సినిమా ఎంత బాగా తీసినా సరైన టైంలో రిలీజ్ చేయకపోతే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతలు వరకు పండగల్ని టార్గెట్ పెట్టుకుంటారు. మిగతా ఫెస్టివల్స్ సంగతి అలా పక్కనబెడితే సంక్రాంతి కోసం విపరీతంగా పోటీపడుతుంటారు. గతంలో మహా అయితే రెండో మూడో సినిమాలొచ్చేవి. ఈసారి మాత్రం అరడజనుకు పైగా లైన్‌లో ఉన్నాయి. కట్ చేస్తే గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ పండక్కి రాబోయే సినిమాలేంటి? వాటి లెక్కేంటి?
(ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!)
సంక్రాంతికి అనగానే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కావడం గ్యారంటీ. వచ్చే ఏడాది కూడా మహేశ్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోస్ తమ చిత్రాల్ని బరిలోకి దింపుతున్నారు. మొన్నటివరకు డేట్ చెప్పకుండా ఊరించారు గానీ ఇప్పుడు ఆయా తేదీల్ని కూడా ఫిక్స్ చేసేశారు. అలా అని వీళ్ల ముగ్గురే వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. విజయ్ దేవరకొండ, తేజ సజ్జాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసుకుంది.
- ఫ్యామిలీ స్టార్ - జనవరి 11 (రూమర్ డేట్)
- గుంటూరు కారం - జనవరి 12
- హనుమాన్ - జనవరి 12
- నా సామిరంగ - జనవరి 12 (రూమర్ డేట్)
- ఈగల్ - జనవరి 13
- అయాలన్ - జనవరి 14 (రూమర్ డేట్)
(ఇదీ చదవండి: సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!)
ప్రస్తుతానికి పైన చెప్పిన సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అలానే 'సలార్' డిసెంబరు చివరి వారంలో రానుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేశ్ 'సైంధవ్', నాని 'హాయ్ నాన్న' కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాయని తెలుస్తోంది.
దర్శకనిర్మాతలు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ పైన చెప్పిన వాటిలో ఏయే సినిమాలు సైడ్ అవుతాయనేది ఇప్పుడే చెప్పలేం. మహేశ్ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉంది. నిర్మాతలు సంక్రాంతి అంటున్నారు కానీ చూడాలి. ఒకవేళ పైన చెప్పినవన్నీ సంక్రాంతికే వచ్చినా థియేటర్ల సమస్య పక్కా. కలెక్షన్స్‌పైనా ఘోరమైన ఎఫెక్ట్ పడుతుంది. బహుశా టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో చూసుకుంటే.. సంక్రాంతి రిలీజ్ విషయంలో ఇంత గందరగోళం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్! మరి ఫైనల్‌గా రేసులో నిలిచి గెలిచేది ఎవరో చూడాలి?
(ఇదీ చదవండి: ప్రభాస్ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!)
This time! Sankranthi is going to be full vibrant 🤗#EAGLE 🦅 13th Jan 2024! Theatres lo Kaludham :)))) pic.twitter.com/okV5LOSrgG
— Ravi Teja (@RaviTeja_offl) September 27, 2023
Comments
Please login to add a commentAdd a comment