అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తా: నవాజుద్దీన్ సిద్ధిఖీ | Nawazuddin Siddiqui Talk About Saindhav Movie | Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తా

Published Sat, Jan 6 2024 4:38 PM | Last Updated on Sat, Jan 6 2024 7:07 PM

Nawazuddin Siddiqui Talk About Saindhav Movie - Sakshi

ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘సైంధవ్‌’ కథ వచ్చింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. ఇలాంటి మంచి  చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర చాలా యూనిక్‌గా ఉంటుంది. వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దాన్‌ సిద్ధిఖీ. విక్టర్‌ వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్‌’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. సంక్రాంతి కానుకగా జవవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా  నవాజుద్దీన్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఓ మంచి కథతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇద్దామనుకున్నాను. 'సైంధవ్’ అది కుదిరింది. ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజులు పని చేశాను. నా పాత్ర పట్ల చాలా తృప్తితో ఉన్నాను.  చాలా మంచి క్యారెక్టర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది.

నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడను. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే చూస్తాను. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం  ఉన్న పాత్ర.

► ఈ సినిమాలోని నా పాత్రకు నేను తెలుగు డబ్బింగ్‌ చెప్పాను. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది.  భాషని, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను.

► షూటింగ్‌ సమయంలో వెంకటేశ్‌ గారిని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.  ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి.

► దర్శకుడు శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో ఉంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రవైజ్ చేశాడు. అవకాశం  ఉన్న ప్రతి చోట మెరుగుపరిచాడు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్ళు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకి సంపూర్ణమైన స్పష్టత వుంటుంది.  

► ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. శ్రీలంక షెడ్యూల్‌లో ఈ ప్రమాదం జరిగింది.  సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను.  ఆ  సీన్ సినిమాలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

► టాలీవుడ్‌లో వర్కింగ్‌ స్టైల్‌ బాగుంది. ఇక్కడ వర్క్‌ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. సమయపాలన చక్కగా ఉంది.నాని, రానా నాకు మంచి స్నేహితులు. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలని పంచుకున్నాం.

► ఓషో పాత్ర చేయాలని నా కోరిక. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement