Akkineni Naga Chaitanya
-
అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌ను కలిసిన నాగచైతన్య.. ఎందుకంటే?
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తండేల్ చిత్రం సక్సెస్ కావడంతో నాగచైతన్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు చందు మొండేటితో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే విజయవాడ వెళ్లిన నాగచైతన్య ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.కాగా.. తండేల్ చిత్రాన్ని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌గా పాత్రలో కనిపించారు. -
ప్రధానిని కలిసిన అక్కినేని కుటుంబం... మోడీ చేతికి ANR బుక్ (ఫోటోలు)
-
'తండేల్' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
బాక్సాఫీస్ వద్ద తండేల్ మొదటిరోజే భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. దీంతో ఫస్ట్ డే నాడు భారీ కలెక్షన్స్ రాబట్టింది.తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట భారీగా వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బుక్‌మై షోలో మొదటిరోజే సుమారు 2.5 లక్షలకు పైగా ‘తండేల్’ టికెట్స్ సేల్ అయ్యాయి. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రతి గంటకు 10 వేల టికిట్లు అమ్ముడుపోతున్నాయి. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. -
వివాదంలో తండేల్ సినిమా.. రియల్ హీరో వైఎస్ జగన్ అంటూ మత్స్యకార నేతల ఆగ్రహం
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్(Thandel Movie). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మించి మా మత్స్యకారుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మండిపడ్డారు. 22 మందిని పాకిస్తాన్ నుంచి తీసుకువస్తే.. ప్రేమకథ సినిమా తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో రియల్ హీరో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అని కొనియాడారు.మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా నిర్మించి మా మత్స్యకారులు మనోభావాలు దెబ్బతీశారు. ఈ సినిమాలో రియల్ హీరో ఆనాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన 22 మందిని పాకిస్థాన్ జైలు నుంచి తీసుకొని వస్తె.. ప్రేమ కథ సినిమా తీస్తారా..? 22 మంది కుటుంబాలకి ప్రేమ లేదా ఒక్కరికే ప్రేమ ఉంటుందా? వారిని జైలు నుంచి విడుదల చేయడానికి మత్స్యకార నాయకులు కాళ్లు అరిగేలా తిరిగారు అని' మూవీ మేకర్స్‌ను నిలదీశారు.తండేల్ కథపై జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా అంతా కల్పితం. దాదాపు 22 మందిని జైల్లో వేశారు. మత్స్యకార నేతలు ఎంతో కష్టపడి వారిని విడిపించారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరో. ఎక్కడా కూడా ఈ సినిమాలో రియాలిటీ కనిపించలేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను పూర్తిగా వక్రీకరించారు. మత్స్యకారుల జీవితంలో ముడిపడి ఉన్న సెంటిమెంట్స్‌ను బిజినెస్‌గా మార్చుకున్నారు. కేవలం డబ్బు కోసమే ప్రేమకథగా తెరకెక్కించారు. 22 మంది జైలుకు పోతే లవ్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది. 22 మంది జైలుకు వెళ్లితే.. 20 మంది మాత్రమే విడుదలయ్యారు. వీళ్లను విడిపించేందుకు కష్టపడిన మత్స్యకార నేతలు, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరోలు అని' కొనియాడారు -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్‌ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్ -
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్‌ని విక్రమ్ కె. కుమార్‌గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్‌లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్‌గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్‌గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్‌ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్‌లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్‌లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
నాగచైతన్య తండేల్.. నిజమైన తండేల్ రాజ్‌ను చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ మూవీతో(Thandel Movie) ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ఈ చిత్రాన్ని యధార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. కొందరు భారత జాలర్లు పాక్ భూభాగంలోకి పొరపాటున వెళ్లడంతో వారందరినీ పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తండేల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్)ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కూడా సినిమాలో అవకాశం ఇస్తే బాగుంటుందని తండేల్ రామారావు అన్నారు. తండేల్-2 లోనైనా నాకు ఏదైనా పాత్ర ఇచ్చినా ఫర్వాలేదని ఆయన అన్నారు. దీనికి తండేల్ రాజు భార్య మాట్లాడుతూ.. మీరు మళ్లీ పాకిస్తాన్ వాళ్లకి దొరికితేనే సాధ్యం అంటూ ఫన్నీగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #Thandel Part 2 రావాలంటే.. నువ్వు మళ్ళీ పాకిస్థాన్ కి దొరకాలి 🤣 Real Bujji Talli to Real ThandelRaju pic.twitter.com/z9k2njOxdl— Rajesh Manne (@rajeshmanne1) February 2, 2025 -
'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
'తండేల్'(Thandel) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాలతో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిబ్రవరి 1 శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Allu Arjun) వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి క్షణంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 'ది ఐకానిక్ తండేల్ జాతర'ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఒక పోస్టర్‌ను సోషల్‌మీడియాలో మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఆదివారం నాడు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతామని తెలిపారు. ఈ పాలి యాట గురితప్పేదే లేదంటూ సినిమా డైలాగ్‌ను కూడా అందులో చేర్చారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్‌తో పాటు తండేల్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025 -
శోభిత-నాగచైతన్య జంట.. పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరో నాగచైతన్య గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి కోసం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగానే వేదికను ఏర్పాటు చేశారు. హీరో వెంకటేశ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు.పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు చైతూ, శోభిత. ఈ పొంగల్ వేడుక ఫోటోలను శోభిత ఇన్ స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. భోగిమంటతో పాటు ముగ్గులు వేసిన ఫోటోలను పంచుకుంది. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా శోభిత సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.కాగా.. నాగ చైతన్య, శోభిత ధూళిపాల 2022 నుంచి రిలేషన్లో ఉన్నారు. గతేడాది ఆగస్టు 8న ఈ జంట హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత డిసెంబర్లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తండేల్‌లో నాగ చైతన్య..ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
శోభితతో ప్రేమ గురించి తొలిసారి నోరు విప్పిన నాగ చైతన్య
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లవ్బర్డ్స్ని ఇంటర్వ్యూ చేసి, వారి ప్రేమ ప్రయాణం గురించి ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్ చేసింది. దీంతో న్యూయార్క్ టైమ్స్ కథనం వైరల్‌గా మారింది.ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శోభితతో తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని పెంచుకోవడానికి గల కారణాలను షేర్ చేశాడు. శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్ చేశాడు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు. ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్‌మీడియా పోస్ట్‌లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసే బ్లర్ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ, గ్లామర్ కోసం, ప్రచారం కోసం పీఆర్ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు. సినిమా షూటింగ్లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా చైతన్య కోరికమేరకు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. -
కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్.. ఒక రేంజ్లో ఉందిగా!
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముచ్చట్లు ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభుతో విడిపోయిన తరువాత నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఎంగేజ్మెంట్, పసుపు కొట్టుడు, హల్దీ, మూడు ముళ్ల వేడుక ఇలా ప్రతీ వేడుక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్‌మీడియాలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.శోభిత పెళ్లికి మేకప్ చేసిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక వైపు ముస్తాబవుతానే.. మరోవైపు బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే అంటూ మాస్ మాస్‌గా స్టెప్పులేయడం ఈ వీడియోలు చూడొచ్చు. " శ్రద్ధా...మేరీ షాదీ హో రహీ హై (నా పెళ్లి అయిపోతోంది) అంటూ సిగ్గుల మొగ్గే అయింది శోభిత. View this post on Instagram A post shared by Shraddha Mishra (@shraddhamishra8) కాగా గత వారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. -
నాగచైతన్య- శోభిత పెళ్లి.. వైరల్‌గా మారిన సమంత పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో అక్కినేని వారి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నాగచైతన్య-శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టడంతో అందరిదృష్టి చైతూ మాజీ భార్య సమంతపై పడింది. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. కొత్త జంటకు విషెస్ చెబుతుందా? మరేదైనా ఉంటుందా? చాలామంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సామ్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఓ రెజ్లింగ్ పోటీలో బాలిక, బాలుడు తలపడుతున్న వీడియోను పంచుకుంది. ఇందులో బాలుడిని ఒక్క పట్టుతో కిందపడేస్తుంది.. అంటే బాలిక పట్టుదల ముందు బాలుడి తలవంచాల్సిందే అన్న అర్థం వచ్చే విధంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ నాగచైతన్య- శోభిత పెళ్లి రోజే చేయడంతో మరింత ఆసక్తిగా మారింది. -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. సతీసమేతంగా హాజరు కానున్న ఐకాన్ స్టార్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇప్పటికే అంతా సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. దీంతో ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు హాజరవుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబసమేతంగా హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కూడా చై వివాహా వేడుకలో సందడి చేయనున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్నిహితులు కూడా హాజరయ్యే అవకాశముంది. ఈనెల 4న అంటే బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వీరి పెళ్లి వేడుక జరగనుంది.కాగా.. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలవ్వగా శోభిత హల్దీ వేడుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మంగళస్నాన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్‌స్టాలో షేర్ చేశారు. -
అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!
మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్‌గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.కుటుంబ ఉమ్మడి నిర్ణయం..ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.తనతో బాగా కనెక్ట్ అయ్యా..శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. -
‘ఫార్ములా’–4 చేదించాడు..
సాక్షి, సిటిబ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ సత్తా చాటింది. టాలివుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీం రేసర్ అఖిల్ అలీ భాయ్ ఫార్ములా 4 విభాగంలో చాంపియన్‌గా నిలిచారు. దీనితో అక్కినేని నాగచైతన్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్ కరీ మోటార్ స్పీడ్వే వేదికగా ఆదివారం జరిగిన ఈ రేసింగ్‌లో చాంపియన్‌గా నిలువగా, లీగ్ 2024లో గోవా ఏసెస్ జేఏ విజేతగా నిలిచింది. చివరి రోజు ఐఆర్ఎల్ రేసులో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా చై ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు. అభిమానులకు ధన్యవాదాలు.. హైదరాబాద్ రేసింగ్ లవర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. నాగచైతన్యతో కలిసి ట్రోఫీ అందుకోవడం మంచి మెమొరీగా మిగిలిపోతుంది. భవిష్యత్తులోనూ రేసింగ్ లీగ్‌కి ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేస్తాను. ఈ విజయం నా కెరియర్ను మలుపు తిప్పుతుంది. – అఖిల్ అలీ భాయ్ఈ సీజన్ చాలా కఠినం.. ఈ సీజన్ రేసింగ్ చాలా కఠినంగా కొనసాగింది. ప్రతి డ్రైవర్‌కి ట్రోఫీ చేజింగ్ లా మారింది. నేను రేసర్‌గా మారడానికి నా కుటుంబం అందించిన సహకారం మాటల్లో వరి్ణంచలేని. పని పట్ల అంకితభావం, ఆత్మస్థైర్యం ఉంటే జెండర్‌తో పనిలేదు. – లారా క్యామ్స్ టారస్, మోటార్స్ స్పోర్ట్స్ వుమెన్ డ్రైవర్ రేసింగ్‌తో మంచి అనుబంధం.. నాకు చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టం. చెన్నైలో ఉన్నప్పటి నుంచే రేసింగ్ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఓనర్‌గా మారినప్పటికీ మన టీం చాంపియన్ షిప్ గెలవడం గర్వంగా ఉంది. మిగతా క్రీడల్లానే భారత్‌లో రేసింగ్ వృద్ధిలోకి రావడంలో మా వంతు కృషి చేస్తున్నాం. ఈ రేసింగ్ ఫెస్టివల్లో వుమెన్ డ్రైవర్స్ పాల్గొనడం, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. నాకు కార్ రేసింగ్ చేయడం మంచి హాబీ.. చిన్నప్పుడు నుంచి ఫార్ములా జీపీ రేసింగ్ అభిమానిస్తూ పెరిగాను. కానీ ఇండియన్ రేసింగ్‌లో పాల్గొనక పోవచ్చు. నా సినిమాల్లో రేసర్‌గా మంచి క్యారెక్టర్ వస్తే కచి్చతంగా చేస్తాను. – అక్కినేని నాగచైతన్య, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఓనర్ -
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నాగార్జున వారసుడు నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం వేడుకగా కుటుంబ సమక్షంలో జరిగింది. అయితే, ఈ జోడీ కలసి ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈమేరకు శోభితా తన ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకున్నారు. పసుపు దంచుతున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, పెళ్లి వేడుక ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది.ఆగష్టు 8న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో వీరి జీవితాలు నిండిపోవాలని కోరుకుంటూ.. 8.8.8.. (ఎనిమిదో తేదీ... ఎనిమిదో నెల... 2024ని కూడితే ఎనిమిది) అనంతమైన ప్రేమకు నాంది అని వారి నిశ్చితార్థం నాడు నాగార్జున తెలిపారు.అడివి శేష్ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన హౌస్‌పార్టీలో నాగచైతన్య, శోభితాలకు తొలిసారి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని టాక్. ‘జోష్’తో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు చేస్తున్న ‘తండేల్’ వరకూ నాగచైతన్య కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభితా ధూళిపాళ్ల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో వేణుగోపాల్ రావు, శాంతాకామాక్షి దంపతులకు జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం.2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత ‘రామన్ రాఘవ్ 2.ఓ’తో నటిగా శోభిత ప్రయాణం హిందీలో మొదలైంది. ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారానూ పాపులర్ అయ్యారు. 2018లో వచ్చిన అడివి శేష్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’లో ఓ లీడ్ రోల్లో నటించారు శోభిత. ‘మేజర్’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ‘మంకీ మ్యాన్’లోనూ నటించారు. ఇక 2017లో నాగచైతన్య–సమంత పెళ్లి చేసుకున్న విషయం, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
పవన్ ఎందుకీ మౌనం?
-
మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం
సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. క్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాతనం, ఇతరుల గోప్యతను గౌరవించాలన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి నిర్లక్ష్యంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే నిజంగా బాధాకరమని ట్వీట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'కొండా సురేఖ గారూ.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా ఉండాలి. సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యంగా నిరాధారమైన కామెంట్స్ చేయడం చూస్తుంటే బాధగా ఉంది. మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. ఒకరినొకరు గౌరవించుకావాలి.. పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సమాజం ఏమాత్రం హర్షించదు' అంటూ పోస్ట్ చేశారు.(ఇది చదవండి: మీలాంటి వారిని చూస్తుంటే అసహ్యమేస్తోంది: కొండా సురేఖపై నాని ఫైర్)కాగా.. అంతకుముందు సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ ప్రముఖులు అంతా ఖండించారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…— Jr NTR (@tarak9999) October 2, 2024 -
సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానంటూ మంత్రి కొండా సురేఖ.. సమంతకు క్షమాపణలు చెప్పారు. ‘‘మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బ తీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అంటూ కొండా సురేఖ ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.— Konda surekha (@iamkondasurekha) October 2, 2024అసలేమైందంటే...! ఈ మొత్తం వివాదం వెనుక ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, దానిపై బీఆర్ఎస్ పేరిట సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌తో బీజం పడింది. అక్కడ జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒక నూలు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు. కొందరు ఈ ఫోటోను పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్ చేశారు. దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖపై ట్రోలింగ్‌కు నిరసనగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, చేనేత కార్మీకులు తెలంగాణ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు. తనను ట్రోల్ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం బాపూఘాట్ వద్ద, గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని.. అలాంటప్పుడు తాను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తానని ప్రశ్నించారు. సినీ నటి సమంత, నాగార్జున కుమారుడు నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని.. ఆయన చాలా మంది హీరోయిన్లను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుని త్వరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి, వాళ్లకూ డ్రగ్స్ అలవాటు చేశారు. వాళ్ల జీవితాలతో ఆడుకునేలా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టారు. వాళ్లను డ్రగ్స్ కేసులో ఇరికించి ఆయన తప్పుకున్నారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి, రహస్యంగా మాట్లాడుకున్న విషయాలను రికార్డు చేసి వాళ్లకు వినిపించేవారు. కేటీఆర్‌పై ఆరోపణలుఆ రికార్డులను అడ్డుపెట్టుకుని బెదిరించేవారు’’ అని కొండా సురేఖ ఆరోపించారు. నిజానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తనను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి, మంత్రి సీతక్క గురించి కూడా గతంలో ఇలాంటి పోస్టులే పెట్టారని.. ఇప్పుడు తనపై పెడుతున్నారని మండిపడ్డారు. తనపై ట్రోలింగ్ చేసినవారు, వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు. దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలుఅయితే, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయాల్లో ఇటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కొండా సురేఖ బుధవారం అర్ధరాత్రి సమంతకు ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగినట్లైంది.👉చదవండి : చౌకబారు రాజకీయం -
అభిమానులతో కలసి ANR హిట్ సినిమా చూసిన నాగచైతన్య
నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరబాద్‌లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్‌తో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైయింది. 31 నగరాల్లో ANR 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.ఈ ఫెస్టివల్లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని హైదరబాద్‌లోని శాంతి థియేటర్లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమాను కోలాహలంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. -
అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ఏఎన్నార్ శత జయంతి వేడుకలు (ఫొటోలు)
-
డైరెక్ట్‌గా ఓటీటీకి శోభిత ధూళిపాళ్ల చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కినేని హీరో నాగచైతన్యతో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం 'లవ్, సితార'. ఈ సినిమాను వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు.చైతూతో ఎంగేజ్మెంట్టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్యతో శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్లో పంచుకున్నారు.A tale of love, heartbreak, and self-discovery! Watch #LoveSitara, premiering on 27th September, only on #ZEE5. #LoveSitaraOnZEE5 pic.twitter.com/zHGnSUmUmr— ZEE5 (@ZEE5India) September 10, 2024 -
నాగచైతన్య బ్లాక్‌బర్డ్స్ జట్టు రేసర్‌కు తొలి స్థానం
చెన్నై: ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా జరిగిన ఎఫ్ఐఏ ఫార్ములా–4 ఇండియా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్ట్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. ఆదివారం చెన్నై నైట్ సర్క్యూట్లో జరిగిన ఈ పోటీల రెండో రౌండ్లో దక్షిణాఫ్రికాకు చెందిన అలీఖాన్ విజేతగా నిలిచాడు. కారులో సాంకేతిక లోపం కారణంగా తొలి రౌండ్ నుంచి అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్న అలీ రెండో రౌండ్లో అంచనాలకు అనుగుణంగా రాణించాడు.గ్రిడ్‌లో నాలుగో స్థానం నుంచి మొదలు పెట్టిన అతను వేగంగా దూసుకుపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు భారత రేసర్లు దివీ నందన్, జేడెన్ పారియట్ను అతను అధిగమించాడు. తొలి రౌండ్లో విజేతగా నిలిచిన హ్యూజ్ బార్టర్ (గాడ్స్పీడ్ కొచ్చి టీమ్) రెండో రౌండ్ క్వాలిఫయింగ్‌లో విఫలమై గ్రిడ్‌లో చివరి స్థానంనుంచి మొదలు పెట్టాడు. చివరకు ఐదో స్థానంతో అతను రేస్‌ను ముగించాడు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌కు యజమానిగా ఉన్నాడు. -
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. తొలిసారి స్పందించిన నాగచైతన్య!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చండు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో మత్స్యకారుని పాత్రలో చైతూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఎన్ కన్వెన్షన్‌పై నాగచైతన్యఅయితే ఇటీవల హైదరాబాద్‌లో తన తండ్రి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఆ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారని ఆరోపణలు రావడంతో అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై నాగార్జున సైతం హైకోర్టును అశ్రయించారు. దీంతో హైకోర్టు వెంటనే స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ పట్టా భూమినే అని.. దీనిపై న్యాయస్థానంలోనే పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే దగ్గరుండి కూల్చేవాడినని నాగార్జున అన్నారు. పెళ్లి వివరాలు త్వరలో చెబుతాతాజాగా ఈ వ్యవహారంపై నాగచైతన్యకు ప్రశ్న ఎదురైంది. నగరంలో హిమాయత్‌నగర్‌లో ఓ షాపు ప్రారంభానికి వెళ్లిన చైతూకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో ఆ టాపిక్ వద్దని చెప్పారు. ఆ విషయంపై నాన్న అన్ని వివరాలు వెల్లడించారని గుర్తు చేశారు. మీ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా.. డెస్టినేషన్ వెడ్డింగ్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాగా.. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయన పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రేసింగ్‌లో అక్కినేని నాగ చైతన్య టీమ్.. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ హీరో అక్కినేని నాగ చైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ‘ఫార్ములా 4’లో భాగమయ్యాడు. ఈ సీజన్‌కు సంబంధించిన రేసులు ఈ నెల 24న మొదలవనున్నాయి. యూత్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరో నాగ చైతన్యకు ఫార్ములావన్ అంటే క్రేజీ! బుల్లెట్లా దూసుకెళ్లే ఈ కారు రేసింగ్‌ను కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా టీవీల్లో చూస్తుంటారు. ఈ ఆసక్తితోనే ఆయన సూపర్ కార్స్, కొత్తకొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లను కొని తన గ్యారేజీలో పెట్టుకుంటారు.సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్‌లో భాగం కావడంతో లీగ్‌పై ప్రేక్షకాదరణ కూడా అంతకంతకు పెరుగుతుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచే రేసింగ్ అంటే ఇష్టం. ఫార్ములావన్ అంటే పిచ్చి. హైస్పీడ్ డ్రామాను ఎంజాయ్ చేస్తాను. ఈ ఫార్ములావన్ క్రేజీతోనే నేను సూపర్ కార్స్, బైక్స్ కొనేలా చేశాయి. నాకు తెలిసి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ కేవలం ఈవెంట్ మాత్రమే కాదు. అంతకు మించిన ఆడ్వెంచర్ కూడా! అందుకే నేను నా అభిరుచి ఉన్న రేసింగ్ క్రీడలో భాగమయ్యాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ మా అంచనాలకు అనుగుణంగా రేసింగ్‌లో దూసుకెళ్తుంది’ అని అన్నారు. నిజానికి రేసింగ్ అంటే అక్కినేని ఇంటికి కొత్తేం కాదు. స్టార్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య రేసింగ్ ప్రేమికుడైతే... ఆయన సోదరుడు ఆదిత్య (అక్కినేని వెంకట్ కుమారుడు) స్వయంగా రేసర్. కొన్నేళ్ల క్రితం ఆదిత్య మోటార్ రేసింగ్ ట్రాక్‌పై పలు రేసుల్లో పాల్గొన్నారు. -
నాగచైతన్యతో ఎంగేజ్మెంట్.. టాప్‌లో శోభితా ధూళిపాళ్ల
అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేవలం వారి రెండు కుటుంబాల మధ్య మాత్రమే నిశ్చితార్థం జరిగింది. దీంతో వారిద్దరి టాపిక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. అయితే, ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల జాబితాలో శోభిత ధూళిపాళ్ల టాప్ ప్లేస్‌కు చేరుకుంది.ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను IMDB (ఇండియన్ మూవీ డేటాబేస్) తాజాగా విడుదల చేసింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నటి శోభిత ఒక్కసారిగా రెండో స్థానంలో నిలిచింది. నాగచైతన్యతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆమె సిద్ధం కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. వారిద్దరి గురించి మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు గూగుల్ సర్చ్ చేశారు.షారూఖ్‌ను దాటేసిన శోభితఐఎండీబీ జాబితా ప్రకారం ఈ వారం ప్రథమ స్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ నిలిచింది. ముంజ్యా మూవీ విజయం తర్వాత ఆమె క్రేజ్ భారీగా పెరిగింది. చైతుతో ఎంగేజ్మెంట్ వల్ల రెండో స్థానంలోకి శోభిత వచ్చేసింది. షారూఖ్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ తర్వాత స్థానాల్లో వరుసగా ఉన్నారు. -
చైతూతో ఎంగేజ్మెంట్.. శోభిత ఎమోషనల్ పోస్ట్!
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నెల 8న ఈ జంట అఫీషియల్‌గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు సినీతారలు, అభిమానులు అభినందనలు తెలిపారు.తాజాగా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.సంతోషంగా ఉందన్నా నాగార్జుననాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
హైదరాబాద్ : కైలాస్, మహిక వివాహ వేడుకలో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
నాగచైతన్య తండేల్ సినిమా టీజర్
-
జర్నలిస్ట్‌గా నాగ చైతన్య.. వరుస హత్యలను ఎలా ఛేదించాడు
అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ 'దూత' డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నేడు (నవంబర్ 23) చైతూ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కె. కుమార్ తాజాగా దూత అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దూతలో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. సమాచార్ అనే దినపత్రికలో సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ నటించాడు. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్ పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనుగొంటాడు. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జర్నలిస్ట్‌గా చైతన్య చేసిన సాహాసాలు ఎలాంటివి..? ఈ క్రమంలో అతని మీదే నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే డిసెంబర్ 1న అమెజాన్‌లో చూడాల్సిందే. -
పిల్లలను దత్తత తీసుకోనున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది. తన ట్రీట్మెంట్లో భాగంగా కొద్దిరోజుల క్రితం భూటాన్‌లో ఆయుర్వేద చికిత్సను తీసుకుంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆమె ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. సమంత హీరోయిన్గా మాత్రమే గుర్తింపు పొందలేదు.. తనలో మంచి సేవాగుణం ఉందని కొందరికే తెలుసు. దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార కొన్నేళ్ల క్రితం ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది. గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందేలా సమంత చూశారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇదంతా తను ఏర్పాటు చేసిన ప్రత్యూష సపోర్టు అనే స్వచ్చంద సహకారంతో ఆమె చేశారు. సమంత సుమారుగా 11 ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతోంది. ఈ సంస్థ మహిళలు, బాలబాలికల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ కారణంగానే సామ్ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎందరో చిన్నారులకు అండగా నిలబడిన సమంత... త్వరలో ఇద్దరు చిన్నారలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలన చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సమంత మాత్రం ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంత పలు కారణాల వల్ల 2021 నుంచి ఆయనతో దూరంగా ఉంటున్నారు. ఐదారేళ్లుగా ప్రేమించుకుని తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ జంట అభిమానులకు భంగపాటు కలిగించింది. వారిద్దరూ విడిపోయాక సమంతపై కొందరు ట్రోల్స్ చేస్తూ ఆమెను క్షోభకు గురిచేశారు. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకోవాలని సమంత తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరిగింది. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని సమంతను వారు సూచించినా ఆమె సున్నితంగా వద్దని చెప్పారట. అలా రెండో పెళ్లి ఆలోచనే లేదని తల్లిద్రండ్రులకు సమంత చెప్పేసిందని ప్రచారం జరిగింది. ఈ విషయం పట్ల కూడా సమంత ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. -
Naga Chaitanya: చై గొప్ప మనసు.. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు బహుమతులు (ఫోటోలు)
-
అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్‌పై రైడ్!
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. చందు మొండేటి డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా నాగచైతన్య తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. అయితే తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీంతో అతని బైక్ నడపడమే కాకుండా.. తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తే వాటిని తన గ్యారేజ్‌లోకి తీసుకురావాల్సిందే. హైదరాబాద్ రోడ్లపై అప్పుడప్పుడు బైక్ రైడ్స్ చేస్తూ కనిపిస్తుంటారు. View this post on Instagram A post shared by Sai (@always__about__akkineni) (ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) -
తాను లెజెండరీ యాక్టర్..!
-
టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?
తన సినీ ఆరంగేట్రం టాలీవుడ్లోనే మొదలైంది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో తెరకెక్కిన మూవీ రంగం ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్‌తో పాటు మలయాళం, తమిళంలోనూ నటించింది. (ఇది చదవండి: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!) ఇంతకీ ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదండీ.. సీనియర్ నటి రాధ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక నాయర్. ఇవాళ తన బర్త్‌డేను పురస్కరించుకుని రాధ షేర్ చేసిన ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇవాళ కార్తీకా బర్త్‌డే కావడంతో కూతురికి స్పెషల్ విషెస్ చెప్పింది సీనియర్ నటి రాధ. తన కూతురి చిన్ననాటి ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా.. రాధ కార్తీకతో పాటు తన పిల్లలైన తులసి, విఘ్నేశ్ ఫోటోలను పంచుకుంది. కార్తీక 1992 జూన్ 27న చెన్నెలో జన్మించింది. ఇవాళ 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బాల్యంలో కార్తీక ఫోటోలు చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్) View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
‘కస్టడీ’ మూవీ ట్వీటర్ రివ్యూ
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కస్టడీ’ సినిమా ఎలా ఉంది? కానిస్టేబుల్‌గా నాగచైతన్య ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. (చదవండి: ఆ విషయం ఓ సవాల్‌గా మారింది : నాగచైతన్య) ‘కస్టడీ’చిత్రానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. నటన పరంగా నాగచైతన్య, అరవింద స్వామి ఇరగదీశారని చెబుతున్నారు. అయితే కథ, కథనం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు ఆకట్టుకునేలా లేవని కామెంట్ చేస్తున్నారు. #Custody One Word Review: This movie has a 50-50 odds of winning at the box office but This gonna be a #NagaChaitanya memorable movie in his career. This remains to be one of the UNDERRATED Movie from tollywood if not recognized today. Mark my words 🔥#CustodyReview… pic.twitter.com/enUNpXNAOK — ReviewMama (@ReviewMamago) May 12, 2023 సినిమా నెమ్మదిగా మొదలై.. ప్రిడిక్టబుల్ నెరేషన్ తో సాగుతుందట ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50ః50 శాతం విజయం సాధించే అవకాశం ఉంది. కానీ నాగచైతన్య కెరీర్లో ఓ మెమరబుల్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Custody Overall a Below Par Action Thriller! Interesting plot point with a few well designed scenes that work but the rest is tiresome. Film is dragged in many places with repetitive actions scenes and narrated in a flat way. BGM is ok but songs are awful. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) May 11, 2023 కస్టడీ ఓవరాల్‌గా బిలో యావరేజ్ పార్ యాక్షన్ థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా సీన్స్ గత సినిమాల్లో చూసినట్టుగా ఉంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. కానీ పాటలు ఆకట్టుకోలేకపోయాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు. #Custody career best acting career best movie 3.789/5 — Vv (@babbar5her_) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody an excellent first half and good second half Overall a must watch movie - 3.25/5 👌 — AkkineniBOupdates (@AkkineniBO) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody First half police station scene 🔥🔥🥳 Second half forest fight 🔥🔥🔥 Kummaru — Toride (@Toride17Toride) May 12, 2023 Just Now Completed My show 🤩 1st Half average, 2nd Half Mathram 💥💥💥 Screenplay +BGM Mamuluga Undav 💥🥵🥵🥵 Chai acting Aithay Un expected💥 Overall ga Block Buster Kotesadu @chay_akkineni Anna 😍#Custody #NagaChaitanya pic.twitter.com/cSd29CzokA — Srinivas (@srinivasrtfan2) May 12, 2023 #CustodyFromTomorrow #CustodyOnMay12 #CustodyMovie #custody 1st half good. It wd have even more gripping but still good 1st half. Chay superb perf 👌 Vennela kishore hilarious 👌 Ilayaraja bgm creates nostalgia 🙏 https://t.co/wmcUQ0NYOk — BayArea MegaFan 💪 (@Twittarodu) May 12, 2023 -
నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తన సొంతం టాలెంట్‌తోనే పేరు సంపాదించాడు. జోష్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు చైతూ. ఆ తర్వాత ఏమాయ చేశావే మూవీతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. (ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల) వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య పోలీస్‌గా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి బాధకరమైన సంఘటనలు లేవు. నాకు ఎదురైన ప్రతి సంఘటన ఏదో ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సినిమాల విషయంలో బాధపడ్డా. వాటిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. ఆ విషయంలో మాత్రం బాధపడుతుంటా. మూడు చిత్రాల విషయంలో అలా జరిగింది.' అని చెప్పుకొచ్చారు. కాగా.. కస్టడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య చివరిసారిగా అమిర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశకు గురి చేసింది. (ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో) -
చివరి షెడ్యూల్ షురూ
‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని శుక్రవారం ప్రారంభించారు. ‘‘నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో మా ‘కస్టడీ’ ఒకటి. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాని ఈ ఏడాది మే 12న విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్, సమర్పణ: పవన్ కుమార్. -
అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్
అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇదే షోలో ఆయనతోపాటు మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'థియేటర్లు పడిపోతున్న సమయంలో ఆయా థియేటర్ల యజమానులు వాటిని పైకి రావాలనుకుంటారు. వాటిని మామూలు స్థితికి తీసుకురావడం, సినిమాలు కొనుక్కోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. దాన్ని భరించలేక ‘థియేటర్లను మీరే రన్ చేయండి.. మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వండి’ అని థియేటర్ల ఓనర్లు నిర్మాతలను కోరారు. అలా మేం వాటిని తీసుకొని కొన్ని కోట్ల రూకపాయలతో మంచిగా తీర్చిదిద్దాం. అన్ని వసతులు ల్పించాం. అలా థియేటర్లను ఆధునికీకరించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మీలాంటి పెద్ద హీరోలకు అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం.' అని తెలిపారు. దీనిపై సురేశ్ స్పందిస్తూ.. దీని వల్ల కొందరికి థియేటర్లు దొరక్కపోవడంతో పలు సందర్భాల్లో విమర్శించారన్నారు. అందరూ కలిసి సినిమాను బతికించారని అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించాలనుందనే తన కోరికను బయటపెట్టారు. -
స్టార్ హీరో కుమార్తెతో నాగచైతన్య.. ఇంతకీ ఎవరో తెలుసా?
