
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం (Thandel Movie) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లపైనే రాబట్టింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రమే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గానూ నిలిచింది. ఈ చిత్రంలోని బుజ్జి తల్లి, హైలెస్సో హైలెస్సా.. వంటి పాటలు జనాల్ని ఎంతగానో అలరించాయి.
తాజాగా హైలెస్సో హైలెస్సా వీడియో సాంగ్ వచ్చేసింది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను అందంగా చూపించారు. అంతేకాదు, సాయిపల్లవి (Sai Pallavi) నెమలిలా డ్యాన్స్ చేసేది ఈ పాటలోనే! దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా నకశ్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.
తండేల్ సినిమా..
శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. తండేల్ మార్చి 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!
Comments
Please login to add a commentAdd a comment