెయిర్లో సందడిగా మారింది. సాహిత్యం, చరిత్ర, ఆర్థిక అంశాలకు సంబంధించిన అనేక అంశాలపైన పాఠకులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. మరోవైపు బాలమేళా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల మేజిక్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 90 మంది రచయితలతో ఏర్పాటు చేసిన రైటర్స్ స్టాల్, హైదరాబాద్ బుక్ ట్రస్టు, నవతెలంగాణ, స్కోలాస్టిక్, అన్వేషిక, ఎమెస్కో, పెంగ్విన్ తదితర స్టాళ్ల వద్ద పాఠకులు నచ్చిన పుస్తకాల కోసం అన్వేషించారు. ఇటీవల విడుదలైన జార్జిరెడ్డి సినిమా పెద్ద ఎత్తున ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆయన జీవితంపై ప్రముఖ రచయిత్రి కాత్యాయని రాసిన ‘జీనా హైతో మర్నా సీఖో’ పుస్తకానికి డిమాండ్ బాగా కనిపించింది. ప్రతి రోజు భారీ సంఖ్యలో పాఠకులు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారు. బొగోమ లోవ్ రాసిన ప్లాటో–అరిస్టాటిల్, కేవీ గోపాలచారి రచన ‘జింక సైన్స్ అను మన గురించి మనం’ వంటి పుస్తకాలతో పాటు జ్యోతిబాపూలే రచనలు, ఓ కుక్క ఆత్మకథ నవల, చేగువేరా, గౌరీ లంకేష్ కొలిమి రవ్వలు, బాలగోపాల్ రాసిన అణచివేత– అణచివేత చట్టాలు పుస్తకాలపై పాఠకులు అమిత ఆసక్తి చూపుతున్నారు. వర్ధమాన రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ‘లెటర్స్ టు లవ్’, పలువురు యువ రచయితల తొలిప్రేమ కథలు, ఇన్ ది మూడ్ ఫర్ లవ్, రష్యన్ క్లాసిక్స్ వంటి సరికొత్త రచనలకు సైతం డిమాండ్ బాగా ఉంది. పిల్లల కోసంప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి విక్రయించే స్కొలాస్టిక్స్ (స్టాల్ నంబర్ 23)లో ఫిక్షన్ సాహిత్యం కోసం చిన్నారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. టార్గెట్స్, బ్యాడ్‌బాయ్స్, జెర్నిమోస్టిల్‌టన్, డాగ్‌మ్యాన్, 2020 ఇయర్ బుక్, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్, అబ్దుల్ కలాం రచనలను విద్యార్థులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. -
పాట ఎక్కడికీ పోదు
‘‘ఏదైనా చక్కటి పాట విన్నప్పుడు దాన్ని ప్రేరణగా తీసుకొని మనదైన స్టయిల్లో ఒక కొత్త ట్యూన్‌ని సిద్ధం చేసుకోవడాన్ని కాపీ కొట్టడం అని అనుకోను. ఒకవేళ మక్కీకి మక్కీ దించేస్తే కాపీయే అంటారు. నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. కొట్టను కూడా’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు. ► నేను మందు తాగను. కానీ శేఖర్ రెడ్డి ‘90 ఎం.ఎల్’ చిత్రకథను చెప్పినప్పుడు మందు తాగినంత కిక్ ఎక్కింది. ఎంత బాగా కథ చెప్పాడో అంతే బాగా చిత్రీకరించాడు కూడా. పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఫుల్ మాస్ ఆల్బమ్‌ను రూపొందించాను. ఇందులో ఆరు పాటలుంటాయి. ఒక బిట్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ మాస్ సాంగ్స్‌కి కార్తికేయ వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ► నా హిట్ ఆల్బమ్స్‌లో ఎక్కువగా మెలోడీలు ఉండటంతో మాస్ సినిమాలకు పనిచేసే అవకాశం పెద్దగా రాలేదు అనుకుంటున్నాను. సంగీతం సమకూర్చేప్పుడు సినిమా పెద్దదా, చిన్నదా అనేది పట్టించుకోను. కథానుసారంగా ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. స్టార్ హీరోలతో పని చేసేప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. మనం మంచి మ్యూజిక్ ఇచ్చినా కొన్నిసార్లు సినిమాలు సరిగ్గా ఆడకపోవచ్చు. అప్పుడు మన శ్రమ వృథా అవుతుంది. ఆ సమయంలో కొంచెం బాధపడతాను. ► ఈ మధ్య కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు మిస్సయ్యాయి. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు కాబట్టి బాధపడను. ► కొత్త సంగీతం వస్తోంది. ప్రేక్షకులు మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పాటలు ఉంటే థియేటర్స్‌కు వస్తున్నారు. మరోవైపు కార్తీ నటించిన ‘ఖైదీ’ లాంటి సినిమా చూసి ‘భవిష్యత్తులో పాటలు లేని సినిమాలే ఉంటే సంగీత దర్శకులకు దెబ్బే’ అని కొందరు అంటున్నారు. భారతీయ సినిమాల్లో నుంచి పాట ఎక్కడికీ పోదు. పాట లేని సినిమా అయినా నేపథ్య సంగీతం కావాలి. అదీ సంగీతదర్శకుడి పనే. మన సినిమాల్లో పాటలు పక్కా ఉండాలని ఓ సందర్భంలో షారుక్ ఖానే అన్నారు. ► ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. -
ప్రేక్షకులను అలా మోసం చేయాలి
‘‘చాలా రోజులు కష్టపడి ఓ సినిమాను తెరకెక్కిస్తాం. ముందుగా చెప్పిన విడుదల తేదీకే సినిమాను విడుదల చేయాలని కొందరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో రాజీ పడుతుంటారు. అది తప్పు అని నా అభిప్రాయం. సమయం ఉన్నప్పుడు రీ–రికార్డింగ్‌కు మరింత సృజనాత్మకతను జోడించి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు నిర్మించారు. సత్యదేవ్, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ... ► ఓ హత్య నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈషా రెబ్బా పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగుతుంటాయి. ఇందులో మూడు పాటలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రమోషనల్ సాంగ్. ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పని చేశాను. ‘ఢమరుకం’ మినహా ఆయన ఎక్కువగా హాస్యభరిత చిత్రాలు తీశారు. ‘రాగల 24 గంటల్లో’ చిత్రం థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ► కెమెరా, నేపథ్య సంగీతం ఈ సినిమాకు రెండు కళ్లు లాంటివి. థ్రిల్లర్ చిత్రాల్లో స్క్రీన్ ప్లే కూడా చాలా ముఖ్యం. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా సాగేందుకు మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచి వారిగా చూపిస్తూ ప్రేక్షకులను మోసం చేయాలి. కొన్నిసార్లు సౌండ్‌తోనే ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా చేయాలి. ఈ సినిమా కోసం దాదాపు 30 రోజులు ఆర్ఆర్(రీరికార్డింగ్) వర్క్ చేశాం. ► ఇప్పటి వరకు 18 సినిమాలకు సంగీతం అందించాను. దర్శకుడికి నచ్చలేదని ఇప్పటి వరకు రెండో ట్యూన్ చేసింది లేదు. మొదటి ట్యూనే కరెక్టుగా వచ్చేందుకు కష్టపడతా. నా కెరీర్ పట్ల సంతృప్తికరంగానే ఉన్నాను. అనుకున్నంత వేగం లేదు. కానీ, ఏడాదికి రెండుమూడు సినిమాలు చేస్తూ రేస్‌లోనే ఉన్నాను. కొన్ని సార్లు సంగీతం బాగున్నప్పటికీ సినిమా ఆడకపోతే ఆ ప్రభావం సంగీత దర్శకుడిపై పడే అవకాశం ఉంది. ► ఒక సినిమాకు ఒకరు ఆర్ఆర్ మరొకరు మ్యూజిక్ ఇవ్వడం సరికాదన్నది నా భావన. ఆర్ఆర్, మ్యూజిక్కు కలిపి ప్యాకేజ్డ్గా నేను ఓ సినిమాను ఒప్పుకున్నాను. కానీ ఒకరు జోక్యం చేసుకుని ఆర్ఆర్ ఇచ్చి, మూవీ బిజినెస్ విషయంలోనూ సహాయం చేస్తాననడంతో యూనిట్ వారు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా రెండు సినిమాలు దూరమయినప్పుడు చాలా బాధపడ్డాను. ► ప్రస్తుతం ‘పలాస’ సినిమాలో నటిస్తూ, సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నటుడిగా నాకు మంచి అవకాశాలు వస్తే తప్పక చేస్తాను. -
