రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మాట్లాడుతూ– ‘‘నా పదో తరగతి నుంచే మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాను. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. కొన్ని వీడియో గేమ్స్‌కి మ్యూజిక్ ఇచ్చాను. సంగీత దర్శకుడిగా ‘ఈగల్’ నాకు తొలి చిత్రం. కాలేజీలో నేను, హీరో శ్రీవిష్ణు క్లాస్‌మేట్స్. అలా కార్తీక్ నాకు పరిచయం అయ్యాడు.
ఇప్పుడు తనతో నా జర్నీ మొదలైంది. రవితేజగారితో సినిమా ఫిక్స్ అయ్యాక ఆయన ఓకే చెబితే, మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు చాన్స్ ఇస్తానన్నాడు కార్తీక్. రవితేజగారు నా మ్యూజిక్ ట్రాక్స్ విని, నచ్చి ఓకే చేశారు. రవితేజగారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా లక్. ఈ సినిమాలో మ్యూజిక్, ఆర్‌ఆర్‌లకు మంచి స్కోప్ ఉంది. మ్యూజిక్ కూడా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ΄ాటలు ఉన్నాయి. ఇక కార్తీక్ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఓ సినిమాకు, దర్శకుడు నక్కిన త్రినాథరావుగారిప్రోడక్షన్‌లోని ఓ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాను. మరో రెండు ్ర΄ాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment