అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం 'తండేల్'. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
జనవరి 4న రెండో సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నమో నమశివాయ అంటూ సాగే పాటను జనవరి 4వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
కాగా.. తండేల్ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Happy New Year 2025 ✨
Let us begin the year with the divine chants of Mahadev 🔱#Thandel second single #NamoNamahShivaya - The ShivShakti Song out on January 4th at 5:04 PM ❤️🔥
A 'Rockstar' @ThisIsDSP divine trance on @adityamusic 🔥🔊#ThandelonFeb7th pic.twitter.com/WcdhAUxWex— Thandel (@ThandelTheMovie) January 1, 2025
Comments
Please login to add a commentAdd a comment