సామజవరగమన
-
మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సినీ హీరో సాయి దరమ్ తేజ్ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి అతని స్నేహితుడే కావడం గమనార్హం. వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టైర్ స్కిడ్ అయి కింద పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్లున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని చూసి కిందకు దిగి ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి తన స్నేహితుడు, మ్యూజిక్ డైరక్టర్ అచ్చు అని తెలుసుకొని స్వయంగా వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాగా, మానవత్వంతో స్పందించిన హీరో వ్యక్తిత్వాన్ని మిగతా వాహనదారులు, ప్రయాణీకులు ప్రశంసించారు. -
మహిళకు సందేశాలు.. దర్శకుడి అరెస్ట్
కర్ణాటక,యశవంతపుర: మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు మురళీధర్ రావ్‌ను కుమారస్వామిలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీధర్ సాహిత్యంతో పాటు మ్యూజిక్ కంపోసింగ్ కూడా చేస్తారు. కుమారస్వామి లేఔట్లో సొంతంగా స్టూడియో ప్రారంభించారు. సీరియల్స్‌తో పాటు ప్రకటనల్లో నటించేందుకు ఇస్తానని, తనకు లైంగికంగా సహకరించాలని ఓ మహిళకు సందేశం పంపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మురళీధర్‌రావును అరెస్ట్ చేశారు. -
రుతురాగాల బంటీ
తల్లి గర్భం నుంచి బాలమురళిని అభ్యసించారు. టెలివిజన్ సీరియల్స్‌కు స్వరాలు అందించారు.తాతల నుంచి∙వైద్య వారసత్వం అందుకున్నారు. వైద్యుడిగా ఎందరికో ఉపశమనం కలిగించారు. పాటలతో పరవశింపచేశారు.. సంగీతకారుడిగా, వైద్యుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతిక సీరియల్ సాంగ్స్‌తో ఈ రోజు సంగీత విభావరి నిర్వహించబోతున్న డా. బంటి (సత్యనారాయణ) తోసాక్షి ప్రత్యేక సంభాషణ. ♦ టీవీ సీరియల్స్‌లోని పాటలతో సంగీత విభావరి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? బంటి:నా శ్రేయోభిలాషి సంజయ్ కిశోర్‌కి ఈ ఆలోచన వచ్చింది. మ్యూజిక్ చేయడం, పాడటం వరకే నా ఆలోచన పరిమితంగా ఉంటుంది. నా గురించి నేను ప్రోగ్రామ్ చేసుకోవడానికి దూరంగా ఉంటాను. ఎవరైనా సరదాగా పిలిస్తే వెళ్లి పాడతాను. అంతే. నేను సంగీతం చేసిన చక్రవాకం సీరియల్ సాంగ్ సంజయ్‌కి చాలా ఇష్టం. నేను ఎవరితో మ్యూజికల్ నైట్‌లో పాడుతున్నా, చక్రవాకం పాడటం తప్పనిసరిగా మారింది. అలా మా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. మా చెల్లెలు అలకనందతో కలిసి నన్ను ప్రోగ్రామ్ చేయమన్నారు. సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది వద్దన్నాను. అయితే నేను పాడటం ప్రారంభించి పాతిక సంవత్సరాలు పూర్తయింది కనుక రజతోత్సవంగా చేద్దామన్నారు. వైద్యుడిగా కూడా పాతికేళ్లు దాటింది. అందుకని ఒప్పుకున్నాను. ♦ సంగీతం నేర్చుకున్నారా? బంటి: ఐదో తరగతి నుంచే పాడడం, మ్యూజిక్ కూడా చేయడం మొదలుపెట్టా. మా అమ్మ, పిన్ని సంగీతం బాగా పాడతారు. ఒకరోజు రాత్రి కరెంటు పోయిన సమయంలో మా పిన్ని ‘మూడు నాళ్లాయెరా మువ్వ గోపాలా’ అనే పదం నేర్పించింది. శృతిలో పాడాను. స్వరం బాగా పలుకుతోందని సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు మా పిన్ని మనోరమ. ఆమే నా గురువు. కొన్నాళ్లు అమ్ముల సత్యవతిగారి దగ్గర వయొలిన్ నేర్చుకున్నాను. నన్ను, మా చెల్లెలిని జవహర్ బాలభవన్‌లో మల్లాది గిరిజ గారి దగ్గర చేర్పించారు. ఆ తరవాత రేడియోలో బాలల కార్యక్రమంలో పాడాం. రేడియో అక్కయ్య తురగా జానకీరాణి మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్, సాయిబాబా, నిర్మల... అందరి స్వరకల్పనలో చిన్న పిల్లల పాటలు పాడాం. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు దూరదర్శన్‌లో ‘విశాల భారతి’ బ్యాలేకి సంగీతం సమకూర్చాను. దూరదర్శన్‌లో వచ్చిన నా మొట్టమొదటి సంగీత రచన అదే. ఆ తరవాత రెగ్యులర్‌గా నేను కంపోజ్ చేసిన పాటలు పాడేవాడిని. చిన్నప్పడు మా నాన్నగారు బ్యాంగో, క్యాసియో కొని ఇచ్చారు. అవి పెట్టుకుని పాటలు కంపోజ్ చేసేవాడిని. కొంతకాలం పాటు మా నాన్నగారే సొంత డబ్బులతో నా ప్రోగ్రామ్స్ ఏర్పాటుచేశారు. అలా నా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ♦ మీ అభిమాన గాయనీ, గాయకులు? బంటి: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు గురుతుల్యులు. ఆయన అన్నిరకాల పాటలు పాడారు, పాడుతూనే ఉన్నారు. పాతిక సంవత్సరాల నా ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపికను బాలు గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకులలో ఇళయరాజా అంటే అభిమానం. ఎం.ఎస్. విశ్వనాథన్, మహదేవన్, రమేశ్‌నాయుడు అందరి పాటలూ ఇష్టమే. కాని ఇళయరాజా సంప్రదాయ సంగీతాన్ని పాశ్చాత్య బాణీలో చేయడం బాగా నచ్చింది. ఇళయరాజాగారి ప్రేరణతో సంగీతం చేయడం ప్రారంభించాను. వసంతకోకిలలోని ‘కథగా కల్పనగా’ పాట విన్నప్పటి నుంచి నాకు ఆయనలాగ చేయాలనే కోరిక కలిగింది. ఒకసారి ఒక పాట కంపోజ్ చేశాను. నాకు తెలియకుండానే అది ఒక సంప్రదాయ రాగంలో వచ్చింది. ♦ వైద్య వృత్తిని, సంగీతాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు? బంటి:ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, శనిఆదివారాలు సంగీతం చేసుకోవాలనుకునేవాడిని. కుదరలేదు. గుల్బర్గాలో మెడిసిన్ పూర్తి చేశాను. కాని నా సంగీత తృష్ణ నన్ను వెంటాడుతూనే ఉంది. ఎం. డి. చేయకుండా తప్పించుకోవడానికి ఎం.బి.ఏ., ఐఏయస్లకు ప్రిపేర్ అయ్యాను. బంధువులకు ఇచ్చిన వైద్యసలహాలు పనిచేయడంతో, క్లినిక్ ప్రారంభిస్తే అన్నీ కలిసి వస్తాయన్నారు. వాళ్ల కోరికమేరకు డాక్టర్ ప్రాక్టీస్ ప్రారంభించాను. దేవుడే పంపినట్లుగా ఒకసారి సుధాకర్ పల్లమాల (మంజులానాయుడు భర్త) వాళ్ల స్టూడియో బాయ్ నా దగ్గరకు వచ్చాడు ట్రీట్మెంట్ కోసం. అప్పట్లో వాళ్లు ‘ఆగమనం’ సీరియల్ తీస్తున్నారు. అలాంటివారి దగ్గర పనిచేస్తే బాగుంటుంది అని మనసులో అనుకున్నాను. ఒకరోజు మంజులానాయుడుగారి అబ్బాయి బండి మీద నుంచి పడిపోవడంతో, వారి ఆఫీస్ బాయ్ రిఫరెన్స్‌తో ఆ కుర్రాడిని నా దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ఆ కుర్రవాడు ఫలానా అని నాకు తెలియదు. మాటల మధ్యలో వాళ్ల వివరాలు తెలుసుకున్నాను. అప్పటికే నేను కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాను. మంజులానాయుడు గారి దగ్గరకు వెళ్లి, నా గురించి చెప్పాను. ఆవిడ, నాతో ‘‘బంటీ! నాకు వంద పరికరాలు వద్దు. చిన్న ట్యూన్ సింపుల్‌గా వినిపించు’’ అన్నారు. ఆవిడ కోరినట్లు వినిపించగానే ఆవిడ సంతోషపడ్డారు. అప్పుడు సుశీల సీరియల్ ప్రారంభిస్తున్నారు. ఆ సీరియల్‌కి ఆలాపన చేయమంటే అలాగే చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది. వీటి కంటె ముందుగా నేను హరిత, అంకురం సీరియల్స్‌కి చేశాను. ♦ మీకు ఋతురాగాలతో మంచి గుర్తింపు వచ్చింది కదా! బంటి: ఋతురాగాలు సీరియల్‌కి. బలభద్రపాత్రుని మధు మంచి పాట రాశారు. దానికి నేను సంగీతం సమకూర్చాను. ప్రముఖ దర్శకులు బాపు, గాయకులు పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, పి. సుశీల... వీరంతా ఋతురాగాలు పాటను మెచ్చుకున్నారు. బలభద్రపాత్రుని మధుగారు నా ఇలవేలుపు. ఆ తరవాతా మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో మంచి పాటలు వచ్చాయి. సీరియల్స్, పాటలు కలిపి వంద వరకు చేశాను. నాకు మెయిన్‌గా ఋతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, కస్తూరి, త్రివేణీ సంగమం, కొంగుముడి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, జయప్రదం.. సీరియల్స్ బాగా పేరు తెచ్చాయి. మా ఇంటి ఆడపడుచు, చక్రవాకం సీరియల్స్‌కి గాయకుడిగా రెండు నంది అవార్డులు గెలుచుకున్నాను. కెరటాలు సీరియల్‌కి సంగీతం విభాగంలో అవార్డు వచ్చింది. ‘హైదరాబాద్ బ్లూస్’తో కలిపి మొత్తం పది చిత్రాలకు సంగీతం సమకూర్చాను. నాకు సీరియల్స్‌లో ఫ్రీడమ్ ఉంది. అందుకే హ్యాపీగా ఉంది. ♦ ఎం. డి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ తూ.గో. జిల్లా రాజోలు నా స్వస్థలం. గోదావరి నీళ్లు తాగితే సంగీతం వస్తుందంటారు. నిజమేనేమో మరి. నేను ముందుగా సంగీత దర్శకుడిని. ఆ తరవాతే డాక్టరు అయ్యాను. నువ్వు ఏం చదువుతావురా అంటే ఎం.డి. అన్నాను. అది డాక్టర్లు చదివే ఎం. డి. కాదు. మ్యూజిక్ డైరెక్టరుకి షార్ట్ ఫామ్. దేవుడి దయ వల్ల డాక్టరుగా మంచి పేరు తెచ్చుకున్నాను. ఎక్కువగా మెడికల్ క్యాంప్స్లో పాల్గొని సేవ చేస్తున్నాను. గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడ ప్రతి నాలుగో ఆదివారం ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ,ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
నయన్‌తో కోలీవుడ్‌కు.. తాప్సీతో బాలీవుడ్‌కు
సంగీత రంగంలో ఉరకలేస్తున్నాడు యువ సంగీత దర్శకుడు రోన్ ఈత్తన్ యోహాన్. ఈయన తండ్రి రాజన్ ప్రముఖ గిటారీస్ట్, తాత జావీద్ సంగీత కళాకారుడే. తండ్రి ప్రోత్సాహంతో స్వయంకృషితోనే సంగీత దర్శకుడిగా ఎదిగాడు. లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని నేర్చుకున్నాడు. అంతే సంగీతదర్శకుడిగా అవకాశం వరించేసింది. అగ్రనటి నయనతార సెంట్రిక్ కథా పాత్ర లో నటించిన మాయ చిత్రానికి సంగీతాన్ని అందిం చే అవకాశం. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అంతే ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో మాయ వంటి సంచలన విజయం సాధిం చిన చిత్రం తరువాత అరవిందస్వామి, శ్రియ నటించిన నరకాసురన్, సిగై, ఇరవా కాలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఇక మలయాళంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ఒప్పం చిత్రానికి నేపధ్య సంగీతం అందించారు. కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా న టించిన కేశవా చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారు. తాజాగా టాలీవుడ్‌ను టచ్ చేశారు. అక్కడ మదనం అనే అందమైన ప్రేమ కథా చిత్రంలో పరిచయం అవుతున్నారు. నయనతార మాయ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన యోహాన్ ఇప్పుడు తాప్సీ నటించిన గేమ్ఓవర్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొంది త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని రోన్ ఈత్తన్ యోహాన్ సాక్షితో పంచుకున్నారు. తన కు గురువు ఇళయరాజా, స్ఫూర్తినిచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్, ఇష్టమైన సంగీత దర్శకుడు ఆర్డీ. బర్మన్ అనీ చెప్పారు. హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్న తనకు మెలోడీ పాటలంటేనే ఇష్టం అని తెలిపారు. తెలుగులో నాగార్జున, ప్రభాస్, విజయ్‌దేవరకొండ తనకు నచ్చిన హీరోలని చెప్పారు. తమిళంలో విజ య్, అజిత్ అంటే ఇష్టం అని, దర్శకుడు మ ణిరత్నం, సెల్వరాఘవన్ వంటి దర్శకుల చిత్రాలకు పని చేయాలని ఆశిస్తున్నానని చెప్పాడు. సంగీతంతో పాటు కథలు రాయడంలో ఆసక్తి ఉందని, భవిష్యత్‌లో దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉందని రోన్ ఈత్తన్ యోహాన్ వెల్లడించాడు. -
తన్..మన్.. మ్యూజిక్..
ఘంటసాల శ్రీనివాస్ సాయి తమన్ శివకుమార్ అనే పూర్తి పేరు వింటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వారుంటారేమో కానీ... సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తమన్. ఎస్ఎస్ అనేపొట్టి ఇంటిపేరును సూపర్ సక్సెస్ అనే గట్టి నిక్‌నేమ్‌గా మార్చుకుని చిరకాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు తమన్.. ఈ యంగ్ మ్యూజిక్ సునామీ సినీ సంగీత ప్రస్థానంలో 10 వసంతాలతో పాటు 100 చిత్రాల మైలురాయిని కూడా దాటాడు. తాజాగా విడుదలైన మజిలీ సినిమాకు మంచి సంగీతాన్ని అందించి ప్రశంసలు అందుకుంటున్న తమన్‌తో సాక్షి ముచ్చటించింది. ఆయన పంచుకున్న టెన్ ఇయర్స్ జర్నీ విశేషాలు ఆయన మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో : తొమ్మిదేళ్ల వయసులో డ్రమ్మర్‌గా ప్రారంభమైన నా సంగీత ప్రయాణం.. సినిమా రంగానికి వచ్చిన పదేళ్లలో ఎన్నో అనుభవాలు. ఎన్నెన్నో పురస్కారాలు, ప్రశంసలతో సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. నా ఈ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూనే... మరిన్ని కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నా.. ఇప్పటిదాకా టచ్ మీ నాట్ తరహాలో ఉంటూ వచ్చానని అంటుంటారు అందరూ.. అయితే ఇకపై ప్రత్యక్షంగా ప్రజలకు చేరువవుదామనే ఆలోచనలో భాగంగానే... స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్స్‌లో కనిపించడం... అలాగే లైవ్ కన్సర్ట్స్తో కూడా ఇకపై ప్రేక్షకులకు కనిపిస్తా.. వినిపిస్తా.. నైట్ ఈజ్ బ్రైట్ నైట్ టైమ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. రాత్రి 7–8 గంటల నుంచి ఎవరూ పెద్దగా ఫోన్లు చేయరు ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప ఫోన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే నైట్ 8గంటల నుంచి ఉదయం 4గంటల వరకు నా మ్యూజిక్ కంపోజింగ్ వర్క్ ప్లాన్ చేసుకుంటాను. ఈ విషయంలో రెహ్మాన్ పంథాయే నాది కూడా.. సినీ రంగంలో గొప్ప గొప్ప సంగీత దర్శకులైన ఎం.ఎం.కీరవాణి, మణిశర్మ, రాజ్‌కోటి... ఇలా దాదాపు అందరి దగ్గరా శిష్యరికం చేసిన అనుభవం నాకు ఈ రంగంలో రాణించడానికి బాగా ఉపయోగపడింది. న్యూ టాలెంట్‌కు ఆకాశమే హద్దు నేపథ్య సంగీత దర్శకుడిగా మాత్రమే తెలిసిన నన్ను నేను నేరుగా ప్రేక్షకులకు పరిచయం చేసుకోవాలనుకున్నాను. పైగా డైట్ వర్కవుట్ చేసి ఇప్పుడు కొంచెం స్లిమ్‌గా కూడా మారాను కదా..(నవ్వుతూ). రాత్రి 9 గంటల సమయంలో ప్రసారమయ్యే స్టార్ మా మ్యూజికల్ రియాల్టీ షో సూపర్సింగర్లో హరితేజ, రేవంత్‌తో కలిసి న్యాయనిర్ణేతగా చేస్తుంటే తెలుస్తోంది... ప్రస్తుతం టాలెంట్‌కు ఆకాశమే హద్దుగా ఉందని.. పాటల పట్ల తమ అభిరుచిని మరచిపోయిన అమెచ్యూర్ గాయనీ గాయకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయడం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంతేకాదు... ఔత్సాహిక గాయనీ గాయకులు ఇంత మందితో సంభాషించే అవకాశం కొత్త విషయాలను నాకు నేర్పిస్తోంది. చాలాసార్లు అనుకున్నా ఐదారుగురు తప్ప నాకు కొత్త గాయనీ గాయకులను పరిచయం చేసే అవకాశం లభించలేదు. ఇలాంటి షోలు నాకు ఆ అవకాశాన్ని ఇస్తాయని ఆశిస్తున్నా.. బాల్యాన్ని బాధించొద్దు... చిన్నప్పుడు 15ఏళ్ల వయసులో తమిళ్లో బాలుగారి ప్రోగ్రామ్‌కి ఆర్కెస్ట్రాలో డ్రమ్స్‌తో పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత బిగ్‌బాస్ కోసం థీమ్‌సాంగ్‌తో పాటు మ్యూజిక్ కంపోజ్ చేసిన మంచి అనుభవం కూడా స్టార్ మా సూపర్ సింగర్స్ షో ఒప్పుకోవడానికి కారణం. ఇంకో విషయం చెప్పాలి... మా టైమ్‌లో ఇన్ని కాంటెస్ట్‌లు లేవు. ఇప్పుడు పిల్లలు సీరియస్ పోటీల్లో పాల్గొనడం చూస్తుంటే మాత్రం కొంచెం బాధనిపిస్తోంది.. బాల్యాన్ని ఎంజాయ్ చేయనీయకుండా చిన్నప్ప్పుడే గ్లామర్, ఎక్స్పోజర్ మీద క్రేజ్ పెంచేస్తే వాళ్లు చాలా మిస్ అవుతారు కదా? చిన్నతనంలో ఆడుకోవాలి, చదువుకోవాలి. అందుకే పిల్లల పోటీలను జడ్జ్ చేయాలంటే ఇష్టపడను. అయితే ఇప్పుడు నేను జడ్జ్ చేస్తున్న కాంటెస్ట్‌లో పోటీదారులంతా తగిన వయసున్నవాళ్లే. మెచ్యూర్డ్ పీపుల్. ‘స్నేహ’సంగీతం... తమన్ తన స్నేహితులైన ప్లేబ్యాక్ సింగర్స్ రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్, మాధవ్... తదితరులతో కలిసి తక్కలి పేరిట బ్యాండ్ కూడా ఏర్పాటు చేశారు. తక్కలి అంటే టమాటో అని అర్థం. చెన్నైలో ఉండే ఈ ఫ్రెండ్స్ అంతా మ్యూజిక్ అభిరుచితో పాటు ఫుడీస్ కూడా కావడంతో ఎన్నో వంటకాల్లో వినియోగించే టమోటా పేరు పెట్టారు. విభిన్న రకాల సామాజిక అంశాలపై పాటలతో ఈ బ్యాండ్ ద్వారా ఒక ఆల్బమ్ కూడా లాంచ్ చేశారు. ఎవరికి ఏ పాట నచ్చుతుంది? ఏ ట్యూన్స్‌కి ఎలా రియాక్టవుతారు అనేది లైవ్ బ్యాండ్ ద్వారా నేరుగా తెలుస్తుంది. నా సొంత బ్యాండ్ ‘తక్కలి’ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్ధేశ్యం అదే అని చెప్పారు తమన్. నో పబ్స్... క్రికెట్ లబ్‌డబ్ ప్రస్తుతం తెలుగులో వెంకిమామ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టŠస్ చేస్తున్నాను. చెన్నైలో ఉంటున్నప్పటికీ.. గత కొంత కాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువ వర్క్స్ చేస్తున్నాను. దాంతో ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వీకెండ్లో సూపర్‌సింగర్ షూటింగ్లో పాల్గొంటున్నాను. సిటీలో పార్టీయింగ్, పబ్‌లకు వెళ్లడం అలవాటు లేదు. ఈ సిటీ íశివార్లలో మంచి స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. సింగర్స్, మ్యూజిషియన్లు.. ఇలా చాలా మంది మా ఫ్రెండ్స్ టీమ్‌లో ఉన్నవాళ్లమంతా కలిసి శంషాబాద్‌లోని గ్రౌండ్‌తో పాటు సిటీ దగ్గర్లోని కొన్ని గ్రౌండ్స్‌లో నైట్ క్రికెట్ ఆడతాం. హైదరాబాద్ వస్తే ఈ ఫన్ని మిస్సవడానికి అసలు ఇష్టపడను. -
సంగీతంలో నాకెవరు సాటి!
సంగీతంపై తనతో చర్చించేంత ప్రతిభావంతుడు ఇంకా తారస పడలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టిన ఈయనకు పలువురు అభినందన సభలను, సత్కారాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే సినీ నిర్మాతల మండలి ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. పలు కళాశాలల్లో ఇళయరాజా జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తూ సన్మానిస్తున్నారు. మంగళవారం విరుదునగర్‌లోని సెంధిల్ కుమర్ నాడార్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఇళయరాజా మాట్లాడుతూ విరుదునగర్‌లో తాను కాలు పెట్టని ప్రాంతమే లేదన్నారు. 1969లో మాసట్ర మనం అనే నాటకానికి సంగీ తాన్ని అందించడానికి తొలిసారిగా హార్మోనియంతో వచ్చానని తెలిపారు. అలా తనకు, తన హార్మోనియంకు పరిచయం అయిన ప్రాంతం విరుదునగర్ అని పేర్కొన్నారు. కామరాజర్ పథకంతో విద్యార్థులకు తాను చెప్పేదొక్కటే. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తన సంగీతంతో ఆశీర్వదిస్తున్నానన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవద్దని చెప్పారు. తనకు చదువు అంటే ఆసక్తి మక్కువనీ, అప్పట్లో కామరాజర్ ప్రవేశపెట్టిన మధ్యాహ్నం ఆహారం పథకంతో 6 నుంచి 8 వ తరగతి వరకూ చదువుకున్నానని ఇళయరాజా గుర్తు చేసుకున్నారు. విద్యార్థల ప్రశ్నలకు ఇళయరాజా బుదులిచ్చారు. అపూర్వసహోదరగళ్ చిత్రంలోని పుదుమాయ్ పిళ్లైక్కు నల్ల యోగమడా పాట ఎలా రూపొందిందన్న ఒక విద్యార్థిని ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అది ఎంజీఆర్ పాటలు మాదిరిగా ఉండాలని నటుడు కమలహాసన్ కోరారన్నారు. అందుకే నాన్ పార్తదిలే అవళ్ ఒరుత్తిౖయెదాన్ నల్ల అళగి యన్భేన్ పాట బాణీలో అపూర్వ సహోదర్‌గళ్ చిత్రంలోని పాటను రూపొందించినట్లు తెలిపారు. సాహిత్యం, నాటక పుస్తకాలు ఉన్నాయి గానీ, సంగీతం గురించి పుస్తకాలు లేవు మీరు సంగీతం గురించి పుస్తకాలు రాయవచ్చుగా అన్న ప్రశ్నకు బదులిస్తూ సంగీతానికీ పుస్తకాలు ఉన్నాయనీ, అయితే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయనీ చెప్పారు. సంగీతానికి సంబంధించి ఏ ఏ పుస్తకాలు ఉండేవో తాను సంగీతాన్ని అందించిన ఒళియిన్ ఓసై చిత్రంలో చెప్పాననీ అన్నారు. ఇకపోతే సంగీతం గురించి తనతో పాటు కూర్చుని చర్చించే ప్రతిభావంతుడు తనకింకా తారస పడలేదనీ, ఇలా అనడంతో తాను గర్విష్టినని కొందరు అనుకుంటారనీ, మరి కొందరు తన నుంచి దూరం అవుతున్నారనీ అన్నారు.అదే విధంగా సంగీతం గురించి పుస్తకం రాయాలన్న ఆలోచన తనకింత వరకూ రాలేదనీ పేర్కొన్నారు.అయినా పుస్తకాలు చదవడం ద్వారా సంగీతాన్ని అర్ధం చేసుకోవడమో, నేర్చుకోవడమో సాధ్యం కాదని ఇళయరాజా అన్నారు. -