అక్కినేని నాగచైతన్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక సామ్‌తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్ లైఫ్‌పై అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరో కుమార్తె నాగచైతన్యతో కలిసి ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అందులో ఆమె ఓ స్పెషల్ ఫుడ్ తయారుచేసి చైతూకు తినిపించింది. ఆ వీడియోకు తెగ లైక్స్, కామెంట్స్‌తో అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరనే కదా మీ సందేహం. ఆ స్టార్ హీరో కుమార్తె మరెవరో కాదండి. విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత దగ్గుబాటి. ఆమె ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల వంటకాలను తన వ్లాగుల్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఈసారి ఆమె ప్రోగ్రామ్‌కు బావా నాగచైతన్య గెస్ట్‌గా హాజరయ్యారు. చైతూతో కలిసి పలు రకాల వంటకాల తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - అక్కినేని నాగ చైతన్య
-
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్‌కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్‌గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్‌లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
రెండు భాషల్లో నాగ చైతన్య ‘దూత’.. అమెజాన్‌లో రిలీజ్
మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది. -
తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి
అచ్యుతాపురం(అనకాపల్లి): అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మితమవుతున్న నూతన చిత్రం షూటింగ్ తంతడి బీచ్‌లో ప్రారంభమైంది. తీరంలోని రెండు కొండల మధ్య ఏర్పాటు చేసిన సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. పది రోజులపాటు కష్టపడి సెట్టింగ్ నిర్మించారు. గురువారం ఉదయం నుంచి షూటింగ్ జరుగుతుందని తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు నాగ చైతన్యను చూసేందుకు తరలివచ్చారు. మరో మూడు రోజులపాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. చదవండి: మహారాజా సుహేల్ దేవ్‌గా రామ్‌చరణ్! -
ఏడేళ్ల తర్వాత జత కడుతున్న చైతూ, పూజా హెగ్డే!
ఒక్కసారి ఏడేళ్లు వెనక్కి వెళదాం. అప్పుడు వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాను గుర్తు చేసుకుందాం. అందులో నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూజ నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. అంతకుముందు తమిళ ‘ముగముడి’ తెలుగు అనువాదం ‘మాస్క్’లో కనిపించారీ బ్యూటీ. ఇక ఏడేళ్ల క్రితం ‘ఒక లైలా కోసం’లో జోడీగా నటించిన చైతూ–పూజ మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం. నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా అనుకుంటున్నారన్నది తాజా టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరి.. చైతూ–పూజా మళ్లీ జంటగా కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్
Bangarraju Movie Wrap The Shooting: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. 'సోగ్గాడు మళ్లీ వచ్చాడు' అనేది సినిమా క్యాప్షన్. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్‌తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన ‘వాసివాడి తస్సాదియ్యా’ ఫుల్ లిరికల్ సాంగ్ విశేషంగా అలరిస్తోంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ 'ఫరియా అబ్దుల్లా' కనువిందు చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. బంగార్రాజు సినిమా షూటింగ్ గురువారంతో (డిసెంబర్ 23) పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో నాగ చైతన్య, కృతీ శెట్టిలపై తీసిన పెప్పీ మాస్ సాంగ్‌తో చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా ‘‘మరో పెప్పీ డ్యాన్స్ నంబర్ రెడీ అవుతోంది. షూటింగ్ చివరి రోజు ఇది. పండగలాంటి సినిమా. ‘బంగార్రాజు’ కమింగ్ సూన్’’ అని గురువారం నాగార్జున ట్వీట్ చేశారు. చైతన్య, కృతీల ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Last day of the shoot!! Another peppy dance number loading.!! పండగ లాంటి సినిమా!! 💥బంగార్రాజు coming soon💥#Bangarraju#BangarrajuComing@chay_akkineni@kalyankrishna_k @iamkrithishetty@anuprubens@AnnapurnaStdios @ZeeStudios_ pic.twitter.com/zq1R2pHjKM — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 23, 2021 ఇదీ చదవండి: బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్.. 'నా కోసం నువ్వు' అంటూ -
సమంత- నాగచైతన్య జంట సొంత సంపాదన ఎంతో తెలుసా?
టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. ఎలాంటి వివాదాలు లేకుండా జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే వృత్తిపరంగా రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సీరీస్‌లో నటిస్తుంది. త్వరలోనే ఈ సీరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగచైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా గతనెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు చై. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చై-సామ్‌ల సంపాదన హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి తర్వాత వీరిద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవల వీరిద్దరు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారట. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. గత పదేళ్ల నుంచి టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సామ్.. ఆస్తులను బాగానే కూడబెట్టిందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ఆమె రెండు స్టార్టప్‌లను కూడా కలిగి ఉంది. వాటిలో ఒకటి ఏకామ్ అనే ఫ్రీ స్కూల్ కాగా, మరొకటి ఫ్యాషన్ లేబుల్ సాకి. వీటి ద్వారా కూడా బాగే సంపాదిస్తుంది సమంత. ఆమెకి రూ.76 లక్షల విలువపై విలాసవంతమైన బీఎమ్‌డబ్ల్యూ కారు కూడా ఉంది. వీటన్నింటితో కలిపి సమంత మొత్తం ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్లోనే ఆయన రూ.40 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం. అలాగే ఖరీదైన కార్లు, బంగ్లాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ జంట సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల విలువ రూ.125కోట్ల వరకు ఉంటుందని సినీ పండితుల అంచనా వేస్తున్నారు. -
‘మనం’ దర్శకుడితో చైతూ కొత్త సినిమా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు హీరో నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించారు. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. దర్శకుడు విక్రమ్ విభిన్న కథను సిద్ధం చేసుకొని దానిని నాగ చైతన్యకు వినిపించగా..కథ ఎంతో నచ్చడంతో ఈ సినిమాకు చైతూ ఓకే చెప్పాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే అక్కినేని కుటుంబం మొత్తంతో విక్రమ్ మనం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలాగే అఖిల్‌తోనూ ‘హలో’ సినిమాను తీశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కినేని వారితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం చైతూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తున్నారు. కరోనావైరస్ లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. అంతేగాక ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన అనంతరం ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవిల మధ్య వచ్చే కొన్ని సీన్లను ఈ మ్యూజికల్ ప్రివ్యూలో ప్రధానంగా చూపెట్టారు. సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్ మంచి పాటను అందించినట్టుగా అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. వేసవిలో విడుదల కానుంది. -
‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు
రియల్ లైఫ్ మామ-అల్లుడు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా వెంకీ మామ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్, నాగచైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే డైరక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర) అభినందనలు తెలిపారు. ‘వెంకటేశ్ తనదైన స్టైల్లో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. చాలా కాలం తర్వాత వెంకటేశ్ యాక్షన్ సీన్స్‌లో వావ్ అనిపించాడు. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా చక్కగా నటించాడు. దర్శకుడు బాబీ తనదైన టేకింగ్, ట్రీట్మెంట్, స్ర్కీన్‌ప్లేతో సినిమాను చక్కగా రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బాబీ, నాగచైతన్యలు ట్విటర్ వేదికగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘వెంకీ మామ గురించి ఇంత అద్భుతమైన మాటలు చెప్పిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఒక అభిమానిగా ఆయన నోటి వెంట ఈ మాటల వినడం.. నా జీవితంలో మరచిపోలేని రోజు’ అని బాబీ ట్వీట్ చేశారు. మహేష్ బాబు కూడా వెంకీ మామ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వెంకటేశ్, నాగచైతన్యల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పారు. తాను ఈ చిత్రంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. కాగా, సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Here's what MEGASTAR Chiranjeevi garu had to say after watching #VenkyMama https://t.co/CAIA3wlzMI#MegastarAboutVenkyMama #BlockbusterVenkyMama #VictoryVenkatesh | @chay_akkineni | @dirbobby | @RaashiKhanna | @starlingpayal | @MusicThaman | @SureshProdns | @peoplemediafcy — Venky Mama (@VenkyMama) December 18, 2019 -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వెంకీమామ
