
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)
రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.
ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?
(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)