నాకు మాత్రమే సంగీతం తెలుసు
సంగీత భాణీలు కట్టడం నాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు అన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. 75వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈయనకు పలువురు సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ విధంగా స్థానిక మెరీనా తీరంలోని రాణీ మేరీ బాలల కళాశాల నిర్వహకం ఇళయరాజా 75 వసంతాల వేడుకను శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీతజ్ఞాని ఇళయరాజా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ మీరీ కళాశాలను ఇప్పుడే చూస్తున్నారని, తాను 48 ఏళ్లుగా చూస్తున్నానని అన్నారు. తాను సహాయ సంగీత దర్శకుడిగా ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి ఈ మార్గంలోనే వెళ్లేవాడినని చెప్పారు. దీనికి ఆసియాలోనే ప్రప్రథమంగా స్థాపించిన కళాశాల అనే ఖ్యాతి ఉందన్నారు. మెరినా తీరం ఎదురుగా నెలకొల్పడం ఈ కళాశాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. తాను అన్నక్కిళి చిత్రానికి తొలి భాణీలు కట్టింది మెరీనా తీరంలోనేనని తెలిపారు. పరిస్థితులకు తగ్గ సంగీతం చిత్రంలోని ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు సంగీత భాణీలు కట్టేవారు తాను మినహా ఎవరూ లేరని ఇళయరాజా అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఇళయరాజా బదులిస్తూ తాను కళాశాల చదువులు చదవకపోవడం వల్ల ఎలాంటి చింతా లేదన్నారు. అయితే కళాశాల చదువు అనుభవం మాత్రం తనకు చాలా ఉందన్నారు. 1968 మార్చి నెలలో చెన్నైకి వచ్చినప్పుడు తన వద్ద ఏమీ లేదని, నమ్మకం మాత్రమే ఉందని ఇళయరాజా పేర్కొన్నారు. ముందుగా ఇళయరాజా తాను భాణీలు కట్టిన పాటలను విద్యార్థులకు పాడి వినిపించారు. -
సంగీత దర్శకుడిపై అత్యాచారం కేసు
కర్ణాటక, కృష్ణరాజపురం, యశవంతపుర : ప్రేమించి మోసం చేయడంతో పాటు మరొక యువకుడితో కుదర్చుకున్న వివాహం రద్దు కావడానికి కారణమైనందుకు ఓ యువతి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సంగీత దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు. గూళిహట్టి చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన మహదేవ్ కరణ్ రెండేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చెందిన ఓ యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే యువతి ఇంట్లో ఇరువురి ప్రేమను వ్యతిరేకించడంతో అప్పటి నుంచి యువతి మహదేవ్‌కు దూరంగా ఉండసాగింది. దీంతోపాటు కొద్ది రోజుల క్రితం యువతికి మరొక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహదేవ్ యువకుడికి ఫోన్ చేసి యువతితో సాగించిన ప్రేమాయణాన్ని వివరించాడు. దీంతో యువకుడు యువతితో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాడు. దీనంతటికి సంగీత దర్శకుడు మహదేవ్ కారణమని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువతితో జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు మహదేవ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు. -
ఆత్మహత్య ఆలోచన వెంటాడింది
ముంబై: పాతికేళ్ల వయస్సు వచ్చేవరకూ రోజూ తనను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్(51) తెలిపారు. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోవడంతో తాను జీవితంలో విఫలమయ్యానన్న భావన కలిగేదని వెల్లడించారు. రచయిత కృష్ణ త్రిలోక్ రాసిన ‘నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకాన్ని ఆదివారం నాడిక్కడ రెహమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన తండ్రి చనిపోవడం, కెరీర్లో తొలి అడుగులు, పనిచేసే విధానం సహా పలు అంశాలపై ఆయన మీడియాతో ముచ్చటిం చారు. ‘25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ నేను ప్రతిరోజూ ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించేవాడిని. ఆ వయస్సులో విజయవంతం కాలేకపోయామన్న భావన మనలో చాలామందికి ఉంటుంది. నాన్న ఆర్కే శేఖర్ చనిపోవడంతో నాలో శూన్యత ఏర్పడింది. అప్పుడు నాలో ఎక్కువ సంఘర్షణ చోటుచేసుకుంది. కానీ అవే నన్ను ధైర్యవంతుడిగా మార్చాయి. అందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ప్రతీదానికి తుది గడువు అంటూ ఉన్నప్పుడు ఇక భయపడటం దేనికి?’ అని రెహమాన్ వ్యాఖ్యానించారు. ‘రోజా’కు ముందే మతం మారాను ‘నాన్న మరణం తర్వాత నేను పనిపై దృష్టి పెట్టలేకపోయా. ఆయన పనిచేసే విధానం చూశాక నేను ఎక్కువ సినిమాలను తీసుకోలేదు. 35 చిత్రాలకు పనిచేయాలని ఆఫర్లు వస్తే కేవలం రెండింటినే అంగీకరించా. అప్పుడు ప్రతిఒక్కరూ ‘ఇలా అయితే నువ్వు ఎలా బతుకుతావు? వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు. కానీ అప్పటికి నా వయస్సు కేవలం 25 సంవత్సరాలే. కానీ చెన్నైలోని నా ఇంటివెనుక సొంత రికార్డింగ్ స్టూడియోను నిర్మించుకోవడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. వచ్చిన అన్ని సినిమా ఆఫర్లను నేను అంగీకరించలేదు. ఆఫర్లు అన్నింటిని అంగీకరించడం అంటే అందుబాటులో ఉన్న ప్రతీదాన్ని తినేయడమే. అలా చేస్తే నిస్తేజంగా మారిపోతాం. మనం కొద్దికొద్దిగా తిన్నా దానిని పూర్తిగా ఆస్వాదించాలి. నా జీవితంలో 12 నుంచి 22 ఏళ్ల మధ్య అన్నింటిని పూర్తిచేసేశా. పాతికేళ్లు ఉన్నప్పుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాకు పనిచేశా. ఆ సినిమాకు కొన్నిరోజుల ముందు నా పేరును, మతాన్ని మార్చుకున్నా. ఎందుకో నా గతాన్ని, దిలీప్ కుమార్ అనే నా పేరును విపరీతంగా ద్వేషించేవాడిని. అదెందుకో నాకు ఇప్పటికీ తెలియదు. సినిమాలకు సంగీతం సమకూర్చడానికి మనలోమనం లీనమైపోవ డం చాలాముఖ్యం. అందుకే నేను ఎక్కువగా రాత్రిపూట, తెల్లవారుజామున ప్రశాంత వాతావరణంలో పనిచేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కుటుంబంతో గడపడం ద్వారా నా పనిఒత్తిడి నుంచి బయటపడతాను’’ అని రెహమాన్ పేర్కొన్నారు. రచయిత కృష్ణ త్రిలోక్ రాసిన ఈ పుస్తకాన్ని ల్యాండ్‌మార్క్ అండ్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రచురించింది. -
ఇకపై కొనసాగరు!
బాలీవుడ్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపింది. ఇండియన్ ఐడల్ 10 మ్యూజిక్ షోకు అను మాలిక్ ఇకపై జడ్జ్‌గా కొనసాగరని సంబంధిత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సింగర్స్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిట్లు అను మాలిక్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇండియన్ ఐడల్ షోకు అను మాలిక్ చాలా కాలం నుంచి జడ్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ 10 షోకు విశాల్ దద్లాని, నేçహా కక్కర్తో కలిసి కో–జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇండియన్ ఐడల్ 10 షో జడ్జ్ ప్యానెల్లో అను మాలిక్ కొనసాగరు. ముందుగా ప్లాన్ చేసిన విధంగా షో కొనసాగుతుంది. విశాల్, నేహాలతో పాటు ఇండియన్ మ్యూజిక్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈ షోకు కో–జడ్జ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు’’ అని ఇండియన్ ఐడల్ షో యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారని బాలీవుడ్ టాక్. -
పాటే మంత్రము
సా.. రి.. గ.. మా.. మా.. మా.. మా..మా.. మా.. మాటలు సరిగా రాని..నోరు అసలే తిరగని.. బెంజీకిఅమ్మే.. పాటలు నేర్పించింది. బెంజీ ‘ఆటిజం’ అమ్మాయి. డాక్టర్లు పెదవి విరిచారు. థెరపిస్టులు ‘అబ్బే’ అనేశారు. కానీ, తల్లి వదిలిపెడుతుందా!!కూతురు.. పాటకు రెస్పాండ్ అవుతోందని గ్రహించి..పాటతో మంత్రం వేసింది. నేషనల్ లెవల్ సింగర్‌గా మార్చింది! ఇది బెంజీ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు. తల్లి కవిత స్ట్రగుల్ స్టోరీ కూడా! కూతురికి ఆటిజమ్ అని తెలిసి కవిత, కుమార్ దంపతులు కుంగిపోయారు! అంతలోనే కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ చిన్నారిని ఎలాగైనా తీర్చిదిద్దాలని సంకల్పం పెట్టుకున్నారు. కానీ ఎలా?! కవిత, కుమార్లది ఢిల్లీ. వీరికి 1992లో పాప పుట్టింది. బెంజీ అని పేరు పెట్టుకున్నారు. పాపాయిని చూసి పరవశించి పోయారు. అయితే ఆ సంతోషం ఎంతోకాలం మిగల్లేదు. పాప వయసు నెల రోజులుగా ఉన్నప్పుడు మెదడువాపు వ్యాధి రావడంతో, మందులు వాడారు. అవి వికటించి పాపకు ఆటిజమ్ వచ్చింది. అప్పటికి ఆటిజమ్ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కాని కవిత బాగా చదువుకోవడంతో విషయం తెలుసుకున్నారు. టేప్ రికార్డర్ వైపే చూపు! బెంజీలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించడం ప్రారంభించారు కవిత. పాప కళ్లు వేటిని వెతుకుతున్నాయో, పాప చూపు వేటి దగ్గర ఆగుతోందో నిశితంగా పరిశీలించారు. పాప నిరంతరం టేప్ రికార్డర్ వైపు చూడటం గమనించారు. పాప సంగీతం ఇష్టపడుతుందేమోనని భావించారు కవిత. పాపకు ఆరు సంవత్సరాలు నిండాయి. ఆ ఆరు సంవత్సరాలుగా »ñ ంజీ.. టేప్ రికార్డరును చూస్తూనే ఉంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి టేప్ రికార్డరును మారుస్తుంటే కూడా దాని వైపే తదేకంగా చూసేది. అసలు కంటిని నిలపలేని స్థితిలో ఉన్న బెంజీ టేప్ రికార్డరుని మాత్రం తదేక దీక్షతో చూడటం కవితకు ఆశ్చర్యం కలిగించింది. దివ్యౌషధంగా మ్యూజిక్ ‘‘ఎక్కడ ఆడుతున్నా అక్కడకు వచ్చేసి పాటలు వినేది, స్తబ్దుగా జడ పదార్థంలా అచేతనంగా ఉండే మా చిన్నారి.. పాటలకు స్పందించడం నాకు ఆనందం కలిగించింది. పాపకు టేప్ రికార్డరుతో వైద్యం చేయాలని నిశ్చయించుకున్నాను. పాప ఎక్కడ ఉంటే అక్కడ టేప్ రికార్డరు ప్లే చేయడం ప్రారంభించాను’’ అన్నారు కవిత. అలా పాపకు అన్నం తినిపించడం, స్నానం చేయించడం, నిద్రపుచ్చడం.. అన్ని పనులకూ కవిత టేప్ రికార్డరు దివ్య సంజీవనిలా ఉపయోగించారు. పాపలో ఎక్కడ నిద్రాణంగా ఉన్న చేతనం, టేప్ రికార్డరు కనిపించగానే మేల్కొనేది. ‘‘ఒక తల్లిగా నేను ఈ పరిణామానికి ఎంతో సంబరపడ్డాను. సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందని విన్నాను. నేను సంగీతం నేర్చుకున్నాను. కనుక పాపలో చైతన్యం కలిగించడం కోసం నేనే ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాను’’ అని చెప్పారు కవిత. బెంజీకి బాల్యం నుంచే ఆమె మ్యూజిక్ థెరపీ ప్రారంభించారు . హిందీ పాటలు వినిపించారు. ఆ.. సరిగమలే బెంజీ కూతురు జీవితాన్ని మార్చేశాయి. ఏడేళ్లకే రాగాల పరిచయం ‘‘రాగయుక్తంగా పాట పాడుతుంటే బెంజీ నిద్ర లేచి, ఆ రోజంతా అల్లరి చేయకుండా, సంతోషంగా ఉండటం గమనించాను. సంగీతం లేకుండా నిద్ర లేచిన రోజు మాత్రం చిరాకు పడుతుండేది. ఈ విషయం ఎవరికి చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు’’ అంటారు కవిత. బెంజీకి ఏడు సంవత్సరాల వయసులో ఎం. ఎం. రఫీ అనే గురువు దొరికారు. ఆయన బెంజీకి కొన్ని రాగాలను పరిచయం చేశారు. ఆనాడు నేర్చుకున్న ఆ పరిజ్ఞానంతో నేటికీ బెంజీకి ఏ పాట ఇచ్చినా వెంటనే కీ బోర్డు మీద వాయించుతోంది. ‘‘ఈ విషయంలో రఫీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను’’ అంటారు కవిత. ఆకాశవాణిలో పర్మినెంట్‌గా..! పదకొండో ఏట, హృతిక్ రోషన్ నటించిన ‘కహోనా ప్యార్ హై’ చిత్రం చూసిన బెంజీ, సినీ సంగీతం మీద శ్రద్ధ చూపించింది. ‘‘ఎప్పుడు సినిమాకు వెళ్లినా పావు గంటకే ఇంటికి వెళ్లిపోదామని గోల చేసే బెంజీ, ఆ రోజు నిశ్శబ్దంగా సినిమా అంతా చూసింది. మాకు ఆశ్చర్యం వేసింది. ఆయనను కలిస్తే ఎలా ఉంటుందా అనిపించి, హృతిక్ రోషన్‌కి ఉత్తరం రాశాను. అమ్మాయి చేసిన సీడీ కూడా పంపాను. ఆయన మమ్మల్ని కలవడానికి అంగీకరించారు. ఆ రోజు మా అమ్మాయి ఎంత ఆనందించిందో చెప్పలేను’’ అన్నారు కవిత మనస్ఫూర్తిగా నవ్వుతూ. ‘కోషిష్’ పేరుతో బెంజీ రూపొందించిన సీడీని హృతిక్ రోషన్ ఆవిష్కరించారు. ఆ సీడీకి బెంజీకి జాతీయ అవార్డు వచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్ట్స్లోకి ఆమె పేరు నమోదైంది. బెస్ట్ క్రియేటివ్ అడల్డ్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకుంది బెంజీ. ఆమె పాడిన పాటను అంతర్జాతీయ స్థాయిలో ప్లే చేశారు. ఆ తరవాత ఆకాశవాణి వారు పర్మినెంట్ ఆర్టిస్టుగా బెంజీ ఎంపికచేశారు. విచిత్రం ఏమిటంటే, సంగీతం పాడి అందుకున్న అవార్డుల గురించి బెంజీకి ఏమీ తెలియదు. అందమైన పేపర్లో చుట్టి ఇచ్చిన బొకే గురించి కూడా బెంజీకి తెలియదు. ఇప్పుడు తనే చెబుతోంది అందరు గాయకులలాగానే వేదిక మీద ఏ మాత్రం బెదురు లేకుండా పాడుతోంది బెంజీ. ఇంకా విశేషం.. పాటలు పాడుతూ అవార్డులు సంపాదించిన బెంజీ ఇప్పుడు టీచర్ కూడా అయ్యారు. ‘‘ మా అమ్మాయిలాంటి వారి కోసం నేను ఇంటి దగ్గరే మ్యూజిక్ క్లాసెస్ ప్రారంభించాను. అందులో మా బెంజీ పాఠాలు చెబుతోంది’’ అని చెప్పారు కవిత. మాట్లాడటం కూడా సరిగా రాని బెంజీ.. సంగీతం మాత్రం అద్భుతంగా పాడుతుంది. సంగీత రాగాలలోనే తన మనో భావాలను పలికిస్తుంది. బెంజీ పాటలు విన్న ప్రముఖ హిందీ గాయిన శుభా ముద్గల్ ‘బెంజీ గొంతులో మాధుర్యం ఉంది, ఒక శక్తి ఉంది’ అన్నారు.బెంజీకి ఇప్పుడు 26 సంవత్సరాలు. సంగీతమే భాష, సంగీతమే ఆత్మ, సంగీతమే జీవితం, సంగీతమే ఆమెకు బలం. ప్రస్తుతం పండిట్ రామజీ మిశ్రా దగ్గర సంగీతం నేర్చుకుంటున్న బెంజీకి లతా మంగేష్కర్, ఆశా భోంశ్లే అంటే చాలా ఇష్టమని చెబుతారు కవిత. ఆమె ‘ధూమ్’ అనే ఫౌండేషన్ కూడా ప్రార ంభించారు. దాని ద్వారా ఆటిజమ్‌తో ఉన్న పిల్లలకు సంగీతంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ‘‘ఆటిజమ్ ఉన్న పిల్లలను కళాకారులుగా తీర్చిదిద్ది, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా చేయడమే నా జీవిత లక్ష్యం. ఆటిజమ్ పిల్లలున్నవారందరికీ నేను ఇచ్చే సందేశం ఒకటే. పిల్లలకు సంగీతం వినిపించండి. సంగీతంతో చికిత్స జరుగుతుందని గమనించండి’’ అంటున్నారు కవిత కూతురుకి తల్లి పాట మంత్రంగా పనిచేసింది. ఆ పాటే తన బిడ్డ ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. కూతురి సంగీతమే కవిత కర్తవ్యం కవితకు ఈ విజయం అంత సులువుగా దొరకలేదు. 2010లో కవిత భర్త కుమార్ గతించడంతో రెండు సంవత్సరాల పాటు కవిత సంగీతాన్ని విడిచిపెట్టారు. అంతలోనే తేరుకున్నారు. ‘‘కర్తవ్యం కళ్ల ముందు కనిపించింది. కుమార్తె బాధ్యతను చేపట్టాను. బెంజీ జీవితంలోకి మళ్లీ సంగీతం తీసుకువచ్చాను. భారతీయ సంగీతానికి చికిత్స చేసే శక్తి ఉందని తెలుసుకున్నాను. కీచుమనేలా ఉండే మా బెంజీ గొంతు కఠినమైన రాగాలు పలకడంతో గంభీరంగా ఖంగుమంటోంది’’ అంటారు కవిత. – వైజయంతి పురాణపండ -
ఎస్–13కి యువ సంగీత దర్శకుడు
తమిళసినిమా: సినిమాకు కథ తరువాత సంగీతం అంత బలంగా మారిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. అందుకే సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇకపోతే వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తీకేయన్ సీమరాజా చిత్రాన్ని పూర్తి చేసి తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇది ఆయన 13వ చిత్రం. అందుకే ఎస్కే– 13గా పేరుతో ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. రాజేశ్ ఎం దర్శకత్వం విహిస్తున్న చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటిస్తున్నారు. వేలైక్కారన్ వంటి విజయవంతమై చిత్రం తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది. కాగా ఇప్పుటికే చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి నటీనటులతో పాటు సాంకేతిక వర్గం ఎంపిక పూర్తైంది. సంగీత దర్శకుడిగా హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ తరం యువ నాడి తెలిసిన సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలన్న విషయంలో స్పష్టంగా ఉన్నామన్నారు. అందుకే హిప్ హాప్ తమిళాను ఎంపిక చేశామని చెప్పారు. హీరో, దర్శకత్వం, సంగీతం అంటూ బిజీగా ఉన్న ఆయన తమ చిత్రానికి సమయాన్ని కేటాయిస్తారా? అన్న సంశయంతోనే ఆయన్ని సంప్రదించామన్నారు. అయితే కథ విన్న వెంటనే హిప్ హాప్ తమిళా సంగీతాన్ని అంగీకరించారని తెలిపారు. శివకార్తీకేయన్, నయనతార జంటను కుటుంబ సమేతంగా చిత్రం చూసే ప్రేక్షకులు అధికం అన్నారు. వారికి హిప్హాప్ తమిళా జోడైతే చిత్ర విజయం తథ్యమన్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచే దర్శకుడు రాజేశ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో జనరంజక చిత్రం అవుతుందని కచ్చితంగా చెప్పగలనని నిర్మాత పేర్కొన్నారు. -
సైరాకి సై
నరసింహారెడ్డి చేసే సాహసాలకు తెరపై సంగీతం అందించడానికి సంగీత దర్శకుడు దొరికారట. ఆల్రెడీ నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయట. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. షెడ్యూల్ బిజీ కారణంగా ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణి, యస్.యస్. తమన్ అని పలు పేర్లు వినిపించాయి. కానీ ఎవరి పేరూ కన్ఫర్మ్ అయినట్లు న్యూస్ రాలేదు. లేటెస్ట్గా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ‘సైరా’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సై అన్నట్లు సమాచారం. ‘సీక్రెట్ సూపర్‌స్టార్, క్వీన్, డియర్ జిందగీ, ప్యాడ్‌మ్యాన్’ వంటి పాపులర్ సినిమాలకు సంగీతం అందించారాయన. త్వరలో స్టార్ట్ కానున్న ప్రభాస్– రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా అమిత్‌నే సంగీతం సమకూర్చనున్నారు. ‘సైరా’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ కూడా స్టార్ట్ చేశారట అమిత్. ఈ సినిమాలో మూడు పాటలకు ట్యూన్స్ ఇచ్చే పనిలో పడ్డారాయన. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కానున్న చిత్రం టీజర్‌కు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ పనిలో ప్రస్తుతం బిజీ ఉన్నారట. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు. -
సైరాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్..?
ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ కాలేదు. ముందుగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా సైరా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు రెహమాన్. అప్పటి నుంచి సంగీత దర్శకుడి కోసం వేట కొనసాగిస్తున్న సైరా టీం ఫైనల్ గా ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామాలకు సంగీతమందించిన అమిత్, సైరా కోసం ఇప్పటికే కొన్ని ట్యూన్స్‌ను సిద్ధం చేశారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
వీణాపాణీతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
సంగీత్ సాగర్
-
వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం!
సాక్షి, హైదరాబాద్ : వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్, జూనియర్ ఆర్టిస్ట్ అనురాగ్ వినిల్ (నాని) ఆత్మహత్య కలకలం రేపుతోంది. వారం రోజుల కిందట అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం, వివరాలపై భిన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, హైదరాబాద్ నాగోల్ మమత నగర్లో సూసైడ్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కొందరు అనురాగ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, కొందరి ప్రోద్బలంతో అతడు బలవన్మరణం చెందాడని తెలుస్తోంది. పలు షార్ట్ఫిల్మ్స్లకు అనురాగ్ పని చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరగడం అతడి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని కుటుంబసభ్యులు వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిని..
