Saindhav Movie
-
నాన్న ముందే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్
సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రీసెంట్గా సైంధవ్ చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తన నటనతో మెప్పించింది. ఆమె జీవితంలో రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా.. సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2005లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ 'యుగానికి ఒక్కడు' సినిమాతో బాగా పాపులర్ అయింది ఆండ్రియా. ఆ తర్వాత తడాఖా, విజయ్‌తో మాస్టర్, కలహాసన్తో విశ్వరూపం, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన వడచెన్నై వంటి చిత్రాల్లో ఆమె మెప్పించింది. నటిగానే కాకుండా గాయనిగా కూడా మెరిసిన ఆండ్రియా... వివాదాలకు కొదవలేదు. ఆమె అనిరుధ్‌తో ప్రేమ వ్యవహారం, సీనియర్ నటుడితో సన్నిహిత సంబంధం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. 'అప్పట్లో నా వయస్సు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో నేను జీన్స్, టీ-షర్ట్ మాత్రమే ధరించాను. మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గర్లోనే నేనూ కూర్చున్నాను. అప్పుడు ఎవరో లోపల చేయి వేసినట్లు అనిపించింది. నా షర్ట్‌లో ఎవరో చేయి పెట్టారన్న ఊహనే తట్టుకోలేకపోయాను. ఇక వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను.ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటో అర్ధంకాక అప్పుడే ఏడుపు మొదలెట్టాను.' అని ఆండ్రియా చెప్పుకొచ్చంది. తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని ఆండ్రియా పంచుకున్న తర్వాత, అభిమానులు ఆమెను ఓదార్చారు. ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. -
ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు నిర్మాత కుమారుడు
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్‌తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్‌కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. విదేశాలకు నీల్! ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి కుమారుడు నీల్ (ఏ9) విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు. మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌ను కూడా అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. -
ఓటీటీలో సంక్రాంతి సినిమా హవా.. ఒక్క రోజులోనే టాప్‌లో ట్రెండింగ్!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్‌కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండో రోజే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్ ట్రెండ్ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్‌లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 9 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్ సోహైల్ సినిమా 'బూట్ కట్ బాలరాజు' సందడి చేయనున్నాయి. వీటితో పాటు అభినవ్ గోమటం నటించిన కిస్మత్, యశ్ పూరి చిత్రం హ్యాపీ ఎండిగ్, మరో చిత్రం గేమ్ ఆన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో ఈ వారంలో చిన్న సినిమాల హడావుడి ఉండనుంది. దీంతో ఈ వీకెండ్లో ఓటీటీ వైపు సినీ ప్రియులు చూసేస్తున్నారు. ఈ వచ్చే మూడు రోజుల్లో ఏయే సినిమాలు వస్తున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఓటీటీ సినిమాలు కూడా సిద్ధమైపోయాయి. వీటిలో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫర్ఫెక్స్ వెబ్ సిరీస్, మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే వెంకటేశ్ నటించిన సైంధవ్ కూడా స్ట్రీమింగ్కు వస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరో ఈ వీకెండ్ ఓ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే నెట్‌ఫ్లిక్స్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01 లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02 ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 అమెజాన్ ప్రైమ్ డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02 మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02 సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02 (రూమర్ డేట్) హాట్‌స్టార్ మిస్ ఫెర్ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02 సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 మనోరమ మ్యాక్స్ ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02 ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎల్ఎస్డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి-2 -
అఫీషియల్: మూడు వారాల్లోనే ఓటీటీకి సైంధవ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు సందడి చేశాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మిగిలిన మూడు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీ వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. (ఇది చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?) శైలేశ్ కొలను డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. -
సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?
సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ శుక్రవారం దాదాపు 8-10 వరకు తెలుగు చిన్న మూవీస్ అన్నీ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. అలానే రాబోయే రెండు మూడు నెలల్లో పెద్ద చిత్రాలేం లేవు. దీంతో మూవీ లవర్స్ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. కొత్తగా ఏమున్నాయి? సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయని తెగ సెర్చ్ చేస్తున్నారు. 'గుంటూరు కారం' విషయానికొస్తే.. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాకు రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్, రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల ప్రేక్షకులు మరీ అంత కాకపోయినా సరే లైట్ తీసుకున్నారు. మహేశ్ యాక్టింగ్ తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏం లేదని చెప్పొచ్చు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) 'హనుమాన్' విషయానికొస్తే.. మహేశ్ మూవీతో పాటు జనవరి 12న రిలీజైన ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల సమస్య వల్ల తొలివారం పర్లేదు గానీ ఆ తర్వాత కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. లెక్క ప్రకారం థియేటర్లలోకి వచ్చిన మూడు-నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు. కానీ టాక్-రెస్పాన్స్ చూసి ప్లాన్ మారింది. మార్చి 2 లేదా 3వ వారం ఓటటీలోకి రావొచ్చని టాక్. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్'.. ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. కంటెంట్, స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్ని ఇది అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటింంచేశారు. నాగార్జున 'నా సామి రంగ' పెద్దగా అంచనాల్లేకుండా సంక్రాంతి బరిలో దిగి పాసైపోయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ రూమర్ డేట్స్ అయినప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?
మరో వారం వచ్చేసింది. సంక్రాంతి సందడి ముగిసిపోవడంతో ఇప్పుడు చిన్న సినిమాలు క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది. అలానే పండగకి థియేటర్లలోకి వచ్చిన వెంకటేశ్ 'సైంధవ్'.. ఈ వీకెండ్లోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఏ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 04 వరకు) నెట్‌ఫ్లిక్స్ మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29 ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 29 జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 30 నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30 అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31 బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31 ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) - జనవరి 31 WIL (డచ్ సినిమా) - జనవరి 31 ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01 లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02 ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 అమెజాన్ ప్రైమ్ మరిచి (కన్నడ సినిమా) - జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది) డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02 మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02 సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02 (రూమర్ డేట్) హాట్‌స్టార్ కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31 మిస్ ఫెర్ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02 సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 మనోరమ మ్యాక్స్ ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02 బుక్ మై షో అసెడియో (స్పానిష్ సినిమా) - జనవరి 30 జియో సినిమా ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29 (స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
Saindhav OTT: ఓటీటీలోకి వెంకటేశ్ కొత్త సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!?
ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలొచ్చాయి. వాటిలో మహేశ్, వెంకటేశ్, నాగార్జున లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. కానీ ఇవి కాకుండా ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. పండగ విన్నర్‌గా నిలిచింది. మిగతా సినిమాలతో పోలిస్తే వెంకీమామ 'సైంధవ్'.. ఊహించని రీతిలో ఫెయిలైంది. ఇప్పుడుది అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుందట. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను తీశాడు. ఇప్పటి ట్రెండ్ తగ్గట్లు యాక్షన్ విత్ ఫ్యామిలీ సెంటిమెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. 'సైంధవ్' పేరుతో మూవీ తీశారు. విడుదలకు కొన్నిరోజుల ముందు వెంకీ బాగా ప్రమోషన్స్ చేయడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అలా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) సినిమా కాస్త ల్యాగ్ ఉండటంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కరెక్ట్‌గా వర్కౌట్ కావడం.. ఫెయిల్ కావడానికి కారణాలని చెప్పొచ్చు. అలానే జనవరి 12న వచ్చిన 'హనుమాన్'కి సూపర్ హిట్ టాక్.. 'గుంటూరు కారం'కి మిక్స్డ్ టాక్ రావడం కూడా 'సైంధవ్'కి మైనస్ అయిందేమో. ఇలా థియేటర్లలో పూర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట. 'సైంధవ్' మూవీ డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ.. దాదాపు రూ.15 కోట్లకు దక్కించుకుందట. లెక్క ప్రకారమైతే ఫిబ్రవరి నెలాఖరున ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారని, టాక్ తేడా కొట్టేయడంతో నెలలోపే అంటే ఫిబ్రవరి 2 లేదా 9న స్ట్రీమింగ్ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. కొన్నిరోజులు ఆగితే దీనిపై ఓ క్లారిటీ వచ్చేస్తుందిలే! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
ఆ చిత్రంపై సైంధవ్ డైరెక్టర్ ప్రశంసలు!
సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తోన్న చిత్రం రామ్ (RAM). ఈ చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన సైంధవ్ డైరెక్టర్ శైలేశ్ కొలను ప్రశంసలు కురిపించారు. రామ్ ప్రీమియర్ షో చూసిన డైరెక్టర్ శైలేష్ కొలను ప్రత్యేకంగా చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా కథాంశం, అందులోని సోషల్ మెసేజ్ గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాను అద్భుతంగా తీశారని ప్రశంసించారు. ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం బాగుందని కొనియాడారు. చిత్రయూనిట్‌కు మంచి విజయం చేకూరుతుందని శైలేష్ అన్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ షోలతో రామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తోంది. -
జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన హీరోయిన్
అభిమానులు లేనిదే ఏ స్టార్ లేరులే అంటారు. అయితే ఒక్కోసారి స్టార్లను ఆ అభిమానులే ఇబ్బందులకు గురి చేస్తారు. దీనిని మితిమీరిన అభిమానం తెచ్చిపెట్టే తంటా అని కూడా పేర్కొనవచ్చు. ఆండ్రియా ఇటీవల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఆంగ్లో ఇండియన్ బ్యూటీ బహుభాషా నటి మాత్రమే కాకుండా బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణి, ఆండ్రియాలో మంచి నటి, గాయని, రచయిత వున్నారు. ఇక ఎలాంటి పాత్రలో నైనా నటించడానికి రెడీ అనే డేరింగ్ బ్యూటీ ఆమె. ప్రస్తుతం ఈమె నటించిన తమిళ చిత్రం పిశాచి–2 విడుదలకు సిద్ధమవుతోంది. నటిగా రాణిస్తున్న ఆండ్రియా ఇటీవల పొంగల్ సందర్భంగా పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రతి ఏడాది కారైక్కాల్‌లో కార్నివాల్ వేడుకలను నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది పొంగల్ సందర్భంగా గత 14న ప్రారంభమైన ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు జరిగాయి. కార్యక్రమం ముగింపు రోజున నిర్వాహకులు ఆండ్రియాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆమె వేదికపై ఊ అంటావా మామ ఊహూ అంటావా వంటి పాటలను పాడి ఆహూతులను, ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అంటూ అండ్రియాను చుట్టుముట్టారు. దీంతో ఆమె జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సురక్షితంగా అక్కడి నుంచి పంపించేశారు. అయినప్పటికీ అభిమానులు ఆమె వెంట పరుగులు తీశారు. దీంతో ఆండ్రియా కారు వేగంగా దూసుకుపోయింది. ఇలా సెలబ్రిటీలు తమపై వీరాభిమానాన్ని పెంచుకున్న ప్రజలను చూసి గర్వపడాలో లేక ఇలాంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారిని చూసి బాదపడాలో అర్థం కాని పరిస్థితి. -
సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?
ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. రిలీజ్ ముందు వరకు చూసుకుంటే ఎప్పుడు లేనంత రచ్చ ఈసారి జరిగింది. చిన్నా పెద్దా అనే అంతరాలు చేసి మాట్లాడటం, థియేటర్ల కేటాయింపు దగ్గర వివాదం.. ఇలా ఊహించని మలుపులతో ప్లాన్ చేసుకున్న నాలుగు మూవీస్ కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. మరి వీటిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవి ఏవి? ప్రస్తుతం ఎంతెంత కలెక్షన్స్ సాధించాయి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'గుంటూరు కారం'.. అలా అలా ఈసారి వచ్చిన వాటిలో భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోనే దీనికి కారణం. మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయని చెప్పడంతో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. తీరా చూస్తే.. మహేశ్ తన వరకు బాగా న్యాయం చేశాడు. స్వాగ్, డ్యాన్సులు రెచ్చిపోయి మరీ చేశాడు. కానీ కథ, డైలాగ్స్, దర్శకత్వం విషయంలో త్రివిక్రమ్ పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు. దీంతో బెన్ఫిట్ షో అయిపోగానే మిక్స్డ్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు వచ్చిన ప్రకటించుకున్నారు. వసూళ్లు అయితే రావొచ్చేమో గానీ మిగతా విషయాల్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందనేది చాలామంది మాట! హనుమాన్.. ఊహించని సక్సెస్ రిలీజ్‌కి ముందే చిన్న సినిమా అని తక్కువ చేసి చూడటం, థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి వాటివల్ల 'హను-మాన్' సినిమాపై సింపతీ పెరిగింది. ఇక స్టోరీ పరంగా కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. హై ఇచ్చే ఎలిమెంట్స్, దేవుడి సెంటిమెంట్ లాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాయి. సినిమాకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. తెలుగులో థియేటర్ల తక్కువ కావడం వల్ల కలెక్షన్స్ తక్కువ వచ్చుండొచ్చు కానీ లాంగ్ రన్లో మిగతా మూడు సినిమాల కంటే దీనికే ఎక్కువ వస్తాయి. (ఇదీ చదవండి: సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?) సైంధవ్.. అంతంత మాత్రమే విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' సినిమాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే టేకింగ్, యాక్టింగ్ పరంగా పెద్దగా వంకపెట్టడానికి ఏం లేదు గానీ స్క్రీన్ ప్లే కాస్త సాగదీత, స్టోరీలో చిన్నచిన్ పారపొట్లు ఈ చిత్రానికి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. అలానే దీనికంటే ముందు 'గుంటూరు కారం', 'హనుమాన్' రావడంతో ఇక అందరి దృష్టి వాటిపైనే ఉండిపోయింది. దీంతో వెంకీమామని పట్టించుకునేవాళ్లు తక్కువైపోయారు. అయితే ఈ సినిమాకు తొలిరోజు రూ.6 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. నా సామిరంగ.. స్లో పాయిజన్ నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'నా సామి రంగ'. విడుదలయ్యేంత వరకు దీనిపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. బడ్జెట్ కూడా తక్కువే. అలా తాజాగా సంక్రాంతికి రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్ అంటున్నారు. పండగ హడావుడిలో పెట్టిన బడ్జెట్లో ఈ మూవీ సేఫ్ అయిపోవచ్చు.ఈ చిత్రానికి కూడా తొలిరోజు రూ.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక నాలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎలా చూసుకున్నాసరే 'హను-మన్' సంక్రాంతి విన్నర్! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
భారీ ధరకు సైంధవ్ ఓటీటీ రైట్స్.. పోటీపడి మరీ దక్కించుకున్న ఆ సంస్థ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీలైన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ఇప్పటికే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వెంకటేశ్ సైతం సైంధవ్ సినిమాతో పోటీలో నిలిచారు. అయితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. వెంకీమామ చిత్రం ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైంధవ్ ఓటీటీ డీల్ వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పోటీపడి సొంతం చేసుకున్నట్లు నెట్టింట వార్త తెగ వైరలవుతోంది. అయితే సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
‘సైంధవ్’ మూవీ రివ్యూ
