
రీసెంట్ టైంలో ఓటీటీల్లోకి(Ott Movies) కొత్త సినిమాలు చాలావరకు నెలలోపే వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడాలు ఉండట్లేదు. మరీ బ్లాక్ బస్టర్ అనుకుంటే నెలన్నర నుంచి రెండు నెలలకు స్ట్రీమింగ్ చేస్తున్నారు.
మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం'తో జీ5 ఓటీటీ సంస్థ.. సరికొత్త పంథాలో వెళ్తోందని చెప్పాలి. ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీల్లో సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. వెంకీ మూవీతో పాటు రీసెంట్ గా 'కింగ్ స్టన్' చిత్రాన్ని ఇలానే రిలీజ్ చేశారు. ఇప్పుడీ లిస్టులోకి 'రాబిన్ హుడ్'(Robinhood Movie) కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
నితిన్, శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ఈ సినిమా.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ఘోరంగా ఫ్లాప్ అయింది. కనీస వసూళ్లు రాక చతికిలపడిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడీ మూవీని మే 4న టీవీ, ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట‍్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)