
రీసెంట్ టైంలో ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. నెలలోపే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా గత నెలలో రిలీజై హిట్ కొట్టిన 'కోర్ట్'(Court Movie) కూడా 28 రోజులకే డిజిటల్ వీక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో హిట్ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)
2023లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా మ్యాడ్. జస్ట్ ముగ్గురు కుర్రాళ్లు.. ఇంజినీరింగ్ కాలేజీలో చేసే అల్లరి నేపథ్యంగా ఫుల్ కామెడీతో తీశారు. ప్రేక్షకులకు అది నచ్చేసింది. దీనికి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) పేరుతో మూవీ తీశారు. ఈ ఉగాదికి థియేటర్లలోకి తీసుకొచ్చారు.
తొలి పార్ట్ అంతా కాకపోయినా సరే ప్రేక్షకులని పర్వాలేదనిపించేలా ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుంచి 'మ్యాడ్ స్క్వేర్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే 28న రావొచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)