సినీ సంగీతంలో కొత్త కెరటం యాజమాన్య తెనాలి: సినీ సంగీత సాగరంలో కొత్త కెరటం...యాజమాన్య. మ్యూజిక్ మాస్త్రో ఇళయరాజాకు ఏకలవ్య శిష్యుడు. ఆయన పాటతో అల్లుకున్న అనుబంధం సంగీతమే ప్రపంచమైంది. సినీ నేపధ్యం లేకుండానే సినిమా రంగంలోకి కాలుమోపాడు. కీబోర్డు ప్లేయరుగా వందలాది సినిమాల్లో అనుభవాన్ని రంగరించి, పదికి పైగా సినిమాలకు వినసొంపైన బాణీలను స్వరపరచి యువతరాన్ని ముగ్ధులను చేశారు. మరో అయిదు సినిమాలు కొద్దివారాల వ్యవధిలో విడుదల కానున్నాయి. తాజాగా పెదరావూరు ఫిలిమ్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘పండుగాడి ఫోటోస్టూడియో’ సినిమా సంగీతం కోసమని తొలిసారిగా నగరాన్ని వదిలి పెదరావూరు వచ్చారాయన. ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... పాట సంగీతం కేసి తీసుకెళ్లింది.. చిత్తూరు జిల్లా పలమనేరు నా స్వగ్రామం. తెలుగు కుటుంబమే. నా పూర్తి పేరు యాజమాన్య వినోద్. ‘పండుగాడి ఫొటోస్టూడియో’ నుంచి ఇంటి పేరు యాజమాన్యగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. మా ఇంట్లో ఎలాంటి సినీ నేపధ్యం లేదు. చదువుకొనే వయసులోనే సినిమా పాటలంటే ప్రాణం. ఇళయరాజా పాటలంటే చెప్పలేనంత ఇష్టం. ఆ స్ఫూర్తితో సంగీతంపై ఆసక్తి పెరిగింది. గిటార్ పట్టేలా చేసింది. కీబోర్డు ప్లేయరయ్యాను. ఎన్నో కచేరీలు చేశాను. వందేమాతరం శ్రీనివాస్ బృందంలో చేరాను. ‘జయం మనదేరా’ సినిమా రికార్డింగ్‌లో గిటారిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. కొద్దిరోజుల్లోనే కీబోర్డు ప్లేయరుగా అవకాశం లభించింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగా పనిచేశాను. చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్..వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేయటం నా అదృష్టం. 2014 నుంచి సంగీత దర్శకత్వం 2014 నుంచి సొంతంగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నా. అంతా కొత్తవారితో తీసిన ‘నువ్వే నా బంగారం’ తొలి సినిమా. ‘పోరా పోవే’, ‘నాటుకోడి’, ‘అనగనగా ఒక చిత్రమ్’, ‘టైటానిక్’ (అంతర్వేది టు అమలాపురం), ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాక్షసి’, ‘దళపతి’, ‘అనగనగా ఒక ఊరిలో’, ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ సినిమాలకు సంగీతం సమకూర్చా. మరో అయిదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పోసాని సినిమా ‘దేశముదుర్స్’, ‘ప్రేమ ఎంత పనిచేసే నారాయణ’, ‘తమిళ తంబి’, ‘సమీరం’, ‘బొమ్మ అదుర్స్’ సినిమాలు మే/జూన్‌లో థియేటర్లకు రానున్నాయి. టైటానిక్ సినిమాలో ‘పడిపోతున్నా నీ మాయలో’, దళపతిలో ‘నీకూ నాకూ మధ్య ఏదో ఉంది’, అంటూ శ్రేయోఘోషల్ పాడిన పాటలు, ‘రాజూ..దిల్‌రాజూ’ పాటల యువతరాన్ని ఆకర్షించాయి. తొలిసారి గ్రామంలో... ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్‌లో ఉన్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ను పాటల రికార్డింగు నుంచి సినిమా షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇక్కడే తీయాలనేది దర్శకుడు దిలీప్‌రాజా నిర్ణయం. నగరానికి దూరంగా పెదరావూరు గ్రామంలో పాటల కంపోజింగ్ చేస్తున్నాం. ఇదో కొత్త అనుభవం నాకు. జంధ్యాల మార్కు కామెడీతో కూడిన స్క్రిప్టుకు ఆ తరహా పాటల కంపోజింగ్ చేస్తున్నాం. బ్లాక్‌బస్టర్ కోసం.. సినిమా సంగీతంలో మునిగితేలుతూనే బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశా. పెద్ద సినిమాలకు కీ బోర్డు ప్లేయరుగానూ సహకారం అందిస్తున్నా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ జనాలకు వెళుతున్నాయి. ఆదరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. ఆరోజుకోసం చూస్తున్నా. మెలోడీనే కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలి. అంతర్జాతీయస్థాయిలో ఎదగాలి, అనేది నా లక్ష్యం. -
మణిశర్మ ఇంట్లో విషాదం
టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ (92) ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. వైయన్ శర్మగా సంగీత ప్రియులకు సుపరిచితుడైన ఆయన వయోలిన్ విద్వాంసులు. ఆయన ప్రోత్సాహంతోనే మణిశర్మ సంగీత దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 175 సినిమాలకు స్వరాలందించారు. వైయన్ శర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ కూడా ఇటీవల ఛలో సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి విజయం అందుకున్నారు. -
సంగీత దర్శకురాలిగా గానకోకిల
సాక్షి, చెన్నై : ప్రతిభకు వయసుతో పని ఉండదు. అలా సంగీతరంగంలో గాయనిగా ఎనలేని కీర్తికిరీటాలను అందుకున్నారు గానకోకిల పి.సుశీల. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది, సంస్కృతం, తుళు ఇలా 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డును సాధించారు. పద్మభూషణ్ అవార్డు వరించింది. 80వ వసంతంలో అడుగిడిన ఆమె సంగీతదర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తుతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. గాయనిగా 60 ఏళ్ల అనుభవం కారణంగానే ఆమెకు ఈ అవకాశం వచ్చినట్లు సమాచారం. నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా పోరాడి ఆత్యహత్య చేసుకున్న వైద్య విద్యార్ధిని అనిత జీవిత వృత్తాంతం సినిమాగా తెరకెక్కుతోంది. డాక్టరు ఎస్.అనిత ఎంబీబీఎస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనిత పాత్రను బిగ్‌బాస్ గేమ్ షో ఫేం జూలీ నటిస్తున్నారు. ఎస్.అజయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిత తండ్రి పాత్రలో రాజ్దళపతి నటిస్తున్నారు. చిత్ర ఫస్ట్లక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయనీమణి పీ సుశీలను సంగీతం అందించాల్సిందిగా కోరగా ముందు తనకు ఆసక్తి లేదని చెప్పారట. తరువాత చిత్రవర్గాల ఒత్తిడి, కథ ఆకట్టుకోవడంతో సంగీతాన్ని అందించడానికి సమ్మతించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే నిజం అయితే డాక్టరు ఎస్.అనిత ఎంబీబీఎస్ చిత్రానికి పీ సుశీల సంగీతం బలంగా నిలుస్తుంది. -
సంగీత దర్శకుడికి గుండెపోటు
బెంగళూరు : ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖకు స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఓ కన్నడ చానల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరణ చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన హంసలేఖను సాగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంయమనంతో ఏదైనా సాధ్యమే..
సాక్షి,రామంతాపూర్: సంయమనం, ఓర్పుతో సాదించలేనిది ఏది లేదని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అన్నారు. రామంతాపూర్ అరోరా పీజీ కళాశాలలో మేనేజ్మెంట్ అన్వేషణ –2018 ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రంగంలో మేనేజ్మెంట్ అనేది ఉంటుందని, మేనేజ్మెంట్ విద్యార్థులు సంయమనంతో వ్యవహరించి విషయాన్ని అర్థం చేసుకొని సమస్యను సులువుగా పరిష్కరించాలన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థుల నడవడిక, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఉన్నత స్థితికి తీసుకెళతాయన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.మాధవి, సినీ గాయకుడు కృష్ణ, ఆర్జే సూరిపాల్గొన్నారు. -
మోహన్‌బాబు వ్యాఖ్యలపై స్పందించిన తమన్
సాక్షి, హైదరాబాద్ : విలక్షణ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పందించారు. మోహన్‌బాబు లాంటి సీనియర్ నటులు తనను విమర్శించినా అవి తనకు ఆశీర్వాదంలాగే తీసుకుంటానని తమన్ వ్యాఖ్యానించారు. గాయత్రి సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా "తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను కానీ పని చేయడం చాలా కష్టం అతనితో. టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు" అంటూ మోహన్‌బాబు, తమన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన జరిగిన చాలా రోజులు తర్వాత తమన్ స్పందించారు. పాటలు ఇవ్వడం ఎందుకు ఆలస్యమైందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గాయత్రికి మంచి మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నారని, అందుకే కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా అది తనకి ఆశీర్వాదం లాంటిదేనని వ్యాఖ్యానించారు. -
సైరాపై మరో గుసగుస
సాక్షి, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి గురించి ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేశారనేది దాని సారాంశం. ముందుగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అధికారికంగా ప్రకటించారు. కానీ, డేట్లు సర్దుబాటు కాకపోవటంతో రెహమాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత థమన్ పేరు తెరపైకి వచ్చింది. అటుపై కీరవాణి పేరు వినిపించింది. ఇక ఇప్పుడు క్లాసిక్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా పేరు చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం చిరు ఇళయరాజాను కలిశాడన్న ఓ వార్తే. అయితే సైరా చరిత్రకు సంబంధించిన కథ కావటంతో పాటల కన్నా ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పైనే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చిరు భావిస్తున్నాడంట. ఈ నేపథ్యంలో కీరవాణి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సైరా.. రెండో షెడ్యూల్‌కు రెడీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో స్పష్టత లేకపోవటం విశేషం. ఏది ఏమైనా ఈ ఊహాగానాలకు త్వరలో నిర్మాత రామ్ చరణ్ పుల్ స్టాప్ పెట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో చోరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకి చెందిన పాటల రికార్డింగ్ స్టూడియోలో చోరీ జరిగింది. ఫిలింనగర్ రోడ్ నంబర్ 10లోని ప్లాట్ నంబర్ సి.45లో ఉన్న స్టూడియోలో దాచిన రూ.4.5 లక్షలు అపహరణకు గురయ్యాయి. జనవరి 27న చెన్నై వెళ్లిన ఆయన ఈ నెల 2న తిరిగి వచ్చారు. అవసరం నిమిత్తం శనివారం బీరువా తెరిచి చూడగా అందులోని నగదు కనిపించలేదు. దీంతో మణిశర్మ వ్యక్తిగత సహాయకుడు వెంకటేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మేనేజర్ జి.సుబ్బానాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. -
'అను' రాగాలు
-
‘నేల టికెట్’కు ఫిదా టచ్
‘రాజా ది గ్రేట్’ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు పనుల్లో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో వెంటనే ‘సొగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 5న సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ఓ కొత్త సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్‌ను ‘నేల టికెట్’ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.