రియల్ లైఫ్ మామ- మేనల్లుడు అయిన హీరోలు వెంకటేశ్- నాగచైతన్య రీల్ లైఫ్‌లోనూ అదే పాత్రలు పోషించిన చిత్రం ‘వెంకీమామ’కు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. కేవలం మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.(వెంకీమామ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Venky Mama gives oxygen to TFI box office, which was dry in last 2 months! #VenkyMama #VictoryVenkatesh, @chay_akkineni, @dirbobby, @SureshProdns @peoplemediafcy @SBDaggubati @vivekkuchibotla @RanaDaggubati pic.twitter.com/FXIl8SeAJD — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) December 16, 2019 -
వెంకీ మామ : మూవీ రివ్యూ
టైటిల్: వెంకీ మామ జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు : వెంకటేశ్, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్, నాజర్, రావు రమేశ్, ప్రకాశ్‌రాజ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గీత, కిషోర్ సంగీతం : థమన్ సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురేళ్ల దర్శకత్వం: బాబీ (కేఎస్ రవీంద్ర) నిర్మాతలు: సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటులు తెరమీద ఆడిపాడి.. అలరిస్తే చూడాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన కాంబినేషన్ విక్టరీ వెంకటేశ్, యువసామ్రాట్ నాగచైతన్య. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లులు. రీల్‌లైఫ్‌లోనూ అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్ సినిమాపై మంచి క్రేజ్ ఉంటుంది. ‘గురు’, ఎఫ్-2 సినిమాలతో మంచి జోష్‌లో వెంకీ, ‘మజిలీ’ సూపర్‌హిట్ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’.. మరీ ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా ఏంటి? తమ అనుబంధంతో ప్రేక్షకులను ఏమేరకు కట్టిపడేశారు? తెలుసుకుందాం పదండి. కథ: రామనారాయణ (నాజర్) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా అన్నట్టు దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేశ్) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్.. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్‌కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? ఇది మిగతా కథ. నటీనటులు: సీనియర్ నటుడు వెంకటేశ్ తెరమీద కనిపిస్తేనే నవ్వులు విరబూస్తాయి. తన మ్యానరిజమ్స్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయంలో దిట్ట ఆయన. మిలటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం పాత్రలో మరోసారి వెంకీ అదరగొట్టాడు. ఫస్టాఫ్ అంతా వెంకీ తన సహాజమైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో గంభీరమైన పాత్రను అంతే అలవోకగా పోషించాడు. అల్లుడు కార్తీక్ పాత్రలో నాగచైతన్య తనదైనశైలిలో చక్కని అభినయం కనబర్చాడు. ‘మజిలీ’లో గంభీరమైన పాత్ర పోషించిన చైతూ.. ఈ సినిమాలో చలాకీ యువకుడిగా, మామకు తగ్గ అల్లుడిగా, ఆర్మీ మేజర్‌గా మెచ్యూర్డ్ ఫర్ఫార్మెన్స్ కనబర్చాడు. వెన్నెల, హారిక పాత్రల్లో పాయల్ రాజపుత్, రాశి కన్నా తమ పరిధి మేరకు నటించారు. సహజంగానే కామెడీ, పాటలు మినహా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాజర్, గీత, ప్రకాశ్ రాజ్, రావూ రమేశ్, కిషోర్, హైపర్ ఆది తమ పాత్రలతో మెప్పించారు. విశ్లేషణ: మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. ఫస్టాప్ అంతా కామెడీతో ఎంటర్టైనర్గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్ అలాగే అనుకోవడం, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్‌ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్, బ్రేకప్ వంటి సీన్లతోపాటు కామెడీతో, పాటలతో ఫస్టాప్ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ సీన్లు బోర్ కొట్టకపోయినా.. సెకండాఫ్‌లో కొంత లాజిక్ తప్పిన విషయాన్ని ప్రేక్షకుడు గుర్తిస్తాడు. సెకండాఫ్ కొంత రోటీన్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందే సినిమాటిక్ క్లైమాక్స్ ఇవన్ని రోటిన్ ఫీలింగ్ కలిగించవచ్చు. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? అంటే సినిమాలో వాటిని నమ్మించేరీతిలో కథను బలంగా చూపించడం కనిపిస్తుంది. ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు. ఏపీ నుంచి కథను అమాంతం కశ్మీర్‌కు తీసుకెళ్లి.. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సీన్లతో కొంత లాజిక్ తప్పినట్టు అనిపించినా.. దర్శకుడు బాబీ తాను అనుకున్న కథను చక్కగా తెరపై చూపించాడు. ప్రసాద్ మురేళ్ల సినిమాటోగ్రఫి బావుంది. కశ్మీర్ అందాలు, అక్కడ తెరకెక్కించిన సీన్లు బావున్నాయి. మిలటరీ నాయుడు పాటతో అదరగొట్టిన థమన్... నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్ అయ్యాడు. డైలాగులు అక్కడక్కడా పేలాయి. సినిమాస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు. బలాలు వెంకటేశ్, నాగచైతన్య నటన ఫస్టాప్, కామెడీ సినిమా నిర్మాణ విలువలు బలహీనతలు సెకండాఫ్ ఒకింత రోటిన్‌గా అనిపించడం సినిమాటిక్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
స్యామ్ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య
స్క్రీన్ మీద చైతూ కనిపిస్తే మైండ్ ఫ్రెష్‌గా అయిపోతుంది! పసి పిల్లాడిలా ఆ నవ్వు చూశారా.. దానికి పడిపోతాం. క్యారెక్టర్ కోసం సీరియస్‌గా ఉంటాడే గానీ, సీరియస్‌గా ఉండే క్యారెక్టర్ కాదు చైతూది. ‘జోష్’ నుంచి ‘మజిలీ’ వరకు పదడుగులు. రెండేళ్ల క్రితం సమంతతో ఏడడుగులు. బ్యూటిఫుల్ జర్నీ అంటాడు. ఆ జర్నీలోని మలుపులు, మేల్కొలుపులు ఈ వారం సాక్షి ఎక్స్‌క్లూజివ్. ఈ నెల 5తో హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు కదా... ఈ పదేళ్ల ప్రయాణం ఎలా అనిపించింది? కచ్చితంగా అందమైన ప్రయాణం అనే చెప్పాలి. విజయాలు, అపజయాలు రెండూ ఉన్నాయి. అయినా బ్యూటిఫుల్ జర్నీ అని ఎందుకు అన్నానంటే... జీవితం విలువ తెలియాలంటే ఈ రెండూ ఉండాలి. నిజానికి పదేళ్ల క్రితం నా ఆలోచనలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. అసలు ఇండస్ట్రీ మనకు కరెక్టా? కాదా? అనే సందేహం ఉండేది. సరే.. ఒక సినిమా చేసి చూద్దాం అనుకున్నాను. ఒక డైలమాలో ‘జోష్’తో కెరీర్ మొదలుపెట్టా. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ పదేళ్లను పది అడుగులు అనుకుంటున్నాను. ఇంకా సాధించడానికి చాలా ఉంది. సినిమా పేరు ‘జోష్’ కానీ రిజల్ట్ అంత జోష్ ఇవ్వలేదు. ఫస్ట్ సినిమాకే అలా జరగడాన్ని ఎలా తీసుకున్నారు? వయసు ప్రభావమో ఏమో కానీ ఆ రిజల్ట్ ఏమాత్రం నన్ను బాధపెట్టలేదు. అప్పుడు నాకు ఓ 23 ఏళ్లు ఉంటుంది. సీరియస్‌నెస్ తక్కువే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం టెన్షన్‌గానే ఉంటుంది. అప్పుడే ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే బావుండేది అనిపిస్తుంటుంది. మీ మాటలు వింటుంటే హీరో అవ్వాలని అంత సీరియస్‌గా అనుకోలేదేమో అనిపిస్తోంది... యాక్టింగ్ మీద ఆసక్తి ఉంది. సీరియస్‌నెస్ కూడా ఉంది. అయితే అది ఇంత పెద్ద బాధ్యత అని మాత్రం అర్థం కాలేదు. తొలి సినిమా చేస్తున్నప్పుడు అంత అవగాహన లేదు. నేనెంత అదృష్టవంతుణ్ణో, ఎంత లక్కీయో ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రావడం రావడమే వారసత్వంగా వచ్చిన అభిమానుల బలం దొరికింది. ఆ విషయం ఫస్ట్ సినిమా అప్పుడు నేను పెద్దగా గ్రహించలేదు. అయితే ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ ఎంత ఫీలవుతారో అర్థం అయింది. తాతగారి వారసత్వం ప్రభావం నా మీద ఎంత ఉంటుందో అర్థం చేసుకున్నాక బాధ్యతగా ఉండాలనుకున్నాను. హీరోగా పది అడుగులు పూర్తి చేశానన్నారు. చిన్నప్పుడు తప్పటడుగులేమైనా..? అవేం గుర్తులేదు. అయితే ప్రతీరోజూ అమ్మ మంచి సలహాలు, సూచనలే ఇస్తుండేవారు. అప్పుడూ ఇప్పుడూ నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు. అమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అరవకుండా, అర్థం అయ్యేలా చెబుతారు. నాన్న కూడా అంతే. ఏ విషయాన్నయినా చాలా తేలికగా చెబుతారు. మనసులో నాటుకుపోయేలా చెబుతారు. స్కూల్లో కంప్లయింట్స్ మీ ఇంటి వరకూ వచ్చేవా? ఒకటా రెండా? చాలా వచ్చేవి. ఎక్కువగా నా చదువు గురించే. చదువులో మనం జస్ట్ యావరేజ్ (నవ్వుతూ). చిన్నప్పటి నుంచి క్రియేటివ్ సైడే ఎక్కువ ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు సంగీతం అయినా, ఇతర యాక్టివిటీస్‌లో అయినా ఎక్కువ పాల్గొనేవాణ్ణి. అందుకే మార్కుల గురించి కంప్లయింట్లు వచ్చేవి. కాలేజీ రోజుల్లో బంక్ కొట్టిన సంఘటనలు... బాగానే బంక్ కొట్టేవాళ్లం. ఎక్కువగా సినిమాలు చూడటానికే. అమెరికా వెళ్లి చదువుకోమని నాన్న అన్నారు. నేనే వెళ్లలేదు. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్స్ చూస్తూ, థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తూ హ్యాపీగా ఉండొచ్చన్నది నా ప్లాన్. అమ్మ మాత్రం ‘నువ్వు ఏం చేసినా ఓకే. నీకు నచ్చిందే చెయ్యి. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ ఉంటే అదే చేద్దువుగానీ.. కానీ డిగ్రీ మాత్రం పూర్తి చేశాకే’ అన్నారు. కాలేజీకి వెళ్లడంతో పాటు యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. షూటింగ్స్‌కి వెళ్లడం అవన్నీ చేసేవాణ్ణి. సినిమా రిలీజ్ ఉంటే కాలేజ్ బంకే. హీరో అవుతానన్నప్పుడు మీ తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) ఏమన్నారు? ఆయన్నుంచి మీరు నేర్చుకున్నది? తాత అయితే ఫుల్ హ్యాపీ. ఆయనెప్పుడూ ఓ స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవారు. నా ఫస్ట్ సినిమా కథ చెప్పినప్పుడు చాలా మంచి కథ. మెచ్యూర్డ్ సబ్జెక్ట్ అన్నారు. చాలా సపోర్ట్ చేశారు. నేను ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటంటే యాక్ట్ చేయడమంటే జీవించడం. ఓవర్‌గా యాక్ట్ చేసేయడం, టూమచ్‌గా ఉండటంలా కాకుండా సహజంగా ఉండాలని తాతగారి సినిమాలు చూసి నేర్చుకున్నాను. తాతయ్య నేచురల్ ఆర్టిస్ట్. మనం బయట ఎలా ఉంటామో, స్క్రీన్ మీద కూడా అలానే అనిపించాలన్నది ఆయన కెరీర్ నుంచి నేను తీసుకున్న విషయం. మరో తాతగారు (రామానాయుడు) నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక బాధ ఏంటంటే తాత బ్యానర్లో (సురేశ్ ప్రొడక్షన్స్) నేను సినిమా చేయలేదు. మొదటి నుంచి కూడా ‘నీ సినిమాని ప్రొడ్యూస్ చేస్తాను. ఏం సినిమా చేస్తావు చెప్పు’ అని రామానాయుడు తాతయ్య అనేవారు. అయితే ఆ చాన్సే రాలేదు. అదొక అసంతృప్తి ఉంది. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏం చేస్తున్నావు? కథేంటి అని అడుగుతుండేవారు. ఈ తాత నుంచి క్రమశిక్షణ వంటివన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్‌లో మీ మావయ్య వెంకటేశ్‌తో ‘వెంకీ మామ’ చేస్తున్నారు కదా.. కానీ మా తాత (రామానాయుడు) సెట్లో ఉండరు కదా. ఆయన ఉండగా సినిమా చేస్తే లొకేషన్లో ఉండేవారు. ఆయన ప్రొడ్యూసర్‌గా, నేను హీరోగా మా కెమిస్ట్రీ ఎలా ఉండేదో ఎక్స్పీరియన్స్ అయ్యేవాణ్ణి. ఆ అనుభూతి జీవితాంతం నిలిచిపోయి ఉండేది. మీరు నటించిన ‘ప్రేమమ్’లో వెంకటేశ్ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేయడం ఎలా ఉంది? ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా మా వెంకీ మామ ఫన్ని చాలా ఇష్టపడతారు. వెంకీ మామతో చేయడం నాకు పెద్ద చాలెంజ్. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. దాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా అనుభవం కావాలి. ఆయనతో యాక్టింగ్‌ని ఎంజాయ్ చేస్తూనే చాలా నేర్చుకుంటున్నాను. వెంకీగారి అభిమానులకు, మా అభిమానులకు ‘వెంకీ మామ’ గ్యారెంటీగా పండగలా ఉంటుంది. మా నాన్నగారితో కూడా మళ్లీ (ఇంతకు ముందు మనం, ప్రేమమ్ చేశారు) చేయబోతున్నారు కదా? ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ లో కలిసి యాక్ట్ చేయబోతున్నాం. త్వరలో అది మొదలవుతుంది. అందులో నాకు, నాన్నకు మంచి పాత్రలు ఉన్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా మీకు అభిమానులను ఇచ్చింది. చాలా గౌరవాన్ని ఇచ్చింది. అలాగే జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. ఆ స్వీట్ మెమొరీస్ ఏమైనా? అవును కరెక్ట్ (నవ్వుతూ). ‘ఏ మాయ చేసావె’ సినిమా చేస్తున్నప్పుడు నేను, స్యామ్ (సమంత) హీరో హీరోయిన్ అన్నట్లు చేశాం. పెద్దగా ఫ్రెండ్స్ కూడా అవ్వలేదు. మా జర్నీ ఇక్కడి వరకూ వస్తుందని అస్సలు ఊహించలేదు. అప్పుడు మేమిద్దరం చాలా యంగ్. ఏం చేస్తున్నామో కూడా సరిగ్గా తెలియదు. నేను గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ కి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే గౌతమ్ డైరెక్షన్లో ‘ఏ మాయ చేసావే’ సినిమా అనగానే ఫుల్ ఖుషీ అయిపోయాను. అదే సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు కావడంతో నా అదృష్టం అనుకొని ఆ సినిమా చేశాను. నాకు ప్రేమకథల వల్ల మంచి గుర్తింపు లభించిందంటే ఆ సినిమా వల్లే. కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ ముందు గొడవ పడి తర్వాత ప్రేమలో పడతారు. స్యామ్, మీ ప్రేమ కథకు అలాంటి టచ్ ఏమైనా ఉందా? పాజిటివ్స్, నెగటివ్స్ ఉన్నాయి. కొన్ని గొడవలు జరిగాయి. అందరూ పడే చిన్న చిన్న గొడవలే. చిన్న చిన్న అపార్థాలు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒక మనిషిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అది చిన్న విషయం కాదు. ప్రతి మనిషి డిఫరెంట్‌గా ఉంటారు. ఏ ఇద్దరి మనసు ఒకలా ఉండదు. గొడవ జరిగితే మంచిదే. దాన్ని పరిష్కరించుకుని ఒకరొనొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. గొడవలు పడుతూ, సాల్వ్ చేసుకుంటూ వెళ్లాలి. అలా వెళితేనే బాండింగ్ బలపడుతుంది. గొడవలు పడినప్పుడు ఎవరు ముందు మాట్లాడతారు? చాలా సందర్భాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ. కొన్ని సార్లు నేనే ఎక్కువ టైమ్ తీసుకుంటాను మాట్లాడటానికి. సమంత వెంటనే వచ్చి మాట్లాడేస్తుంది. నేను రిజర్డ్వ్ టైప్ కాబట్టి కొంచెం సమయం తీసుకుంటానేమో. తక్కువ మాట్లాడే స్వభావం నాది. ఓ మనిషిని అర్థం చేసుకోవాలంటే జీవిత కాలం పడుతుందన్నారు. జీవితం పంచుకున్న మీ ఇద్దరికీ ఇంకా ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందనుకుంటున్నారా? ప్రతీ వారమో, నెలలోనో కొత్త ఓ సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు ఎదుటి మనిషిలో ఇంకో కోణం తెలుస్తుంది. కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడే మన పర్సనాలిటీ ఓపెన్ అవుతుంటుంది. ఇది మాకనే కాదు.. ఎవరి లైఫ్‌లో అయినా కామనే. ఓ కొత్త సమస్య వచ్చినప్పుడో, ఓ మంచి సంఘటన జరిగినప్పుడో.. ఇలా డైలీ లైఫ్‌లో జరిగే విషయాలకు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేదాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి మన మనసత్త్వం అర్థం అవుతుంది. ఆ విధంగా చూస్తే.. లైఫ్ జర్నీలో ఒకర్నొకరు అర్థం చేసుకోవడం అనేది ఓ ప్రాసెస్‌లా జరుగుతుంది. పెళ్లయ్యాక మీ ఇద్దరూ కలిసి చేసిన ‘మజిలీ’ సూపర్ హిట్. మళ్లీ కలసి స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకుంటారు? మళ్లీ కలసి చేయాలని మాకూ ఉంది. విభిన్నమైన కథ దొరికితే తప్పకుండా చేస్తాం. అది కొన్ని నెలల్లోనే జరగచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఏదైనా స్క్రిప్ట్‌ని బట్టే ఉంటుంది. ఈ మధ్య సమంతకు సినిమా అవకాశాలు తగ్గాయేమో అనిపిస్తోంది.. పెళ్లి ప్రభావం ఏమైనా? ఈ రెండేళ్లలో తన కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉందని అనుకుంటున్నాను. ‘రంగస్థలం, మహానటి, మజిలీ, యుటర్న్, ఓ బేబీ’ అన్నీ బెస్ట్ సినిమాలే చేసింది. అన్నీ హిట్ అవడంతో పాటు స్యామ్‌కి మంచి పేరు కూడా వచ్చింది. కొత్తగా వెబ్ సిరీస్ చేస్తోంది. తను పని పరంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్వాంటిటీ (సినిమాల సంఖ్య) తగ్గినా క్వాలిటీ పెరిగింది. స్యామ్ కావాలనే ఆ దారిలో వెళ్లాలనుకుంటోంది. తక్కువ చేసినా మంచి సినిమాలు చేయాలి. అదే ప్రస్తుతం తన గోల్. తను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఒప్పుకుంటే ఎన్ని సినిమాలైనా చేస్తుంది. కానీ ‘ఎక్కువ సినిమాలు’ అనే లెక్క చూసుకోవడంలేదు. మీకు కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి. గైడ్ చేయడానికి ఫ్యామిలీ ఉంది. మంచి లైఫ్ పార్టనర్ కూడా ఉంది. మరి ఆడుకోవడానికి పిల్లలు ఎప్పుడు? (పెద్దగా నవ్వుతూ) టైమ్ వస్తుంది. త్వరలో. పిల్లలంటే మీకు బాగా ఇష్టం కదా? అవును. చాలా చాలా. పిల్లలంటే ప్యూరిటీ. అమ్మానాన్న అడుగుతుంటారా? పిల్లలెప్పుడూ అని? ఒత్తిడిలాంటిది ఏమైనా? హ.. హ.. హ.. అమ్మానాన్న సరదాగా డైలాగులు వేస్తూనే ఉంటారు. మనవళ్లు కావాలని కచ్చితంగా కోరుకుంటారు కదా. అడిగినప్పుడల్లా నవ్వేసి ఊరుకోవడమే. మీ నాన్నగారికి 60. మీకేమో 32. ఆ సీక్రెట్ ఏంటోగానీ... మీ నాన్న అంత వయసులా కనిపించరు. మీరూ 32లా ఉండరు... ఏం లేదండీ. సంతోషంగా ఉంటాం. అదే సగం బలం అంటారు కదా. బలంతో పాటు ఆ హ్యాపీనెస్ మన ముఖంలో కూడా కనిపిస్తుంది. సంతోషం ఎలా వస్తుంది? మనకున్న డబ్బు వల్లా? సక్సెస్ వల్లా? కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంత డబ్బుంటే బావుండు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అని అనుకునేవాణ్ణి. ఆ ఆలోచనా విధానంతో చేసేవాణ్ణి. డబ్బు సంపాదించి, కావాల్సినవన్నీ కొనుక్కున్నాక ‘ఇంతే కదా’ అనిపించింది. మనం ఏ పని చేసినా దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆస్వాదిస్తూ చేస్తే కచ్చితంగా సంతోషంగా ఉంటామని అర్థం అయింది. నా కుటుంబం సంతోషంగా ఉంటే నాకు అదే పెద్ద సంతోషం. చేసే పనిలో సక్సెస్ వస్తే అది సంతోషం. మొన్న వెళ్లిన హాలిడే ట్రిప్ గురించి. షూటింగ్స్ కోసం ఆల్రెడీ ఫారిన్ వెళ్తారు. మళ్లీ హాలిడేలకు ఫారిన్ వెళ్లడం ప్రైవసీ కోసమేనా? షూటింగ్స్‌కి వెళ్లినప్పడు కొన్ని లొకేషన్స్ హాయిగా ఉంటాయి. అప్పుడు ‘అబ్బా! ఇక్కడికి హాలిడేకు వస్తే బావుంటుంది’ అని అనిపిస్తుంది. షూటింగ్స్ అప్పుడు ఉదయాన్నే నిద్రలేవాలి. మేకప్ వేసుకొని షాట్ కోసం రెడీగా ఉండాలి. ఆ దృశ్యాలను ఎంజాయ్ చేసే ఆలోచన ఉండదు. ధ్యాసంతా పని మీదే ఉంటుంది. అందుకే నచ్చిన లొకేషన్ని హాలిడే స్పాట్‌గా ఫిక్స్ చేసుకుని వెళ్లడం నాకు ఇష్టం. ఫోన్ టచ్ లేకుండా, దూరంగా వెళ్లి మనకు కావాల్సిన వాళ్లతో టైమ్ స్పెండ్ చేయడం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. మొన్న ట్రిప్ నాన్న 60వ పుట్టిన రోజు అని వెళ్లాం. బాగా ఎంజాయ్ చేసి తిరిగొచ్చాం. హాలిడే ట్రిప్‌లో సమంత, నాగచైతన్య, నాగార్జున, అమల, అఖిల్ ఫైనల్లీ జీవితం ఎలా ఉంది? చాలా బావుంది. బ్యూటిఫుల్ అనొచ్చు. కంప్లయింట్స్ ఏం లేవు. చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉన్నాను. ఇక అడగడానికి ఏమీ లేదు. – డి.జి. భవాని -
కాబోయే శ్రీమతికి ప్రేమతో...
శ్రీమతి చేతి వంటకు అలవాటు పడిన భర్తలందరూ ఇటు ఓ లుక్కేయండి. ఈ ఫొటో చూపించి ‘ఏవండోయ్ శ్రీవారూ... నా కోసం ఓసారి టిఫిన్ చేసి పెట్టండి’ అని అడిగినా అడగొచ్చు. యువ మన్మథుడు అక్కినేని నాగచైతన్య ఎంత సిన్సియర్‌గా వంట చేస్తున్నారో చూశారుగా! కాబోయే శ్రీమతి సమంతకు చైతూ బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టారు. ఏదో సండే ఖాళీగా ఉన్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేశారనుకోండి.. అందులో పెద్ద గొప్పేముందని అనుకోవచ్చు. చైతూ టిఫిన్ చేసింది ఫ్రైడేనాడు. అదీ షూటింగ్‌కి వెళ్లే ముందు సమంతకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి వెళ్లారు. దాంతో సమంత ఆనందానికి అవధులు లేవు. ‘‘మోకాళ్ల మీద కూర్చుని దేవుడికి కృతజ్ఞతలు తెలిపా. ఈ ప్రపంచానికి నేనే రాణి అనే భావన కలిగింది’’ అని సమంత సంబరపడిపోయారు. ‘షూటింగ్‌కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చైతూ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసినప్పుడు... మీరు చేయలేరా’ అని శ్రీమతి అడిగితే ఏం చెప్పాలో ఆలోచించుకోండి. లేదా ఓ గంట ముందు నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవ్వండి. సో, భర్తలందరూ బీ అలర్ట్. మీకిది స్వీట్ వార్నింగ్! -
సంతకం పెట్టిందోచ్!
సమంత అంటే ఇష్టపడే తెలుగు సినిమా అభిమానులకు ఇది శుభవార్తే. అక్కినేని నాగచైతన్య (చైతూ)తో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చెన్నై బ్యూటీ నటన, సినిమాలకు స్వస్తి పలుకుతారనే పుకార్లు షికారు చేశాయి. పెళ్లి తర్వాత కూడా సమంత నటిస్తుందని చైతూ స్వయంగా చెప్పినా... ఈ పుకార్లకు అడ్డుకట్ట పడలేదు. దీనికి తోడు ‘జనతా గ్యారేజ్’ తర్వాత తెలుగులో మరో చిత్రానికి సమంత సంతకం చేయకపోవడంతో ప్రచారంలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ... తెలుగులో కొత్త చిత్రాలకు సమంత సంతకం చేశారు. ఆ మాట ఎవరో కాదు... సాక్షాత్తూ సమంతే చెప్పారు. కానీ, ఆ కొత్త తెలుగు చిత్రాల ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. ‘‘కొత్త చిత్రాల్లో ఎవరికి జోడీగా నటిస్తున్నాను, ఆ సినిమాలు ఏంటి, కాంబినేషన్ ఏమిటన్నది ప్రకటించడానికి నేనింక ఎదురు చూడలేను’’ అని సమంత ట్వీట్ చేశారు. ఫిల్మ్‌నగర్‌లో మాత్రం చిన్న ఎన్టీఆర్- దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) సినిమా, రామ్‌చరణ్- దర్శకుడు సుకుమార్‌ల సినిమాల్లో హీరోయిన్గా సమంత పేరు వినిపిస్తోంది. అయితే, అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అలాగే, చైతూతోనూ త్వరలోనే సమంత కలసి నటిస్తారనే వార్తలు వినపడుతున్నాయి. మరి, సమంత తెలుగులో అంగీకరించిన కొత్త సినిమాలు ఏమిటో? అబ్బ... సమంత మళ్ళీ ట్వీట్ చేసేదాకా జనం ఎదురుచూడలేరు బాబూ! -
‘డాక్టర్లు ఎన్ని రోజులని చెప్పార్రా’ అని నాన్న అడిగారు
నాగార్జున మంచి నటుడు. మంచి నిర్మాత. మంచి వ్యాపారవేత్త. వీటన్నింటినీ మించి... మంచి కొడుకు. ఎంత మంచి కొడుకంటే.. తన తండ్రి అక్కినేని టాపిక్ తెస్తేనే భావోద్వేగానికి లోనైపోయేంత. తండ్రి జ్ఞాపకాల్లో జీవించడం ఆయనకిష్టం. తండ్రి గురించి వినడం ఆయనకిష్టం. తండ్రి గురించి మాట్లాడటం ఆయనకిష్టం. మొత్తంగా తండ్రే ఆయనకు లోకం. కాసేపు ఆయనతో ముచ్చటిస్తే ఇది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. ఈ నెల 23న తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నాగ్ నటించిన ‘మనం’ చిత్రం విడుదలకానుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ దర్శకుడు. ‘మనం’ ముచ్చట్లు చెప్పడానికి ఆదివారం నాగార్జున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ‘మనం’ గురించే కాక, తన తండ్రి అక్కినేని చివరి రోజుల్ని ఉద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలివి. ‘మనం’ సినిమాకు గత ఏడాది మార్చిలో కొబ్బరికాయ కొట్టాం. కానీ... ఆ ఎండల్లో నాన్నను కష్టపెట్టడం నాకిష్టం లేదు. అందుకే... జూలైలో చల్లబడగానే షూటింగ్ మొదలుపెట్టాం. నాన్నకు ముందే చెప్పేశాను.. ‘నాన్నా.. ఏం ఫర్లేదు... సినిమాను ఏడాది పాటు నిదానంగా తీసుకుందాం. మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చేసేసి వెళ్లిపోండి’ అని. అలాగే వచ్చి చేసి వెళ్లిపోయేవారు. ఎందుకో తెలీదు కానీ... గత ఏడాది ఆయన 90వ పుట్టిన రోజుని మిత్రులు, శ్రేయోభిలాషులందరినీ పిలిపించుకొని మరీ చేసుకున్నారు. చెన్నయ్, యూఎస్, లండన్... ఇలా దేశవిదేశాల నుంచి కూడా వచ్చారు. వాళ్లందరి సమక్షంలో పుట్టినరోజును జరుపుకోవాలని నాన్నకు ఎందుకు అనిపించిందో!సెప్టెంబర్ 30... మా కుటుంబానికి అదో దుర్దినం. ఎందుకంటే... నాన్నకు తొలిసారి కడుపు నొప్పి వచ్చింది ఆ రోజే. నాన్న అప్పుడు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నారు. ‘ఇంటికెళ్లండి నాన్నా... తర్వాత చూసుకుందాం’ అని పంపించేశాను. అయినా హాస్పిటల్కెళ్లి చూపించుకున్నారు. ‘ఎసిడిటీ’ అన్నారు. యాంటాసిడ్ ఇస్తే తగ్గిపోయింది. అసలు నాన్నకు ఎసిడిటీ అనేది ఎన్నడూ లేదు. అంత హెల్దీగా ఉండేవారు. అక్టోబర్ 10... నాన్నకు మళ్లీ కడుపులో నొప్పి వచ్చింది. ఈ దఫా తీవ్రంగా. స్కాన్ చేస్తే... చిన్న ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. దాన్ని డాక్టర్లు తొలగించేశారు. మళ్లీ నాన్న పర్ఫెక్ట్. అయితే... ఆ ట్యూమర్‌ని బయాప్సీకి పంపినప్పుడు అసలు విషయం బయటపడింది. నాన్నకు ‘కేన్సర్’. ఇంట్లో అందరి గుండె ఆగినంత పనైంది. తక్షణ కర్తవ్యం ఏంటని డాక్టర్లను అడిగాం. ‘ఓపెన్ చేస్తే కానీ చెప్పలేం. కానీ ఓపెన్ చేయడానికి ఆయన వయసు సహకరించదు’ అనేశారు. మేం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే.. ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు. కొందరైతే... ఫోన్లు చేసి ఏడవడం, ఇంకొందరైతే... ‘సార్... మీరు బాగున్నారా?’ అనడగడం. నాన్నకు విసుగొచ్చేసింది. ఇది ఆగాలంటే.. ఉన్న విషయం చెప్పేయడమే మంచిదని భావించారు. అక్టోబర్ 19... నాన్న ప్రెస్‌మీట్ పెట్టారు. అంతా పూసగుచ్చినట్టు చెప్పారు. అదే రోజు... ‘మనం’ షూటింగ్లో పాల్గొన్నారు. శ్రీయతో నా సీన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారిగా... కడుపు పట్టుకొని పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. స్కాన్ తీశారు. అప్పుడు తెలిసింది.. ట్యూమర్ పెరిగిపోయి.. జీర్ణాశయాన్ని మెలిపెట్టేసిందని, ఆ ప్రాంతమంతా బిగుసుకుపోవడంతో ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లడంలేదని. ఇక ఎంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా నాన్నకు నొప్పి ఆగడంలేదు. సర్జరీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు. నాన్న మొండి మనిషి. ‘చేసేయండి’ అన్నారు. కడుపుని ఓపెన్ చేశారు. అది కడుపంతా స్ప్రెడ్ అయిపోవడం గమనించారు. అయినా సరే.. సర్జరీ చేసేశారు. పెద్ద సర్జరీ. అయినా తట్టుకున్నారు. రెండ్రోజుల్లోనే లేచి తిరిగారు కూడా. ఓ రోజు సర్జరీ చేసిన డాక్టర్లందర్నీ ఇంటికి పిలిపించారు నాన్న. ‘నన్ను ఓపెన్ చేశారు. లోపల ఏముందో మీ అందరికీ తెలుసు. అబద్ధం చెప్పొద్దు. నిజం చెప్పండి’ అని సూటిగా అడిగారు. నాన్నతో వాళ్లు అబద్ధం చెప్పలేకపోయారు. ‘మీకు కావాల్సినవన్నీ తినండి. సాధ్యమైనంతవరకూ ఆనందంగా ఉండండి. అంతకు మించి ఏం చెప్పలేం’ అనేశారు. ఇక వాళ్లను పంపించేసి, మమ్మల్ని పిలిపించారు నాన్న. ‘ఎన్ని రోజులు అని చెప్పార్రా’ అనడిగారు. నాన్న అబద్ధం చెబితే అస్సలు ఊరుకోరు. ఆయన దగ్గర ఉన్నదున్నట్లు చెప్పేయాలి. అందుకే... ‘ఏమో నాన్న.. ఇన్ని రోజులనేం చెప్పలేదు. మమ్మల్ని మాత్రం ఎక్కువ సమయం మీతోనే గడపమన్నారు’ అని చెప్పేశాం. ఆ రోజే అందర్నీ భోజనాలకు పిలుస్తూ... ‘ఏడుస్తూ వచ్చేటట్లయితే... ఎవరూ నా ఇంటికి రావొద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పారు. ఇక ఆ రోజు నుంచి మాతో కబుర్లు చెబుతూ హ్యాపీగా గడిపారు నాన్న. కేన్సరేమో... ఆయన్ను లోలోపల నిదానంగా తినేస్తోంది. ఓ రోజు నాన్న నన్ను పిలిచి... ‘మనం’లో నా వర్క్ ఎన్ని రోజులుంది అనడిగారు. మీరు ఆర్రోజులొస్తే సరిపోతుందని చెప్పాను. సీన్స్ అన్నీ తెప్పించుకొని చూశారు. ‘ఫస్ట్ క్లైమాక్స్ ఫినిష్ చేయ్’ అన్నారు. సినిమా పూర్తవ్వాలంటే... క్లైమాక్స్ పూర్తి చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అది నాన్నకు బాగా తెలుసు. తర్వాత ఏయే సీన్స్ తీయాలో కూడా వివరించి చెప్పారు. ‘ఆర్టిస్టులందర్నీ రెడీ చేసి పెట్టుకో... ఏదో ఒకరోజు నేనొచ్చి చేసేసి వెళ్లిపోతా’ అని చెప్పారు. అన్నట్లుగానే... ముందు క్లైమాక్స్ కంప్లీట్ చేసేశారు. తర్వాత నిదానంగా మిగిలిన సీన్స్ పూర్తి చేశారు. ‘మనం’ ట్రైలర్లో లాస్ట్ షాట్ మీరు చూసే ఉంటారు. నాన్నపై తీసిన లాస్ట్ షాట్ కూడా అదే. ఆ షాట్లో ఆయన నవ్వు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. జనవరి 14... అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైన రోజు. ఆ రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు నాన్న. వర్కర్లందర్నీ పిలిచి వాళ్లతో పాటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అయితే... ఈ దఫా నాన్న రాలేరు అనుకున్నాను. కానీ.. వీల్ ఛెయిర్లో స్టూడియోకి వచ్చారు. ఉద్యోగులందర్నీ పేరుపేరునా పలకరిచారు. సాయంత్రం మా అందర్నీ ఇంటికి పిలిచారు. ‘నా జీవితం అందమైందిరా.. చేయాల్సినవన్నీ చేసేశాను’ అని సంబరపడిపోయారు. క్రమంగా నాన్న ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కిమ్స్ డాక్టర్లు చెప్పారు... ‘రెండు వారాల్లో ఆయనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రిపేర్ అయిపోండి. హాస్పిటల్‌కి తీసుకొచ్చినా వేస్ట్. మేం సర్జరీలు కూడా చేయలేం. పెయిన్ మెడికేషన్ ఇంట్లో రెడీగా పెట్టుకోండి’ అని. పెయిన్ మెడికేషన్ ఇచ్చిన మనిషి చనిపోయిన వాడితో సమానం. ఎందుకంటే... అలా నిద్రలో ఉండిపోతాడంతే. చేసేది లేక డాక్టర్ల మాట పాటించాం. జనవరి 21... రాత్రి మా ఫ్యామిలీ మొత్తం నాన్నతోనే ఉన్నాం. భోజనాలు చేశాం. అందరికీ నాన్న ‘గుడ్‌బై’ చెప్పారు. నిద్ర వస్తోందని లోపలకెళ్లి పడుకున్నారు. నేను పదింటివరకూ అక్కడే ఉన్నాను. ఇంటికెళ్లేముందు నాన్నను ఓసారి చూసి వెళదామని గదిలోకి వెళ్లాను. గురక పెడుతున్నారు. సరే... వెళ్లబోయాను. ఇంతలో నర్స్ ‘అదేంటిసార్... నాన్నకు గుడ్ నైట్ చెప్పకుండా వెళ్లిపోతారా?’ అంది. ‘నాన్న... నాన్న’ అని తట్టాను. నాన్న లేచారు. ‘గుడ్‌నైట్ నాన్నా’ అన్నాను. ‘సరే... వెళ్లు. రేపు కలుద్దాం’ అని నిద్రలోకి జారుకున్నారు. నిద్రలోనే.... నిజంగా నాన్నది అద్భుతమైన జీవితం. ఒక మనిషి ఎంత సాధించగలడో అంతా సాధించారు. అందుకే... ఆయన ధన్యజీవి. ‘మనం’ మీకు చాలా ప్రత్యేకమైన సినిమా కదా? కచ్చితంగా. నా కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమా. శివ, గీతాంజలి విడుదలై పాతికేళ్లయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు నా కెరీర్లో రాబోతున్న మరో మైలురాయి ‘మనం’. నాకే కాదు, నా కుటుంబం మొత్తం ప్రేమించి ఈ సినిమా చేశాం. ఆడుతుందా, ఆడదా అనే విషయాలు మేం ఆలోచించలేదు. ‘ఇలా చేద్దాం’ అనుకున్నాం.. చేసేశాం. తెరపై కూడా చైతూ నాకు కొడుకే. నాన్న వాడికి తాతే. ఈ మధ్యకాలంలో నాకు సూట్ అయ్యే పాత్రలు నేను చేయలేదు. ఇన్నాళ్లకు నాకు తగ్గ పాత్రను ‘మనం’లో చేశాను. మొన్నే అందరం చూసుకున్నాం. అద్భుతంగా అనిపించింది. ఇందులో అమితాబ్ కూడా నటించారు కదా. ఆ విషయం నాన్నగారికి తెలుసా? ఆయనకు తెలీదండీ... నాన్న మనకు దూరమైన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. నాన్నకు అమితాబ్గారంటే చాలా ఇష్టం. ఆయన నటనను ఎప్పుడూ పొగుడుతుండేవారు. అందుకే... ఈ సినిమాలో ఆయనతో కూడా నటింపజేయాలనిపించింది. ‘నాన్న చివరి సినిమాలో మీరూ నటిస్తే బావుంటుంది’ అని స్వయంగా ఆయన్ను అడిగాను. ‘మూడు జనరేషన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని... అన్నమాట ప్రకారం వచ్చి నటించారు. ఇందులో ఆయనది చాలా చిన్న వేషం. మీ నాన్నగారి పాటను ఇందులో రీమిక్స్ చేశారట కదా? ‘ప్రేమనగర్’లోని ‘నేను పుట్టాను...’ పాటను రీమిక్స్ చేశాం. ఇందులో ముగ్గురం నటించాం. మణిరత్నం సినిమా సంగతేంటి? చర్చలు జరిగాయి కానీ.. కార్యరూపం దాల్చలేదు. మొన్ననే ‘గీతాంజలి’కి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పా. ఆ సినిమాకు పాతికేళ్లు వచ్చినట్లు ఆయనకు తెలీదంట. ఎన్టీఆర్, మీరూ కలిసి చేస్తున్నారట? అవును... పీవీపీవాళ్లు తీస్తున్నారు. పైడిపల్లి వంశీ దర్శకుడు. అందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వైజాగ్‌లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం. మరి అక్కడ స్టూడియో కట్టాలనే యోచన ఏమైనా ఉందా? 1974లో నాన్న స్టూడియో కట్టారు. అయినా... చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కి పూర్తి స్థాయిలో పరిశ్రమ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఇప్పటికీ డాన్సర్లు కావాలన్నా, మ్యూజిషియన్లు కావాలన్నా చెన్నయ్నే ఆశ్రయించాల్సిన పరిస్థితి. మన తెలుగునేలపై చదువుపై చూపించే శ్రద్ధ కళలపై చూపించరు. కానీ తమిళనాడు, కేరళలలో విద్యావంతులు ఎంత ఎక్కువగా ఉంటారో, కళాకారులు కూడా అంతే ఉంటారు. అందుకే... ఇప్పటికీ కళాకారుల్ని మనం అక్కడ్నుంచే తెచ్చుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థమైందేంటంటే... స్టూడియో అని ఓ నాలుగు గోడలు కడితే సరిపోదు. ముందు ఒక వ్యవస్థ అక్కడ క్రియేట్ అవ్వాలి. అసలు పరిశ్రమ వైజాగ్ వెళ్లే అవసరం ఉందంటారా? అసలక్కడ పాలనా వ్యవస్థే లేదు. స్టూడియోలకి తొందరెందుకు? మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఏదైనా స్మారక చిహ్నం ఏర్పాటు చేసే ఆలోచన ... ఉందండీ... అమ్మ, నాన్న ఇద్దరి పేరిటా చేయాలి. నాన్న మ్యూజియం కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే మ్యూజియం అంటే నాన్నకు చాలా ఇష్టం. స్టూడియోలోనే... సరైన స్పాట్ చూసి ఆ కార్యక్రమాలు మొదలుపెడతాం. నాన్న పేరిట ప్రతి ఏడాదీ ఇచ్చే అవార్డును కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తాం. -
ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా చనిపోవాలని...
ఇన్నర్ వ్యూ పుట్టినరోజు : 1924 సెప్టెంబర్ 20 (శనివారం) జన్మస్థలం : కృష్ణాజిల్లా గుడివాడ సమీపం లోని వెంకట రాఘవాపురం గ్రామం తల్లిదండ్రులు : అక్కినేని పున్నమ్మ, వెంకటరత్నం పేరు వెనుక కథ : నేను పుట్టే ముందు, బిడ్డ చుట్టూ నాగుపాము మూడుసార్లు ప్రదక్షిణ చేసినట్టు మా అమ్మ పున్నమ్మగారికి కల రావడం వల్ల నాగేశ్వరరావు అని పేరు పెట్టారు. విద్యార్హత : ఐదో తరగతి మధ్యలోనే ఆపేశాను. హిందీ మాధ్యమిక పాసయ్యాను.విద్యాభ్యాసం పెదవిరివాడలో జరిగింది. జీవితంలో తొలిసారిగా చేసిన పాత్ర : స్కూల్లో చంద్రమతి పాత్ర చిత్రరంగ ప్రవేశం : 1944 మే 8న ‘ధర్మపత్ని’ సినిమాతో. హీరోగా తొలి చిత్రం : సీతారామ జననం తొలి పారితోషికం : ‘సీతారామ జననం’లో నా పాత్రకు 250 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ‘ధర్మపత్ని’కి నెలకి 25 రూపాయలు ఇచ్చారు. గాయకునిగా తొలి చిత్రం : ‘సీతారామజననం’లో గురుబ్రహ్మ గురుదేవో అనే శ్లోకం తొలి ద్విపాత్రాభినయ చిత్రం : ఇద్దరు మిత్రులు తొలి సంగీత ప్రధాన చిత్రం : జయభేరి తొలి క్రైమ్ చిత్రం : దొంగల్లో దొర తొలి నవలా చిత్రం : దేవదాసు తొలి కలర్ సినిమా : అమరశిల్పి జక్కన్న తొమ్మిది పాత్రలు చేసిన చిత్రం : నవరాత్రి తొలి వాన పాట : ఆత్మబలం (చిటపట చినుకులు పడుతూ ఉంటే) తొలి వృద్ధ పాత్ర : పరదేశి తొలి విదేశీ యాత్ర : సిలోన్ 1952లో తమిళంలో చేసిన చిత్రాలు : 26 వివాహం : 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణతో షష్టిపూర్తి మహోత్సవం : 1984 సెప్టెంబర్ 20న జరిగింది. అన్నపూర్ణా స్టూడియోస్ శంకుస్థాపన : 1975 ఆగస్ట్ 13న, నా మనవడు చిరంజీవి సుమంత్చే జరిగింది. అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభం : 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. నటసమ్రాట్ బిరుదు : 1957లో విజయవాడలో బెజవాడ గోపాలరెడ్డి ఇచ్చారు. ముద్దు పేర్లు : ఇంట్లో అంతా నాగేశ్వర్రావ్ అనే పిలిచేవారు. సినీ పరిశ్రమలోని సన్నిహితులు మాత్రం ముద్దుపేర్లతో పిలిచేవారు. పేకేటి శివరామ్ ‘నాగూభాయ్’ అని, సముద్రాల రాఘవాచార్యులు‘నాగు’, నాగయ్య అని, ముదిగొండ లింగమూర్తి ‘చిరంజీవి’ అని, ఘంటసాల బలరామయ్య ‘రాముడు’ అని, శాంతకుమారి ‘అబ్బీ’అని, సావిత్రి ‘హీరోగారు’ అనేవారు. తెలిసిన భాషలు : తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ బాగా ఇష్టమైన పాట : అందమె ఆనందం నా సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా : బాటసారి అభిమాన పాత్రలు : రామకృష్ణ పరమహంస, యోగి వేమన, అన్నమాచార్య, రామానుజాచార్య అభిమాన తారలు : అశోక్‌కుమార్, నర్గీస్ ఇష్టమైన దుస్తులు : వైట్ అండ్ వైట్ డ్రెస్ ఇష్టపడే వంటకాలు : పులుసు కూరలు ప్లస్ పాయింట్స్ : నా లోపాలు తెలియడమే కాకుండా నా మెరిట్స్ తెలుసుకోవడం మైనస్ పాయింట్స్ : పెద్ద గొంతు కాదు... ఎత్తు లేను... అందగాణ్ణి కాదు... అని అనుకుంటాను మరిచిపోలేని విషాదకర సంఘటన : 1960 మార్చి 19న నా పెద్దకొడుక్కి చికిత్స చేయడానికని వచ్చిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకయ్య తిరిగివెళ్తూ యాక్సిడెంట్లో చనిపోవడం. బాగా ప్రేమించేది : నట జీవితాన్ని ద్వేషించేది : దొంగతనాల్ని, అబద్ధాల్ని జీవిత లక్ష్యం : ఇప్పుడు నాక్కావల్సినవి ఏమీలేవు.ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా, ఆరోగ్యంగా ఉంటూ చనిపోవాలని ఉంది. మొదట్నుంచీ నాకు సున్నిపిండి వాడే అలవాటు ఉంది. చలిరోజుల్లో చర్మం డ్రై కాకుండా సున్నిపిండి ఉపకరిస్తుంది. సబ్బులు పైపై మెరుగులకే కానీ, సున్నిపిండి వల్ల వంటి మీద మురికి మొత్తం పోతుంది. సున్నిపిండి నలుగు పెట్టుకోవడం కండరాలకు ఎక్సర్సైజ్. అలాగే బకెట్లో నీరు పెట్టుకుని వంగి తీసుకుని పోసుకుంటాను. అది కూడా తెలీకుండా ఒక మంచి ఎక్సర్సైజ్! -
‘మనం' ఫస్ట్ లుక్ విడుదల
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మనం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. రేపు అక్కినేని నాగేశ్వరరావు 90వ జన్మదినం సందర్భంగా నిర్మాతలు దీన్ని విడుదల చేశారు. నాగార్జున సూట్ నిల్చునుండగా, నాగ చైతన్య పంచకట్టుతో మధ్యలో కూర్చుని ఉన్నాడు. నట సామ్రాట్ నాగేశ్వరావు చిన్నపిల్లాడి డ్రెస్సులో మనవడి ముందు చేతులు కట్టుకుని ఉన్న ఈ ఫోటో చూడగానే ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ ఫోటోను ఫేస్ బుక్ లో ఉంచారు. మరోవైపు తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాగార్జున ట్విట్ చేశారు. 'యంగ్ అండ్ హ్యేపీ బర్త్ డే నాన్న' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. Tommorrow is my fathers 90 th bday and I cannot resist releasing the first look of manam..forever young,happy birthday nana! — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 19, 2013 'మనం' చిత్రానికి ‘ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుంది. నాగార్జునకు జోడీగా శ్రీయ, నాగచైతన్య సరసన సమంత నటిస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు అందించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.