భారీ ధరకు తండేల్‌ డిజిటల్ రైట్స్‌.. ఎన్ని కోట్లంటే? | Naga Chaitanya Thandel Movie Ott Rights Sold For Huge Margin | Sakshi
Sakshi News home page

Thandel Movie: భారీ ధరకు నాగచైతన్య మూవీ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

Published Mon, Apr 29 2024 2:49 PM | Last Updated on Mon, Apr 29 2024 2:49 PM

Naga Chaitanya Thandel Movie Ott Rights Sold For Huge Margin

అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో చైతూ కనిపించనున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. తండేల్‌ మూవీ ఓటీటీ డీల్‌ భారీ ధరకు అమ్ముడయ్యాయి. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న తండేల్‌ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement