థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే! | Tollywood Movies Ott Platform Fixed Before Theatrical Release | Sakshi
Sakshi News home page

Tollywood Movies Ott: రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!

Published Tue, Jan 14 2025 12:51 PM | Last Updated on Tue, Jan 14 2025 1:24 PM

Tollywood Movies Ott Platform Fixed Before Theatrical Release

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇ‍ప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత ఓటీటీకి వస్తే..  మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.

అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్‌ సినిమాలు రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.

గతంలో విడుదలైన మ్యాడ్‌ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్‌ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్‌ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement