Eagle
-
త్వరలో తెలంగాణ పోలీస్ లో చేరనున్న ఈగిల్ స్క్వాడ్
-
TG: వీవీఐపీలకు గద్దలతో భద్రత..త్వరలో రంగంలోకి ‘గరుడ దళం’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వీవీఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు పటిష్ట భద్రతను కల్పి స్తాయి. మఫ్టీలో ఉండే బలగాలు అదనం. అయినా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాల నేపథ్యంలో.. గగనతలం నుంచీ భద్రత కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం తెలంగాణ పోలీసులు త్వరలో ‘గరుడ దళం (ఈగిల్ స్క్వాడ్)’ను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే 4 గద్దలకు మొయినా బాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద డ్రోన్లను నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై తర్ఫీదు ఇచ్చారు. ఇటీవలే ఈ ‘గరుడ దళం’ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద డెమోను సైతం ఇచ్చింది. సుశిక్షితమైన ఈ గరుడ దళాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు పోలీస్ ఉన్నతాధి కారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అంతర్గత భద్రత విభాగం (ఐఎస్‌డబ్ల్యూ)లో భాగంగా ఉంటూ తెలంగాణలో వీవీఐపీ రక్షణను పర్యవేక్షించనుంది.గగనతలం నుంచి నిఘా నేత్రాలుగా..దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖలో గరుడ దళాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణకు మూడేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నాలుగు గద్దలకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. చిన్న పక్షి పిల్లలను తెచ్చి,వాటిని పోషిస్తూ, తర్ఫీదు ఇస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారితోపాటు కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్‌తో గద్దలకు డ్రోన్లను నేలకూల్చడం, అనుమానాస్పద వ్యక్తులను గమ నించడం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. అదే సమయంలో వీటికి అమర్చిన ప్రత్యేక నిఘా కెమెరాల సాయంతో భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతారు.అనుమానం రాకుండా...సాధారణంగా గగనతలం నుంచి డ్రోన్లతో నిఘా పెట్టవచ్చు. కానీ డ్రోన్ల నుంచి వెలువడే శబ్దం, వాటి కదలికలను కింద ఉన్నవారు సులువుగా గుర్తించవచ్చు. దీనితో నేరస్తులు అప్రమత్తమై తప్పించుకోవడం, లేదా తాము చేసేది గమనించ లేకుండా చేయడం వంటివాటికి పాల్పడే చాన్స్ ఉంటుంది. అదే గద్దల ద్వారా నిఘా పెడితే పసిగట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే వీఐ పీల భద్రతతోపాటు మావోయిస్టు ఆపరేషన్లకు, వారి కదలిక లను పసిగట్టేందుకు కూడా ఈ గరుడ స్క్వాడ్‌ను వాడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. అంతేగాక డ్రోన్లను ఎక్కువసేపు వినియోగించుకునే అవకాశముండదు. వాటి వేగమూతక్కువ. అదే ‘గరుడ స్క్వాడ్’తో ఈ సమస్యలు ఉండవని అంటున్నారు.ఇదీ చదవండి: నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో -
అహో!
వీడియో వైరల్ కావడానికి అసాధారణ అద్భుతాలతో పనిలేదు. ‘ఆహా’ అనిపిస్తే చాలు. ఇది అలాంటి వైరల్ వీడియోనే. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ మార్క్ స్మిత్ తీసిన వీడియో నెటిజనులను మంత్రముగ్ధులను చేసింది. చేపను క్యాచ్ చేస్తున్న ఒక డేగకు సంబంధించిన క్లోజ్–అప్ షాట్ ఇది.కెమెరామన్‌గా మార్క్ స్మిత్ అద్భుతమైన పనితనం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ స్టన్నింగ్ వీడియో 124 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
Sankranthi 2025: కర్చీఫ్ మడతపెట్టి...!
సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ మడతపెట్టి, పండగ బరిలో సీట్ రిజర్వ్ చేసుకున్నారు కొందరు స్టార్స్. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. విశ్వంభర వస్తున్నాడు సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట. భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ‘దిల్’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మళ్లీ బంగార్రాజు వస్తాడా? ‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్) సినిమాలతో హిట్స్ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. లక్మణ్ భేరి రెడీ రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని టాక్. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో వచ్చి రవితేజ హిట్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా... ప్రభాస్ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో డబ్బింగ్ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్ హీరోగా నటించనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. -
టీ20 క్రికెట్లో సంచలనం.. కేవలం 16 పరుగలకే ఆలౌట్
జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఈగల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ అగ్రస్ధానంలో ఉంది. బిగ్‌బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ సాధిచింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మస్టర్డ్(46), రాబిన్సన్(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది. డర్హామ్ బౌలర్లలో కాఫ్లీన్, పార్కిన్సన్, లూక్ రాబిన్సన్ తలా రెండు వికెట్లతో డర్హామ్ పతనాన్ని శాసించగా.. బాస్ డీ లీడ్, సౌటర్ తలా వికెట్ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. ఈగల్స్ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
రవిశంకర్ రాజు టూ మాస్ మహారాజా: ఇరగదీశాడు భయ్యా!
#EagleRavitejarapsongintelugu టాలీవుడ్ హీరో రవితేజ్ గా వస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో తెలుగు కుర్రోడు దుమ్ము రేపాడు. తెలుగులో ర్యాప్ మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవిశంకర్ రాజు నుండి మాస్ మహారాజా రవితేజ వరకు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అంతేకాదు అద్భుతమైన RAP పాటకు రవితేజ కూడా ఫిదా అయిపోయాడు. ఉత్సాహంగా ఊగిపోయాడు. అదేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. కాగా మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ్ నటిస్తున్న మూవీ ఈగల్. ధమాకా తర్వాత మరో మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలొ అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. -
నేను కూడా సిద్ధం
‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. విశ్వ ప్రసాద్, వివేక్గార్లతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు.. అన్ని విషయాల్లోనూ చాలా స్పష్టంగా ఉంటారు.. అందుకే వారితో పనిచేయడం నాకు ఇష్టం. నాతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని విశ్వ ప్రసాద్‌గారు అంటున్నారు.. ఈ బ్యానర్లో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను కూడా సిద్ధం’’ అని హీరో రవితేజ అన్నారు. ఆయన హీరోగా కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ–‘‘ఈగల్’ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూసేందుకు నేను కూడా వేచి చూస్తున్నా. ఈ సినిమాకి తన సంగీతంతో ఇరగదీశాడు డేవ్ జాంద్. బాలనటుడు ధ్రువన్ పాత్ర బాగుంటుంది.. పిల్లలందరూ తన పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. ‘ఈగల్’ కథని నడిపించేది అనుపమ పాత్రే. కావ్యది లవ్లీ క్యారెక్టర్. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని ఎంతో క్లారిటీతో తీశాడు. ఈ సినిమా విజయం సాధించి, తనకు చాలా మంచి పేరు రావాలి. నాకు నేను విపరీతంగా నచ్చిన పాత్ర ‘ఈగల్’.. ఈ పాత్ర కోసం చాలా మేకోవర్ అయ్యాను. ఈ చిత్రం రిలీజ్ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు. కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ–‘‘ఈగల్’ కి దాదాపు 200 మంది సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఇంతమందితో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన రవితేజ సర్కి థ్యాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థియేటర్ అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘మా సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేస్తున్న రవితేజగారికి థ్యాంక్స్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. ‘ఈగల్’ని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మళ్లీ మళ్లీ రవితేజగారితో పనిచేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘రవితేజగారు వెర్సటైల్ యాక్టర్. ‘ఈగల్’ హాలీవుడ్ మూవీలా అద్భుతంగా ఉంటుంది. కానీ, తెలుగు నేటివిటీ ఎక్కడా మిస్ అవదు’’ అన్నారు చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. -
ఆ మైలురాయిని చేరుకుంటాం
‘‘మా బ్యానర్లో వంద సినిమాలను త్వరితగతిన పూర్తి చేయాలనే మా మిషన్ ఆన్‌లోనే ఉంది. మా నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాది కనీసం 15 సినిమాలు విడుదల కావొచ్చు. రవితేజగారి ‘మిస్టర్ బచ్చన్’, శర్వానంద్, శ్రీ విష్ణు సినిమాలు ఈ ఏడాదే విడుదలవుతాయి. నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ గురించి త్వరలోనే చెబుతాం. అలాగే ఈ ఏడాది మా సంస్థలో 50వ చిత్రం మైలురాయిని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈగల్’ను 2023 డిసెంబరు చివరి వారంలో విడుదల చేద్దామనే ఆలోచన చేశాం. అయితే ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’ రిలీజ్ కన్ఫార్మ్ కావడంతో ‘ఈగల్’ను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నాం. కానీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్ట్, పరిశ్రమ మేలుని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 9కి వాయిదా వేశాం. ఈ టైమ్‌కి ‘యాత్ర 2’ కూడా వస్తోంది. కానీ ఆ సినిమా డిఫరెంట్. ఏ సినిమా రీచ్ ఆ సినిమాకు ఉంటుంది. ‘ఈగల్’ క్లాసిక్ అండ్ స్టయిలిష్ మాస్ ఎంటర్టైనర్. రవితేజగారు కొత్తగా కనిపిస్తారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి’’ అన్నారు. -
‘ఈగల్’లో మ్యూజిక్ కూడా కథ చెబుతుంది
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మాట్లాడుతూ– ‘‘నా పదో తరగతి నుంచే మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాను. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. కొన్ని వీడియో గేమ్స్‌కి మ్యూజిక్ ఇచ్చాను. సంగీత దర్శకుడిగా ‘ఈగల్’ నాకు తొలి చిత్రం. కాలేజీలో నేను, హీరో శ్రీవిష్ణు క్లాస్మేట్స్. అలా కార్తీక్ నాకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తనతో నా జర్నీ మొదలైంది. రవితేజగారితో సినిమా ఫిక్స్ అయ్యాక ఆయన ఓకే చెబితే, మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు చాన్స్ ఇస్తానన్నాడు కార్తీక్. రవితేజగారు నా మ్యూజిక్ ట్రాక్స్ విని, నచ్చి ఓకే చేశారు. రవితేజగారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా లక్. ఈ సినిమాలో మ్యూజిక్, ఆర్ఆర్లకు మంచి స్కోప్ ఉంది. మ్యూజిక్ కూడా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ΄ాటలు ఉన్నాయి. ఇక కార్తీక్ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఓ సినిమాకు, దర్శకుడు నక్కిన త్రినాథరావుగారిప్రోడక్షన్లోని ఓ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాను. మరో రెండు ్ర΄ాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
ఈగల్...ఆన్ హిజ్ వే!
రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్యా థాపర్ మరో కథానాయిక. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9న విడుదల కానుంది. శుక్రవారం (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఈగల్’ సినిమాలోని ‘ఈగల్స్ ఆన్ హిజ్ వే.. ఇట్స్ టైమ్ టు డై...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు దేవ్ జాంద్ నేతృత్వంలో ఈ పాటకు ఇంగ్లిష్ లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూయే ఆలపించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ విడుదలైంది. -
Eagle Movie HD Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తోన్న సీనియర్స్
-
థ్రిల్లింగ్ ఈగల్
రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం కానుకగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఈగల్’. రవితేజని పవర్ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు కార్తీక్. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘2024 ఉషోదయం మీకు ఆశీర్వాదాలు, విజయాలతో పాటు మరపురాని జ్ఞాపకాలను ఇస్తుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ రవితేజ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: దేవ్ జాంద్. -
ఆ రోజు గోల గోల చేద్దాం
‘‘మీ అందరి (అభిమానులు) ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఈగల్’ వైవిధ్యమైన మాసీ ఫిలిం. వినోదం అద్భుతంగా ఉంటుంది. నాకు విపరీతంగా నచ్చింది.. మీ అందరికీ తెగ నచ్చుతుంది. జనవరి 13న అందరూ థియేటర్స్‌కి వచ్చేయండి.. గోల గోల చేద్దాం’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవ్ జాంద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లంతే..’ అంటూ సాగే రెండో పాటని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, కపిల్ కపిలన్, లిన్ పాడారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ – ‘‘గల్లంతే..’ పాట నాకు చాలా ప్రత్యేకం. రవితేజగారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాకి సంగీతం ఇవ్వడంతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు దేవ్ జాంద్. ఈ వేడుకలో కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూఛిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు. కోటికి రవితేజ వాయిస్ తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాలో కోటి పాత్రలో నటించిన వానరానికి హీరో రవితేజ డబ్బింగ్ చె΄్పారు. ‘‘రవితేజగారి వాయిస్‌తో కోటి పాత్ర మరింత హ్యూమరస్, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని మేకర్స్ అన్నారు. -
ఈగల్లో నన్ను కొత్తగా చూస్తారు
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. అలాగే రవితేజ, శ్రీలీల జంటగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఈగల్ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిన్నో మొన్నో రిలీజైనట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాతో హీరోయిన్గా శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్కు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అది నిజమైంది. ‘ధమాకా’ యూనిట్ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఇక ‘ఈగల్’ విషయానికొస్తే... ఈ చిత్రంలో కొత్త రవితేజను చూస్తారు. కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉందని నా నమ్మకం. నిర్మాత విశ్వగారితో నా జర్నీ కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న మంచి చిత్రం ‘ఈగల్’. థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని. ‘‘గత ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఎండ్ చేశాం. వచ్చే ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఆరంభిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు మాట్లాడారు. -
‘ధమాకా’ 1 ఇయర్ మరియు ‘ఈగిల్’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈగల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
-
#EagleTrailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
విధ్వంసం ఆపేవాడు దేవుడు!
‘తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా... అది పట్టుకున్న వాణ్ణి తాకినప్పుడు...’ అంటూ నటుడు నవదీప్ చెప్పిన డైలాగ్‌తో ‘ఈగల్’ ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు’ అంటూ హీరో రవితేజ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ–‘‘ఈగల్’ సినిమా చాలా బావుంటుంది. కార్తీక్ రూపంలో ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ ప్రొడక్షన్ లాంటింది. విశ్వ ప్రసాద్‌గారితో మరొక చిత్రం చేయబోతున్నా. జనవరి 13న థియేటర్స్‌లో కలుద్దాం.. కుమ్మేద్దాం’’ అన్నారు. ‘‘గత ఏడాది రవితేజ గారికి ‘ధమాకా’ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాం. ‘ఈగల్’తో మరో బ్లాక్ బస్టర్కి రెడీ అవుతున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘ఈగల్’ పండక్కి గొప్ప థియేట్రికల్ అనుభూతి ఇచ్చే చిత్రం. జనవరి 13న థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని. ఈ వేడుకలో అనుపమ, కావ్యా థాపర్, నటులు నవదీప్, శ్రీనివాస్ అవసరాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: డేవ్ జాంద్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ΄్లాకి, కర్మ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. -
సంక్రాంతికి ముందే బుల్లెట్ల పండుగ.. ట్రైలర్ వచ్చేసింది!
మాస్ మహరాజా రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈగల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈగల్ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్లో 'విశ్వం తిరుగుతాను.. ఊపిరి అవుతాను..కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను' అనే రవితేజ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ట్రైలర్ చూస్తే మాఫియా నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సంక్రాంతికి బుల్లెట్ల పండుగ రావడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు' అనే మాస్ మాహారాజా డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. Breaking the myths this Sankranthi!#EAGLETrailer out now :) - https://t.co/ZSe6qyHxon See you all at the cinemas on JAN 13th with #EAGLE 🔥#EAGLEonJan13th pic.twitter.com/3mnQjG7nwl — Ravi Teja (@RaviTeja_offl) December 20, 2023 -
ఈగల్: రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'ఆడు మచ్చా' సాంగ్ విన్నారా?
రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ , కావ్వా థాపర్ హీరోయిన్లుగా, నవదీప్, మధుబాల కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆడు మచ్చా..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. దావ్జాంద్ స్వరకల్పనలో కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ‘‘రవితేజ మల్టీషేడ్స్లో నటించిన చిత్రం ఇది. ఓ గ్రామీణ పండగ నేపథ్యంలో ‘ఆడు మచ్చా..’ పాట వస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
రవితేజ ఈగల్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. వేట మొదలైంది
మాస్ మహారాజ రవితేజ 'ఈగల్'గా సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్‌లు కనిపించనున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్‌డౌన్ మొదలైందని మేకర్స్ తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ.. ఈ ఆనంద సమయంలో కుటుంబం మొత్తం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది. అందుకే ఇండస్ట్రీలో చాలా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వస్తాయి. రవితేజ ఈగల్ కూడా జనవరి 13న విడుదల కానుంది. మరో 50 రోజుల్లో ఈగల్ వచ్చేస్తుందని కౌంట్‌డౌన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. అందులో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. రవితేజ కెరియర్లోనే ఇదొక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథగా రూపొందుతోందని గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈగల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. -
Eagle Movie Teaser Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
'ఈగల్' విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న రవితేజ
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ఈగల్’ చిత్రాన్ని 2024 జనవరి 13న సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రవితేజ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్–దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!
