ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలొచ్చాయి. వాటిలో మహేశ్, వెంకటేశ్, నాగార్జున లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. కానీ ఇవి కాకుండా ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. పండగ విన్నర్‌గా నిలిచింది. మిగతా సినిమాలతో పోలిస్తే వెంకీమామ 'సైంధవ్'.. ఊహించని రీతిలో ఫెయిలైంది. ఇప్పుడుది అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుందట. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు.
విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను తీశాడు. ఇప్పటి ట్రెండ్ తగ్గట్లు యాక్షన్ విత్ ఫ్యామిలీ సెంటిమెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. 'సైంధవ్' పేరుతో మూవీ తీశారు. విడుదలకు కొన్నిరోజుల ముందు వెంకీ బాగా ప్రమోషన్స్ చేయడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అలా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.
(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)
సినిమా కాస్త ల్యాగ్ ఉండటంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కరెక్ట్‌గా వర్కౌట్ కావడం.. ఫెయిల్ కావడానికి కారణాలని చెప్పొచ్చు. అలానే జనవరి 12న వచ్చిన 'హనుమాన్'కి సూపర్ హిట్ టాక్.. 'గుంటూరు కారం'కి మిక్స్‌డ్ టాక్ రావడం కూడా 'సైంధవ్'కి మైనస్ అయిందేమో. ఇలా థియేటర్లలో పూర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట.
'సైంధవ్' మూవీ డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ.. దాదాపు రూ.15 కోట్లకు దక్కించుకుందట. లెక్క ప్రకారమైతే ఫిబ్రవరి నెలాఖరున ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారని, టాక్ తేడా కొట్టేయడంతో నెలలోపే అంటే ఫిబ్రవరి 2 లేదా 9న స్ట్రీమింగ్ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. కొన్నిరోజులు ఆగితే దీనిపై ఓ క్లారిటీ వచ్చేస్తుందిలే!
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment