
రియల్ లైఫ్ మామ-అల్లుడు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా వెంకీ మామ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్, నాగచైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే డైరక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర) అభినందనలు తెలిపారు.
‘వెంకటేశ్ తనదైన స్టైల్‌లో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. చాలా కాలం తర్వాత వెంకటేశ్ యాక్షన్ సీన్స్‌లో వావ్ అనిపించాడు. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా చక్కగా నటించాడు. దర్శకుడు బాబీ తనదైన టేకింగ్, ట్రీట్‌మెంట్, స్ర్కీన్‌ప్లేతో సినిమాను చక్కగా రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బాబీ, నాగచైతన్యలు ట్విటర్ వేదికగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘వెంకీ మామ గురించి ఇంత అద్భుతమైన మాటలు చెప్పిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఒక అభిమానిగా ఆయన నోటి వెంట ఈ మాటల వినడం.. నా జీవితంలో మరచిపోలేని రోజు’ అని బాబీ ట్వీట్ చేశారు.
మహేష్ బాబు కూడా వెంకీ మామ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వెంకటేశ్, నాగచైతన్యల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పారు. తాను ఈ చిత్రంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. కాగా, సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్‌లుగా నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Here's what MEGASTAR Chiranjeevi garu had to say after watching #VenkyMama https://t.co/CAIA3wlzMI#MegastarAboutVenkyMama #BlockbusterVenkyMama #VictoryVenkatesh | @chay_akkineni | @dirbobby | @RaashiKhanna | @starlingpayal | @MusicThaman | @SureshProdns | @peoplemediafcy
— Venky Mama (@VenkyMama) December 18, 2019
Comments
Please login to add a commentAdd a comment