Venky Mama Collections: Venky Mama Day 3 Box Office Collections | Venkatesh, Naga Chaitanya - Sakshi Telugu
Sakshi News home page

వెంకీమామ: మూడు రోజుల్లో రూ. 45 కోట్లు!

Published Mon, Dec 16 2019 11:10 AM | Last Updated on Mon, Dec 16 2019 2:25 PM

Venky Mama Movie Gives Boost To TFI Stable Collections At Box Office - Sakshi

రియల్‌ లైఫ్‌ మామ- మేనల్లుడు అయిన హీరోలు వెంకటేశ్‌- నాగచైతన్య రీల్‌ లైఫ్‌లోనూ అదే పాత్రలు పోషించిన చిత్రం ‘వెంకీమామ’కు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. కేవలం మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్‌ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్‌, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.(వెంకీమామ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement