అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.
అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి.
కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
How did team #Thandel decide on the release date?
With a super fun game...❤🔥
'Tugs of Thandel' out now 💥
▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥
In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#Dhullakotteyala
Yuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024
Comments
Please login to add a commentAdd a comment