సినిమా ఎంత బాగా తీసినా సరైన టైంలో రిలీజ్ చేయకపోతే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతలు వరకు పండగల్ని టార్గెట్ పెట్టుకుంటారు. మిగతా ఫెస్టివల్స్ సంగతి అలా పక్కనబెడితే సంక్రాంతి కోసం విపరీతంగా పోటీపడుతుంటారు. గతంలో మహా అయితే రెండో మూడో సినిమాలొచ్చేవి. ఈసారి మాత్రం అరడజనుకు పైగా లైన్లో ఉన్నాయి. కట్ చేస్తే గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ పండక్కి రాబోయే సినిమాలేంటి? వాటి లెక్కేంటి? (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) సంక్రాంతికి అనగానే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కావడం గ్యారంటీ. వచ్చే ఏడాది కూడా మహేశ్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోస్ తమ చిత్రాల్ని బరిలోకి దింపుతున్నారు. మొన్నటివరకు డేట్ చెప్పకుండా ఊరించారు గానీ ఇప్పుడు ఆయా తేదీల్ని కూడా ఫిక్స్ చేసేశారు. అలా అని వీళ్ల ముగ్గురే వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. విజయ్ దేవరకొండ, తేజ సజ్జాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫ్యామిలీ స్టార్ - జనవరి 11 (రూమర్ డేట్) గుంటూరు కారం - జనవరి 12 హనుమాన్ - జనవరి 12 నా సామిరంగ - జనవరి 12 (రూమర్ డేట్) ఈగల్ - జనవరి 13 అయాలన్ - జనవరి 14 (రూమర్ డేట్) (ఇదీ చదవండి: సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!) ప్రస్తుతానికి పైన చెప్పిన సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అలానే 'సలార్' డిసెంబరు చివరి వారంలో రానుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేశ్ 'సైంధవ్', నాని 'హాయ్ నాన్న' కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాయని తెలుస్తోంది. దర్శకనిర్మాతలు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ పైన చెప్పిన వాటిలో ఏయే సినిమాలు సైడ్ అవుతాయనేది ఇప్పుడే చెప్పలేం. మహేశ్ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉంది. నిర్మాతలు సంక్రాంతి అంటున్నారు కానీ చూడాలి. ఒకవేళ పైన చెప్పినవన్నీ సంక్రాంతికే వచ్చినా థియేటర్ల సమస్య పక్కా. కలెక్షన్స్పైనా ఘోరమైన ఎఫెక్ట్ పడుతుంది. బహుశా టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో చూసుకుంటే.. సంక్రాంతి రిలీజ్ విషయంలో ఇంత గందరగోళం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్! మరి ఫైనల్‌గా రేసులో నిలిచి గెలిచేది ఎవరో చూడాలి? (ఇదీ చదవండి: ప్రభాస్ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!) This time! Sankranthi is going to be full vibrant 🤗#EAGLE 🦅 13th Jan 2024! Theatres lo Kaludham :)))) pic.twitter.com/okV5LOSrgG — Ravi Teja (@RaviTeja_offl) September 27, 2023 -
పలు గెటప్స్‌లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే కథలు కొందరు స్టార్స్‌కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్‌లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించడం కమల్‌హాసన్‌కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్‌హాసన్ నాలుగుకి మించి గెటప్స్‌లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్‌కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
లండన్‌లో వాలిపోయిన 'ఈగల్'
రవితేజ మోస్ట్ వాంటెడ్.. హీరోగా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. ‘ఈగల్’ సినిమాలో కూడా రవితేజ మోస్ట్ వాంటెడ్. సినిమాలో ఆయన్ను పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెతుకుతుంటుంది. కొందరు ఆయన్ను పెయింటర్ అనుకుంటారు.. మరికొందరు రైతు అనుకుంటారు.. ఇంకొందరు ఇంకోటి అనుకుంటారు. సో.. ఈ చిత్రంలో రవితేజ పలు గెటప్స్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. రవితేజ, అనుపమా పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
సంక్రాంతికి ఈగిల్
మోస్ట్ వాంటెడ్ పెయింటర్, పత్తి పండించే రైతు, ‘రా’ ఏజెన్సీ పట్టుకోవాలనుకుంటున్న మనిషి... ఇలా ఒకే వ్యక్తి గురించి విభిన్న కథలు వినిపిస్తున్నాయి? అసలు అతను ఎవరు? అతని నిజస్వరూపం ఏంటి? అనేది ‘ఈగిల్’ సినిమాలో తెలుస్తుంది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఈగిల్’. అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘ఈగిల్’ సినిమా గురించి అధికారికంగా ప్రకటించి, వీడియోను విడుదల చేయడంతో పాటు సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: దవ్‌జాంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. -
డేగకు చిక్కిన కూన..ఇది కదరా ఆకలి..!
-
వెరీ ఇంట్రెస్టింగ్.. తేనెను మాత్రమే తిని జీవించే పక్షి.. ప్రత్యేకతలివే..
పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): విమాన వేగంతో ఆకాశంలో నిరంతరం సంచరిస్తూ నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతులకు మకుటం లేని మహారాజులు ఈ గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై నిరంతర నిఘాతో ఆకాశం నుండే ఆహారాన్ని గుర్తించి, క్షణంలోనే దానిపై వాలి సేకరించటం ఈ పక్షుల ప్రత్యేకత. గద్ద జాతిలో అరుదైన గద్ద హనీ బజార్డ్. తేనెను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించే ఇటువంటి ప్రత్యేక ఆహారపు అలవాట్లు కలిగిన హనీ బజార్డ్ గద్దపై ప్రత్యేక కథనం.. అభయారణ్యంలోని క్రిమి కీటకాలు, వన్యప్రాణుల కళేబరాలు, పెరుగుతున్న పాముల సంతతి తదితర వాటిని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతున్న గద్దలు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైనవి. నల్లమల అభయారణ్యంలో నైతిక ధైర్యంతో మిగతా జీవులకు ఆదర్శంగా నిలిచే గద్దల జీవనశైలి ఎంతో ముఖ్యమైనది. నల్లమలలో క్రెస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్, క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్, శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ లాంటి గద్ద జాతులు సంచరిస్తుంటాయి. పర్యావరణాన్ని సంరక్షించే గద్ద జాతులు: నల్లమల అభయారణ్యంలో ఎన్నో రకాల వన్యప్రాణులతో పాటు, ఆకాశంలో సంచరించే పక్షి జాతులు కూడా ఎక్కువే. పక్షి సంతతిలో అత్యంత ముఖ్యమైనవిగా ప్రాచుర్యం పొందిన గద్దలు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించి వాతావరణాన్ని సమతుల్యంగా ఉండేందుకు దోహద పడుతున్నాయి. ప్రకృతిలో ఎక్కువవుతున్న పాములు, క్రిమి కీటకాలు, మిడతలు, కుందేళ్లు తదితర వాటిని ఆహారంగా తీసుకోవటంతో పాటు నల్లమలలో జంతువులు వేటాడిన మృతకళేబరాలను భక్షిస్తూ ఎప్పటికప్పుడు నల్లమలను స్వచ్ఛంగా ఉంచేందుకు దోహద పడుతున్నాయి. సహజంగా మాంసాహార జాతులైన గద్దలు కొనతేలిన ముక్కు, పొడవైన రెక్కలతో, ఎంత బరువున్న ఆహారాన్నైనా సునాయాసంగా తీసుకెళ్లే నైపుణ్యం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా క్రిస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్‌లు దట్టమైన అభయారణ్యంలోని గడ్డి మైదానాలను, ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పాములను గుర్తించి వాటిని గురి చూసి వేటాడటం వీటి ప్రత్యేకత. క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్‌లు అభయారణ్యంలోని కుందేళ్లను ఎక్కువగా వేటాడి చంపుతుంది. ఒక్కో సారి గొర్రెలు, మేకల పిల్లలనుసైతం అవలీలగా ముక్కున కరుచుకుని పోయేటంత బలం వీటికి ఉంటుంది. శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ తదితర రకాల గద్దలు మాత్రం మిడతలు, తొండలు, కీటకాలను ఆహారంగా తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తాయి. నల్లమలలో సంచరించే గద్దలపై శ్రీశైలం ప్రాజెక్టు బయోడైవర్సిటీలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. నైతిక ధైర్యానికి నిదర్శనం: సహజంగా 70 ఏళ్ల పాటు జీవించే గద్దలకు 40 ఏళ్లు వచ్చే సరికి ఎన్నో జీవన్మరణ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమయంలోనే అవి ఎంతో మానసిక స్దైర్యంతో తమ సమస్యను ఎదుర్కొని పునర్జన్మ ఎత్తి మరో ముప్పై ఏళ్ల పాటు జీవిస్తాయి. సాధారణంగా పొడవుగా, వాడిగా, పదునుగా ఉండే దాని ముక్కు నిరంతర రాపిడి వల్ల అరిగిపోతుంది. వాడిగా, పొడువుగా ఉండి సులభంగా ఒంగి ఆహారాన్ని తీసుకు పోయేందుకు ఉపకరించే కాలిగోళ్లు సైతం తమ సామరాధ్యన్ని కోల్పోతాయి. దీంతో పాటు పెరిగిన వయసు వల్ల బరువైన రెక్కలు, దట్టమైన ఈకలు దాని గుండెకు హత్తుకు పోయి ఎగరటంలో కష్టాన్ని కలిగిస్తాయి. దీంతో నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్న గద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని శరీర పునర్నిర్మాణాన్ని చేపడతాయి. ఆ క్రమంలో అవి ఎత్తైన పర్వతాల మీదకు చేరుకుని అక్కడ కొండ రాళ్లకు తన ముక్కును ఢీకొడుతూ దాన్ని రాల్చి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటాయి. కొత్త ముక్కు రాగానే దాని సహాయంతో దాని పాత రెక్కలను పీకేసి కొత్త రెక్కలు వచ్చే వరకు వేచి ఉంటాయి. ఇలా ఐదు నెలల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నైతిక ధైర్యంతో దాని జీవిత కాలాన్ని మరో 30 ఏళ్లు వరకు పొడిగించుకుంటాయి. తేనె మాత్రమే తినే హనీ బజార్డ్ నల్లమల అభయారణ్యంలో మిగతా గద్దలకు విభిన్నంగా తేనెను మాత్రమే సేవించి తమ జీవనాన్ని గడిపే గద్దలు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది. అలా జీవించే గద్దలే హనీ బజార్డ్. వీటి జీవనశైలి ఎంతో విచిత్రమైంది. ఇవి నల్లమల అభయారణ్యం యావత్తూ ఆకాశంలో సంచరిస్తుంటాయి. వీటి ప్రయాణంలో ఎక్కడైనా తేనె తుట్టెలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అవి అక్కడ వాలి తేనెను సేకరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి వాటి భారీ రెక్కలను విసురుతూ తేనెటీగలను తరిమి వేస్తాయి. ఆకాశం గుండా సంచరిస్తూ ఎంత దూరంలోని తేనె తుట్టలనైనా గుర్తించటం హనీ బజార్డ్ల ప్రత్యేకత. ఇవి తేనె తప్ప మిగతా ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడవు. చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో.. ఆ గద్దకు తేనే ఆహారం హనీ బజార్డ్లు తేనెను మాత్రమే తాగి జీవించే గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై సంచరిస్తూ ఎక్కడ తేనె నిల్వలు ఉన్నా అక్కడ వాలి తేనెను సేకరించటం వీటి ప్రత్యేకత. కొన్ని గద్ద జాతులు పాములు, సరీసృపాలు, కీటకాలను భక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి. గద్దలు నైతిక ధైర్యానికి ప్రతీకలు. ఇవి జీవితంలో కఠినమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాయి. – షేక్ మహమ్మద్ హయాత్, ఫారెస్టు రేంజి అధికారి, శ్రీశైలం బయోడైవర్సిటీ. -
సొరచేప గ్రద్దకి దొరికితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి
-
పోలాండ్‌లో రవితేజ ఈగిల్?
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగిల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, కావ్యాథాపర్ హీరోయిన్స్‌గా నటించనున్నారని టాక్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పోలాండ్‌లో మొదలైందని ఫిల్మ్‌నగర్ సమాచారం. రవితేజ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే ఈ సినిమాను అధికారికంగా ఓ టీజర్‌తో ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తోందట. అందుకే పోలాండ్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేశారని భోగట్టా. ఇక ‘ఈగిల్’ కాకుండా ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలు చేస్తున్నారు రవితేజ. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటించారు. -
Viral Video: చచ్చాన్రా బాబోయ్! విందు మాట దేవుడెరుగు.. బతికుంటే చాలు
పక్షి జాతుల్లో డేగలది ప్రత్యేక స్థానం. పక్షులన్నీ క్రిమి, కీటకాలను భోంచేస్తే.. అవి మాత్రం ఏకంగా జంతువులపై వేట సాగిస్తాయి. ఒక్కసారి వాటి బలమైన కాళ్లకు దొరికాయా ఇక అంతే! అంతెత్తున గాల్లో తిరుగుతూ నేలపై ఉన్నవాటిని గురిచూసికొట్టే వాటి వేగానికి వేట ఖాయమవాల్సిందే. తాజాగా ఓ డేగ వేటకు సంబంధించిన 57 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈసారి డేగ ఆటలు సాగలేదు. దాని బలమైన పంజా నుంచి కొండ మేక తప్పించుకున్న తీరు భలేగా ఉంది. వీడియో ప్రకారం.. మాంచి ఆకలిమీదున్న ఓ భారీ డేగ కొండ మేకపై కన్నేసింది. అంతెత్తు నుంచి అమాంతం దానిపైబడి తన పదునైన కాళ్లతో ఒడిసి పట్టింది. ఇంకొంచెమైతే అది మేకను నోట కరిచి ఉడాయించేదే! అయితే, అక్కడే మేకకు ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. ప్రాణాలు దక్కిచుకునేందుకు శక్తినంతా కూడదీసుకుని పరుగు లంకించుకుంది. అయినప్పటికీ డేగ తన పట్టు విడువలేదు. మేక మరింత తెలివిగా దారిలో దొర్లుకుంటూ పోయింది. రెండు జీవాలు అలా బండరాళ్లపై రాసుకుంటూ కొంత దూరం వెళ్లాయి. అయినా లాభం లేకపోవడంతో ఈసారి మేక బండరాళ్లకు బలంగా రాసుకుంటూ పోయింది. అలా కొద్దిదూరం వెళ్లగానే రాళ్ల దెబ్బలకు డేగ వెనక్కి తగ్గకతప్పలేదు. తిండి మాట దేవుడెరుగు ఒళ్లు హూనమైందిరో బాబోయ్ అంటూ అది తన ఉడుం పట్టు విడిచింది. ఇక ఈ భీకర పోరు జరుగుతున్న సమయంలో ఆ కొండ మేక తోడుగా మరో మేక కూడా ఉండటం విశేషం. తన మిత్రుడికి ఎప్పుడేం సాయం అవసరమవుతుందో అని అది వాటి చుట్టే పరుగులు పెట్టింది. (చదవండి: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం) సింహం కన్నా బలమైన పట్టు ఎంతో బరువైన జంతువులపై దాడిచేసి అలవోకగా లేవదీసుకుపోయే డేగ పట్టు సింహం కన్నా బలమైనదట. ఒక చదరపు అంగుళానికి సుమారు 340 కిలోల పట్టు బలం దీని సొంతం. సాధారణంగా ఇవి మూడున్నర ఫీట్ల వెడల్పుంటాయి. వీటి రెక్కలు 9 ఫీట్ల పొడవు ఉంటాయి. అంతటి బలమైన పక్షిబారి నుంచి తప్పిచుకోవడంమంటే మామూలు విషయం కాదు. (చదవండి: ముంబో జంబో.. అంటే అర్థం తెలుసా? ఈ ఆర్ట్‌ను చూస్తే..) -
చచ్చాన్రా బాబోయ్! విందు మాట దేవుడెరుగు.. బతికుంటే చాలు
-
ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!!
ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! సౌదీ అరేబియాలోని మల్హంలో జరిగిన వేలంలో దీనికా రేటు పలికింది. అమెరికాకు చెందిన ఈ తెల్లటి జిర్ఫాల్కన్ డేగ జాతుల్లో అతి పెద్దది. ఎందుకింత అంటే.. సౌదీలో ఏళ్లుగా డేగలతో చిన్న జంతువులను వేటాడించే సంప్రదాయ ఆట ఒకటి ఉంది. దాన్ని ఫాల్కన్రీ అంటారు. ఇందుకోసమే అక్కడి ధనవంతులు ఈ వేటాడే పక్షులకు భారీ మొత్తాలు చెల్లించి కొంటుంటారు. అయితే.. ఈ స్థాయి ధర గతంలో ఎన్నడూ లేదట. ఇదో ప్రపంచ రికార్డట. ఈ ఇంటర్నేషనల్ ఫాల్కన్ బ్రీడర్ ఆక్షన్‌లో 14 దేశాలకు చెందిన డేగల పెంపకందారులు పాల్గొన్నారు. సౌదీ టీవీల్లో, సోషల్ మీడియాలో ఈ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో -
డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు. డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జిల్లాల్లో ఇష్టానుసారంగా.. జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. 90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం... వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది. నెదర్లాండ్స్ స్ఫూర్తితో... డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు. -
వైరల్: డేగ దాహం తీర్చిన ఓ బాటసారి
ఆమ్స్టర్డామ్: ఆకలి రుచిఎరుగదు నిద్ర సుఖమెరుగదు అనేది నానుడి. మరి దాహం వేస్తే. అది అనుభవించే వారికే తెలుస్తుంది. వేసవిలో గింజలు, నీళ్లు దొరక్క అనేక పక్షులు చనిపోతుంటాయి. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లో ఓ డేగ నీళ్ల కోసం అల్లాడిపోయింది. రోడ్డు దగ్గరకొచ్చి ఆ దారివెంట పోయే వాళ్లను తదేకంగా గమనిస్తోంది. దాని బాధను అర్థం చేసుకున్నాడు ఓ బాటసారి. డేగకి తన దగ్గర ఉన్న బాటిల్లోని నీళ్లును తాగించి దాన్ని దాహార్తిని తీర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన 20 సెకన్ల నివిడి గల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 53,000 వేల మంది నెటిజన్లు వీక్షించగా..వందల మంది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి సీసాలోని నీటిని డేగ నోటికి అందించడానికి ప్రయత్నిస్తాడు. ఆ పక్కనే ఇద్దరు స్నేహితులు దాన్ని గమనిస్తున్నట్లు ఉండే ఈ వీడియోను ఓ హైవేపై రికార్డ్ చేసినట్టు కనిపిస్తుంది. కాగా డేగకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు ఆ జంతు ప్రేమికుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Thirsty eagle.. Thank you! 🙏 pic.twitter.com/ljmh7yMlDU — Buitengebieden (@buitengebieden_) May 24, 2021 (చదవండి: వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్) -
వామ్మో.. ఇలా వచ్చి, అలా తన్నుకుపోయింది!
జైపూర్: గద్దలా తన్నుకుపోవడం అని చాలాసార్లు అంటుంటాం.. వింటుంటాం కూడా.. కానీ ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇప్పుడు చూసేయండి.. ఈ స్టెప్పీ జాతికి చెందిన గద్ద వేటాడటంలో మంచి నేర్పరులు.. టార్గెట్ మిస్కావు..ఆ అడవిలో పాపం ఒక జింక పిల్ల తన తల్లినుంచి తప్పిపోయినట్టుంది. అయితే..ఆకాశం నుంచి ఒక గద్ద ఆ పిల్ల జింకను గమనించింది. వెంటనే ఆమాంతం కిందకు వచ్చి ఒక్క ఉదుటున జింక పిల్లను వాటి పదునైన కాలితో పట్టుకోని వెళ్లిపోయింది. అయితే, ఈ సంఘటన రాజస్తాన్‌లోని తాల్ చప్పర్ అభయారణ్యంలో చోటుచేసుకుంది. దీన్ని బైజూ పాటిల్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇంతకీ ఈ కృష్ణ జింక పిల్ల సంగతేమైందంటారా? ముందే చెప్పాంగా.. అవి టార్గెట్ మిస్ కావని.. -
కోకిల డేగ.. ఉడతల గెద్ద!
సాక్షి, అమరావతి: కోకిల డేగ.. ఉడతల గెద్ద.. నూనె బుడ్డిగాడు. సరదాగా ఆట పట్టించేందుకు గ్రామీణులు పెట్టిన పేర్లు కావివి. విజయవాడ పరిసరాల్లో సందడి చేస్తున్న కొత్త పక్షుల జాతులివి. ఈ ప్రాంతానికి కొత్తగా జిట్టంగి (బ్లైత్స్ పిపిట్), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్ ఓర్ఫియన్ వార్బ్లెర్), మెడను లింగాడు (యురోషియన్ వ్రైనెక్), కోకిల డేగ (క్రెస్టెడ్ గోషాక్), ఉడతల గెద్ద (పాలిడ్ హారియర్), నీలి ఈగ పిట్ట (వెర్డిటర్ ఫ్లైకాచర్), నూనె బుడ్డిగాడు (బ్లాక్ రెడ్‌స్టార్ట్) అనే 7 రకాల పక్షి జాతులు వస్తున్నట్టు పక్షి ప్రేమికులు గుర్తించారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో మొత్తంగా 174 పక్షి జాతులు ఉన్నట్టు నిగ్గు తేల్చారు. మన రాష్ట్రంలో 460కి పైగా పక్షి జాతులు ఉండగా.. అందులో 174 అంటే 35 శాతం విజయవాడ పరిసరాల్లోనే ఉంటున్నట్టు గుర్తించారు. విజయవాడ నేచర్ క్లబ్ చేపట్టిన శీతాకాల పక్షుల గణనలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు 20 పెద్ద చెరువుల వద్ద 32 మంది వలంటీర్లు (డాక్టర్లు, వ్యాపారులు, విద్యార్థులు, బ్యాంక్ మేనేజర్లు తదితరులు) నిపుణులైన బర్డ్ వాచర్స్ సూచనల ప్రకారం గణన నిర్వహించిన గణనలో మొత్తం 13,527 పక్షుల్ని పరిశీలించారు. జాతులెక్కువ.. సంఖ్య తక్కువ! ఈ గణన సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చే నాలుగు పక్షి జాతుల్ని మాత్రమే గుర్తించారు. వాటిలో బాపన బాతు (రడ్డీ షెల్డ్ డక్), నామం బాతు (స్పాటెడ్ యురేషియన్ వైజన్), సూదితోక బాతు (నార్తర్న్ పిన్‌టైల్), చెంచామూతి బాతు (నార్తర్న్ షోవెలర్) ఉన్నాయని తెలిపారు. గతంలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పక్షులు వలస వచ్చేవి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గణనలో స్పష్టమైంది. నున్న, కవులూరు, వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, ఈడుపుగల్లు, కొండపావులూరు గ్రామాల సమీపంలో చెరువులు, చిత్తడి నేలలు బాగున్నట్టు గుర్తించారు. ఎక్కువ పక్షి జాతుల్ని ఈ చెరువుల వద్దే లెక్కించారు. ఇక్కడికి వస్తున్న పక్షి జాతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. పక్షుల సంఖ్య మాత్రం బాగా తక్కువగా ఉన్నట్టు గణనలో తేలింది. నీటి కాలుష్యం, చేపల చెరువులు ఎక్కువ కావడం, నివాస ప్రాంతాలు విస్తరించడం, పంట పొలాల్లో పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల వలస పక్షుల సంఖ్య తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. విజయవాడ పరిసరాల్లో పట్టణీకరణ ఎక్కువగా జరుగుతుండటం వల్ల చిత్తడి నేతలు, పంట పొలాలు నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. పక్షుల గణన నిర్వహించిన ఎక్కువ ప్రాంతాలు మానవ నివాసాలకు బాగా దగ్గర ఉన్నాయి. కొన్ని చెరువులు తమ సహజ స్వభావాన్ని కోల్పోగా కొన్ని బహిరంగ మలమూత్రాలు విసర్జించే ప్రాంతాలుగా మారాయి. రెండుచోట్ల పక్షుల్ని వేటాడటానికి పన్నిన వలల్ని గుర్తించారు. ఏదేమైనా పక్షుల సంఖ్య తగ్గడానికి చెరువుల చుట్టుపక్కల పొలాల్లో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటమేనని అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు కనబడుతున్న నేపథ్యంలో పక్షుల జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో బాగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు ఏర్పడాలి విజయవాడలో బర్డ్ వాచింగ్ కమ్యూనిటీ లేకపోవడం వల్ల పక్షి జాతులను నమోదు చేయడం, పర్యవేక్షించడం, వాటి సంఖ్య అంచనా వేయడం పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి పెద్ద నగరాల్లో బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు ఎప్పటి నుంచో ఉండటం వల్ల అక్కడ బర్డ్ రేస్, బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ వంటి వార్షిక కార్యక్రమాలు తరచూ జరుగుతున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో అలాంటి కమ్యూనిటీలు ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిర్వహించిన శీతాకాల పక్షుల గణనను ఇకపై వార్షిక కార్యక్రమంగా చేపడతాం. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ -
వెల్డన్ దిశా
గాయపడిన ఓ పక్షి (గద్ద)కి వైద్య సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. ఈ విషయాన్ని ఓ వెటర్నరీ డాక్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘దిశా పటానీగారు ఓ పక్షిని వెటర్నరీ క్లినిక్‌కు తీసుకువచ్చారు. అప్పటికే ఆ పక్షి రెండు రెక్కలకు బాగా గాయాలయ్యాయి. ఆ నొప్పితో పాటు డీహైడ్రేషన్‌తో కూడా ఆ పక్షి బాధపడుతున్నట్లుగా కూడా గమనించాం. ప్రస్తుతం వైద్యం చేస్తున్నాం. ఆ పక్షికి ఆర్ధోపెడిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఆ పక్షి విహంగంలో విహరించాలని కోరుకుంటున్నాం. దిశా పటానీగారి దయాగుణం మెచ్చుకోదగినది’’ అని ఆ వెటర్నరీ డాక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన దిశా ఫ్యాన్స్, నెటిజన్లు... ‘వెల్ డన్ దిశా’ అని ఈ బ్యూటీని ప్రశంసిస్తున్నారు. -
వైరల్ : బతుకు జీవుడా అనుకున్న గద్ద
-
వైరల్ : బతుకు జీవుడా అనుకున్న గద్ద
సాధారణంగా గద్దలు ఆహారం కోసం సముద్రమార్గంలో అన్వేషిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వాటి అన్వేషణలో భాగంగా దొరికిన చేపలను,పాములను నోట కరచుకొని వెళ్తుంటాయి. కానీ కెనెడాలోని వాంకోవర్ ఐలాండ్‌లో మాత్రం ఒక గద్దకు వింత అనుభవం ఎదురైంది. ఆహారం కోసమని నీటిలో దిగగా ఒక ఆక్టోపస్ వచ్చి గద్దను తన కబంద హస్తాలలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని నుంచి విడిపించికునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆక్టోపస్ గద్దను ఇంకా గట్టిగా పట్టుకోవడంతో హాహాకారాలు మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయానికి చేపలను పెంచే సాల్మన్ బృందం పడవలో వెళ్తూ గద్ద అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆక్టోపస్ హస్తాలలో చిక్కుకున్న గద్ద బయటికి వచ్చేందుకు చేస్తున్న పోరాటాన్ని ఆ బృందం గమనించింది. ఎలాగైనా గద్దను కాపాడాలనే ప్రయత్నంలో ఒక కర్రకు హుక్‌ను తగిలించి దానితో ఆక్టోపస్‌ను కదిలించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆక్టోపస్ తన పట్టు విడవడంతో చివరికి ఎలాగోలా గద్ద బతుకుజీవుడా అంటూ పక్కనే ఉన్న ఒడ్డుకు చేరుకుంది. మొత్తం 54 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ కాస్తా సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ యూట్యూబ్‌లో 1.78 మిలియన్ల మంది వీక్షించారు. ఆక్టోపస్ చేతులలో బంధీగా మారిన గద్దను సురక్షితంగా కాపాడిన బృందాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. -