టైటిల్: సైంధవ్ నటీనటులు: వెంకటేశ్,నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం: శైలేష్ కొలను సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యార్రి బి.హెచ్ విడుదల తేది: జనవరి 13, 2024 సైంధవ్ కథేంటంటే... ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్, డ్రగ్స్ సరఫరా చేసే డీల్ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అదే సమయంలో ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్ సైకో(వెంకటేష్) తిరిగి చంద్రప్రస్థ టౌన్‌కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్‌లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్)కి సైంధవ్ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఓ సారి స్కూల్లో సడెన్‌గా పడిపోతుంది గాయత్రి. ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్ కుదుర్చుకుంటాడు సైంధవ్. అసలు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్ ఎందుకు ప్రయత్నించాడు? కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భారీ యాక్షన్ సీన్‌తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్‌తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్‌ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్‌తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్లో హీరోకి బుల్లెట్ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా.. కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం? పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్‌కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. డ్రగ్స్ డీల్.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్-డాటర్ సెంటిమెంట్ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో ఫస్టాఫ్‌ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కేవలం యాక్షన్ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు. కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సైంధవ్ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్‌గా కనిపించాడు. వెంకటేశ్ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్ సీన్ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే. ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల స్క్రీన్స్‌పై సైంధవ్ అలరిస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై ట్విటర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకునికి అర్థమైపోయింది. ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. తాజాగా రిలీజ్ కాగా.. నెటిజన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ సీన్స్‌లో ముఖ్యంగా వెంకీమామ ఇరగదీశాడని ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. సెంటిమెంట్స్ సీన్స్ కూడా హార్ట్‌కు టచ్ చేస్తాయని చెబుతున్నారు. ప్రతి సీన్ గూస్బంప్స్ తెప్పిస్తోందని.. ఇంటర్వెల్ ట్విస్ట్ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ⭐⭐⭐/5 Venky mawa before movies tho compare chesthey better story Mainly fights , sankranti Paisa vasool#saindhavreview #Saindhav #venkatesh #Venky75 pic.twitter.com/BSJU3YLBXB — #Gunturkaaram (@renutv9) January 12, 2024 #Saindhav saidhev day... postive talk premieres shows🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aUDtYnrGEo — venkyarjunnaidu (@DukkaNaidu65634) January 13, 2024 Positive reviews Venky mama done & dusted 💥❤️🩹#SaindhavOnJan13th #Saindhav #Venkatesh pic.twitter.com/o4y5Xd7v6f — Bharath (@Bharath_9180) January 13, 2024 #SaindhavReview - ⭐⭐⭐⭐⭐ It's a best movie of #Venkatesh , Lot's of Action, lot of Twist and Turn and Interval is literally mind-blowing. Goosebump 🔥🔥🔥#Saindhav #Venky75 pic.twitter.com/yDMPAMu7no — AMIR ANSARI (@amirans934) January 12, 2024 -
కొన్ని వాటంతట అవే కుదురుతాయి
వివేకానందగారి బయోపిక్‌కి స్క్రిప్ట్ కుదరడం లేదు. నేను, నాని ఓ సినిమా చేయబోతున్నామా అంటే.. నానీతోనే కాదు.. నేను అందరితో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాను. నా తర్వాతి సినిమా కోసం మూడు కథలు విన్నాను. తర్వలో చెబుతాను. ‘‘నా 75వ సినిమా కాబట్టి ‘సైంధవ్’ నాకు స్పెషల్ ఫిల్మ్ అనేం కాదు. నా ప్రతి సినిమా నాకు స్పెషలే. నిర్మాతలు సినిమాకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓ నటుడిగా నేను పారితోషికం తీసుకుంటున్నాను. సో.. నటుడిగా నేను వంద శాతం నిజాయితీగా కష్టపడాలి. ప్రతి సినిమాకు ఇదే చేస్తున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకటేశ్ కెరీర్లో ఇది 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, చైల్డ్ ఆర్టిస్టు సారా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రేపు (శనివారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకటేశ్ చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో నేను చేసిన చాలా సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు ఆడాయి.. కొన్ని నిరాశపరచాయి. ఈ సంక్రాంతికి ‘సైంధవ్’ వస్తోంది. ఓ మంచి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ పండగకి ‘సైంధవ్’తో పాటు వస్తున్న మిగతా సినిమాలు ‘నా సామిరంగ’, ‘గుంటూరు కారం’, ‘హను–మాన్’ కూడా విజయం సాధించాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. అయినా ఓ వారం పోతే సంక్రాంతి సినిమాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. ► ‘సైంధవ్’ కథను శైలేష్ చెప్పినప్పుడు బాగుందనిపించింది. ఓ యాక్టర్‌గా నా పని నేను చేశాను. దర్శకుడిగా తన పని తాను చేశాడు. చైల్డ్ ఆర్టిస్టులతో కలిసి నటించడం నాకు సరదాగా ఉంటుంది. ‘కలిసుందాం..రా’, ‘తులసి’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులతో కలిసి చేశాను. ‘సైంధవ్’లో సారాతో చేశాను. సారా బాగా నటించింది. నవాజుద్దీన్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్. ‘సైంధవ్’లో కథ ముందుకు కదులుతూనే ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంటుంది. ► ప్రత్యేకంగా యాక్షన్ సినిమాలు చేయాలని చేయడం లేదు. ‘బొబ్బిలిరాజా’ సినిమా సమయంలో కొన్ని గాయాలయ్యాయి. ఆ సమయంలో కొన్ని ఫ్యామిలీ సినిమాలు చేశాను. ప్రేక్షకులు ఆదరించారు. అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలూ చేశాను. ఇప్పుడు ‘సైంధవ్’ చేశాను. ఇదంతా జర్నీలో ఓ భాగం. స్పిరిట్చ్యువల్గా చెప్పాలంటే.. మనకి జీవితంలో కొంత అదృష్టం కూడా ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్, సినిమాలు వాటంతట అవే కుదురుతాయి. కొన్నిసార్లు ఓ సినిమా ప్రయాణంలో అది అంతగా ఆడదేమో అనిపిస్తుంది. మంచి సబ్జెక్ట్ లేకపోతే యాక్టర్స్‌గా మేం ఏమీ చేయలేం. కథ కుదరకపోతే పెద్ద కాంబినేషన్స్‌తో కూడిన సినిమాలు కూడా నష్టపోయిన రోజులు ఉన్నాయి. ► 75వ సినిమా, 100వ సినిమా అనేవి నా దృష్టిలో నంబర్స్ మాత్రమే. అలాగే రికార్డ్స్, కలెక్షన్స్ వంటి అంశాల జోలికి వెళ్లను. నా కెరీర్ ఆరంభంలో 98 రోజులు ఆడిన సినిమాలను సడన్‌గా ఆపేసిన ఘటనలు ఉన్నాయి. నేను అంతగా ఏం ఫీల్ కాలేదు. అది నిర్మాతలు, పంపిణీదారుల నిర్ణయం కదా అని అనుకునేవాడిని. ఈ విషయంలో నా అభిమానులు మొదట్లో కాస్త అసహనంగా ఉండేవారు. కానీ నా స్టైల్‌ను వారు అర్థం చేసుకున్నారు. అందుకు వారికి థ్యాంక్స్ ► నేను డిఫరెంట్‌గా చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఇంపాక్ట్ నా సినిమాలపై ఉండదనే అనుకుంటున్నాను. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. యాక్టర్‌గా మనం నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఉండొచ్చు. కానీ నేను తీసుకోను. పాజిటివ్‌గానే ఉంటాను. అప్పుడే మన జీవితంలో మనం సంతోషంగా ఉండగలం. అలాగే నటుడిగా నా సుధీర్ఘమైన కెరీర్లో ఎందుకు వివాదాలు లేవో నాకే తెలియదు. నాకు తెలిస్తే అందరికీ చెబుతాను (నవ్వుతూ). అయితే నా స్కూల్, కాలేజీ, ఇప్పుడు ఇండస్ట్రీ... ఇలా ఎప్పుడైనా నా తోటి వారు నావల్ల అసౌకర్యంగా ఫీల్ కాకూడదని భావిస్తుంటాను. -
75 అనేది నెంబర్ మాత్రమే..ప్రతి సినిమా ప్రత్యేకమే: వెంకటేశ్
దగ్గుబాటి వెంకటేశ్.. ఈ పేరు కంటే విక్టరీ వెంకటేశ్ అంటే చాలు అందరు గుర్తుపడతారు. విక్టరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేశ్. వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది. కానీ.. సొంత ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు అని రుజువు చేశాడు వెంకటేశ్. హీరోగా 74 సినిమాల్లో నటించడమే కాదు..వాటిలో ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక తన 75వ సినిమాగా ‘సైంధవ్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. సైంధవ్ మీ లాండ్ మార్క్ 75వ సినిమా కదా.. ఆ ఒత్తిడి ఏమైనా ఉందా ? నాకు ఆ ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నెంబర్ మాత్రమే. అయితే ఒక కెరీర్ లో 50, 75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్ లా అనుకోవచ్బు. నా వరకూ .. ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. దర్శకుడు శైలేష్ కొలను కథ చెప్పినపుడు మీకు నచ్చిన అంశం ఏమిటి ? చాలా బ్యుటీఫుల్ డాటర్ సెంటిమెంట్ ఉంది. రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. యాక్షన్ చాలా నేచురల్ గా ఉంది. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఇది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. పిల్లలతో కలసి చాలా సినిమాలు చేశారు కదా.. బేబీ సారా నటన ఎలా అనిపించింది ? పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. బేబీ సారాలో స్పార్క్ ఉంది. అద్భుతంగా నటించింది. ‘సైంధవ్’ కథకు సంబంధించి మీరేమైనా సూచనలు చేశారా ? దర్శకుడు శైలేష్ చాలా మంచి కథతో వచ్చారు. ఒకసారి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా టీంతో కలసిపోతాను. సాధారణమైన చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. ఎక్కడైనా మెరుగుపరిచే అవకాశం ఉందనిపిస్తే చెబుతాను. నా దృష్టి మాత్రం నటనపైనే ఉంటుంది. ‘సైంధవ్’లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారని, క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుందని వినిపిస్తోంది ? -సైంధవ్ చాలా మంచి కథ. స్టొరీ నడిచే విధానం చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ ని ఎక్స్ ట్రార్డినరీ గా డిజైన్ చేశారు. హైలీ ఎమోషనల్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఒక కొత్తదనం తీసుకొచ్చాయి. ఈ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్స్ లో స్టేజ్ పై డ్యాన్స్ చేశారు కదా ? నాకు సహజంగానే సౌండ్ వింటే కాళ్ళు ఆడుతాయి. సడన్ గా వాసు పాట వేసేసరికి అలా వచ్చేసింది. ఆ బీట్ అలాంటిది (నవ్వుతూ) ‘సైంధవ్’ పాత్రలో మీ ‘ధర్మచక్రం’ పోలికలు ఉన్నాయా ? లేదండీ. ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్. నవాజుద్దీన్ సిద్ధిఖి గారు ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు.. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? నవాజుద్దీన్ సిద్ధిఖి గారితో పని చేయడం చాలా మంచి అనుభూతి. ఆయన ఎక్స్ ట్రార్డినరీ యాక్టర్. గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ నుంచి ఆయన ప్రయాణం చాలా విలక్షణంగా సాగుతోంది. సైంధవ్ లో చాలా క్రేజీ రోల్ చేశారు. మాములు సీక్వెన్స్ ని కూడా డిఫరెంట్ గా చేసే నటుడు ఆయన. ఇందులో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ‘సైంధవ్’ లో సంగీతంకు ఎంత ప్రాధన్యత ఉంటుంది ? సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. నేపధ్య సంగీతం ఎక్స్ లెంట్ గా ఉంటుంది. రాంగ్ యూసెజ్, సరదాలే పాటలు అద్భుతంగా వచ్చాయి. లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి. 75 సినిమాల కెరీర్ లో ఒక్క వివాదం కూడా లేకుండా మీ ప్రయాణం సాగడం ఎలా సాధ్యమైయింది? అది ఎలా అని తెలుసుంటే అందరికీ చెప్పేవాడిని( నవ్వుతూ). నిజంగా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది. స్కూల్, కాలేజీలో కూడా ఇలానే ఉండేవాడిని. నాని గారితో సినిమా చేస్తున్నారని విన్నాం ? చేద్దాం. అన్నీ చేసేద్దాం (నవ్వుతూ) స్వామి వివేకనంద సినిమా గురించి ? ఆ స్క్రిప్ట్ ఒక లెవల్ వరకు వచ్చింది. ఇద్దరు మేకర్స్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ పై వాళ్ళకి పూర్తి స్థాయి సంతృప్తి రాలేదు. నెక్స్ట్ సినిమా గురించి ? రెండు మూడు కథలు ఉన్నాయి. ఇంకా ఏమీ లాక్ చేయలేదు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. నాలుగు సినిమాలు అద్భుతంగా ఆడాలి. అందరూ ఆనందంగా ఉండాలి. థాంక్ యూ సో మచ్. -
నా పాట తెలిసినంతగా నేను తెలియను: కృష్ణకాంత్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదకొండేళ్ల ప్రయాణం నాది (తొలి చిత్రం ‘అందాల రాక్షసి’). ఇన్నేళ్ల కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. అయితే నా పాటలు తెలిసినంతగా నేనెక్కువగా జనాలకు తెలియదేమో అనిపిస్తుంటుంది. అయినా నేను కాదు.. నా పాటలు వారికి తెలియడం సంతృప్తిగా ఉంది’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. నేడు ఆయన బర్త్‌డే (జనవరి 10). ఈ సందర్భంగా మంగళవారం కృష్ణకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎన్నో పాటలు రాశాను. 2023లో ‘విరూపాక్ష, కోట బొమ్మాళి, హాయ్ నాన్న, సలార్, జైలర్, జవాన్, లియో’.. ఇలా 27 సినిమాల్లో 70 పాటలు రాశాను. సిద్ధార్థ్ ‘చిన్నా’, ‘ది మార్వెల్స్’ చిత్రాలకు పాటలు, మాటలు రాశా. మన పాట వైరల్ కావాలనే ఆలోచనతో రాస్తే సినిమా ఆడినన్ని రోజులు గుర్తుంటుంది.. ఆ తర్వాత మరచిపోతారు. నా ప్రతి పాటలో ఓ భావం, అర్థం ఉండాలనే ఆలోచనతో రాస్తాను. నేను పాటలు రాసిన ‘హను–మాన్’, ‘సైంధవ్’, ‘ఈగల్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాకీ పాటలు రాశాను’’ అన్నారు. -
‘సైంధవ్’ కోసం ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్: డైరెక్టర్
‘‘ఓ ప్రాసెస్‌ను ఫాలో అవుతూ నిజాయితీగా సినిమా తీస్తే, ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ‘సైంధవ్’ను కూడా ఇలాగే తీశాను. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే జయాపజయాల గురించి ఆలోచించే మనస్తత్వం నాకు లేదు. నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను’’ అన్నారు శైలేష్ కొలను. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో శైలేష్ కొలను చెప్పిన విశేషాలు. ► ‘హిట్ 2’ రిలీజ్ తర్వాత నిర్మాత వెంకట్‌గారు చెప్పారని వెంకటేశ్‌గారిని కలిశా. ఆయన్ను కలిసిన తొలిసారి మేం సినిమాలు కాకుండా జీవిత విశేషాలను మాట్లాడుకున్నాం. అలా రెండు మూడుసార్లు కలుసుకున్నాక ఓ సందర్భంలో ఆయనకు ‘సైంధవ్’ స్టోరీ లైన్ చెప్పాను. ఆ తర్వాత పూర్తి కథ చెప్పా. ‘ఈ స్క్రిప్ట్ నా 75వ సినిమాకు సరిపోతుందనిపిస్తోంది. ఈ సినిమా చేద్దాం’ అన్నారు. వెంకటేశ్‌గారి అనుభవం, ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ‘సైంధవ్’ స్క్రిప్ట్‌ను మరింత బాగా రెడీ చేశాను. అలాగే వెంకటేశ్‌గారు చెప్పారని, సురేష్‌బాబుగారికి కూడా కథ వినిపించాను. ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు ► దర్శకుడిగా నేను తొలుత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చేశాను. కానీ ‘సైంధవ్’ ఎమోషనల్ డెప్త్ ఉన్న ఫిల్మ్. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన చిన్నారి కుమార్తె గాయత్రిని (సారా పాత్ర)ని తండ్రిగా సైంధవ్ (వెంకటేశ్ పాత్ర) ఏ విధంగా కాపాడుకుంటాడు? గాయత్రికి కావాల్సిన రూ. 17 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ కోసం ఏ విధంగా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ. వెంకటేశ్‌గారి పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఉంటుంది. కానీ రొటీన్‌గా ఉండదు. ఎంత కొత్తగా డిజైన్ చేశానన్నది థియేటర్స్‌లో చూస్తారు. ► డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో ఇందులో కథ జరుగుతుంటుంది. ఈ కథ సముద్రతీరంలో జరగాలి. వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా ఉండదు. ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేశాం. మేజర్‌గా నైట్ షూట్ చేయాల్సి వచ్చింది. నైట్ షూట్స్ అని వెంకటేశ్‌గారికి ముందే చెప్పాను. బాగా సపోర్ట్ చేశారు. ‘సైంధవ్’ను ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే పార్ట్ 2 చేసే స్కోప్ కథలో ఉంది. ► థ్రిల్లర్స్, యాక్షన్ చిత్రాలే కాదు.. ఓ దర్శకుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నాది ప్రేమ వివాహం. నా జీవితంలో జరిగిన లవ్ మూమెంట్స్‌ను ఓ కథగా రాశాను. తప్పకుండా ఈ సినిమా చేస్తాను. అలాగే నానీగారితో ‘హిట్ 3’ ఉంటుంది. -
ఈ సినిమా ప్రాణం పెట్టి చేసినం..!
-
ఎనర్జిటిక్ స్పీచ్ మాట్లాడిన శ్రద్ధ శ్రీనాథ్..!