గ్రద్ద తెలివికి నెటిజన్లు ఫిదా: వైరల్
న్యూయార్క్ : సెయింట్ క్రోయిక్స్ నదిలో అలలపై ఓ గ్రద్ద తేలుతూ వస్తోంది. పైకి ఎగరకుండా రెక్కలను లైఫ్ జాకెట్లుగా వాడుతూ నదిపై ఈదుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకునే సమయంలో అది తన రెక్కలను తెడ్డుగా ఉపయోగించి నేలపైకి వచ్చింది. అంతే! అప్పటి వరకు దాన్ని వీడియో తీస్తున్న ఓ జంట ఆశ్చర్యానికి గురైంది. గాయం కారణంగా గ్రద్ద పైకి ఎగరలేకపోయిందనుకున్న వారు దాని తెలివికి ఫిదా అయ్యారు. అమెరికాకు చెందిన డాన్ గాఫ్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రద్ద ఎందుకలా చేసింది?!.. వేటాడి పట్టుకున్న చేపను గాల్లోకి తీసుకెళితే అది ఊపిరాడక కావచ్చు.. తప్పించుకోవాలన్న ప్రయత్నంతో కావచ్చు.. గిలగిలా కొట్టుకుని కిందకు దూకే ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి తప్పించుకుందంటే ఒక్కసారిగా వందల అడుగుల ఎత్తునుంచి చేప నీటిలో పడి, అది తేలిగ్గా నీటి అడుగుకు చేరి దొరక్కుండా పోతుంది. గ్రద్ద అంత ఎత్తునుంచి నీటిలోకి దూకేసరికే చేప తుర్రుమంటుంది. మరి గ్రద్ద ఇలా ఆలోచించిందో లేదో తెలియదు కానీ చేపను నీటిలోనే కాళ్లతో గట్టిగా అదిమిపట్టింది. ఒడ్డుకు చేరేంత వరకు ఆగి ఆ తర్వాత చేపను ఒడ్డుపైకి లాగింది. -
ఈగ
ఖురాసాన్ రాజు వేటనుంచి తీవ్ర అలసటతో తిరిగి రాజభవనానికి చేరుకుని తన రాజదర్బారులో విశ్రాంతి తీసుకునేందుకు కునుకు తీశాడు. అంతలోనే ఒక ఈగ తన ముక్కుపై వాలింది. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. కోపంతో ఈగను అల్లించాడు. తేరుకొని ముంచుకొస్తున్న నిద్రతో కళ్లు మూతలుపడుతుండగా ఆ ఈగ మళ్లీ అతని ముక్కుపై వాలింది. రాజు గారికి ఈగ మీద చిర్రెత్తుకొచ్చింది. ఈగను నరికి పోగులేయాలన్న కోపంతో ఊగిపోయాడు. మాటిమాటికీ ఇదే పునరావృతమైంది. రాజుగారు తన పక్కనే ఉన్న తన సైనిక భటునితో ‘‘దేవుడు ఈగను ఎందుకు సృష్టించాడు. దీన్ని పుట్టించడం వెనుక ఉద్దేశమేమిటి’’ అని కోపంతో అడిగాడు. ‘‘రాజులు, చక్రవర్తుల అధికార మదాన్ని, అహంకారాన్ని అణిచివేసేందుకే ఈగను సృష్టించాడు. ఎంత గొప్ప చక్రవర్తులైనా చిన్న ఈగపై కూడా ఎలాంటి ఆధిపత్యాన్ని చెలాయించలేరన్న విషయాన్ని తెలిపేందుకే ఈగను సృష్టించాడు. తమకు తిరుగులేదని విర్రవీగే చక్రవర్తులు చిన్న ఈగపై కూడా అధికారం చెలాయించలేనప్పుడు మన విలువ ఏపాటిదో గుర్తుంచుకోవాలి’’ అని సైనిక భటుడు రాజుగారి కళ్లు తెరిపించాడు. అతని మాటలకు ఎంతో మెచ్చుకున్న రాజుగారు అతన్ని తన మంత్రిగా నియమించుకున్నాడు. – తహీరా సిద్ధఖా -
రోబో ఈగ
‘రోబో’ సినిమా తెలుసు, ‘ఈగ’ సినిమా తెలుసు... ఇప్పుడు ‘రోబో ఈగ’ అనే కొత్త సినిమా రిలీజవుతోందేంటా అని అనుకుంటున్నారా? సినిమా కాదు గాని, నిజంగానే అసలు సిసలు ‘రోబో ఈగ’ను రిలీజ్ చేశారు... సారీ తయారు చేశారు వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈగలా గాల్లోకి ఎగిరే ఈ రోబోకు ‘రోబో ఫ్లై’ అని నామకరణం కూడా చేశారు. ఇది చాలా తేలికైన రోబో. దీని బరువు టూత్‌పిక్ బరువు కంటే కాస్త ఎక్కువ. దీనికి అమర్చిన సర్క్యూట్ బోర్డు సాయంతో లేజర్ కిరణాలను విద్యుత్తుగా మార్చుకుని, వైర్లెస్ పద్ధతిలో గాలిలోకి ఎగరడం దీని ప్రత్యేకత. ఇలా వైర్లెస్ పద్ధతిలో గాల్లోకి ఎగరగలిగే రోబో ఇప్పటి వరకు ఇదొక్కటి మాత్రమేనని దీని రూపకల్పనలో పాల్గొన్న శాస్త్రవేత్త సాయర్ పుల్లర్ తెలిపారు. దీనిపై ఉండే మైక్రో కంట్రోలర్ రెక్కలు కొట్టుకునే వేగాన్ని నియంత్రించేలా సందేశాలు పంపుతుందని, ఎక్కువసార్లు కొట్టుకునేందుకు ఒకరకంగా, ముందుకు వెళ్లేందుకు ఇంకోలా, గాలి అల పైకి రాగానే వేగాన్ని తగ్గించేందుకు మరోలా సందేశాలు పంపుతుందని ఆయన వివరించారు. గ్యాస్ లీకేజీలను, కర్మాగారాల నుంచి వెలువడే కలుషిత వాయువులను పసిగట్టడం మొదలుకొని, రకరకాల ప్రయోజనాల కోసం దీనిని వాడుకోవచ్చని తెలిపారు. -
కోడిలాంటి గద్ద
‘నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను’ అని ఒక గురువు దగ్గర చెప్పుకున్నాడు యువకుడు. అప్పుడు ఆ యువకుడిలో లోపించిన ఆత్మవిశ్వాసానికి కారణాలు తెలుసుకున్నాడు గురువు. వాటన్నింటినీ అధిగమిస్తేనే పైకి ఎదగగలవని సూచించాడు. మనిషిని పరిస్థితులు ఎలా నియంత్రిస్తాయో, వాటికనుగుణంగా ఆలోచన ఎలా కురచబారుతుందో తెలియజేసేందుకు ఈ కథ చెప్పాడు. పొరపాటున ఒక గద్ద గుడ్డు, కోళ్లుండే చోట పడింది. అది ఏమిటని కోళ్లు ముందు ఆశ్చర్యంగా చూశాయి. చివరకు ఒక కోడి ఆ గుడ్డును పొదిగింది. కొన్ని రోజుల తర్వాత గద్ద పిల్ల అందులోంచి బయటికి వచ్చింది. కోళ్లన్నీ దాన్ని కోడిపిల్లలాగే పెంచాయి. అది ఎంతో ఎత్తుకు ఎగరాలనుకునేది. దాని రెక్కలకు ఆ నేల చాలేది కాదు. కానీ దాని తోటి కోడిపిల్లలన్నీ కిందే బతికేవి. వాటితోపాటు గద్దపిల్ల కూడా నేలన తిరిగేది. అప్పుడప్పుడూ పైన గద్దలు ఎగురుతూ పోవడం అది చూసేది. అప్పుడు దాని రెక్కల్లోకి ఏదో కొత్త ఉత్సాహం వచ్చేది. ఎగరడానికి ప్రయత్నించేది. కానీ, ‘నువ్వు కోడిపిల్లవు, గద్దల్లాగా అంత పైకి ఎగరలేవు’ అని నూరిపోసేది తల్లికోడి. అది నిజమేనని నమ్మింది గద్దపిల్ల. ఇక శాశ్వతంగా నేలమీదే ఉండిపోయింది. చాలా ఏళ్లు కోడిలాగే బతికి, కోడిలాగే చచ్చిపోయింది. -
ఆటోడ్రైవర్ ఔదార్యం
అన్నానగర్: కుంభకోణం సమీపంలో విద్యుత్ షాక్ కొట్టి ప్రాణాలకు పోరాడుతున్న ఓ గద్దను ఆటో డ్రైవర్ రక్షించి చికిత్స అందించాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. కుంభకోణం పొట్రామరై కులమ్ సమీపంలో గురువారం ఉదయం ఓ గద్ద విద్యుత్ తీగను ఢీకొంది. దీంతో విద్యుత్ షాక్ గురై కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో అటుగా వెళ్తూ దీన్ని గమనించిన కుంభకోణం పాత అరన్మలై వీధికి చెందిన ఆటో డ్రైవర్ ముత్తు కృష్ణన్ గద్దని రక్షించి దానిపై నీళ్లు చల్లాడు. అనంతరం దాన్ని లక్ష్మీ విలాస్ వీధిలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నోటి దారిన గ్లూకోస్ ఎక్కించారు. అనంతరం ముత్తుపిల్లై మండపంలో ఉన్న అటవీ శాఖ కార్యాలయంలో దాన్ని అప్పగించాడు. గద్ద ప్రాణాలు కాపాడిన ముత్తు కృష్ణన్‌ను అక్కడి వారు అభినందించారు. -
సెమీస్‌లో బీహెచ్ఈఎల్, ఈగల్స్
సాక్షి, హైదరాబాద్: నవాబ్ షుజాత్ అహ్మద్ ఖాన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఈగల్స్, బీహెచ్ఈఎల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సిటీ కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ జట్టు 57– 47తో షార్ప్ షూటర్స్ జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ షార్ప్ షూటర్స్ యువ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. బీహెచ్ఈఎల్ జట్టులో రాజు, రాహుల్ చెలరేగడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 29–22తో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మూడో క్వార్టర్లో 48–30తో ఏకంగా 18 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరిదైన నాలుగో క్వార్టర్లో షార్ప్ షూటర్స్ దీటుగా పోరాడినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరికి 10 పాయింట్ల తేడాతో బీహెచ్ఈఎల్ గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ తరఫున రాజు (13), పాల్ (13) ఆకట్టుకున్నారు. షార్ప్ షూటర్స్ జట్టులో అశ్విన్ 17 పాయింట్లు స్కోర్ చేయగా.. ఒమేర్ 12 పాయింట్లు చేశాడు. ఈగల్స్ జోరు రాజేంద్రనగర్ బాస్కెట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈగల్స్ జట్టు 52– 28తో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజేంద్రనగర్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈగల్స్ జట్టులో రోహన్ (21), అమన్ (15) అద్భుత ప్రదర్శన కనబరిచారు. రాజేంద్రనగర్ జట్టు తరఫున సలీమ్ (16) ఒక్కడే చివరి వరకు పోరాడాడు. -
సారాంశం
రెండవ బహుమతి పొందిన కథ అర్థం కావు. చాలా విషయాలు అర్థం కావు. మనిషికి కన్నీళ్లు అర్థం కావు. దుఃఖం అర్థం కాదు. చుట్టూ ఉన్న సమాజం అర్థం కాదు. మనుషులు అర్థం కారు. ప్రకృతి అర్థం కాదు. వర్షం ఎందుకు కురుస్తుందో... తుఫాన్లు ఎందుకొస్తాయో... రవ్వంత అగ్ని ఎక్కడో ఒక బిందువుగా పుట్టి అరణ్యాలకు అరణ్యాలనే ఎందుకు దహిస్తుందో అర్థం కాదు. తను చిన్నగా... పదేళ్ల వయస్సులో ఒళ్లో కూర్చుండబెట్టుకుని నాన్న ఆప్యాయంగా తల నిమిరినప్పుడు... బడికి వెళ్లొస్తుంటే చిటపట చినుకులు ఒంటిపై కురుస్తున్నప్పుడు... ఊరికే అలా ఖాళీ ఆకాశంలోకి చూస్తూ గంటలకు గంటలు కూర్చున్నప్పుడు... పిడికెడు గుండెలో పొంగిన ఆనంద మహాసముద్రాలు అర్థమయ్యాయా? ఉహు... అస్సలేం అర్థం కాలేదు. వర్తమానంలోకి దూసుకొస్తున్నకొద్దీ గతం అర్థం కాలేదు. గతంలో నుండి భవిష్యత్తును అంచనా వేసుకోవాలంటే వర్తమానమూ అర్థం కావడం లేదు. నలభై అయిదేండ్ల అచల పొద్దుటి నుండి కారణాలను వెదికేందుకు ప్రయత్నిస్తోంది. భర్త. తనకూ ఆయనకూ నడుమ ఒక సముద్రమంత అంతరం. కారణం ఏమిటి? అభిరుచుల తేడా... వ్యక్తిత్వాల తేడా... తత్వాల తేడా. యినుము ఇత్తడితో అతకదు. కారణం ఏమిటి? ఇక పిల్లలు. రెక్కలొచ్చి... ఎగిరి... ఆకాశం విశాలం... బతుకులు విశాలం... ఎవరి దారి వారిది. ఎవరి జీవితం వారిది. కుటుంబం, సమూహం... విచ్ఛిన్నమై... ఎవరికి వారే ఒంటరి. కారణం ఏమిటి? పైకి ఒక ఇల్లు. లోపల... మనుషులు ఎవరి అరలో వాళ్లు. మధ్యలో అభేద్యమైన గోడలు. బైటికెళ్తే... పెద్ద ప్రపంచంలో ఒక చిన్న తను. లోపలికొస్తే ఒక చిన్న తనలోనే ఒక పెద్ద ప్రపంచం. నిరంతరం... అంతరాగ్నితో ఘర్షించే ప్రపంచం. ‘కి... కి.. కిచ్...’ చప్పుడు. ఉలిక్కిపడింది అచల. జ్ఞాపకాల తుఫానులో నుండి తెప్పరిల్లి కిందికి చూచింది. హాల్లో తను కూర్చున్న కుర్చీ ప్రక్కన... నేలమీద... చిన్న కోడిపిల్ల. పదిహేను రోజుల వయసున్న కోడిపిల్ల. నల్లనిది. అందమైంది. చురుకైంది. ప్రేమ గలది. తనవైపే చూస్తోంది. మిలమిల్లాడే చిన్న కళ్లతో... నిశ్శబ్దంగా, దీనంగా కూడా. కళ్లు చిన్నవే. చీమవి. పక్షివి. పామువి. ఏనుగువి. కాని చూపు మాత్రం చిన్నది కాదు. చూపు నిశితమైంది. చూపు తీక్షణమైంది. చూపు సూటిగా హృదయాన్ని తాకేది. చూపు నిండా కరుణ, దయ, వాత్సల్యాన్ని నింపుకునేది. అచల కాళ్లపై రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని రాసుకుంటున్నప్పుడల్లా రాయడం ఆపి... కోడిపిల్ల దిక్కు మరింత పరిశీలనగా చూచింది. కొద్ది దూరంలో ఒక అరగంట క్రితం తను దానికోసం నేలపై పోసిన పిడికెడు బియ్యపు గింజలు, చిన్న సత్తుగిన్నెలో పోసిపెట్టిన నీళ్లు. అలాగే ఉన్నాయి. వాటిని విడిచి, వచ్చి తన ముందర అలా నిలబడి... తన వైపే చూస్తూ. దానికి తన ఆహారంపైనా, ఆకలి దప్పులపైనా ధ్యాస లేదు. తనపై... మనిషిపై... ఏదో అజ్ఞాతంగా అల్లుకుంటున్న మమకారం పైననే మక్కువ. దాన్ని ప్రేమ అంటారా? బంధం అంటారా? ఋణం అంటారా? ప్చ్... ఏమో! అచల మనసులో పదిహేను రోజుల కిందటి ఘటన కళ్లముందు కదిలింది. ఉదయం ఆరు గంటలు కూడా కాలేదు. ఆ రోజు ఒకటే వర్షం. మూడు రోజులుగా ఒకటే ముసురు. లేచి కళ్లు నులుముకుంటూ ఇంటి వెనక ఉన్న నీళ్లగది దిక్కు నడుస్తూంటే... పక్కనే రేకుల షెడ్డు కింద పారేసిన పాత సామాన్ల కుప్పలో నుండి ఏదో శబ్దం వినబడింది అచలకు. దగ్గరికెళ్లి చూస్తే... విరిగిన కుర్చీల పక్కనున్న దళసరి అట్టపెట్టెలో ఒద్దికగా కూర్చుని ఒక కోడిపెట్ట కొక్కుబట్టి ఉంది. మత్తుగా... బద్ధకంగా... గురగురలాడ్తూ... ఒంటి పైనున్న ఈకలను రిక్కిస్తూ. దగ్గరగా వెళ్లినా... అది కదిలి... భయపడి పారిపోలేదు. సరికదా ఇంకా ముడుచుకుని కడుపు కింద ఏదో దాచుకున్నట్టు సర్దుకుని కూర్చుంది. చేతితో తట్టి... లేబట్టి చూచింది తను. దాని కడుపు కింద ఐదారు గుడ్లు. వాటిపైన కూర్చుంది... వెచ్చగా. అంటే... యిది గుడ్లను పొదుగుతున్నట్టా? ఎప్పట్నుండి పొదుగుతోంది? అసలీ కోడి ఎక్కడిది? ఎవరిది? ఎలా వచ్చింది తమ యింటికి? ఊరి బయట... కొత్తగా ఏర్పడ్తున్న కాలనీలో... ఈ మధ్యనే కట్టుకున్న ఇల్లు తమది. అక్కడో ఇల్లు యిక్కడో ఇల్లు. కోళ్లు... కుక్కలు... ఎవరికెవరివో ఎక్కడెక్కడో తిరుగుతూండడం మామూలే. కోడిపెట్ట భయం భయంగా... బెరుకుగా కూర్చుంది. అచల వైపు ఎంతో ప్రాధేయ పూర్వకంగా చూచింది... ‘ప్లీజ్... డిస్టర్బ చేయకు’ అన్నట్లు. అచల దాన్నక్కడే... అలాగే విడిచిపెట్టి... వాకిట్లోకి వచ్చి... బాత్రూమ్కు వెళ్లింది. కాని... ఆమెకు తెలియకుండానే ఆమె మనసు ఆ కోడిపెట్ట అట్టపెట్టెలో చిక్కుకు పోయింది. అప్పట్నుంచీ గంట రెండు గంటలకొకసారి అటు వెళ్లి... కోడిపెట్టను డిస్టర్బ చేయకుండానే గమనించేది. ఎన్ని రోజులైందో.. కోడిపెట్ట గుడ్లను పొదుగుతూ. మర్నాడు ఉదయం లేవగానే ఉత్సుకతలో నిశ్శబ్దంగా వెళ్లి గమనిస్తే... చిన్న కోడిపిల్లల కిచకిచల చప్పుడు వినిపించింది. ఆశ్చర్యం! ధైర్యంగా కోడిపెట్టను చేత్తో పట్టుకుని పెకైత్తి చూస్తే నాల్గు పిల్లలు ఉన్నాయి. రెండు నల్లవి. ఒకటి గవ్వలది. ఒకటి బూడిద రంగు. అన్నీ ముద్దొస్తున్నాయి. అప్పుడూ వర్షమే. జాగ్రత్తగా తల్లి కోడినీ... నాల్గు పిల్లలనూ... ఇంట్లోకి తెచ్చింది. హాలులోకి తెచ్చి... బియ్యపు గింజలేసి... నీళ్లు పెట్టింది. ఒక కొత్త సందడి. ఐదు జీవులు. ఇంట్లో ఉన్న రెండు మానవ జీవాలకు అదనంగా. తామిద్దరు. భార్య, భర్త మాటలు ఉండని... హృదయాలు కలవని... సంబంధాలు లేని... లోకం దృష్టిలో ఏకస్తులే ఐనా ఒకరికొకరు ఏమీ కాని పూర్తి పరస్పర పరాయి మనుషులు. యిప్పుడు... ఈ ఐదు ప్రాణాలు. కొక్కొక్కొకో... కిచ్ కిచ్ కిచ్... ఇల్లంతా కోడిపిల్లలు, తల్లికోడి తిరుగుడు. సందడి. అటు ఇటు నడకలు... పరుగులు. చిన్న చిన్న రెక్కలు... తోక... సూది మొనలా ముక్కులు... చిన్ని చిన్ని కాళ్లు... ఎంత ముద్దో. భగవత్ సృష్టిలో జీవి ఏదైనా... దేని అందం దానిదే. దేని ఆకర్షణ దానిదే. చీమైనా... కోడిపిల్లయినా... ఖడ్గ మృగమైనా... శిశు సింహమైనా! ఒకరోజు... రెండు రోజులు... అచల దాదాపు బైటికి పోవడం మానేసింది. తల్లికోడి... పిల్లలు... అవే తన లోకమై పోయాయి. పాలవాడు... పేపర్‌వాడు... పనిమనిషి లచ్చమ్మ... అందరూ... ఆసక్తిగా వాటిని గమనించి... ఉచిత సలహాలు ఇస్తున్నారు. ‘ఊర్కే యింట్లోనే ఉంటే ఎలాగమ్మా. బైటి గాలి తగలాలి గదా. అలా ఇంటెనక పెరట్లోకి తీసుకెళ్లండి. కాని జాగ్రత్తమ్మో. పిల్లి.. గ్రద్ద...’ ఇలా. అచల రెండ్రోజుల తర్వాత... కోడిపెట్టనూ, పిల్లలనూ, జాగ్రత్తగా యింటి వెనుక పెరట్లో వదిలి... ప్రక్కనే ఓ కుర్చీ వేసుకుని, చేతిలో ఓ పొడుగాటి కర్ర పట్టుకుని వాటికి కాపలాగా కూర్చుంది. అచల పేపర్ చదువుకుంటూ... చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ... పైకి ఆకాశంలోని గ్రద్దల దిక్కూ... యింటి ఫెన్సింగ్ వైపు పిల్లి జాడ దిక్కూ... చూస్త. ఐదవరోజు... దాహమేస్తే అచల వంటగదిలో కొచ్చి... మంచినీళ్లు తాగుతుండగా. బయట పెరట్లో గోల గోల వినబడింది. కోడి కొట్టుకుంటున్నట్టు... ఏదో పెనుగులాడు తున్నట్టు గలాటా... చప్పుడు... ఏదో దాడి. తీరా ఒక్క అంగలో పరిగెత్తి చూస్తే... పెద్ద మగ ఊరకుక్క. ఎదురింటి ఇక్బాల్ వాళ్లది. తల్లి కోడిని నోట్లో కరుచుకుని... ఒకటే పరుగు. పాపం... కోడిపిల్లలు... నాల్గు... పరుగెత్తుకొచ్చినై యింట్లోకి భయంతో... వచ్చి నక్కి నక్కి దాక్కున్నాయి. వాటిని దగ్గరికి తీసుకుంది అచల. దోసిట్లోకి తీసుకుని ఎంతో ప్రేమగా నిమిరింది. నీళ్లు తాగించింది. ఎందుకో అచలకు దుఃఖం, బాధ... విలవిల్లాడ్తూ... కడుపులో ఎవరో దేవుతున్నట్టు. మర్నాడు పెరటి దిక్కు దర్వాజకు... ఓ యినుప జాలీ అడ్డం పెట్టింది. పిల్లలు యింట్లోనే... మంచిగానే... సందడి సందడిగా అటూ ఇటూ ఎంతో హుషారుగా తిరుగుతున్నాయి. పదవరోజు... పదురుకున్నట్టు... రెండు గండు పిల్లులు వచ్చాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి... వీధి దర్వాజాలో నుండి విడిచిన బాణంలా ఉరికొచ్చి చెరో కోడిపిల్లనూ తన్నుకుపోయినై. మళ్లీ మనసంతా బోసిపోయి... విలవిల... దుఃఖం మౌనక్షోభ. యిక రెండు పిల్లలు మిగిలినై. ఒకటి నలుపు... మరొకటి బూడిద రంగు. చాలా జాగ్రత్తలు తీసుకుంది అచల ఆ రెండింటినీ ఎలాగైనా రక్షించాలని. ఆమెకు తెలియకుండానే ఆమె మనసు నిండా కోడిపిల్లలు... వాటిని ఎలా కాపాడాలి... పిల్లి, కుక్క దాడి నుండి ఎలా వాటిని రక్షించాలి. ఇవే ఆలోచనలు. పాపం... రెండు కోడిపిల్లలూ ఆమె వెంటనే తిరిగేవి కిచకిచలాడ్తూ. ఎటు పోతే అటు... కిచెన్‌లోకి, బెడ్రూంలోకి, హాల్లోకి అన్నిట్లోకీ పోతుండేవి. భాషకందని ఏదో బంధం ఏర్పడినట్టు అర్థమైంది అచలకు... తనకూ వాటికీ. రెండ్రోజుల క్రితం... ఏమైందో ఏమో... గంప కింద కమ్మిన కోడిపిల్లలను పొద్దున లేవగానే ఆతురతగా చూస్తే... బూడిద రంగు పిల్ల చచ్చిపోయి బిగుసుకుని ఉంది. చచ్చిన దాని శరీరం నిండా గుంపులు గుంపులుగా చీమలు పట్టేశాయి. తీసుకెళ్లి బైటపడేసింది కాలువలో... చచ్చిన కోడిప్లిలను బరువెక్కిన హృదయంతో. అచల భర్త... ఈ కోడిపిల్లల తతంగాన్నీ, వాటి క్రమానుగత మరణాలనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమనిస్తూ... సంతోషపడ్తూ... వెకిలిగా దేహ భాషను ప్రదర్శిస్తున్నాడు. అతని పైశాచికానందం అచలకు చిర్రెత్తించింది. బహుశా... అందువల్లనేనేమో. మిగిలిన ఒక్క నల్లరంగు కోడిపిల్లపై అచలకు అచంచలమైన ప్రేమ ఇనుమడించింది. ‘‘బుజ్జిముండా.. నీకు నేనున్నానుగదే’’ అంది అచల ఆ రోజు. దోసిట్లోకి కోడిపిల్లను తీసుకుని ప్రేమగా నిమిరింది అచల. చేతుల్లో... వెచ్చగా... మెత్తగా పట్టు వలె బూరు. ఎత్తుకుంటే అవది దోసిలి నిండా ఉంది. పదిహేను రోజుల్లో కాస్త సైజు పెరిగి... చక్కగా ఎదిగిందిది. అలవాటైంది అచలక్కూడా. యింట్లో అటు ఇటూ తిరుగుతూ... పక్కనే వెంట నడిచి వచ్చే కోడిపిల్లను గమనిస్తూ ఆనందించడం... ముచ్చటపడ్డం. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నా... వంటగదిలో స్టౌ ముందు నిలబడి ఏదైనా వండుతున్నా, బాత్రూమ్కు వెళ్తే, బయటికి రాగానే డోర్ దగ్గరే... వెంట నీడలా వచ్చేది కోడిపిల్ల. వైరి భర్త... అర్థంలో నెరిసిన జుట్టును దువ్వుకుంటూ... ‘కోళ్లమీదున్న ప్రేమ మనుషుల మీదుంటే ఎంత బాగుండునో’ అని బిగ్గరగా గొణుగుతూ... పిచ్చి ఆనందంతో ఈల వేసుకుంటూ... ఓ వెటకారపు చూపును... కోడిపిల్లపై అచలమై విసుర్తూ తిరుగుతున్నాడతను. ఆ రోజు... అతను వీధి గుమ్మం తెరిచి... బైటికి కదుల్తూండగా... ఎప్పటినుండి పొంచి చూస్తోందో పిల్లి మాటేసి... మెరుపులా ఉరికొచ్చి కోడిపిల్లను నోట కరుచుకుని లిప్తలో పరుగుతీస్తూ మాయమైంది. కోడిపిల్ల చావుకేక... అరుపు... దాని నల్లని బూరు... ఈకలు. క్షణంలో... ఏదో బీభత్సం... నేలపై... ఐదారు రక్తపు బొట్లు. దూరమౌతున్న కోడిపిల్ల ఆర్తనాదపు... అరుపు... సన్నగా. అచల దిగ్గున లేచి... పిల్లి పరుగెత్తిన దిక్కు ఉరికింది. కాని లిప్తకాలంలో అంతా అయిపోయింది. ‘‘వెల్డన్. మంచి పనైంది. డర్టీ చిక్...’’ అతనంటున్నాడు... గుమ్మంలో నిలబడి సంతోషంగా నవ్వుతూ అన్నాడు భర్త. పిచ్చి ఆనందం అతనిలో. అచల తలలో ఎందుకో చటుక్కున ఏదో బాంబు పేలినట్టయింది. ఒళ్లూ... మనసూ... హృదయం... కంపించి బ్రద్దలైనట్టుగా ఉంది. అతని వంక... పరమ అసహ్యంగా చూచి... పిచ్చిదానివలె చిర్రెత్తి... పక్కన టీపాయ్ పైనున్న గాజు ఫ్లవర్‌వేజ్‌ను తీసి కోపంతో నేలకేసి కొట్టింది. ఫ్లవర్‌వాజ్ భళ్లున చిట్లి... ముక్కలు ముక్కలై ఎగిసింది. హాలు నిండా గాజు పెంకులే. క్షణకాలం... తల్లికోడి... పిల్లలు నాలుగూ ఒక్కొక్కటి... వరుసగా... కుక్కకు... పిల్లులకు.. బలైపోయాయి. దాడి... నిస్సహాయ జీవులపై బలమైన జంతువుల దాడి. నిర్విరామ దాడి. అన్నీ మనసులో మెదుల్తూండగా... ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది అచలకు. ముఖాన్ని దోసిట్లో దాచుకుని చిన్నపిల్లలా భోరున ఏడ్చింది. మనిషికి దుఃఖం అర్థం కాదు. - పి.అమరజ్యోతి -
క్యాచ్ ఇట్!
స్పెయిన్ రాజకుటుంబం ప్రైవసీకి డ్రోన్లతో తెగ ముప్పొచ్చిపడిందట. రాజ కుటుంబీకుల ఎక్స్‌క్లూజివ్ ఫోటోల కోసం అక్కడి టాబ్లాయిడ్లు డ్రోన్లను ప్రయోగిస్తున్నాయట. భద్రతాపరంగానూ వీటితో ముప్పు ఎదురయ్యే అవకాశాలుండటంతో చివరికి డ్రోన్లను అరికట్టడానికి రెండు డేగలను ఉద్యోగంలో పెట్టుకోవాలని రాజు ఆరో ఫిలిప్ డిసైడయ్యారట. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లను పట్టి నేలకు తేవడంలో రెండు నెలలు ప్రత్యేకశిక్షణ పొందిన డేగలను ఇప్పుడు రాజకుటుంబం రక్షణకు వినియోగిస్తున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ శివార్లలో ఉండే రాజభవనం ‘జర్జుయెలా’ ఇప్పుడిక డేగకన్నుల పహారాలో ఉందన్న మాట.