-
ప్రతి ఒక్కరి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది
-
Saindhav Pre-Release Event: వెంకటేశ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
సంక్రాంతికి పండగే పండగ
‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సైంధవ్’ చేశాం. సంక్రాంతి పండగకు రిలీజ్ చేస్తున్నాం.. పండగే పండగ.. మీకు(అభిమానులు, ప్రేక్షకులు)నచ్చేలా నా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ కొత్తగా చేశాను. ‘ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఇలా.. అన్ని సినిమాలను ఆదరించిన మీరు ‘సైంధవ్’ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’, ‘సుందరకాండ’, ‘మల్లీశ్వరీ’, ‘గురు’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చాలా చిత్రాల కోసం వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ‘సైంధవ్’ కోసం వచ్చాను. న్యూ ఏజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. శైలేష్ కొలను బాగా చూపించాడు. ప్రేక్షకులు కంటతడి పెట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాకు హీరో సారా పాప. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా పండక్కి ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్’ బాధ్యతని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయన్ను మీరు (ప్రేక్షకులు, అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. నేను కమల్‌హాసన్ గారి అభిమానినని చాలాసార్లు చె΄్పాను. ఇకపై నేను వెంకటేశ్‌గారి అభిమానిని కూడా. నవాజుద్దీన్ గారిని తెలుగుకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన సీనియర్ హీరోలు రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడాలనుకుంటాం.. అలాంటి ఓ సినిమా ‘సైంధవ్’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘బ్రహ్మపుత్రుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు తొలిసారి వెంకటేశ్‌గారిని చూశాను. ‘సైంధవ్’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ఈ వేడుకలో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కెమెరామేన్ మణికందన్ , బేబీ సారా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన బయోపిక్‌లో నటించాలని ఉంది
తెలుగులోకి రావడానికి సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్’తో కుదిరింది. వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఎవరికైనా ఓ డ్రీమ్గానే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో చాలావరకూ ఆయన డూప్ లేకుండా చేశారు. సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా, చాలా సహనంతో ఉంటారు. వెంకటేశ్‌గారి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఆయన చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీస్ చూశాను. వెంకటేశ్‌గారి ‘అనారి’ (‘చంటి’) చిత్రం కూడా చూశాను. ‘సైంధవ్’లో కొంత తెలుగు, కొంత హిందీ మాట్లాడే ఓ హైదరాబాదీ పాత్ర నాది. సెట్స్‌లో నా తొలి రోజు చిత్రీకరణ యాక్షన్‌తో మొదలు కావడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఇక బెస్ట్ మూమెంట్స్ అంటే.. శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం బోట్ పై స్పీడ్‌గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి ఎగిరాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్లోనే ల్యాండ్ అయ్యాను (నవ్వుతూ). ఆ సీన్ సినిమాలో ఉంటుంది. నా నటనకు మరొకరు డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా డైలాగ్స్ నేర్చుకుని ఆ భాషలో డబ్బింగ్ చెప్పడమే ఇష్టం. అప్పుడే నా పాత్రలో ఉన్న ఇంటెన్స్, డెప్త్ తెలుస్తాయి. శైలేష్ చాలాప్రోఫెషనల్ డైరెక్టర్. నటుడిగా నాది సుధీర్ఘమైన ప్రయాణం. శైలేష్ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయమే అవుతోంది. అయితే ఫిల్మ్ మేకింగ్ పరంగా అతనికి ఎంతో విషయ పరిజ్ఞానం, ఉందనిపించింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రోఫెషనల్ ప్రోడక్షన్ హౌస్. ∙టాలీవుడ్ చాలాప్రోఫెషనల్. ఇక రజనీకాంత్‌గారి ‘పేట’ (2019) సినిమా తర్వాత తమిళ, తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చాయి.. కానీ కుదర్లేదు. అప్పుడు ‘పేట’లా ఇప్పుడు ‘సైంధవ్’ సంక్రాంతికే విడుదలవుతుండటం హ్యాపీ. ఇక ఓషోగారి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. -
అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తా: నవాజుద్దీన్ సిద్ధిఖీ
ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘సైంధవ్’ కథ వచ్చింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. ఇలాంటి మంచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర చాలా యూనిక్‌గా ఉంటుంది. వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దాన్ సిద్ధిఖీ. విక్టర్ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. సంక్రాంతి కానుకగా జవవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నవాజుద్దీన్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఓ మంచి కథతో టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్నాను. 'సైంధవ్’ అది కుదిరింది. ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజులు పని చేశాను. నా పాత్ర పట్ల చాలా తృప్తితో ఉన్నాను. చాలా మంచి క్యారెక్టర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ►నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడను. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే చూస్తాను. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం ఉన్న పాత్ర. ► ఈ సినిమాలోని నా పాత్రకు నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. భాషని, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను. ► షూటింగ్ సమయంలో వెంకటేశ్ గారిని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి. ► దర్శకుడు శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో ఉంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రవైజ్ చేశాడు. అవకాశం ఉన్న ప్రతి చోట మెరుగుపరిచాడు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్ళు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకి సంపూర్ణమైన స్పష్టత వుంటుంది. ► ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. శ్రీలంక షెడ్యూల్లో ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను. ఆ సీన్ సినిమాలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ► టాలీవుడ్లో వర్కింగ్ స్టైల్ బాగుంది. ఇక్కడ వర్క్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. సమయపాలన చక్కగా ఉంది.నాని, రానా నాకు మంచి స్నేహితులు. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలని పంచుకున్నాం. ► ఓషో పాత్ర చేయాలని నా కోరిక. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. -
'సైంధవ్'లో ఆ రేంజ్ ఎమోషన్ ఉంది: నిర్మాత వెంకట్
‘‘హిట్’ ట్రైలర్ చూసి, డైరెక్టర్ శైలేష్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. వెంకటేశ్‌గారికి శైలేష్ కథ చెప్పారు. సాధారణంగా వెంకటేశ్‌గారితో సినిమా అంత సులభంగా వర్కౌట్ కాదని, సురేష్‌బాబుగారు కథల విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటారనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ నేను ఇండియాలో విమానం ఎక్కి, అమెరికాలో దిగే సరికి ‘సైంధవ్’ సినిమా ఓకే అయ్యింది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకట్ బోయనపల్లి చెప్పిన విశేషాలు. ► వెంకటేశ్–నానీగార్ల కాంబినేషన్లో మా బ్యానర్లో ఓ సినిమా చేయాలనుకున్నాను.. కుదర్లేదు. మా బ్యానర్లో తొలి సినిమాగా నానీగారు హీరోగా ‘శ్యామ్ సింగరాయ్’ తీశాం. ఇప్పుడు వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్’ను నిర్మించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇక వెంకటేశ్–నానీగార్ల మల్టీస్టారర్ ఫిల్మ్‌కు మంచి కథ కుదిరితే నిర్మించడానికి రెడీగా ఉన్నాను. ► ‘సైంధవ్’ను వెంకటేశ్, సురేష్బాబుగార్లు చూసి, హ్యాపీ ఫీలయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లా హక్కులను సురేష్గారే తీసుకున్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడే భారీ ఖర్చుతో కూడుకున్నది అర్థమై, గ్రాండ్‌గా నిర్మించాం. ‘సైంధవ్’ను చూసే ప్రేక్షకులు దాదాపు గంటసేపు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రేంజ్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంది. ► పాన్–ఇండియా అంటూ కొంత బడ్జెట్ కేటాయించి మరీ ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్‌కు పరిగెడుతున్నారు.ఈ క్రమంలో తెలుగును మర్చిపోతున్నారు. కానీ మేం తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చాం. ‘కాంతార’ వంటి కన్నడ చిత్రాలు ముందుగా మాతృ భాషలో విడుదలై, ఆ తర్వాత ఇతర భాషల్లోనూ హిట్ అయ్యాయి. ప్రస్తుతం నిర్మాతలకు పాన్ ఇండియా మార్కెట్ అంత లాభసాటిగా ఏం లేదు. మా వరకు ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ బాగా జరిగింది. ఈ సంక్రాంతి రేసు నుంచి ‘ఈగల్’ను వాయిదా వేయడం ఆ చిత్రం యూనిట్ గొప్పదనం. -
Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ స్టిల్స్
-
'బుల్లెట్ అలా ఎలా బయటికి వస్తుంది బ్రో'.. ఆ సీన్‌పై సైంధవ్ డైరెక్టర్ క్లారిటీ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్లో ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. ఇందులో ఓ సీన్ అయితే ఏకంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. బుధవారం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌ను తలపించింది. అయితే ఒక్క సెకన్ కూడా చూపించని ఆ సీన్ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ట్రైలర్లో ఓ రౌడీ నోట్లో తుపాకీ పెట్టిన వెంకటేశ్ అతన్ని కాల్చగా.. ఆ బుల్లెట్ ఏకంగా అతని మలద్వారం నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. తల వెనుక భాగం నుంచి రావాల్సిన బుల్లెట్ అలా ఎలా వెళ్లిందటూ నెటిజన్స్ షాకింగ్‌కు గురయ్యారు. అంతే కాకుండా ఆ సీన్‌పై మీమ్స్ ఇక చెప్పాల్సిన పనిలేదు. గ్రాఫిక్స్ చేసి మరీ సీన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వస్తున్న డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. ఆ వీడియోను చూసిన ఆయన చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్ చేశారు. బుల్లెట్ మలద్వారం నుంచి బయటకు వచ్చే విషయమై పూర్తి వివరణ ఇచ్చారు. శైలేశ్ తన ట్వీట్లో రాస్తూ.. 'హాహ్హా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఏ విషయమైనా చెప్పడానికి నేను ఇష్టపడతా. మామూలుగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే బుల్లెట్ తల వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. కానీ ఒక వ్యక్తిని ఒక కచ్చితమైన దిశలో కూర్చోబెట్టి.. గన్ బ్యారెల్‌ను వీలైనంతగా అతడి నోటి లోపలికి పెట్టి.. సుమారు 80 డిగ్రీల కోణంలో కాలిస్తే.. అతని అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్ బయటకు వస్తుంది.' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా.. 'మీరు ఆ బొమ్మలో చూపించినట్లు బుల్లెట్ శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్, కొన్నిసార్లు గుండెను గాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను చీల్చుకుంటూ మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇలా షూట్ చేయడానికి చాలా నేర్పు కావాలి. సైకో స్పెషల్ స్కిల్ ఇది. థియేటర్లో ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే ఈ మాస్ మూమెంట్ క్రియేట్ చేశాం. కానీ మీరు షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది బ్రదర్..' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు డైరెక్టర్ శైలేశ్ వివరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Hahaha this is funny af. Since I like explaining things, let me start this, generally if you shoot someone in the mouth the bullet should exit from the back of the head, but if you make the person sit in a specific angle and shove the barrel of the gun enough into the mouth and… https://t.co/BLrZXrK7Da — Sailesh Kolanu (@KolanuSailesh) January 4, 2024 -
సంక్రాంతికి సైంధవ్ అసలైన ట్రీట్
‘‘సైంధవ్’ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ (ప్రేక్షకులు, అభిమానులు) అందరి ప్రేమ, అభిమానం, ్ర΄ోత్సాహం కావాలి. నా కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాశ్ కీలక ΄ాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సైంధవ్’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ థ్రిల్లర్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘సైంధవ్’తో అది నెరవేరింది. ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి అసలైన ట్రీట్. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ చిత్రం ‘సైంధవ్’ నేను చేయడం నా అదృష్టం. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా ఈ సినిమా కోసం వాడేశా. ఈ పండక్కి మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేయడం నా కల నెరవేరినట్లయింది. మా సినిమా విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
సైంధవ్ మూవీ ట్రైలర్
-
వెంకటేశ్ 'సైంధవ్' ట్రైలర్.. రూ.17 కోట్ల ఇంజెక్షన్ కథే సినిమా!
ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. మిగతా మూవీస్ సంగతి పక్కనబెడితే వెంకటేశ్ 75వ మూవీ 'సైంధవ్' కూడా ఉందండోయ్. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్.. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. అలానే వెంకీ మామని సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేశారు కూడా. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) హీరో ఓ ఫ్యామిలీ మ్యాన్. భార్య-కూతురితో హ్యాపీగా జీవిస్తుంటాడు. తన కూతురు.. 'స్పైనల్ మాస్క్యూలర్ ఎట్రోఫి' అనే అరుదైన వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. దీని నుంచి బయటపడాలంటే రూ.17 కోట్ల విలువైన ఓ ఇంజెక్షన్ పాపకు ఇవ్వాలి. అప్పుడు బతుకుతుంది. అయితే ఈ ఇంజెక్షన్ విలన్ దగ్గర.. విలన్‌కి కావాల్సిన కంటైనర్స్ హీరో దగ్గర ఉంటుంది. చివరకు హీరో.. తన కూతుర్ని బతికుంచుకున్నాడా? లేదా? అనేదే ట్రైలర్ బట్టి అనిపించిన స్టోరీ. ఫ్యామిలీ ప్రేక్షకుల ఫేవరెట్ హీరో వెంకటేశ్.. చాలారోజుల నుంచి సాఫ్ట్ లేదా థ్రిల్లర్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. 'సైంధవ్'లో మాత్రం యాక్షన్‌తో అదరగొట్టేసినట్లు కనిపిస్తుంది. కత్తి, గన్.. ఇలా దేనితో పడితే దానితో విలన్ గ్యాంగ్‌ని చంపుతూ కనిపించాడు. మరోవైపు ఫ్యామిలీ పర్సన్‌గా డిఫరెండ్ షేడ్స్ చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గానే ఉంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
నువ్వు నా వరమే..
‘బంగారమే బంగారమే నువ్వు నా వరమే.. నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే...’ అంటూ మొదలవుతుంది ‘సైంధవ్’ సినిమాలోని ‘బుజ్జి కొండవే..’ పాట. వెంకటేశ్ హీరోగా నటించిన 75వ సినిమా ఇది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య కీలక పాత్రలు పోషించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‘నా ఆయువంతా అందిపుచ్చుకుని నువ్వు చిందులాడవే... బుజ్జికొండవే...’ అంటూ సాంగే ‘బుజ్జి కొండవే..’ పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ఎస్పీ చరణ్ ఆలపించారు. ‘‘తండ్రీ కూతుళ్ల అనుబంధం, వారి ఎమోషన్ ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఈ సినిమాలో వెంకటేశ్ కూతురికి ఆరోగ్య సమస్య ఉంటుంది. తన కూతురిని భావోద్వేగానికి గురి చేయకుండా, తన ఎమోషన్స్‌ని దాచిపెడతాడు. పాపకు తల్లి కాకపోయినా సొంత కూతురిలా చూసుకుంటుంటుంది శ్రద్ధా శ్రీనాథ్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు. -
22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్.. టాలీవుడ్ డైరెక్టర్ భావోద్వేగ పోస్ట్!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రస్తుతం శైలేష్ కొలను ప్రస్తుతం సైంధవ్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హిట్ సినిమాల సిరీస్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టిన శైలేష్ పాన్ ఇండియా చిత్రంతో పలకరించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించనుంది. అయితే తాజాగా సైంధవ్ డైరెక్టర్ చేసిన ట్వీట్ నెట్టంట వైరల్‌గా మారింది. దాదాపు 20 ఏళ్ల క్రిత రిలీజైన సినిమాను చూసిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అదేంటో తెలుసుకుందాం. శైలేష్ కొలను ట్వీట్లో రాస్తూ.. 'అప్పట్లో నేను హైదరాబాద్‌కి మారడం వల్ల మీ సినిమా అభయ్‌ని థియేటర్లలో చూడలేకపోయాను. ఆ సినిమా చూడలేకపోయానన్న బాధ ఇప్పటికీ గుర్తుంది. అయినప్పటికీ మీ నటనకు ప్రేమలో పడిపోయా. అంతే కాదు నా కొడుకుకి అభయ్ అని పేరు పెట్టా. ఎట్టకేలకు రెండు దశాబ్దాల తర్వాత ఈ రోజు థియేటర్లో అభయ్ సినిమా చూడాల్సి వచ్చింది. ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. నేను జీవితాంతం ఆలోచించినా మీకు కృతజ్ఞతలు చెప్పడానికి తగిన పదాలు దొరుకుతాయని నేను అనుకోవడం లేదు. మీరు ఇప్పటికీ అలాగే ఉన్నందుకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. కమల్ హాసన్, రవీనా టాండన్ జంటగా నటించిన ఆళవంధన్(హిందీలో అభయ్) అనే చిత్రం 2001లో విడుదలైంది. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా.. మనీషా కొయిరాలా, శరత్ బాబు, గొల్లపూడి మారుతీ రావు కీలక పాత్రల్లో నటించారు. హిందీలో అభయ్ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ.. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌కి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. కాగా.. డిసెంబర్ 8, 2023న ఈ చిత్రాన్ని మేకర్స్ రీ రిలీజ్ చేశారు. I still remember the heart breaking feeling of not being able to watch #Abhay in theatres as I had just moved to Hyderabad back in the late nineties. Finally after two decades of being in love with Kamal sir’s work and even naming my son as Abhay, I got to watch this movie in the… pic.twitter.com/occMjpyo3O — Sailesh Kolanu (@KolanuSailesh) December 12, 2023 -
దుర్గమ్మను దర్శించుకున్న వెంకీ మామ.. సైంధవ్ 2పై అప్డేట్
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. ఇది ఈయన నటిస్తున్న 75వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం తీసుకుంది. సోమవారం నాడు సైంధవ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన చిత్రయూనిట్ దుర్గమ్మను దర్శించుకుంది. అనంతరం వెంకటేశ్ బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశాడు. వెంకటేశ్ మాట్లాడుతూ.. సైంధవ్ మూవీ కొత్త కథ, కథనంతో తెరకెక్కింది. సినిమాలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండబోతుంది. దర్శకుడు శైలేష్ కథ చెప్పగానే ఒప్పుకున్నాను. హీరోయిన్ శ్రద్ధ చాలా బాగా నటించింది. ప్రేక్షకులు మెచ్చితే సైంధవ్ 2 కూడా తీస్తాము. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నాను. బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. మరిన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తాను అని చెప్పాడు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. హిట్, హిట్ 2 సినిమాల ఘన విజయాల తర్వాత ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను. వెంకటేశ్ 75వ చిత్రం నేను తీయడం చాలా సంతోషంగా ఉంది. ఎవరూ చూడని కొత్త విక్టరీ వెంకటేశ్‌ను మీరు ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారు అని తెలిపాడు. చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ -
'సైంధవ్' ప్రమోషనల్ టూర్ ఫోటోలు
-
సరదా.. సరదాగా...
హీరో వెంకటేశ్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సరదా.. సరదాగా...’ అంటూ సాగే రెండో పాటని నేడు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేసింది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా కలిసి సరదాగా సముద్రపు ఒడ్డున చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందుతోన్న చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ‘రాంగ్ యూసేజ్..’ అనే తొలి పాటకి మంచి స్పందన వస్తోంది. ‘సరదా.. సరదాగా...’ పాట కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: యస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు. -
నాలాంటి స్టూడెంట్స్‌కి సహాయం చేయాలి!
‘‘ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘సైంధవ్’ నా 75వ చిత్రం. యాక్షన్, భావోద్వేగాలు చాలా అద్భుతంగా వచ్చాయి. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. చిత్ర సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రాంగ్ యూసేజ్..’ అంటూ సాగే తొలిపాటని సీఎంఆర్ గ్రూప్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను నకాష్ అజీజ్పాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘కళాశాల దశలో నేను బ్యాక్ బెంచర్‌ని. ఇప్పుడున్న నాలాంటి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులు, అధ్యాపకులు సహకారం అందించాలి. 35 ఏళ్లుగా నా సినీ జర్నీ కొనసాగుతోంది. నా మొదటి చిత్రం విడుదల అప్పటినుంచి ఇప్పుడున్న యువత తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు యువత ఆదరిస్తున్నారు. ఈ తరం వారిని కూడా నా సినిమాలు రీచ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
నా గర్ల్ ఫ్రెండ్ తో నీకెందుకయ్యా: హీరో వెంకటేష్
-
కౌంట్ డౌన్ మొదలుపెట్టిన వెంకీమామ
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఇది వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రం కావడం విశేషం. తాజాగా ‘సైంధవ్’ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘సైంధవ్’. సినిమా విడుదలకు ఇంకా 75 రోజులు ఉంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ సిద్ధం చేశారు. త్వరలో మ్యూజికల్ ప్రమోషన్్స స్టార్ట్ చేయబోతున్నాం’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కిశోర్ తాళ్లూరు, కెమెరా: యస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
సైంధవ్ మూవీ టీజర్
-
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
సైంధవ్ టీజర్.. సైకోగా మారిపోయిన విక్టరీ వెంకటేశ్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. తాజాగా సైంధవ్ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ భారీ యాక్షన్ మోడ్‌లో సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీకి అడ్డొచ్చిన వారందరిని దారుణంగా చంపేస్తూ కనిపించాడు. దీంతో సైకోగా మారిన వెంకటేష్ ఎంట్రీ టీజర్లో అదుర్స్ అనిపించేలా ఉంటుంది. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టీజర్లో కొన్ని షాట్స్ గూస్‌బంప్స్‌ను తెప్పిస్తాయి. వెంకటేశ్ చేతికి కత్తి, గన్ ఏది దొరికితే అది అన్నట్లుగా శత్రు సంహారం చేశాడు వెంకీ. ఈ టీజర్లో చాలా పవర్‌ఫుల్‌గా వెంకటేశ్ కనిపించాడు. ఈ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతికి కానుకగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
సలార్ ఎఫెక్ట్.. వెంకటేశ్ 'సైంధవ్' విడుదలలో మార్పులు
వెంకటేశ్ హీరోగా 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలలో మార్పు చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) క్రిస్మస్ కానుకగా ఈ మూవీని డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ అప్పుడు ప్రభాస్ సలార్ విడుదల కానున్న విషయం తెలిసిందే. అందువల్ల సైంధవ్ విడుదల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సైంధవ్’ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో గాయత్రి అనే పాత్రను బేబీ సారా పోషిస్తోంది. ఇందులో ఆమె రోల్ ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’గా ఉంటుందని మేకర్స్ చెప్పారు. సైంధవ్‌లోని లోతైన భావోద్వేగానికి ఈ పాప ప్రతిరూపం. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్‌తో తెలిపారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేష్ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్ అందిస్తున్నారు. -
టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!
సినిమా ఎంత బాగా తీసినా సరైన టైంలో రిలీజ్ చేయకపోతే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతలు వరకు పండగల్ని టార్గెట్ పెట్టుకుంటారు. మిగతా ఫెస్టివల్స్ సంగతి అలా పక్కనబెడితే సంక్రాంతి కోసం విపరీతంగా పోటీపడుతుంటారు. గతంలో మహా అయితే రెండో మూడో సినిమాలొచ్చేవి. ఈసారి మాత్రం అరడజనుకు పైగా లైన్లో ఉన్నాయి. కట్ చేస్తే గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ పండక్కి రాబోయే సినిమాలేంటి? వాటి లెక్కేంటి? (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) సంక్రాంతికి అనగానే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కావడం గ్యారంటీ. వచ్చే ఏడాది కూడా మహేశ్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోస్ తమ చిత్రాల్ని బరిలోకి దింపుతున్నారు. మొన్నటివరకు డేట్ చెప్పకుండా ఊరించారు గానీ ఇప్పుడు ఆయా తేదీల్ని కూడా ఫిక్స్ చేసేశారు. అలా అని వీళ్ల ముగ్గురే వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. విజయ్ దేవరకొండ, తేజ సజ్జాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫ్యామిలీ స్టార్ - జనవరి 11 (రూమర్ డేట్) గుంటూరు కారం - జనవరి 12 హనుమాన్ - జనవరి 12 నా సామిరంగ - జనవరి 12 (రూమర్ డేట్) ఈగల్ - జనవరి 13 అయాలన్ - జనవరి 14 (రూమర్ డేట్) (ఇదీ చదవండి: సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!) ప్రస్తుతానికి పైన చెప్పిన సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అలానే 'సలార్' డిసెంబరు చివరి వారంలో రానుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేశ్ 'సైంధవ్', నాని 'హాయ్ నాన్న' కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాయని తెలుస్తోంది. దర్శకనిర్మాతలు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ పైన చెప్పిన వాటిలో ఏయే సినిమాలు సైడ్ అవుతాయనేది ఇప్పుడే చెప్పలేం. మహేశ్ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉంది. నిర్మాతలు సంక్రాంతి అంటున్నారు కానీ చూడాలి. ఒకవేళ పైన చెప్పినవన్నీ సంక్రాంతికే వచ్చినా థియేటర్ల సమస్య పక్కా. కలెక్షన్స్పైనా ఘోరమైన ఎఫెక్ట్ పడుతుంది. బహుశా టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో చూసుకుంటే.. సంక్రాంతి రిలీజ్ విషయంలో ఇంత గందరగోళం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్! మరి ఫైనల్‌గా రేసులో నిలిచి గెలిచేది ఎవరో చూడాలి? (ఇదీ చదవండి: ప్రభాస్ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!) This time! Sankranthi is going to be full vibrant 🤗#EAGLE 🦅 13th Jan 2024! Theatres lo Kaludham :)))) pic.twitter.com/okV5LOSrgG — Ravi Teja (@RaviTeja_offl) September 27, 2023 -
ప్రభాస్ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్ హీరోలు
సలార్ టీజర్‌లోని కొన్ని పదాలలో ‘సింపుల్ ఇంగ్లిష్ - నో కన్ఫ్యూజన్’ మొదటిది. అయితే, ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీ నుంచి అన్నీ కన్ఫ్యూజన్ అని ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో సినిమా విడుదల అని చెప్పి చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో చాలా సినిమాలు తేదీని ఎంచుకోవడానికి దారితీసింది. దీంతో సలార్ విడుదల కావాల్సిన రోజుకు స్కంద,చంద్రముఖి-2 వచ్చేశాయి. అయితే తాజాగా సలార్ చిత్రం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతుందని వార్తలు బలంగా వస్తున్నాయి. సలార్ డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సలార్ వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఒకవేళ 'సలార్' డిసెంబర్ 22న విడుదలైతే.. ముందే ఆరోజును టార్గెట్ చేసుకున్న సినిమాల విడుదల తేదీలు మార్చాల్సి వస్తుంది. ఈ సినిమా నిర్మాతలు వేరే తేదీ కోసం మళ్లీ వెతుక్కోవాలి. ఎప్పటి నుంచో క్రిస్మస్ సెలవుల్లో తమ సినిమాలను విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. (ఇదీ చదవండి: దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్) డిసెంబర్ 21, 22, 23 తేదీలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందస్తు ప్రణాళికలు పెట్టుకున్నారు. తాజాగా డైనాసర్ సడన్ గా విడుదల తేదీని డిసెంబర్ 22 అని ప్రకటిస్తే వాటి పరిస్థితి ఏంటి అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఈ అంశంపై సలార్ మేకర్స్‌పై భారీ విమర్శలు వస్తున్నాయి. సినిమా వాయిదా పడుతుంది అని చెప్పడానికి సు డిసెంబర్21న నాని- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' విడదల అవుతుందని ఆ చిత్ర నిర్మాణ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. డిసెంబర్ 22న, వెంకటేష్ 'సైంథవ్' కూడా లైన్లో ఉంది. డిసెంబర్ 23న నితిన్- వక్కంతం వంశీ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' విడుదల కానుంది. ఇలా ఈ మూడు సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ముందే ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు సలార్‌పై వస్తున్న వార్తల వల్ల ఈ చిత్రాల నిర్మాతల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. సలార్ సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో మేకర్స్ చాలా అలసత్వం వహిస్తున్నారనే చెడ్డపేరు ఉంది. (ఇదీ చదవండి: ప్రియమణిపై మరో రూమర్స్.. జీర్ణించుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్) ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా కనీసం ఇప్పటికీ సలార్ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎందుకని సంక్రాంతికి 'సైంథవ్' చిత్రాన్ని విడుదల చేయాలని వెంకటేశ్ ప్లాన్ చేస్తున్నారట. సలార్ మేకర్స్ నిర్ణయాల వల్ల ప్రభాస్‌తో పాటు ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైన సలార్ మేకర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడటం తప్ప చేసేది ఏం లేదు. -
శ్రీలంకలో సైంధవ్
వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ కొత్త షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ కీలక షూటింగ్ షెడ్యూల్ శ్రీలంకలో జరుగుతోంది. ‘‘వెంకటేష్ కెరీర్లో 75వ మైలురాయిగా ‘సైంధవ్’ రూపొందుతోంది. శ్రీలంక షెడ్యూల్లో భాగంగా ముఖ్యమైన టాకీ భాగంతో పాటు ఇంటె¯Œ ్స యాక్షన్ బ్లాక్, ఒక పాట కోసం కొన్ని మాంటేజ్‌లు చిత్రీకరిస్తున్నాం. వెంకటేష్‌తో పాటు ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా, జయప్రకాశ్.. ఇలా ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘సైంధవ్’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న విడుదల చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం(వెంకట్). -
కథను మలుపుతిప్పే రోల్స్.. పాపే ప్రాణంగా రానున్న సినిమాలు
కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్‌కి ఏజ్‌తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంరక్షకుడు? ‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఆఫ్ సైంధవ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. హాయ్ నాన్న తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది. గరుడ సాహసాలు ‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
వెంకటేశ్ చిత్రంలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలో మరో హీరో నటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి) ఆ హీరోకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఆర్య ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్లో ఆర్య లుక్ ఫ్యాన్సను తెగ ఆకట్టుకుంటోంది. తుపాకీ చేతపట్టి ఆర్య నడుస్తూ కనిపిస్తోన్న లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. కాగా.. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 22న సైంధవ్ విడుదల కానుంది. (ఇది చదవండి: రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!) Meet the talented @arya_offl as MANAS from #SAINDHAV 🔥#SaindhavOn22ndDEC @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @maniDop @Garrybh88 @tkishore555 @NeerajaKona @artkolla @UrsVamsiShekar #Venky75 pic.twitter.com/6TlHJGGQRy — Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2023 -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
యాక్షన్.. ఎమోషన్
వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా కీలక పాత్రలు చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా యూనిట్ వెంకటేష్ లుక్‌ని రిలీజ్ చేసింది. ‘‘వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతోంది. హీరోతో పాటు ఎనిమిది మంది ముఖ్య నటీనటులపై 16 రోజుల్లో కీలకమైన హై యాక్షన్– ఎమోషనల్ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్వైజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా: ఎస్.మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్). -
వెంకటేశ్ 'సైంధవ్' హార్ట్ ఎవరంటే..?
సైంధవ్ హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ మాటకొస్తే సైంధవ్ హార్ట్ ఎవరు? అంటే... బేబీ గాయత్రి. సైంధవ్, గాయత్రిల అనుబంధం ఎలాంటిదో ‘సైంధవ్’ చిత్రంలో చూడాల్సిందే. వెంకటేశ్ టైటిల్ రోల్లో శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో గాయత్రి పాత్ర చేస్తోంది బేబీ సారా. వెంకటేశ్‌తో సారా ఉన్న పొస్టర్ని ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అంటూ సోమవారం విడుదల చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా, నవాజుద్దీన్ సిద్ధిఖ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దక్షిణాది భాషల్లో, హిందీలోనూ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఎస్. మణికందన్. ∙వెంకటేశ్, సారా -
త్వరలో ఫైనల్ మిషన్
మిషన్‌ను పూర్తి చేయడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ మిషన్ (ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
పుష్పరాజ్ తో షారుఖ్ వేంకటేష్ ఫైట్
-
వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. శుక్రవారం (మే 19) నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న వికాస్ వలిక్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో నవాజుద్దీన్ది పవర్ఫుల్ విలన్ రోల్. ‘‘హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకటేశ్ కెరీర్లో 75వ లాండ్ మార్క్ మూవీ ఇది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా (మనోజ్ఞ పాత్రలో) నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహానీ శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ కాగా ‘సైంధవ్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహనిర్మాత: కిశోర్ తాళ్లరు, కెమెరా: ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్) -
పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న ఆండ్రియా
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. హిట్ సిరీస్‌తో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు. కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా ఈ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ అనే పాత్రలో కనిపించనుంది. చేతిలో రివాల్వర్‌తో స్టైలిష్ లుక్‌లో ఆండ్రియా దర్శనమిచ్చింది. కాగా గతంలో ఆమె నాగచైతన్య హీరోగా వచ్చిన తబాఖా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మళ్లీ పదేళ్లకు ఆండ్రియా టాలీవుడ్లో మెరవనుంది. Introducing JASMINE from SAINDHAV 🔥#SaindhavOnDec22 Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/I6L1W5cJjI — Andrea Jeremiah (@andrea_jeremiah) April 28, 2023 -
దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్.. డిసెంబర్ 22న తెలుస్తుంది
క్యాబ్‌లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్ ముగించాలనుకుంది. బాక్స్ ఓపెన్ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ. ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్‌ని విడుదల చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. -
వైజాగ్‌లో వెంకటేశ్ 'సైంధవ్' షూటింగ్
వైజాగ్‌కు మాకాం మార్చింది ‘సైంధవ్’ టీమ్. ‘హిట్’ ఫ్రాంచైజీ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్. తాజా షూటింగ్ షెడ్యూల్ గురువారం వైజాగ్‌లో మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది. -
యాక్షన్ ఎంటర్టైనర్గా 'సైంధవ్'.. తొలి షెడ్యూల్ పూర్తి
వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు వెంకటేశ్ పాల్గొనగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ మంగళవారం వెల్లడించింది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ను కూడా వేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగుకి పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్. మణికందన్, సహనిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
క్రిస్మస్ కానుక
హీరో వెంకటేశ్ సినీ అభిమానులకు, ప్రేక్షకులకు క్రిస్మస్ కానుక ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘సైంధవ్’ ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, వెంకటేశ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇటీవల మొదలైన ఈ లాంగ్ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. నవాజుద్దీన్ సిద్ధిఖి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా:ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం. -
రెమ్యునరేషన్ పెంచేసిన వెంకీ మామ.. పాన్ ఇండియా మూవీకి ఎంతంటే..
టాలీవుడ్ అగ్ర హీరోల్లో విక్టరీ వెంకటేష్ స్టైలే వేరు. ఒకవైపు సోలో హీరోగా రాణిస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ రానుంది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ రోజు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. వెంకీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దగ్గుబాటి హీరో భారీగానే ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం వెంకటేష్ ఏకంగా రూ. 17 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. అంతకు ముందు ఎఫ్3 లో నటించిన వెంకటేష్.. ఆ సినిమాకు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సైంధవ్‌కు మాత్రం మరో రెండు కోట్లు పెంచేసినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేశ్ నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో రానాకు తండ్రిగా నటించాడు. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌తో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం (ఫొటోలు)
-
'నేనిక్కడే ఉంటానురా.. ఎక్కడికెళ్లను .. రమ్మను'.. అదిరిపోయిన గ్లింప్స్
విక్టరీ వెంకటేశ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న మూవీకి సైంధవ్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అంతే కాకుండా వెంకటేశ్ ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. దీంతో విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియా భాషలతో పాటు హీందీలోనూ నిర్మిస్తున్నారు. 'నేనిక్కడే ఉంటానురా.. ఎక్కడికెళ్లను .. రమ్మను' అనే డైలాగ్ వెంకీ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇవాళ విడుదలైన టైటిల్ పోస్టర్ చూస్తే పక్కా మాస్ ఎంటర్టైనర్ను తలపిస్తోంది. టైటిల్ పోస్టర్లో వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. టైటిల్ పోస్టర్లో యాక్షన్ సీన్ల్ భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. వీడియోకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. వెంకటేశ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్. ఈ సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.